• TFIDB EN
  • జులాయి
    UATelugu2h 32m
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    రవీంద్ర రవి నారాయణ్
    Ravi love interest
    సోనూ సూద్
    బిట్టు
    రాజేంద్ర ప్రసాద్
    DIG సీతారాం IPS (రవి స్నేహితుడు మరియు గురువు)
    కోట శ్రీనివాసరావు
    ఎమ్మెల్యే వరదరాజులు
    తనికెళ్ల భరణి
    రవి తండ్రి
    బ్రహ్మానందం
    వీరిలో సీతారాం సేవకుడిని ఉంచుకున్నారు
    అలీ
    అతిధి పాత్ర
    రావు రమేష్
    ACP రాజ మాణిక్యం IPS
    బ్రహ్మాజీ
    ట్రావెల్ మూర్తి (ట్రావెల్ ఏజెంట్)
    షఫీ
    బిట్టు తమ్ముడు
    ఎంఎస్ నారాయణ
    సబ్-ఇన్‌స్పెక్టర్ వాల్మీకి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    మధు తండ్రి
    శీతల్ మీనన్
    బిట్టు ప్రేమ ఆసక్తి
    తులసి
    కామేశ్వరి
    హేమ
    సుజాత
    శ్రీముఖి
    రవి సోదరి
    రవి ప్రకాష్
    బిట్టు అనుచరుడు
    ప్రదీప్ మాచిరాజు
    రవి స్నేహితుడు fm స్టూడియోలో పనిచేస్తున్నాడు
    సప్తగిరి
    రవి స్నేహితుడు
    అమిత్ తివారీ
    బిట్టు అనుచరుడు
    వంశీ కృష్ణ
    బిట్టు అనుచరుడు
    పోసాని కృష్ణ మురళి
    క్లబ్ ఓనర్
    గౌతమ్ రాజు
    పోలీస్ కానిస్టేబుల్
    శివన్నారాయణ నారిపెద్ది
    టీ అమ్మేవాడు
    కల్పికా గణేష్
    నేహా
    శ్రవణ్సత్తారు
    ప్రభుప్రభు
    వెన్నెల కిషోర్
    కేఫ్‌లో కస్టమర్
    రఘు బాబు
    కస్టమర్
    అనంత్ బాబు
    పూజారి
    ధనరాజ్
    ఆసుపత్రిలో రోగి
    రజిత
    రవి పొరుగు
    సన్నీదొంగ
    వెంకట గిరిధర్ వజ్జ
    ఉదయ భాను
    రాజు సుందరం
    ప్రకాష్ రాజ్
    సిబ్బంది
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    దర్శకుడు
    ఎస్. రాధా కృష్ణ
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ప్రవీణ్ పూడి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల జాతర చేస్తోంది. ఒక్క పక్క టెలివిజన్ షోలు చేస్తూనే ఇన్‌స్టాలో హాట్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. కొద్దిరోజులుగా శ్రీముఖి ఇన్‌స్టాలో హట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది. తాజాగా మిల్కీ వైట్, లైట్ పింక్ లెహంగాలో ఈ శ్రీముఖి తళుక్కున మెరిసింది. ఎప్పటికప్పుడూ హాట్ ఫొటో షూట్లతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తన ప్రతి గ్లామరస్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. బిగ్ బాస్ 3 రన్నరప్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. అప్పట్లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ పొత్తినేని సిస్టర్ క్యారెక్టర్ చేసింది.  తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాలోనూ శ్రీముఖి మెరిసింది. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఈ అల్లరి పిల్ల ఎదురుచూస్తోంది. బీబీజోడీ, పటాస్ వంటి టెలివిజన్ షోలతో క్రేజ్ సంపాదిస్తోంది. మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ దూసుకెళ్తోంది
    ఏప్రిల్ 06 , 2023
    <strong>Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!</strong>
    Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!
    టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్‌ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్‌-రాజమౌళి, త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌, తారక్‌ - కొరటాల శివ, అల్లు అర్జున్‌-సుకుమార్‌, హరీష్‌ శంకర్‌-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్‌ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్‌ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్‌ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయకొచ్చాయి.&nbsp; ముహోర్తం ఫిక్స్‌! అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్‌ చేసి ఆ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.&nbsp; ఆ ఇద్దరిలో ఎవరు! బన్నీ-త్రివిక్రమ్‌ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ భామలు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), అలియా భట్‌ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్‌ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; హ్యాట్రిక్ హిట్స్‌ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’తో బిజీ బిజీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో 'పుష్ప 2' (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప' (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
    ఆగస్టు 07 , 2024
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    Guntur Kaaram: త్రివిక్రమ్‌తో ఆ విషయంలో కుదరకే పూజా హెగ్డే బయటకొచ్చిందా? సంయుక్త మీనన్ ఎంట్రీ!
    మహేష్ బాబు, త్రివిక్రమ్(Mahesh Babu-Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ గురించి ఏదొక వివాదం చర్చలకు మూల కేంద్రంగా మారుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్పులే మార్పులు ఇప్పటికే స్టోరీ మహేష్‌బాబుకు తగ్గట్టు లేదని ఓసారి మార్చివేశారు. కొన్ని కారణాల వల్ల ఫైట్ మాస్టర్స్‌ను తొలగించారు. రెండు షెడ్యూల్స్‌లో జరిగిన షూటింగ్‌ను కంప్లీట్‌గా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూజా హెగ్డే సైతం బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫలితంగా ఈ చిత్రం కాస్టింగ్‌లో భారీగా మార్పులు రానున్నాయి. పూజా హెగ్డే స్థానంలో మరొక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త మీనన్‌ లేదా త్రిషను సినిమాలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. అదే అసలు సమస్య డేట్ సమస్యల కారణంగా పూజా హెగ్డే సినిమా నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. జూన్- ఆగస్టు టైమ్‌ఫ్రేమ్‌లో పూజా హెగ్డే ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. ఈ టైమ్‌లో గుంటూరు కారం సినిమా వల్ల ఇతర చిత్రాల షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుందని ఆమె భావించిందని సమాచారం. షెడ్యూల్స్ సరైన టైమ్‌కి పూర్తికాకపోవడం, కొన్ని సీన్లు రీషూట్ చేయడం, అనుకున్న సమయానికి షెడ్యూల్స్ పూర్తికాకపోయినా.. కొత్త షెడ్యూల్స్ ప్రకటించడం, కొన్ని షెడ్యూల్స్‌లో జరిగిన సన్నివేశాలను రీ షూట్ చేయడం వంటి వాటి పట్ల పూజా హెగ్డే తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేందుకే.. గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే వైదొలిగినట్లు తెలిసింది. తమన్ తప్పుకున్నట్లు ప్రచారం.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. తమన్‌కు బదులు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు బజ్ నడిచింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. కావాలని కొంత మంది కడుపు మంటతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కడుపుమంట ఉన్నవాళ్లు తన ఆఫీస్ వద్దకు రావాలని సూచించారు. ఆఫీస్ ముందు మజ్జిగ స్టాల్ ఏర్పాటు చేశానని అక్కడ ఫ్రీగా మజ్జిగ తాగి కడుపు మంట తగ్గించుకోవాలని సూచించారు.&nbsp; ఈసారి తాను అందించే మ్యూజిక్‌తో బాక్స్‌లు బద్దలు అవుతాయని చెప్పుకొచ్చారు. https://twitter.com/MusicThaman/status/1670846867650002946?s=20 పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్? పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. మహేష్ సరసన సంయుక్త మీనన్‌(Samyuktha Menon)ను హీరోయిన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు టాక్. సంయుక్త మీనన్ కాకపోతే.. త్రిష(Trisha)ను కూడా సంప్రదించాలని భావిస్తున్నారట. మరి పూజా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవర్నీ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. https://twitter.com/SSMB28_29/status/1671043502451609601?s=20 పూజా ఓవర్ యాటిట్యూడ్ అయితే కొంత మంది అభిమానులు పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు పూజా హెగ్డేను ఎంకరేజ్ చేయడం ఆపాలని సూచిస్తున్నారు. ఆమెకు తెలుగు సినిమాలంటే గౌరవం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభాస్‌తో తీసిన సినిమాలోనూ ఇదే జరిగిందని కామెంట్ చేస్తున్నారు.&nbsp; ప్రమోషన్స్ విషయంలో హిందీ, తమిళ్‌ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వదని ఏకిపారేస్తున్నారు. https://twitter.com/898SAG/status/1671025365240942595?s=20 పూజా హెగ్డే స్థానంలో కియరా అద్వానిని మహేష్‌కు జోడీగా తీసుకొస్తే బాగుంటుందని మరికొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.&nbsp; మూవీ బృందం క్లారిటీ గుంటూరు కారం మూవీలో జరుగుతున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పూజా హెగ్డేని హీరోయిన్‌గా మూవీ నుంచి తీసివేసే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.&nbsp; సినిమా షూటింగ్ 24 జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది అని స్పష్టం చేసినట్లు తెలిసింది. https://twitter.com/TheAakashavaani/status/1671040847054528512?s=20 అల్లు అర్జున్‌తో మళ్లీ... మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనుండగా... నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు వచ్చాయి.
