• TFIDB EN
  • హ్యాపీ డేస్
    UTelugu2h 40m
    ఒక ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఎనిమిది మంది యవకులు తమ స్నేహాన్ని నిలుపుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చిత్రం యూత్‌లో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించింది. 2007లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. స్నేహితులతో కలిసే చూసేందుకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ సందేశ్
    చంద్రశేఖర్ చందు
    తమన్నా భాటియా
    మధు
    నిఖిల్ సిద్ధార్థ్
    రాజేష్
    సోనియా దీప్తి
    శ్రవంతి శ్రావస్
    వంశీ చాగంటి
    శంకర్
    గాయత్రీ రావుయత్రీ రావు
    రాహుల్ హరిదాస్
    అర్జున్ టైసన్
    మోనాలీ చౌదరిసంగీత
    గురురాజ్ మానేపల్లికళాశాల ప్రిన్సిపాల్
    కమలినీ ముఖర్జీ
    శ్రేయా మేడమ్ (అతిథి పాత్ర)
    కృష్ణుడు
    బండోడు
    రణధీర్ రెడ్డి
    నవీన్
    ఆదర్శ్ బాలకృష్ణ
    సంజయ్
    వంశీపైడితల్లి
    ఆదిత్యప్రవీణ్
    శృతిప్రశాంతి
    సిబ్బంది
    శేఖర్ కమ్ముల
    దర్శకుడు
    శేఖర్ కమ్ములనిర్మాత
    మిక్కీ J. మేయర్
    సంగీతకారుడు
    విజయ్ సి. కుమార్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. కార్తికేయ2, సూర్య Vs సూర్య, శంకరాభరణం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు ఉన్న నిఖిల్ గురించి మీకు తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం. నిఖిల్ సిద్ధార్థ  ముద్దు పేరు? "బేగంపేట బోయ్" నిఖిల్ సిద్ధార్థ ఎత్తు ఎంత? 5 అడుగుల 10అంగుళాలు నిఖిల్ తొలి సినిమా? హ్యాపీ డెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో రాజేష్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ నిఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు? జూన్ 1, 1985 నిఖిల్‌కు వివాహం అయిందా? నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ అనే యువతిని 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు. విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు? తన ఫస్ట్ స్టాండర్డ్‌లో అయేష అనే అమ్మాయిని ఇష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిఖిల్‌కు ఇష్టమైన సినిమా? హ్యాపీడేస్ విశ్వక్‌ సేన్ ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ నిఖిల్ సిద్ధార్థ్ తొలి హిట్ సినిమా? హ్యాపీ డేస్ చిత్రం నిఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. కార్తికేయ2, 18 పెజేస్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. నిఖిల్‌కు ఇష్టమైన కలర్? బ్రౌన్ కలర్ నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రుల పేర్లు? తల్లి వీణా సిద్ధార్థ(మాజీ పాఠశాల ప్రిన్సిపాల్), తండ్రి శ్యామ్ సిద్ధార్థ(ప్రొఫెసర్) నిఖిల్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ నిఖిల్ సిద్ధార్థ చదువు? ఇంజినీరింగ్ నిఖిల్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? కార్తికేయ2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకానిక్ గోల్డ్, సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. నిఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు? నిఖిల్ 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.  నిఖిల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ నిఖిల్ తొలి పారితోషికం? హ్యాపీడేస్ చిత్రానికి గాను నిఖిల్ రూ.25,000 తీసుకున్నట్లు చెప్పాడు నిఖిల్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? నిఖిల్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.5 నుంచి రూ.10కోట్ల వరకు తీసుకుంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ అభిరుచులు? పుస్తకాలు చదవడం, ఫుట్‌బాల్ ఆడటం నిఖిల్‌కు ఇష్టమైన హీరోయిన్?  భూమిక చావ్లా నిఖిల్‌కు ఇష్టమైన హిందీ సినిమాలు? షోలే, 3 ఇడియట్స్ https://www.youtube.com/watch?v=waTLUNgxueo
    మార్చి 21 , 2024
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం... విజయశాంతి: తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్. "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం... ఆసిన్ విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది. కమలినీ ముఖర్జీ హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది. ఇలియానా రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు. నయనతార లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది. సాయి పల్లవి ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే  'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది. శృతిహాసన్ తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. సన్నిలియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్. షకిలా నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది.   కలర్స్ స్వాతి సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి  సంయుక్త మీనన్ ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్  సుహాసిని ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
