రివ్యూస్
YouSay Review
కార్తికేయ 2 మూవీ ఫుల్ రివ్యూ
హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన కార్తికేయ 2 మూవీ నేడు (ఆగస్టు 13న) థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే విజయం సాధి...read more
How was the movie?
తారాగణం
నిఖిల్ సిద్ధార్థ్
డా. కార్తికేయ కుమారస్వామి కార్తీక్అనుపమ పరమేశ్వరన్
ముగ్ధఅనుపమ్ ఖేర్
డా. ధన్వంతి వేద్పాఠక్ (అతి పాత్ర)ఆదిత్య మీనన్
డా. శాంతను ముఖర్జీకెఎస్ శ్రీధర్ ప్రొఫెసర్ రంగనాథరావు
సత్య అక్కల
కార్తీక్ స్నేహితుడుప్రవీణ్
కార్తీక్ స్నేహితుడుహర్ష చెముడు
సులేమాన్తులసి
కార్తీక్ తల్లివెంకటేష్ ముమ్ముడిఅభీర
అప్పాజీ అంబరీష దర్భదైవజ్ఞ శర్మ
పరన్ ముర్ముపరాన్
సిబ్బంది
చందూ మొండేటి
దర్శకుడుఅభిషేక్ అగర్వాల్నిర్మాత
టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
చందూ మొండేటి
రచయితకాల భైరవ
సంగీతకారుడుకార్తీక్ గట్టమ్నేని
సినిమాటోగ్రాఫర్కార్తీక్ గట్టమ్నేని
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్ చిత్రాలు..!
దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్ నుంచి పలు సూపర్‌హిట్ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
తెలుగు
టాలీవుడ్ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తమిళం
కోలీవుడ్ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
కన్నడ
2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి.
మలయాళం
మలయాళం నుంచి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey), 'న్నా తాన్ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
ఆగస్టు 03 , 2023
Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.
ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన 'డీజే టిల్లు 2' ట్రైలర్ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.
కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.
ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.
రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.
దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.
ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.
అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.
గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .
కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు.
మాస్ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.
అలాగే తమిళంలో 'సైరెన్' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.
ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 21 , 2024
Kajal Aggarwal: కాజల్‌కు అరుదైన గుర్తింపు.. ఆ అవార్డుతో గట్టి కమ్‌బ్యాక్!
టాలీవుడ్ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. ఇటీవల బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది.
‘భగవంత్ కేసరి’ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు.. కాజల్ నటనపై కూడా ప్రశంసలు కురిశాయి. తాజాగా ఈ చిత్రానికి గాను ‘జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - JIFF’ (Jaipur International Film Festival)లో కాజల్‌ను ఓ అవార్డు వరించింది.
కాజల్‌తో (Kajal Agarwal) పాటు ప్రకాష్ (బింబిసారా), అనుపమ్ ఖేర్ (కార్తికేయ 2), అర్జున్ రాంపాల్ (భగవంత్ కేసరి) సైతం JIFF అవార్డులకు ఎంపికయ్యారు.
గత కొంతకాలంగా అవకాశాలు లేక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్ ‘భగవంత్ కేసరి’ ద్వారా గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. తాజా అవార్డుతో కాజల్ మరోమారు ఇండస్ట్రీలో పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాజల్.. 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే కాజల్‌కు తిరుగుండదు. అందుకే కాజల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అలాగే హిందీలో 'ఉమా', తెలుగులో సత్యభామ అనే రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే మూడు పదుల వయసులోనూ కాజల్ (#KajalAggarwal) యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆమె ఫిట్‌నెస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.
అయితే తన అందం, ఫిట్‌నెస్ వెనకున్న రహాస్యాలను కాజల్ పంచుకున్నారు. కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌కు తెలియజేశారు.
ప్రతీ రోజు సూర్య నమస్కారాలు చేస్తానని కాజల్ అగర్వాల్ (#KajalAggarwal) తెలిపింది. వారంలో కనీసం మూడు రోజుల యోగా తప్పనిసరి అని పేర్కొంది.
