• TFIDB EN
 • KGF: చాప్టర్ 1
  U/ATelugu2h 35m
  రాకీ అనే యువకుడు, చనిపోయిన తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అధికారం, సంపద కోసం పోరాడుతాడు. అతను తను ఎదిగే క్రమంలో బంగారం మాఫియాతో తలపడుతాడు.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  యష్
  అన్మోల్ విజయ్
  రామచంద్రరాజు
  శ్రీనిధి శెట్టి
  వశిష్ట ఎన్. సింహ
  అచ్యుత్ కుమార్
  అర్చన జోయిస్
  అనంత్ నాగ్
  అశోక్ శర్మ
  రమేష్ ఇందిర
  వినయ్ బిడప్ప
  లక్కీ లక్ష్మణ్
  బీఎస్ అవినాష్
  తారక్ పొన్నప్ప
  దినేష్ మంగళూరు
  హరీష్ రాయ్
  టి.ఎస్.నాగాభరణ
  భరణ
  మాళవిక అవినాష్
  గోవిందే గౌడ
  మోహన్ జునేజా
  అయ్యప్ప పి. శర్మ
  జాన్ కొక్కెన్
  పునీత్ రుద్రనాగ్
  నీనాసం అశ్వత్
  బి. సురేషా
  శ్రీనివాస్ మూర్తి
  యష్ శెట్టి
  లక్ష్మీపతి
  రూప రాయప్ప
  కృష్ణోజీ రావు
  సూర్య శేఖర్
  సంపత్ మైత్రేయ
  తమన్నా భాటియా
  మౌని రాయ్
  సిబ్బంది
  ప్రశాంత్ నీల్
  దర్శకుడు
  విజయ్ కిరగందూర్నిర్మాత
  రవి బస్రూర్
  సంగీతకారుడు
  భువన్ గౌడ
  సినిమాటోగ్రాఫర్
  శ్రీకాంత్ గౌడ
  ఎడిటర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
  Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
  కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో  యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.  https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.  https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.   https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.  https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.  https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.  https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.  https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.  https://youtu.be/CDbuW4689fI
  ఏప్రిల్ 12 , 2023
  Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
  Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!
  షారుక్‌ ఖాన్ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్‌ బాక్సాఫీస్‌ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌.  ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే ఫస్ట్‌ డే నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయి. తాజాగా జవాన్‌ మూవీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే జవాన్‌ చిత్రం తొలిరోజు రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా (సెప్టెంబర్‌ 7) రిలీజైన జవాన్‌ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పైగా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan)కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్‌ బద్దలు కొట్టే ఛాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘జవాన్’ డే 1 గ్రాస్‌ లెక్కల విషయానికి వస్తే వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ గ్రాస్‌ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే జవాన్‌ కంటే ముందు పలు చిత్రాలు హైయస్ట్‌ గ్రాస్‌ వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూళ్లను సాధించిన టాప్‌-10 భారతీయ చిత్రాలు (Highest Opening Day Grossers In Indian Cinema) ఏవో ఇప్పుడు చూద్దాం.  1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.  3. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.  4. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 5. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.  6. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.  7. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  8. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.  9. కబాలి (2016) 2016లో వచ్చిన ‘కబాలి’ (Kabali) చిత్రం ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ తొలి రోజు భారీ వసూళ్లనే సాధించింది. ఈ మూవీ మెుదటి రోజు రూ.90.5 కోట్ల గ్రాస్‌ సాధించింది. జైలర్‌ ముందు వరకు రజనీకాంత్‌కు ఫస్ట్‌ డే హైయస్ట్ గ్రాసింగ్‌ మూవీగా ‘కబాలి’ ఉంటూ వచ్చింది.  10. పొన్నియన్ సెల్వన్‌ (2022) మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan: Part I) మూవీ తొలి రోజున రూ. 83.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రీసెంట్‌గా విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 2’ తమిళంలో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. 
  సెప్టెంబర్ 08 , 2023
  Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
  Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.  అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్‌తో సలార్ లింక్ సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్‌ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి చూపించారు.  అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్‌)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు.  ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్‌) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.  ఫ్యాన్స్ రచ్చ రచ్చ మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్‌ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్‌ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  సలార్‌తో నడిచేది వీరే.. ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని  కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
  జూలై 06 , 2023
  Prashanth Neel : సలార్‌, కేజీఎఫ్‌ 2 కలయికతో KGF 3..!