    సెప్టెంబర్ 05 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5  (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.  https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన  రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.  Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.  Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL  ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత  కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.  Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు  BMW X5  ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  Lamborghini Aventador Roadster   లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.  ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography  ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ  కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL  దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2  అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.  వోల్వో XC90 T8 ఇది  వోల్వో  ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు   ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.  ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ  కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.  విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు  https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు  లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.  అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.  Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.  తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,  టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.  అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా  రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,  రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-   రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.  విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో  స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్  హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-  దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్   సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    మే 09 , 2024
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.  అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు   అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.  అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన  మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.  అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.  ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.  https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
    ఏప్రిల్ 26 , 2024
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం  ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.  హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.  సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. & Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తమన్నా భాటియా ప్రస్తుతం అవకాశాలపరంగా మంచి స్వింగ్‌లో ఉన్న హీరోయిన్,  తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. ఇప్పటి వరకు 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ మిల్క్ బ్యూటీ... ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015) హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల లస్ట్ స్టోరీస్2లో నటించి గ్లామర్ షోతో అదరగొట్టింది. అయితే తమన్నా గురించి చాలా మందికి తెలియని కొన్ని(Some Lesser Known Facts About Tamannaah Bhatia) ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తమన్నా భాటియా ఎవరు? తమన్నా భాటియా భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమన్నా దేనికి ఫేమస్? తమన్నా భాటియా.. హ్యాపీడేస్, బాహుబలి, F2 వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. తమన్నా భాటియా వయస్సు ఎంత? డిసెంబర్ 21, 1989లో జన్మించింది. ఆమె వయస్సు  34 సంవత్సరాలు  తమన్నా భాటియా ముద్దు పేరు? తమ్మి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  తమన్నా భాటియా ఎక్కడ పుట్టింది? ముంబై తమన్నా భాటియాకు వివాహం అయిందా? ఇంకా కాలేదు తమన్నా భాటియా అభిరుచులు? డ్యాన్సింగ్, కవితలు రాయడం తమన్నా భాటియా ఇష్టమైన ఆహారం? హైదరాబాద్ బిర్యాని తమన్నా భాటియా అభిమాన నటుడు? మహేష్ బాబు, హృతిక్ రోషన్ తమన్నా భాటియా తొలి సినిమా? చాంద్ సా రోషన్ చెహరా తమన్నా భాటియా నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ తమన్నా భాటియా ఏం చదివింది? BA చదివింది తమన్నా భాటియా పారితోషికం ఎంత? తమన్నా భాటియా ఒక్కొ సినిమాకు రూ.4 కోట్లు- రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. తమన్నా భాటియా తల్లిదండ్రుల పేర్లు? సంతోష్ భాటియా, రజని భాటియా తమన్నా భాటియాకు అఫైర్స్ ఉన్నాయా? తమన్నా భాటియా తొలుత క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలిచింది? 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/tamannaahspeaks/?hl=en తమన్నా భాటియా ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? తమన్నా భాటియా లస్ట్‌ స్టోరీస్ 2 వెబ్‌ సిరీస్‌లో విజయ్ వర్మతో కలిసి లిప్‌లాక్ సీన్లలో నటించింది. తమన్నా భాటియా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? సమంత, విజయ్ వర్మ తమన్నా భాటియా రోల్ మోడల్ ఎవరు? తన రోల్ మోడల్ మాధురి దీక్షిత్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు తమన్నా భాటియా ఎన్ని అవార్డులు గెలుచుకుంది? తమన్నా తన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకుంది. తమిళ్‌లో అత్యున్నత పురస్కారం కళైమామని, దయావతి మోడీ పురస్కారం, తఢకా చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును సైమా నుంచి పొందింది. https://www.youtube.com/watch?v=4pZvW7izZDw
    ఏప్రిల్ 16 , 2024
    Movies to watch with friends: ఈ 5 సినిమాలు ఫ్రెండ్స్‌తో చూస్తే ఆ కిక్కే వేరు!
    Movies to watch with friends: ఈ 5 సినిమాలు ఫ్రెండ్స్‌తో చూస్తే ఆ కిక్కే వేరు!
