• TFIDB EN
  • హలో బ్రదర్
    UTelugu2h 32m
    కవల సోదరులైన దేవా, రవి వర్మ పుట్టగానే మిస్రో అనే గూండా వల్ల వేరు చేయబడుతారు. అయితే వారు పెద్దయ్యాక తిరిగి కలుసుకుని తమ తండ్రికి హాని తలపెట్టాలని చూస్తున్న మిస్రో కొడుకు మిత్రాపై పోరాడుతారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగార్జున
    దేవా మరియు రవివర్మ (ద్వంద్వ పాత్రలు)
    రమ్య కృష్ణన్
    మంగ
    సౌందర్య
    ఓహో
    నెపోలియన్
    మిత్ర
    శ్రీహరి రఘుముద్రి
    అయ్యో మామయ్య
    కోట శ్రీనివాసరావు
    ఎస్ ఐ తాడి మాతయ్య కానిస్టేబుల్ వైపు తిరిగాడు
    బ్రహ్మానందం
    కాసి
    అలీ
    హిగారల్
    శరత్ బాబు
    చక్రవర్తి
    గిరి బాబు
    మంగ తండ్రి
    బాబూ మోహన్
    సత్తి పాండు
    మల్లికార్జునరావు
    కానిస్టేబుల్ చిట్టి ఎస్‌ఐని ఆశ్రయించాడు
    చరణ్ రాజ్
    మిత్ర తండ్రి
    శివాజీ రాజా
    మిత్ర అనుచరుడు
    అనంత్ బాబు
    గౌతమ్ రాజు
    ఇన్‌స్పెక్టర్
    కోట శంకర్ రావుఇన్స్పెక్టర్
    మదన్ మోహన్జైలర్
    కాదంబరి కిరణ్సెంట్రీ
    అశోక్ కుమార్
    చక్రవర్తి బావ
    నర్సింగ్ యాదవ్
    మిత్ర అనుచరుడు
    జెన్నీ
    మార్వాడి
    రంభ
    డాన్సర్
    ఆమని
    డాన్సర్
    ఇంద్రజ
    డాన్సర్
    అన్నపూర్ణ
    ఓహో తల్లీ
    సంగీత క్రిష్
    హీరో తల్లి
    సుధ
    మంగ తల్లి
    శ్రీ లక్ష్మి
    తాడి మాతయ్య భార్య
    శివ పార్వతి
    మాస్టర్ ఉదయ్బాల్యం మిత్ర
    బాలాదిత్య
    బాల్యం దేవా
    సిబ్బంది
    ఈవీవీ సత్యనారాయణ
    దర్శకుడు
    కెఎల్ నారాయణనిర్మాత
    S. గోపాల్ రెడ్డినిర్మాత
    రాజ్-కోటిసంగీతకారుడు
    S. గోపాల్ రెడ్డిసినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!</strong>
    HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!
    అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్‌, క్లాస్‌, ఆధ్యాత్మికం, లవ్‌ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్‌ ‌అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్‌ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 'శివ'తో సెన్సేషన్‌ సాధారణంగా కెరీర్‌ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్‌ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్‌ వర్మకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్‌ స్టెప్‌ ‌అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా&nbsp; ‘శివ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నాగ్‌ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్‌ - రామ్‌గోపాల్‌ వర్మ చెక్‌ పెట్టారు.&nbsp; వైవిధ్యతకు ప్రాధాన్యం శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్‌ నేచురల్‌ హెయిస్ట్‌ ఫిల్మ్‌, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్‌’లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా మారిపోయాడు.&nbsp; ‘అన్నమయ్య’ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ రావడం విశేషం.&nbsp; మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు.. ‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.&nbsp; కొత్తవారికి ఛాన్స్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్‌ (మాస్‌), విజయ్‌ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్‌ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్‌. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్‌ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్‌, ఫాజిల్‌, రవిచందర్‌, మహేష్‌ భట్‌ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్‌ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్‌ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్‌ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్‌ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/thokkaloteja/status/1828863171152757038 బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా.. సాధారణంగా స్టార్‌డమ్‌ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తారక్‌ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్‌ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1829013612117230039 ఫిట్‌నెస్‌ మంత్ర నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్‌ ఫిజిక్‌ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్‌ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్‌’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్‌ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
    ఆగస్టు 29 , 2024
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.&nbsp; కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. న‌వంబ‌ర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘ‌నంగా జ‌రిగిన సంగతి తెలిసిందే.&nbsp; పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్‌ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.&nbsp; వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు. వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.&nbsp; వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్‌-పవన్‌ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్‌ మార్‌ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.&nbsp; https://twitter.com/vamsikaka/status/1719756960852263315 కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి.&nbsp; కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
    నవంబర్ 03 , 2023
    Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
    Vishwambhara: మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో అలనాటి స్టార్‌ హీరోయిన్‌? ఆ సీన్‌ సినిమాకే హైలెట్‌ అట!
    మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; విశ్వంభరలో అలనాటి నటి! విశ్వంభరలో చిరుకి జోడీగా నటి త్రిష (Trisha Krishnan) నటిస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్‌ విజయశాంతి (Vijayashanti) కూడా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ ప్రకారం సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలక పాత్ర కోసం ఆమె పేరును మేకర్స్‌ పరిశీలిస్తున్నారట. ఆమెను ఒప్పించే పనిలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్‌కు ఓకే చెబితే విశ్వంభరపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చిరంజీవి - విజయశాంతి జోడీగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. ఇన్నాళ తర్వాత మళ్లీ వీరిద్దరిని తెరపై చూడటమంటే అది ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.&nbsp; చిరు కెరీర్‌లోనే తొలిసారి! ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ కూడా చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. ఈ ఒక్క సీక్వెన్స్‌ కోసం 26 రోజులు షూటింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే తొలిసారి. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. షూట్‌లో చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్‌లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నిర్వహించారు. కాగా, ఈ సీక్వెన్స్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, మెగా బ్రదర్స్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు.. ఈ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్‌ను కలవడం గమనార్హం. మెగాస్టార్‌ స్పెషల్‌ పోస్టు మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేడు (ఏప్రిల్‌ 23) హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరు తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష, కార్యదక్షత, సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం’ అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టారు. దీనికి విశ్వంభ‌ర సెట్స్ నుంచి తీసిన హనుమంతుడి ఫొటోను జత చేయడంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/KChiruTweets/status/1782634604022673632?
    ఏప్రిల్ 23 , 2024
    18 Years Of Bhadra: మొదట హీరో రవితేజ కాదు.. సినిమా విడుదలకు ముందు ఇన్ని జరిగాయా?
    18 Years Of Bhadra: మొదట హీరో రవితేజ కాదు.. సినిమా విడుదలకు ముందు ఇన్ని జరిగాయా?
    మాస్‌ మహారాజ రవితేజను స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో భద్ర ముందు వరుసలో ఉంటుంది. 2005లో వచ్చిన భద్ర సినిమా ద్వారానే బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (మే 12, 2005) రిలీజైన ఈ చిత్రం ప్రభంజనమే సృష్టించింది. అప్పటికే మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజను భద్ర సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసింది. అలాగే దిల్‌రాజును ఇండస్ట్రీలో బలమైన నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో భద్ర సాంగ్స్‌ ఉన్నాయి. భద్ర సినిమా రిలీజై 18ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.&nbsp; తారాగణం భద్ర సినిమాలో రవితేజ- మీరా జాస్మిన్ జంటగా చేశారు. సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. మీరా జాస్మిన్‌ బ్రదర్‌గా, రవితేజ ఫ్రెండ్‌గా నటుడు అర్జన్‌ బజ్వా నటించాడు. అలాగే ప్రకాష్‌ రాజ్‌, మురళి మోహన్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మాజీ, సునీల్‌ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఆర్తూర్‌ A. విల్సన్‌ సినిమాటోగ్రఫీ అందించగా మాటలు కొరటాల శివ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు రాశారు.&nbsp; https://www.youtube.com/watch?v=WrW9j6DjvZs గ్రాండ్‌ ఎంట్రీ దర్శకుడిగా బోయపాటి శ్రీను సత్తా ఏంటో భద్ర సినిమా చూపించింది. మాస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బోయపాటిని దగ్గర చేసింది. భద్ర తర్వాత బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అతని డైరెక్షన్‌ స్కిల్స్‌ చూసిన టాలీవుడ్‌ ప్రొడ్యూసర్లు బోయపాటితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచారు.&nbsp; https://www.youtube.com/watch?v=rFfZZyobCdQ కాసుల వర్షం దిల్‌, ఆర్య సినిమా హిట్లతో ఊపు మీదున్న నిర్మాత దిల్‌ రాజుకు భద్ర సినిమా హ్యాట్రిక్‌ విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్‌ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. బడ్జెట్‌ కంటే రెట్టింపు వసూళ్లను భద్ర రాబట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నో రెమ్యూనరేషన్‌! భద్ర సినిమా కోసం బోయపాటి శ్రీనుకు దిల్‌రాజు రూ. 