    జూన్ 20 , 2023
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.&nbsp; అరవింద సమేత వీరరాఘవ హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=qmqQHtla20w S/O సత్యమూర్తి ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’&nbsp; (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది. https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ అజ్ఞాతవాసి ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు. https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc జులాయి తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U ఖలేజా&nbsp; మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.  https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
    జూన్ 12 , 2023
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,&nbsp; డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.&nbsp; అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే.. ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.&nbsp; అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.&nbsp; ఎవరెలా చేశారంటే? నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.&nbsp; నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.&nbsp; అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. &nbsp;సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5
    మే 26 , 2023
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.&nbsp; View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) తల్లి కాబోతుంది గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్‌ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్‌ న్యూస్‌ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) ఇలియానా జీవితం కెరీర్‌ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం. &nbsp; ఆమె సోదరుడితో డేటింగ్ ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.&nbsp; తండ్రి ఎవరు?&nbsp; ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా&nbsp; ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.&nbsp; పరిచయం చేస్తుందా? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్‌. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. టాప్ హీరోయిన్ దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 18 , 2023
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం&nbsp; సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)&nbsp; షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.&nbsp;&nbsp; అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా&nbsp; ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.&nbsp; సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’&nbsp; (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా&nbsp; ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.&nbsp; ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.&nbsp;
    మార్చి 14 , 2024
    <strong>Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?</strong>
    Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?
    నటీనటులు : ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌, ఎమ్మా కొరిన్‌, మోరెనా బాక్రియన్‌, రామ్‌ డెలనే, లస్లీ ఉగ్గమ్స్‌, ఆరోన్‌ స్టాన్‌ఫోర్డ్‌ తదితరులు దర్శకత్వం : షాన్‌ లెవీ సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచ్‌మండ్ సంగీతం : రాబ్‌ సిమన్‌సెన్‌ ఎడిట‌ర్ : డీన్ జిమ్మెర్‌మాన్, షేన్ రీడ్ నిర్మాణ సంస్థ : మార్వెల్‌ స్టూడియోస్‌, మ్యాక్జిమమ్‌ ఎఫర్ట్‌, 21 ల్యాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల తేదీ : 26 జులై, 2024 మార్వెల్‌ (Marvel) చిత్రాల సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. భారత్‌లోనూ మార్వెల్‌ చిత్రాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సూపర్‌ హీరో కామిక్‌ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి రూపొందిన మరో చిత్రమే 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' (Deadpool &amp; Wolverine). ఇద్దరు సూపర్‌ హీరోల కలయికతో రూపొందిన ఈ చిత్రం కోసం ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జులై 26న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వాల్వెరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే? డెడ్‌పూల్‌ పాత్రలో ర్యాన్‌ రెనాల్డ్స్‌ తనదైన