    ఏటా ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. కానీ, కొన్నే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇక, కొన్ని ఫ్రెండ్స్‌తో చూసే సినిమాలుంటాయి. ఒంటరిగా చూసినప్పుడు పొందని అనుభూతి.. ఫ్రెండ్స్‌తో కలిసి చూసినప్పుడు కలుగుతుంది. దోస్తులతో కూర్చొని చూస్తున్నప్పుడు తెగ ఎంజాయ్ చేస్తాం. తెలుగులో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. ఈ నగరానికి ఏమైంది? తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైంది. విభిన్న ప్రవృతులు కలిగిన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. వీరందరూ ఒక చోట కలిసి తమ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకోవడం, గోవాకి వెళ్లడం, డబ్బుల కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొనడం వంటి ఘట్టాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులో ఉంది.  https://www.youtube.com/watch?v=wERgpPK44w0 సొంతం సినిమా కోసం కన్నా కామెడీ సీన్ల కోసం ‘సొంతం’ మూవీ చూసేవాళ్లు చాలామంది. ఇందులోని సన్నివేశాలు అంతలా నవ్వు పుట్టిస్తాయన్నమాట. ముఖ్యంగా, సునీల్, ఎం.ఎస్. నారాయణ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఈ సీన్ల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటారు నెటిజన్లు. ఒకరకంగా సినిమాకు హీరో ‘సునీల్’ అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. https://www.youtube.com/watch?v=kDro5bBnZkE వెంకీ ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే వెంకీ సినిమా ఫుల్ టైం ఎంటర్‌టైనర్. ఇందులోని ట్రైన్ సీన్ బెస్ట్ కామెడీ ట్రాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఎస్సై సెలక్షన్స్‌కి ఎంపికైన నలుగురు స్నేహితులు అనుకోని ప్రమాదంలో పడితే ఎలా తప్పించుకున్నారనేదే సినిమా కథ. హీరోకు లవ్ ట్రాక్ జోడించి మరింత ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ మూవీ మ్యూజికల్‌గానూ మంచి విజయం సాధించింది. డీఎస్పీ స్వరాలు సమకూర్చాడు.  https://www.youtube.com/watch?v=pG4_xm-UilM హ్యాపీడేస్ ఫ్రెండ్‌షిప్‌కి కేరాఫ్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇంజినీరింగ్ చదువులు, స్నేహితుల మధ్య సంబంధాలను చక్కగా చూపించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాలేజీ స్టూడెంట్స్‌ జీవితాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మ్యూజికల్‌గానూ హిట్ టాక్ తెచ్చుకుంది.  https://www.youtube.com/watch?v=pG4_xm-UilM జాతిరత్నాలు ఈ మధ్య కాలంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘జాతిరత్నాలు’. సిటీలో ఉండాలని అనుకుని ఊరి నుంచి వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది సినిమాలో చూపించాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. పనీ పాట లేకుండా ఊరిలో తిరగడం, నగరానికి వచ్చి ఇబ్బందులను కోరి తెచ్చుకోవడం, వాటి నుంచి బయట పడటానికి ప్రయత్నించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. నిజంగా మనలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.  https://www.youtube.com/watch?v=Hgc07_BX4_8 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఓ వైపు ఫ్యామిలీ డ్రామాను నడిపిస్తూనే ఫ్రెండ్‌షిప్‌ని తెలియజేస్తుందీ చిత్రం. తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో ఒకరికొకరు ఎలా తోడున్నారనే సీన్స్‌ని చక్కగా చూపించాడు శేఖర్. నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, అభిజీత్, తదితరులు ఇందులో నటించారు.  https://www.youtube.com/watch?v=Xl912NaaKf0 వున్నది ఒకటే జిందగీ ‘మన కష్టసుఖాలను చెబితే వినేవాడు ఫ్రెండ్‌.. కానీ, ఆ కష్టసుఖాల్లో తోడుండే వాడే బెస్ట్ ఫ్రెండ్’ అంటూ ఫ్రెండ్‌కి, బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా చెప్పిన సినిమా ఇది. రామ్ పోతినేని, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓ ఫీల్ కలుగుతుంది. మ్యూజికల్‌గా సినిమా మంచి విజయాన్ని సాధించింది. https://www.youtube.com/watch?v=CJLJl1ckbOA డీజే టిల్లు రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఆహా, సోనీ లివ్ ప్లాట్‌ఫారంలలో స్ట్రీమింగ్ అవుతోంది.  https://www.youtube.com/watch?v=BHfLK-swJFA
    జూన్ 22 , 2023
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే! 
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే! 
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్‌ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం. [toc]  గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి  విశ్వ‌క్ సేన్ లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’.. శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.2 కోట్ల‌కు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఫలితంగా విశ్వ‌క్ సేన్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. శ‌ని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద జోరు చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. విశ్వక్‌ వన్‌మ్యాన్‌ షో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో లంక‌ల ర‌త్న అనే యువ‌కుడిగా విశ్వ‌క్ సేన్ యాక్టింగ్‌, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల‌ను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్‌ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.  కథేంటి కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  గం.. గం.. గణేశా  ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘గం గం గ‌ణేశా’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ విష్వక్‌ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ  మూవీ ఫ‌స్ట్ డే రూ.80-90 లక్షల వ‌ర‌కు గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 ల‌క్ష‌ల‌కుపైగా షేర్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.  కామెడీ ప్రధానం బలం క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కామెడీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. గం గం గ‌ణేశా మూవీలో ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌, న‌య‌న్‌సారిక హీరోయిన్లుగా న‌టించారు. బేబీ స‌క్సెస్ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిషోర్‌తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.  కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన ‘భ‌జే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్‌ రాబట్టినట్లు ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి.  క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్‌, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.  కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. 
