• TFIDB EN
  • గూడాచారి
    UATelugu2h 27m
    గోపి (అడివి శేషు) RAW ఏజెంట్‌. దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరతాడు. అనూహ్య ఘటన వల్ల అర్జున్‌పై దేశద్రోహం నేరం మోపబడుతుంది. దాని నుంచి అర్జున్‌ ఎలా బయటపడ్డాడు? ఒకప్పటి రా ఏజెంట్‌ అయిన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అడివి శేష్
    M. గోపి / M. అర్జున్ కుమార్
    శోభితా ధూళిపాళ
    సమీరా రావు / సమీరా షేక్
    ప్రకాష్ రాజ్
    సత్య
    సుప్రియ యార్లగడ్డనదియా ఖురేషి
    వెన్నెల కిషోర్
    షామ్
    అనీష్ కురువిల్లా
    దామోదర్
    రాకేష్ వర్రేమహమ్మద్ బాషా
    మధు శాలిని
    లీనా రాజన్
    రవి ప్రకాష్
    విజయ్
    స్వరాజ్ రెబ్బాప్రగడఆచార్య
    ప్రీతి సింగ్ఉమా విశ్వనాథ్
    ఇర్ఫాన్ సియారవివర్మ
    రవి మైస్కర్కిషోర్ కృష్ణమూర్తి
    మయాంక్ పరాఖ్ అబ్దుల్ ఖాదిర్
    సిబ్బంది
    శశి కిరణ్ టిక్కాదర్శకుడు
    అభిషేక్ నామనిర్మాత
    టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
    అభిషేక్ అగర్వాల్నిర్మాత
    శ్రీచరణ్ పాకాల
    సంగీతకారుడు
    గ్యారీ BH
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. 'రామన్‌ రాఘవ్‌ 2.0' అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..  బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం.  శోభిత దూళిపాళ ఎప్పుడు పుట్టింది? 1991, మే 31న జన్మించింది శోభిత దూళిపాళ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? రామం రాఘవం 2.o శోభిత దూళిపాళ ఎత్తు ఎంత? 5 అడుగుల 9అంగుళాలు  శోభిత దూళిపాళ ఎక్కడ పుట్టింది? తెనాలి, ఆంధ్రప్రదేశ్ శోభిత దూళిపాళ తెలుగులో నటించిన తొలి సినిమా? గూడాచారి(2018) శోభిత దూళిపాళ అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ శోభిత దూళిపాళకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, టిబెటన్ వంటకాలు, నూడిల్స్ శోభిత దూళిపాళకు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ శోభిత దూళిపాళకు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, మహేష్ బాబు శోభిత దూళిపాళ తల్లిదండ్రుల పేరు? వేణు గోపాల్ రావు, శాంత శోభిత దూళిపాళ ఏం చదివింది? BCom, శోభిత దూళిపాళ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. శోభిత దూళిపాళ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది. శోభిత దూళిపాళ అవార్డులు? శోభిత దూళిపాళ 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచింది. 2013లోనే జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో విజేతగా నిలిచింది. శోభిత దూళిపాళకు ఎఫైర్స్ ఉన్నాయా? టాలీవుడ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sobhitad/?hl=en&img_index=6 https://www.youtube.com/watch?app=desktop&v=nJyjdLURscA
    ఏప్రిల్ 05 , 2024
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2,  ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అడవి శేషు అసలు పేరు? అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర అడవి శేషు ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు అడవి శేషు తొలి సినిమా? సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.  అడవి శేషుకు వివాహం అయిందా? ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు? 5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.  అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్? అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అడవి శేషుకు ఇష్టమైన కలర్? బ్లాక్, వైట్ అడవి శేషు పుట్టిన తేదీ? 17 December 1984 అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు? చంద్ర, భవాని అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం? కాలీఫోర్నియా అడవి శేషు ఏం చదివాడు? అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు? అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.  అడవి శేషుకు ఇష్టమైన ఆహారం? అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు అడవి శేషు ఇల్లు ఎక్కడ? అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
    మార్చి 21 , 2024
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    Chiranjeevi and Radhika Sarathkumar Movies List: చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. కిరాయి రౌడీలు(1981) ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది. న్యాయం కావాలి(1981) డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఇది పెళ్లంటారా( 1982) విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు. పట్నం వచ్చిన పతివ్రతలు(1982) చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు. బిల్లా రంగా(1982) కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది.  ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు. యమకింకరుడు(1982) రాజ్‌ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. పులి బెబ్బులి(1983) చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ప్రేమ పిచ్చోలు (1983) ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది. పల్లెటూరి మొనగాడు(1983) చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. అభిలాష(1983) ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది. గూడచారి నెం.1 (1983) చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హీరో (1984) విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది. జ్వాలా(1985) చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. దొంగ మొగుడు(1987) చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఆరాధన(1987) భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు. రాజా విక్రమార్క(1990) చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.
