• TFIDB EN
  • జోష్
    UATelugu2h 48m
    దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగ చైతన్య
    సత్య
    కార్తీక నాయర్
    విద్యా
    జెడి చక్రవర్తి
    జె.దుర్గారావు
    ప్రకాష్ రాజ్
    ప్రిన్సిపాల్
    బ్రహ్మానందం
    దుర్గారావు వ్యక్తిగత సహాయకుడు
    సునీల్
    బుజ్జి
    ఆనంద్
    సత్య తండ్రి
    సితార
    సత్య తల్లి
    సందీప్ మాధవ్
    విద్యార్థి (రాధ బ్యాచ్)
    సిద్ధు జొన్నలగడ్డ
    సూర్య
    హేమ
    జానకి
    హర్ష వర్ధన్
    విద్యా సోదరుడు
    దేవదాస్ కనకాల
    కౌటిల్యగుణ
    కామేష్
    మౌనిక
    విద్యా కోడలు
    శ్రేయా ధన్వంతరి
    భావ
    విశ్వా
    పీలా గంగాధర్
    ప్రియాంక
    సాయి కుందన
    అసలత
    కోటేష్ మానవ
    సత్యనారాయణ వర్మ
    సిబ్బంది
    వాసు వర్మ
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    సందీప్ చౌతా
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    కొత్త సంవత్సరం రోజు ఫుల్ జోష్‌లో హీరోయిన్లు… హాట్ లుక్స్‌లో  కవ్విస్తూ..
    కొత్త సంవత్సరం రోజు ఫుల్ జోష్‌లో హీరోయిన్లు… హాట్ లుక్స్‌లో కవ్విస్తూ..
    ]మెహ్రీన్‌ దుబాయ్‌లో తన స్నేహితులతో కలిసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో  ఈ ముద్దుగుమ్మ అందాలు కుర్రకారు మతిపోగుడుతున్నాయి.మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!</strong>
    OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!
    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్‌ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థమన్ ఏమన్నారంటే? పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.&nbsp; https://twitter.com/MusicThaman/status/1842245316252209456 పాన్‌ ఇండియా స్థాయిలో పవన్‌ కల్యాణ్‌ ఓజీ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్‌ సైతం ఓజీ హైప్‌ క్రియేట్‌ చేసింది.&nbsp; https://twitter.com/tollymasti/status/1822184749072294337 అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్‌! సంగీత దర్శకుడు థమన్‌ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) చిత్రానికి కూడా థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్‌ డేట్‌ను సైతం కన్ఫార్మ్‌ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్‌ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్‌ మరింత ఇష్టుడిగా మారిపోయారు.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ ప్రస్తుతం పవన్‌ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    <strong>Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్‌.. ఫుల్‌ జోష్‌లో మెగా ఫ్యాన్స్‌!</strong>
    Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్‌.. ఫుల్‌ జోష్‌లో మెగా ఫ్యాన్స్‌!
    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో గ్లోబల్‌ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్‌ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్‌ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్‌ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్‌ పెట్టే దిశగా రామ్‌చరణ్‌ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్‌ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; సెట్స్‌పైకి రెండు చిత్రాలు! మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్‌ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్‌ పెట్టాలని చరణ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ కాకముందే డైరెక్టర్‌ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ సంతోషిస్తున్నారు.&nbsp; ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా? ప్రభాస్‌ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్‌ మారుతీతో 'రాజాసాబ్‌' అనే చిత్రంలో ప్రభాస్‌ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్‌ కల్లా సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్‌'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్‌ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.&nbsp; ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌ దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.&nbsp; ఈ ఏడాది లేనట్లే! ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం రిలీజ్‌ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్‌ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబ‌ర్ 20కి ఇప్ప‌టికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్‌ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్‌ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>RGV Comments On SSMB29: మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!&nbsp;</strong>
    RGV Comments On SSMB29: మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!&nbsp;
    దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli), మహేష్‌ బాబు (Mahesh Babu) కాంబోలో రానున్న చిత్రం కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మహేష్‌ ఫ్యాన్స్‌, సగటు సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ ప్రాజెక్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే తరుచూ వివాదాలతో సావాసం చేసే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ‘SSMB29’పై క్రేజీ కామెంట్స్‌ చేశారు. ఎప్పుడు లేనిది రిలీజ్‌ ముందే ఈ సినిమాను ఆకాశానికి ఎత్తారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారో ఈ కథనంలో చూద్దాం.&nbsp; 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌' దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గత కొన్నేళ్లుగా సంచలనాలకు మారు పేరుగా మారిపోయారు. అతడు ఏం మాట్లాడిన, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినా ప్రతీది సెన్సేషన్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆర్జీవీ, మహేష్‌ - రాజమౌళి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 'SSMB29' కచ్చితంగా 'బాప్‌ ఆఫ్‌ ఆల్‌' అవుతుందని వ్యాఖ్యానించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత మహేష్‌ చిత్రం కోసం రాజమౌళి చాలా వర్క్‌ చేశారని గుర్తుచేశారు. డెఫినెట్‌గా ఊహలకు అందని రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని సాలిడ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మహేష్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. దీంతో వర్మ కామెంట్స్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.&nbsp; https://twitter.com/i/status/1815971837337297111 రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్: ఆర్జీవీ దర్శకధీరుడు రాజమౌళి పైనా రామ్‌ గోపాల్‌ వర్మ ప్రశంసలు కురిపించారు. బాహుబలి కలెక్షన్స్‌ని బాలీవుడ్‌ సినిమాలు కూడా కలెక్ట్‌ చేయలేవని వ్యాఖ్యానించారు. ‘రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమాది కాదు. ఇది కేవలం రాజమౌళిదే. రాజమౌళి ఎక్కడ పుట్టినా ఇలాగే సినిమాలు తీసేవాడేమో. RRRలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా యూనిక్ గా ఉంటాయి. RRR వల్లే ఇండియన్ సినిమా గురించి చాలా దేశాలకి తెలిసింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రాజమౌళి గొప్పగా చెప్పుకోడు. రాజమౌళి కంటే నాదే లగ్జరీ లైఫ్' అటు ఆర్జీవీ కామెంట్స్ చేశారు. హార్దిక్‌ పాండ్యా డివోర్స్‌పై.. ఇటీవల హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల తనదైన శైలిలో స్పందించారు. 