ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
శర్వానంద్
కె. రామచంద్ర అకా రామ్సమంత రూత్ ప్రభు
ఎస్. జానకీ దేవిశరణ్య ప్రదీప్సుభాషిణి
వెన్నెల కిషోర్
రామ్ స్నేహితుడుతాగుబోతు రమేష్
రామ్ స్నేహితుడుబొమ్మాళి లక్ష్మణరావుయువకుడు సతీష్
రఘు బాబు
ఎ వాచ్‌మెన్ (కపాల దేవుడు)వర్ష బొల్లమ్మ
ఒక ట్రైనీ ఫోటోగ్రాఫర్తనికెళ్ల భరణి
సెలూన్ యజమానిసిబ్బంది
సి.ప్రేమ్ కుమార్దర్శకుడు
సి.ప్రేమ్ కుమార్దర్శకుడు
దిల్ రాజు
నిర్మాతగోవింద్ వసంత
సంగీతకారుడుప్రవీణ్ కెఎల్
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ చిత్రం థియేటర్లలోకి రాకముందే మనం తప్పక చూడాల్సిన ప్రేమ కథా చిత్రాలు
]తమిళ మూవీ ‘96’కు రీమేక్‌గా ‘జాను’ చిత్రం వచ్చింది. శర్వానంద్, సమంతలు తమ నటనతో సినిమాలోని పాత్రలకు జీవం పోశారు. అపరిమితమైన ప్రేమ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నువ్వు ప్రేమించిన వారితో నువ్వు కలకాలం కలసి ఉండలేవు థీమ్‌తో సినిమా నిర్మించారు.జానుDownload Our App
ఫిబ్రవరి 11 , 2023
వర్ష బొల్లమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
వర్ష బొల్లమ్మ.. చూసి చూడంగానే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు కంటే ముందు తమిళ్ చిత్రం సతురన్(2015) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. తెలుగులో జాను, మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పకవిమానం, స్వాతి ముత్యం వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన క్యూట్ లుక్స్, అందంతో పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వర్షకు పెంపుడు జంతువులంటే ఇష్టం. అలాగే వర్ష బొల్లమ్మ గురించి(Some Lesser Known Facts Varsha bollamma) మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
వర్ష బొల్లమ్మ దేనికి ఫేమస్?
వర్ష బొల్లమ్మ.. 'చూసి చూడంగానే' చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పపక విమానం, స్వాతి ముత్యం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
వర్ష బొల్లమ్మ వయస్సు ఎంత?
1995 జులై 30న జన్మించింది. ఆమె వయస్సు 28 సంవత్సరాలు
వర్ష బొల్లమ్మ తెలుగులో నటించిన తొలి సినిమా?
చూసి చూడంగానే
వర్ష బొల్లమ్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
వర్ష బొల్లమ్మ ఎక్కడ పుట్టింది?
కూర్గ్, కర్ణాటక
వర్ష బొల్లమ్మ ఉండేది ఎక్కడ?
బెంగుళూరు
వర్ష బొల్లమ్మ ఏం చదివింది?
BSC, మైక్రో బయాలజీ
వర్ష బొల్లమ్మ తల్లిదండ్రుల పేర్లు?
శాంతి బొల్లమ్మ, మధు మాలెట్రియా
వర్ష బొల్లమ్మ అభిరుచులు?
ట్రావెలింగ్
వర్ష బొల్లమ్మకు ఇష్టమైన ఆహారం?
మాంసాహారం ఏదైన
వర్ష బొల్లమ్మకి ఇష్టమైన కలర్ ?
పింక్
వర్ష బొల్లమ్మ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
వర్ష బొల్లమ్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు వర్ష బొల్లమ్మ మోడలింగ్ చేసేది
వర్ష బొల్లమ్మ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/varshabollamma/?hl=en
వర్ష బొల్లమ్మ పెంపుడు కుక్క పేరు?
