
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
2024 May 1710 months ago
వారం రోజులు గడవక ముందే కృష్ణమ్మ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది
రివ్యూస్
YouSay Review
Krishnamma Movie Review: రివేంజ్ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్… సినిమా ఎలా ఉందంటే?
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ...read more
How was the movie?
తారాగణం

సత్యదేవ్ కంచరణా
అతిరా రాజ్
అర్చన అయ్యర్

రఘు కుంచె
సిబ్బంది
వివి గోపాల కృష్ణదర్శకుడు
కృష్ణ కొమ్మాలపాటినిర్మాత

కాల భైరవ
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
యంగ్ బ్యూటీ ‘అతిరా రాజ్’ పేరు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
‘కృష్ణమ్మ’ సినిమాలో ఈ అమ్మడి నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్‌కు మరో కొత్త హీరోయిన్ దొరికేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శుక్రవారం రిలీజైన (మే 11) ‘కృష్ణమ్మ’ సినిమాతో అతిరా రాజ్.. తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది.
ఇందులో సత్య దేవ్‌కు జోడీగా మీనా పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటుంది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ అథిరాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అథిరా రాజ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ అమ్మడు 20 ఆగస్టు, 2001న కేరళలోని కన్నూర్‌లో జన్మించింది.
2021లో సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ అతిరా.. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎంటర్‌టైన్ చేసింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
2023లో వచ్చిన తమిళ చిత్రం ‘వీరన్’లో లీడ్ రోల్‌లో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీలో సెల్వీ పాత్రలో కనిపించిన అతిరా.. తన నటనతో తమిళ ఆడియన్స్‌ను ముగ్దుల్ని చేసింది.
కాగా రీసెంట్‌గా తమిళంలో వచ్చిన ‘అమిగో గ్యారేజ్’ చిత్రంలోనూ అతిరా హీరోయిన్‌గా చేసింది.
చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించి మాస్టర్ మహేంద్రన్‌కు జోడీగా నటించింది.
View this post on Instagram A post shared by athiraraj (@athiraraj_1)
అతిరా ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.
ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ నెట్టింట తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 103K మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024

Krishnamma Movie Review: రివేంజ్ డ్రామాలో అదరగొట్టిన సత్యదేవ్… సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : సత్య దేవ్, అథిరా రాజ్, ఆర్చన అయ్యర్, రఘు కుంచె
డైరెక్టర్ : వి. వి. గోపాల కృష్ణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్ : సన్నీ కుర్రపాటి
ఎడిటర్ : తిమ్మరాజు
నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వి.వి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సత్య దేవ్‌కు మరో హిట్‌ను అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
విజయవాడ వించిపేటలో జీవించే భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా జీవిస్తుంటారు. గతంలో నేరాలకు పాల్పడిన ఈ ముగ్గురు కొన్ని కారణాలతో మంచిగా మారతారు. భద్ర ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా వీరికి రూ. 3 లక్షలు అవసరం పడతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. జైలుకు కూడా వెళ్తారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు అనూహ్యంగా చనిపోతారు? స్నేహితుల్లో ఒకరు చనిపోవడానికి కారణం ఎవరు? వారు జైలుకెళ్లేలా కుట్ర చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
విలక్షణ నటుడు సత్యదేవ్ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తనదైన నటనతో అదరగొట్టాడు. పగతో రగిలిపోయే భద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఎమోషనల్ సన్నివేశాల్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరోయిన్‌గా అతిర పాత్ర పరిమితమే. నటన పరంగా ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేదు. స్నేహితులుగా చేసిన మీసాల లక్ష్మణ్, కృష్ణ తేజా రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. పోలీసు ఆఫీసర్‌గా చేసిన నందగోపాల్ పర్వాలేదనిపించాడు. రఘు కుంచే పాత్ర కూడా సినిమాలో బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వి.వి గోపాలకృష్ణ.. రివేంజ్ డ్రామాగా ఈ సినిమాకు తెరకెక్కించాడు. అయితే కథ పరంగా చూస్తే కొత్త దనం ఏమి లేదని చెప్పాలి. ఈ తరహా రివేంజ్ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లిన విధానం ప్రశంసనీయం. ఫస్టాఫ్ మెుత్తం ఓ దారుణ హత్య.. స్నేహితుల పాత్రలు, వారి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్‌ను పరిచయం చేయడంతోనే సరిపోయింది. దీంతో ఆడియన్స్‌కు కథ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌కు వచ్చాక దర్శకుడు కథలో వేగం పెంచాడు. తమ ఫ్రెండ్‌ను చంపిన వారిని హీరో టార్గెట్ చేసే సీన్లను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు. అయితే క్లైమాక్స్ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. చిన్న చిన్న లోపాలున్నా దర్శకుడిగా వి.వి. గోపాల కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సన్నీ కుర్రపాటి తన కెమెరా పనితనంతో తెరపై ప్లెజెంట్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు కాల భైరవ అందించిన పాటలు సో సోగా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సత్యదేవ్ నటనస్క్రీన్‌ప్లేసెకండాఫ్
మైనస్ పాయింట్స్
రొటిన్ రీవెంజ్ డ్రామాబోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-satyadev.html
మే 10 , 2024