    నవంబర్ 09 , 2023
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
    సినిమా- స్పై తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా,  ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్: గ్యారీ బీహెచ్ మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై'  విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం. కథ:  జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్  జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా  దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు  ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎలా ఉందంటే? స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు.  అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్‌ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు. ఎవరెలా చేశారంటే? రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు.  గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. టెక్నికల్‌గా.. స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే.  గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.  చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది. రేటింగ్: 2.25/5
    జూన్ 29 , 2023
    <strong>Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!</strong>
    Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ టాప్‌-10 చిత్రాలు!
    సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చిన ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్‌ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] రాజాసాబ్‌ (The Raja Saab) ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్‌ బాక్సాఫీస్‌ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌ వచ్చే ఏడాది ‘రాజాసాబ్‌’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్‌ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్‌ తెగ ఎదురుచూస్తున్నాడు.&nbsp; ఓజీ (OG) పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్‌ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్‌ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్‌ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.&nbsp; గేమ్‌ ఛేంజర్‌ (Game changer) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత చరణ్‌ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; వార్‌ 2 (War 2) టాలీవుడ్‌ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) ‘వార్‌ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్‌ నటిస్తున్నారన్న టాక్‌ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్‌ తర్వాత తారక్‌ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్‌ 2’ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; VD 12 విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్‌ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్‌ లుక్‌లో కనిపించి మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్‌ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్‌ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; తండేల్‌ (Thandel) నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్‌’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (Love story) మంచి హిట్‌ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.&nbsp; మిరాయ్‌ (Mirai) ‘హనుమాన్‌’ (Hanuman) వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తర్వాత యంగ్‌ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్‌’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్‌ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్‌ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; కుబేరా (Kubera) క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్‌ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్‌ చేస్తున్నట్లు టాక్‌. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్‌ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు.&nbsp; జీ 2 (G2) అడివి శేష్‌ (Adivi Sesh) హీరోగా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్‌ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; NANI 33 ‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్‌ బాస్టర్‌ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
    ]గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గూఢచారి - Prime VideoDownload Our App
    ఫిబ్రవరి 14 , 2023
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్‌ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్‌ వెహికల్‌ పాత్రను కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆడియన్స్‌ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోహినిగా దిశా పటానీ! లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్‌ అయిన కమల్‌ హాసన్‌.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్‌) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్‌తో ప్రభాస్‌ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; ఆ లాజిక్‌ మాటేంటి? ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్‌ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్‌ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్‌ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్‌పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌లో నిజం లేకపోవచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు. &nbsp; దిశాతో ప్రభాస్ స్పెషల్‌ సాంగ్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్‌కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్‌ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్‌ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్‌ను ఢీకొట్టే పాత్రలో కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.&nbsp;
    మే 24 , 2024
    RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
    RC 17: మద్రాస్‌ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్‌ చరణ్‌-సుకుమార్‌ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్‌ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..! 'RC 17' చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్‌ యాక్షన్‌ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; రాజమౌళి వ్యాఖ్యలు వైరల్‌ ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ‘ఓపెనింగ్‌ సీన్‌ అద్భుతం’ మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్‌ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.&nbsp; ఈ ఏడాది చివర్లో ప్రారంభం! ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్‌ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్‌లోకి రామ్‌చరణ్‌ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.&nbsp; రేపు అదిరిపోయే ట్రీట్‌! రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, ఎస్‌.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp;