Hachiko
https://www.youtube.com/watch?v=8QaWIO8nt0o
ఏప్రిల్ 13 , 2024
105 Minuttess Review: హన్సికా కెరీర్ బెస్ట్ నటన.. ‘105 మినిట్స్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: హన్సిక
దర్శకత్వం: రాజు దుస్సా
సంగీతం: సామ్ సిఎస్
ఛాయాగ్రహణం: కిషోర్ బోయిడపు
నిర్మాత: బొమ్మక్ శివ
‘దేశముదురు’, ‘కందిరీగ’ వంటి విజయవంతమైన చిత్రాలతో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్’ (105 Minutes)తో థియేటర్లలోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? హన్సికకు విజయాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
జాను (హన్సిక) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శక్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? దాని బారి నుంచి జాను ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ
ఎవరెలా చేశారంటే
జాను పాత్రలో హన్సిక (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్రయత్నం మంచిదైనా సరైన కథ, కథనాలు లేకుండా రంగంలోకి దిగడం వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. సినిమా (105 Minutes Review) ఆసక్తికరంగానే మొదలైనా.. ఆ తర్వాత నుంచి కథ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అసలు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాలనుకుంటోంది? అన్నదానిపై కూడా దర్శకుడు సరైన స్పష్టత ఇవ్వలేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక విషయాలకు వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథేమీ లేకున్నా ఆ సంగీతమే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హన్సిక నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్
రేటింగ్: 2.5/5
జనవరి 27 , 2024
Anthahpuram: సౌందర్యను రీప్లేస్ చేయగల సత్తా ఆ ఇద్దరి సొంతం.. డైరెక్టర్ కృష్ణవంశీ క్రేజీ కామెంట్స్!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా అంటే ఒకప్పుడు థియేటర్లలో పండగ వాతావరణం ఉండేది. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఇందులో దివంగత నటి సౌందర్య ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనపై సర్వత్ర ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ వంశీ ఎక్స్ వేదికగా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో అంతఃపురం సినిమాలో సౌందర్యను ఏ హీరోయిన్‌తో రీప్లెస్ చేయగలదని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ వంశీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
కృష్ణవంశీ ఏమన్నారంటే?
సౌందర్య, సాయికుమాార్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన అంతఃపురం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో క్రూరమైన తన మామ బారి నుంచి బిడ్డను కాపాడుకునే తల్లిగా సౌందర్య ఉత్తమ నటన కనబరిచింది. అయితే ఇప్పటి హీరోయిన్స్‌లో ‘అంతఃపురం’ ఎవరికి సెట్ అవుతుందని డైరెక్టర్ కృష్ణ వంశీని ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ అడిగాడు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ 'సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. కానీ ప్రస్తుతం హీరోయిన్స్ ఎంతో టాలెంటెడ్. తమ నటనతో మెస్మరైజ్ చేస్తున్నారు. వారిని గౌరవిస్తున్నా' అని అన్నారు. దానికి ఆ నెటిజన్ బదులిస్తూ నివేతా థామస్, శ్రద్ధా కపూర్‌లలో ఎవరు సెట్ అవుతారు? అని మళ్లీ ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణవంశీ రిప్లే ఇస్తూ ప్రస్తుత హీరోయిన్స్‌లో సమంత, సాయిపల్లవి సౌందర్య పాత్రకు సెట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంత, సాయిపల్లవి ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
సౌందర్యను రీప్లేస్ చేయగలరా!
స్టార్ హీరోయిన్ సమంతకు గ్లామర్ బ్యూటీగానే కాకుండా మంచి నటిగానూ గుర్తింపు ఉంది. తన ఫస్ట్ ఫిల్మ్ 'ఏమాయ చేశావే'తో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత ‘మనం’, ‘అ ఆ’, ‘యూటర్న్’, ‘జాను’, ‘యశోద’, ‘శాకుంతలం’, ‘బేబీ’ వంటి చిత్రాలతో నటిగా తనను నిరూపించుకుంది. అటు సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాలతో నటనలో తనకు సాటి ఎవరూ లేరని చాటి చెప్పింది. అటువంటి ఈ స్టార్ హీరోయిన్స్ అంతఃపురంలో సౌందర్య పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరి నెటిజన్లు భావిస్తున్నారు.
డైరెక్టర్‌గా రెండు నేషనల్ అవార్డ్స్
డైరెక్టర్ కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. సినిమాల్లోకి వచ్చాక కృష్ణ వంశీ అని పిలుస్తారు.రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1995లో JD చక్రవర్తి నటించిన చిత్రం ‘గులాబీ’ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ‘అంత:పురం’, ‘చంద్రలేఖ’, ‘నిన్నే పెళ్లాడుతా’ మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. రీసెంట్‌గా ‘రంగమార్తండ’ అనే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమాను తీశారు. కృష్ణ వంశీ తన కెరీర్‌లో ఉత్తమ దర్శకుడిగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం..
