రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
సుగుణాకర్ రావుకమల్ హాసన్
జానీజయసుధ కపూర్
సుహాసినిగా జయసుధశరత్ బాబు
భరణిలీలావతి
సుహాసిని అత్తగారుసరిత
గాయత్రిసిబ్బంది
కె. బాలచందర్
దర్శకుడుMS విశ్వనాథన్
నిర్మాతMS విశ్వనాథన్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్ రెడ్డి వంగా.. ఏమైందంటే?
తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘పొట్టేల్’ (Pottel). అక్టోబర్ 25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అనన్య బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఎవరికైనా ఇచ్చారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్న టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అనన్య మరోమారు మాట్లాడారు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ టీమ్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సందీప్‌పై అనన్య ప్రశంసలు
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్’ (Pottel). మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడకకు 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నటి అనన్య మాట్లాడారు. తమ ‘పొట్టేల్’ ప్రమోషన్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి కాదు రెండుసార్లు తమ మూవీ వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లడం కోసం మీరు చేస్తున్న సపోర్ట్ మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు.
https://twitter.com/i/status/1848603026728358266
'రంగస్థలం’ తర్వాత పొట్టేలే: సందీప్ రెడ్డి
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు సాహిత్ ఓ రోజు తనకు చెప్పాడని సందీప్ అన్నారు. కథ వినగానే 'ఇది చిన్న కథ కాదు పెద్దది' అని అనిపించిందన్నారు. తాను ఇప్పటికే సినిమా చూశానని బాగా నచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆ విధంగా ఉంటుందని అసలు ఊహించలేదన్నారు. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆడియన్స్‌ను ఉద్దేశించి చెప్పారు. 'రంగస్థలం' తర్వాత పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో చూసిన సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. చిన్న సినిమాలను ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటూ ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/i/status/1848595831508652364
సంస్కారం ఉంటే ఆ ప్రశ్నలు వేయరు: అనన్య
‘పొట్టేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అనన్య నాగళ్ల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమిట్‌మెంట్‌పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను మరోమారు లేవనెత్తుతూ చురకలు అంటించారు. ‘ఇంత డైరెక్ట్‌గా సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్ చేస్తున్నా. పొట్టేల్ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారని భావించా. కమిట్‌మెంట్ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. హీరోయిన్లు మేకప్ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య కోరారు.
అసలేం జరిగిందంటే?
పొట్టేల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్ ట్రైలర్ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.
https://twitter.com/tfpcin/status/1847262295266865248
రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్
అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్ చేశారు. మహిళా రిపోర్టర్ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498
అక్టోబర్ 22 , 2024
Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.
7/G బృందావన కాలనీ
లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.
ప్రేయసి రావే
ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
మహర్షి
ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
అభినందన
లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.
ఓయ్
మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది.
సుస్వాగతం
జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ప్రేమిస్తే
ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది.
ఆగస్టు 14 , 2023
Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్ ప్రశ్న.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నివేదా థామస్!
టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే?
నివేథ థామస్ నటించిన '35 చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్ కాదు.. టెక్నిషియన్స్ వెయిట్ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1808789199795204521
తొలిసారి ‘అమ్మ’ పాత్రలో..
'35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM
నాకు పెళ్లైంది : నివేదా థామస్
తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్ స్పందించారు. టీజర్ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
https://twitter.com/i/status/1808760891615416465
జూలై 04 , 2024
This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్ బ్రేకులు వేయగలవా!
థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
స్వాగ్ (Swag)
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు.
చిట్టి పొట్టి (Chitti Potti)
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణ (Dakshina)
తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సాయిధన్సిక ఇందులో కనిపించనున్నారు.
కలి (Kali)
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ (Kali). ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
బహిర్భూమి (Bahirbhoomi)
నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లింక్'. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
సెప్టెంబర్ 30 , 2024
OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.
ఈ నగరానికి ఏమైంది
సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
జాతిరత్నాలు
ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు.