    జూన్ 01 , 2024
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 
    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ?. దానికి గూగుల్‌ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్ర. అల్లుఅర్జున్‌ ఇల్లు ఎక్కడ? గూ: బన్నీ ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ప్రైవసీ దృష్ట్యా ఇంతకంటే ఏం చెప్పలేను. ప్ర: అల్లుఅర్జున్ బర్త్‌డే ఎప్పుడు? గూ: 8th ఏప్రిల్‌ 1983 ప్ర. అల్లుఅర్జున్ ఫోన్‌ నెంబర్‌? గూ: ... 98480 ..... అర్థమైందా? ప్ర: అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ కజిన్స్‌ అవుతారా? గూ: అవును.. అల్లు అర్జున్‌ వాళ్ల నాన్న చెల్లెలిని చిరంజీవి వివాహం చేసుకున్నారు. చిరు కొడుకు రామ్‌చరణ్‌. కాబట్టి అల్లుఅర్జున్‌ రామ్‌చరణ్‌ కజిన్స్ అవుతారు.  ప్ర: మల్లు అర్జున్ అని ఎందుకు పిలుస్తారు? గూ. అల్లుఅర్జున్‌ కేరళలో చాలా ఫేమస్‌. ఆర్య, హ్యాపీ సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. బన్నీ ప్రతీ సినిమా కేరళలో తప్పక రిలీజ్ అవుతుంది. అతడికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కేరళలో మల్లు అర్జున్ అనిపిలుస్తారు. ప్ర: అల్లుఅర్జున్‌ బాలీవుడ్‌ సినిమాలు ఎందుకు తీయట్లేదు? గూ: తెలుగులో తన కెరీర్‌పై అల్లుఅర్జున్‌ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చేయోచ్చు. ప్ర: నార్త్‌ ఇండియాలో అల్లుఅర్జున్‌ ఎందుకు ఫేమస్‌? గూ: నార్త్‌ ప్రజలు అతని డ్యాన్స్‌, సినిమాలు చూడటానికి ఇష్టపడతారు ప్ర. అల్లుఅర్జున్ ఫేవరేట్‌ నెంబర్‌? గూ. 666 ప్ర: అల్లుఅర్జున్‌ హిందీలో మాట్లాడగలడా? గూ: లేదు.. కానీ త్వరలో కచ్చితంగా నేర్చుకుంటానని చెప్పాడు.  ఇటీవల ‘4 ఇడియట్స్‌ రియాక్ట్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ అల్లుఅర్జున్‌తో ముచ్చటించింది. తన గురించి గూగుల్‌ను ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు అందులో బన్నీ సమాధానం ఇచ్చారు.  ప్ర: మీరు బ్రాహ్మణులా? బన్నీ: నో (నవ్వుతూ) ప్ర: మీరు చిరంజీవికి బంధువా? బన్నీ: అవును.. నేను చిరంజీవి గారికి మేనల్లుడ్ని ప్ర. మీరు బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు? బన్నీ: ఆ విషయం నాకూ తెలీదు ప్ర. మీ ఫేవరేట్‌ రంగు? బన్నీ: బ్లాక్ ప్ర. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతారు? బన్నీ: షూటింగ్‌ ఉంటే క్యారివాన్‌లో.. లేకపోతే అల్లు పార్క్‌లో ఎక్కువ టైం గడుపుతా. అల్లుఅర్జున్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు ఈ కింద యూట్యూబ్‌ వీడియోలో చూడండి. https://youtu.be/yoRVoy8hqmI
    ఏప్రిల్ 07 , 2023
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే? 
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.  https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.  https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.  https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)  కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.  https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.  https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.  https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.  https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.  బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.  టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)  స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.  సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు& టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.  ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.  టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.  మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్  (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద  ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది. 
