• TFIDB EN
  • క్రాక్
    UATelugu2h 34m
    హీరో నిక్కచ్చిగా ఉండే పోలీసాఫీసర్‌. సీఐగా ఒంగోలుకి వెళ్లాక అక్కడ ముఠా నాయకుడు కఠారి కృష్ణ(సముద్రఖని)తో వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్యతో కఠారీ కృష్ణకు సంబంధం ఏంటి? ఈ కేసును వీరశంకర్‌ (రవితేజ) ఎలా ఛేదించాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రవితేజ
    సీఐ పోతరాజు వీర శంకర్
    శృతి హాసన్
    శంకర్ భార్య
    సముద్రకని
    కటారి కృష్ణ
    వరలక్ష్మి శరత్‌కుమార్
    జయమ్మ
    పి. రవిశంకర్
    సుబ్బారెడ్డి అల్లుడు (అతి అతిథి పాత్ర)
    అలీ
    శంకర్ స్నేహితుడు
    సుధాకర్ కోమాకుల
    కానిస్టేబుల్ కిరణ్
    సాత్విక్ మలినేనికల్యాణి మరియు శంకర్ కుమారుడు
    చిరాగ్ జానీ
    సలీమ్ బత్కల్
    ప్రియాంక రామన్దీప్తి బేడీ
    హైపర్ ఆది
    కానిస్టేబుల్
    సప్తగిరి
    సుబ్బా రెడ్డి
    పోసాని కృష్ణ మురళి
    ఎస్పీ
    దేవీ ప్రసాద్
    SI తిలక్
    ముక్కు అవినాష్కానిస్టేబుల్ సాయి కుమార్
    ఆశ్రిత వేముగంటికటారి కృష్ణ భార్య
    అనీష్ కురువిల్లా
    ఎస్పీ మురళీ శర్మ
    జీవా
    లోకల్ రౌడీ
    కత్తి మహేష్
    కత్తి
    స్టన్ శివ
    అంకుడు
    B. V. S. రవి
    ప్రేక్షకుడు
    అంకిత మహారాణా
    భూమ్ బద్దాల్ అనే పాటలో అప్సర రాణి ప్రత్యేక పాత్ర
    సిబ్బంది
    గోపీచంద్ మలినేని
    దర్శకుడు
    ఠాగూర్ బి. మధునిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    మత్తెక్కిస్తున్న అప్సరా రాణి అందాలు
    మత్తెక్కిస్తున్న అప్సరా రాణి అందాలు
    ]రవితేజ క్రాక్ సినిమాలో బుమ్ బద్ధలు అనే ఐటం సాంగ్‌తో ఆకట్టుకుంది
    అక్టోబర్ 21 , 2022
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)  గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.  శృతి హాసన్ ముద్దు పేరు? కన్నా శృతి హాసన్ వయస్సు ఎంత? 1986, జనవరి28న జన్మించింది శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అనగనగా ఓ ధీరుడు(2011) శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా? లక్(2009) శృతి హాసన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  శృతి హాసన్ ఎక్కడ పుట్టింది? చెన్నై, తమిళనాడు శృతి హాసన్  ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ శృతి హాసన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా? హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది. శృతి హాసన్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రజనీకాంత్ శృతి హాసన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల  వరకు ఛార్జ్ చేస్తోంది. శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు? కమల్ హాసన్, సారిక ఠాకూర్ శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shrutzhaasan/?hl=en శృతి హాసన్ వ్యాపారాలు? శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=mos5_ozTwEE శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    ఏప్రిల్ 27 , 2024
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్‌, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.  ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్‌, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.  గౌతమ్ మీనన్‌ ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్‌ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు. భారతీ రాజా శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా. తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్‌ వచ్చినా తరుణ్ భాస్కర్‌ వదులుకోవట్లేదు.  రిషబ్‌ శెట్టి కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్‌ బాయ్‌, స్పాట్ బాయ్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్‌ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియాను షేక్‌ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. 