డీజే టిల్లు
డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.
హుషారు
మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.
బ్రోచెవారెవరురా
స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు.
ఒకే ఒక జీవితం
టైమ్ ట్రావెల్ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది.
మిషన్ ఇంపాజిబుల్
చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
హృదయం
కాలేజ్ లైఫ్, లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
చిచ్చోరే
ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది.
రొమాంచనమ్
హారర్ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు.
మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్ చేయండి.
ఏప్రిల్ 21 , 2023
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్.. ఇది మామూలు హైప్ కాదు భయ్యా!
‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ జరగ్గా రానాపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘రానా భయపెట్టాడు’
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్ లుక్ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1843720706057724332
కథ మార్చేసిన రజనీ
వేట్టయన్ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.
రజనీపై తమిళ డైరెక్టర్ ఆరోపణలు
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చేయనున్నారు రజనీ.
అక్టోబర్ 09 , 2024
Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్ రోల్‌లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు.
శైలేష్ కొలను
హిట్ యూనివర్స్‌తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్‌లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు.
బుచ్చిబాబు సానా
కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.
కేవీ అనుదీప్
జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
జూన్ 14 , 2023
JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.
హాలీవుడ్ ఫ్రాంఛైజీ జాన్ విక్ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.
2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.
లక్ష్యం
మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్ విక్ నుంచి ఇది నేర్చుకోవచ్చు.
నిబద్ధత
జాన్ విక్ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు.
కఠోర శ్రమ
లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.
అసలేంటిది?
నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.
హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం.
నమ్మకం
సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు.
మన పని
చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు.
తక్కువగా మాట్లాడు
సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు.
ప్లాన్ బి
చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా.
కుదరదు
ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.
మార్చి 21 , 2023
Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్… స్టోరీ ఇదేనా?
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్ తన క్రేజ్ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్ హీరో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
హిస్టారికల్ మూవీ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'VD14' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. 'ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
https://twitter.com/MythriOfficial/status/1788443050177659232
భారీ అంచనాలు
'VD14' (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్ తొలిసారి చేయనున్న హిస్టారికల్ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా కొత్త మూవీ పోస్టర్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ గతంలోనూ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్ చేసిన శ్యామ్ సింగరాయ్ మూవీ కూడా తెలుగు ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంది.
‘VD12’ నుంచి అప్‌డేట్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో 'VD12' చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్ చెప్పడంతో పాటు ఓ పోస్టర్ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
https://twitter.com/SitharaEnts/status/1788428225003278352
విజయ్ డేరింగ్ డెసిషన్!
'VD12' సినిమా కోసం హీరో విజయ్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్ తొలిసారి పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ గౌతమ్ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
మే 09 , 2024
Martin Luther King Movie Review: లాజిక్ కాస్త మిస్ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!
హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్ రోల్‌లో మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం.
కథ
ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు.
ఇక సెకండాఫ్ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది.
ఎవరెలా చేశారంటే?
మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనిపించింది.
టెక్నికల్‌గా..
నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
బలాలు
సంపూర్ణేష్ బాబు నటన
ఫస్టాఫ్ కామెడీ
బలహీనతలు
సెకండాఫ్ సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్ కన్‌క్లూజన్
చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు.
రేటింగ్: 3/5
అక్టోబర్ 27 , 2023
NTR 31: జూ.ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌పై దిమ్మతిరిగే అప్‌డేట్.. బంగ్లాదేశ్ రైతుగా తారక్?
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మూవీ సక్సెస్‌తో తారక్ తర్వాతి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో తారక్ ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR 31’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 32' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
ఆ మూవీ తర్వాత సెట్స్‌పైకి!