  Prashanth Neel : సలార్‌, కేజీఎఫ్‌ 2 కలయికతో KGF 3..!
  థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు కన్నడ నటుడు యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్‌ ‌అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్‌ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్‌-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్‌ నీల్‌ మరణించినట్లు ధ్రువీకరించలేదు. దీంతో కచ్చితంగా పార్ట్‌-3 ఉంటుందని బలమైన సంకేతాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగానే తాజాగా KGF మేకర్స్‌ పార్ట్‌-3పై ఆశలు కలిగించారు.   KGF-2 సినిమా రిలీజై నేటితో (ఏప్రిల్‌ 14) ఏడాది పూర్తైన సందర్బంగా మేకర్స్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని ప్రతీ పాత్రను తిరిగి గుర్తు చేస్తూ ఆ వీడియో సాగింది. ‘మరపురాని క్యారెక్టర్లు, యాక్షన్‌ ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రపంచ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకున్నాం’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ పెట్టారు. అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది.. మరి నెరవేరిందా? అని మూడో పార్ట్‌పై హింట్‌ ఇచ్చారు. దీనిని మేకర్స్‌ చేసిన అధికారిక ప్రకటనగా భావించిన నెటిజన్లు #KGF3, #PrashanthNeel హ్యాష్‌ట్యాగ్‌లను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌2, సలార్‌ చిత్రాలను కలుపుతూ పోస్టులు పెడుతున్నారు.  కేజీఎఫ్‌2, సలార్‌  చిత్రాల అనుసంధానంగా కేజీఎఫ్‌-3 రానుందని ఇప్పటినుంచే నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు తమ అంచనాలను ట్విటర్‌లో పెడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.  https://twitter.com/hombalefilms/status/1646732589540028416 https://twitter.com/adheeraeditz/status/1646759564300173313 https://twitter.com/VickyOfficia1/status/1646758480051576832 https://twitter.com/SagarPrabhas141/status/1646738776880992256 ‘బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్‌ ది డే’ అంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. KGF-3 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.  https://twitter.com/MoviesPlexus/status/1646782407029444608 https://twitter.com/iamaniketL/status/1646781955395182593 https://twitter.com/Movies_Bar/status/1646781802378592257 1978-81 మధ్య రాకీ భాయ్‌ ఎక్కడ ఉన్నాడని సదరు వీడియోలో మేకర్స్‌ ఓ ప్రశ్నను వదిలారు. అయితే దానికి సమాధానం పార్ట్‌-3 వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్‌-3 కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.  https://twitter.com/saloon_kada/status/1646776349733060608 https://twitter.com/imARajput66/status/1646781794988228608 థియేటర్‌లో అద్భుత అనుభూతిని పంచిన సినిమాల్లో కేజీఎఫ్‌ ఒకటని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. హీరో ఇంట్రో, క్లైమాక్స్‌ కోసమే మూడు సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్‌-3 కోసం పిచ్చిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. https://twitter.com/Thalapathy_Bk/status/1646758004715581441 కేజీఎఫ్ 3 అంచనాలకు అందని రీతిలో ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన ఊహాకు మించి సినిమా ఉండబోతుందని అభిప్రాయపడుతున్నారు. https://twitter.com/YUVA__YASHCULT/status/1646787256202698752 షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ పఠాన్‌ రికార్డులను KGF3 బద్దలు కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. ఒకసారి సినిమా రిలైజ్‌ అయితే పటాన్ రికార్డ్స్‌ ఎక్స్‌పైరేనని ట్వీట్లు చేస్తున్నారు. 
  ఏప్రిల్ 14 , 2023
  #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
  #AskNani: ఫ్యాన్‌కు నాని  స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా  KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
  దసరా చిత్రంతో అభిమానులకు మాస్‌ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్‌ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్‌ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో  అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి. దసరా రన్‌టైమ్‌ #Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్‌ టైమ్ రివీల్‌ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.  https://twitter.com/NameisNani/status/1636016970473828353 ఫుల్‌ బిందాస్ సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.  https://twitter.com/NameisNani/status/1636015575284748288 స్ట్రాంగ్ రిప్లై రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్‌ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్‌ ఖాన్, ఆర్నాల్డ్‌ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్‌ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.  https://twitter.com/NameisNani/status/1636005865101877255 ఫన్నీ సమాధానం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్‌ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.  https://twitter.com/NameisNani/status/1636006778805837824 ఎవరైనా ఒక్కటే నేచురల్ స్టార్‌ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్‌ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. https://twitter.com/NameisNani/status/1636004611210502150 ఒరిజినల్ పీస్‌ సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్‌” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు. 