    మే 22 , 2024
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
    సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యూత్‌.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్‌ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్‌ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్‌ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్‌ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్‌ రొమాంటిక్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  When Harry Met Sally (1989) నటి నటులు: మెగ్ ర్యాన్‌, బిల్లీ క్రిస్టల్‌ డైరెక్టర్‌ : రాబ్‌ రీనర్‌ ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్‌ చేసిన హ్యారీ, సాలీ.. న్యూయార్క్‌లో కలుసుకుంటారు. అప్పటికే వారు ప్రేమలో విఫలమై ఉన్నందు వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక పురుషుడు, స్త్రీ లైంగిక సంబంధం లేకుండా స్నేహితులుగా ఉండగలరా? అన్న ప్రశ్న వారికి ఎదురవుతుంది. దానికి వారు ఏం సమాధానం చెప్పారు? అన్నది స్టోరీ. Sleepless in Seattle (1993) నటినటులు : టామ్‌ హ్యాన్క్స్‌, మెగ్‌ ర్యాన్ డైరెక్టర్‌ : నోరా ఎప్రాన్‌ శ్యామ్‌ భార్య చనిపోవడంతో అతడు కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతడు ఓ టీవీ షోలో పాల్గొంటాడు. రిపోర్టర్‌ అన్నీ రీడ్‌.. అతడి మాటలకు ఆకర్షితురాలవుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రేమికుల రోజున అతడికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? వారు కలుసుకున్నారా? లేదా? అన్నది స్టోరీ. The Notebook (2004) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, రచెల్‌ మెక్‌ ఆడమ్స్‌ డైరెక్టర్‌ : నిక్‌ క్యాసావెట్స్‌ నోహ్‌ కాల్హౌన్‌ అనే యువకుడు అల్లీ అనే సంపన్న యువతిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం తరపున పోరాడేందుకు యుద్ధ భూమికి వెళ్తాడు. తమ ప్రేమ ముగిసిందని భావించిన అల్లీ మరోక వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నోహ్‌ తిరిగి రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.  Titanic (1997) నటినటులు : లియోనార్డో డికాప్రియా, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : జేమ్స్‌ కామెరాన్ రోజ్‌కు సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆమె తనకు కాబోయే భర్తతో టైటానిక్‌ షిప్‌లో ప్రయాణిస్తుండగా అక్కడ జాక్ అనే యువకుడ్ని ప్రేమిస్తుంది. ఓ ఉపద్రవం వారిద్దరినీ వేరు చేస్తుంది. రోజ్‌ కోసం జాక్‌ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. Titanic (1997) Directed by James Cameron Shown from left: Leonardo DiCaprio, Kate Winslet La la land (2016) నటీనటులు : ర్యాన్‌ గోస్లింగ్‌, ఎమ్మా స్టోన్‌ డైరెక్టర్‌ : డామీన్‌ చాజెల్లె సంగీతకారుడు సెబాస్టియన్‌, నటి మియా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే వారి కీర్తి పెరిగే కొద్ది వారి మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. కొందరు వ్యక్తులు వారి ప్రేమను బలహీన పరుస్తారు. చివరికి వారు ఒక్కటిగా ఉన్నారా? లేదా? Carol (2015) నటీనటులు : కేట్‌ బ్లాన్‌చెట్‌, రూనీ మారా డైరెక్టర్‌ : టాడ్ హేయ్‌నెస్‌ 1950లో ఫొటోగ్రాఫర్‌ థెరిస్‌.. కరోల్‌ అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె విచారంగా ఉండటాన్ని గమనించి కరోల్‌కు విడాకులైన విషయాన్ని తెలుసుకుంటాడు. థెరిస్‌ను రోజూ కలుస్తూ ఆమెకు దగ్గరవుతాడు. వారు ఒక్కటయ్యే క్రమంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నైతిక పోరాటం చేస్తారు.  Eternal Sunshine of the Spotless Mind (2004) నటీనటులు:  జిమ్‌ క్యారీ, కేట్‌ విన్‌సెల్ట్‌ డైరెక్టర్‌ : మైఖేల్‌ గాండ్రీ జోయెల్‌, క్లెమెంటైన్‌ ఒకరినొకరు ప్రేమించుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. జ్ఞాపకాలను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాము ఇప్పటికీ డీప్‌గా లవ్‌ చేసుకుంటున్నట్లు గ్రహించడంతో కథ మలుపు తిరుగుతుంది.  The Curious Case of Benjamin Button (2008) నటినటులు: బ్రాడ్‌ పిట్‌, కేట్‌ బ్లాన్‌చెట్‌ డైరెక్టర్ : డేవిడ్‌ ఫిన్‌చెర్‌ బెంజమన్‌ బటన్‌ ఒక అరుదైన సమస్యతో జన్మిస్తాడు. పుట్టడమే వృద్ధుడి శారీరక స్థితితో జన్మించిన అతడు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రివర్స్‌లో అతడి ఏజ్‌ తగ్గుతూ వస్తుంది. బెంజమన్‌.. డైసీ అనే డ్యాన్సర్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. కాలం గడుస్తున్న కొద్ది వారి వయసులు పరస్పరం విరుద్దంగా మారుతుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.  