తారక్ బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్‌కు డేట్స్ అడ్డస్ట్ చేయవచ్చని తారక్ అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయాలపై క్లారిటీ
దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. రాజకీయాలు కాదు.. నటనే తన తొలి ఆప్షన్ అని తేల్చి చెప్పారు. తొలి నుంచి నటుడిని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జూనియర్ స్పష్టం చేశారు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ చేశానన్న తారక్ అప్పటి నుంచి నటనపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు. ఓట్ల సంగతి పక్కన పెడితే తన కోసం లక్షలాది మంది టికెట్లు కొంటున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ప్రజలను కలుస్తున్నందుకు నటుడిగా తనకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలను బట్టి ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేనట్టు అర్ధమవుతోంది.
అక్టోబర్ 01 , 2024
Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్ రోల్?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ కోసం స్పెషల్ పోస్ట్!
‘హనుమాన్’తో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఫొటో షేర్ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471
ముహోర్తం ఫిక్స్..!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ వైరల్..
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
సెప్టెంబర్ 03 , 2024
Best Hollywood Romantic Movies: ప్రేమ లోకంలో మునిగేలా చేసే అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలు!
సినీ ప్రియులు ఏ భాషలో కొత్త సినిమా ఉన్నా వెతుక్కుని మరి వెళ్లి చూస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్.. తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అద్భుతమైన కథ, కథనంతో సాగే యాక్షన్ సినిమాలను చూసి వినోదాన్ని పొందుతుంటారు. అయితే హాలీవుడ్ అంటే కేవలం యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు. అక్కడ హృదయాలను హత్తుకునే రొమాంటిక్ సినిమాలు (Best Hollywood Romance Movies) కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన టాప్ రొమాంటిక్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
When Harry Met Sally (1989)
నటి నటులు: మెగ్ ర్యాన్, బిల్లీ క్రిస్టల్
డైరెక్టర్ : రాబ్ రీనర్
ఒకే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ చేసిన హ్యారీ, సాలీ.. న్యూయార్క్‌లో కలుసుకుంటారు. అప్పటికే వారు ప్రేమలో విఫలమై ఉన్నందు వల్ల ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక పురుషుడు, స్త్రీ లైంగిక సంబంధం లేకుండా స్నేహితులుగా ఉండగలరా? అన్న ప్రశ్న వారికి ఎదురవుతుంది. దానికి వారు ఏం సమాధానం చెప్పారు? అన్నది స్టోరీ.
Sleepless in Seattle (1993)
నటినటులు : టామ్ హ్యాన్క్స్, మెగ్ ర్యాన్
డైరెక్టర్ : నోరా ఎప్రాన్
శ్యామ్ భార్య చనిపోవడంతో అతడు కొడుకుతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతడు ఓ టీవీ షోలో పాల్గొంటాడు. రిపోర్టర్ అన్నీ రీడ్.. అతడి మాటలకు ఆకర్షితురాలవుతుంది. ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికీ ప్రేమికుల రోజున అతడికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? వారు కలుసుకున్నారా? లేదా? అన్నది స్టోరీ.
The Notebook (2004)
నటీనటులు : ర్యాన్ గోస్లింగ్, రచెల్ మెక్ ఆడమ్స్
డైరెక్టర్ : నిక్ క్యాసావెట్స్
నోహ్ కాల్హౌన్ అనే యువకుడు అల్లీ అనే సంపన్న యువతిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధంలో దేశం తరపున పోరాడేందుకు యుద్ధ భూమికి వెళ్తాడు. తమ ప్రేమ ముగిసిందని భావించిన అల్లీ మరోక వ్యక్తిని ఇష్టపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నోహ్ తిరిగి రావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
Titanic (1997)
నటినటులు : లియోనార్డో డికాప్రియా, కేట్ విన్‌సెల్ట్
డైరెక్టర్ : జేమ్స్ కామెరాన్
రోజ్‌కు సంపన్న వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఆమె తనకు కాబోయే భర్తతో టైటానిక్ షిప్‌లో ప్రయాణిస్తుండగా అక్కడ జాక్ అనే యువకుడ్ని ప్రేమిస్తుంది. ఓ ఉపద్రవం వారిద్దరినీ వేరు చేస్తుంది. రోజ్ కోసం జాక్ ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
Titanic (1997)
Directed by James Cameron
Shown from left: Leonardo DiCaprio, Kate Winslet
La la land (2016)
నటీనటులు : ర్యాన్ గోస్లింగ్, ఎమ్మా స్టోన్
డైరెక్టర్ : డామీన్ చాజెల్లె
సంగీతకారుడు సెబాస్టియన్, నటి మియా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తమ వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే వారి కీర్తి పెరిగే కొద్ది వారి మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. కొందరు వ్యక్తులు వారి ప్రేమను బలహీన పరుస్తారు. చివరికి వారు ఒక్కటిగా ఉన్నారా? లేదా?
