• TFIDB EN
  • హను మాన్
    UATelugu
    సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    2024 Apr 178 months ago
    ఏప్రిల్ 28న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో హను మాన్ ప్రసారం కానుంది
    రివ్యూస్
    YouSay Review

    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?

    ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిల...read more

    How was the movie?

    తారాగణం
    తేజ సజ్జ
    హనుమంతు
    అమృత అయ్యర్
    మీనాక్షి
    వరలక్ష్మి శరత్‌కుమార్
    అంజమ్మ
    వినయ్ రాయ్
    మైఖేల్
    వెన్నెల కిషోర్
    సిరి వెన్నెల
    సత్య అక్కల
    గెటప్ శ్రీను
    సిబ్బంది
    ప్రశాంత్ వర్మ
    దర్శకుడు
    కె. నిరంజన్ రెడ్డినిర్మాత
    ప్రశాంత్ వర్మ
    రచయిత
    అనుదీప్ దేవ్సంగీతకారుడు
    హరి గౌరాసంగీతకారుడు
    కృష్ణ సౌరభ్సంగీతకారుడు
    దాశరధి శివేంద్రసినిమాటోగ్రాఫర్
    సాయి బాబు తలారిఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
    సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్‌’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్‌’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పది రోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలాంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్‌ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ కానుందో ఇప్పుడు చూద్దాం.  అథర్వ కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.   ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా రాజశేఖర్‌ ఓ కీలక పాత్రలో నటించారు.  ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ పోలీస్‌ కథలతో తరచూ ప్రేక్షకులను అలరించే బాలీవుడ్‌ దర్శకుల్లో రోహిత్‌ శెట్టి (Rohit Shetty) ఒకరు. తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో ఈ సిరీస్‌ సిద్ధమైంది.  TitleCategoryLanguagePlatformRelease DateDusty Slay: Workin' ManSeriesEnglishNetflixJan 16American NightmareDocumentaryEnglishNetflixJan 17Merry Men 3MovieEnglishNetflixJan 18Full CircleSeriesEnglish NetflixJan 19Love on the Spectrum 2SeriesEnglish NetflixJan 19The KitchenMovieEnglishNetflixJan 19Where the Crawdads SingMovieEnglishSonyLIVJan 19Death and Other DetailsSeriesEnglishHotstarJan 16A Shop for KillersSeriesEnglish/KoreanHotstarJan 17Coleen Rooney: The Real Wagatha StoryDocumentaryEnglishHotstarJan 16Snakes SOS: Goa's Wildest 4DocumentaryEnglish HotstarJan 16Blue BeetleMovie English Jio CinemaJan 18Chicago Fire 12SeriesEnglishJio CinemaJan 18Law & Order: Special Victims UnitSeriesEnglishJio CinemaJan 18Mayalo MovieTeluguAmazon primeJan 15Hazbin HotelSeriesEnglishAmazon primeJan 19LOL: Last One Laughing IrelandSeriesEnglishAmazon primeJan 19
    జనవరి 17 , 2024
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్‌ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. హను-మాన్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.  సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు. నా సామిరంగ ఈ సంక్రాంతికి మరో స్టార్‌ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.  అయలాన్‌ సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్‌ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్‌ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్‌ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.  ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్‌ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి. కోట బొమ్మాళి P.S శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil SonyLIVJan 12SivappuMovieTamil AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
    జనవరి 08 , 2024
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్‌ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  సుహాస్‌ యువ నటుడు సుహాస్‌ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్‌.. తానొక హీరో మెటీరియల్ ‌అని నిరూపించుకున్నాడు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌’, ‘అంజాబీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ వంటి హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్‌ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్‌ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్‌ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్‌ స్టార్‌ అవుతాడని అంటున్నారు.  విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’తో స్టార్‌ హీరోగా మారిన విజయ్‌.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్‌ సొంతం. ప్రస్తుతం సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్‌ మార్కెట్‌ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్‌ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్‌ హిట్‌ లభిస్తే విజయ్‌ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.  సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌ను రూల్‌ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో రూ.100 కోట్ల క్లబ్‌లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, రైటింగ్‌ స్కిల్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్‌ చేయడంలో యూత్‌ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్‌ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్‌’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్‌ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.  నవీన్ పొలిశెట్టి ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్‌ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్‌లో కామెడీ స్టార్‌ అనగానే అందరికీ నవీన్‌ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్‌ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్‌ తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్‌ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్‌ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఒక సాలిడ్‌ హిట్‌ లభిస్తే నవీన్‌ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తేజ సజ్జ యంగ్‌ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్‌’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాందించిన ఈ యంగ్‌ హీరో.. టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్‌ యోధ’ చిత్రం కూడా  సాహసోపేతమైన కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్‌ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.  అడవి శేషు యువ హీరో అడవి శేషు.. యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్‌ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్‌ బాయ్‌, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్‌ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం  కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్‌: సెకండ్‌ కేసు’, ‘మేజర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్‌లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్‌లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌గా మారే అవకాశముంది. ప్రియదర్శి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన  'టెర్రర్‌' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్‌లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులను ప్లాన్‌ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్‌ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