అయితే ప్రతీరోజూ రొటీన్‌గా ఒకే రకమైన వ్యాయమం కాకుండా విభిన్నంగా ట్రై చేస్తుంటానని కాజల్ తెలిపింది. మధ్య మధ్యలో స్విమ్మింగ్ కూడా చేస్తుంటానని చెప్పుకొచ్చింది.
ఇక డైట్ విషయంలోనూ కాజల్ చాలా జాగ్రత్తగా ఉంటుందట. వ్యాయామానికి తగిన ఫుడ్ తీసుకుంటూ ఉంటానని గతంలో తెలిపింది.
నాన్ వెజ్ కంటే ఎక్కువగా వెజ్‌కే ఈ బ్యూటీ ప్రాధాన్యం ఇస్తుందట. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని కాజల్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
జనవరి 27 , 2024
Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు
మలయాళి అందాల తెగింపు అనుపమ పరమేశ్వరన్ పలుచటి చీరతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది
నల్లటి స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆర బోసింది.
నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
సినిమాల్లో అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే అనుపమ.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది.
సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది.
కార్తికేయ 2 తర్వాత అనుపమ ‘బటర్‌ఫ్లై’, ‘18 పేజెస్’ చిత్రాల్లో నటించింది. ఇందులో ‘18 పేజెస్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
మార్చి 29 , 2023
Sai Pallavi: నిత్యామీనన్.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్ రాకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాయిపల్లవిని కాదని..!
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్ సంయుక్తంగా వరించింది.
నిత్యా మీనన్ ఏం గొప్ప..!
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు.
https://twitter.com/david_bro18/status/1824390579129815154
https://twitter.com/jammypants4/status/1824662625713521129
https://twitter.com/tum_saath_ho/status/1824438399735869460
బెస్ట్ యాక్టర్‌గా సౌత్ స్టార్
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా 'ఆట్టమ్' (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్ 2', బెస్ట్ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు.
జాతీయ అవార్డు విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్‌మోహర్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్‌మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)
జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్‌మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్ - లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్)
ఆగస్టు 17 , 2024
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది.
నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది.
ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది
ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు.
గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది.
ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది
గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు.
అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది.
ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది.
ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది.
కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
మార్చి 30 , 2024
RRR సినిమాకు ఆస్కార్ రావడంపై బాలీవుడ్ అక్కసు… మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు దుమారం
భారతీయ చిత్రాలు RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ సినిమాలకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దేశం మెుత్తం గర్వించింది. ఇలాంటి సమయంలో ఆస్కార్‌ను కూడా కొన్నారంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మేకప్ చేసే షాన్ ముట్టాత్తిల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వటం పట్ల అక్కసు వెళ్లగక్కడా షాన్.
నాటునాటుకు ఆస్కార్ ఇవ్వటం చాలా హాస్యాస్పదం. భారత్‌లో అవార్డులు కొంటారని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఏకంగా ఆస్కార్స్. మనదగ్గర డబ్బుంటే ఏదైనా వస్తుంది. ఆస్కార్‌తో సహా” అన్నాడు.
View this post on Instagram A post shared by viral.fta (@viral.fta)
షాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నీ మాటల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు సినిమాకు ఆస్కార్ రావటం బాలీవుడ్‌లో చాలామందికి నచ్చలేదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే, బాహుబలి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు టాలీవుడ్ సినిమాలు అక్కడ ఏలుతున్నాయి.
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాలీవుడ్‌లో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం ఇందుకు నిదర్శనం. ఈ కారణంగానే కొంతమంది నాటునాటుకి ఆస్కార్ రావటాన్ని ఓర్వలేక పోతున్నారని వినికిడి.
నాటునాటుకి ఆస్కార్ రావటం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. కానీ, బాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.