[toc]
బేబీ
“ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని”
“మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు”
“అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు”
వాన
“ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు”
మన్మథుడు
“నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!”
కంచె
“గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం”
నిన్నుకోరి
“నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది”
ఆర్య
“నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “
ఆరెంజ్
“ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి”
ప్రేయసిరావే
“ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.”
ఏమాయ చేశావె
“ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.”
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
“కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”
మజిలి
“పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది”
ఊపిరి
“ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే”
జాను
“పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే”
అందాల రాక్షసి
“నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను”
"రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు."
ఓయ్
“నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే”
కలర్ ఫొటో
“ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.”
“ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే
సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం.
కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది.
మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.”
“ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో
రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.”
“నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి.
అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి.
ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.”
మనం
“మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు”
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
హలో గురు ప్రేమకోసమే
“గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.”
తీన్‌మార్
“మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది”
అల వైకుంఠపురములో..
“ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.”
“బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.”
“ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు”
“ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.!
“ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్,
ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
ఆగస్టు 23 , 2024
Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అహం రీబూట్ (Aham Reboot)
సుమంత్ హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం అహం రీబూట్'. జూన్ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్ ఏంటంటే.. ఆర్జే నిలయ్ (సుమంత్) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్ అని భావించిన నిలయ్.. ఆమె మాటలకు కన్విన్స్ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
105 మినిట్స్ (105 Minuttess)
‘అహం రీబూట్’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్ చిత్రం వచ్చింది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే.. జాను (హన్సిక) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శక్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? దాని బారి నుంచి జాను ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ఆరంభం (Aarambham)
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్ నాగ్ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, లక్ష్మణ్ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్ అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
లవ్ మీ (Love Me)
ఆశిష్ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్
ప్రాజెక్ట్ జెడ్ (Project Z)
సందీప్ కిషన్ (Sundeep Kishan), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్ కిల్లర్ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్ కుమార్ (సందీప్ కిషన్) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ.
ఓటీటీ వేదిక : ఆహా
ప్రసన్న వదనం (Prasanna Vadanam)
సుహాస్ (Suhas) రీసెంట్ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్‌నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ.
భ్రమయుగం (Bramayugam)
మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది. డిజిటల్ యుగంలోనూ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ.
ఓటీటీ వేదిక : సోనీ లివ్
జూలై 03 , 2024
Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్ సుమ తనయుడు.. ‘బబుల్ గమ్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 29-12-2023
రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు యువతరాన్ని ఆకర్షించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోషన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.
కథ
హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ.
ఎవరెలా చేశారంటే
హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనుహాసన్ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్ రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్, క్లైమాక్స్
మైసన్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సీన్స్
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 29 , 2023
Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ చిత్రాలు
'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.
తొలి ప్రేమ (Tholi Prema)
వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.
ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade)
నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.
అష్టా చమ్మా (Ashta Chamma)
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.
అలా మెుదలైంది (Ala Modalaindi)
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్ ఫెయిల్ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.
సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan)
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి (Majili)
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
ఓకే బంగారం (Ok Bangaram)
ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.
ఏ మాయ చేశావే (Ye Maya Chesave)
తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్ బిజినెస్‌లో భాగమై సక్సెస్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.
సీతారామం (Sita ramam)
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్ క్లాసిక్ మూవీగా దీన్ని చెప్పవచ్చు.
హాయ్ నాన్న (Hi nanna)
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్ నాన్న తప్పకుండా ఉంటుంది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్ (Oye)
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి (Raja Rani)
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను (Jaanu)
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
గోదావరి (Godavari)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. హీరో సుమంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఆనంద్ (Anand)
ఈ ఫీల్‌గుడ్ మూవీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
మార్చి 22 , 2024
Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్, కామెడీ, అడ్వెంచర్ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివాహభోజనంబు
‘మాయాబజార్’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.
https://www.youtube.com/watch?v=dZejdBmYC3k
‘సుందరి నీవంటి’
సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్ చేస్తారు. కానీ ‘మాయాబజార్’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.
https://www.youtube.com/watch?v=ScasolQHzxs
'నిలువరా వాలు కనులవాడా'
జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.
https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA
'చెప్పమ్మా.. చెప్పమ్మా..'
‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్ కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్ అవుతుందో ఈ సాంగ్ కళ్లకు కడుతుంది.
https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI
'బుగ్గే బంగారమా..'
‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు.
https://www.youtube.com/watch?v=WABcMeOf0oM
‘అసలేం గుర్తుకు రాదు’
‘అంతపురం’లోని ఈ సాంగ్.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.
https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss
‘ఇంకి పింకి పాంకీ’
సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి.
https://www.youtube.com/watch?v=FusD0RVkKAk
‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’
తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.
https://www.youtube.com/watch?v=u_wB6byrl5k
‘ఐతే’
ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్ కళ్లకు కడుతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.
https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4
‘లైఫ్ ఆఫ్ రామ్’
ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.
https://www.youtube.com/watch?v=2a34XyiZO14
‘చెలియా చెలియా’
ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.
https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
మార్చి 02 , 2024
Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశాడంటూ డాక్టర్ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
‘గంజాయి తీసుకుంది నిజమే’
యాంకర్ ధనుష్.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్ ఫేమ్ గలాటా గీతు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.
ఆ వార్తలు అవాస్తవం : గీతూ
అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్ స్నేహితుల్లో ఒకరికి ఫోన్ చేసిందని తెలిపారు. వినయ్ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు.
‘అలా చేయడం సరికాదు’
ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.
మౌనిక చేసిన ఆరోపణలు ఇవే!
బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్ భయపెట్టి అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.
షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు!
షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్ బిగ్‌బాస్ సీజన్-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నర్ కావాల్సి వచ్చింది. ఆ సీజన్ విజేతగా సన్నీ నిలిచాడు.
బిగ్‌బాస్ ఎఫెక్ట్‌తో బ్రేకప్!
బిగ్‌బాస్ వెళ్లడానికి ముందు వరకూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ డీప్ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్ పడింది. అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో అన్న సంపత్ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
షణ్ముఖ్‌తో క్లోజ్.. వైష్ణవి లవ్ బ్రేకప్!
బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్ రీల్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్ డెవలపర్ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్ వచ్చాయి.
షణ్మఖ్‌ను ఫేమస్ చేసిన సిరీస్‌లు ఇవే!
2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్’ వంటి యూట్యూబ్ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్ మంచి పేరు సంపాదించాడు.
ఫిబ్రవరి 23 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్‌లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
జిమ్‌లో జాన్వీ కపూర్ అందాల సెగలు
]వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘ధావల్’ చిత్రంలోనూ మెరువనుంది.Download Our App
ఫిబ్రవరి 14 , 2023
Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
[toc]
అసలేం జరిగిందంటే?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 19) ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.
తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్
మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
https://twitter.com/HeroManoj1/status/1836692133216174368
జానీ మాస్టర్ టాప్-10 సాంగ్స్
జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్ -10 సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం
మేఘం కరిగేనా (తిరు)
తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ధనుష్, నిత్య స్టెప్పులను నెక్స్ట్ లెవల్లో కంపోజ్ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY
అరబిక్ కుతు (బీస్ట్)
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్ బెస్ట్ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది.
https://www.youtube.com/watch?v=vOYJmUE_U24
రంజితమే (వారసుడు)
విజయ్, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో విజయ్, రష్మిక డ్యాన్స్ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్ చివరిలో వచ్చే సింగిల్ టేక్ స్టెప్ విజయ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8
రారా రక్కమ్మ (విక్రాంత్ రోణ)
విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్ దేశంలోని మ్యూజిక్ లవర్స్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్ స్టెప్‌పై రీల్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.
https://www.youtube.com/watch?v=aC9KBju5BNY
నువ్వు కావాలయ్యా (జైలర్)
రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్న వేసిన హుక్ స్టెప్‌కు యూత్ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. రీల్స్ సైతం పెద్ద ఎత్తున చేశారు.
https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk
రౌడీ బేబీ (మారి 2)
సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్ చిత్రీకరణ జరిగింది.
https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI
బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు.
https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ
సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం)
‘రేసుగుర్రం’లోని మాస్ బీట్ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA
లైలా ఓ లైలా (నాయక్)
రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=HGgHSi-kg78
ఏం మాయో చేశావే (ద్రోణ)
2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ టాలెంట్ చూసిన నితిన్ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నితిన్ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్ తర్వాత నుంచి జానీ మాస్టర్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
సెప్టెంబర్ 19 , 2024
Janhvi Kapoor Top 10 Saree Tips: చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్ నుంచి ఇలా నేర్చుకోవచ్చు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. మోడ్రన్ డ్రెస్ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రీసెంట్‌గా అనంత్ అంబాని - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్ నెక్లెస్ ధరించి అందరి దృషి ఆకర్షించింది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్ హెయిర్ స్టైల్.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది.
చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్ కలర్ డిజైనర్ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్ కలర్ శారీలో జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్ కలర్ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్, ఇయర్ రింగ్స్ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.
గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.
కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.
పెద్ద పెద్ద డిజైనర్ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్ స్పెషల్‌గా చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ మిస్మరైజింగ్ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
ఈ స్టైలిష్ రెడ్ శారీలో జాన్వీ కపూర్.. ఘాటైన రెడ్ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్ నెవర్ బీఫోర్‌లా అనిపిస్తాయి.
జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్ కలర్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.
మార్చి 06 , 2024
Janhvi Kapoor: జాన్వీ కపూర్ నడుము మడతలు.. చూపు తిప్పుకొకుండా ఉండగలరా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) ‘69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024’ (69th Filmfare Awards 2024) ఈవెంట్‌లో సందడి చేసింది.
స్టన్నింగ్ అవుట్ ఫిట్లతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఈ బ్యూటీ అందాలను చూసి వేడుకకు వచ్చిన వారంతా ఫిదా అయ్యారు.
వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన జాన్వీ... మాస్ స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది.
స్టేజీపై జాన్వీ ప్రదర్శనను చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు తమ చప్పట్లతో ఆమెను అభినందించారు. అటు జాన్వీ పర్‌ఫార్మెన్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకల్లోనే జాన్వీ టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్‌లోనూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది.
నల్లటి దుస్తుల్లో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు ఉర్రూతలూగుతున్నారు. తల్లి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది.
కోలివుడ్ హీరో సూర్య నటిస్తున్న 'కర్ణ' (Karna) చిత్రంలోనూ ఈ భామకు ఛాన్స్ చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
జాన్వీ కపూర్.. ‘ధడ్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు.
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు.
ఇటీవల 'రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని శరణ్‌శర్మ తెరకెక్కిస్తున్నారు.
జనవరి 30 , 2024
Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్ లీక్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది.
ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్ చేశాడా? అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.
మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్ జోహార్ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.
ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్‌తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది.
శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'దేవర' చిత్రంలో నటిస్తోంది. న్యూయర్ సందర్భంగా దేవర పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. జనవరి 8న సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ గ్లింప్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.
ఇక దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ టామ్ చాకోలు విలన్స్‌గా కనపడబోతున్నారు.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్.
ఇక జాన్వీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
జనవరి 04 , 2024
janhvi kapoor: లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
బాలీవుడ్ అందాల క్వీన్ జాన్వీ కపూర్ ఒక్కసారిగా రవివర్మ కుంచె గీసిన బొమ్మగా మారిపోయింది. పరువాలను అడ్డు చీరలో దోపుతూ ఫొటో షూట్‌కు పొజులిచ్చింది. అచ్చం రవివర్మ గీసిన పెయింటింగ్‌లా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను నెటిజన్ల తెగ పొగుతుతున్నారు.
కేరళ కుట్టిలా ముస్తాభై నేల మీద కూర్చోని అందాలను అమర్చింది ఈ కొంటె పిల్ల. జబ్బల అందాలు, సొగసైన ఎద అందాల అచ్చాదనను ఎకరువు పెడుతూ తళుక్కున మెరిసింది
ముగ్దమైన కళ్లు, సగం తెరుచుకున్న ఎర్రని లాలీపప్స్ వంటి పెదాలు, పొడవైన నల్లని జుట్టులో దోపిన కలువ పూల అందాల్లో జాన్వీ అందాలకే అందంగా నిలిచింది.
అతిలోక సుందరి శ్రీదేవికి తగిన తనయగా తన అందానికి మరింత హంగులు అద్దింది. చూపు తిప్పుకోలేని భంగిమలో కుర్రకారును టెంఫ్ట్ చేస్తోంది.
రాఖీ పండగ సందర్భంగా కవ్వించే సొగసులతో కుదురుగా ఉండనివ్వడం లేదంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. దీంతో కుర్రాళ్లు తమ పదునై కామెంట్లకు పని చెబుతున్నారు.