    ఏప్రిల్ 27 , 2023
    <strong>Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;</strong>
    Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్‌’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్‌’, ‘మిరపకాయ్‌’, ‘పవర్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘రాజాది గ్రేట్‌’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్‌ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్‌. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్‌ వెంటాడుతుండటంతో ఈ మాస్‌ మహారాజ్‌ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ! మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్‌ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్‌ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.&nbsp; బాలయ్యను కాదని.. ‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్‌ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్‌ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్‌ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.&nbsp; ఫ్లాప్స్‌ బెడద తట్టుకోలేకనే! ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్‌) సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్‌) యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్‌’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్‌, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్‌ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్‌ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.&nbsp; మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా? ‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ అయిన రంగా (ఫహద్‌ ఫాజిల్‌)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్‌ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్‌ ఫాజిల్‌ క్యారెక్టరైజేషన్‌ ఈ కథలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తెలుగులో ఆ క్యారెక్టర్‌ సీనియర్‌ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్‌, అగ్రెషన్‌ ఇలా అన్ని షేడ్స్‌ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
    Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
    ప్రస్తుతం టాలీవుడ్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘హనుమాన్‌’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమాలకు ముందు టాలీవుడ్‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. బాలీవుడ్‌ వర్గాలకు తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చిన్నచూపు ఉండేదని అప్పట్లో టాక్‌ వినిపించింది. ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన పాన్‌ ఇండియా చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి డైరెక్టర్ల ప్రతిభ హిందీ స్టార్లను ఆకర్షిస్తోంది. దీంతో వారు టాలీవుడ్‌ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు టాలీవుడ్‌ డైరెక్టర్లతో బాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాలు కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్లు ఎవరు? ఏ బాలీవుడ్‌ స్టార్‌తో వారు సినిమా చేయబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం.&nbsp; రణ్‌వీర్‌ - ప్రశాంత్‌ వర్మ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma).. 'హనుమాన్‌' (Hanu Man) చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రశాంత్‌ అంటే బాలీవుడ్‌ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడికి బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో సినిమా చేసే అవకాశం దక్కింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్‌వీర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.&nbsp; సన్నీ డియోల్‌ - గోపిచంద్‌ మలినేని దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni)కి టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. కొత్త తరహా కథతో అద్భుతమైన యాక్షన్‌ చిత్రాలను ఆయన రూపొందిస్తుంటారు. ఇలా వచ్చి సూపర్‌ హిట్ సాధించినవే ‘క్రాక్‌’ (Krack), ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు. ఇదిలా ఉంటే అతడికి బాలీవుడ్‌ నుంచి సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గదర్‌ 2’ (Gadar 2)సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ అందుకున్న సన్నీ డియోల్ (Sunny Deol)తో గోపిచంద్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఆయన శైలీలోని యాక్షన్‌ డ్రామాగా రానున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ వచ్చేనెలలో మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.&nbsp; షాహిద్‌ కపూర్‌ - వంశీ పైడిపల్లి టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally).. గత కొంతకాలంగా తెలుగు హీరోలకంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌తో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత చిత్రం ‘వారసుడు’లో విజయ్‌ హీరోగా చేశాడు. ఇక తన అప్‌కమింగ్‌ చిత్రం కోసం బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor)ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షాహిద్‌ కపూర్‌కు కథ చెప్పి ఒప్పించినట్లు కూడా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్రాలను డబ్‌ చేసి విడుదల చేసే గోల్డ్‌మైన్‌ సంస్థ.. ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.&nbsp; సాయి రాజేశ్‌ గతేడాది జులైలో రిలీజైన ‘బేబీ’ (Baby) చిత్రం టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు సాయి రాజేశ్‌.. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకర్షిస్తాడో చూడాలి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా - రణ్‌బీర్‌ కపూర్‌ టాలీవుడ్‌ అగ్రెసివ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన రీసెంట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal).. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. బాలీవుడ్‌ లవర్‌ బాయ్ రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)ను గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్‌గా ఈ సినిమాలో చూపించాడు. అయితే యానిమల్‌కు సీక్వెల్‌ కూడా భవిష్యత్‌లో రానుంది. రణ్‌బీర్‌ను మరింత వైలెంట్‌గా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చూపించనున్నారు. ప్రస్తుతం సందీప్‌.. ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత ‘యానిమల్‌ 2’ పట్టాలెక్కనుంది.&nbsp;
    మే 06 , 2024
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్‌ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.&nbsp; తొలి కలెక్షన్స్ ఎంతంటే? తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్‌ దూకుడు ప్రదర్శించింది. యూఎస్‌ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు. రవితేజ టాప్‌-10 కలెక్షన్స్‌! (Ravi Teja Top 10 Highest Grossing Movies) ‘ఈగల్’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్‌ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. ధమాకా (Dhamaka) రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్‌ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.20 కోట్ల వరకూ జరిగింది.&nbsp; బడ్జెట్: 35 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు క్రాక్‌ (Krack)&nbsp; ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్‌, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్‌ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు తీర్పు: బ్లాక్ బస్టర్ రాజా ది గ్రేట్‌ (Raja the Great) రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్‌ కాగా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు తీర్పు: హిట్ బలుపు (BALUPU) రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రవితేజ గత చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.&nbsp; బడ్జెట్: 55 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు పవర్‌ (Power) రవితేజ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్‌’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్‌.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్‌ గణాంకాలను నమోదు చేసింది.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు తీర్పు: సగటు కంటే ఎక్కువ బెంగాల్ టైగర్‌ (Bengal Tiger) ఈ సినిమా బడ్జెట్‌ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు విక్రమార్కుడు (Vikramarkudu) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్‌ హిట్‌ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.&nbsp; బడ్జెట్: 11 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు కిక్‌ (Kick) రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్‌’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ కూడా అంతకే జరగడం గమనార్హం.&nbsp; బడ్జెట్: 14 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు కిక్‌ (KICK 2) అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్‌ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ బిజినెస్‌ రూ.36 కోట్లు. కిక్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; బడ్జెట్:&nbsp; 30Cr ప్రపంచవ్యాప్తంగా గ్రాస్:&nbsp; 43cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
    ఫిబ్రవరి 10 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Devara Record: 50 రోజులు క్రాస్ చేసిన దేవర… ఎన్ని సెంటర్లలో అంటే?