Carol (2015)
నటీనటులు : కేట్ బ్లాన్‌చెట్, రూనీ మారా
డైరెక్టర్ : టాడ్ హేయ్‌నెస్
1950లో ఫొటోగ్రాఫర్ థెరిస్.. కరోల్ అనే అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె విచారంగా ఉండటాన్ని గమనించి కరోల్‌కు విడాకులైన విషయాన్ని తెలుసుకుంటాడు. థెరిస్‌ను రోజూ కలుస్తూ ఆమెకు దగ్గరవుతాడు. వారు ఒక్కటయ్యే క్రమంలో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నైతిక పోరాటం చేస్తారు.
Eternal Sunshine of the Spotless Mind (2004)
నటీనటులు: జిమ్ క్యారీ, కేట్ విన్‌సెల్ట్
డైరెక్టర్ : మైఖేల్ గాండ్రీ
జోయెల్, క్లెమెంటైన్ ఒకరినొకరు ప్రేమించుకొని కొన్ని కారణాల వల్ల విడిపోతారు. జ్ఞాపకాలను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాము ఇప్పటికీ డీప్‌గా లవ్ చేసుకుంటున్నట్లు గ్రహించడంతో కథ మలుపు తిరుగుతుంది.
The Curious Case of Benjamin Button (2008)
నటినటులు: బ్రాడ్ పిట్, కేట్ బ్లాన్‌చెట్
డైరెక్టర్ : డేవిడ్ ఫిన్‌చెర్
బెంజమన్ బటన్ ఒక అరుదైన సమస్యతో జన్మిస్తాడు. పుట్టడమే వృద్ధుడి శారీరక స్థితితో జన్మించిన అతడు సంవత్సరాలు గడుస్తున్న కొద్ది రివర్స్‌లో అతడి ఏజ్ తగ్గుతూ వస్తుంది. బెంజమన్.. డైసీ అనే డ్యాన్సర్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. కాలం గడుస్తున్న కొద్ది వారి వయసులు పరస్పరం విరుద్దంగా మారుతుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.
500 Days of Summer (2009)
నటీనటులు : జోసెఫ్ గార్డన్, జూలీ డెస్‌చానెల్
డైరెక్టర్ : మార్క్ వెబ్
టామ్ ఒక గ్రీటింగ్ కార్డ్ రైటర్. అతడు సమ్మర్ తర్వాత తన ప్రేయసితో విడిపోతాడు. అయితే వేసవిలో ఆ 500 రోజులు ఆమెతో ఎలా గడిపానన్న విషయాన్ని టామ్ సమీక్షించుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహిస్తాడు.
‘Before’ Trilogy (1995 – 2013)
నటీనటులు : ఈథన్ హావ్‌కే, జూలీ డెల్పీ
డైరెక్టర్ : రిచర్డ్ లింక్‌లేటర్
‘బిఫోర్ ట్రయాలజీ’.. హాలీవుడ్‌లోని ఉత్తమ రొమాన్స్ ఫిల్మ్ ఫ్రాంచైజీ. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunset), ‘బిఫోర్ సన్‌సెట్’ (Before Midnight), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (Before Midnight) మూవీస్ అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ మూడు సినిమాలు జెస్సీ, సెలిన్ ప్రేమకథల చుట్టు తిరుగుతుంది.
