• TFIDB EN
  • లక్ష్యం
    UATelugu2h 44m
    కరుడుగట్టిన నేరస్థుడైన సెక్షన్ శంకర్, బ్యాంకు ఉద్యోగి హత్యలో ACP బోస్‌ను ఇరికిస్తాడు. బోస్ సోదరుడైన చందు తన అన్నను రక్షించి, శంకర్‌ను ఎదుర్కొవాలని నిర్ణయించుకుంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    గోపీచంద్
    చందు
    జగపతి బాబు
    ఏసీపీ బోస్
    అనుష్క శెట్టి
    ఇందు
    యశ్‌పాల్ శర్మ
    సెక్షన్ శంకర్
    అమిత్ తివారీ
    షఫీ
    ఆశిష్ విద్యార్థి
    డిఐజి అజయ్ ప్రకాష్
    దేవరాజ్
    డిఐజి హరి నారాయణ్
    కోట శ్రీనివాసరావు
    చందు మరియు బోస్ తండ్రి
    కావేరి
    బోస్ భార్య
    బ్రహ్మానందం
    రెస్టారెంట్ యజమాని
    అలీ
    బొక్కన
    వేణు మాధవ్
    వేణు
    ఆహుతి ప్రసాద్
    ఇందు తండ్రి
    సూర్య
    బ్యాంక్ మేనేజర్
    రఘు బాబు
    శంకర్ అనుచరుడు
    రవిబాబు
    పవన్
    చలపతి రావు
    పవన్ తండ్రి
    శ్రీనివాస రెడ్డి
    పవన్ స్నేహితుడు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    చందు మరియు బోస్‌కి మద్దతు ఇస్తున్న పోలీసు అధికారి
    శంకర్ మెల్కోటే
    లక్ష్మీపతి
    ఇందు తండ్రి సహాయకుడు
    ఫిష్ వెంకటయ్య
    ఫిష్ వెంకట్
    గిరిధర్
    చిట్టి
    విజయ సింగ్
    పద్మ జయంతి
    రేవతి
    నందిని
    రమ్య
    కావ్య
    వినీత రావు
    బేబీ కల్వి మిత్రపింకీ
    సిబ్బంది
    శ్రీవాస్ ఓలేటి
    దర్శకుడు
    నల్లమలుపు బుజ్జి
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    శేఖర్ వి. జోసెఫ్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: శివ పాలడుగు  సంగీతం: పవన్  సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి విడుదల తేది: జూన్‌ 14, 2024 టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ & ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ అజయ్‌ ఘోష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుప్రీ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5   https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    జూన్ 14 , 2024
    <strong>Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?</strong>
    Celebrities Weddings &amp; Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం?
    భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.&nbsp; [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.&nbsp; సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.&nbsp; మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్.&nbsp;
    సెప్టెంబర్ 16 , 2024
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అనుష్క శెట్టి తెలుగులో సూపర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. అంచెలంచెలుగా ఎదిగి లెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. సినిమాల్లోకి రాకముందు అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసేది. అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన అనుష్క శెట్టి(Some Lesser Known Facts Anushka shetty)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి ముద్దు పేరు? స్వీటి అనుష్క శెట్టి వయస్సు ఎంత? 1981, నవంబర్ 7న జన్మించింది అనుష్క శెట్టి బిరుదు? లెడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన తొలి సినిమా? సూపర్ (2005) అనుష్క శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు&nbsp; అనుష్క శెట్టి ఎక్కడ పుట్టింది? పుత్తూర్, కర్ణాటక అనుష్క శెట్టి ఉండేది ఎక్కడ? హైదరాబాద్ అనుష్క శెట్టి ఏం చదివింది? డిగ్రీ అనుష్క శెట్టి అభిరుచులు? ట్రావెలింగ్, యోగా, గార్డెనింగ్ అనుష్క శెట్టికి ఇష్టమైన ఆహారం? బిర్యాని, చికెన్ కర్రీ అనుష్క శెట్టికి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్యాక్, వైట్ అనుష్క శెట్టికి ఇష్టమైన ప్రదేశం లండన్ అనుష్క శెట్టికి ఇష్టమైన హీరో? అక్కినేని నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు అనుష్క శెట్టికి ఇష్టమైన హీరోయిన్? జ్యోతిక అనుష్క శెట్టి&nbsp; పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. అనుష్క శెట్టి తల్లిదండ్రుల పేరు? A.N విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? యోగా ట్రైనర్‌గా పనిచేసేది అనుష్క శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/anushkashettyofficial/ అనుష్క శెట్టికి ఎన్ని అవార్డులు వచ్చాయి? అరుంధతి, రుద్రమదేవి చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ -సౌత్ అవార్డును, సైజ్ జీరో, అరుంధతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. బాహుబలి-2 చిత్రానికి గాను బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అందుకుంది. అనుష్క శెట్టి నికర ఆస్తుల విలువ? రూ.100కోట్లు https://www.youtube.com/watch?v=PuExPz-K09U
    ఏప్రిల్ 29 , 2024
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.&nbsp; [toc] వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.&nbsp; రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.&nbsp; ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.&nbsp; మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి&nbsp; చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ &amp; హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌&nbsp; రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ &amp; ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.&nbsp; ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :&nbsp; అమెజాన్‌ ప్రైమ్‌
    అక్టోబర్ 25 , 2024
    <strong>Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!</strong>
    Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
    సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్‌ ఇండిలిజెన్స్‌)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.&nbsp; రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.&nbsp; ధూమ్‌ 4 విలన్‌గా సూర్య! హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్‌ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్‌ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్.