    Devara Record: 50 రోజులు క్రాస్ చేసిన దేవర… ఎన్ని సెంటర్లలో అంటే?
    ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కలెక్షన్స్‌ బట్టి కాకుండా ఎన్ని రోజులు ఆడింది అన్నదానిని కొలమానంగా తీసుకునేవారు. ఈ నేపథ్యంలోనే గతంలో హిట్టైన చాలా వరకూ చిత్రాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. కొన్ని చిత్రాలైతే ఏకంగా 200 డేస్‌ ఫంక్షన్స్‌ కూడా జరుపుకున్నాయి. రామారావు, నాగేశ్వరరావు కాలంలో అయితే ఏడాది పొడవునా సినిమాలు ప్రదర్శితమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత ఓటీటీ యుగంలో ఆ పరిస్థితి లేదు. బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమా సైతం నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో 50 రోజులు, 100 రోజులు అన్నమాటే ఇండస్ట్రీలో వినిపించడం లేదు. అయితే తారక్‌ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) ఈ సైలెన్స్‌ను బద్దలు కొట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘దేవర’.. హాఫ్‌ సెంచరీ తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara Record). సెప్టెంబర్‌ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇదిలా ఉంటే దేవర చిత్రం తాజాగా ఓ ఫీట్‌ సాధించింది. 52 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు (Devara 50 Days in 52 Centers) ప్రదర్శితమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్స్‌ రిలీజ్ చేశారు. సీడెడ్‌, ఉత్తరాంధ్ర, కృష్టా, నైజాం, ఈస్ట్‌, వెస్ట్‌, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లోని ఏ ఏ థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందో వివరించారు. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ‘దేవర’ హాఫ్‌ సెంచరీ చేయడం విశేషం. ఇది చూసిన తారక్‌ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.  https://twitter.com/DevaraMovie/status/1857054185000153358 ఓటీటీలోనూ ట్రెండింగ్‌ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన 'దేవర' (Devara Record) చిత్రాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. నవంబర్‌ 8 నుంచి తెలుగు, తమిళం, మలయాళం సహా పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ‘దేవర’ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓటీటీలోనూ దేవరకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్టు స్థాయి స్ట్రీమింగ్ మినిట్స్‌ను తారక్‌ చిత్రం నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చి వారం అవుతున్నా ఇప్పటికీ టాప్‌-10లో దేవరోడు ట్రెండింగ్ అవుతున్నాడు. సినిమాను ఆల్రెడీ చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.  త్వరలో సెట్స్‌పైకి 'NTR 31' కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)తో తారక్ (Jr NTR) ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. NTR 31 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.  పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని అంటున్నారు. (Devara 50 Days in 52 Centers)ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం తారక్‌ ‘వార్‌ 2’ చిత్రంలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ బాలీవుడ్‌ చిత్రంలో తారక్‌ నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్‌.  రజనీ డైరెక్టర్‌తో తారక్‌ మూవీ? తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dileep Kumar)తో తారక్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీకి సంబంధించిన డిస్కషన్‌ కూడా జరిగిందని అంటున్నారు. కథ పట్ల తారక్‌ సానుకూలంగా స్పందించాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఉంటుందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల 'జైలర్‌'ను తెరకెక్కించి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సాలిడ్‌ హిట్ అందుకున్నారు. ఇందులో రజనీని ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించి ప్రశంసలు దక్కించుకున్నారు. ప్రస్తుతం 'జైలర్‌ 2' సినిమాతో నెల్సన్‌ బిజీగా ఉన్నారు. దాని తర్వాత తారక్‌ - నెల్సన్‌ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
    నవంబర్ 15 , 2024
    Shubra Aiyappa: స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర&nbsp;
    Shubra Aiyappa: స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు దాటిన శుభ్ర&nbsp;