500 Days of Summer (2009) నటీనటులు : జోసెఫ్ గార్డన్‌, జూలీ డెస్‌చానెల్‌ డైరెక్టర్‌ : మార్క్ వెబ్‌ టామ్ ఒక గ్రీటింగ్ కార్డ్‌ రైటర్‌. అతడు సమ్మర్‌ తర్వాత తన ప్రేయసితో విడిపోతాడు. అయితే వేసవిలో ఆ 500 రోజులు ఆమెతో ఎలా గడిపానన్న విషయాన్ని టామ్‌ సమీక్షించుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహిస్తాడు.  ‘Before’ Trilogy (1995 – 2013) నటీనటులు : ఈథన్‌ హావ్‌కే,  జూలీ డెల్పీ డైరెక్టర్‌ : రిచర్డ్‌ లింక్‌లేటర్‌ ‘బిఫోర్ ట్రయాలజీ’.. హాలీవుడ్‌లోని ఉత్తమ రొమాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీ. ఆ సంస్థ నుంచి వచ్చిన  ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunset), ‘బిఫోర్ సన్‌సెట్’ (Before Midnight), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (Before Midnight) మూవీస్‌ అద్భుతమైన రొమాంటిక్‌ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడు సినిమాలు జెస్సీ, సెలిన్ ప్రేమకథల చుట్టు తిరుగుతుంది.  Never Let me go (2010) నటీనటులు : క్యారి ముల్లీగన్‌, ఆండ్రూ గర్‌ఫీల్డ్‌, కియారా నైట్లీ, ఎల్లా పుర్నెల్‌ డైరెక్టర్‌: మార్క్‌ రోమనెక్‌ రూత్, కాథీ, టామీ ఓ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటారు. లవ్‌కు సంబంధించిన బాధాలను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఆ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది కథ.  Pride & Prejudice (2005) నటీనటులు: కీరా నైట్లీ, మ్యాథ్యూ, కారే ముల్లిగన్‌, రోసముండ్‌ పైక్‌, సిమన్‌ వుడ్స్‌ తదితరులు డైరెక్టర్‌ : జో వ్రైట్ ఇది బెన్నెట్ అనే మహిళకు పుట్టిన నలుగురు కుమార్తెల కథ. ధనవంతులైన భర్తలు కావాలని ఆమె కూతుర్లు పట్టుబడతారు. మరి వారి కలలు ఎలా నెరవేరాయి? వారు ఎలాంటి భర్తలను పొందారు? అన్నది కథ.  Broke back mountain (2005) నటీనటులు : హీత్‌ లెడ్జర్‌, జేక్‌ గైలెన్‌హాల్‌, మిచెల్లె విలియమ్స్‌, అన్ని హాథ్‌వే డైరెక్టర్‌ : ఆంగ్‌ లీ ఇద్దరు గొర్రెల కాపరులు.. ఎన్నిస్, జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. లైంగిక, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారిద్దరూ తమ స్నేహితులను వివాహం చేసుకోవడంతో బంధం క్లిష్టంగా మారుతుంది. Dirty Dancing (1987) నటీ నటులు : పాట్రిక్‌ స్వేజీ, జెన్నిఫర్ గ్రే డైరెక్టర్‌ : ఎమిలీ ఆర్డొలినో ఫ్రాన్సిస్‌ తన తల్లిదండ్రులతో విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఓ రిసార్టులోని డ్యాన్స్‌ మాస్టర్‌తో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను యువతి తండ్రి తిరస్కరిస్తాడు. మరి వారు ఒక్కటయ్యారా? Call Me By Your Name (2017) నటీనటులు : టైమోథీ చలామెట్‌, అర్మీ హామర్‌ డైరెక్టర్‌ : లుకా గ్వాడాగ్నినో 1983 వేసవి కాలంలో కథ జరుగుతుంది. 17 ఏళ్ల ఎలియో పెర్ల్‌మాన్.. తన తండ్రి సహాయకుడు ఆలివర్‌ను ఇష్టపడుతుంది. వారు ఆ వేసవిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే, ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.  Shakespeare in Love (1998) నటీనటులు : జోసెఫ్‌ ఫ్లెన్నస్‌, గ్వినేత్ పాల్ట్రో డైరెక్టర్‌ :  జాన్‌ మాడెన్‌ విలియం షేక్‌ స్పియర్‌.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒక అందమైన యువతిని చూసి ప్రేరణ పొందుతాడు. ఓ నాటకం రాయడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో వారు శరీరకంగా దగ్గరవుతారు. అయితే యువతి చేసిన పని వల్ల వారి జీవితాలు తలకిందులవుతాయి.  The fault in our Star (2014) నటీనటులు : షాయ్‌లెనె వూడ్లీ, అన్సెల్‌ ఎల్గర్ట్‌ డైరెక్టర్‌ : జోష్‌ బూన్‌ హాజెల్, అగస్టస్ అనే ఇద్దరు క్యాన్సర్ బాధితులు.. క్యాన్సర్ సపోర్టు గ్రూప్‌ ద్వారా కలుసుకుంటారు.  త్వరలోనే వారు ప్రేమలో పడతారు. కష్టకాలంలో వారు ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. అయితే విధి వారిపై కన్నెర్ర చేస్తుంది. . Four Weddings and a Funeral (1994) నటీనటులు : హ్యూజ్‌ గ్రాన్ట్‌, ఆండీ మెక్‌డొవెల్‌ డైరెక్టర్‌ : మైక్‌ నెవెల్‌ ఇంట్రోవర్ట్‌ అయిన చార్లెస్‌.. అమ్మాయిలను దురదృష్టంగా భావిస్తుంటాడు. ఒక పెళ్లిలో క్యారీ అనే అందమైన యువతిని చార్లెస్‌ చూస్తాడు. ఆ అమ్మాయి తనకు అదృష్ట దేవత కాగలదని విశ్వసిస్తాడు. మరి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చార్లెస్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. 