6 లక్షలతో పాటు ఓ కారు కూడా ఆఫర్ చేశారట. అయితే తన ఫస్ట్‌ సినిమాకు బడ్జెట్‌ సమస్య రాకుండా తన రెమ్యూనరేషన్‌ కూడా చిత్ర నిర్మాణానికి వినియోగించాలని బోయపాటి సూచించారట. https://www.youtube.com/watch?v=1U9yWjrXQpA ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బన్నీ భద్ర సినిమాకు రవితేజకు బదులు మెుదట అల్లు అర్జున్‌ను అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల బన్నీ చేయలేకపోయారట. రవితేజను సంప్రదించగానే ఆయన ఓకే చెప్పేశారట.&nbsp; https://www.youtube.com/watch?v=5CExeYfyEG0 స్టోరీనే బలం భద్ర సక్సెస్‌లో ఆ సినిమా స్టోరీదే కీ రోల్‌. అప్పటివరకూ చూసిన సినిమా కథలతో పోలిస్తే భద్ర స్టోరీలైన్‌ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్‌ ఇలా కోణాలను స్పృశిస్తూ సినిమా సాగింది.&nbsp;
    మే 12 , 2023
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం&nbsp; ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.&nbsp; ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.&nbsp; విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.&nbsp; హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.&nbsp; సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. &amp; Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self&nbsp;MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    <strong>Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!</strong>
    Pushpa 2 Climax:&nbsp; పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్!
    సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 2: ది రూల్‌’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17న&nbsp; విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్‌ ఊచకోత సన్నివేశం యాక్షన్‌ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్‌ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్‌’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌ నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌, తమన్‌ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్‌ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి. https://twitter.com/resulp/status/1858089345464279297 సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’ ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్‌ ఫైర్‌” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు. క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్‌ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్‌ లోనే హింట్స్ ఉన్నాయి.&nbsp; ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది.&nbsp; ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రముఖుల స్పందన ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు: రాజమౌళి: "పుష్పగాడి వైల్డ్‌ ఫైర్‌ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది."అనిల్‌ రావిపూడి: "ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. బిగ్‌ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా."హరీశ్‌ శంకర్‌: "పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్‌."రిషబ్‌ శెట్టి: "ట్రైలర్‌లో మాస్‌ ఎలిమెంట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్‌ సిద్ధమవుతోంది."ప్రశాంత్ వర్మ: "పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు." ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై నటుడు కిరణ్‌ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, "థ్యాంక్యూ మై బ్రదర్‌. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్‌ చేస్తాను" అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 5 - పుష్ప పండుగ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్‌ విజువల్స్‌ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా..?" అంటూ డైరెక్టర్‌ బుచ్చిబాబు చేసిన కామెంట్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంతకు మించి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్‌ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్‌ ఇస్తుందో చూడాలి!
    నవంబర్ 18 , 2024
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,&nbsp; కౌషిక్‌ మెహతా, నాగ&nbsp;మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,&nbsp; కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. &nbsp; సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    <strong>Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్‌ తేజ్‌.. ఎలాగంటే?</strong>
    Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్‌ తేజ్‌.. ఎలాగంటే?