    ఏప్రిల్ 18 , 2024
    <strong>Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;</strong>
    Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;
    టాలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్‌ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్‌ పెళ్లి టాపిక్‌ చాలా సార్లు సోషల్‌ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్‌ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే? ప్రభాస్‌ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్‌ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్‌ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్‌ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్‌ తర్వాత యావత్‌ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది.&nbsp; మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్‌ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్​తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.&nbsp; ‘ఫౌజీ’ షూట్‌లో ప్రభాస్‌! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ తాజాగా ఈ మూవీ షూట్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్‌ మలయాల భామ నమిత ప్రమోద్‌ కూడా సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్‌ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    అక్టోబర్ 26 , 2024
    <strong>The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!</strong>
    The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్‌’ సినిమా నుంచి ఓ రొమాంటిక్‌ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.&nbsp; లేటెస్ట్ అప్‌డేట్‌ అదుర్స్‌ ప్రభాస్‌ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్‌ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్‌ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్‌ ట్రీట్‌ (టీజర్‌/ట్రైలర్‌ రిలీజ్‌) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్‌ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్‌ వింటేజ్‌ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్‌ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న 'రాజా సాబ్‌' రిలీజ్‌ కానుంది. రాజా సాబ్‌ ఫొటో లీక్‌! రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రిలీజ్‌ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్‌ లాంగ్‌ హెయిర్‌తో ఫుల్‌ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్‌ రిద్ది కుమార్‌ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్‌ సందర్భంగా మానిటర్‌ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్‌ చేసినట్లు కనిపిస్తోంది.&nbsp; https://twitter.com/Baahubali230/status/1848209164553814057 రీ-రిలీజ్‌ల సందడి మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్‌ చేసి స్పెషల్‌ షోస్‌ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్‌’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’, ‘మిర్చి’, ‘రెబల్‌’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్‌ చేస్తున్నారు.&nbsp; భారీ ధరకు మ్యూజిక్ రైట్స్‌ రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్‌ రాజాసాబ్‌ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్‌ రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; వరుస సినిమాలతో ప్రభాస్‌ జోరు! ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!</strong>
    Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్‌.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
    దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కచ్చితంగా టాప్‌ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు ప్రభాస్‌. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్‌ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ! ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్‌ డాక్యుమెంటరీని ప్లాన్‌ చేస్తున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.&nbsp; రాజమౌళిపై సైతం దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.&nbsp; ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్‌! ప్రభాస్‌, గోపిచంద్‌ మధ్య మంచి ప్రెండ్‌షిప్‌ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా గోపిచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్‌ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్‌ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.&nbsp; ప్రభాస్‌ బర్త్‌డే కానుక ప్రభాస్‌ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్‌’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్‌ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్‌ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్‌ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్‌’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్‌ చేసి రిలీజ్‌ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌’ అంటూ వదిలిన ‘ఈశ్వర్‌’ ట్రైలర్‌ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.&nbsp; https://www.youtube.com/watch?v=gTA9ghC4ehs
    అక్టోబర్ 15 , 2024
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.&nbsp; డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఏప్రిల్ 23 , 2024
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
    దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
    ఫిబ్రవరి 27 , 2024