'పెళ్ళీలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్‌ను నియమించుకోవడం బెటర్. ప్రస్తుతం రోజు రోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చేయడం మూర్ఖత్వమే. ప్రేమ గుడ్డివారిని చేస్తే పెళ్లి కళ్లు తెరిపిస్తుంది' అంటూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఇవి కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.&nbsp; https://twitter.com/RGVzoomin/status/1814612480649535830 https://twitter.com/RGVzoomin/status/1814614163593044241 https://twitter.com/RGVzoomin/status/1814615965612863618 సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి! 'SSMB29'కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు సమాచారం. మిగిలిన కాస్త వర్క్‌ను కూడా ఫినిష్‌ చేసుకొని సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో మహేష్‌ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి నెగిటివ్‌ షేడ్స్ ఉంటుందని గాసిప్స్‌ వినిపించాయి. మహేష్‌ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్‌ రోల్‌, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేయలేదు. దీంతో ఈ అప్‌డేట్‌ మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఇందులో వాస్తవం ఎంతో రాజమౌళి టీమ్‌ తెలియజేయాల్సి ఉంది.&nbsp;
    జూలై 24 , 2024
    Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
    Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌ను ఫుల్‌ జోష్‌లో నింపాయి.&nbsp; ‘పుష్ప 3’ కూడా ఉంటుందట! జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అక్కడ పుష్ప సినిమా గురించి కొత్త అప్‌డేట్‌ను అందించారు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని బన్నీ తెలిపారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ ‘పుష్ప 2’లో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌అనిపిస్తాయని చెప్పారు. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని బన్నీ తన ప్రసంగాన్ని ముగించారు.&nbsp; ‘పుష్ప ముగింపు లేని కథ’ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటించి అద్భుత నటన కనబరిచింది. తనదైన యాస, భాషతో శ్రీవల్లి పాత్రలో జీవించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘పుష్ప 2’ చిత్రంపై స్పందించింది. పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’ అని అన్నారు. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూసిన కూడా పార్ట్‌ 3పై సానుకూల సంకేతాలే వచ్చాయి. బన్నీ ప్లాన్స్‌ తలకిందులు! నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) భావించారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్స్ అన్ని తలకిందులు అయ్యాయి. పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు. కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్తే బన్నీ మరో ఏడాది కూడా సుకుమార్‌కే అంకితం కావాల్సి ఉంటుంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..&nbsp; ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..&nbsp; ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/sunny4u007/status/1633901586413154304 ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1633886352583565313 ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు&nbsp; ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.&nbsp; https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20 వరుస పెట్టి సినిమాలు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్‌ శంకర్‌ షూటింగ్‌ను మార్చి 28నుంచి&nbsp; పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025 https://twitter.com/SupremePSPK/status/1630933852058423302 ఫటా ఫట్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి. &nbsp; పవన్ క్యూ జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు వేళాయే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
    మార్చి 10 , 2023
    <strong>The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?</strong>
    The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
    వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్‌ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను&nbsp; ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది. గ్లింప్స్‌ ఎలా ఉందంటే? &nbsp;కలర్‌ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన&nbsp; ప్రభాస్ లుక్ అదిరిపోయింది.&nbsp; డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్‌ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది. https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హరర్‌ జనర్‌లో.. కల్కి సక్సెస్‌ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్&nbsp; జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్‌ జనర్‌లో తెరకెక్కుతోంది. సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్ ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను,&nbsp; అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన&nbsp; గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్‌ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; ఆ హిందీ సాంగ్ రీమిక్స్ 'రాజా సాబ్‌' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్‌ హిందీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో.. మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    జూలై 29 , 2024
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు
    ]సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ జోష్‌ను చిరంజీవి కొనసాగించాలని చూస్తున్నారేమో. ఈ సారి కూడా వాల్తేరు వీరయ్యతో సిద్ధం అయిపోయారు. విజయంపై మరింత ధీమాాగా ఉన్నారు.వాల్తేరు వీరయ్య
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్‌ వీక్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’కు వర్క్‌ చేయడం విశేషం. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; 35 చిన్న కథ కాదు నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.&nbsp; జనక అయితే గనక యంగ్ హీరో సుహాస్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఉరుకు పటేలా తేజస్‌ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉరుకు పటేలా' (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe Perfect CoupleSeriesEnglishNetflixSep 05Apollo 13: SurvicalDocumentaryEnglishNetflixSep 05Bad Boys: Ride or DieMovieEnglishNetflixSep 06Adios AmigoMovieMalayalamNetflixSep 06Sector 36MovieHindiNetflixSep 13Tanav Season 2SeriesHindiSonyLIVSep 06ThalaivanMovieMalayalamSonyLIVSep 10English TeacherMovieEnglishHotstar&nbsp;Sep 03KillMovieHindiHotstar&nbsp;Sep 06Brick ToonsMovieEnglishHotstar&nbsp;Sep 04The Fall GuyMovieEnglishJio CinemaSep 03Fight Night: The Million Dollar HeistSeriesEnglishJio CinemaSep 06
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Jr NTR Sons: టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై కర్చీఫ్‌ వేసిన తారక్‌ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్‌ అయినట్లేనా!</strong>
    Jr NTR Sons: టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై కర్చీఫ్‌ వేసిన తారక్‌ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్‌ అయినట్లేనా!
    దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్‌ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్‌ సైతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్‌ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్‌ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్‌ ఏంజలిస్‌ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్‌, భార్గవ్‌ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.&nbsp; బిడ్డల సినీ ఎంట్రీపై తారక్‌ ఏమన్నారంటే! టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్‌ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్‌ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్‌ హింట్‌ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్‌, భార్గవ్‌ సినిమా ఎంట్రీని ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; తారక్‌.. నందమూరి వారసుడు కాదా? ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్‌ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్‌ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.&nbsp; హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం! నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌ స్టేటస్‌ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్‌, కల్యాణ్‌ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్‌ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.&nbsp; 'దేవర 2'.. తారక్‌ ఏం చెప్పారంటే? కలెక్షన్స్‌ పరంగా దేవర సాలిడ్‌ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర 2'పై తారక్‌ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్‌2లో కొన్ని సన్నివేశాలు షూట్‌ చేశాం. ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్‌ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్‌ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్‌ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్‌ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్‌ అన్నారు.
    అక్టోబర్ 07 , 2024
    <strong>Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?</strong>
    Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?
    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్‌ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ స్టైలిష్‌, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్‌కమింగ్‌ హీరో మేకోవర్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య సినిమాతో ఎంట్రీ? నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న 'అఖండ' (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్‌ రోల్‌ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్‌ రాశారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్‌ షూట్‌ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.&nbsp; హనుమాన్‌ దర్శకుడితో! మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్‌’ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్‌ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్‌ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్‌ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్‌ వర్మకు మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఆ రిలేషన్‌తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. హ్యాండ్సమ్‌ లుక్‌లో.. నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లోకి మారిపోయాడు. హీరో కటౌట్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్‌తో మోక్షజ్ఞ మెస్మరైజ్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్‌ హీరో మెటీరియల్‌ అని తన న్యూ లుక్‌ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్‌ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్‌ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/AKKINENI_9999/status/1808086164647153776 29 ఏళ్లకు తెరంగేట్రం! తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్‌ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్‌గా మోక్షజ్ఞ లుక్‌ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
    జూలై 09 , 2024
    Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు
    Bhagavanth Kesari Review: ఎమోషనల్ బైండింగ్‌తో బాలయ్య కంటతడి పెట్టించాడు
    నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగంత్ కేసరి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ.. కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కిన భగవంత్ కేసరితో ముందుకొచ్చాడు. ట్రైలర్‌లో బాలయ్య- శ్రీలీల మధ్య వచ్చిన ఎమోషన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాతో తన పంథాను మార్చుకున్న అనిల్ రావుపూడి.. బాలకృష్ణతో కొత్త&nbsp; ప్రయోగం చేయడంతో సినిమాపై హెప్ పెరిగింది. మరి ఇంతకు ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నేలకొండపల్లి భగంవత్ కేసరి మెప్పించాడా? లేదా? YouSay రివ్యూలో చూద్దాం. నటీనటులు: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్, శరత్‌కుమార్ డెరెక్టర్: అనిల్ రావుపూడి నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది సినిమాటోగ్రఫి: సి. రామ్ ప్రసాద్ సంగీతం: తమన్&nbsp; విడుదల తేదీ: అక్టోబర్ 19 కథ: కొన్ని తప్పని పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి ఆ జైలు.. జైలర్ ఓ పని అప్పగిస్తాడు. తన కూతుర్ని కొంత మంది దుర్మార్గుల నుంచి రక్షించమని మాట తీసుకుంటాడు. అందుకోసం భగవంత్ కేసరి.. ఆమెను స్ట్రాంగ్‌ చేసేందుకు నిత్యం కష్టపడుతుంటాడు. అయితే విజ్జి పాప(శ్రీలీల) మాత్రం అవేమి పట్టనట్టుగా ఉంటుంది. తనను వదిలేయమని వేడుకుంటుంది. ఈక్రమంలో విజ్జును చంపడానికి వచ్చిన విలన్లతో బాలయ్య తలపడుతాడు. వాళ్లు ఊహించని ఓ ట్విస్ట్ ఇస్తారు. ఇంతకు ఆ ట్విస్ట్ ఏమిటి? జైలర్‌కు విలన్‌కు ఉన్న విరోధం ఏమిటి? భగవంత్ కేసరి.. జైలర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఇక సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ఈ సన్నివేశాలు ఆడియన్స్‌కు కనెక్ట్‌ అవుతాయి. శ్రీలీల- బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ అదిరిపోతుంది. బాలయ్య మాస్ స్టేప్పులతో ఇరగదీశాడు. అయితే సినిమాలో కాజల్‌తో పాటలు ఏమి లేవు. బాలకృష్ణతో శ్రీలీల బాండింగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అయితే భగవంత్ కేసరి చిత్రం బాలయ్య గత సినిమాల మాదిరి ఉండదు. కొంత వినోదం, కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. కూతురు సెంటిమెంట్ సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాలో మూడు పెద్ద ఫైట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ ప్రేక్షకుల చేత వన్స్ మోర్ అనిపిస్తాయి. బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. విలన్ అర్జున్ రామ్‌పాల్‌తో బాలయ్య సన్నివేశాలు గూస్‌బంప్స్. సినిమాకే హైలెట్‌గా బాలకృష్ణ ఇంకో గెటప్‌ ఉంటుంది. బాలయ్యకు జైలర్‌కు మధ్య ఉన్న సంబంధమే కథకు సెంట్రల్ పాయింట్. ఆ పాయింట్‌కు శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌ను ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలిస్తుంది, ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భగవంత్ కేసరి సినిమాకు మెయిన్ థీమ్. ఈ ఎపిసోడ్‌లో 15 నిమిషాల పాటు బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.&nbsp; ఎవరెలా చేశారంటే.. భగవంత్ కేసరిలో బాలకృష్ణ పూర్తిగా కొత్తగా కనిపించారు. ఇప్పటివరకు యాక్షన్ సీన్లలోనే ఎక్కువ కనిపించిన బాలయ్య.. కామెడీ సీన్స్‌లోనూ అదరగొట్టారు. శ్రీలీలతో జరిగే ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య తన నటనతో కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో ఎప్పటిలాగే అదరగొట్టారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తాయి. ఇక శ్రీలీల గురించి చెప్పాలంటే.. విజ్జు పాత్రలో సహాజమైన నటనతో ఆకట్టుకుంది. ఈ పాత్ర శ్రీలీల కెరీర్‌లో గుర్తిండి పోతుంది. ముఖ్యంగా శ్రీలీలకు కెరీర్ ఆరంభంలోనే ఇలా నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్లలో బాలయ్యతో పోటీపడి మరి నటించింది. ఇక బాలయ్య సరసన నటించిన కాజల్ తన పాత్ర పరిధిమేరకు నటించింది. పెద్దగా తన పాత్రకు స్కోప్ లేనప్పటికీ.. ఉన్నంతలో బాగా చేసింది. విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ మెప్పించాడు. కథకు తగ్గట్లు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో హిట్ అయిన అనిల్ రావిపూడి తన సినిమాలకు భిన్నంగా బాలయ్యతో ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తీసేందుకు మంచి ప్రయత్నమే చేశాడు. అనిల్ తీసుకొచ్చి స్టోరీ లైన్ బలమైనదే అయినప్పటికీ.. దానికి తగినవిధంగా ఇంకాస్త బలంగా కథ రాసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ తాను అనుకున్న స్టోరీని అమలు చేయడంలో మాత్రం విజయం సాధించాడు. బాలయ్య- శ్రీలీల మధ్య ఇంకొన్ని బలమైన ఎమోషన్ సీన్లు పడితే బాగుండేది అనిపించింది.&nbsp; టెక్నికల్ పరంగా సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ మ్యూజిక్ మెప్పిస్తుంది. కానీ గత సినిమాలతో పోలిస్తే BGM రేంజ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. సినిమాలోని రెండు పాటలు అలరిస్తాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి ప్రత్యేకంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో బాలయ్య రిచ్‌ లుక్‌లో కనిపించేందుకు బాగా కష్టపడినట్లు అర్థం అవుతోంది. ఇక వెంకట్ యాక్షన్ సిక్వెన్స్‌ హెలెట్. ఉన్న మూడు ఫైట్లు బాలయ్య మాస్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అదిరిపోయాయి. బలాలు బాలకృష్ణ- శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్లు యాక్షన్ సన్నివేశాలు ఇంటర్వెల్ బ్యాంగ్ బలహీనతలు అంచనాలకు తగ్గట్టుగా లేని ఫస్టాఫ్ కొన్ని చోట్ల లాగ్ సీన్లు చివరగా: తండ్రి- కూతుళ్ల మధ్య ఎమోషనల్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... ప్రేక్షకులకు అన్ని విధాల కనెక్ట్ అవుతుంది. రేటింగ్: 3/5
    అక్టోబర్ 26 , 2023
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    తమిళ్ హీరోయిన్&nbsp; ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది.&nbsp; సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది&nbsp; వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది. తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది 1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది. తమిళ్‌లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది ప్రియా భవాని శంకర్ జయంరవికి జంటగా నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్‌ సరసన నటించిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా ఎస్‌ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
    జూన్ 19 , 2023
    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?
    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?