    శుభ్ర అయ్యప్ప తాజాగా హాటో ఫోటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది.  కంప్లీట్ క్రాప్ టాప్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. స్లీవ్ లెస్ టాప్‌లో నడుమందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ గ్లామర్ పిక్స్ చూసిన ఆమె అభిమానులు లుకింగ్ హాట్, గార్జియస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  శభ్ర అయ్యప్ప తమిళ్ నటి. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. శుభ్ర అయ్యప్ప 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది.&nbsp; &nbsp;బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa) వై. వి. ఎస్. చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన 'రేయ్' సినిమాలో తొలిసారిగా కనిపించింది. &nbsp;ఆ తర్వాత 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా శుభ్ర అయ్యప్ప(Shubra Aiyappa)&nbsp; హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా యాక్ట్ చేసింది. 2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.&nbsp; అదే ఏడాదిలో వచ్చిన&nbsp; 'వజ్రకాయ' అనే కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది. &nbsp;ఈ సినిమాలో శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.&nbsp; ఆ తర్వాత యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది. శుభ్ర అయ్యప్ప గతేడాది జనవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త విశాల్‌ శివప్పతో ఆమె ఏడడుగులు వేసింది.&nbsp; View this post on Instagram A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa) అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో….150 ఏళ్ల ప్రాచీన గృహంలో గురువారం వీరి వివాహం జరిగింది.&nbsp; ప్రస్తుతం తమిళ్, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు లేనప్పటికీ... కన్నడలో మాత్రం దూసుకెళ్తోంది. అక్కడ తిమ్మయ్య తిమ్మయ్య, రామన అవతార వంటి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
    ఏప్రిల్ 01 , 2024
    <strong>Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!</strong>
    Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!
    2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాలు దేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసు దోచాయి. ప్రతిసారి హీరోల స్టార్ పవర్‌తోనే కాకుండా, కథనం, పాటలు, సంగీతం వంటి అంశాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్లో నిలిపాయి. ఈ సంవత్సరంలో పలు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. హనుమాన్, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు ఈ జాబితాలో చేరి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇప్పుడు 2024లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ప్రధాన తెలుగు చిత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. హనుమాన్ (Hanuman): తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టి. సంక్రాంతి సందర్భంగా విడుదలై, దేశవ్యాప్తంగా సుమారు రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్టార్ హీరోల అవసరం లేకుండానే, మంచి కథ, దర్శకత్వం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. 2. టిల్లు స్క్వేర్ (Tillu Square): సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం, 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా విడుదలైంది. చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. 3. కల్కి 2898 AD (Kalki 2898 AD): ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, జూన్‌లో విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఆరోవది కావడం విశేషం. 4. సరిపోదా శనివారం (Saripoda Sanivaram): నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నానికి మరో విజయాన్ని అందించింది. 5. దేవర (Devara): ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 6. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar): దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. 7. పుష్ప 2 (Pushpa 2): అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలై రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు (రూ.280 కోట్లు)సాధించిన తొలి చిత్రంగా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 8. సలార్ (Salaar): ప్రభాస్ నటించిన ఈ చిత్రం, 2023 డిసెంబర్‌లో విడుదలైనప్పటికీ, 2024లో కూడా గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్‌కు మరో విజయాన్ని అందించింది. 9. అమరన్ (Amaran): శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం, తమిళనాట విడుదలై, పాన్ ఇండియావైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది. 10. గోట్ (G.O.A.T): విజయ్ నటించిన ఈ చిత్రం, పలు చోట్ల మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, విజయ్‌కు మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
    డిసెంబర్ 19 , 2024
    <strong>South-Indian Films In Rs 500 Crore Club: దక్షిణాదిలో రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన చిత్రాలు.. ఓ లుక్కేయండి!</strong>
    South-Indian Films In Rs 500 Crore Club: దక్షిణాదిలో రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన చిత్రాలు.. ఓ లుక్కేయండి!
    జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Dveara) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి నాలుగు రోజుల్లో రూ.325 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. అయితే సౌత్‌ నుంచి వచ్చిన పలు చిత్రాలు ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు సాధించాయి? ఓవరాల్‌ కలెక్షన్స్ ఎంత? ఆయా చిత్రాల డైరెక్టర్లు ఎవరు? ఏ స్టార్‌ హీరో అందులో నటించాడు? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఓవరాల్‌గా రూ.1200 కోట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.&nbsp; యానిమల్‌ (Animal) బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆరు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 917.82 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవరాల్‌గా రూ.700 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp; RRR రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' పలు రికార్డులను కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.570 కోట్లను కొల్లగొట్టి ప్రశంసలు అందుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. కేజీఎఫ్‌ 2 (KGF 2) కన్నడ నటుడు యష్‌ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌-2’ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాల సక్సెస్‌తో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో యష్‌ పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.&nbsp; బాహుబలి (Baahubali) ప్రభాస్‌ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌ సత్తా ఏంటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.600-650 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.&nbsp; బాహుబలి 2 (Baahubali 2) బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టి దేశంలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.&nbsp; రోబో 2.0 (Robo 2.0) రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ శంకర్‌ (Director Shankar) తెరకెక్కించిన ‘రోబో 2.0’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లనే సాధించింది. ఈ మూవీ తొలి 7 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.700 - 800 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు.&nbsp; జవాన్‌ (Jawan) బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ (Director Atlee) తెరకెక్కించిన జవాన్‌ చిత్రం గతేడాది సెప్టెంబర్‌లో రిలీజై బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం 4 రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లను సాధించింది. మెుత్తంగా రూ.1,148.32 కోట్లను బాక్సాఫీస్‌ వద్ద రాబట్టింది.&nbsp;
    అక్టోబర్ 01 , 2024
    <strong>Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్</strong>
    Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; 15 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఇది&nbsp; నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927 ఏకైకా సౌత్‌ హీరోగా ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్‌ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్‌ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్‌ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్‌, పఠాన్‌ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.&nbsp; త్వరలో టాప్‌-3లోకి ‘కల్కి’ తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్‌ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్‌ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్‌’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, జవాన్ సినిమాలకు షాక్‌ తప్పేలా లేదు. డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 13 , 2024
    <strong>Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్‌, తారక్‌, బన్నీ.. బాక్సాఫీస్‌ బరిలో ఎవరి బలమెంత..?&nbsp;</strong>
    Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్‌, తారక్‌, బన్నీ.. బాక్సాఫీస్‌ బరిలో ఎవరి బలమెంత..?&nbsp;
    టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్‌ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్‌ హిట్‌ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రూ.1000 కోట్లకు పైగా మార్కెట్‌! దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్‌ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్‌ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్‌ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్‌ 2’, ‘స్పిరిట్‌’, ‘రాజాసాబ్‌’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.&nbsp; రూ.700-1000 కోట్ల మార్కెట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్‌ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉన్న నేపథ్యంలో హిట్‌ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్‌ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్‌ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ టచ్‌ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ తర్వాతి ప్రాజెక్ట్స్‌ తారక్‌ (NTR31), ప్రభాస్‌ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.&nbsp; రూ. 500-700 కోట్ల మార్కెట్‌ ఈ మార్కెట్‌ రేంజ్‌లో టాలీవుడ్‌ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ramcharan), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు సరైన హిట్‌ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్‌ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్‌ కూడా డైరెక్టర్‌ శంకర్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఎన్టీఆర్‌ తరహాలోనే చరణ్‌ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.&nbsp; రూ.200-500 కోట్ల మార్కెట్‌ టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్‌ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్‌ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్‌ ఫిల్మ్‌ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్‌ రూ.200 పైనే ఉండనుంది.&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు&nbsp;
    Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు&nbsp;
    ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్‌ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.&nbsp; అల్లు అర్జున్&nbsp; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.&nbsp; పీవీ సింధు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.&nbsp; రష్మిక మందన్న పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.&nbsp; రణ్‌వీర్ సింగ్&nbsp; 18.17 కోట్ల డాలర్లతో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్‌వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.&nbsp;&nbsp; విరాట్ కోహ్లీ&nbsp; కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.&nbsp; అక్షయ్ కుమార్&nbsp; బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.&nbsp; అలియా భట్ లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.&nbsp; దీపిక పదుకొణె 8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది. ఎం.ఎస్.ధోనీ&nbsp; రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.&nbsp; అమితాబ్ బచ్చన్&nbsp; బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.&nbsp; సచిన్ తెందుల్కర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. హృతిక్ రోషన్ 7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.&nbsp; షారూక్ ఖాన్ కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.&nbsp; సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.&nbsp; రణ్‌బీర్ కపూర్ సల్మాన్ ఖాన్‌తో సమానంగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్‌తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్‌బీర్.&nbsp; రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్. ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.&nbsp; అనుష్క శర్మ&nbsp; సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.&nbsp; కియారా అడ్వాణీ&nbsp; ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.&nbsp; కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్&nbsp; కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్‌ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.&nbsp; హార్దిక్ పాండ్యా భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.&nbsp; సారా, వరుణ్.. సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.&nbsp; నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
    మార్చి 22 , 2023
    <strong>Pushpa 2: సినిమా చూడండి అంటూ నాగబాబు ట్వీట్.. తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యాన్స్</strong>
    Pushpa 2: సినిమా చూడండి అంటూ నాగబాబు ట్వీట్.. తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యాన్స్
    అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై మెగా ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. అంతేకాదు ‘పుష్ప 2’కి సంబంధించి ఏ చిన్న నెగిటివ్‌ వార్త కనిపించినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ నెట్టింట దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం దీటుగా బదులిస్తుండటంతో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గురువారం (డిసెంబర్‌ 5) ‘పుష్ప 2’ వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మరో రెండు గంటల్లో ప్రీమియర్స్‌ సైతం పడనున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు ఎక్స్‌ వేదికగా మెగా ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు. ‘సినిమాను చూడండి’ మెగా బ్రదర్‌ నాగబాబు (Nagababu) ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టులో ఎక్కడా ‘పుష్ప 2’ పేరును ప్రస్తావించడం, ట్యాగ్‌ చేయడం వంటివి చేయలేదు. కానీ, మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్‌ సినిమా రిలీజ్‌ ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు ఈ సినిమా చూడాలని పరోక్షంగా సూచించారని అర్థమవుతోంది. https://twitter.com/NagaBabuOffl/status/1864291940956839994 మెగా ఫ్యాన్స్ రియాక్షన్‌ ఇదే.. నాగబాబు పిలుపుపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్‌ అవుతున్నారు. మీ మాటపై తమకు గౌరవముందని, కానీ తాము 'పుష్ప 2' సినిమాను చూడమని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో అస్సలు 'తగ్గేదేలే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ను నెట్టింట పోస్టు చేస్తున్నారు. తమకు ఇష్టం ఉంటేనే వెళ్తామని, లేకపోతే అస్సలు వెళ్లమని తేల్చి చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తమ మెుదటి ప్రేయారిటీ అని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్మీ సైతం నాగబాబు పోస్టుపై రియాక్ట్‌ అవుతోంది. డైరెక్ట్‌గా 'పుష్ప 2' పేరు ప్రస్తావించి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ మెగా వర్సెస్‌ అల్లు వార్‌ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.&nbsp; https://twitter.com/IamManoharRoyal/status/1864295570006794737 https://twitter.com/TFIxBCCI/status/1864292229423992918 https://publish.twitter.com/?url=https://twitter.com/Janasena200/status/1864294848754536790#&nbsp; https://twitter.com/Rohit4526418/status/1864296317863751777 https://twitter.com/KingOf_Attitude/status/1864297409125224513 https://twitter.com/Raja__JSP/status/1864301177191715096 https://twitter.com/ChinnuPenumaka/status/1864297351432818739 ‘తప్పును సరిదిద్దుకో’ రెండ్రోజుల క్రితం నాగబాబు (Naga Babu) పెట్టిన ట్వీట్‌ సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా 'పుష్ప 2' రిలీజ్‌ నేపథ్యంలోనే చేసినట్లు స్పష్టంగా అర్థమైంది. ‘నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్ట తరంగా మారగలదు. తప్పును సరిదిద్దుకో’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ అల్లు అర్జున్‌ (Allu Arjun)ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు చర్చించుకున్నారు. తప్పులను సరిదిద్దుకొని మెగా ఫ్యామిలీతో కలిసిపోవాలని పరోక్షంగా నాగబాబు సూచించినట్లు అంతా భావించారు.&nbsp; https://twitter.com/NagaBabuOffl/status/1863207473773183307
    డిసెంబర్ 04 , 2024
    <strong>The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?</strong>
    The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
    వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్‌ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను&nbsp; ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది. గ్లింప్స్‌ ఎలా ఉందంటే? &nbsp;కలర్‌ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన&nbsp; ప్రభాస్ లుక్ అదిరిపోయింది.&nbsp; డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్‌ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది. https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ హరర్‌ జనర్‌లో.. కల్కి సక్సెస్‌ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్&nbsp; జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్‌ జనర్‌లో తెరకెక్కుతోంది. సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్ ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను,&nbsp; అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్‌ సినిమాకు సంబంధించిన&nbsp; గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్‌ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; ఆ హిందీ సాంగ్ రీమిక్స్ 'రాజా సాబ్‌' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్‌ హిందీ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో.. మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్‌ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    జూలై 29 , 2024
    SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
    SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్ సైతం ప్రశంసించే స్థాయికి రాజమౌళి ఎదిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని మహేశ్‌ బాబు (Mahesh babu)తో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ పేరుతో ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. తాజాగా మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. నటీనటుల ఎంపిక పూర్తి! యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ‘SSMB29’ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన టీమ్‌ను దర్శకేందుకు ఫైనలైజ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్‌ సిబ్బంది, వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రాజమౌళి తన సినిమాకు ఎంచుకున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తికావడంతో.. షూటింగ్‌ను ఈ ఏడాది మిడిల్‌ నుంచి ప్రారంభించే అవకాశముందని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1762770509467689149 కీలక పాత్రలో ఇండోనేషియా భామ! తాజాగా జరుగుతున్న సమాచారం ప్రకారం ‘SSMB29’లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు సమాచారం. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు తెలుస్తోంది. అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1762762767856279976 విభిన్న తరహాలో ప్రమోషన్స్! ‘SSMB29’ చిత్రం.. యాక్షన్‌ అండ్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తన గత చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రమోషన్స్‌ కోసం డైరెక్టర్‌ రాజమౌళి సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను సిద్ధం చేస్తున్నాడట. ఈ పనులన్నీ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.&nbsp; మహేశ్‌కు జక్కన్న కీలక సూచన! రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం మహేశ్‌ బాబు సిద్దమవుతున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ కావడంతో దృఢంగా కనిపించేందుకు శారీరక కసరత్తులు సైతం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో మహేశ్ కనిపిస్తాడని టాక్‌. అయితే మహేశ్‌ లుక్‌ బయటకు రాకుండా రాజమౌళి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సినిమా మెుదలయ్యేలోపు ప్రకటనలకు సంబంధించిన షూట్స్‌ ఉంటే పూర్తి చేసుకోవాలని మహేశ్‌కు జక్కన్న సూచించారట. త్వరలోనే మహేశ్‌ లుక్‌కు సంబంధించి టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ మెుదలు కానుందని అంటున్నారు.&nbsp; షూట్‌ ప్రారంభం ఎప్పుడంటే? ‘SSMB29’ సినిమా షూట్‌ను తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న అధికారికంగా ప్రారంభించాలని రాజమౌళి తొలుత భావించారట. అయితే మిగిలిన ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఇంకాస్త సమయం కావాల్సి రావడంతో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న స్టార్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో టాక్‌ నడుస్తోంది. అయితే ఐదు నెలల సమయం అంటే ఎక్కువేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా ముందే షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫీల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.&nbsp;
    ఫిబ్రవరి 28 , 2024
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య&nbsp; దర్శకుడు: క్లాక్స్ సంగీతం: మణిశర్మ నిర్మాణ సంస్థ: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌&nbsp; నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)&nbsp; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్&nbsp; విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2023 కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎల్బీ శ్రీరామ్‌, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్‌ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ&nbsp; ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్‌ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్‌ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) పెద్ద ప్లాన్‌ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్‌ ఘోష్‌ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, డేనియల్‌గా రాంప్రసాద్‌ మెప్పించారు. రాజ్‌ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.&nbsp; ఎలా సాగిందంటే సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడంతో కథలో వేగం మిస్‌ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్‌, బ్రహ్మం, డేనియల్‌ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్‌ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్‌ అవుతుంది.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం&nbsp; జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్‌ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో&nbsp; మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్‌ చేశాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్‌ అని చెప్పవచ్చు. సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్‌ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుహీరో, హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సీన్లు&nbsp; రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=98y83GscKEI