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; ‘హనుమాన్‌’గా కాంతార నటుడు! ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్‌ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్‌ ప్రకారం కాంతారా ఫేమ్‌ రిషబ్‌శెట్టితో ప్రశాంత్‌ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్‌ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్‌ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp; దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.&nbsp; స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా? ‘జై హనుమాన్‌’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్‌ పాత్రకు పలానా స్టార్‌ హీరోను ఫైనల్‌ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌, రానా దగ్గుబాటి, కేజీఎఫ్‌ ఫేమ్‌ యష్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్‌ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్‌’పై ప్రేక్షకుల్లో హైప్‌ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్‌ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్‌’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్‌ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ‘కాంతార’తో పాన్‌ ఇండియా క్రేజ్‌ రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    Hanuman Movie OTT: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    Hanuman Movie OTT: హనుమాన్‌ ఓటీటీ ఆలస్యంపై డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ క్లారిటీ.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) జంటగా నటించిన తొలి తెలుగు సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) డైరెక్షన్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే సంక్రాంతికి రిలీజైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో హనుమాన్‌ రాక ఎప్పుడంటూ ఓటీటీ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. మార్చి 16న హనుమాన్‌ హిందీ వెర్షన్‌ విడుదలవుతున్నప్పటికీ తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియక ఆడియన్స్ తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాపై ఓ అపడేట్‌ ఇచ్చాడు.&nbsp; డైరెక్టర్ ఏమన్నారంటే! హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ ఆలస్యంపై సినిమా లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సినిమాను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు మేము అహర్నిశలు కొన్ని విషయాల పట్ల దృష్టి సారించాం. ఎప్పుడూ మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశం తప్పా ఇంకేం లేదు. దయచేసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు’ అని ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1768483659928265154 తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌! హనుమాన్‌ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5' (Zee 5) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హిందీలో స్ట్రీమింగ్‌ డేట్‌ కన్ఫార్మ్‌ కాగా తెలుగు ఆడియన్స్‌కు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 'జీ 5' కూడా తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌పై ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘ఎంతోకాలం ఎదురుచూసిన క్షణం ఆసన్నమైంది. జీ5లో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో హనుమాన్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. డైరెక్టర్‌తో పాటు ఓటీటీ సంస్థ కూడా స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించకపోవడంతో ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఎదురు చూపులు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే హనుమాన్‌ రేపే హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్‌ వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/ZEE5Telugu/status/1768250898784854434 హిందీలో డబుల్‌ ధమాకా ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’ (Jio Cinema)లో మార్చి 16 నుంచి ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఇటీవల ట్వీట్‌ రూపంలో ప్రకటించాడు. ఇక అదే రోజూ టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌లో హనుమాన్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మతో పాటు ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ధ్రువీకరించింది. దీంతో హిందీ ప్రేక్షకులు.. హనుమాన్‌ను ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.&nbsp;
    మార్చి 15 , 2024
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    Hanuman Movie: ‘హనుమాన్‌’ టీమ్‌ డబుల్ ధమాకా.. నిరాశలో తెలుగు ఆడియన్స్‌!
    టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా డబుల్ గుడ్‌న్యూస్‌ ప్రకటించారు.  డబుల్‌ ధమాకా ఏంటంటే? ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్‌.. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్‌ ప్రీమియర్‌గానూ హనుమాన్‌ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ (Colors Cineplex) ఛానల్‌, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్‌ ప్రసారం అవుతుందని డైరెక్టర్‌ తన పోస్టులో చెప్పుకొచ్చారు. ‌అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్‌ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్‌ సినీప్లెక్స్‌’ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది. https://twitter.com/PrasanthVarma/status/1766116151636140450 మరి తెలుగులో ఎప్పుడు? హనుమాన్‌ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్‌ భరించాలని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.  తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు! హనుమాన్‌ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్‌ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్‌ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్‌ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్‌’ హౌస్‌ఫుల్‌ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1766064148956532944 సీక్వెల్‌లోనూ విలన్‌ అతడేనా? ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్‌ విలన్‌గా నటించిన 'వినయ్ రాయ్‌' (Vinay Roy) పార్ట్‌ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌ను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్‌ రాయ్‌కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ పోస్టు చేశారు. వినయ్‌ సినిమాలో మాదిరిగానే ఫేస్‌కు మాస్క్, బ్లాక్‌ డ్రెస్‌ ధరించి హోటల్‌ సిబ్బందికి షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్‌ చేస్తున్న నెటిజన్లు.. 'జై హనుమాన్‌'లోనూ వినయ్‌ విలన్‌గా కనిపిస్తాడా? అనే డౌట్‌ను రెయిజ్‌ చేస్తున్నారు. https://twitter.com/PrasanthVarma/status/1765336587184034177
    మార్చి 09 , 2024
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    సంక్రాతికి విడుదలైన హనుమాన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్‌ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్‌ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.&nbsp; మహిళ విచిత్ర ప్రవర్తన హనుమాన్‌ క్లైమాక్స్‌ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. https://twitter.com/i/status/1752014453342969952 ఒంట్లోకి దేవుడు వచ్చాడా? ఉప్పల్‌లోని ఏసియన్‌ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.&nbsp; దుష్టశక్తే ఈ పని చేసిందా? మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్‌ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్‌ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్‌ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; అసలు నిజం ఇదే! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్‌ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.&nbsp; రూ.300 కోట్ల దిశగా పరుగులు ఇక హనుమాన్‌ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్‌ను ‌అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్‌ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్‌ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తూ సీక్వెల్‌పై ఫోకస్‌ పెట్టారు.&nbsp;