ఈ క్రమంలో మేకప్ ఆర్టిస్ట్ షాన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని పెంచాయి. దీంతో ట్రోలర్స్ చేతికి పనిదొరికనట్లయ్యింది.
మార్చి 15 , 2023
Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
[toc]
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్‌చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
అక్టోబర్ 22 , 2024
BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య
దర్శకుడు: క్లాక్స్
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
విడుదల తేది: ఆగస్ట్ 25, 2023
కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(రాంప్రసాద్) పెద్ద ప్లాన్ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్ మెప్పించారు. రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా సాగిందంటే
సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడంతో కథలో వేగం మిస్ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్, బ్రహ్మం, డేనియల్ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్ చేశాడు.
టెక్నికల్‌గా
చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్ అని చెప్పవచ్చు. సాంగ్స్ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
పాటలుహీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌సాగదీత సీన్లు
రేటింగ్: 2.75/5
https://www.youtube.com/watch?v=98y83GscKEI
ఆగస్టు 25 , 2023
Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
కింగ్ ఆఫ్ కొత్త
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
గాండీవధారి అర్జున
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడు? అన్నది సినిమా కథ.
బెదురు లంక 2012
కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది.
ఏం చేస్తున్నావ్
విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్’ (Em chestunnav). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బాయ్స్ హాస్టల్
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే!
బ్రో
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)- సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.
బేబీ
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు.
TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao MovieHindiJio CinemaAugust 25Invasion 2 SeriesEnglishApple Tv PlusAugust 23
APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
ఆగస్టు 21 , 2023
Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, రూపా లక్ష్మీ, అనీష్ కురువిల్ల, దేవి ప్రసాద్ తదితరులు..
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
సంగీతం : అజయ్ అరసద
సినిమాటోగ్రాఫర్ : చరణ్ మాధవనేని
నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్
విడుదల తేదీ: 29-03-2024
విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
విజయ్-సాగర్ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్ భయపడుతుంటే సాగర్ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్. ఓవరాల్‌గా రమాకాంత్ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా సీన్లు లైవ్ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 29 , 2024
Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్న కార్తికేయ !
నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
ఎడిటింగ్: జి.సత్య
నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ : మే 31, 2024
యంగ్ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్ టైసన్ మంచి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్ పాత్రలో బొమ్మాళి రవిశంకర్ ఎప్పటిలాగే తన మార్క్ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్ కాకుండా క్లైమాక్స్ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదు. కొన్ని లాజికల్ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్ చేస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కపిల్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు.. యాక్షన్ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆర్.డి రాజశేఖర్ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కార్తికేయ నటనఇంటర్వెల్ ట్విస్ట్‌సెకండాఫ్
మైనస్ పాయింట్
హీరో హీరోయిన్ లవ్‌ట్రాక్‌రొటిన్ క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 05 , 2024
DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం 'దేవర'. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్ సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్ రికార్డును తారక్ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్!
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్’ తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.
23 ఏళ్ల రికార్డు బద్దలు
రాజమౌళి ఫ్లాప్ రికార్డు సెంటిమెంట్ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2001లో రిలీజైన స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్ 27న దేవర రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్‌ను తారక్ బద్దలు కొట్టాడని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.
కార్తికేయ స్పెషల్ పోస్టు
ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్‌గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్‌ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
https://twitter.com/ssk1122/status/1839476779175567669
ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్. చిత్రంలోని ఫియర్ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
https://twitter.com/ArtistryBuzz/status/1839517947548794958
https://twitter.com/AnirudhTrend/status/1839516079560802450
సెప్టెంబర్ 27 , 2024
Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి.
[toc]
Drushyam
దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్) ఊరిలో కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.
Karthikeya 2
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే…
కార్తికేయ (నిఖిల్)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
Bichagadu 2
ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ
F2
2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్(వరుణ్ తేజ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ.
Ante Sundaraniki
గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
Tholiprema
ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే..
అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
Pelli Choopulu
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
ఓటీటీ సన్ నెక్ట్స్
Spyder
స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే…
ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్
Raja The Great
రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా
Ori Devuda
వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా
Bichagadu
ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో
Jalsa
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
ఓటీటీ: ఆహా
Nenu
అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
Sye Raa Narasimha Reddy
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే..
భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
Bharat Ane Nenu
సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా
Ye Maaya Chesave
ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Baahubali: The Beginning
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
Businessman
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్
Good Luck Sakhi
బంజార యువతి సఖి (కీర్తి సురేష్) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Oxygen
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
Adipurush
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
SR Kalyanamandapam
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ: ఆహా
Disco Raja
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
ఓటీటీ: సన్ నెక్స్ట్
Goutham Nanda
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
Kirrak Party
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Teja
తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
Pelli Sandadi
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
ఓటీటీ:యూట్యూబ్
Swathi Muthyam
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
ఓటీటీ: జియో టీవీ
Dhruva
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
KGF 2
రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
Baadshah
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: యూట్యూబ్
Pushpa
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
Nannaku Prematho
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
Ala Modalaindi
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Sir
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
Jersey
అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: జీ5
Hit: The First Case
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Aditya 369
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
Aha Naa Pellanta
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Vikram Vedha
వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ: ప్రైమ్
Bro
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Khaidi
ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
Uppena
మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్ తేజ్) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Geetha Govindam
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
Acharya
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
Rang De
అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5
ఓటీటీ: ప్రైమ్
Induvadana
వాసు (వరుమ్ సందేశ్) ఫారెస్ట్ పోలీసాఫీసర్. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Maharshi
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Aakaasam Nee Haddhu Ra
సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Ala Vaikunthapurramuloo
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Munna
కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
RRR
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
Dear Comrade
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Jathi Ratnalu
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Dirty Hari
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
ఓటీటీ: ఆహా
Arjun Reddy
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా, ప్రైమ్
Rangasthalam
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
జూన్ 25 , 2024
Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!
రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్‌లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం.
[toc]
Arthaminda Arunkumar Season 2
ఈ చిత్రం మంచి అడల్ట్ స్టఫ్‌తో వచ్చింది. చాలా సన్నివేశాల్లో రొమాంటిక్ సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరుణ్ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
Citadel Honey Bunny
ఈ సినిమాలోని బెడ్రూమ్ సీన్లలో సమంత రెచ్చిపోయి నటించింది. వరుణ్ ధావన్‌తో లిప్‌లాక్ సీన్స్ మరి ఘాటుగా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్ గ్యాంగ్ హనీ వెంట ఎందుకు పడుతోంది? అన్నది స్టోరీ.
Honeymoon Express
చైతన్యరావు , హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. హీరోయిన్ హెబ్బా పటేల్ తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. బెడ్రూమ్ సీన్లలో చైతన్యరావు, హెబ్బా పటెల్ రెచ్చిపోయి నటించారు. బొల్డ్ కంటెంట్ ఇష్టపడేవారికి మంచి మాజాను ఇస్తుంది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..ఇషాన్, సోనాలి పెళ్లైన కొత్త జంట. భిన్నమైన మనస్తత్వాలు ఉండటంతో తరచూ వీరి కాపురంలో గొడవలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ సీనియర్ కపుల్స్.. వీరికి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెప్తారు. ఏంటా గేమ్? దాని వల్ల ఇషాన్, సోనాలి ఎలా దగ్గరయ్యారు? ఇంతకీ గేమ్‌ను సూచించిన సీనియర్ జంట ఎవరు? అన్నది కథ.
స్త్రీ 2
స్త్రీ 2 చిత్రంలో టైమ్ లెస్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అందాలను అప్పనంగా ఆస్వాదించవచ్చు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ బొల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. యూత్‌కు మంచి మజాను అందిస్తుంది ఈ చిత్రం.
ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలిగింది అనే అంతా భావించే లోపు సర్కటతో కొత్త సమస్య మొదలువుతుంది. ఈ సమస్యను విక్కీ(రాజ్ కుమార్), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన(అభిషేక్ బెనర్జీ)తో కలిసి దెయ్యం(శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది అన్నది కథ.
Nakide First Time
రాంరెడ్డి మస్కీ దర్శకత్వంలో వచ్చిన 'నాకిదే ఫస్ట్ టైమ్' చిత్రంలో ధనుష్ బాబు, సిందూర రౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో టీనేజీలో యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణలను ప్రధానంగా చూపించారు.
Silk Saree
అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి టైం పాస్ ఇస్తుంది. ఈ సినిమాలో వాసుదేవ్‌రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి, ప్రధాన పాత్రల్లో నటించారు.
Naughty Girl
ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కావాల్సినన్ని మసాల సీన్లు అందుబాటులో ఉన్నాయి.
Hi Five
ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు.ఈ సినిమాలోనూ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఎవోల్
రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్‌ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని
ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే..
చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ.
https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps
హాట్ స్పాట్
నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
లవ్ మౌళి
2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
Mr & Miss
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్‌లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ.
ఏడు చేపలా కదా
ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్ అవుతున్నారన్నది మిగతా కథ.
RGV’s Climax
తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ.
రాజ్
ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
నేను
మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
BA పాస్
బాలీవుడ్‌లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…
ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ.
కుమారి 21F
తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్‌ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
సిద్దు(రాజ్ తరుణ్) హోటల్ మెనేజ్‌మెంట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్‌గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ.
మిక్స్ అప్
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్ సూచన మేరకు వారు గోవా టూర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి.
సిద్ధార్థ్ రాయ్
రీసెంట్‌గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్.. ఏ ఏమోషన్స్ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్‌ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఆట మొదలైంది
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
భక్షక్
సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్‌గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
బబుల్గమ్
ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
యానిమల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
పర్‌ఫ్యూమ్
అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు? అతడు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ.
మంగళవారం
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ
ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఒదెల రైల్వే స్టేషన్
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు.
హెడ్స్ అండ్ టేల్స్
హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
క్రష్
ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
ఏక్ మినీ కథ
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్ శోభన్ (సంతోష్) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ హరి
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.
RDX లవ్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్‌పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.
చీకటి గదిలో చితక్కొట్టుడు
ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
నాతిచరామి
ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.
24 కిసెస్
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
RX 100
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
దండుపాళ్యం 3
దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ.
జూలీ 2
నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించి స్టార్‌గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
బాబు బాగా బిజీ
తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
గుంటూరు టాకీస్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
అవును2
ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఐస్ క్రీమ్ 2
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
నా బంగారు తల్లి
దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్‌లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
ప్రేమ ఒక మైకం
మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
పవిత్ర
శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు.
దండుపాళ్యం
క్రూరమైన ఓ గ్యాంగ్ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్‌ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా నేరుగా చూడవచ్చు.
ది డర్టీ పిక్చర్
ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్‌తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్‌తో(Telugu hot movies) ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ.
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్‌లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
అరుంధతి
ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్‌గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ దుర్యోధన
ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
రా
శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడొచ్చు.
సముద్రం
సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్‌నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉంది.
10th Class
టినేజ్‌లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది.
ఆరుగురు పతివ్రతలు
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
4 లెటర్స్
ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ.
రొమాంటిక్ క్రిమినల్స్
ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
ఈరోజుల్లో
ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో చూడవచ్చు.
అల్లరి
అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్‌గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
నవంబర్ 14 , 2024
Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్ చంద్ర, కిషోర్ కుమార్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, మైమ్ గోపి, రూపలక్ష్మీ తదితరులు
రచన, దర్శకత్వం : కరుణ కుమార్
సంగీతం : జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్
ఎడిటింగ్ : కార్తికేయ శ్రీనివాస్
నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల
విడుదల తేదీ: 14-11-2024
మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review)
కథేంటి
మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చిన రతన్ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
వాసు పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్ స్టైల్, వాకింగ్ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనితో పాటు నవీన్ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఒకప్పటి గ్యాంగ్ స్టార్ రతన్ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్ అయ్యింది. కెమెరామెన్ కిషోర్ కుమార్ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా పీరియాడిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 14 , 2024
Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎందుకంటే?