Never Let me go (2010)
నటీనటులు : క్యారి ముల్లీగన్, ఆండ్రూ గర్‌ఫీల్డ్, కియారా నైట్లీ, ఎల్లా పుర్నెల్
డైరెక్టర్: మార్క్ రోమనెక్
రూత్, కాథీ, టామీ ఓ ఇంగ్లీష్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటారు. లవ్‌కు సంబంధించిన బాధాలను ఎదుర్కొంటారు. పరిస్థితులు ఆ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది కథ.
Pride & Prejudice (2005)
నటీనటులు: కీరా నైట్లీ, మ్యాథ్యూ, కారే ముల్లిగన్, రోసముండ్ పైక్, సిమన్ వుడ్స్ తదితరులు
డైరెక్టర్ : జో వ్రైట్
ఇది బెన్నెట్ అనే మహిళకు పుట్టిన నలుగురు కుమార్తెల కథ. ధనవంతులైన భర్తలు కావాలని ఆమె కూతుర్లు పట్టుబడతారు. మరి వారి కలలు ఎలా నెరవేరాయి? వారు ఎలాంటి భర్తలను పొందారు? అన్నది కథ.
Broke back mountain (2005)
నటీనటులు : హీత్ లెడ్జర్, జేక్ గైలెన్‌హాల్, మిచెల్లె విలియమ్స్, అన్ని హాథ్‌వే
డైరెక్టర్ : ఆంగ్ లీ
ఇద్దరు గొర్రెల కాపరులు.. ఎన్నిస్, జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. లైంగిక, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. వారిద్దరూ తమ స్నేహితులను వివాహం చేసుకోవడంతో బంధం క్లిష్టంగా మారుతుంది.
Dirty Dancing (1987)
నటీ నటులు : పాట్రిక్ స్వేజీ, జెన్నిఫర్ గ్రే
డైరెక్టర్ : ఎమిలీ ఆర్డొలినో
ఫ్రాన్సిస్ తన తల్లిదండ్రులతో విహార యాత్రకు వెళ్లినప్పుడు అక్కడ ఓ రిసార్టులోని డ్యాన్స్ మాస్టర్‌తో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను యువతి తండ్రి తిరస్కరిస్తాడు. మరి వారు ఒక్కటయ్యారా?
Call Me By Your Name (2017)
నటీనటులు : టైమోథీ చలామెట్, అర్మీ హామర్
డైరెక్టర్ : లుకా గ్వాడాగ్నినో
1983 వేసవి కాలంలో కథ జరుగుతుంది. 17 ఏళ్ల ఎలియో పెర్ల్‌మాన్.. తన తండ్రి సహాయకుడు ఆలివర్‌ను ఇష్టపడుతుంది. వారు ఆ వేసవిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే, ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.
Shakespeare in Love (1998)
నటీనటులు : జోసెఫ్ ఫ్లెన్నస్, గ్వినేత్ పాల్ట్రో
డైరెక్టర్ : జాన్ మాడెన్
విలియం షేక్ స్పియర్.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒక అందమైన యువతిని చూసి ప్రేరణ పొందుతాడు. ఓ నాటకం రాయడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో వారు శరీరకంగా దగ్గరవుతారు. అయితే యువతి చేసిన పని వల్ల వారి జీవితాలు తలకిందులవుతాయి.
The fault in our Star (2014)
నటీనటులు : షాయ్‌లెనె వూడ్లీ, అన్సెల్ ఎల్గర్ట్
డైరెక్టర్ : జోష్ బూన్
హాజెల్, అగస్టస్ అనే ఇద్దరు క్యాన్సర్ బాధితులు.. క్యాన్సర్ సపోర్టు గ్రూప్ ద్వారా కలుసుకుంటారు. త్వరలోనే వారు ప్రేమలో పడతారు. కష్టకాలంలో వారు ఒకరికొకరు బాసటగా నిలుస్తారు. అయితే విధి వారిపై కన్నెర్ర చేస్తుంది. .