This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
కృష్ణమ్మ
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ప్రతినిధి 2
నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
జితేందర్ రెడ్డి
ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్ వర్రే కథానాయకుడిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆరంభం
మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్
హాలీవుడ్‌లో ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు
గీతాంజలి మళ్లీ వచ్చింది
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.
ఆవేశం
పుష్ప ఫేమ్ విలన్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBodkin SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
మే 06 , 2024

Anil Ravipudi: ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి క్రేజీ కామెంట్స్.. ముసుగేసి గుద్దితే డబ్బు ఇస్తానన్న రాజమౌళి!
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. మినిమం గ్యారంటీ చిత్రాలను ఆయన రూపొందిస్తారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ (Balakrishna)తో చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే డైరెక్టర్ అనిల్.. తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఐపీఎల్‌పై కామెంట్స్ చేశారు. దీనిపై ఐపీఎల్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ‘కృష్ణమ్మ’ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యాడు. హీరో సత్య (Satya)పై ప్రశంసల వర్షం కురిపించాడు. కృష్ణమ్మ చిత్రం చాలా బాగుంటుందని.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. అంతటి ఆగకుండా డైరెక్టర్ అనిల్ ఐపీఎల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు 2 రోజులు చూడకుంటే కొంపలేమీ మునిగిపోవు. క్రికెట్ స్కోర్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలి’ అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
https://twitter.com/i/status/1785936991726743773
మండిపడుతున్న ఫ్యాన్స్
అనిల్ రావిపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ఐపీఎల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీ సినిమాలు కూడా నెల తరువాత ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా.. అప్పుడు చూస్తామని కౌంటర్లు వేస్తున్నారు. ఇతరుల ఇష్టా ఇష్టాల గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని సూచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాని తాము ఏం చేయాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని క్రికెట్ ఫ్యాన్స్ ఘాటుగానే బదులిస్తున్నారు.
అనిల్‌ను కొడితే రూ.10 వేలు ఇస్తా: రాజమౌళి
కృష్ణమ్మ ఈవెంట్‌లో అనిల్ రావిపూడితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రాల గురించి డైరెక్టర్ అనిల్ ప్రస్తావించాడు. తనకు రెండు కోరికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి.. కొరటాల శివ స్పీచ్‌లో దేవర రిలీజ్ డేట్ వినడం, రెండోది రాజమౌళి స్పీచ్‌లో ‘SSMB29’ ఓపెనింగ్ డే? జానర్? ఏ కథ తీస్తున్నారు? అని తెలుసుకోవడం కోసం ఎగ్జైటింగ్ ఉన్నట్లు చెప్పారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో ఫన్నీగా బదులిచ్చారు. 'ఎవరైనా సరే అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దేస్తే వారికి రూ.10వేలు ఇస్తా' అని అన్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1785935511531511969
మే 02 , 2024

Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్
సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zibra). 'పుష్ప'లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్ టాక్‌తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్‌గా సక్సెస్ మీట్‌ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సత్యదేవ్ ఏం రాశారంటే?
‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. 'ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాని మీరు థియేటర్‌లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు.
https://twitter.com/ActorSatyaDev/status/1861276550337073501
ప్రతీ సినిమాకు ఎదురీతే
టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్ టాక్ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్‌లో కనిపించకపోవడంతో సత్యదేవ్ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్‌కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్ ఫిల్మ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కొవిడ్ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన 'తిమ్మరుసు'పై కూడా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'కృష్ణమ్మ' రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్‌కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు.
'జీబ్రా' నిజంగానే బాగుందా?
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్ విషయంలో గ్యాంగ్‌స్టర్ అయిన విలన్ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్ పెద్దగా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు.
స్టోరీ ఏంటంటే?
మిడిల్ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.
నవంబర్ 26 , 2024