    అక్టోబర్ 14 , 2024
    <strong>Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?</strong>
    Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్‌.. ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ మెప్పించిందా?
    నటీనటులు : విశ్వంత్‌, శిల్పా మంజునాథ్‌, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్‌ వెరేళ్ల తదితరులు రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా సంగీతం : లిజో కె. జోస్‌ ఎడిటర్‌ : అమర్‌ రెడ్డి కుడుముల నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి విడుదల తేదీ: 20-09-2024 ‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్‌ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం. కథేంటి కర్నూల్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్‌) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్‌ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్‌ వార్‌ ఫేర్‌ను కర్నూల్‌ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్‌ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్‌ ఇంకాస్త బాగా ఎలివేట్‌ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విశ్వాంత్‌ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    సెప్టెంబర్ 20 , 2024
    <strong>Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!</strong>
    Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!
    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్‌ చేశారంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్‌ పవర్‌ ఇచ్చే అప్‌డేట్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్‌ 'పుష్ప' చిత్రంలో నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్‌ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్‌ 'పుష్ప 2'లో తన పాత్ర గురించి చెబుతూనే 'పుష్ప 3' క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్‌ మాత్రమే షూట్‌ చేశారు. మిగిలిన డేట్స్‌ పుష్ప 2కి వాడుకుంటాం సర్‌ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్‌ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్‌ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో' అంటూ రావు రమేష్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. 'పుష్ప 3' పక్కాగా ఉంటుందని రావు రమేష్‌ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nasavnensasthaa/status/1828421405731697031? క్లైమాక్స్‌లో హింట్‌! ‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్‌ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్‌ రెండు మూడేళ్ల గ్యాప్‌ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. సుకుమార్‌ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్‌ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్‌, తమిళ స్టార్ డైరెక్టర్‌ అట్లీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.&nbsp; తొలి పార్ట్‌కి మించి..&nbsp; ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, ఫస్ట్‌, సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్‌ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్‌ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్‌ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్‌ ఆడే గేమ్‌, ఎమోషనల్‌ సీన్స్‌, పుష్ప రాజ్‌ vs భన్వర్‌సింగ్‌ షెకావత్‌ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.&nbsp; ‘కేజీఎఫ్‌’ ఫార్మూలా! డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్‌’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్‌ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్‌ 2’ను కూడా రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌ 3’ గ్యాప్‌ ఇచ్చి ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్‌ సైతం ‘టాక్సిక్‌’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్‌ - బన్నీ కూడా ప్రశాంత్‌ నీల్‌- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ ఫినిష్‌ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!</strong>
    Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్‌ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్‌ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ పార్ట్‌ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్‌ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది.&nbsp; అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది.&nbsp; కమల్‌ హాసన్‌ విశ్వరూపం కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు. భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు? భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్‌ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్‌ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్‌ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్‌ పార్ట్‌లో రానుంది.&nbsp; విజయ్‌కి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌! కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ పోషించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్‌ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర కూడా సెకండ్‌ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.&nbsp; కల్కి పాత్రలో ఎవరు? పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు.&nbsp; 'కల్కి 2' రిలీజ్‌ ఎప్పుడంటే? ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.&nbsp; అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్​' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.&nbsp;
    జూలై 08 , 2024
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.&nbsp; https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.&nbsp; కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.&nbsp; రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.&nbsp; శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.&nbsp; https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.&nbsp; https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.&nbsp; విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.&nbsp; దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.&nbsp; ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.&nbsp; https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
    Shivathmika Rajashekar: ఎద అందాలతో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!
