• TFIDB EN
  • కోట బొమ్మాళి P.S
    UATelugu
    కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?

    ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథ...read more

    How was the movie?

    తారాగణం
    శ్రీకాంత్
    రామ కృష్ణ
    వరలక్ష్మి శరత్‌కుమార్
    రజియా అలీ
    రాహుల్ విజయ్
    రవి
    శివాని రాజశేఖర్
    కుమారి
    మురళీ శర్మ
    మంత్రి బరిసెల జయరాజ్
    దయానంద్ రెడ్డి
    విష్ణు Oi
    పవన్ తేజ్ కొణిదెల
    సిబ్బంది
    తేజ మార్నిదర్శకుడు
    బన్నీ వాసు
    నిర్మాత
    విద్యా కొప్పినీడినిర్మాత
    రంజిన్ రాజ్సంగీతకారుడు
    మిధున్ ముకుందన్సంగీతకారుడు
    జగదీష్ చీకాటిసినిమాటోగ్రాఫర్
    కార్తీక శ్రీనివాస్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: సంక్రాంతికి దద్దరిల్లనున్న థియేటర్లు.. ఈ వారం విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్‌ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.  థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గుంటూరు కారం మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. హను-మాన్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్‌ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.  సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు. నా సామిరంగ ఈ సంక్రాంతికి మరో స్టార్‌ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.  అయలాన్‌ సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్‌ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్‌ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్‌ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.  ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్‌ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్‌ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి. కోట బొమ్మాళి P.S శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBreak Point Season 2SeriesEnglishNetflixJan 10King Dom - 3MovieEnglishNetflixJan 10The TrustSeriesEnglishNetflixJan 10Boy Swallows UniverseSeriesEnglishNetflixJan 10Killer SoupMovieHindiNetflixJan 11LiftMovieEnglishNetflixJan 12EchoSeriesEnglishDisney + HotstarJan 11The Legend of HanumanSeriesHindiDisney + HotstarJan 12JourneyMovieTamil SonyLIVJan 12SivappuMovieTamil AhaJan 12La BreaSeriesEnglishJio CinemaJan 10TedSeriesEnglishJio CinemaJan 12Mission: Impossible – Dead Reckoning Part OneMovieTelugu/EnglishAmazon PrimeJan 11RoleplayMovieEnglishAmazon PrimeJan 12
    జనవరి 08 , 2024
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు:  శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్‌ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్ సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి  నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌ నిర్మాతలు: బన్నీ వాసు,  విద్యా  విడుదల తేదీ: నవంబర్‌ 24, 2023 ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న 'నయట్టు'కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ చేరిందా? శివానీ రాజశేఖర్‌ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.  కథ కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, విజయ్‌, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్‌ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు.  మురళీ శర్మ యాక్టింగ్‌ కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్‌ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్‌ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్‌ ఉండటం వల్ల కాస్త బోరింగ్‌ ఫీల్‌ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ పని తీరును మెచ్చుకోవాల్సిందే.  టెక్నికల్‌గా  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రంజన్‌ రాజ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్‌ అయ్యింది. అటు జగదీష్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన పాత్రల నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్ ప్లేబోరింగ్ సీన్లు రేటింగ్‌: 3/5
    నవంబర్ 24 , 2023
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
    నవంబర్ 21 , 2023
    <strong>69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!</strong>
    69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ సౌత్‌ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్‌ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్‌ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాని.. డబుల్‌ ధమాకా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్‌ నాన్న) నాని నామినేట్‌ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), ధనుష్‌ (సర్), నవీన్‌ పోలిశెట్టి (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌ రాజ్‌ (రంగమార్తాండ), ఆనంద్‌ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్‌ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్‌ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.&nbsp; బేబీ చిత్రం హవా! 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్‌ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్‌ (సాయి రాజేష్‌), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌ (విజయ్‌ బుల్గానిన్‌), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164 ఫిల్మ్‌ అవార్డ్స్‌ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే... ఉత్తమ చిత్రం బేబీబలగందసరాహాయ్‌ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టిసామజవరగమనసలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ ఉత్తమ నటుడు ఆనంద్‌ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)ధనుష్‌ (సర్‌)నాని (దసరా)నాని (హాయ్‌ నాన్న)నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) ఉత్తమ నటి: అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)కీర్తిసురేశ్‌ (దసరా)మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ) ఉత్తమ దర్శకుడు: అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)కార్తిక్‌ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)సాయి రాజేశ్‌ (బేబీ)శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)శ్రీకాంత్‌ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం) ఉత్తమ సహాయ నటుడు: బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్‌ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా) ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్‌ కేసరి)శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు) ఉత్తమ గాయని: చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌) ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)బలగం (భీమ్స్‌ సిసిరిలియో)దసరా (సంతోష్‌ నారాయణ్‌)హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్) ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)
    జూలై 17 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌&nbsp; తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న&nbsp; థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..&nbsp; పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.&nbsp; (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.&nbsp; మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.&nbsp; యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి &amp; హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,&nbsp; మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన&nbsp; కృష్ణ (రాహుల్ విజయ్)ని&nbsp; ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    Bhaje Vaayu Vegam Review: ‘RX100’ తర్వాత సాలిడ్‌ హిట్‌ అందుకున్న కార్తికేయ !
    నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ ఎడిటింగ్: జి.సత్య నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌ విడుదల తేదీ : మే 31, 2024 యంగ్‌ హీరో కార్తికేయ (Karthikeya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam). ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తికేయ నటన సినిమాపై అంచనాలు పెంచింది. మరి మే 31న విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఎలా ఉంది? ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ తనదైన నటనతో అదరగొట్టాడు. బాధ, ఎమోషన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లలోనూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లభించలేదు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు తన గ్లామర్‌తో ఏదోలా నెట్టుకొచ్చింది. అటు సోదరుడి పాత్రలో రాహుల్‌ టైసన్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. విలన్‌ పాత్రలో బొమ్మాళి రవిశంకర్‌ ఎప్పటిలాగే తన మార్క్‌ ఏంటో చూపించాడు. తనికెళ్ల భరణి సహా మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి.. తొలి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడు. హీరో లాకప్‌లో ఉండే సీన్‌తో మూవీని మెుదలు పెట్టిన డైరెక్టర్‌.. డిఫరెంట్‌గా ఫ్లాష్‌బ్యాక్‌లో కథను నడిపించారు. స్టోరీ సెటప్‌ కోసం ఫస్టాప్‌ను ఉపయోగించుకున్న అతడు.. ఇంటర్వెల్‌కు ఇచ్చిన బిగ్‌ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని రగిలించారు. అక్కడ నుంచి ఏమాత్రం ఫ్లో మిస్‌ కాకుండా క్లైమాక్స్‌ వరకూ ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించి ఆకట్టుకున్నాడు. అయితే క్లైమాక్స్‌ను రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మెట్‌లో ముగించడం కాస్త ఆసంతృప్తిగా అనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. కెమెస్ట్రీ అసలు వర్కౌట్‌ కాలేదు. కొన్ని లాజికల్‌ ఎర్రర్స్‌ను మినహాయిస్తే ‘భజే వాయు వేగం’ తప్పకుండా థ్రిల్‌ చేస్తుంది. టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కపిల్‌ కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. రాధన్‌ సాంగ్స్‌ కూడా బాగున్నాయి. ఆర్‌.డి రాజశేఖర్‌ కెమెరా పనితనం మెపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కార్తికేయ నటనఇంటర్వెల్‌ ట్విస్ట్‌సెకండాఫ్‌ మైనస్‌ పాయింట్ హీరో హీరోయిన్‌ లవ్‌ట్రాక్‌రొటిన్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూన్ 05 , 2024
    <strong>Gorre Puranam Review: రెండు మతాలకు ఒక గొర్రె టార్గెట్‌ అయితే.. సుహాస్‌ కొత్త చిత్రం మెప్పించిందా?</strong>
    Gorre Puranam Review: రెండు మతాలకు ఒక గొర్రె టార్గెట్‌ అయితే.. సుహాస్‌ కొత్త చిత్రం మెప్పించిందా?