నటనతో అదరగొట్టాడు. పూర్తిగా వినోదాన్ని పండిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపాడు. వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్‌ చేసిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. లెజండరీ నటుడు హ్యూ జాక్‌మాన్‌ వాల్వెరైన్ పాత్రలో అద్భుతం చేశాడు. తన సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కసండ్రా పాత్రలో ఎమ్మా కోరిన్ ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ రోల్స్‌లో మెప్పించారు. తమ ఎంపిక సరైందని నిరూపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు షాన్‌ లెవీ అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఫన్‌ వేలో కథను నడిపించడం సినిమాకు బాగా కలిసొచ్చింది. డెడ్‌పూల్‌ మాటలు, సెటైర్స్‌, వన్‌లైనర్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికే సరిపోగా సెకండాఫ్‌ నుంచి అసలైన కథలోకి ఆడియన్స్‌ను తీసుకెళ్లారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్స్‌ వరకూ అదరహో అనిపిస్తుంది. అయితే సాలిడ్ ఎమోషన్స్‌ కూడా జోడించి ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది.&nbsp; ఓవరాల్‌గా ఒక మంచి సూపర్‌ హీరోల చిత్రాన్ని చూడాలనుకునేవారికి డెడ్‌పూల్‌ అండ్‌ వాల్వెరైన్‌ మంచి అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా తెలుగులోని డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; నేపథ్య సంగీతం చాలా బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM బాగా ఎలివేట్‌ చేసింది. అలాగే&nbsp; తెలుగు డబ్బింగ్‌ అదిరిపోయింది. పరిస్థితులకు డైలాగ్స్‌ బాగా సింక్‌ అయ్యాయి. అటు గ్రాఫిక్స్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరించింది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది.&nbsp; నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌యాక్షన్‌ సీక్వెన్స్‌డైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌ఎమోషనల్ టచ్‌ లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;&nbsp;
    జూలై 26 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే?&nbsp;
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్ సంగీతం: సురేష్‌ బొబ్బలి సినిమాటోగ్రఫీ: అజాజ్‌ మహ్మద్‌ ఎడిటింగ్‌: శ్రీధర్‌ సోంపల్లి నిర్మాత: రాజశేఖర్‌ మేడారం శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘#90's. ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్‌ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం. కథ చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్‌. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్‌ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారంటే చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ &amp; లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్‌ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు. టెక్నికల్‌గా సాంకేతికంగా #90’s సిరీస్‌ బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది.&nbsp;అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్‌ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం&nbsp; మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3/5
    జనవరి 05 , 2024
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
    దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి&nbsp; పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం. ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie) కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా&nbsp; ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.&nbsp; మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ (GHOST) కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది. ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal&nbsp;MoviePortuguese&nbsp;NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series&nbsp;SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie&nbsp;KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul&nbsp;MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece&nbsp;SeriesTelugu Dubbed&nbsp;Disney Plus HotstarOctober 25&nbsp; Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist&nbsp;SeriesEnglishApple Plus TVOctober 27
    అక్టోబర్ 26 , 2023
    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!
    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!
    ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘డీప్‌ ఫేక్‌ సాంకేతికత’ (Deep Fake Technology)కు కృత్రిమ మేధ (AI) మూల కారణమని చెప్పొచ్చు. ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు సినిమా రూపురేఖలనే మార్చేస్తున్నారు. పలు సూపర్‌ హిట్ సినిమాలకు సంబంధించిన సీన్లను తమకు నచ్చిన హీరో ముఖాలతో మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు డీప్‌ ఫేక్‌ (Deep Fake) అంటే ఏమిటీ? అది ఎలా పనిచేస్తుంది? దీనికి సంబంధించిన వైరల్‌ వీడియోలు ఏవి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; ఎలా పనిచేస్తుంది? ‘డీప్‌ ఫేసింగ్‌’ గురించి సాధారణ భాషలో చెప్పాలంటే మార్ఫింగ్‌ అని అర్ధం. డీప్‌ ఫేకింగ్‌ కోసం ఎన్‌కోడర్స్‌, డీకోడర్స్‌ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఎన్‌కోడర్స్‌ రెండు చిత్రాల కదలికలను క్షుణ్నంగా పరిశీలించి, వాటి మధ్య సారూప్యతను పసిగడుతుంది. ఇక డీకోడర్స్‌ ముఖాలను మార్చేస్తుంది. అయితే ఎంత బాగా మార్ఫింగ్‌ చేసినా కొంత లోటు ఉంటుంది. చూసే కళ్లకు అది డీప్‌ ఫేకింగ్‌ ఏమో అన్న అనుమానం కచ్చితంగా కలుగుతుంది. అయితే కొందరు మాత్రం మరింత అడ్వాన్స్‌డ్‌ సాంకేతికతను సంధించి డీప్‌ ఫేక్‌ వీడియోను మరింత సహజంగా మార్చేస్తున్నారు. షోలే.. డీప్‌ ఫేక్‌ బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘షోలే’ చిత్రాన్ని కూడా ఇటీవల డీప్‌ ఫేక్‌ చేశారు. అందులోని పాత్రలను హాలీవుడ్‌ యాక్టర్ల ముఖాలతో మార్ఫింగ్‌ చేశారు. హాలీవుడ్‌ వర్షన్‌ షోలే మూవీ ఈ స్టైల్‌లో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ డీప్‌ ఫేక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. సినిమాలోని జై (అమితాబ్‌ బచ్చన్‌) పాత్రలో అలనాటి హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డి నిరో (Robert De Niro) ఫేస్‌ను మార్ఫింగ్‌ చేశారు. ధర్మేంద్ర పాత్రలో అల్‌ పాసినో (Al Pacino), బాసంతి క్యారెక్టర్‌ను జులియా రాబర్ట్స్‌ , గబ్బర్‌ సింగ్‌ పాత్రను జాక్‌ నికోల్సన్‌ (Jack Nicholson), థాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ పాత్రలో కెవిన్‌ స్పేసీ (Kevin Spacey) ముఖాలను మార్ఫింగ్‌ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్‌ అవుతున్నారు. పాత్రలు చాలా బాగా సింక్‌ అయ్యాయని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రయత్నం అసలు బాగోలేదని బదులిస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Shadygraphics.ai (@shadygrqphics.ai) కంగనా, హృతిక్‌&nbsp; హాలీవుడ్‌లో రిలీజైన బార్బీ (Barbie) ఇటీవల ఓ వ్యక్తి డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్‌ చేశాడు. బార్బీ చిత్ర ట్రైలర్‌ను బాలీవుడ్‌ నటులు కంగనా రనౌత్, హృతిక్‌ రోషన్‌లతో డీప్‌ ఫేక్‌ చేయడం విశేషం. ఇందులో బార్బీ గార్ల్‌గా కంగనా కనిపించింది. ర్యాన్‌ గోస్లింగ్‌ (Ryan Gosling) పాత్రలో హృతిక్‌ సైతం అద్బుతంగా సెట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంగనా నిజంగానే బార్బీ గార్ల్‌ లా ఉందని పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker) స్క్విడ్‌ గేమ్‌&nbsp; ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, తమన్నా బాయ్ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో ఓ వ్యక్తి స్వ్కిడ్‌ గేమ్‌ సిరీస్‌ను డీప్‌ ఫేక్‌ చేశాడు. అందులోని వివిధ పాత్రలకు బాలీవుడ్‌ స్టార్‌ క్యాస్ట్‌ నసీరుద్దీన్‌ షా, తాప్సీ పన్ను, ఆలియా భట్‌, కంగనా రనౌత్, ఇషాన్‌ ఖట్టర్‌, నితిన్‌ ముఖేశ్‌ ముఖాలను మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కూడా నెట్టింట తెగ పాపులర్ అయ్యింది.&nbsp; View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker) టెర్మినేటర్‌&nbsp; హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ టెర్మినేటర్‌ను సైతం డీప్‌ ఫేక్‌ చేశారు. ఇందులా ఆర్నాల్డ్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by The Indian Deepfaker (@the_indian_deepfaker)
    ఆగస్టు 04 , 2023
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.&nbsp; అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్‌తో సలార్ లింక్ సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్‌ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి చూపించారు.  అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్‌)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు.&nbsp; ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్‌) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.&nbsp; ఫ్యాన్స్ రచ్చ రచ్చ మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్‌ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్‌ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.&nbsp; సలార్‌తో నడిచేది వీరే.. ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని&nbsp; కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