    ఫిబ్రవరి 10 , 2024
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..  ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…  మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.  మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/sunny4u007/status/1633901586413154304 ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.  https://twitter.com/i/status/1633886352583565313 ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు  ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.  https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20 వరుస పెట్టి సినిమాలు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్‌ శంకర్‌ షూటింగ్‌ను మార్చి 28నుంచి  పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.  https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025 https://twitter.com/SupremePSPK/status/1630933852058423302 ఫటా ఫట్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి.   పవన్ క్యూ జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు వేళాయే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
    మార్చి 10 , 2023
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి ఎమోషనల్.. ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాక‌తో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గ‌ర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాక‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.  https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20 అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు. https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది.  రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.  చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.  డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్,  డాక్టర్ రూమా సిన్హా  అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో  ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది. ఐకాన్ స్టార్ రాక.. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ‌అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/ANI/status/1671037419255373824?s=20  అటు చరణ్‌-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్‌ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ  
    సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ  
    ప్రస్తుతం సోషల్‌ మీడియా స్టార్స్‌ అంటే రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్‌లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్‌ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్‌ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.  ట్విటర్ వార్‌ గత కొన్ని నెలలుగా రామ్‌ చరణ్ ఏదో విధంగా ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్‌ మధ్య ఫ్యాన్‌ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్‌ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.  హ్యాష్‌ట్యాగ్స్‌తో హల్‌చల్‌ ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.  https://twitter.com/i/status/1632680528578228224 అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ విషెస్ చెప్పిన స్క్రీన్‌ షాట్లు తీసి తెగ షేర్ చేశారు. (1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్‌లో ట్రెండ్‌ చేయగా..  వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు. https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20 యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్‌ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1633007975412400132 టైటిల్‌పై రచ్చ మరోవైపు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్‌ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్‌లో RC15 హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. క్రేజీ కాంబినేషన్‌ RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్‌తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్‌ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు ఎస్‌జే సూర్య, సునీల్‌, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  భారీ అంచనాలు RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టైటిల్ ఇదేనా? సినిమా టైటిల్‌ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్‌ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. https://twitter.com/i/status/1633351074508845058 బర్త్‌డే కానుక చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.  https://twitter.com/i/status/1633737854919606273 ఫ్యాన్స్‌ నిరాశ సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్‌రాజు హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్‌ప్రైజ్‌ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
    మార్చి 09 , 2023
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    SSMB 29: మహేష్‌ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
    సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో  'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం గ్లోబల్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటించిన రాజమౌళి ఈ సినిమాపై కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్లిన రాజమౌళి.. తన అప్‌కమింగ్‌ మూవీ గురించి తొలిసారి పెదవి విప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  రాజమౌళి ఏమన్నారంటే? రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం గ్లోబల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జపాన్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ రాజమౌళికి ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB 29 గురించి రాజమౌళి మాట్లాడారు. 'మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుశా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను' అని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1769897700923990284 జెన్నీ పాత్ర చనిపోతుందట.. కానీ! జపాన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాన్ని రాజమౌళి పంచుకున్నారు. ఈ సినిమాలో భీమ్‌ (తారక్‌)కి జోడిగా జెన్నీ పాత్రలో ఓలివియా నటించింది. అయితే వీరిద్దరి కాంబోలో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, నిడివి కారణంగా వాటిని తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపారు. అంతేకాకుండా జెన్నీ పాత్రకి ముందుగా విషాదాంతం రాశామని తెలిపారు. రామ్ (రామ్‌చరణ్‌) పాత్రని జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కి జెన్నీ సాయం చేసే నేపథ్యంలో ఆమె పాత్ర మరణిస్తుందని పేర్కొన్నారు. అయితే అది మరీ ఎమోషనల్ ఎండింగ్‌లా ఉంటుందేమో అని భావించి బ్రతికి ఉన్నట్లు మార్పు చేశామని చెప్పారు. ఈ ముంగింపు అందరికీ నచ్చిందని రాజమౌళి హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.  రాజమౌళికి అపురూప కానుక బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో వారి హృదయాల్లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ వీరాభిమాని రాజమౌళికి అపురూపమైన కానుక ఇచ్చింది. ఆ అభిమాని 83 ఏళ్ల వృద్ధురాలు కావడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 'జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారు చేసి తమకు ఇష్టమైన వారికి కానుగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్‌కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. మాకోసం తను చలిలో బయటే వేచిచూస్తూ నిలుచుంది. కొంతమంది చూపే ఆదరణకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం’ అంటూ రాజమౌళి వివరించారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
    మార్చి 19 , 2024
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    ]సినిమాల విషయంలో తనకు తానే స్ఫూర్తి అని, ఎవరూ తనని ప్రభావితం చేయబోరని చెబుతుంటుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    ]శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరీ’ ఎటువంటి క్రెడిట్స్‌ తీసుకోకుండానే వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. అంతే రానా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. సినిమాయే తన ప్రపంచమని సురేశ్‌ బాబు చెబుతుంటారు.వాయిస్ ఓవర్‌
    ఫిబ్రవరి 13 , 2023
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    Celebrity Couples Age Gap: ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఇంతనా.. అయినా సో హ్యాపీ..!