    నటినటులు: కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి దర్శకత్వం: రమేష్‌ కడూరి సంగీతం: సాయి కార్తిక్‌ నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం  రీసెంట్‌ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కిరణ్‌ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్‌ మూవీ మీటర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి అంచనాలను కిరణ్ అబ్బవరం అందుకున్నాడా?. వరుసగా రెండో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడా? అసలు సినిమా కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం.  కథ ఏంటంటే: కథలోకి వెళితే... అర్జున్‌ కళ్యాణ్‌ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ మంచి పోలీసు ఆఫీసర్‌. కానిస్టేబుల్‌గా చేస్తూ ఎన్నో అవమానాలు పడుతుంటాడు. కొడుకుని ఎస్సైని చేయాలని తండ్రి కలలు కంటాడు. కాని అర్జున్‌కు అది అసలు ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా పరీక్ష రాసిన అర్జున్.. ఎస్సై అయిపోతాడు. ఈ క్రమంలో హోమంత్రి కంఠం బైరెడ్డి(పవన్‌), అర్జున్‌ మధ్య గొడవ జరుగుతుంది. బైరెడ్డి చేసిన స్కామ్‌ ఏంటి?. అర్జున్‌ దాన్ని ఎలా బయటపెడతాడు? అనేది అసలు కథ. అది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: మీటర్‌ సినిమాలో కిరణ్‌ అబ్బవరం మాస్‌ హీరోగా అదరగొట్టాడు. గత సినిమాల్లో కంటే ఎంతో ఉత్సాహాంగా నటించి అలరించాడు. ప్రతీ సీన్‌లో తన మార్క్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. తన పంచులు, ప్రాసలతో ఆడియన్స్‌ మెప్పించాడు. కిరణ్‌ చెప్పిన డైలాగ్స్‌ థియేటర్లలో చాలా అద్భుతంగా పేలాయి. హీరోయిన్‌గా అతుల్య రవి పాటల మేరకే పరిమితం అయ్యింది. సప్తగిరి కామెడి అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది. పోసాని కృష్ణమురళి సహా ఇతర నటులు తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ సినిమాలో చాలా పాత్రలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. ఖాళీగా తిరిగే హీరో ఒక్కసారిగా ఎస్సై అవ్వడం వాస్తవ దూరంగా ఉంటుంది. అబ్బాయిలంటేనే ఇష్టపడని హీరోయిన్‌ ఒక్క పాటతో హీరో ప్రేమలో పడిపోవడం ఆడియన్స్‌కు అంతగా రుచించదు. సీఎంను కూడా భయపెట్టేంత రేంజ్‌లో విలన్‌ను చూపించి హీరో ముందు మరీ తక్కువ చేయడం అర్థంకాని అంశంగా ఉంది. సినిమా కథలో కొత్త దనం లేకపోవడంతో పాటు, కొన్ని సీన్లను ఎక్కడో చూశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక సాయికార్తిక్‌ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్యం సంగీతం కూడా నార్మల్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హీరో నటనకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసహజత్వం లోపించడంకథలో సాగదీతసంగీతం రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 07 , 2023
    <strong>Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్</strong>
    Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్‌.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్
    ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ఈ సినిమాపై ప్రముఖ ఫిల్మ్ క‌్రిటిక్ ఉమెర్ సంధు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా పైసా వసూల్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. బన్నీ ఫ్యాన్స్‌ను జోష్‌లో ముంచేసింది. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, పుష్ప-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ సీక్వెల్ లో తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా నిలిచాడు. బన్నీ పుష్పలో తన మేనరిజంతో, మాస్ యాక్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప-2 పై ప్రేక్షకుల అంచనాలు ఫస్ట్ పార్ట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు విపరీతంగా స్పందించడంతో, సీక్వెల్ పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప-2’ కోసం నార్త్ ఆడియన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలోనే పుష్ప హిందీలో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ సీక్వెల్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్ షోల హైప్– అల్లు అర్జున్ అటెండ్ డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. టిక్కెట్లు ముందుగానే హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని సుదర్శన్ 70MM థియేటర్‌లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని స్వయంగా అభిమానులతో కలిసి చూడనున్నారు. ఉమేర్ సందు ఫస్ట్ రివ్యూ ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకుడు ఉమేర్ సందు ‘పుష్ప-2’ పై ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని “బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్”గా అభివర్ణించాడు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ హైలైట్ అని, అల్లు అర్జున్ మళ్లీ నేషనల్ అవార్డు గెలవడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. https://twitter.com/UmairSandu/status/1863865410421960724 అల్లు అర్జున్ మాస్ అవతార్ ఉమేర్ సందు ట్వీట్ చేస్తూ, “అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అతని మాస్ అవతారం ఈ సినిమా కీలక ఆకర్షణ. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు” అని అభినందించారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌&nbsp; సీన్లలో అల్లు అర్జున్‌ అదరగొట్టాడని పేర్కొన్నారు.&nbsp; రష్మిక, ఫహాద్ ఫాజిల్ మెస్మరైజింగ్ రష్మిక మందన్నా సీక్వెల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ, అభిమానుల మన్ననలు పొందిందని ఉమేర్ పేర్కొన్నాడు. రష్మిక- అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ అభిమానులను అలరిస్తుందని పేర్కొన్నారు.&nbsp; అలాగే, ఫహాద్ ఫాజిల్ సెకండ్ పార్ట్‌లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తాడని పేర్కొన్నాడు. తన నటనతో ప్రత్యేకమైన ముద్రవేసాడని అభినందించారు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2 ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల రికార్డులను అధిగమించింది. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Screengrab Twitter: #pushpa2therule ప్రత్యేకమైన మసాలా మూవీగా గుర్తింపు ‘పుష్ప-2’ ని ఇండియన్ సినిమా చరిత్రలో విభిన్నమైన మసాలా మూవీగా ఉమేర్ పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులకు విందుగా ఉంటాయని తెలిపారు. మూడేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ‘పుష్ప-2’ భారీ విజయం సాధించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి. 'పుష్ప-2 ది రూల్'తో అల్లు అర్జున్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. మరి కాసేపట్లో పుష్ప 2 పూర్తి రివ్యూ రానుంది.. అప్‌డేట్స్‌ కోసం YouSay Telugu వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.