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024

Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్‌స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024

Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024

Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విష్వక్ సేన్ తాజా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.
మూవీ ప్లాట్ ఏంటంటే..
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
మూవీ కథ ఏంటంటే..
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
గం గం గణేశా
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
స్టోరీ ఏంటంటే..
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది కథ.
లవ్ మీ
యంగ్ హీరో ఆశిష్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం 'లవ్ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది.
కథ ఏంటంటే..
‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్ లవర్ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ.
ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్ సాధించింది.
కథ ఏంటంటే..
‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్.. సిటాడెల్ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ.
కృష్ణమ్మ
సత్యదేవ్ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.3.50 కాగా, షేర్ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.
కథ ఏంటంటే..
‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు? అన్నది కథ.
ఆ ఒక్కటి అడక్కు
అల్లరి నరేష్ రీసెంట్ రీసెంట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది.
కథ ఏంటంటే..
‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ.
ప్రసన్న వదనం
సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి.
కథ ఏంటంటే..
రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్ బ్లైండ్‌నెస్ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్యని ఇరికించింది ఎవరు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్.
జూన్ 06 , 2024

KCR Movie Review: ‘కేసీఆర్’ వీరాభిమానిగా రాకింగ్ రాకేష్ హిట్ కొట్టినట్లే.. కానీ!
నటీనటులు: రాకింగ్ రాకేష్, అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, ధనరాజ్, జోర్దార్ సుజాత తదితరులు
దర్శకత్వం: అంజి గరుడవేగ
సంగీతం: చరణ్ అర్జున్
ఎడిటర్: చింతాల మధు
నిర్మాత: రాకింగ్ రాకేష్
నిర్మాణ సంస్థ: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కేశవ చంద్ర రమావత్’ (Kesava Chandra Ramavat Movie) . షార్ట్ కట్‌లో ‘కేసీఆర్’ (కేసీఆర్)'. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్ హీరోయిన్‌గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్, రచ్చరవి, లోహిత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్ రాకేష్ మెప్పించాడా? కేసీఆర్ అభిమానిగా హిట్ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review)
కథేంటి
వరంగల్ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్ అలియాస్ కేసీఆర్ (రాకింగ్ రాకేష్) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్ నటుడు లోహిత్, మామ పాత్రలో మైమ్ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ఏవిధంగా డెవలప్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాకింగ్ రాకేష్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
పొలిటిషియన్‌ను హైలేట్ చేయడంకొన్ని సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 23 , 2024

Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?
నటీనటులు : ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి, గుండు సుదర్శన్ తదితరులు
దర్శకత్వం : శివ శేషు
సంగీతం : జీవన్ బాబు
సినిమాటోగ్రాఫర్ : రమణ జాగర్లమూడి
ఎడిటర్ : విజయ్ వర్ధన్ కావురి
నిర్మాత : టి. లీలా గౌతమ్
విడుదల తేదీ : 04-10-2024
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'కలి' (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరామ్ మంచి తనాన్ని క్యాష్ చేసుకొని ఆస్తి కొట్టేయాలని సొంత వారే కుట్రలు చేస్తుంటారు. సొంత తమ్ముడు, బాబాయ్ మోసం చేయడంతో శివరామ్ తీవ్రంగా నిరాశ చెందుతాడు. వచ్చే జన్మలోనైనా మనిషిలా పుట్టకూడదంటూ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ క్రమంలో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా సూసైడ్ చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్ బెల్ కొట్టి అతడ్ని రక్షిస్తాడు. కలి రాకతో శివరామ్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? శివరామ్ జీవితానికి కలి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు. చాలా సీన్లలో డైలాగ్స్ లేనప్పటికీ ఎక్స్ ప్రెషన్స్‌తోనే మెప్పించాడు. సీన్లను రక్తికట్టిస్తూ నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్ అగస్త్య మెరిశాడు. స్టైలీష్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరే కథ మెుత్తాన్ని నడిపించారు. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్ ఉన్నంతలో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. మిగిలిన పాత్ర దారులు కూడా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సమస్యలకు పరిష్కారం సూసైడ్ కాదని, ఆత్మహత్యే అసలైన ప్రాబ్లమ్ అని దర్శకుడు శివ శేష్ ఈ చిత్రం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సందేశాత్మక కథనే ఎంచుకున్నప్పటికీ కమర్షియల్ అంశాలకూ ప్రయారిటీ ఇచ్చారు. కథను ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభంలో శివరామ్ పాత్ర, అతడి కుటుంబ నేపథ్యం, లవ్ ట్రాక్, కుటుంబ సభ్యుల మోసం చూపించారు. కలి అయిన అగస్త్య రాకతో కథలో వేగం పెంచారు డైరెక్టర్. శివరామ్‌ను అగస్త్య ప్రశ్నించిన తీరు, అతడు చేస్తున్న తప్పేంటో చెప్పే ప్రయత్నం మెప్పిస్తుంది. బతకాలనే ఆశని పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్, నరేష్ అగస్త్యా మధ్య వచ్చే సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథను మరీ సాగదీసినట్లు అనిపించడం, సినిమా మెుత్తం రెండు పాత్రల చుట్టే తిరగడం, కామెడీ లేకపోవడం మైనస్‌లుగా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంగీతం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవన్ బాబు అందించిన నేపథ్యం సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథప్రిన్స్, అగస్త్య నటనసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024

Gorre Puranam Review: రెండు మతాలకు ఒక గొర్రె టార్గెట్ అయితే.. సుహాస్ కొత్త చిత్రం మెప్పించిందా?
నటీనటులు : సుహాస్, విషికా కోట, పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు
డైరెక్టర్ : బాబీ వర్మ
సంగీతం : పవన్. సీహెచ్
సినిమాటోగ్రాఫర్ : సురేష్ సారంగం
ఎడిటర్ : వంశీ కృష్ణ రావి
నిర్మాత : ప్రశాంత్ మాండవ
విడుదల తేదీ : 21-09-2024
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళతాడు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లిపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. అది తప్పించుకోవడంతో గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరి కొంతమంది పడతారు. ఈ క్రమంలో ఆ గొర్రె ఒక గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం కాస్త మీడియా దృష్టికి వెళ్తుంది. దీంతో మతకలహాలు రేకెత్తిస్తోంది అంటూ గొర్రెను పోలీసులు అరెస్టు చేస్తారు. రవి సెల్‌లోనే దాన్ని ఉంచుతారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్‌కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో సుహాస్ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. ఉన్నంతలో అతడు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన సహజసిద్ధమైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాలో నటీనటుల కంటే గొర్రె ఎక్కువసేపు కనిపిస్తుంది. దానికి ఎంతో ఫన్నీగా వాయిస్ ఓవర్ ఇచ్చి నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ నవ్వులు పూయించాడు. కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఓ గొర్రెకు డబ్బింగ్ చెప్పాడు. మిగతా పాత్రల్లో కనిపించిన కమెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ల పాత్రల నిడివి తక్కువే అయినా కథపై ప్రభావం చూపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బాబీ వర్మ ఒక గొర్రెను ప్రధాన పాత్రధారిగా తీసుకొని చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? లాంటి విషయాలను వ్యాగ్యంగా చెబుతూనే కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఈ క్రమంలో ప్రజలు, రాజకీయ నేతలు, మీడియాపై గట్టిగానే సెటైర్లు వేశారు. ఒక పక్కన నవ్విస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సుహాస్ పాత్రను తీర్చిదిద్దానం విధానం కూడా బాగుంది. అయితే అతడు ఎందుకు హత్య చేశాడు? మరో ముగ్గుర్ని ఎందుకు చంపాలని అనుకున్నాడు? అన్నది కనెక్టింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
సుహాస్ నటనకథ, కథనండైలాగ్స్
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంవర్కౌట్ కాని ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 21 , 2024