  మార్చి 16 , 2023
  <strong>NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో </strong><strong>జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!</strong>
  NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!
  ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత 'NTR 31' సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది.&nbsp; రాక్షసుడిగా తారక్‌! ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న 'NTR 31' చిత్రాన్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రం తారక్‌ కెరీర్‌లో 31వ సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. తారక్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. తారక్‌ పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే 'సలార్‌ 2' మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌! NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.&nbsp; భారీ బడ్జెట్‌ చిత్రం తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం.&nbsp; ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే? క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది.&nbsp;
  జూన్ 22 , 2024
  Prabhas New Movie: ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ మరో కొత్త సినిమా.. టైటిల్‌ కూడా ఫిక్స్!
  Prabhas New Movie: ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ మరో కొత్త సినిమా.. టైటిల్‌ కూడా ఫిక్స్!
  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సలార్‌’ (Salaar). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుంది. సలార్‌ పార్ట్‌ 2; శౌర్యంగ పర్వం (Salaar Part 2 ; Shouryaanga Parvam) పేరుతో ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ - ప్రశాంత్ నీల్‌ కాంబోలో మరో చిత్రం ఉండనున్నట్లు క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.&nbsp; సినిమా టైటిల్ ‌అదే! ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న ఈ హ్యాట్రిక్‌ మూవీకి టైటిల్‌ ఇదే అంటూ ఓ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘రావణం’ (Ravanam) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా ఇది రూపొందనున్నట్లు సమాచారం. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ రాని కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.&nbsp; బాహుబలి తరహాలోనే..! బాహుబలి తరహాలోనే ఈ సినిమాకు కూడా మైథలాజికల్‌ డ్రామా (Mythological Drama)గా రానుందని అంటున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ జోనర్‌ సినిమాను ఇప్పటి వరకూ చేయలేదు. ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ నటించినప్పటికీ అది రామాయణం ఆధారంగా తెరకెక్కింది. దీంతో కమర్షియల్‌గా రానున్న ‘రావణం’ ప్రభాస్‌ ఫేమ్‌, కెరీర్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ మైథలాజికల్‌గా వస్తుందన్న ఊహాగానాలతో ‘రావణం’ ఆసక్తిరేపుతోంది. నిర్మాత అతడే! టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను రూపొందిస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం దిల్‌ రాజు.. రామ్‌చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు ఫోకస్‌ మెుత్తం ప్రస్తుతం ఆ సినిమా పైనే ఉంది. ‘గేమ్ ఛేంజర్‌’ తర్వాత ఆయన ‘రావణం’ మేకింగ్ వర్క్స్‌పై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; షూటింగ్ ఎప్పుడు? ‘రావణం’ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘సలార్‌ 2’ తర్వాత వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని కొందరు అంటున్నారు. గతంలో తారక్‌ (Jr NTR)తో ప్రశాంత్ నీల్‌ ఓ సినిమాను ప్రకటించారు. ‘NTR 31’గా అది రావాల్సి ఉంది. అయితే తాజా బజ్‌ ప్రకారం ఆ మూవీ కంటే ముందే ‘రావణం’ తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొందరి విశ్లేషణ మరోలా ఉంది. 2026 తర్వాత ప్రశాంత్‌ నీల్ ‘రావణం’ ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేయవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లోనే ‘రావణం’పై క్లారిటీ రానుంది.
  ఫిబ్రవరి 12 , 2024
  Salaar English On Netflix: గ్లోబల్‌ స్థాయికి ‘సలార్‌’ క్రేజ్‌.. ఇక రికార్డుల మోతే!
  Salaar English On Netflix: గ్లోబల్‌ స్థాయికి ‘సలార్‌’ క్రేజ్‌.. ఇక రికార్డుల మోతే!
  ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ (KGF) ఫేమ్ ప్రశాంత్‌నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. టాప్‌-10 మూవీస్‌లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన సలార్‌.. తాజాగా గ్లోబల్‌ లాంగ్వేజ్‌ (Salaar English On Netflix) లోనూ అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్‌ రేంజ్‌కు ‘సలార్‌’..! సలార్ ఇంగ్లీష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ తాజాగా&nbsp; (ఫిబ్రవరి 5) అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘భారీ డిమాండ్ల నేపథ్యంలో గ్లోబల్ ఆడియన్స్ కోసం సలార్‌ను ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఎట్టకేలకు ఇంగ్లిష్ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ (Salaar English On Netflix) తీసుకురావటంతో గ్లోబల్ రేంజ్‍లో సలార్ మరింత దుమ్మురేపే అవకాశం ఉంది. చాలా దేశాల్లో సలార్‌ మరింత ట్రెండ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరోమారు ప్రభాస్‌ పేరు మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లీష్‌ వెర్షన్‌ వైరల్‌.. సలార్‌ చిత్రం ఇంగ్లీష్‌లో ప్రసారం అవుతుండటంతో ఈ మూవీలోని హైలెట్‌ సీన్స్‌ నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి. ఆంగ్ల వెర్షన్‌లో ఉన్న ఈ సీన్లను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. #SalaarEnglishOnNetflix హ్యాష్‌ట్యాగ్‌తో అవి ట్రెండ్ అవుతున్నాయి. అయితే సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‍లోకి రాకముందే గ్లోబల్ రేంజ్‍లో దుమ్మురేపింది. ఇంగ్లీష్ సబ్‍టైటిల్స్‌తో చాలా దేశాల్లోని ప్రజలు ఈ మూవీని చూసేశారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ‘సలార్ గోస్ గ్లోబల్’ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం విశేషం.&nbsp; https://twitter.com/i/status/1754413397377253645 మరి హిందీలో ఎప్పుడు! ఇక సలార్ హిందీ వెర్షన్ మాత్రం (Salaar English On Netflix) ఇప్పటి వరకు నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై సదరు స్ట్రీమింగ్‌ వర్గాలు అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా విడుదల తేదీ నుంచి ఓటీటీలోకి రావడానికి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండడం వల్లే హిందీ వెర్షన్ ఆలస్యమవుతోందని సమాచారం. అయితే మార్చిలో సలార్‌ హిందీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన కూడా చేయనుందని వార్తలు వస్తున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1754424769397838125 షారుక్‌ను ఢీకొట్టి నిలబడ్డ ప్రభాస్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్ (Shah Rukh Khan) నటించిన డంకీ (Dunki), సలార్ (Salaar) చిత్రాలు గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. అయితే సలార్ చిత్రమే కలెక్షన్లలో దుమ్మురేపింది. షారుక్‌ మూవీని వెనక్కి నెట్టి.. సలార్ అదరగొట్టింది. దీంతో ఉత్తరాదిలో ప్రభాస్‍కు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి రుజువైంది. హిందీలో సలార్‌ చిత్రానికి సుమారు రూ.170 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. https://twitter.com/i/status/1754426944857481621 సలార్‌ 2 షూటింగ్‌ ఎప్పుడంటే? సలార్‌ సినిమాకు సీక్వెల్‌ (Salaar Part 2: Shouryaanga Parvam) కూడా రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీక్వెల్ షూటింగ్‌ ఈ సమ్మర్‌లోనే మొదలు కానుందట. ఇందుకోసం ప్రభాస్‌ 2 నెలల డేట్స్‌ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించి డిసెంబర్‌ 22న సలార్‌ రెండో భాగాన్ని రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. దీనికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే రానున్నాయి. https://twitter.com/i/status/1754457149055565894
  ఫిబ్రవరి 06 , 2024
  Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
  Pawan Kalyan: ‘సలార్‌’లో ప్రభాస్ లాగే ‘ఓజీ’లో పవన్‌ కూడా… ఫ్యాన్స్‌లో తగ్గిపోతున్న హైప్‌!
  టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ముందు వరుసలో ఉంటాడు. ఆయన కొత్త సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ, పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ (OG) జాతీయ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘సలార్‌’.. పవన్‌ ‘ఓజీ’ మూవీకి ఓ కనెక్షన్‌ ఉందంటూ నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. అలాగే పవన్‌ తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) గురించి కూడా ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఓజీ - సలార్‌ మధ్య పోలిక! ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రంలో హీరో ప్రభాస్‌ (Prabhas) పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. దాదాపు మూడు గంటలు ఉండే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించేది సుమారు గంట మాత్రమే. మిగతా రన్ టైమ్‌లో ప్రభాస్‌పై ఎలివేషన్‌లు, ఇతర పాత్రలు, సినిమా కథ వంటివి కనిపించాయి. అయితే పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో పవన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలోనే పవన్‌ రెగ్యులర్‌ షూట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. పవన్‌ పాత్రకు సంబంధించి మిగిలిన షూటింగ్‌కు రెండు వారాల సమయం సరిపోతుందని టాక్‌ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్‌ పాత్ర నిడివి 'ఓజీ'లో పరిమితంగా ఉండొచ్చనే అభిప్రాయానికి సినీ వర్గాలు వస్తున్నాయి.&nbsp; హై రేంజ్‌లో ఎలివేషన్స్‌! ‘ఓజీ’ సినిమాలో పవన్‌ పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఎలివేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని మూవీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ గ్లింప్స్‌ చూస్తే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమవుతోంది. ఇందులో పవన్‌ను.. ఓ రేంజ్‌లో చూపించాడు డైరెక్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతోపాటు ఓజీ నుంచి వచ్చి ‘హంగ్రీ చీతా’ సాంగ్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ తమ కాలర్‌ ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌గా పెట్టుకోవడం విశేషం. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.&nbsp; సన్నగిల్లుతున్న అంచనాలు! పవన్‌ కల్యాణ్‌ హీరోగా.. దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న మరో చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్‌లో మంచి హైప్‌ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై నాలుగేళ్ల గడిచినా ఎటువంటి సాలిడ్‌ అప్‌డేట్‌ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరుస్తోంది. సినిమా షూటింగ్‌ వాయిదా మీదా వాయిదా పడుతుండటంతో పాటు అరకొరగా అప్‌డేట్స్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఓ ప్రోమో రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించినప్పటికీ ఇవాళ్టికి కూడా దానిపై ఎలాంటి అలెర్ట్ లేకపోవడం గమనార్హం. దీంతో పవన్‌ కెరీర్‌లో ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'హరిహర వీరమల్లు'.. ‘ఓజీ’ చిత్రంతో పోలిస్తే చాలా లో బజ్‌లోకి వెళ్లిపోతోంది.&nbsp; చిరుకు పోటీగా పవన్‌ కల్యాణ్‌! ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? అన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దీంతో ఇటీవల మేకర్స్‌ స్పందిస్తూ ఈ సినిమా ఆగలేదని, షూటింగ్‌ అయినంతవరకూ పోస్ట్‌ ప్రొడక్షన్, VFX వర్క్స్‌ జరుగుతున్నాయని ప్రకటించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల తర్వాత పవన్‌ డేట్స్‌ ఇస్తే డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేయాలని వారు భావిస్తున్నారట. తద్వారా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నారట. అదే జరిగితే ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని ‘హరిహర వీరమల్లు’ ఢీకొట్టాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.&nbsp;&nbsp;
  మార్చి 07 , 2024
  Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఏంటంటే?
  Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఏంటంటే?
  బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్‌లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ యష్‌ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్‌కు ‘దంగల్‌’ (Dangal) లాంటి బ్లాక్‌ బాస్టర్‌ను అందించిన స్టార్‌ డైరెక్టర్‌ నితేష్‌ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.&nbsp; షూటింగ్‌ ప్రారంభం ఆ రోజే! లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'రామాయణం' చిత్రానికి సంబంధించి ఏప్రిల్‌ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్‌కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్‌మెంట్‌ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్‌.&nbsp; ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం! ‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్‌ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్‌ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీతో గ్రాఫిక్స్‌! రామాయణం చిత్రాన్ని విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాలని డైరెక్టర్‌ నితేష్‌ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్‌ సినిమా గ్రాఫిక్స్‌పై విపరీతంగా ట్రోల్స్‌ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్‌ కోసం హాలీవుడ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్‌ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అమీర్‌ఖాన్ కొడుకుతో సినిమా ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్‌ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఫిక్స్‌ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; సాయిపల్లవి ఫూచర్‌ ప్రాజెక్ట్స్‌ తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్‌గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్‌’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్‌ (Siva Karthikeyan)తో ‘అమరన్‌’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది.&nbsp;
  మార్చి 02 , 2024
  Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
  Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
  దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.&nbsp; ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.&nbsp; హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ&nbsp; కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.&nbsp; ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.&nbsp;
  ఫిబ్రవరి 27 , 2024
  Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
  Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
  సృష్టిలో ప్రతీ ప్రాణికీ మూల కారణం 'అమ్మ'. అటువంటి తల్లి గురించి చెప్పాలంటే భాష చాలదు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 'అమ్మ' పాత్ర‌.. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే అమ్మ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మనసుకు హత్తుకునే కథలతో చక్కటి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas Mother Sentiment Movies) కు కూడా అమ్మ సెంటిమెంట్‌తో ఉన్న చిత్రాలు తీశారు. అతడి కెరీర్‌లో ఘన విజయాలు సాధించిన చిత్రాలన్ని దాదాపుగా తల్లి సెంటిమెంట్‌తో వచ్చినవే. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar). ఇందులో ప్రభాస్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అదే సమయంలో తల్లి మాటను జవదాటని కొడుకు గాను మెప్పించాడు. తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావడంతో పాటు.. ప్రభాస్‌ మార్క్‌ యాక్షన్‌తో సలార్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించాడు.&nbsp; బాహుబలి ప్రభాస్ హీరోగా రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali), బాహుబలి 2 (Baahubali 2) చిత్రాలలోనూ తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ దాగుంది. ప్రభాస్‌, రమ్యకృష్ణ పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కాగా, ఇందులో రానా (Rana Daggubati).. ప్రభాస్‌కు సోదరుడిగా నటించాడు. అనుష్క (Anushka Shetty) హీరోయిన్‌గా చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంతో ప్రభాస్‌ క్రేజ్‌ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన డార్లింగ్ ఫేమ్‌.. అన్ని ఇండస్ట్రీలకు పాకింది.&nbsp; ఛత్రపతి ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన మరో మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘ఛత్రపతి’ (Chatrapathi). దీనిని కూడా దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించారు. ఈ సినిమా ప్రధానంగా యాక్షన్‌ చుట్టూ తిరిగినా.. కథలో తల్లి సెంటిమెంట్‌ అంతర్లీనమై ఉంటుంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా భానుప్రియ (Bhanu Priya) నటించారు. వారిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకుల కళ్లు చెమడ్చేలా చేస్తాయి. కాగా, ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటి శ్రియా (Shriya Saran) చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. యోగి ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన తొలి మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘యోగి’ (Yogi Movie). ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద గొప్ప విజయం సాధించనప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. టెలివిజన్‌లో కొన్ని వందలసార్లు అత్యధిక TRP రేటింగ్‌తో ఈ చిత్రం ప్రసారమైంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి శారద (Actress Sarada) నటించారు. హీరోయిన్‌గా నయనతార (Nayanthara) చేసింది. వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల, గురు కిరణ్‌ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌ రావత్‌, ముమైత్‌ ఖాన్‌, వేణు మాధవ్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp;
  ఫిబ్రవరి 05 , 2024
  Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
  Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
  నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌ సంగీతం: రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌ విడుదల: 22-12-2023 పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌లార్‌’. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఎప్ప‌ట్నుంచో  ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ కటౌట్‌కు తగిన హిట్‌ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు ఖాతాలో మరో బ్లాక్‌ హిస్టర్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్‌ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని ఖాన్సార్‌కు రూలర్‌గా చూడాలనేది రాజమన్నార్‌ కోరిక‌. దీంతో వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్‌. తన కటౌట్‌కు తగ్గట్లు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని స్నేహితుడిగా ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి,&nbsp; శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’తో మరోమారు తన మార్క్‌ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత&nbsp; ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన క‌థ‌ని అల్లారు. కె.జి.యఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్ర‌భాస్‌కి త‌గ్గట్టు మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్‌కు ఎలివేష‌న్ల‌ు ఇచ్చి అభిమానుల‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు డైరెక్టర్. ఓవరాల్‌గా స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్‌నీల్‌ సక్సెస్ అయ్యారు.&nbsp; సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రభాస్, పృథ్వీ నటనయాక్షన్‌ సన్నివేశాలుభావోద్వేగాలు, క్లైమాక్స్ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ రేటింగ్‌: 3.5/5
  డిసెంబర్ 22 , 2023
  SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
  SalaarTheSaga: సలార్ ఒక పెను సంచలనం.. ఇండియా హిస్టరీలో అలాంటి మూవీ రాలేదు!