    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్‌కు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపించింది. అయితే మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోమారు అల్లు వర్సెస్‌ మెగా వివాదం తెరపైకి వచ్చింది. సమసిపోతుందనుకుంటున్న ఈ సోషల్‌ మీడియా వార్‌కు అతడి వ్యాఖ్యలు అగ్గిరాజేసేలా చేసింది.&nbsp; వరుణ్ ఏమన్నారంటే.. మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్​లో విశాఖలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కడ వేదికపై మాట్లాడిన వరుణ్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. మట్కా గురించి రిజల్ట్‌పై టెన్షన్‌ పడుతున్న క్రమంలో తన అన్న రామ్‌చరణ్‌ నుంచి ఫోన్ వచ్చినట్లు వరుణ్‌ తెలిపాడు. చరణ్‌ 10 మాటలు చెప్పాల్సిన పనిలేదని, పక్కన కూర్చొని భుజంపై చేయి వేస్తే అదే రూ.100 కోట్లకు సమానమని అన్నాడు. 'ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/TheAakashavaani/status/1855645538848317783 బన్నీకి ఇండైరెక్ట్‌ పంచ్‌..! వరుణ్‌ తేజ్‌ తన తాజా కామెంట్స్‌ ద్వారా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘చెప్పను బ్రదర్‌’ అంటూ పవన్‌ గురించి బన్నీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలో తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే తనకంటూ స్టార్‌డమ్ వచ్చాక బన్నీ వారి గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదన్న విమర్స మెగా ఫ్యాన్స్‌లో ఉంది. ఏపీ ఎన్నికల సమయంలో ఇది తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం మారుతీనగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన బన్నీ ‘తనకు నచ్చితేనే వస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్‌ను సెపరేట్‌ చేస్తూ అల్లు ఆర్మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐ లవ్‌ యూ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.&nbsp; సోషల్‌ మీడియాలో బిగ్ వార్‌! వరుణ్‌ తేజ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ మరోమారు సోషల్ మీడియా వేదికగా దాడి చేసుకుంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని వరుణ్‌ తేజ్‌ చెప్పకనే చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ‘కుక్కకాటుకు చెప్ప దెబ్బ’ అన్న సామెతను కూడా ప్రయోగిస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్‌ సైతం వరుణ్‌ తేజ్‌, మెగా ఫ్యాన్స్‌కు దీటుగా బదులిస్తున్నారు. బన్నీలా సక్సెస్‌ అయ్యి వరుణ్‌ ఈ మాట చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. తన సినిమా రిలీజ్‌ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ను కాకా పట్టడం కోసమే వరుణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వరుణ్‌ లేటెస్ట్ కామెంట్స్‌ నెట్టింట మరోమారు అల్లు vs మెగా ఫ్యాన్‌ వార్‌కు ఆజ్యం పోసిందనే చెప్పాలి.&nbsp; https://twitter.com/Mr_Thanniru/status/1855677559385506053 https://twitter.com/Mahendr00185818/status/1855658081923002548 https://twitter.com/KurnoolGabbar/status/1855648961681600850 https://twitter.com/Nishvk18/status/1855647703893786929 https://twitter.com/Pawala444/status/1855647070990082127 https://twitter.com/allumanu45/status/1855654467125096827 https://twitter.com/goudsaab410/status/1855646150281338887 ‘పుష్ప 2’ను టార్గెట్‌ చేసిన మెగా ఫ్యాన్స్‌! అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్మీతో పాటు మెగా ఫ్యాన్స్‌ సైతం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూడటానికి ఓ బలమైన కారణం ఉంది. ‘పుష్ప 2’పై ఏమాత్రం నెగిటివ్‌ టాక్‌ వచ్చిన సోషల్‌ మీడియాలో బన్నీని ఓ ఆట ఆడుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాను బాయ్‌కాట్‌ చేయడం ద్వారా కలెక్షన్స్‌ దెబ్బతీయాలని ప్లాన్‌ చేస్తున్నారట. #Pushpa2boycott అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం వారు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎవరు అడ్డుకోలేరని అల్లు అర్మీ అంటోంది. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యాన్‌ వార్‌ మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.&nbsp;
    నవంబర్ 11 , 2024
    <strong>Tollywood Couples: నారా రోహిత్‌ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!</strong>
    Tollywood Couples: నారా రోహిత్‌ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే!