Raju Yadav Review : 'రాజు యాదవ్'గా గెటప్ శ్రీను మెప్పించాడా? ఈ రివ్యూలో తెలుసుకోండి!
నటీనటులు : గెటప్ శ్రీను, అంకితా కరాట్, హేమంత్, ఆనంద్ చక్రపాణి, నమని ప్రశాంత్ తదితరులు
డైరెక్టర్ : కృష్ణమాచారి. కె
సినిమాటోగ్రాఫర్ : సాయిరాం ఉదయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, స్వాతి పసుపులేటి
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). అంకిత కరాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటన సినిమాపై అంచనాలను పెంచింది. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?
కథేంటి
ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఊరిలో చాలా సరదాగా ఉండే అబ్బాయి. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా అతడికి ప్రమాదం జరుగుతుంది. దీంతో ఓ వైద్యుడ్ని సంప్రదిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి రాని చికిత్స చేయడంతో రాజు స్మైలింగ్ డిజార్డర్ అనే వ్యాధి బారిన పడతాడు. అప్పటి నుంచి రాజు నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా స్విటీ (అంకితా)తో ప్రేమలో పడినప్పుడు అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ప్రేమకు అతడి నవ్వు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? రాజు-స్విటీ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హాస్య నటుడు గెటప్ శ్రీను.. రాజు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడు. అటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ తాను అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేయసి పాత్రలో అంకితా కరాట్ పర్వాలేదనిపింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చక్కటి నటన కనిబరిచాడు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణమాచారి.. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఫన్, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించారు. స్మైలింగ్ డిజార్జర్ అనే సమస్యతో హాస్యాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అదే సమయంలో ఆ డిజార్డర్ చుట్టే భావోద్వేగ సన్నివేశాలను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలకు సినిమా హత్తుకునేలా చేశారు. ముఖ్యంగా గెటప్ శ్రీను, ఆనంద్ చక్రపాఠి మధ్య వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది. కొన్ని సీన్లు సాగదీతలా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
గెటప్ శ్రీను నటనకామెడీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 24 , 2024

Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్ థ్రిల్లర్.. ‘మిరల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
దర్శకత్వం: ఎం. శక్తివేల్
మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్
సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా
ఎడిటర్: కలైవనన్.ఆర్
నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
విడుదల తేదీ: 17-05-2024
ప్రేమిస్తే ఫేమ్ భరత్ హీరోగా నటించిన చిత్రం 'మిరల్'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హరి (భరత్), రమ (వాణీ భోజన్) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హీరో భరత్ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఎం. శక్తివేల్.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
భరత్, వాణీ భోజన్ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 17 , 2024

TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ
పొన్నియన్ సెల్వన్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ హీరోయిన్ క్రేజ్ భారీగా పెరిగింది. ఆమె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తను ఎవరో కాదు సూపర్ క్యూట్ బ్యూటీ త్రిష కృష్ణన్.
ఒకప్పుడు తన లుక్స్‌తో అలరించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనూ అంతే అందంతో ఆకట్టుకుంటుంది.
సామాజిక మాధ్యమాల్లో ఎక్కడచూసిన త్రిష ఫొటోలు కనిపిస్తున్నాయి. పరువాల జాతరతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. దాదాపు 4 నెలలుగా ఈ అమ్మడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
PS-2 చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది త్రిష. రోజుకో గెటప్‌లో దర్శనమిస్తూ కుర్లాళ్ల గుండెల్ని కొళ్లగొడుతుంది.
వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుందంటారు. కానీ, త్రిష విషయంలో అసలు ఏ మాత్రం అలా అనడానికి వీళ్లేదు.
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కుర్ర హీరోయిన్లదే హవా. వాళ్లతో పోటీ పడుతూ ఆఫర్లు కొట్టేస్తుంది సొగసరి.
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కుందవి పాత్రలో నటించింది త్రిష. అంతేకాదు, దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలోనూ చేస్తోంది.
తమిళ్‌లో ది రోడ్ అనే చిత్రంతో పాటు సత్తురాంగ వెట్టై అనే సినిమాలోనూ నటిస్తోంది త్రిష. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.
తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ సరసన వర్షం ద్వారా సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు.
వరుసగా తమిళ్, తెలుగు చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించింది ఈ హీరోయిన్. తర్వాత వివిధ కారణాల వల్ల సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాల్లో చేస్తోంది.
ఏప్రిల్ 20 , 2023