    జూలై 06 , 2023
    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్
    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్
    బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రాలతో పాన్‌ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్‌ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్‌ మూవీని మహేష్‌ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.&nbsp; https://twitter.com/fanaticbuff/status/1644059697098510380?s=20 మహేష్‌తో చేయబోయే చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి కసరత్తు చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంచర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB28 చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బాబు బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను ఫాస్ట్‌ ఫాస్ట్‌గా ఫినిష్‌ చేసేందుకు మహేష్‌ కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూట్‌ పూర్తి కాగానే రాజమౌళి ప్రాజెక్ట్‌లో మహేష్‌ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దీంతో SSMB 29 షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 07 , 2023
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలివుడ్‌ డైరెక్టర్‌పై రేప్‌ ఆరోపణలు..సౌత్‌ దర్శకులు,యాక్టర్లపై ప్రశంసలు కురిపించిన హీరోయిన్
    బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనను రేప్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్‌ పాయల్ ఘోష్. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ప్రేమను కురిపించింది.&nbsp;సౌత్‌లో అవార్డులు గెలుచుకున్న ఇద్దరు దర్శకులతో పనిచేసినప్పటకీ కనీసం వాళ్లు టచ్‌ కూడా చేయలేదంటూ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్‌తో నటించానని… ఒక్కరోజు కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. అందుకే సౌత్ ఇండస్ట్రీ అంటే తనకిష్టమంటూ పేర్కొంది ఈ సుందరి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.&nbsp; మూడో మీటింగ్‌లోనే అనురాగ్ కశ్యప్‌ను టార్గెట్‌ చేసుకొని మీటూ వేదికగా విమర్శలు గుప్పించింది ఈ బెంగాల్ భామ. “ అసలు అతడితో కలిసి పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్లకు ఇంకా బాలీవుడ్‌లో పని దొరుకుతుండటం బాధాకరం” అన్నారు. ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చిన పాయల్ ఘోష్ ఎవరనే విషయాన్ని వెతుకుతున్నారు చాలామంది. తారక్‌తో ఏ సినిమాలో నటించిందని ఆలోచిస్తున్నారు.&nbsp;&nbsp; ఎవరీ పాయల్‌ 17 సంవత్సరాల వయసులోనే&nbsp; నటనలోకి అడుగుపెట్టింది పాయలో ఘోష్. షార్ప్స్‌ పెరిల్‌ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది. తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది. కశ్యపై కేసు గతంలోనే అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది ఈ హీరోయిన్. 2013లో ముంబయిలోని యారీ రోడ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 2022 సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిి కశ్యప్ కొట్టి పారేశారు. పోలీసుల విచారణకు హాజరైన అతడు… ఆ సమయంలో శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నట్లు ఆధారాలు కూడా సమర్పించాడు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.&nbsp; తెలుగులోకి ఎంట్రీ అకాడమీలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి పరిచయం కావటంతో ఆయన తెరకెక్కించిన ప్రయాణం చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. మంచు మనోజ్‌ ఇందులో హీరోగా నటించాడు. తర్వాత Mr. రాస్కెల్‌ సినిమాలో చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా మెరిసింది ముద్దుగుమ్మ.&nbsp; రాజకీయ నాయకురాలు ప్రస్తుత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 2020లో జాయిన్ అయ్యింది పాయల్‌. అదే రోజున మహిళల విభాగానికి ఉపాధ్యక్షురాలుగా నియమించారు.&nbsp; ‌అప్పట్నుంచి రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్‌పైన విమర్శలు చేసింది. విదేశాల్లో మన దేశం పరువు తీశాడని ఆరోపించింది. సినిమాలు ప్రస్తుతం రెండు సినిమాల్లో పాయల్ ఘోష్ నటిస్తుంది. పటేల్‌కి పంజాబ్‌ షాదీ, కోయి జానే నా అనే చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.&nbsp;
