• TFIDB EN
 • కీడా కోలా (2023)
  U/ATelugu
  స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌

  ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  చైతన్య రావువాస్తు
  రాగ్ మయూర్లాంచం
  జీవన్ కుమార్జీవన్
  విష్ణు ఓయీసికందర్
  రఘు రామ్షాట్లు
  హరి కాంత్
  సిబ్బంది
  ఉపేంద్ర వర్మనిర్మాత
  శ్రీనివాస్ కౌశిక్నిర్మాత
  వివేక్ సుధాంషునిర్మాత
  వివేక్ సాగర్సంగీతకారుడు
  ఎ జె ఆరోన్సినిమాటోగ్రాఫర్
  కథనాలు
  <strong>Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?</strong>
  Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
  నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్‌ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. క‌థ వాస్తు (చైత‌న్య‌రావు), వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) తాత మనవళ్లు. లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్‌ వేస్తారు. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్‌ కార్పొరేట‌ర్ కావాల‌ని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tharun bhascker) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవ‌స‌రం పడటంతో నాయుడు, జీవన్‌ కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎలా సాగిందంటే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి వచ్చిన షార్ప్ షూట‌ర్స్‌ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి.&nbsp; బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ ఈ సినిమాలో న‌టుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీ టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హీరో చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్, గెటప్‌ శీను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా సినిమాలో న‌వ్విస్తాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌, సంగీతం, మాట‌ల‌ు, పాత్ర‌ల హావ‌భావాల‌తో ఆయన న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ ఆయన స‌న్నివేశాల్ని న‌డిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా ప్రేక్ష‌కుల్ని మాత్రం కడుపుబ్బా&nbsp; నవ్వించడంలో తరుణ్ భాస్కర్‌ మరోమారు విజయం సాధించాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ న‌టులు&nbsp;హాస్య సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్‌ ఊహకందే కథనంరొటిన్‌ స్టోరీ రేటింగ్‌ : 3.5/5
  నవంబర్ 03 , 2023
  <strong>This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!</strong>
  This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.&nbsp; విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.&nbsp; ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.&nbsp;&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
  అక్టోబర్ 30 , 2023
  <strong>Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!</strong>
  Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
  అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2&nbsp; సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.&nbsp; కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని&nbsp; డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.&nbsp; ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని&nbsp; హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.&nbsp; రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.&nbsp;
  అక్టోబర్ 26 , 2023
  Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
  Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
  తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.&nbsp; తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్‌ రోల్‌లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు. శైలేష్ కొలను హిట్ యూనివర్స్‌తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్‌లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు సానా కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. కేవీ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్‌ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’&nbsp; సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.&nbsp; వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
  జూన్ 14 , 2023
  రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
  రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
  టాలివుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్‌ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, బాలయ్య, మహేశ్‌ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన రామ్‌ చరణ్ ‘ఆరెంజ్‌’ కూడా ఇటీవల&nbsp; విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా రానున్న రోజుల్లోనూ కొనసాగబోతోంది. అనేక మంది స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.&nbsp; దేశముదురు అల్లు అర్జున్‌ను మాస్‌ హీరోగా చేసిన సినిమా దేశముదురు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా హీరో ఇంట్రో సీన్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా&nbsp; ఏప్రిల్‌ 6, 8 తేదీల్లో దేశముదురు 4K థియేటర్లలో నడవబోతోంది. పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ఐకాన్‌ స్టార్‌ మేనియాను క్యాష్‌ చేసుకోబోతున్నారు. హన్సిక హీరోయిన్‌గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. వైశాలి పాత్రకు వచ్చిన క్రేజ్‌తోనే ఆ తర్వాత హన్సిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.&nbsp;&nbsp; ఆది RRR స్టార్‌గా విశ్వవ్యాప్తం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘తొడ గొట్టు చిన్నా’ డైలాగ్‌ తెలుగు వారందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే మీసాలు వస్తున్న వయసులో జూ.ఎన్టీఆర్ చేసిన బలమైన పాత్ర ‘ఆది’. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వివి వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మే 20న మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సింహాద్రి రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇందులో ఉపయోగించిన కత్తి, కీరవాణి పాటలు అన్నీ అప్పట్లో జనాన్ని ఆకట్టుకున్నవే. మే 20న ‘ఆది’తో పాటే సింహాద్రి కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఇందులో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు.&nbsp; మోసగాళ్లకు మోసగాడు భారత సినీ చరిత్రలోనే తొలి కౌబాయ్‌ ఫిల్మ్‌ ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K వెర్షన్‌ కూడా థియేటర్లో విడుదల కాబోతోంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమా&nbsp; మే 31న మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. KSR దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, ఆరుద్ర స్క్రీన్‌ప్లే అందించారు. కృష్ణ సరసన విజయ నిర్మల నటించారు. ఇంగ్లీష్‌ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత తమిళ హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది. ప్రస్తుతం 4K కు సినిమాను రీస్టోర్‌ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది?”(ENE)కి యూత్‌లో మామూలుగా క్రేజ్‌ ఉండదు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌, కథనం, కామెడీతో 2018లో కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా..ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం సోషల్‌ మీడియాలో నిత్యం తరుణ్‌ భాస్కర్‌ను అడుగుతూనే ఉంటారు. త్వరలోనే తీస్తానని తరుణ్‌ భాస్కర్‌ కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ENE రీ రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించాడు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తానన్న విషయం చెప్పలేదు గానీ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తానని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే&nbsp; రీ రిలీజ్‌ అయిన ఖుషి ఏకంగా రూ.7.73 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. రజినీకాంత్‌ కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ‘బాబా’ రూ.4.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమా పరాజయం వల్ల తన హీరోయిన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని&nbsp; మనీషా కొయిరాలా ఇటీవల బాధను వ్యక్తం చేశారు. కానీ రీ రిలీజ్‌లో మాత్రం ‘బాబా’ ఘన విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్ ‘జల్సా’ కూడా రీ రిలీజ్‌తో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. మహేశ్ బాబు ఒక్కడు రూ.2.25 కోట్లు రాబట్టింది. పోకిరి కూడా బాగానే వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రీ రిలీజ్‌లు చూసే అవకాశముంది. కొన్ని సినిమాలు అప్పట్లో థియేటర్‌లో&nbsp; ఫ్లాప్‌ అయినా టీవీలో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాంటి సినిమాలు థియేటర్లో రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలాగే కొన్ని హిట్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ అయితే బాగుంటుందని నెట్టింట డిమాండ్‌ చేస్తున్నారు. మీరు ఏ సినిమా మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలనుకుంటున్నారు? కామెంట్‌ చేయండి.
  ఏప్రిల్ 01 , 2023

  @2021 KTree