  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాని ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేశారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ ఢమాల్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేశారు. అయితే, ఆదిపురుష్ ఫలితాన్ని మర్చిపోయేలా ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ ఫీవర్‌ షురూ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో ఫోకస్ మొత్తం సలార్ వైపు మళ్లింది. సలార్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో సరికొత్త జోష్ మొదలైంది.&nbsp; ‘సలార్’కి 100 రోజుల ముందే కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్లను ట్రాక్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి నుంచే సలార్ మూవీ ప్రజల్లో ఉండేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌ని రివీల్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం కావడమూ ఇందుకు మరో కారణం. పైగా, ఇందులో ‘KGF’కు మించిన యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయట. ఊహకు అందని రీతిలో మూవీ ఉంటుందని టాక్‌. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; టీం సభ్యుల ప్రచారం.. సినిమా ప్రచార వ్యూహాలు ఒకెత్తయితే, మూవీ విషయాలను క్యాస్ట్ అండ్ క్రూ సందర్భానుసారంగా వెల్లడిస్తుండటం మరొక ఎత్తు. ఇప్పటికే సలార్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సినిమా స్టోరీ ప్లాట్ సహా ఎక్కడ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటితోనే అభిమానులు పండగ చేసుకుంటుంటే వారికి మరింత కిక్ ఇచ్చేలా మూవీ టీం సభ్యులు అప్‌డేట్స్ ఇస్తున్నారు.&nbsp; కెమెరా.. సలార్ మూవీ కోసం ప్రత్యేక కెమెరాను ఉపయోగిస్తున్నట్లు సినిమాటోగ్రఫర్ భువన గౌడ్ వెల్లడించాడు. సిగ్నేచర్ లెన్స్‌తో కూడిన నెక్ట్స్ వెర్షన్ అలెక్స్ ఎర్రీ కెమెరాను వాడుతున్నట్లు తెలిపాడు. పైగా, సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ వెర్షన్‌కి సపోర్ట్ చేసేలా 4K లో తీస్తున్నట్లు వెల్లడించాడు. డార్క్ సెంట్రిక్‌ థీమ్‌లో తెరకెక్కుతున్నందున ఆరెంజ్‌కు బదులు బూడిద రంగును వాడినట్లు చెప్పాడు. పైగా, స్కేల్, జాగ్రఫీ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి హైప్ క్రియేట్ చేశాడు.&nbsp; సరికొత్తగా ప్రభాస్.. సలార్ సినిమాలో చూసే ప్రభాస్ సరికొత్తగా ఉంటాడని నటి శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని సలార్‌లో చూస్తారని చెప్పింది. కేజీఎఫ్ ఒక సంచలనం అయితే సలార్ పెను సంచలనం అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను మరిపించేలా ఫైట్స్ ఉండబోతున్నాయట. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఒక ప్రపంచం ఉంటుందని.. అదే విధంగా ప్రశాంత్ నీల్ మరొక ప్రపంచాన్ని సృష్టించాడని తెలిపింది. ఇలాంటి ప్రపంచంలో ఓ మైటీ ప్రభాస్ ఉంటాడని చెప్పింది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పేర్కొంది. మరో 8 పాత్రలు వేటికవే ప్రత్యేకమని స్పష్టం చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది.&nbsp; https://twitter.com/Attitudist/status/1671201399584227328 మ్యూజిక్ కేజీఎఫ్ 1, 2 సినిమాలకు మ్యూజిక్ అందించాడు రవి బాస్రూర్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు సలార్ మూవీకి కూడా రవినే సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ పరంగా ఆల్బమ్ ముందే హిట్ లిస్టులోకి చేరుకుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. రవి బాస్రూర్ పోస్ట్ చేసే మ్యూజిక్ ప్రాక్టీస్ వీడియోలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా చిత్రంపై ఒకొక్క విషయం వెల్లడిస్తూ&nbsp; https://twitter.com/NimmaNuthan/status/1671180132638420992
  జూన్ 21 , 2023
  Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
  Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
  టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవర 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్‌ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, టామ్‌ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; తండేల్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తండేల్‌’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్‌ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌ ప్రధాన పాత్రుల పోషించనున్నారు. మట్కా వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్‌ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్‌. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. KGF 3 ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్‌ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. RC16 మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్‌. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.&nbsp; వాల్తేరు వీరయ్య గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఉప్పెన సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్‌ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్‌ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఘాజీ 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; మహా సముద్రం&nbsp; అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.&nbsp;
  జనవరి 10 , 2024
  Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
  Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
  సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; తండేల్‌ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్‌' (Thandel). ఈ సినిమా టైటిల్‌ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్‌ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్‌' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; డంకీ (DUNKI) బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్‌ 21న విడుదల కానుంది.&nbsp; తంగలాన్‌ చియాన్‌ విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.&nbsp; కంగువ స్టార్‌ హీరో సూర్య అప్‌కమింగ్‌ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.&nbsp; మట్కా వరణ్‌తేజ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.&nbsp; జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్‌ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.&nbsp; అయలాన్‌ శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్‌ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.&nbsp;