    జనవరి 30 , 2024
    ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్‌ ఎందుకు చూడాలి
    ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్‌ ఎందుకు చూడాలి
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 14 , 2023
    <strong>Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!</strong>
    Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. తాజాగా 'హనుమాన్‌ 2'కి సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావొచ్చన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; మెగాస్టార్‌తో సంప్రదింపులు! హనుమాన్‌ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' (Jai Hanuman) ఉండనున్నట్లు తొలి భాగం క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ స్పష్టం చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో హనుమాన్‌ పాత్రకు మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకోవాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. సీక్వెల్‌ మెుత్తం హనుమంతుడి పాత్ర మీదే ఉండటంతో దానికి మెగాస్టార్‌ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారట. లేదంటే రామ్‌చరణ్‌ను అయిన హనుమాన్ పాత్రకు తీసుకోవాలని మేకర్స్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈమేరకు తాజాగా సంప్రదింపులు కూడా మెుదలైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హనుమాన్‌గా చిరంజీవి లేదా రామ్‌చరణ్‌ను తాము ఊహించుకుంటున్నట్లు రీసెంట్‌గా చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకురుస్తున్నాయి. చిరు, చరణ్‌లలో ఏ ఒక్కరు ఓకే చెప్పిన 'హనుమాన్‌ 2'పై అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; ‘హనుమాన్‌ 2’కి సమయం పట్టనుందా? 'జై హనుమాన్‌' (Jai Hanuman) చిత్రం పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోకజ్ఞ తేజ (Mokshagna Teja)తో డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెున్నటి వరకూ బొద్దుగా కనిపించిన మోకజ్ఞ కూడా రీసెంట్‌గా బరువు తగ్గి హ్యాండ్సమ్‌గా మేకోవర్‌ అయ్యాడు. దీంతో త్వరలోనే వీరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోకజ్ఞతో సినిమా తర్వాతనే ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’పై ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు చురుగ్గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అటు రామ్‌ చరణ్‌ సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నాడు. ఆపై ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ‘జై హనుమాన్‌’ షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముంది.&nbsp; మోక్షజ్ఞ&nbsp; వీడియో వైరల్‌ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద హీరో మెటీరియల్ కాదని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. ఈ వీడియోను నందమూరు అభిమానులు విపరీతంగా షేర్‌ చేయడంతో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.&nbsp; https://twitter.com/UrsVamsiShekar/status/1815971676414435711
    జూలై 25 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;
    2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్‌, కమిటీ కుర్రోళ్లు, ఆయ్‌ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్‌ - కలెక్షన్స్‌ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్‌ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu) నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.&nbsp; ఆయ్‌ (Aay) నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ కూడా కలుపుకుంటే ‘ఆయ్‌’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్స్‌ నటించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటివారు స్పెషల్‌ క్యామియోలతో అలరించారు.&nbsp; టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్‌ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.&nbsp; హనుమాన్‌ (Hanuman) తేజసజ్జ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్‌ క్రేజ్‌తో ప్రశాంత్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ ఫోకస్‌ పెట్టనున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ&nbsp; సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.&nbsp; సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (Vey Dharuvey). యషా శివకుమార్‌ హీరోయిన్‌. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రజాకార్‌&nbsp; బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; తంత్ర యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్‌ ధ్రువన్‌ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.&nbsp; షరతులు వర్తిస్తాయి! చైతన్యరావ్‌, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌ సంయుక్తంగా నిర్మించారు.&nbsp; లైన్‌మ్యాన్‌ త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్‌’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.&nbsp; రవికుల రఘురామ ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్‌ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది. లంబసింగి&nbsp; భరత్‌ రాజ్‌ హీరోగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్‌ తన్నీరు నిర్మించారు.&nbsp; యోధ సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఇతర చిత్రాలు పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateHanuman&nbsp;MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution&nbsp;MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean&nbsp;SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
    మార్చి 11 , 2024
    <strong>PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;</strong>
    PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;
    ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్‌ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా&nbsp; PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు.&nbsp; ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761 పోస్టర్‌లో ఇవి గమనించారా? ‘మ‌హా కాళీ’ పోస్టర్‌ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. కాళికాదేవి శక్తితో.. మహాకాళి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్‌ పాత్ర ఏ హీరోయిన్‌ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్‌ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్‌ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
    అక్టోబర్ 10 , 2024

    @2021 KTree