    డిసెంబర్ 04 , 2024
    <strong>Unstoppable 4: పవన్‌పై ప్రశ్న.. ఆ విషయంలో నేనే నెం.1: బన్నీ</strong>
    Unstoppable 4: పవన్‌పై ప్రశ్న.. ఆ విషయంలో నేనే నెం.1: బన్నీ
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్‌ సల్మాన్‌, సూర్య ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్లాయి. తాజాగా మరో స్టార్ హీరోకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆయనెవరో కాదు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ఇందులో సినీ హీరోల గురించి బాలయ్య కొన్ని ప్రశ్నలు వేయగా బన్నీ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్‌ వార్‌ జరుగుతున్న వేళ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.&nbsp; పవన్‌పై ఏమన్నారంటే? బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కూడా ఫుల్‌ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా 4వ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇందులో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్‌, బిజినెస్‌ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్‌ కల్యాణ్‌ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్‌ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బన్నీ వ్యాఖ్యలను పవన్ అభిమానులు స్వాగతిస్తున్నారు. https://twitter.com/pakkafilmy007/status/1857292801391628444 ‘ఆ స్టార్‌తో మల్టీస్టారర్‌ చేయాలి’ పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోల ఫొటోలు స్క్రీన్‌పై రాగా వారిపైనా అల్లు అర్జున్‌ (Allu Arjun) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముందుగా మహేష్‌ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్‌ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఫెయిల్యూర్స్‌ తర్వాత వచ్చే ఆయన కమ్‌బ్యాక్స్‌ చాలా బాగుంటాయన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. తాను ప్రతీ ఏటా క్రిస్మస్‌ ట్రీ పెడతానని తెలిసి తనకోసం యూరప్‌ నుంచి డెకరేషన్‌ ఐటెమ్స్‌ తీసుకొచ్చారని తెలిపాడు. అటు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్‌ హీరోల్లో వావ్‌ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. తాను రణ్‌బీర్‌తో మల్టీస్టారర్‌ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ తరం ఫేవరేట్‌ హీరో ఈ జనరేషన్‌ హీరోల్లో నీకు ఇష్టమైన హీరో ఎవరని బాలయ్య ప్రశ్నించగా బన్నీ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్ చేశాడు. ఈ తరం వాళ్లందరూ బాగా నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) యాక్టింగ్‌ తనకు బాగా నచ్చిందని అన్నాడు. తర్వాత నవీన్‌ పొలిశెట్టి చేసిన జాతిరత్నాలు మూవీ చూసి పడి పడి నవ్వుకున్నట్లు తెలిపాడు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), విష్వక్‌ సేన్‌ (Vishwak Sen), అడివిశేష్‌ (Adivi Sesh)లు బాగా నటిస్తున్నట్లు ప్రశంసించాడు. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం సిద్ధూ (Siddhu Jonnalagadda) అని స్పష్టం చేశాడు. మరోవైపు ఇండస్ట్రీలో టాప్‌ డ్యాన్సర్‌ నువ్వే అనుకుంటున్నావా? అని బాలయ్య ప్రశ్నించగా ‘నిజమే సర్‌’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి నేనే నవంబర్‌ వన్‌ డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చాడు. 'ఇండస్ట్రీలో నాకు నేనే పోటీ' ప్రస్తుతం ఇండస్ట్రీలో నీకు ఎవరు పోటీ అని అల్లు అర్జున్‌ను బాలయ్య ప్రశ్నించారు. దీనికి బన్నీ సమాధానం ఇస్తూ పుష్పా 2 టైటిల్‌ సాంగ్‌లోనూ లిరిక్‌ను చదివాడు. 'నన్ను మించి ఎదిగినవాడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే. నాను నేనే పోటీ. అలాగే నేను అందరినీ గౌరవిస్తాను' అంటు బన్నీ సమాధానం ఇచ్చారు. ఇక త్రివిక్రమ్‌, సుకుమార్‌లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటూ బాలయ్య ప్రశ్నించారు. దానిపై బన్నీ మాట్లాడుతూ 'చేస్తున్న దర్శకుడు ఒకరు.. చేయనున్న దర్శకుడు ఒకరు. నేను ఇప్పుడే చెప్పాను కదా.. ఏ సినిమా చేస్తే. ఆ చిత్ర బృందం నా ఫేవరేట్ అని. అందుకే సుకుమార్‌ అంటే ఇష్టం' అని ఆన్సర్ ఇచ్చాడు. https://twitter.com/i/status/1857314917340397862
    నవంబర్ 16 , 2024
    <strong>Adiparvam Movie Review: </strong><strong>దుష్టశక్తిపై దైవశక్తి పోరాటం.. మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మెప్పించిందా?</strong>
    Adiparvam Movie Review: దుష్టశక్తిపై దైవశక్తి పోరాటం.. మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మెప్పించిందా?
    నటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోర్హానా, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్ తదితరులు రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి&nbsp; సంగీతం: మాధవి సైబ సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్ హరీశ్ ఎడిటింగ్: పవన్ శేఖర్ పసుపులేటి నిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్‌, ఏఐ (అమెరికా ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘అమ్మోరు’, ‘అరుంధతి’ వంటి పీరియాడిక్‌ ఫాంటసీ చిత్రాలు టాలీవుడ్‌లో ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ‘అరుంధతి’ తర్వాత ఆ స్థాయి ఫాంటసీ డ్రామా చిత్రాలు ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ క్రమంలో ఆ జానర్‌లో మంచు లక్ష్మీ నటించిన చిత్రం 'ఆదిపర్వం' (Adiparvam Movie Review). సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆదిత్య ఓం, ఎస్తర్‌, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? మంచు లక్ష్మీ తన నటనతో మెప్పించిందా? విజయాన్ని తన ఖాతాలో వేసుకుందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి కడప దగ్గర్లోని ఎర్రగుడిలో (Adiparvam Movie Review) గుప్తనిధులు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు. ఆ నిధిని దక్కించుకుంటే రాయలసీమలోనే గొప్ప సంపన్నులు అవుతారని అంతా భావిస్తుంటారు. దీంతో ఆ నిధి సొంతం చేసుకునేందుకు కడప ఎమ్మెల్యే నాగమ్మ (మంచు లక్ష్మీ) ప్రయత్నిస్తుంటుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు రాయప్ప అనే గ్రామపెద్ద కూడా నిధి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ నిధి కోసం రాయప్ప, నాగమ్మ ఎలాంటి అరాచకాలు చేశారు? ఈ క్రమంలో రాయప్ప తన కూతురు బుజ్జమ్మ (శ్రీజిత)ను ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెను ఎందుకు చంపాలనుకుంది? రాయప్ప, నాగమ్మ ఆగడాలను దేవత మారెమ్మ (సుహాసిని) ఏ విధంగా అడ్డుకుంది? నిధి దక్కించుకోవాలన్న నాగమ్మ కోరిక తీరిందా? లేదా? బుజమ్మ, శ్రీను (వెంకట కిరణ్‌)ల ప్రేమ వ్యవహారం ఏమైంది? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే నాగమ్మ పాత్రకు మంచు లక్ష్మీ (Adiparvam Movie Review) పూర్తిగా న్యాయం చేసింది. పవర్‌ఫుల్‌ నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ఆమె అదరగొట్టింది. ఎలాగైన నిధిని దక్కించుకోవాలన్న నెగిటివ్‌ షేడ్‌ పాత్రలో తన మార్క్‌ చూపించింది. ప్రేమజంటగా చేసిన వెంకట్‌ కిరణ్‌, శ్రీజిత మంచి నటన కనబరిచారు. దేవత పాత్రలో చంటిగాడు ఫేం సుహాసిని ఆకట్టుకుంది. రాయప్ప పాత్రలో సత్యప్రకాశ్‌ బాగా చేశాడు. మంచి లక్ష్మీకి దీటుగా నటించారు. ఎస్తర్‌ హాట్‌హాట్‌గా కనిపించి అలరించింది. శివ కంఠమనేని, సమ్మెట గాంధీ, ఆదిత్య ఓం తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే 1974-1990ల సమయంలో యధార్థంగా జరిగిన ఘటనల ఆధారంగా దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఈ సినిమా తెరకెక్కించారు. ఒక నిధిని వశం చేసుకోవడానికి నరబలి, తమ స్వార్థం కోసం కన్న బిడ్డను బలి ఇవ్వానుకోవడం దాని పర్యవసానాలు దర్శకుడు చక్కగా చూపించారు. నిధి కోసం ప్రాకులాడే ఇద్దరు స్వార్థపరులను ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాన్న సీక్వెన్స్‌ మెప్పిస్తుంది. ఎర్రగుడి గ్రామ దేవత మారెమ్మ తన గుప్త నిధిని ఎలా కాపాడుకుంది? తనని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలిచింది? అని తనదైన శైలిలో దర్శకుడు చూపించారు. ఈ క్రమంలో జరిగే దైవ, దుష్ట శక్తుల మధ్య ఫైట్‌ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. అటు బుజ్జమ్మ, శ్రీనుల లవ్‌ ట్రాక్‌ కూడా బాగానే చూపించారు డైరెక్టర్‌. అయితే రొటిన్‌ స్టోరీ కావడం, కథలో నాటకీయత మరీ ఎక్కువగా ఉండటం, గ్రాఫిక్స్‌లో నాణ్యత లేకపోవడం మైనస్‌గా మారాయి.&nbsp; టెక్నికల్‌గా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Adiparvam Movie Review).. హరీష్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను భారీగా ఎలివేట్ చేసింది. ఫస్టాఫ్‌ విషయంలో ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్ టీమ్ ఇంకాస్త బెటర్ పర్‌ఫార్మెన్స్‌ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ మంచు లక్ష్మీ నటనదైవ, దుష్ట శక్తి మధ్య ఫైట్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీపూర్‌ గ్రాఫిక్స్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 09 , 2024
    <strong>Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్‌ పెంచిన రామ్‌చరణ్!</strong>
    Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్‌ పెంచిన రామ్‌చరణ్!