    ఆగస్టు 25 , 2023
    <strong>Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్‌ సంచలన నిజాలు</strong>
    Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్‌ సంచలన నిజాలు
    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) టాలీవుడ్‌ను టార్గెట్‌ చేశారంటూ విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.&nbsp; ‘అనుమతి లేకున్నా వచ్చారు’ ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఘటన జరిగిన తీరు, హీరో నిర్లక్ష్య ధోరణి గురించి ప్రస్తావించారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌ రెండో తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే మూడో తారీఖు పోలీసులు తిరస్కరించారు. నాలుగో తారీఖున ఎవరూ థియేటర్‌కి రావొద్దు మేము పర్మిషన్ ఇవ్వము అని పోలీసులు తిరస్కరించినా హీరో రాత్రి 9.30కి థియేటర్‌కు వచ్చారు’ అని రేవంత్‌ తెలిపారు.&nbsp; https://twitter.com/Aale_Baale/status/1870403630509277346 ‘సైలెంట్‌గా వెళ్లలేదు’ అల్లు అర్జున్‌ అనుమతి లేకుండా రావడమే కాకుండా రూఫ్‌ టాప్‌ ఓపెన్‌ చేసి భారీ జన సమీకరణకు కారణమయ్యాడని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘బన్నీ సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేది కాదేమో. క్రాస్‌ రోడ్‌ చౌరస్తా ముందు నుంచే కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్తూ వెళ్లారు. దీనివల్ల చుట్టుపక్కల థియేటర్ల ఆడియన్స్‌ బన్నీని చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. దీంతో రోడ్లపై వేలాది మంది పోగయ్యారు. దీంతో అక్కడ ఒక విధమైన రద్దీ వాతావరణం ఏర్పడింది’ అని రేవంత్‌ అన్నారు.&nbsp; ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’ ర్యాలీగా బన్నీ రావడంతో అతడితో పాటే థియేటర్‌లోకి ఫ్యాన్స్‌ బలంగా తోసుకువచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతని ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు&nbsp; విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసలాట జరిగిందని సీఎం తెలిపారు. చివరికి అక్కడ ఉన్న జనాలను పోలీసులు చెల్లాచెదురు చేయడంతో అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడి కనిపించారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఒకేసారి అంతమంది తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగి ఆమె (రేవతి) చనిపోయిందని అసెంబ్లీలో స్పష్టం చేశారు.&nbsp; ‘బిడ్డను రక్షించేందుకు రేవతి యత్నించింది’ తొక్కిసలాట సమయంలో బిడ్డను కాపాడుకునేందుకు తల్లిగా రేవతి ఎంతో ప్రయత్నించిందని సీఎం రేవంత్‌ తెలిపారు. సొమ్మసిల్లిపడిపోయినా కూడా బిడ్డ చేతిని మాత్రం గట్టిగానే పట్టుకొని ఉండిపోయిందని అన్నారు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని, బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడని సీఎం అన్నారు. అటు థియేటర్లో కూడా హీరోని కలవాలని తొక్కిసలాట జరిగినట్టు తెలిసిందని రేవంత్‌ చెప్పారు.&nbsp; https://twitter.com/CoreenaSuares2/status/1864377538631328021 ‘వెళ్లమని చెప్పినా వినలేదు’ తొక్కిసలాట అనంతరం హీరోను వెళ్లిపోమని పోలీసులు సూచించారని కానీ ఆయన వినలేదని సీఎం రేవంత్ తెలిపారు. సినిమా చూసే వెళ్తానని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘హీరో థియేటర్‌లో ఉండగా బాల్కనీలో కూడా అభిమానులు నిల్చొని ఒకరిపై ఒకరు పడే పరిస్థితి ఏర్పడింది. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో హీరోను వెళ్లిపోమని చెప్పడానికి వెళ్తే ఏసీపి కూడా రావొద్దని థియేటర్ వాళ్లు చెప్పారు. అందరిపై కేసులు నమోదు చేస్తానని హెచ్చరిస్తే అప్పుడు లోపలికి అనుమతించారు’ అని రేవంత్‌ చెప్పారు.&nbsp; ‘రిటర్న్‌లోనూ చేతులు ఊపుకుంటూ వెళ్లాడు’ అల్లు అర్జున్‌ వద్దకు ఏసీపీ వెళ్లి బయట పరిస్థితిని వివరించిన ఆయన పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘బయట ఒకరు చనిపోయారని ఏసీపీ హీరోకి చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు వెళ్ళిపోవాలి అంటే లేదు సినిమా చూసి వెళ్తా అని ఆ హీరో చెప్పినట్టు నాకు సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. దాంతో పై అధికారి రంగంలోకి దిగి హీరోకి చెప్పి ఇక్కడ్నుంచి మీరు వెళ్ళాలి అని అతన్ని తీసుకెళ్లి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ అభిమానులను చూసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కొంతమంది థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి హీరోని మీరు A11 అని చెప్తే అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఆ తర్వాత అరెస్ట్ చేసారు’ అని సీఎం అన్నారు. https://twitter.com/M9News_/status/1870405933672911317 ‘అతడి కాలు, చేతులు పోయాయా’ జైలు నుంచి విడుదలయ్యాక సెలబ్రిటీలు అల్లు అర్జున్‌ ఇంటికి క్యూ కట్టడం పైనా సీఎం రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ సినీ ప్రముఖులు.. ఒక్క రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఇంటికెళ్లి ప్రభుత్వాన్ని తిడుతండ్రు. నన్ను తిడుతుండ్రు. అతడ్ని పరామర్శిస్తుండ్రు. ఏమైంది అధ్యక్ష.. అతడి కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా. అతడ్ని (బన్నీ) ఇంతమంది సినీ ప్రముఖులు పలకరించారు గానీ, ఆస్పత్రిల్లో ఉన్న పిల్లాడ్ని (శ్రీతేజ్‌) కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాలేదు' అని అన్నారు. https://twitter.com/M9News_/status/1870407972058447983 ఇక పై నో బెనిఫిట్ షోస్ సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఇకపై ఊరుకోనని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకు సీఎం కూర్చీలో కూర్చున్నన్ని రోజులు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి 'తెలంగాణలో ఇకపై బెన్‌ ఫీట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపును రద్దు చేస్తున్నాం' అని ప్రకటించారు. బన్నీపై చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి MIM నేత అక్బరుద్ధీన్‌ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం. https://twitter.com/Trends4TDP/status/1870406612038598805
    డిసెంబర్ 21 , 2024

    @2021 KTree