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్ - ఐనాక్స్ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.
https://twitter.com/MAofIndia/status/1795374893879710125
ఇలా బుక్ చేసుకోండి!
మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.
https://twitter.com/girishjohar/status/1795734272068006128
ఈ సినిమాలు చూడొచ్చు!
ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్ హీరో విష్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.
https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853
గతంలోనూ ఇలాగే..
రూ.99లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 13న 'నేషనల్ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
మే 29 , 2024
Rajamouli: టెన్షన్‌లో రాజమౌళి ఫ్యామిలీ.. ధైర్యం చెప్పిన జపాన్ వాసులు.. అసలు ఏం జరిగిందంటే?
దేశం గర్వించతగ్గ దర్శకుల్లో 'రాజమౌళి' (SS Rajamouli) ఒకరు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ (Jr NTR), రామ్‌చరణ్ (Ramcharan) నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) స్క్రీనింగ్ కోసం ఇటీవలే రాజమౌళి తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని గురించి రాజమౌళి కుమారుడు కార్తికేయ (Karthikeya) స్వయంగా ప్రకటించడంతో అంతా ఆందోళన చెందారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
కార్తికేయ ఏమన్నారంటే?
ప్రస్తుతం రాజమౌళి.. జపాన్‌లో ఫ్యామిలితో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఉంటున్న బిల్డింగ్ మెుత్తం ఒక్కసారిగా ఊగిపోయినట్లు రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ‘జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో 28వ ఫ్లోర్‌లో మేమంతా ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. కొంత సేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి అయితే భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం’ అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ను ఫోటోను కార్తికేయ ఈ పోస్టుకు జత చేశారు.
https://twitter.com/ssk1122/status/1770613017081999768?
ధైర్యం చెప్పిన జపనీయులు
అయితే భూకంపం చూసి కాస్త ఆందోళన చెందిన రాజమౌళి ఫ్యామిలీ (SS Rajamouli Family)కి స్థానిక జపానీయులు ధైర్యం చెప్పారట. ఇక్కడ భూకంపం రావడం సాధారణమేనని పేర్కొన్నారట. వచ్చింది భారీ భూప్రకంపనలు కాదూ అంటూ వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారట. అటు కార్తికేయ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడ్డారు. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు జపాన్‌లో వచ్చిన తాజా భూకంపం తీవ్రత 5.3 రిక్టర్ స్కేల్‌పై నమోదైంద. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రాంతంలో గల ప్రిఫెక్చర్స్ ఏరియాలో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం.
View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
రాజమౌళికి అదిరే ఆతిథ్యం
‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రీనింగ్ కోసం జపాన్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి రాజమౌళికి జపనీయులు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు జపనీయులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చారు. ఒక పెద్దావిడ అయితే రాజమౌళి కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. దీన్ని ప్రత్యేకంగా రాజమౌళి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఓ ఇండియన్ సినిమాకి జపాన్‌లో ఈ రేంజ్‌లో గుర్తింపు రావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ సినిమాను ఇంతలా నెత్తిన పెట్టుకున్న జపనీయులకి రాజమౌళి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌తో తాను తీయబోతున్న చిత్రం విశేషాలు కూడా వారితో పంచుకున్నారు. సినిమా రిలీజ్ సమయానికి మహేష్‌ను కూడా తీసుకొచ్చి ప్రమేషన్స్ చేస్తానని జపనీయులకు దర్శకధీరుడు మాట కూడా ఇచ్చారు.
View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli)
మార్చి 21 , 2024