    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్‌ ఛేంజర్ టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; టీజర్‌ గ్రాండ్‌ రిలీజ్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.&nbsp; https://youtu.be/OXe7N7-xMKM?si=BCd-Cbbs34DeiwT2 త్రీ డిఫరెంట్‌ లుక్స్‌లో… కాలేజీ బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అన్న డైలాగ్‌తో టీజర్‌ మెుదలైంది. ఇందులో చరణ్‌ త్రీ డిఫరెంట్‌ డైమన్షన్స్‌లో కనిపించాడు. పాతకాలం వ్యక్తిలా, కాలేజీ కుర్రాడిలా, ప్రభుత్వ ఆఫీసర్‌గా ఇలా మూడు లుక్స్‌ అదరగొట్టాడని చెప్పవచ్చు. టీజర్‌ను ఎక్కువగా యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్‌తో అదిరిపోయే BGMతో పర్ఫెక్ట్‌గా కట్‌ చేశారు. చివర్లో చరణ్ ‘ఐ యాం అన్ ప్రిడిక్టబుల్’ అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని రామ్ చెప్పకనే చెప్పాడు.&nbsp; ఫ్యాన్స్‌.. మాస్‌ సెలబ్రేషన్స్‌ గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్ణాటకలోని 11 నగరాల్లో 11 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రతిభా థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అటు ఏపీలోని వైజాగ్‌ (సంగం-శరత్‌ థియేటర్‌), రాజమండ్రి (శివజ్యోతి థియేటర్‌), విజయవాడ (శైలజా థియేటర్‌), కర్నూల్‌ (వి మెగా థియేటర్‌), నెల్లూర్‌ (S 2 థియేటర్‌), బెంగళూరు (ఊర్వశి థియేటర్), అనంతపూర్‌ (త్రివేణి థియేటర్‌), తిరుపతి (పీజీఆర్‌ థియేటర్) నగరాల్లో టీజర్‌ విడుదలైంది. టీజర్‌ రిలీజ్‌కు ముందే భారీగా అయా థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/censorReport_/status/1855228209064759425 https://twitter.com/Rams41380829/status/1855228328787235323 https://twitter.com/sivacherry9/status/1855214405321101433 https://twitter.com/TweetRamCharan/status/1855215658340065747 https://twitter.com/Rishi_JSP/status/1855228307438190787 https://twitter.com/megafanforever3/status/1855228287502414266 తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌! ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్‌ నిర్వహించాలని మూవీ టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్‌ ప్లేసులో ఈవెంట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్‌ చరణ్‌ బాబాయ్ అయిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్‌ ఆహ్వానాన్ని పవన్‌ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్‌ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.&nbsp; దిల్‌ రాజు 50వ చిత్రంగా.. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఫిల్మ్‌ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్‌ ఛేంజర్‌ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్‌ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్‌ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్‌ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్‌ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్‌ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, ఆదిత్య రామ్‌ మూవీస్‌ సంస్థలు 'గేమ్‌ ఛేంజర్‌'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
    నవంబర్ 09 , 2024
    <strong>Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!</strong>
    Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌' సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్‌ సల్మాన్‌ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్​కమింగ్ మూవీ 'కంగువా' (Kanguva) ప్రమోషన్స్​లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్‌, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూర్య సీక్రెట్‌ రివీల్‌ చేసిన కార్తీ! బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్‌ కూడా ఫుల్‌ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్‌ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్‌ చేసిన సూర్య బ్లాక్‌ గ్లాసెస్‌ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్‌ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్‌’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్‌ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్‌ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్‌ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు. https://twitter.com/ahavideoIN/status/1853655983760998850 కంటతడి పెట్టిన సూర్య తాజా టీజర్‌ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్‌ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్‌, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.&nbsp; 10 వేల స్క్రీన్స్‌లో విడుదల ‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు.&nbsp; ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. రిలీజ్ ఎప్పుడంటే? ఇక 'కంగవా' విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?</strong>
    Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?
    టాలీవుడ్‌ ప్రేమ జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒకరు. వీరిద్దరికి వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 6, 2011లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యింది. వీరికి అయాన్‌, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బన్నీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇద్దరు పిల్లల్ని అల్లు స్నేహానే చూసుకుంటోంది. వారికి ఆలనా పాలనా దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతేకాదు వారికి బోర్‌ ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తమ పిల్లల్లో ఫుల్‌ జోష్‌ నింపేందుకు ఇంట్లో కిడ్స్‌ పార్టీ నిర్వహించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పిల్లలకు గ్రాండ్‌ పార్టీ! అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి తమ పిల్లల కోసం ‘వీకెండ్‌ స్లీప్‌ఓవర్‌’ పార్టీ నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఈ పార్టీ నిర్వహించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అల్లు అయాన్‌, కూతురు అర్హా ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించిన స్నేహా వారిని ఈ పార్టీలో భాగస్వామ్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు స్నేహా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం విశేషం. ‘బాయ్స్ అండ్‌ గర్స్‌ #వీకెండ్‌’ పేరుతో ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన ఫ్రెండ్స్‌ను అయాన్‌ సర్‌ప్రైజ్‌ చేయడం వీడియోలో గమనిపించవచ్చు. మరోవైపు అర్హా ఇంట్లోని అవార్డ్స్‌ను ఫ్రెండ్స్‌కు చూపించి ఎంతగానో మురిసిపోయింది. అంతేకాదు అయాన్‌ తన స్నేహితులతో స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి ఎంతో సరదాగా గడిపాడు. స్విమ్మింగ్‌ చేస్తూ బాల్‌తో ఆడుకున్నాడు. అదే విధంగా ఇంటికి వచ్చిన చిన్నారులకు స్నేహా హెల్తీ ఫుడ్‌ను అరేంజ్‌ చేసి పెట్టింది. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) అట్లతద్ది సెలబ్రేషన్స్‌ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, ఫ్యామిలీ ఈవెంట్‌ జరిగినా వెంటనే ఆమె షేర్‌ తన అభిమానలతు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల అట్లతద్ది సందర్భంగా కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ఆ రోజున తెల్లవారుజామునే లేచి పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి అట్లతద్ది సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) స్నేహా బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ అల్లు స్నేహారెడ్డి గత నెల 29న 40 పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేశారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/FilmyBowl/status/1840610091973611849
    అక్టోబర్ 26 , 2024

    @2021 KTree