    నటీనటులు : సుహాస్‌, విషికా కోట, పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు డైరెక్టర్‌ : బాబీ వర్మ సంగీతం : పవన్‌. సీహెచ్‌ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌ : వంశీ కృష్ణ రావి నిర్మాత : ప్రశాంత్‌ మాండవ విడుదల తేదీ : 21-09-2024 టాలీవుడ్‌ యువ నటుడు సుహాస్‌ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళతాడు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లిపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. అది తప్పించుకోవడంతో గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరి కొంతమంది పడతారు. ఈ క్రమంలో ఆ గొర్రె ఒక గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం కాస్త మీడియా దృష్టికి వెళ్తుంది. దీంతో మతకలహాలు రేకెత్తిస్తోంది అంటూ గొర్రెను పోలీసులు అరెస్టు చేస్తారు. రవి సెల్‌లోనే దాన్ని ఉంచుతారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్‌కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో సుహాస్‌ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. ఉన్నంతలో అతడు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన సహజసిద్ధమైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాలో నటీనటుల కంటే గొర్రె ఎక్కువసేపు కనిపిస్తుంది. దానికి ఎంతో ఫన్నీగా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి నటుడు, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నవ్వులు పూయించాడు. కమెడియన్‌ గెటప్‌ శ్రీను కూడా ఓ గొర్రెకు డబ్బింగ్‌ చెప్పాడు. మిగతా పాత్రల్లో కనిపించిన కమెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ల పాత్రల నిడివి తక్కువే అయినా కథపై ప్రభావం చూపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు బాబీ వర్మ ఒక గొర్రెను ప్రధాన పాత్రధారిగా తీసుకొని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? లాంటి విషయాలను వ్యాగ్యంగా చెబుతూనే కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్‌. ఈ క్రమంలో ప్రజలు, రాజకీయ నేతలు, మీడియాపై గట్టిగానే సెటైర్లు వేశారు. ఒక పక్కన నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. సుహాస్‌ పాత్రను తీర్చిదిద్దానం విధానం కూడా బాగుంది. అయితే అతడు ఎందుకు హత్య చేశాడు? మరో ముగ్గుర్ని ఎందుకు చంపాలని అనుకున్నాడు? అన్నది కనెక్టింగ్‌గా చూపించడంలో డైరెక్టర్‌ తడబడ్డాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్‌ కాకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగా ప్లస్‌ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సుహాస్‌ నటనకథ, కథనండైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ కమర్షియల్ హంగులు లేకపోవడంవర్కౌట్ కాని ఎమోషన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 21 , 2024
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు రచన &amp; దర్శకత్వం : పరుశురామ్‌ పెట్ల సంగీతం : గోపి సుందర్‌ ఛాయా గ్రహణం : కె.యు మోహనన్‌ ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ విడుదల తేదీ : ఏప్రిల్‌ 5, 2024 విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star Review In Telugu). నేడు (ఏప్రిల్‌ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. గీతా గోవిందం హిట్‌ తర్వాత విజయ్‌తో డైరెక్టర్‌ పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను అందించిందా? వంటి అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గోవ‌ర్ధన్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధన్ చేతికందుతుంది. ఆ పుస్తకం వల్ల ఇద్దరు విడిపోతారు. ఇంత‌కీ ఆ పుస్తకంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధన్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు విజయ్‌ దేవరకొండ (Family Star Review In Telugu) ఎప్పటిలాగానే తన మార్క్ యాటిట్యూడ్‌తో ఈ మూవీలోనూ అదరగొట్టాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి పాత్రలో జీవించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ చూపించి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముఖ్యంగా డ్యాన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.&nbsp; యాక్షన్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నా... తనదైన స్టైల్‌లో మెప్పించాడు. విజయ్- మృణాల్ మధ్య వచ్చే సీన్లు.. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. తన నటనతో పాటు అందం, అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్‌ - మృణాల్‌ మధ్య కెమెస్ట్రీ&nbsp; వీరి మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇక వాసుకి, రోహిణి అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్ పరుశురామ్‌.. ఫ్యామిలీ స్టార్‌ ద్వారా మరోమారు తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. టైటిల్‌కు తగ్గట్లు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ ఫ్యామిలి సెంటిమెంట్, కమర్షియల్ అంశాలతో నింపేసిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ అంశాలు మేళవించి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా విజయ్- మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే ఇగో తాలుకు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబం కోసం మిడిల్‌ క్లాస్‌ వారు ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయాన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు పరుశురామ్. అయితే ఇదే ఫ్లోను సెకండాఫ్‌లో ఇంకాస్త కొనసాగిస్తే బాగుండేది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్‌లో విజయ్- మృణాల్ మధ్య వచ్చే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. &nbsp; రొటిన్‌ కథను ఎంచుకోవడం, డైలాగ్స్‌లో పెద్దగా మెరుపులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. &nbsp; ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Family Star Review In Telugu).. విజయ్‌-పరుశురామ్‌ కాంబోలో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ మూవీకి మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యింది. అయితే&nbsp; ఈ సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు కూడా బాగున్నాయి. ఇంట్రోసాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా, నందా నందన సాంగ్స్ ఫీల్‌ గుడ్‌గా ఉంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచాడు. సినిమా మెుత్తాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దిల్‌రాజు ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ విజయ్‌ - మృణాల్‌ కెమెస్ట్రీఎమోషనల్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vijay-devarkonda.html
    ఏప్రిల్ 08 , 2024
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్‌ ఫ్యాన్స్‌ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
    పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్‌ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp; రీరిలీజ్‌కు కారణమదేనా! టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ రీరిలీజ్‌ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్‌ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్‌ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.&nbsp; థియేటర్లలో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ! ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. పేపర్‌ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన గోలతో థియేటర్‌ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్‌ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. https://twitter.com/i/status/1755066839678460162 https://twitter.com/i/status/1755059327348752417 https://twitter.com/i/status/1755080872309490050 సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. పవన్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్‌ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755097512300691556 https://twitter.com/i/status/1755050940854575519 https://twitter.com/i/status/1755076337927410140 ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్‌ సందర్భంగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్‌ ఫ్యాన్స్‌.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్‌ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు. https://twitter.com/i/status/1755058297563185509 పవన్‌ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్‌ నారాయణ చెప్పే డైలాగ్స్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755087745880564102 సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్‌ స్టెప్పులను ఎంజాయ్‌ చేశారు.&nbsp; https://twitter.com/i/status/1755074209372385626 ‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్‌ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్‌ స్టెప్పులను హైలేట్‌ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1755130614301569433 https://twitter.com/i/status/1755074988850438494 ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్‌ స్క్రీన్‌ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్‌ చేస్తూ గోల గోల చేశారు. https://twitter.com/i/status/1755087070811537517 పవన్‌ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1755120800028582335 https://twitter.com/i/status/1755087298054766925 https://twitter.com/i/status/1755117782461567301
    ఫిబ్రవరి 07 , 2024
    Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?
    Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?
    తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. సస్పెన్స్‌తో కూడిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సరిగ్గా అదే కోవాలోని కథను ఎంచుకున్నారు డైరెక్టర్ బాబా పీఆర్. 'సైదులు' అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకుని పెద్ద సాహసమే చేశారు. రచ్చ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సూర్య భరత్ చంద్ర 'అష్టదిగ్భంధనం' సినిమాలో హీరోగా నటించాడు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? ఓ రాజకీయ పార్టీ అధినేత వద్ద పనిచేస్తున్న శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్‌కు ఎమ్మెల్యే టికెట్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తాను కూడా పోటీచేయాలని ఆ పార్టీ అధినేత రాములన్నకు చెబుతాడు. రూ.50 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తానని చెబుతాడు. దీంతో తన మనుషులతో కలిసి శంకర్ ప్లాన్ వేస్తాడు. శంకర్ వేసిన స్కెచ్‌లో హీరో హీరోయిన్లు( సూర్య, విషికా కోటా) ఎలా ఇరుక్కుంటారు. రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన రూ.100కోట్లు ఎక్కడ దాచాడు? ఆ డబ్బును ఎవరు కొట్టెశారు. అసలు అష్టదిగ్బంధనం ప్లాన్ చేసింది ఏవరు? అనే ట్విస్ట్‌లు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. సినిమా ఎలా ఉందంటే? "యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది.. ఈ యుద్ధం రాజ్యం కోసమే, రాణి కోసమో, అధికార కోసమో కాదు.. అహం కోసం. అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది" అనే డైలాగ్ ట్రైలర్‌లో వినిపిస్తుంది.&nbsp; ఇదే డైలాగ్‌ను సినిమా మొత్తం కథలో చూపించాడు దర్శకుడు బాబా పి.ఆర్.&nbsp; ఇగోతో ఓ వ్యక్తి చేసే పని ఎక్కడికి దారి తీస్తుంది? అనేది ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో కథ సాదా సీదా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచుతుంది.&nbsp; సెకండాఫ్ వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చోట్ల సిల్లీ పాయింట్లు ఉన్నా&nbsp; ఓవరాల్‌గా సినిమా బాగుందని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ప్రేష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరో భరత్ చంద్ర యాక్టింగ్ పర్వాలేదు. హీరోయిన్ విషికా కోటా... అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ నచ్చుతుంది. రౌడీ షీటర్ శంకర్ పాత్రలో నటించిన మహేష్ రావుల్ విలనిజాన్ని బాగా చూపించాడు. యాక్షన్ సీన్స్‌లో జీవించాడు. మిగతా పాత్రలు కూడా తమ క్యారెక్టర్ల పరిధిమేరకు నటించారు.&nbsp; సాంకేతికంగా సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. జాక్సన్ విజయన్ మ్యూజిక్, సాంగ్స్, బీజీఎమ్ పర్వాలేదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాలోని కొన్ని సీన్లలో సత్య తన ఎడిటింగ్‌కు ఇంకాస్త మెరుగుపెడితే బాగుండేది. బలాలు థ్లిల్లర్ కథాంశం ఇంటర్వెల్ ట్విస్ట్ విలన్ శంకర్ క్యారెక్టరైజేషన్ బలహీనతలు కొన్నిచోట్ల లాజిక్ మిస్ సిల్లీ సీన్స్ చివరగా: థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలు కోరుకునే వారికి ఈ చిత్రం నచ్చుతుంది రేటింగ్: 3.5/5
    సెప్టెంబర్ 25 , 2023
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జూన్‌ 21న&nbsp; ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.&nbsp; బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
    Prabhas Mother sentiment Movies: ఈ సినిమాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
    సృష్టిలో ప్రతీ ప్రాణికీ మూల కారణం 'అమ్మ'. అటువంటి తల్లి గురించి చెప్పాలంటే భాష చాలదు. మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 'అమ్మ' పాత్ర‌.. నిజ జీవితంలోనే కాకుండా సినిమాల్లోనూ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే అమ్మ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మనసుకు హత్తుకునే కథలతో చక్కటి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas Mother Sentiment Movies) కు కూడా అమ్మ సెంటిమెంట్‌తో ఉన్న చిత్రాలు తీశారు. అతడి కెరీర్‌లో ఘన విజయాలు సాధించిన చిత్రాలన్ని దాదాపుగా తల్లి సెంటిమెంట్‌తో వచ్చినవే. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar). ఇందులో ప్రభాస్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అదే సమయంలో తల్లి మాటను జవదాటని కొడుకు గాను మెప్పించాడు. తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావడంతో పాటు.. ప్రభాస్‌ మార్క్‌ యాక్షన్‌తో సలార్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటించగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో కనిపించాడు.&nbsp; బాహుబలి ప్రభాస్ హీరోగా రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali), బాహుబలి 2 (Baahubali 2) చిత్రాలలోనూ తల్లి-కొడుకుల సెంటిమెంట్‌ దాగుంది. ప్రభాస్‌, రమ్యకృష్ణ పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. కాగా, ఇందులో రానా (Rana Daggubati).. ప్రభాస్‌కు సోదరుడిగా నటించాడు. అనుష్క (Anushka Shetty) హీరోయిన్‌గా చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంతో ప్రభాస్‌ క్రేజ్‌ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కే పరిమితమైన డార్లింగ్ ఫేమ్‌.. అన్ని ఇండస్ట్రీలకు పాకింది.&nbsp; ఛత్రపతి ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన మరో మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘ఛత్రపతి’ (Chatrapathi). దీనిని కూడా దర్శకధీరుడు రాజమౌళినే తెరకెక్కించారు. ఈ సినిమా ప్రధానంగా యాక్షన్‌ చుట్టూ తిరిగినా.. కథలో తల్లి సెంటిమెంట్‌ అంతర్లీనమై ఉంటుంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా భానుప్రియ (Bhanu Priya) నటించారు. వారిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు వీక్షకుల కళ్లు చెమడ్చేలా చేస్తాయి. కాగా, ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటి శ్రియా (Shriya Saran) చేసింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. యోగి ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన తొలి మదర్‌ సెంటిమెంట్‌ చిత్రం (Prabhas Mother Sentiment Movies) ‘యోగి’ (Yogi Movie). ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద గొప్ప విజయం సాధించనప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. టెలివిజన్‌లో కొన్ని వందలసార్లు అత్యధిక TRP రేటింగ్‌తో ఈ చిత్రం ప్రసారమైంది. ఇందులో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి శారద (Actress Sarada) నటించారు. హీరోయిన్‌గా నయనతార (Nayanthara) చేసింది. వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి రమణ గోగుల, గురు కిరణ్‌ సంగీతం అందించారు. కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌ రావత్‌, ముమైత్‌ ఖాన్‌, వేణు మాధవ్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp;
    ఫిబ్రవరి 05 , 2024
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో వచ్చే వారం పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో చిన్న చితకా సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 20కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం థియేటర్లలలో విడుదలకు సిద్ధమైన సినిమాలు గాఢ్ తమిళ్‌లో హిట్ సాధించిన ఇరైవన్ మూవీ తెలుగులో గాఢ్ పేరుతో అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం ట్విస్ట్‌లతో కూడిన ఈ చిత్రం తమిళ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను సుధన్ సుందరం, జి. జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఐ.అహ్మద్ డైరెక్ట్ చేశారు. మధనపూడి గ్రామం అనే నేను ఓ ఊరి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. శివ కంఠమనేని హీరోగా క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; రతినిర్వేదం మలయాళంలో సూపర్ హిట్‌ అయి తెలుగులోనూ ఒకప్పుడు హిట్ కొట్టిన చిత్రం రతి నిర్వేదం. ఈ చిత్రం అక్టోబర్ 13న రీరిలీజ్ కానుంది. శ్వేతమీనన్, శ్రీజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సగిలేటి కథ రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం సగిలేటి కథ. ఈ చిత్రాన్ని రాజశేఖర్ సుద్మూన్ డైరెక్ట్ చేశారు. రవితేజ మహాదాస్యం, విషిక కోట ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. రాయలసీమ సంస్కృతులు పండుగలు సినిమాలో ప్రధానాంశంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. రాక్షస కావ్యం మైథాలజీని ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ రూపొందించిన చిత్రం రాక్షస కర్తవ్యం. ఈ చిత్రంలో అభయ్ నవీన్, కుశాలిని లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 9- 13) TitleCategoryLanguagePlatformRelease DateMargauxMovieEnglishNetflixOctober&nbsp; 09Big WopWebseriesGermanNetflixOctober 11KasargoldMovieMalayalamNetflixOctober 13Awareness&nbsp;MovieSpanish&nbsp;Amazon PrimeOctober 11&nbsp; In My Mother's &nbsp; &nbsp; SkinMovieTagalog&nbsp;Amazon PrimeOctober 12Everybody Loves Diamonds&nbsp;SeriesItalian&nbsp;Amazon PrimeOctober 13The BurialmovieEnglish&nbsp;Amazon PrimeOctober 13Mathagam Part 2SeriesTelugu DubbedHot StarOctober 12GoosebumpsSeriesEnglishHot StarOctober 13Sultan of DelhiSeriesHindiHot StarOctober 13MattikathaMovieTelugu&nbsp;ahaOctober 13&nbsp; Prema VimanaMovie&nbsp;Telugu&nbsp;Zee 5October 13Star vs Food Survival&nbsp;SeriesHindiDiscovery PlusOctober 09Mr. NagabhushanamSeriesTeluguEtv-WinOctober 13Mission Impossible - Dead Reckoning Part 1MovieEnglishBook My ShowOctober 11Talk To MeMovieEnglishBook My ShowOctober 15The Queen MaryMovieEnglishBook My ShowOctober 15
    అక్టోబర్ 09 , 2023
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
    లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్‌ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.&nbsp; బొమ్మరిల్లు నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.&nbsp; https://www.youtube.com/watch?v=GEBykGzUxk8 సుస్వాగతం సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.&nbsp; https://www.youtube.com/watch?v=iwdC7TGACSk ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.&nbsp; https://www.youtube.com/watch?v=bCTJZbwI5_0 ఆకాశమంత కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్‌లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=nqGXCWmWDuU నాన్నకు ప్రేమతో ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో. చందమామ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=DSCPzIUd8GE నువ్వే నువ్వే కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
    జూన్ 16 , 2023
    Raashii Khanna: కోక కిందకు జారి.. బయటకొచ్చిన రాశీ ఖన్నా ఎద అందాలు
    Raashii Khanna: కోక కిందకు జారి.. బయటకొచ్చిన రాశీ ఖన్నా ఎద అందాలు
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    జూన్ 19 , 2023
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : అజ్మల్‌ అమీర్‌, మానస రాధాక్రిష్ణన్‌, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్‌ ప్రభూనే, కోటా జయరామ్‌, ఎలెనా టుతేజా తదితరులు దర్శకుడు : రామ్‌గోపాల్‌ వర్మ సంగీతం : బాలాజీ సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్‌ ఎడిటింగ్‌ : మనీష్‌ థాకూర్‌ నిర్మాత : దాసరి కిరణ్‌ కుమార్‌ టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్‌ (ధనుంజయ్‌ ప్రభునే), పవన్‌ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్‌ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే వైఎస్‌ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్‌ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్‌ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్‌ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్‌ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్‌ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్‌ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ పాత్రకు పాత్రకు మైలేజ్‌ ఇస్తూ.. చంద్రబాబు, పవన్‌ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్‌ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది. టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్‌ రాజేంద్రన్‌ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ అజ్మల్‌ అమీర్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ కమర్షియల్‌ హంగులు లేకపోవడంద్వితీయార్థంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మార్చి 02 , 2024
    <strong>Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!</strong>
    Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!