    రీల్‌ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్‌- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్‌-ఊహా, మహేశ్‌ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే&nbsp;టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్‌ హీరో నారా రోహిత్‌ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్‌ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.&nbsp; నారా రోహిత్‌ - సిరి లేళ్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.&nbsp; నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని&nbsp; స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్‌, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. కిరణ్‌ అబ్బవరం - రహస్య గోరఖ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్‌ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్‌, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్‌ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.&nbsp; వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడైన వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్‌’, ‘ఎఫ్‌3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.&nbsp; ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్‌ హీరోగా చేసిన ‘వారియర్‌’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.&nbsp; వరుణ్‌ సందేశ్‌ - వితిక షేరు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్‌’తో&nbsp; తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్‌ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్‌ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్‌ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Samantha: చైతూ ఫ్యాన్స్‌కు గట్టి షాకిచ్చిన సమంత! ఆ డైరెక్టర్‌తో డేటింగ్‌?&nbsp;</strong>
    Samantha: చైతూ ఫ్యాన్స్‌కు గట్టి షాకిచ్చిన సమంత! ఆ డైరెక్టర్‌తో డేటింగ్‌?&nbsp;
    నాగచైతన్య (Naga Chaitanya) - శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) నిశ్చితార్థం తర్వాత తన ప్రమేయం లేకుండానే సమంత (Samantha) వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంపై సమంత ఎలా స్పందిస్తుందా అని అంతా తెగ ఎదురుచూశారు. అంతేకాదు తన మాజీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో సమంత ఫ్యూచర్ గురించి కూాడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె కూడా విడాకుల గాయం నుంచి కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సామ్ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. సామ్‌ ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు సోషల్‌ మీడియాలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; డేటింగ్‌లో సమంత? స్టార్‌ హీరోయిన్ సమంతకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 'సిటాడెల్‌ : హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత డేటింగ్‌ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం మెుదలైంది. రాజ్‌ తెరకెక్కిస్తున్న ప్రస్తుత సిరీస్‌తో పాటు గతంలో రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌లోనూ సామ్‌ నటించింది. ఆ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది, సిటాడెల్‌ సిరీస్‌కు వచ్చే సరికి అది కాస్త ప్రేమగా మారిందంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దీనిపై సమంత నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్న తాజా గాసిప్‌ను చూసి నాగ చైతన్య ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలోనే సమంత డేటింగ్‌ అంశం తెరపైకి రావడంపై గుర్రుగా ఉన్నారు.&nbsp; రాజ్‌ ప్రోత్సాహంతో ఓటీటీలోకి! సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించిన సమంత గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్‌ నిడిమోరు ప్రోత్సాహంతోనే సామ్‌ స్ట్రీమింగ్‌ రంగంలోకి వచ్చిటన్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘సిటాడెల్‌ : హనీ బన్నీ’ హిందీ సిరీస్‌లోనూ సామ్‌ ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తోంది. ఈ సిరీస్‌ నవంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. తన బ్యాక్‌ టూ బ్యాక్‌ సిరీస్‌లలో సమంతకు అవకాశం ఇవ్వడం వెనుక రాజ్‌ నిడిమోరుతో ఆమెకున్న రిలేషన్‌ కూడా కారణం కావొచ్చన్న పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా, రాజ్‌కు ఇదివరకే పెళ్లి కావడం గమనార్హం.&nbsp; సిటాడెల్‌ కోసం ప్రత్యేక సన్నద్ధత ‘సిటాడెల్‌ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా చేశారు. ఈ యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుంగా సామ్‌ స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌తో పాటు డీకే కూడా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.&nbsp; నాగచైతన్యతో విడాకులు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్‌ కపుల్‌ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 14 , 2024
    <strong>Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!</strong>
    Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!
    బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్‌ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్‌ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్‌ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అనసూయ షాకింగ్‌ పోస్టు బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్‌ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్‌ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791 విజయ్‌ దేవరకొండను ఉద్దేశించేనా? అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్‌ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్‌ మ్యానర్స్‌ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్‌ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్‌ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.&nbsp; గతంలోనూ ఇలాగే.. అనసూయ ఈ తరహా అగ్రెసివ్‌ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్‌ పెట్టి అందరినీ షాక్‌ గురిచేసింది. తన గ్లామరస్‌ ఫోటోలోను షేర్‌ చేస్తూ హాట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అనసూయ ప్రస్థానం జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది.&nbsp;
    జూలై 25 , 2024
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    Father's Day Special: నాన్నలతో ఈ స్టార్‌ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
    ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; https://twitter.com/KChiruTweets/status/1802187791251509401 మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది.&nbsp; ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) యంగ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్‌ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్‌ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్‌ షేర్‌ చేసింది.&nbsp; https://twitter.com/shrutihaasan/status/1802221449899610217 మెగా బ్రదర్‌, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్‌ హీరో ‘వరుణ్‌ తేజ్‌’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.&nbsp; కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
    జూన్ 17 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస&nbsp; నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023&nbsp;&nbsp; తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్‌ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్‌ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విజయ్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసింది. ఫైట్స్‌లో విజయ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.&nbsp;&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే 'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తన స్టైల్‌ను అనుసరించాడు.&nbsp; సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్‌ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్‌ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్‌, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్‌ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్‌ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్‌ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్‌ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్‌ మార్క్‌ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.&nbsp;&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుసాగదీత సీన్స్‌ చివరిగా : లోకేష్‌ కనగరాజ్‌ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్‌) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది. రేటింగ్‌: 2.5/5
    అక్టోబర్ 19 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.&nbsp; రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.&nbsp; అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.&nbsp;సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వరణ్‌ తేజ్‌&nbsp; మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.&nbsp; అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023
    Heroines Birthday: ట్విటర్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
    Heroines Birthday: ట్విటర్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
    కథానాయికలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇవాళ తెలుగు అగ్రకథానాయిక రష్మిక మందన్న పుట్టిన రోజు. దీంతో ట్విటర్‌లో రష్మిక బర్త్‌డే ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ అభిమాన నటికి విషెస్‌ చెబుతూ రష్మిక ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. #RashmikaMandanna హ్యాష్‌టాగ్‌తో ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో రష్మిక ఫొటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పుష్ప 2 లో రష్మికా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.&nbsp; https://twitter.com/BheeshmaTalks/status/1643477077314904065 ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో రష్మిక తన డ్యాన్స్‌ ప్రదర్శనతో అకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రష్మిక పోస్టు చేసిన డ్యాన్స్‌&nbsp; వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది.&nbsp; https://twitter.com/iamRashmika/status/1641832071739084806 రష్మిక లేటెస్ట్‌ మూవీ ‘రెయిన్‌బో’ షూటింగ్‌ ప్రారంభోత్సవ ఫొటోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ సినిమా సూపర్‌ హిట్ అవుతుందని రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్‌ పెడుతున్నారు.&nbsp; https://twitter.com/iamRashmika/status/1642859136558792705 తమిళ నటుడు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా రష్మికకు పెద్ద ఎత్తున విషెస్‌ చెబుతున్నారు. విజయ్‌తో రష్మిక ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/itz_jaiTheri/status/1643469141662400513 పలు సినిమాలకు సంబంధించిన రష్మిక డిఫరెంట్‌ లుక్స్‌ ఫొటోను ఓ నెటిజన్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. https://twitter.com/SivaHarsha_1/status/1643484285998108674 https://twitter.com/SivaHarsha_1/status/1643484313055563777 ఇవాళ రష్మికతో పాటు మరో హీరోయిన్‌ కూడా బర్త్‌డే జరుపుకుంటోంది. హలో, చిత్ర లహరి సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్‌ పుట్టిన రోజు కూడా ఇవాళే. దీంతో ఆమె ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున ప్రియదర్శన్‌కు విషెస్‌ చెబుతున్నారు. #kalyanipriyadarshanతో నటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.&nbsp; క్యూట్‌ లుక్స్‌తో ఉన్న కళ్యాణి ప్రియదర్శన్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శారీలో నటి దిగిన పిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; https://twitter.com/SivaHarsha_1/status/1593112240752058369 https://twitter.com/Pranay___Varma/status/1622950945335447555 ప్రియదర్శన్‌ చేసిన పలు సినిమాల్లోని మూవీ క్లిప్స్‌ ట్విటర్‌ ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిని ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/24HoursUpdated/status/1511181288471871493 https://twitter.com/i/status/1643458567972990976 ఓ మూవీ ఈవెంట్‌లో ప్రియదర్శన్‌ సందడి ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పలు సినిమాల్లో మరింత అందంగా కనిపించిన వీడియో క్లిప్స్‌ను ఈ వీడియోకు ఫ్యాన్స్ జత చేశారు.&nbsp; https://twitter.com/i/status/1643479187225976832