    మార్చి 19 , 2023
    <strong>Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?</strong>
    Raayan Day 1 Collection: ‘రాయన్‌’ను దెబ్బతీసిన హాలీవుడ్‌ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
    కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రాయన్‌' (Rayaan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ముఖ్య పాత్ర పోషించాడు. ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj), ఎస్‌.జే. సూర్య (S.J Surya), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రం జులై 26న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. రొటిన్ రివేంజ్‌ డ్రామా అని నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చినప్పటికీ ధనుష్‌ యాక్టింగ్‌, డైరెక్షన్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిశాయి. సినిమా తమకు బాగా నచ్చిందని మెజారిటీ ప్రేక్షకులు నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయన్‌ తొలి రోజు ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. తొలి రోజు వసూళ్లు ఎంతంటే? ధనుష్‌ కెరీర్‌లో 50వ చిత్రంగా ‘రాయన్‌’ రూపొందింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన (జులై 26) ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20.7 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రూ.15.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే 'రాయన్‌'కు తమిళనాడులో అత్యధికంగా&nbsp; రూ.10.6 కోట్లు వచ్చాయి. ఏపీ &amp; తెలంగాణలో రూ. 2 కోట్లు, కర్ణాటకలో రూ.1.8 కోట్లు, కేరళలో రూ.90 లక్షలు, రెస్ ఆఫ్‌ ఇండియా రూ.40 లక్షలు వసూలైనట్లు వివరించాయి. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; డెడ్‌పూల్‌ వోల్వరైన్‌ డామినేషన్‌ మార్వెల్‌ సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ‘రాయన్‌’కు ఈ హాలీవుడ్‌ చిత్రం నుంచి గట్టిపోటీ ఎదురైంది. దేశంలోని సినీ ఆడియన్స్‌ ఈ మార్వెల్‌ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బుక్‌మైషోలో రాయన్‌కు 2 లక్షల 73 వేల టికెట్లు బుక్‌ అయితే ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’కు 3 లక్షల 25 వేల బుకింగ్స్‌ వచ్చాయి. ఈ హాలీవుడ్‌ చిత్రానికి దేశంలో తొలి రోజు రూ. 21.5 కోట్లు (NET) వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రూ.11.7 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.1.1 కోట్లు వసూలైనట్లు వివరించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రాయన్‌’ వసూళ్లను ఈ హాలీవుడ్‌ చిత్రం ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థమవుతుంది.&nbsp; ‘రాయన్‌’లో హైలెట్స్‌ ఇవే! గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ 'రాయన్‌' సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. న‌ట‌నే కాదు త‌న‌లో ఎంత మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడో కూడా ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు. కథగా చూస్తే ‘రాయన్‌’లో కొత్త‌ద‌న‌ం ఏమీ కనిపించదు. అయితే కొన్ని మ‌లుపులు, కుటుంబ డ్రామా, క‌థా నేప‌థ్యం ఈ సినిమాను ప్ర‌త్యేకంగా మార్చేశాయి. ఒక మామూలు క‌థ‌ని ధ‌నుష్ త‌న అండ‌ర్ ప్లే న‌ట‌న‌తో, వైవిధ్య‌మైన కొన్ని మాస్ ఘ‌ట్టాల‌తో ర‌క్తి క‌ట్టించాడు. ఎ.ఆర్‌.రెహమాన్ నేప‌థ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఆయన ఈ సినిమాకు సెకండ్‌ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ కూడా వచ్చాయి. ‘రాయన్‌’ కథ ఏంటంటే రాయన్‌ (ధనుష్‌) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్‌ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్‌.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్‌ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్‌ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్‌ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.&nbsp; ‘డెడ్‌పూల్‌ &amp; వోల్వరైన్‌’ స్టోరీ ఇదే డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వోల్వరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వోల్వరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
    జూలై 27 , 2024
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024

    @2021 KTree