    రాజశేఖర్ - జీవిత నట వారసురాలు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్‌ మీడియాలో మరోమారు రెచ్చిపోయింది.  తాజా ఫొటో షూట్‌లో హద్దులన్నీ చెరిపేసిన ఈ చిన్నది నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.&nbsp; శివాత్మిక అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమెదంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; 2019లో ‘దొరసాని’ చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్‌గా పురస్కారం అందుకుంది.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్‌మీడియాపై ఫోకస్ పెట్టింది.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. హాట్‌ డోస్‌ను రెట్టింపు చేస్తూ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను పంచుకుంటోంది. చురకత్తుల్లాంటి చూపులతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; శివాత్మిక తీరుతో ఆమెకు పాపులారిటీ దక్కడమే గాకుండా ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. నిత్యం నెటిజన్లు శివాత్మిక సోషల్ మీడియా వాల్‌పై కన్నేస్తున్నారు. ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురు ఈ స్టార్ కిడ్ ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని నెటిజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3 లక్షల 95 వేల మంది ఫాలో అవుతున్నారు.
    ఫిబ్రవరి 16 , 2024
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.&nbsp; ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.&nbsp; మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.&nbsp; పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.&nbsp; ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.&nbsp; మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్‌ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్‌ కేర్‌ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం. తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్‌ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by @forestessentials 'లైవ్‌ యువర్‌ ఫెయిరీ టేల్‌' అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్‌ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.&nbsp; 2020లో హాలీవుడ్ యాక్టర్‌ ‘రాబర్ట్ హాఫ్‌మన్‌’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్‌ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్‌ చేశాడు.&nbsp; మలీషా కోసం ‘గో ఫండ్‌ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్‌ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.&nbsp; సోషల్‌ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్‌ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.&nbsp; మలీషాకు పాపులారిటీని గమనించిన&nbsp; ‘ది పికాక్‌’ అనే మ్యాగజైన్‌ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్‌ పేజ్‌ మీద ప్రింట్‌ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా&nbsp; మలీషా స్టోరీని పబ్లిష్‌ చేశాయి.&nbsp; మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ ఇచ్చింది. ‘ప్రిన్సెస్‌ ఆఫ్ స్లమ్‌’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.&nbsp; మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.&nbsp; చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.&nbsp; గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్‌ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది.&nbsp;
    మే 24 , 2023
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    నటీనటులు: గోపిచంద్‌, డింపుల్‌ హయాతి, ఖుష్బు, నాజర్‌, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్‌ శ్రీను దర్శకత్వం: శ్రీవాస్‌ సంగీతం: మిక్కి జే. మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి నిర్మాతలు: T.G విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గోపిచంద్‌, శ్రీవాస్‌ కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి హిట్‌ సాధించడంతో ఈ రామబాణంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్‌ వంటి దిగ్గజ నటులతో పాటు, అలీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, గెటప్‌ శ్రీను వంటి కామెడీ స్టార్లు నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్లే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామబాణం చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో గోపిచంద్‌ హిట్‌ కొట్టినట్టేనా? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి: విలువలు, నియమాలతో కూడుకున్న అందమైన ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంపై కార్పొరేట్ మాఫియా కన్నుపడుతుంది. వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పవర్‌ ఉపయోగించుకొని కష్టాలు పెడుతుంది. ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో (గోపిచంద్‌) శత్రువుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఆ హీరో ఎదుర్కొనే అడ్డంకులు, చివరికి వారిని ఎలా కాపాడుతాడు అనేది అసలు కథ. ‌హీరో కుటుంబానికి కార్పోరేట్‌ మాఫియాకు వైరం ఎందుకు వస్తుంది?. జగపతి బాబు, గోపిచంద్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? తెలియాలంటే రామబాణం చూడాల్సిందే. ఎవరేలా చేశారంటే: ఎప్పటిలాగే రామబాణంలో కూడా గోపిచంద్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో గోపిచంద్‌ నటన సినిమాకే హైలెట్‌ అని చెప్పొచ్చు. అటు హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఎంతో గ్లామర్‌గా కనిపించింది. జగపతి బాబు పాత్ర కూడా సినిమాకు చాలా కీలకం. ఆ పాత్రను తన ‌అద్బుతమైన నటనతో జగపతిబాబు నిలబెట్టాడు. ఇక సప్తగిరి, వెన్నెల కిషోర్‌, అలీ, గెటప్‌ శ్రీను, సత్య కామెడీ బాగుంది.&nbsp; సాంకేతికంగా: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీవాసు ఈ సినిమాకు మంచి కథే తీసుకున్నప్పటికీ..&nbsp; సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడో చూసిన కథలా సినిమా అనిపిస్తుంది.&nbsp; రామబాణం&nbsp; ఫ్యామిలీ కథ అయినప్పటికీ కొత్తనం లేకపోవడం మైనస్. రోటీన్‌గా ముందుకు సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్టాఫ్ సీన్లు డీసెంట్‌గా ఉన్నప్పటికీ… సెకండాఫ్‌లో స్టోరీ నెమ్మదించింది. &nbsp;అయితే&nbsp; కామెడీ, యాక్షన్‌ డ్రామాలతో ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ చేశాడు. సెంటిమెంట్‌ సీన్లు బాగా పండాయి. ఇక మిక్కీ జే. మేయర్‌ అందించిన&nbsp; BGM యాక్షన్‌&nbsp; సీన్లను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. ప్లస్‌ పాయింట్స్‌ గోపీచంద్ నటనయాక్షన్, కామెడీ సీన్స్నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీత సీన్స్సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్ రేటింగ్‌: 2.75/5
    మే 05 , 2023