Four Weddings and a Funeral (1994)
నటీనటులు : హ్యూజ్ గ్రాన్ట్, ఆండీ మెక్‌డొవెల్
డైరెక్టర్ : మైక్ నెవెల్
ఇంట్రోవర్ట్ అయిన చార్లెస్.. అమ్మాయిలను దురదృష్టంగా భావిస్తుంటాడు. ఒక పెళ్లిలో క్యారీ అనే అందమైన యువతిని చార్లెస్ చూస్తాడు. ఆ అమ్మాయి తనకు అదృష్ట దేవత కాగలదని విశ్వసిస్తాడు. మరి వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చార్లెస్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఫిబ్రవరి 10 , 2024
Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగ బాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్దాల
సంగీతం: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు
నిర్మాత: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ
క్లాస్ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.
కథ:
1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే?
ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఎవరేలా చేశారంటే
పెదకాపు పాత్ర చేసిన విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్ ప్రగతి పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేవిరాట్, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్పాటలు
రేటింగ్ : 3/5
సెప్టెంబర్ 29 , 2023
Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?
ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం ఈరోజు విడుదలైంది. బిగ్ బాస్ ఫేం సొహైల్, అందాల నటి మృణాలిని జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మరి, ఈ మామా అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించారా? ఎస్వీ కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటాడు విజయ్(సొహైల్). ఇతడు హాసిని(మృణాలిని)తో ప్రేమలో పడతాడు. వెంకటరమణ(రాజేంద్రప్రసాద్) సంపన్నుడే కాదు పక్కా సాంప్రదాయవాది. గారాభంగా పెంచుకున్న కూతురు హాసిని విజయ్‌తో ప్రేమలో పడటం వెంకటరమణకు ఇష్టం ఉండదు. మరి వీరి ప్రేమని ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ.
నటీనటులు
హీరోగా సొహైల్ చక్కగా నటించాడు. అక్కడక్కడా తన నటనతో ప్రేక్షకుడిని మెప్పించాడు. మృణాలిని అందంగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, మీనా, వరుణ్ సందేశ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలీ, కృష్ణ భగవాన్, సప్తగిరి, సునీల్ వంటి కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారు. కానీ, ఎక్కడా కామెడీ పండించలేక పోయారు. సునీల్ కాస్త ఫర్వాలేదనిపించాడు.
ఎలా ఉంది?
కథలో కొత్తదనం లోపించింది. డైరెక్టర్ పాత సినిమాల గుర్తులు ఇందులో కనిపించాయి. కథ, కథనంలో ప్రేక్షకుడు లీనం కాలేకపోయాడు. కామెడీ వెగటుగా ఉంది. కొన్ని సీన్లు మరీ ల్యాగ్ అయ్యాయి. క్లైమాక్స్ బాగా ఉన్నప్పటికీ సినిమాను నడిపించడానికి అదొక్కటే సరిపోదు కదా.
సాంకేతికంగా..
చాలా గ్యాప్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. టైటిల్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. కానీ, వాటిని అందుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. పాత కథనే తీసినట్లుగా అనిపించింది. అయితే, ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు, క్లైమాక్స్ కొద్దిమేరకు బాగున్నాయి. ఈ సినిమాకు స్వయంగా తానే సంగీతం అందించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒక పాట మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సింది.
ప్లస్ పాయింట్స్
సొహైల్ నటన
ఒక పాట
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథనం
సాగతీత సన్నివేశాలు
మ్యూజిక్
ఎడిటింగ్
చివరగా
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వినోదాన్ని పండించలేకపోయారు.
రేటింగ్: 2.25/5
మార్చి 03 , 2023
HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్ కెరటం.. సన్నీ డియోల్ లైఫ్‌లో అంత జరిగిందా?
ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అతడి ఫిల్మ్ కెరీర్ పూల పాన్పులా సాగలేదు. అతడి కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతీసారి బౌన్స్‌బ్యాక్ అవుతూ వచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం తిరుగులేని స్టార్‌గా బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. నేడు (అక్టోబర్ 19) సన్నీ డియోల్ 67వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్ కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం.
ధర్మేంద్ర నటవారసుడిగా..
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ 1957 అక్టోబర్ 19న జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఆయన కుమారుడు. ఎవర్‌గ్రీన్ బాలీవుడ్ చిత్రం ‘షోలే’ (Sholey)లో అమితాబ్ బచ్చన్‌తో పోటీ పడి ధర్మేంద్ర నటించారు. అటువంటి ధర్మేంద్ర నట వారసుడిగా సన్నీ డియోల్ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిజానికి అతడి అసలు పేరు అజయ్ సింగ్ డియోల్. ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ డియోల్‌గా మార్చుకున్నారు. 1983లో వచ్చిన రొమాంటిక్ చిత్రం 'బేతాబ్' (Betaab)తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. ’బేతాబ్’లో సన్నీ చేసిన గుర్రపు స్వారీ సీన్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఎంతో కఠినమైన గుర్రపు స్వారీ సీన్లను అలవోకగా చేయడంతో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. హీరోయిన్ అమృత సింగ్‌తో కలిసి అద్భుతంగా రొమాంటిక్ సన్నివేశాలను పండించాడు. తొలి మూవీతోనే స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.
ఒకే ఏడాది 7 చిత్రాలు రిలీజ్
'బేతాన్' సక్సెస్‌తో సన్నీ డియోల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో చిత్రం 'రాజ్ ఖోస్లా' (1985) తీసి మరో హిట్ అందుకున్నారు సన్నీ. రొమాంటింక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సన్నీలోని ప్రతిభను మరింత బహిర్గతం చేసింది. సన్నీ క్రేజ్ అమాంతం పెరగడం మెుదలైంది. ఆ తర్వాత అర్జున్ (1985), డెకాయిట్ (1987) చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత నుంచి కథల ఎంపికలో సన్నీ ఉదాశీనంగా వ్యవహరించారు. వచ్చిన కథను వచ్చినట్లు ఓకే చేశారు. తద్వారా 1989వ సంవత్సరంలో ఏకంగా 7 సినిమాలను రిలీజ్ చేశారు. కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన ఐదు మూవీస్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో సన్నీ క్రేజ్‌కు బీటలు వారడం మెుదలైంది. ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న సన్నీ కథల విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడు.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్
1990లో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో 'ఘాయల్' అనే చిత్రం చేశాడు. ఈ మూవీని అతడి ధర్మేంద్ర నిర్మించడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది. అంతకుముందు వచ్చిన వరుస ఫ్లాప్స్‌ను అందరూ మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్‌లోనే వరుసగా దామిని (1993), ఘటక్ (1996) అనే రెండు బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశారు. ముఖ్యంగా ‘దామిని’ సినిమాలో వచ్చే కోర్టు సీన్‌లో కెరీర్ బెస్ట్ నటనతో సన్నీ డియోల్ మెస్మరైజ్ చేశారు. అంతేకాదు ఘటక్ సినిమాతో మరో నేషనల్ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. షారుక్ ఖాన్ (Shah Rukh Khan)తో కలిసి చేసిన ‘డర్’ సినిమా సన్నీకి బిగ్ మైనస్‌గా మారింది. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ‘డర్’ సాఫ్ట్ రోల్ చేశాడు. దానికితోడు అందులో షారుక్ పాత్ర కనెక్టింగ్‌గా ఉండటంతో షారుక్ ముందు సన్నీ తేలిపోయాడన్న భావన ఆడియన్స్‌లో కలిగి ఉంది.
‘గదర్’తో చెక్!