ఈ ఫొటోలను ట్యాగ్ చేస్తూ ... ఇది ఆర్ట్ గొప్పతనం అంటూ పోస్ట్ చేసింది. ఇక పోస్ట్‌కు రిప్లే ఇస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. జాన్వీ అందాలను పొగుడుతూ తమలోని కామెంట్ల కవిత్వానికి పని చెప్పారు.
లుకింగ్ గార్జియస్, డ్రీమీ, ఏంజెల్‌లా ఉన్నావని కొందరూ, అతిలోక సుందరిని మించిపోయావంటూ తెగ పొగుడుతున్నారు.
స్టార్ కిడ్ అయినప్పటికీ జాన్వీ బాలీవుడ్‌లో గొప్పగా అయితే లాంచ్ కాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటనలో పరిపక్వతను సాధిస్తోంది. తాజాగా వరుణ్ దావణ్‌తో `బవాల్` చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది.
ఇప్పుడు ఈ సొగసుల సోయగం తెలుగులో భారీగా ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ- జూ. ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్‌పై తన ఇష్టాన్ని పలు ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ అల్లరి పిల్ల నేరుగా ఆయన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయడం విశేషం.
అయితే దేవర కంటే ముందుగానే జాన్వీ.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. కానీ కుదరలేదు. అయితే ఆ సినిమాలో నటించకపొవడం జాన్వీకి మంచే చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా ఆమె కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి లాగా పాన్ ఇండియన్ హీరోయిన్‌గా ఎదిగేందుకు అన్ని విధాల దేవర సినిమా అయితే ఉపయోగపడనుంది.
ఈ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాన్వీ పరిచయం కానుంది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు హిందీలో.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలజ్ సినిమాల్లో నటిస్తోంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా జాన్వీకి మాత్రం బిగ్ బ్రేక్ రాలేదు. మరి జూ. ఎన్టీఆర్ దేవరతో ఆ బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
ఆగస్టు 31 , 2023
Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్ షోలో తగ్గేదేలే..!
Janhvi Kapoor: జాన్వీ అందాల జాతర.. గ్లామర్ షోలో తగ్గేదేలే..!బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మరోమారు చిట్టి పొట్టి డ్రెస్‌లో తళుక్కుమంది.గ్లామర్ ఫోజుల్లో కనిపించి అందాల జాతర చేసింది. కొంటెగా చూస్తూ కవ్వించింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.హిందీలో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోతగ్గ బ్రేక్ రాలేదు.దీంతో దక్షిణాదిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జాన్వీ చూస్తోంది.ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.మరోవైపు కోలీవుడ్‌లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి.శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ.. ‘ధడక్’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు అవకాశాలు సైతం క్యూ కట్టాయి.రీసెంట్‌గా ‘మిలి’ సినిమాతో జాన్వీ ఆడియన్స్ పలకరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ జాన్వీ యమా యాక్టివ్‌గా ఉంటోంది.తన ఫొటో షూట్, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.ప్రస్తుతం జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 21.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
జూలై 19 , 2023
క్రైం థ్రిల్లర్ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
]గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గూఢచారి - Prime VideoDownload Our App
ఫిబ్రవరి 14 , 2023
Janhvi Kapoor: ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా? చూస్తే మతిపోవాల్సిందే!
బాలీవుడ్‌లో శ్రీదేవి ముద్దుల తనయగా అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా తారక్ సరసన ‘దేవర’లో నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీ నటిస్తున్న ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇదే కావడంతో ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అమ్మడి గురించి తెలుసుకుంటూనే ఇప్పటివరకూ చూడని బోల్డ్ ఫొటోలను చూసేయండి.
‘ధడ్’ చిత్రం ద్వారా జాన్వీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు.
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు.
ఈ క్రమంలోనే 'రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.
రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్’ చిత్రాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసిన నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.
జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ తెలుగు పరిశ్రమపై భారీ ఆశలు పెట్టుకుంది. తల్లి శ్రీదేవిలా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేయాలనుకుంటోంది.
దేవరతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా జాన్వీ ఎంపికైంది. రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబోలో రానున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటించనుంది.
ప్రస్తుతం హిందీలో 'సన్నీ శాన్‌స్క్రీట్ కి తుల్సీ కుమారి' అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది. ఇందులో లీడ్ రోల్‌లో ఆమె కనిపించనుంది.
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే జాన్వీ సోషల్ మీడిాయాలో చాలా చురుగ్గా ఉంటోంది. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 25.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 25 , 2024