    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'క' (Ka Movie). యువ డైరెక్టర్లు సుజీత్‌ - సందీప్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్​గా నటించింది. 2024 దీపావళి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. తొలి 4 డేస్‌లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కంటెంట్‌ పరంగా చూస్తే&nbsp; అంతకంటే ఎక్కువ వసూళ్లనే ‘క’ రాబట్టి ఉండేది. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయం వల్ల ఈ మూవీ కలెక్షన్స్‌లో భారీ కోత పడింది. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్‌లో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నాకర్థంగా మారవచ్చు.&nbsp; థియేటర్ల కేటాయింపులో అన్యాయం కిరణ్‌ అబ్బవరం నటించిన ‘క’ చిత్రాన్ని దీపావళికి తీసుకొస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చేటప్పటికీ దివాలీ రేసులో ఏ చిత్రం లేదు. ఆ తర్వాత దీపావళి బరిలోకి ‘క’ (Ka)తో పాటు ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar), ‘అమరన్‌’ (Amaran), ‘బఘీరా’ (Bagheera) వచ్చి చేరాయి. ఇందులో ‘లక్కీ భాస్కర్‌’ మినహా మిగిలిన రెండు చిత్రాలు పరభాష చిత్రాలే. తమిళ, కన్నడ చిత్రాలైనా ‘అమరన్‌’, ‘బఘీరా’ను తెలుగులో రిలీజ్‌ చేయడం వల్ల ‘క’ సినిమాకు ఆశించిన థియేటర్లు లభించలేదు. పైగా అమరన్‌ చిత్రాన్ని ప్రదర్శించేందుకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఆసక్తికనబరిచాయి. మైత్రి మూవీ మేకర్స్‌ వంటి బలమైన నిర్మాణ సంస్థ లక్కీ భాస్కర్‌ను నిర్మించడంతో థియేటర్ల విషయంలో ఆ సినిమాకు పెద్దగా సమస్య ఏర్పడలేదు. కానీ ‘క’ చిత్రానికి మాత్రం తీవ్ర నష్టం ఎదురైంది. చిన్న సినిమా కావడం, పెద్ద స్టార్ హీరో లేకపోవడంతో ‘క’ సినిమాను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముందుకు రాలేదు. దీనివల్ల తెలుగు స్టేట్స్‌లో కేవలం 147 థియేటర్లలోనే ‘క’ రిలీజ్‌ కావాల్సి వచ్చింది. ఒకవేళ ముందుగానే అమరన్‌, బఘీరా చిత్రాలను దీపావళికి రాకుండా అడ్డుకొని ఉంటే ‘క’ చిత్రానికి థియేటర్లు పుష్కలంగా లభించేవి. మంచి హిట్ టాక్‌ వచ్చినందున సులువుగానే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది.&nbsp; తెలుగు చిత్రాలను పట్టించుకోని ‘కోలీవుడ్‌’! తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారు. కోలీవుడ్‌ స్టార్స్‌ సూర్య, కార్తీ, విక్రమ్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లకు తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తమిళ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించడంలో తెలుగు ఆడియన్స్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, మన చిత్రాల విషయానికి వచ్చే సరికి తమిళనాడులో ఆ స్థాయి ఆదరణ లేదు. తమిళ దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులకు తెలుగు చిత్రాలంటే కాస్త చిన్నచూపు. ‘క’ విషయంలో ఇది మరోమారు బయటపడింది. పాన్‌ ఇండియా రిలీజ్‌లో భాగంగా ‘క’ చిత్రాన్ని తమిళనాడులో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేశారు. కానీ, తమిళ దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ‘క’ చిత్రాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. త‌మిళంలో దీపావ‌ళికి వ‌స్తున్న సినిమాల‌కు ‘క‌’ అడ్డుత‌గులుతుంద‌ని భావించి ఒక్క థియేటర్‌ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రకటించారు. అదే తమిళనాడులో ‘క’ రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు దొరకని కారణంగా ‘క’ వారం రోజులు ఆలస్యంగా అక్కడ రిలీజ్‌ కాబోతోంది.&nbsp; పట్టించుకోని మీడియా! తమిళనాడుతో పాటు, తెలుగు స్టేట్స్‌లోనూ ‘క’ సినిమాకు అన్యాయం జరిగితే టాలీవుడ్‌ పెద్దలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్‌ అబ్బవరం ఫెయిల్యూర్స్‌ గురించి పదే పదే ప్రస్తావించే తెలుగు ఫిల్మ్‌ సైట్స్‌, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా.. భారీ విజయం సాధించినప్పటికీ జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. మీ సినిమాకు అంత బడ్జెట్ అవసరమా? తిరిగి రికవరీ చేయగలరన్న నమ్మకం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించే విలేఖరులు కలెక్షన్స్‌ దారుణంగా కోతకు గురవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మంచి సినిమాను బతికించాల్సిన బాధ్యత ఎంటర్‌టైన్‌ మీడియాకు లేదా?. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ముఖ్యంగా పండగ సీజన్లలో చిన్న సినిమాను రిలీజ్‌ చేయాలంటే యంగ్‌ హీరోలు, డైరెక్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి తలెత్తవచ్చు.&nbsp; మార్పు తప్పనిసరి! బాలీవుడ్‌, కోలివుడ్‌, శాండిల్‌వుడ్‌, మల్లువుడ్‌, హాలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా విడుద‌లైనా, అది ఎలాంటి సీజ‌న్ అయినా వాళ్ల‌కు థియేట‌ర్లు ఇచ్చేస్తారు. అవసరమైతే పోటీగా నిలిచిన చిన్న చిత్రాలు సైడ్ అయ్యేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, ద‌స‌రా, దీపావ‌ళి, సమ్మర్‌ లాంటి సీజ‌న్ల‌లో ప‌క్క రాష్ట్రాల నుంచి వ‌చ్చే డ‌బ్బింగ్ సినిమాల‌కు చెక్ పెట్టాలి. ఓ వారం ఆల‌స్యంగా విడుద‌ల చేయ‌మ‌నాలి. అప్పుడు తెలుగు సినిమాల‌కు మంచి వ‌సూళ్లు ద‌క్కుతాయి. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రికీ అన్యాయం చేయడం లేదు. త‌మిళనాట త‌మిళ చిత్రాల‌కే ప్రాధాన్యం ఇచ్చిన‌ప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు వ‌ర్తింప‌జేయ‌కూడ‌ద‌ు. దీనిపై టాలీవుడ్‌ పెద్దలు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆలోచన చేయాలి.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Sana Makbul : బిగ్‌బాస్‌ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్</strong>
    Sana Makbul : బిగ్‌బాస్‌ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్
    హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌3 విజేతగా టాలీవుడ్ నటి సనా మక్బుల్‌ (Sana Makbul) నిలిచింది. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట మార్మోగుతోంది. సనా మక్బుల్‌ గురించి తెలుసుకునేందుకు బిగ్‌ బాగ్‌ ఆడియన్స్‌ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ భామను ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు సైతం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.&nbsp; ముంబయిలో పుట్టి పెరిగిన సనా మక్బుల్‌ తెలుగు ఫిల్మ్‌తోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు సనా టెలివిజన్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించింది. 'ఇషాన్ : సప్నో కో అవాజ్‌ దే', 'కితనీ మెహబ్బత్‌ హై 2', 'ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ దూన్‌?', 'అర్జున్‌' వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించింది.&nbsp; ఆ ఫేమ్‌తోనే దిక్కులు ‘చూడకు రామయ్య’ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌ చిత్రంలో సంహిత పాత్రలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.&nbsp; ఆ తర్వాత 'రంగూన్‌' (2017) అనే తమిళ ఫిల్మ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక అదే ఏడాది 'కాదల్‌ కండీషన్స్ అప్లే' అనే మూవీలోనూ సనా మక్బూల్‌ నటించింది.&nbsp; 2017లో 'మామ ఓ చందమామ' అనే తెలుగు ఫిల్మ్‌లో సనా మక్బూల్‌ నటించింది. ఇందులో బుజ్జమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.&nbsp; తెలుగులో చేసిన రెండు చిత్రాలు కమర్షియల్‌గా హిట్‌ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌పై సనా ఫోకస్‌ పెట్టింది.&nbsp; హిందీలో గేమ్స్‌, వినోదానికి సంబంధించిన పలు రియాలిటీ షోలలో పాల్గొని అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.&nbsp; ఈ క్రమంలోనే ఇటీవల 'బిగ్‌ బాస్‌ ఓటీటీ 3' రియాలిటీ షోలో పాల్గొని తన ప్రవర్తనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది. తాజాగా టైటిల్‌ సైతం గెలుచుకొని విజేతగా నిలిచింది.&nbsp; సనా మక్బూల్‌ పలు మ్యూజిక్‌ వీడియోలలో నటించింది. ‘ఖేలేగి క్యా?’, ‘సైకో’, ‘గల్లాన్‌’, 'ఎక్‌ తూ హి తో హై' ఆల్బమ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.&nbsp; బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు వరకూ తన హాట్‌ ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తించింది.&nbsp; ఈ అమ్మడి అందచందాలను చూసి నెటిజన్లు మైమరిపోయారు. ఇంతటి అందాల తారకు హీరోయిన్‌గా ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.&nbsp; ఇన్‌స్టాగ్రామ్‌లో సనా మక్బూల్‌కు పెద్ద ఎత్తునే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఖాతాను 2.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 03 , 2024

    @2021 KTree