    మార్చి 26 , 2024
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    Devil Movie Review: ఏజెంట్‌ ‘డెవిల్‌’గా అదరగొట్టిన కళ్యాణ్‌రామ్‌.. హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు దర్శకుడు: అభిషేక్‌ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్ ఎడిటర్: తమ్మిరాజు నిర్మాత: అభిషేక్‌ నామా విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023 నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా అభిషేక్‌ నామా రూపొందించిన చిత్రం&nbsp; ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయికగా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో తొలిసారి గూఢచారిగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే బోస్ ఇండియాలో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ హత్య ఎందుకు జరిగింది? ఏజెంట్‌ డెవిల్‌ గతం ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రిటిష్‌ ఏజెంట్‌గా తన లుక్స్‌లో, యాక్షన్‌లో ఫ్రెష్ నెస్ చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఫైటింగ్‌ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. అటు మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపించడంతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అభిషేక్‌ నామా ఎంచుకున్న 1945 నాటి కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. కథ రాసుకున్న తీరు, దీనికి క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ను యాడ్‌ చేసి ఒక్కో పాయింట్‌ను రివీల్‌ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నట్లు అనిపించినా సస్పెన్స్‌గా మాత్రం అనిపించదు. ద్వితీయార్థాన్ని కాస్త ఎమోషనల్‌గా నడుపుదామని డైరెక్టర్‌ యత్నించినప్పటికీ అది పెద్దగా వర్కౌట్‌ అయినట్లు కనిపించదు. కొన్ని సీన్లు లాజిక్స్‌కు దూరంగా ఉంటాయి. అయితే&nbsp; ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను డైరెక్టర్‌ చాలా బాగా తెరకెక్కించారు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ అంశాలకు వస్తే.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని చోట్ల కథకు స్పీడు బ్రేకుల్లా అడ్డుపడినట్లు అనిపిస్తాయి. అయితే హర్షవర్ధన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌ అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. సినిమా సెటప్‌, ఆర్ట్‌ వర్క్‌, కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కళ్యాణ్‌రామ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్‌ టీమ్‌ పనితనం మైనస్‌ పాయింట్స్‌ పాటలుస్క్రీన్‌ ప్లే రేటింగ్‌: 3/5
    డిసెంబర్ 29 , 2023
    <strong>Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్</strong>
    Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్‌: ఏ లవ్‌ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్‌ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్‌ డియో డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్‌' హీరోయిన్‌ను అనౌన్స్‌ చేశారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘ప్రేమించి మోసం చేశావ్‌’ యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్‌’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్‌ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి మృణాల్‌ ఠాకూర్‌ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్‌ - అడివి శేష్‌ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.  https://twitter.com/AdiviSesh/status/1868899040303431969 హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! డెకాయిట్‌ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్‌ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్‌ తీసుకున్నారు. అడివి శేష్‌, మృణాల్‌ పెయిర్‌ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424 డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్‌’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్‌’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయగా ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. https://twitter.com/TrackTwood/status/1737423086188925221 అడివి శేష్ ఫిల్మ్‌ జర్నీ ఇదే.. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 
    డిసెంబర్ 17 , 2024
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి Sobhita Dhulipala శోభితా ధూళిపాళ&nbsp; టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. Meenakshi Chaudhary మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్‌ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్‌ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది. Sreeleela శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది Samantha సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. Courtesy Instagram: samantha Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది . Sai Pallavi సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. Kiara Advani కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ .  ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. Rukshar Dhillon రుక్సర్‌ థిల్లాన్‌ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్‌ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది. Samyuktha Menon సంయుక్త మీనన్  తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. Keerthy Suresh కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.  Divyansha Kaushik దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది. Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. Mirnalini Ravi మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్‌' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది. Kethika Sharma కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. Chandini Chowdary చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Eesha Rebba ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్‌ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. Priyanka Jawalkar "ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రియాంక ఎన్‌.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. Courtesy Instagram: Dimple Hayathi Pujita Ponnada పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్‌' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది. Ananya Nagalla అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. Courtesy Instagram:Ananya Nagalla
    డిసెంబర్ 04 , 2024
    <strong>Sobhita Dhulipala: నాగ చైతన్య భలే చిలిపి! ఏం చేశాడో చూడండి!</strong>
    Sobhita Dhulipala: నాగ చైతన్య భలే చిలిపి! ఏం చేశాడో చూడండి!
    ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్‌ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ సమంతతో విడాకుల అనంతరం చైతూ ఈ పెళ్లికి రెడీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తోడు సామ్‌ తమ విడాకుల గురించి తరుచూ ఏదోక కామెంట్స్‌ చేస్తుండటం కూడా చైతూ సెకండ్‌ మ్యారేజ్‌పై అందరి ఫోకస్‌ పడేలా చేసింది. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి పనులు మెుదలైనట్లు తెలుస్తోంది. వారిద్దరు హల్దీ వేడుకలు (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; పసుపు దుస్తుల్లో.. అక్కినేని నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్‌ 4న గ్రాండ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హల్దీ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ వేడుకల్లో (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చైతూ-శోభితా చాలా సంతోషంగా కనిపించారు. కుటుంబ సభ్యులు వారికి పసుపు నీటితో మంగళ స్నానం చేయించారు. శోభితాపై నీళ్లు పోస్తున్న సందర్భంలో తీసిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఆ సమయంలో చైతన్య చిలిపి చేష్టలు చేసినట్లు తెలుస్తోంది. చేతిలోకి నీళ్లు తీసుకొని శోభిత ముఖాన చైతూ చల్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ హల్దీ ఫొటోలు అక్కినేని అభిమానులు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.&nbsp; https://twitter.com/etimes/status/1862417583234027679 https://twitter.com/i/status/1862343687931298101 నాగేశ్వరరావు విగ్రహం ఎదుట.. నాగచైతన్య - శోభిత వివాహం డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఇరుకుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. రీసెంట్‌గా తమ పెళ్లి గురించి మాట్లాడిన నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్దంగా శోభిత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అతిథుల జాబితాను శోభితాతో కలిసి తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో వాస్తవం లేదట నాగచైతన్య - శోభిత పెళ్లి (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony)ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా స్ట్రీమింగ్‌ చేసేందుకు నెట్‌ ఫ్లిక్‌ వర్గాలు రూ.50 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో నయనతార-విఘేష్‌ తరహాలోనే చైతూ కూడా తన పెళ్లిని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని సమాచారం. స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు అక్కినేని ఫ్యామిలీని సంప్రదించలేదని తెలుస్తోంది. అవి జస్ట్‌ పుకార్లు మాత్రమేనని ఫిల్మ్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.&nbsp; రెండేళ్లుగా ప్రేమాయణం సమంతతో విడాకుల అనంతరం నటుడు నాగచైతన్య (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) శోభితకు దగ్గరయ్యాడు. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు, డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చైతూ-శోభిత ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్‌ 4న బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.&nbsp; శోభితా సీక్రెట్స్‌ ఇవే శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో పుట్టింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచి సత్తా చాటింది. హిందీలో వచ్చిన ‘రామన్‌ రాఘవన్‌ 2.0’ (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన గూఢచారి చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘మేజర్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా మెరిసింది. రీసెంట్‌గా హిందీలో 'లవ్‌, సితారా' అనే చిత్రం చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    నవంబర్ 29 , 2024
    <strong>Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!</strong>
    Naga Chaitanya : పెళ్లి పనులు షురూ.. శోభితా దూళిపాళ్ల ఏం చేసిందో చూడండి!
    అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)తో చైతూ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన పనులు అఫిషియల్‌గా మెుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; పెళ్లి పనులు షురూ టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఎంగేజ్ మెంట్ ఆగస్టు 8న గ్రాండ్‌గా జరిగింది తెలిసిందే. ఈ తరుణంలో వీరి పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు షురూ అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తాను పసుపు దంచుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోస్ లో శోభిత చాలా సంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. దాంతో అతి త్వరలోనే చై-శోభితా ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. వైజాగ్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) రెండేళ్లుగా ప్రేమాయణం! నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి సైతం జరగబోతోంది.&nbsp; ‘పెళ్లి గురించి కలలు కనలేదు’ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పొల్గొన్న శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. తాజాగా హిందీలో 'లవ్‌, సితారా' అనే చిత్రంలో చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!</strong>
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.&nbsp; https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    <strong>Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!</strong>
    Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!
    అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ ఈ జంట ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు సైతం ఎక్కనుంది. ఇక చైతూతో ఎంగేంజ్‌మెంట్‌ తర్వాత నుంచి శోభిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా, కామెంట్స్‌ చేసినా క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్‌ తర్వాత శోభిత తన మెుదటి ఇంటర్యూ ఇచ్చింది. చైతూతో పెళ్లి, మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ‘నిశ్చితార్థం గురించి కలలు కనలేదు’ తను నటించిన లవ్‌, సితార చిత్రం ఓటీటీ ప్రమోషన్స్‌లో భాగంగా నటి శోభిత దూళిపాల తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘చైతూలో ఆ ప్రేమ చూశా’ నటుడు నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం సంబంధిత ఫొటోలను షేర్‌ చేస్తూ కవిత్వంతో కూడిన ఆసక్తికర పోస్టు శోభిత పెట్టారు. ఆ విధంగా పోస్టు పెట్టడానికి గల కారణాన్ని తాజా ఇంటర్యూలో శోభిత వెల్లడించారు. ‘సంగం సాహిత్యానికి (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది) నేను విపరీతమైన అభిమానిని. నా పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం గతంలో నేను చదివినది. అది ఎంతో కవితాత్మకం. సరళంగా ఉంటుంది. హృదయాలను హత్తుకునే సందేశం అందులో ఉంది. అందుకే అది నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. నేను ఎల్లప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామిలో అదే ప్రేమను చూశా’ అని శోభితా ధూళిపాళ్ల వివరించారు.&nbsp; రెండేళ్లుగా ప్రేమాయణం! నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'లవ్‌, సితారా' అనే చిత్రం నటించింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp; సమంతతో విడాకులు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్‌ కపుల్‌ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Sharvari Wagh Hot: ఫిట్‌నెస్‌ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!&nbsp;</strong>
    Sharvari Wagh Hot: ఫిట్‌నెస్‌ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!&nbsp;
    బాలీవుడ్‌ అందాల తార శార్వరీ వాఘ్‌ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.&nbsp; ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది.&nbsp; మెస్మరైజింగ్‌ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్‌ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.&nbsp; శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.&nbsp; పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ వాష్‌ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుంది.&nbsp; ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.&nbsp; అలా 2015లో 'ప్యార్‌ కా పంచ్‌నామా 2', బాజీరావ్‌ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసింది.&nbsp; 'ద ఫర్‌గాటెన్‌ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.&nbsp; తన తొలి చిత్రం 'బంటీ ఔర్‌ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.&nbsp; ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్‌ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్‌ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్‌’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; రీసెంట్‌గా జాన్‌ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.&nbsp; రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.&nbsp; ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
    ఆగస్టు 26 , 2024
    <strong>Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!</strong>
    Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!
    ప్రముఖ హీరోయిన్‌ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్‌ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్‌ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్‌ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; శోభితానా మజాకా..! ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్‌ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్‌ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), కాజోల్‌ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్‌ నటుడు లక్ష్య, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్‌ 14, దివ్య ఖోస్లా కుమార్‌ 18, ఫహాద్‌ ఫాజిల్‌ 25, విజయ్‌ 27, విక్రాంత్‌ మెస్సీ 35, త్రిష 37, జాన్‌ అబ్రహం 39, కమల్‌ హాసన్‌ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.&nbsp; View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) పాపులారిటీకి కారణమిదే! నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్‌మెంట్‌ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే! టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ చేశారు. వాస్తవానికి&nbsp; చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    ఆగస్టు 13 , 2024
    <strong>Samantha: మహానటి సావిత్రి జీవితంతో సమంతకు పోలికలు.. సేమ్ సీన్ రిపీట్?</strong>
    Samantha: మహానటి సావిత్రి జీవితంతో సమంతకు పోలికలు.. సేమ్ సీన్ రిపీట్?
    అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) 2017లో పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను రెండో వివాహం చేసుకునేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలతో పాటు ప్రస్తుత పరిణామాలను ముడివేస్తూ నటి సమంత పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ నటి సావిత్రి జీవితంతో సామ్‌ లైఫ్‌ను ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులలోని సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; సావిత్రి జీవితంతో సామ్‌కు లింకేంటి? 2021లో నాగ చైతన్యతో డివోర్స్‌ సందర్భంగా అందరూ సమంతనే ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా చైతూ రెండో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున నెటిజన్లు సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. దిగ్గజ నటిగా ఓ వెలుగు వెలిగిన మహా నటి సావిత్రి జీవితంతో సమంత లైఫ్‌ను కంపేర్‌ చేస్తున్నారు. సినిమా కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో సావిత్రి జీవితంలోకి అప్పటికే పెళ్లైన నటుడు జెమినీ గణేశన్‌ ప్రవేశించారు. ఆ సమయానికి సావిత్రితో పోలిస్తే జెమినీ గణేశన్‌ సినిమా జీవితం అంతంతమాత్రంగానే ఉంది. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న జెమినీ గణేశన్‌ను గెస్ట్‌ హౌస్‌లో మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి సావిత్రి తట్టుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లి మద్యానికి బానిసగా మారింది. ఆపై పలు అనారోగ్య సమస్యల బారిన పడి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది. అయితే సమంత విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. నాగ చైతన్యను మరొకరితో చూసి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ బాధలన్నీ తట్టుకోలేకనే చైతూకి సామ్‌ విడాకులు ఇచ్చిందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/vamccrishnaa/status/1822085950098505895/ ‘అంతలా శోభితలో ఏముంది’ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నప్పటి నుంచి సమంత ఫ్యాన్స్‌ నాగచైతన్యను ఏకిపారేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు శోభితాలో ఏముందని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌గా ఆమె ఫెయిల్‌ అయ్యిందని అంటున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే చైతూ మరొకరితో ప్రేయాయణం మెుదలుపెట్టారని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చై-సమంతలతో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో గుర్తించాలని సూచిస్తున్నారు. మరోవైపు సమంత ఫ్యాన్స్‌ సంధిస్తున్న ప్రశ్నలకు చైతు, శోభిత ఫ్యాన్స్‌ గట్టిగానే బదులు ఇస్తున్నారు. పెళ్లి పెటాకులు అయినంత మాత్రాన జీవితాలు అక్కడే ఆగిపోవాలా? అంటూ నిలదీస్తున్నారు.&nbsp; సామ్‌ చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా!&nbsp; సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.&nbsp; శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp; నాగచైతన్య రియాక్షన్ ఇదే! శోభితతో నిశ్చితార్థంపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వస్తున్న క్రమంలో తమ బంధం గురించి నాగ చైతన్య స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శోభిత పెట్టిన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు, ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రీట్వీట్‌ చేస్తూ తన అభిప్రాయం కూడా ఇదే అంటూ రీపోస్టు చేశారు. 'నా తల్లి నీకేమవుతుంది? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని క్యాప్షన్‌గా పెట్టారు. ఈ పోస్టును అక్కినేని సమర్థిస్తుండగా సామ్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
    ఆగస్టు 10 , 2024
    <strong>Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!</strong>
    Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
    అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  నాగార్జున స్పెషల్‌ పోస్టు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 రెండేళ్లుగా ప్రేమాయణం! నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.  సమంతతో విడాకులు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్‌ కపుల్‌ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp; సమంత కంటే చాలా బోల్డ్! ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.&nbsp; ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 08 , 2024

    @2021 KTree