1990వ దశకంలో పెద్ద ఎత్తున రొమాంటిక్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందుకు అనుగుణంగా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్.. ప్రేమ కథలను ఎంచుకుని మంచి విజయాలను సాధించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అన్న ముద్ర పడటంతో సన్నీకి ఆ తరహా లవ్‌స్టోరీలు రాలేదు. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకు సన్నీ రీచ్ కాలేకపోయారు. అటు డ్యాన్స్‌లోనూ సన్నీకి పెద్దగా ప్రావీణ్యం లేకపోవడం కూడా అతడి క్రేజ్‌ను కొద్దిమేర డ్యామేజ్ చేసింది. ఇది అతడి కెరీర్‌లో వచ్చిన సెకండ్ స్ట్రగల్ ఫేజ్ అని చెప్పవచ్చు. అయితే 2001లో వచ్చిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ (Gadar: Ek Prem Katha) మూవీతో వాటన్నింటికి సన్నీ చెక్ పెట్టాడు. సరిహద్దులు దాటిన ప్రేమకథ చిత్రంలో అతడు అద్భుతంగా నటించారు. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్‌తో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అతి పెద్ద మైలురాయిగా నిలిచింది. తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.
23 ఏళ్ల నిరీక్షణ తర్వాత..
‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ (Gadar: Ek Prem Katha) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత సన్నీకి ఇక తిరుగుండదని అంతా భావించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ స్థాయి సక్సెస్ రాలేదు. ఓ దశలో హీరోగా అవకాశాలు కోల్పోయి క్యారెక్టర్ అర్టిస్టుగానూ సన్నీ డియోల్ చేశారు. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్థిక సమస్యలను సైతం ఆయన ఫేస్ చేశారని సన్నిహితులు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం సన్నీ అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక అతడి కెరీర్ అయిపోయిందనుకుంటున్న సమయంలో మరోమారు ‘గదర్ 2’ మరోమారు బౌన్స్ బ్యాక్ అయ్యారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 691.08 కోట్లు కొల్లగొట్టి మరోమారు సన్నీ డియోల్‌కు స్టార్ స్టేటస్‌ను అందించింది. ప్రస్తుతం 'లాహోర్ 1947', బోర్డర్ 2, రామాయణం వంటి బిగ్ ప్రాజెక్ట్స్‌లో సన్నీ డియోల్ నటిస్తున్నారు.
తెలుగు డైరెక్టర్‌తోనూ
టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలోనూ సన్నీ డియోల్ (Sunny Deol) ఓ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'జాట్' (Jaat) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్ శరీరమంతా బ్లడ్ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకొని ఉండటాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
అక్టోబర్ 19 , 2024
Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్ దేవరకొండ, నితీన్, అడివిశేష్, శర్వానంద్, గోపిచంద్ తదితరులు ‘టైర్ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలు ‘టైర్-2’ అంటే ఏంటి?
సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్ (Prabhas), రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్ వసూలవుతుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమాల బడ్జెట్ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.
కన్నెత్తి చూడని స్టార్ డైరెక్టర్స్!
రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్ దేవరకొండ, నాని వంటి స్టార్ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్ దాటి స్టార్ డమ్ లేకపోవడం వల్ల టాలెంట్ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.
కథలు సైతం వెళ్లడం లేదా?
ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
నెపోటిజం vs టాలెంట్!
అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.
తప్పు ప్రేక్షకుల్లో ఉంది!
గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.
సెప్టెంబర్ 13 , 2024
Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్ కామరాజ్, కల్పలత, రవి కాలే, రజత్ బేడి
దర్శకత్వం: తేజ
సంగీతం: R.P పట్నాయక్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్ తొలి హిట్ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరోగా అభిరామ్ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్ ఇంట్లో ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్ ఉన్నా రొటీన్ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీతరొటీన్ సీన్స్లాజిక్ లేని సన్నివేశాలు
రేటింగ్: 2/5
జూన్ 02 , 2023