    ఏప్రిల్ 05 , 2023
    <strong>Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్</strong>
    Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy), ‘టాక్సీవాలా’ (Taxiwala), ‘గీతాగోవిందం’ (Geetha Govindam) హిట్స్‌తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అతడు చేసిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ దారుణంగా విఫలమయ్యాయి. దీంతో అతడిపై ట్రోల్స్‌, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండపై దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అది టాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.  ‘ప్రేమతో పాటు ద్వేషమూ చూశాడు’ మ‌లయాళ న‌టుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్‌' (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ నటుడు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ తరం గొప్పనటులు అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తాను అభిమానించే నటుల్లో విజయ్‌ ఒకరని వ్యాఖ్యానించారు. 'విజయ్ ఎంతో ప్రేమ చూశాడు. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూసాడు. బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి న‌వ‌ల‌లో ఒక లైన్ ఉంటుంది. మావాడే మ‌హాగ‌ట్టివాడ‌ని. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అది వ‌ర్తిస్తుంది. మా వాడు మహా గట్టోడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  https://www.youtube.com/watch?v=PhzeAy5OUl8 ‘ఖలేజా బాలేదంటే కొట్లాటే’ ‘లక్కీ భాస్కర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సైతం మాట్లాడారు. దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి ప్రస్తావిస్తూ క్రేజీ కామెంట్స్ చేశాడు. పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత తన ఫస్ట్‌ చెక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరపున త్రివిక్రమ్‌ ఇచ్చినట్లు చెప్పారు. చెక్ ఇస్తూ నువ్వు స్టార్‌ అవుతావని చెప్పారని పేర్కొన్నారు. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం తన లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘జల్సా’ చిత్రాలు ఎంత క్రేజ్ సంపాదించుకున్నాయో మన జనరేష్‌కు బాగా తెలుసాని అన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్ట్‌ చేసిన ‘అతడు’, ‘ఖలేజా’ తన ఫేవరేట్స్ అని తెలిపాడు. ‘ఖలేజా’ను ఎవరైనా ఫ్లాప్ అంటే వారితో కొట్లాడేవాడినని వివరించాడు.&nbsp; https://twitter.com/oneindiatelugu/status/1850807211817369676 దుల్కర్‌ - విజయ్‌ మల్టీస్టారర్‌ లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తన బ్రదర్ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కోసం వచ్చానని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) వ్యాఖ్యానించారు. ‘కల్కి’, ‘మహానటి’ సినిమాల్లో తామిద్దరం నటించిన విషయాన్ని గుర్తుచేశాడు. కానీ తమ ఇద్దరి కాంబినేషన్ సీన్స్‌ పడలేదని పేర్కొన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ దుల్కర్ తనతో మల్టీస్టారర్‌ చేయాలని భావించినట్లు చెప్పాడు. అప్పుడు చెన్నైలో కలిసి కథ కూడా విన్నట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో కలిసి సినిమా చేయోచ్చేమే అంటూ ఒక్కసారిగా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేశాడు. https://twitter.com/ihsan21792/status/1850579970093129862 పెళ్లి చూపులు కాంబో రిపీట్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ రూపొందించిన 'పెళ్లి చూపులు' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా మరో సినిమా రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్‌కు కథ కూడా చెప్పేశాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు రౌడీ బాయ్‌ కూడా ఓకే చెప్పాడని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. యాక్షన్‌తో పాటు, తరుణ్‌ స్టైల్‌ ఆఫ్‌ కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. కాగా, విజయ్‌ ప్రస్తుతం ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.  విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లోనూ మూవీ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    అక్టోబర్ 28 , 2024
    <strong>HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;</strong>
    HBD Prabhas: ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?&nbsp;
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్‌ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్‌ 23) ప్రభాస్‌ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్‌ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం. చదువులో యావరేజ్‌&nbsp; ప్రభాస్‌ చదువు పరంగా యావరేజ్‌ స్టూడెంట్‌. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్‌ పిరియడ్‌ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు. మతిమరుపు ఎక్కువ ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్‌ డేస్‌ నుంచి తన ఫ్రెండ్స్‌ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.&nbsp; ‘నువ్వు హీరో ఏంట్రా’ కెరీర్‌ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్‌ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్‌ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్‌ తీసుకున్నాక 'ఈశ్వర్‌' ఆఫర్‌ వచ్చింది.&nbsp; డార్లింగ్‌ పిలుపుకు కారణం ఇదే ప్రభాస్‌ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్‌ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్‌ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్‌ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్‌ సినిమా కూడా రావడం గమనార్హం. అతిథి పాత్రలు రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హిందీలో వచ్చిన 'యాక్షన్‌ జాక్సన్‌' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం గమనార్హం.&nbsp; పెదనాన్నతో రెండు చిత్రాలు దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్‌’ వంటి చిత్రాల్లో ప్రభాస్‌ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు. ముచ్చటగా మూడుసార్లు ప్రభాస్‌ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్‌ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.&nbsp; తొలి దక్షిణాది హీరో ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్‌ గుర్తింపు పొందాడు. ప్రభాస్‌ తర్వాత టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రీసెంట్‌గా రామ్‌చరణ్‌ ఈ ఘనత సాధించారు.&nbsp; నటుడు కాకుంటే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో వర్క్‌ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్‌ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్‌ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.&nbsp;
    అక్టోబర్ 23 , 2024
    <strong>Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్‌ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?</strong>
    Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్‌ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?
    ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్‌ హీరోయన్లతో సమానంగా గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.&nbsp; ఒకప్పటిలా హెయిర్‌ను వెనక్కి కాకుండా ముందుకు వదిలేసి బేబీ కటింగ్‌ స్టైల్లో మేకోవర్‌ అయ్యింది.&nbsp; ఆ లుక్‌తోనే బ్యూటీఫుల్‌ శారీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రంగమ్మత్త మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు.&nbsp; అయితే రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపించి అనసూయ కాస్త బోర్ ఫీలై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఛేంజ్‌ ఔట్‌ కోసం ఈ విధంగా రెడీ అయ్యిందని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; జబర్దస్త్‌ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.&nbsp; 2012 - 2022 మధ్య&nbsp; బుల్లితెర యాంకర్‌గా ‌కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.&nbsp; యాంకర్‌ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్‌ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.&nbsp; రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.&nbsp; సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Pedda Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది.&nbsp; ఇందులో తెలంగాణ మాండలికం ఓన్‌ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; రీసెంట్‌గా ‘రజాకార్‌’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది.&nbsp;ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.&nbsp; అల్లుఅర్జున్‌ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.&nbsp; గతంలో ‘పుష్ప’లో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; పుష్ప 2తో పాటు తమిళంలో ' ఫ్లాష్‌బాక్‌' (Flashback), ఉల్ఫ్‌ (Wolf) అనే రెండు చిత్రాల్లో అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.
    అక్టోబర్ 09 , 2024
    <strong>HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?</strong>
    HBD Suriya: సూర్యను ‘వేస్ట్‌ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
    తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్‌ నటనతో సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్‌ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; సూర్య అసలు పేరు ఇదే! సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్‌. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్‌ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్‌’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్‌ (Vijay)తో కలిసి సూర్య నటించాడు. ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి! సూర్య తండ్రి శివ కుమార్‌ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్‌ శరవణన్‌, డూయింగ్‌ మై డూకామ్‌’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్‌ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.&nbsp; రూ.600 జీతంతో ఉద్యోగం హీరోగా నటించిన తండ్రి శివకుమార్‌, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.&nbsp; కెమెరా ఫియర్‌ కెరీర్‌ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్‌ చెప్పడం, ఎమోషన్స్‌ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్‌ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట. రఘువరన్‌ వ్యాఖ్యలతో మార్పు సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్‌. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్‌?’ అని రఘువరన్‌ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు. తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు షార్ట్‌ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై’వంటి మ్యూజిక్‌ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.&nbsp; సూర్య డబ్బింగ్‌ చెప్పారని తెలుసా! ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్‌ వెర్షన్‌లో హీరో అభిషేక్‌ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్‌ చూపించారు. అవార్డులే అవార్డులు 27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్‌ యాక్టర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్‌, 5 తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌, 2 సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డ్స్‌, 2, ఎడిసన్‌ అవార్డ్స్‌, 2 సైమా అవార్డ్స్‌, 6 విజయ్ అవార్డ్స్‌ అందుకున్నారు.&nbsp; సేవా కార్యక్రమాలు మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్‌’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్‌’ను ప్రారంభించడం గమనార్హం. ‘కంగువా’గా రాబోతున్న సూర్య&nbsp; సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్‌ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
    జూలై 23 , 2024

    @2021 KTree