Meter Review: మాస్ నటనతో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. మరీ ‘మీటర్’ ప్రేక్షకులకు నచ్చిందా?
నటినటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి
దర్శకత్వం: రమేష్ కడూరి
సంగీతం: సాయి కార్తిక్
నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కిరణ్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్ మూవీ మీటర్ ఇవాళ (ఏప్రిల్ 7) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి అంచనాలను కిరణ్ అబ్బవరం అందుకున్నాడా?. వరుసగా రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడా? అసలు సినిమా కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం.
కథ ఏంటంటే:
కథలోకి వెళితే... అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ మంచి పోలీసు ఆఫీసర్. కానిస్టేబుల్‌గా చేస్తూ ఎన్నో అవమానాలు పడుతుంటాడు. కొడుకుని ఎస్సైని చేయాలని తండ్రి కలలు కంటాడు. కాని అర్జున్‌కు అది అసలు ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా పరీక్ష రాసిన అర్జున్.. ఎస్సై అయిపోతాడు. ఈ క్రమంలో హోమంత్రి కంఠం బైరెడ్డి(పవన్), అర్జున్ మధ్య గొడవ జరుగుతుంది. బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి?. అర్జున్ దాన్ని ఎలా బయటపెడతాడు? అనేది అసలు కథ. అది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే:
మీటర్ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ హీరోగా అదరగొట్టాడు. గత సినిమాల్లో కంటే ఎంతో ఉత్సాహాంగా నటించి అలరించాడు. ప్రతీ సీన్‌లో తన మార్క్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. తన పంచులు, ప్రాసలతో ఆడియన్స్ మెప్పించాడు. కిరణ్ చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో చాలా అద్భుతంగా పేలాయి. హీరోయిన్‌గా అతుల్య రవి పాటల మేరకే పరిమితం అయ్యింది. సప్తగిరి కామెడి అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది. పోసాని కృష్ణమురళి సహా ఇతర నటులు తమ పరిధిమేరకు నటించారు.
విశ్లేషణ
సినిమాలో చాలా పాత్రలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. ఖాళీగా తిరిగే హీరో ఒక్కసారిగా ఎస్సై అవ్వడం వాస్తవ దూరంగా ఉంటుంది. అబ్బాయిలంటేనే ఇష్టపడని హీరోయిన్ ఒక్క పాటతో హీరో ప్రేమలో పడిపోవడం ఆడియన్స్‌కు అంతగా రుచించదు. సీఎంను కూడా భయపెట్టేంత రేంజ్‌లో విలన్‌ను చూపించి హీరో ముందు మరీ తక్కువ చేయడం అర్థంకాని అంశంగా ఉంది. సినిమా కథలో కొత్త దనం లేకపోవడంతో పాటు, కొన్ని సీన్లను ఎక్కడో చూశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక సాయికార్తిక్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్యం సంగీతం కూడా నార్మల్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీసహజత్వం లోపించడంకథలో సాగదీతసంగీతం
రేటింగ్: 2/5
ఏప్రిల్ 07 , 2023

Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్ చాలు’ వీడియో వైరల్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అటువంటి టాప్ హీరోలు ఒక సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకెంత అటెన్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ సైతం ఏపీ ఉపముఖ్యమంత్రి తన మూవీ షూటింగ్స్‌లోనే పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘డ్రింకర్ సాయి’ సినిమా యూనిట్ వారిచేత సరికొత్త ప్రమోషన్స్‌కు తెర లేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కటౌట్‌తో ప్రమోషన్స్
ధర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కల్యాణ్, ప్రభాస్ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. వారి సమక్షంలో తన సినిమా ఈవెంట్ జరగాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. హీరో ధర్మ.. ప్రభాస్‌కు అభిమాని కావడంతో డార్లింగ్ పోస్టర్‌ను సైతం వేదికపై పెట్టారు. ఇది చూసి ఈవెంట్‌కు వచ్చిన వారంతా చప్పట్లో వారిని అభినందించారు.
https://twitter.com/tollymasti/status/1866099251031450077
పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా?
ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్ వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రింకర్ సాయి టీమ్ కూడా స్టేజీపై పవన్, ప్రభాస్ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రభాస్, పవన్‌పై అభిమానంతోనే డైరెక్టర్, హీరో తమ హీరోల పోస్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయా హీరోల అభిమానులను తమ సినిమా చూసేలా ప్రేరేపించడం కోసమే వారు ఈ విధంగా చేసి ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ‘డ్రింకర్ సాయి’ టీమ్ ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు.
https://twitter.com/shreyasmedia/status/1866107400769433812
ఆ సినిమాలు కూడా అంతే..
ఇటీవల విడులైన 'మట్కా' (Matka) సినిమా కోసం హీరో వరుణ్ తేజ్ (Varun Tej) వినూత్నంగా ప్రమోషన్స్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు. తన గత చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని చేసిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) బామ్మర్ది సుధీర్ బాబు (Sudheer Babu) కూడా తన రీసెంట్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) సినిమాకు సరికొత్తగా ప్రమోషన్స్ చేశాడు. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ ప్రమోషన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి.
https://twitter.com/SkyPspk/status/1856617018276839798
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/isudheerbabu/status/1842084097621164229
డిసెంబర్ 10 , 2024

Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్ చేసిన పవన్.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకోగా అతను కూడా కొద్ది నెలలకే అధికార వైకాపా ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో పవన్‌ను టార్గెట్ చేస్తూ వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం పవన్ దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున పవన్‌పై టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పవన్‌ను ట్రోల్ చేస్తూ ఏకంగా సినిమా కూాడా తీశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-భాజపా) అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పవన్‌ను ఎంతగానో విమర్శించిన ఆర్జీవీ, పోసానిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఆర్జీవీపై వరుస కేసులు
సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఇవాళ (నవంబర్ 11) ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ (Nara Lokesh), బ్రాహ్మణి (Nara Brahmani), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్జీవీపై గుంటూరు జిల్లా తాళ్లురు పోలీసు స్టేషన్‌లోనూ కేసు పెట్టారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
త్వరలో పోసాని అరెస్టు!
పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. వైసీపీ స్థాపన తరువాత జగన్ పంచకు చేరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. జగన్ సీఎం అయ్యాక వైసీపీ నేతల కంటే మరింత ఘాటుగా పవన్, చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్‌పై పలు ప్రెస్‌మీట్లలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పవనో మెంటల్ కేసని, పైసల కోసమే మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టిందని గతంలో పోసాని మండిపడ్డారు. మట్టిగొట్టుకుపోతావ్ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గతంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమోచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను తిరగదోడుతుండటంతో ఓ క్షణమైన పోసాని అరెస్టు కావొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వైసీపీ మద్దతుదారులనేదీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కల్యాణ్ తల్లిని సైతం ఆమె దూషించిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వారిపై ఏపీ పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో శ్రీరెడ్డిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై తన మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టనని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.
ప్రకాష్ రాజ్‌పై చర్యలుంటాయా?
ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ప్రకాష్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సందించారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్‌ట్యాగ్‌తో పవన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయంలో దూరి మరి విమర్శలు చేయడంపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌పైనా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత కేసులనే ఏపీ పోలీసులు తిరగదోడుతున్నారు. పైగా ప్రకాష్ రాజ్‌పై ఏ స్టేషన్‌లోనూ కేసు నమోదు కానందున ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 11 , 2024

Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్ శంకర్ కాంబో మళ్లీ మ్యాజిక్ చేసిందా?
నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, శుభలేక సుధాకర్, కిషోర్ రాజు వశిష్ట, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం : హరీష్ శంకర్
సంగీతం : మిక్కీ. జె. మేయర్
సినిమాటోగ్రఫీ : అయనంక బోస్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అభిషేక్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్ బచ్చన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ సత్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో సత్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్ బచ్చన్ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్రథమార్ధాన్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్‌కు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మార్చారు డైరెక్టర్. అయితే ప్రథమార్ధంలో కనిపించిన హరీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేపథ్యంగానే ద్వితీయార్ధమంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మరోవైపు కనుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటనలవ్ ట్రాక్కామెడీ, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ద్వితియార్థంకొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 16 , 2024

This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
రాజు యాదవ్
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju yadav). అంకిత కారాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
లవ్ మీ
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ మీ’ (Love Me). అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్ యూ డేర్’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
డర్టీ ఫెలో
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్ డ్రామా చిత్రమని మూవీ యూనిట్ తెలిపింది.
ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్, క్రిస్ హేమ్స్‌వర్త్ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్ మ్యాక్స్’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man MovieEnglishLions Gate PlayMay 24
మే 20 , 2024