    ప్రేమ ఎంతో మధురమైనది. దానికి కులం, మతం, డబ్బు, రంగుతో పని లేదంటారు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ప్రేమికులు ఏ విషయాన్ని పట్టించుకోరు. ఎంతదూరమైన వెళ్లి తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రేమకు వయసుతోనూ పనిలేదని చాటి చెప్పారు. వయసులో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ భాగస్వామిని చేసుకొని సంతోషంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో పదేళ్లకు మించి ఏజ్‌ గ్యాప్‌ ఉన్న సెలబ్రిటీ కపుల్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.  రణ్‌బీర్ కపూర్‌ - అలియా భట్‌ బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌ (40)  - అలియా భట్‌ (30)ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆలియా కంటే రణ్‌బీర్‌ 10 ఏళ్లు పెద్ద. వయసును ఏ మాత్రం పట్టించుకోని ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి గతేడాది నవంబర్‌లో ఓ పాప కూడా పుట్టింది.  ఫహద్‌ - నజ్రియా మలయాళం నటుడు ఫహద్‌ ఫాసిల్‌ (40) నటి నజ్రియా నజిన్‌ (28)ను 2014లో లవ్‌ మ్యారేజ్ చేసుకున్నాడు. తన కంటే ఫహద్‌ 12 ఏళ్లు పెద్ద అయినప్పటికీ మనసులు కలవడంతో వీరు ఒక్కటయ్యారు. పుష్ప సినిమాలో విలన్‌గా నటించి ఫహద్ ఆకట్టుకున్నాడు. అటు నజ్రియా సైతం నాని హీరోగా చేసిన 'అంటే సుందరానికి ' నటించి ఆకట్టుకుంది.  ప్రియాంక చోప్రా -  నిక్ జోనాస్‌ బాలీవుడ్ ‌అగ్రకథానాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా (40) తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ నటుడు నిక్ జోనాస్‌ (30)ను ప్రేమ వివాహం చేసుకుంది. తన కంటే జోనాస్ చిన్నవాడైనప్పటికీ మనసులో మాత్రం చాలా పెద్ద వాడని ప్రియాంక ఓ సందర్భంలో పేర్కొంది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. జోనాస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక క్రేజ్‌ బాగా పెరిగింది. హాలీవుడ్ అవకాశాలు కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వచ్చేసాయి. సైఫ్ అలీఖాన్‌ - కరీనా కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా తన కంటే 13 ఏళ్లు చిన్నదైన కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కరీనాను సైఫ్‌ అలీఖాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్‌కు ఆయన మొదటి భార్యకు మధ్య కూడా వయసులో చాలా వ్యత్యాసమే ఉంది. ఫస్ట్‌ వైఫ్‌ అమృతా సింగ్‌ సైఫ్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. వీరికి పుట్టిన సారా అలీఖాన్‌ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.  ఆర్య - సయేషా సైగల్  తమిళ హీరో ఆర్య (42).. 2019లో సయేషా సైగల్‌ (25) ను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్య కంటే సయేషా వయసులో 17 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా ఉంది.   ప్రకాష్‌ రాజ్‌ - పోనీ వర్మ ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌(58) కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ (45) ను 2010లో వివాహం చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కంటే పోనీ వర్మ 13 ఏళ్లు చిన్నది. వీరిద్దరి ఓ బాబు కూడా ఉన్నాడు. 1994లో లలితా కుమారి అనే మహిళను ప్రకాష్‌ రాజ్ వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ జంట 2009లో విడాకులు తీసింది. ఆ తర్వాతి ఏడాదే ప్రకాష్ రాజ్‌ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు.  దిల్‌ రాజు - తేజస్విని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (52) తేజస్విని(వైఘా రెడ్డి)ని 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇరువురి మధ్య వయసు వ్యత్యాసం 19 సంవత్సరాలు. దిల్‌రాజు మెుదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దిల్‌రాజు ఇప్పటివరకూ వివిధ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాలు నిర్మించాడు.   అర్జున్‌ కపూర్‌ - మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ (45) తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరా (58)తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు. 
    మే 16 , 2023
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.  ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.  లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.  https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.  కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024

    @2021 KTree