  నవంబర్ 25 , 2023
  Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
  Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
  సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సార్లు వారే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి ప్రేక్షకుల్లో తమ చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాతలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ హీరో పోస్టర్‌లో గన్‌ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాల పోస్టర్లను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? తుపాకీ పట్టుకున్న స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; భోళా శంకర్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భోళాశంకర్‌’ (Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ కానుండగా.. ఇంకా తొమ్మిది రోజులే ఉందంటూ ఇటీవల మేకర్స్‌ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో చిరు రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. యాక్షన్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌ను ‌అమితంగా ఆకట్టుకుంది.&nbsp; జైలర్‌ సూపర్‌ రజనీకాంత్‌ రీసెంట్‌గా ‘జైలర్‌’ (Jailer) మూవీ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో రజనీ గన్‌తో మెరిసారు. చేతిలో పెద్ద తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా హీరోయిన్‌గా చేసింది.&nbsp; కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ లేటెస్ట్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజయ్యింది. మునుపెన్నడూ చూడని లుక్‌లో ధనుష్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు. తుపాకీని ఫైర్‌ చేస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి అరుణ్‌ మతేశ్వరం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.&nbsp; జవాన్‌ ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘జవాన్‌’ (Jawan) చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో షారుక్‌ రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా ఆమె కూడా తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో తుపాకీతోనే దర్శనమిచ్చింది. కాగా, ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; సలార్‌ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, KGF డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. గన్‌పై చేయి పెట్టుకొని, అగ్రెసివ్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; గాండీవధారి అర్జున మెగా హీరో వరణ్‌ తేజ్‌ తాజాగా ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌లోనూ వరణ్‌ చేతిలో గన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షివైద్య హీరోయిన్‌గా చేస్తోంది. మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘సైంధవ్‌’ (Saindhav) మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఇందులో వెంకటేష్‌ చేతితో గన్‌ పట్టుకొని దాన్ని చూస్తూ కనిపించాడు. కాగా, ఈ చిత్రాన్ని సైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈగల్‌ మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్‌ నాగేశ్వర్‌ (Tiger Nageswara Rao) చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘ఈగల్‌’ (Eagle) సినిమా చేయనున్నాడు. కాగా ఈగల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని కనిపించాడు. చేతిలో గన్‌ కూడా ఉంది. కాగా, ఈ చిత్రంలో కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; స్పై&nbsp; ఇటీవలే విడుదలైన ‘స్పై’ (Spy) చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో నిఖిల్‌ కూడా పిస్టల్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp;
  ఆగస్టు 04 , 2023
  SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
  SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
  దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా&nbsp; సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా&nbsp; సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)&nbsp; మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.&nbsp; తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి&nbsp; ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),&nbsp; 'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
  ఆగస్టు 03 , 2023
  PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
  PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
  ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం. సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్‌ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం. RRR&nbsp; ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.&nbsp; KGF రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.&nbsp; పఠాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.&nbsp; పుష్ప సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మాస్త్ర అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.&nbsp; బీస్ట్ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్‌ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.&nbsp; సలార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.&nbsp; OG పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.&nbsp; LEO లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
  మే 02 , 2023

  @2021 KTree