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.&nbsp; రామబాణం హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది. ఉగ్రం నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ది కేరళ స్టోరీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది. విరూపాక్ష(మళయాలం) తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.&nbsp; అరంగేట్రం కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.&nbsp;&nbsp;&nbsp; యాద్గిరి అండ్ సన్స్ వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix&nbsp;May 4MeterMovieTeluguNetflix&nbsp;May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
    మే 02 , 2023
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.&nbsp; హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.&nbsp; ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.&nbsp; 2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.&nbsp; లక్ష్యం మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్‌ విక్‌ నుంచి ఇది నేర్చుకోవచ్చు. నిబద్ధత జాన్‌ విక్‌ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు. కఠోర శ్రమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్‌ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.&nbsp; అసలేంటిది? నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.&nbsp; హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్‌ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం. నమ్మకం సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్‌ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు. మన పని చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు. తక్కువగా మాట్లాడు సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు. ప్లాన్ బి&nbsp; చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా. కుదరదు ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.&nbsp;
    మార్చి 21 , 2023
    <strong>Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది</strong>
    Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
    దిగ్గజ నటుడు వెంకటేష్‌ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్‌ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘తెలియక రియల్‌ గన్‌ గురిపెట్టా’ ‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్‌ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్‌ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్‌ గారు నీకు రియల్‌ గన్‌ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్‌ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్‌ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్‌ కంగారు పడ్డారు. వెంటనే గన్‌ నుంచి బుల్లెట్స్‌ తీశారు. అది జస్ట్‌ ఇలా టచ్‌ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్‌ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్‌ గన్‌ అని తెలియక గణేష్‌ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు' అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్‌ రావిపూడి తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1859203309460242668 'అప్పుడే పరిశ్రమ బాగుంటుంది' ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్‌ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. సీనియర్‌ నటుడు నరేష్‌ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్‌ వెంకటేష్ అని కొనియాడారు.&nbsp; https://twitter.com/i/status/1859532368333373653 https://twitter.com/i/status/1859206087821737998 సంక్రాంతికి హ్యాట్రిక్‌ చిత్రాలు! 2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్‌ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్‌ పెట్టారని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/i/status/1859522147229573619 70% థియేటర్లు దిల్‌రాజుకే! 2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్‌ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్‌ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp;
    నవంబర్ 21 , 2024
    <strong>Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?</strong>
    Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్‌ చంద్ర, కిషోర్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, మైమ్‌ గోపి, రూపలక్ష్మీ తదితరులు రచన, దర్శకత్వం : కరుణ కుమార్‌ సంగీతం : జి. వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: కిషోర్‌ కుమార్‌ ఎడిటింగ్‌ : కార్తికేయ శ్రీనివాస్‌ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల విడుదల తేదీ: 14-11-2024 మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్‌ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review) కథేంటి మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోనితో పాటు నవీన్‌ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒకప్పటి గ్యాంగ్‌ స్టార్‌ రతన్‌ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్‌ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్‌ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్‌ అయ్యింది. కెమెరామెన్‌ కిషోర్‌ కుమార్‌ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పీరియాడిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి. వి. ప్రకాష్‌ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్&nbsp; వరుణ్‌ తేజ్ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?</strong>
    Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?
    నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్‌, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, కె.ఎస్‌. రవికుమార్‌, హరీష్ ఉత్తమన్‌, కోవై సరళ, ఆనంద్‌రాజ్‌ తదితరులు.. దర్శకత్వం : శివ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి ఎడిటింగ్‌: నిషాద్‌ యూసఫ్‌ నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్‌, వంశీ ప్రమోద్‌ విడుదల తేదీ: 14-11-2024 తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్‌ వాంటెడ్‌ చిత్రం 'కంగువా' (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్‌ (Bobby Deol) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్‌ రాజా, వంశీ ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా నవంబర్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్య ఖాతాలో మరో విజయం పడినట్లేనా? ఇప్పుడు తెలుసుకుందాం. (Kanguva Movie Review) కథేంటి ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie Review) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే తమిళ స్టార్ హీరో సూర్య&nbsp; (Kanguva Movie Review) ఎప్పటిలాగే ఈ సినిమాలోనే అదరగొట్టేశాడు. ఫ్రాన్సిస్, కంగువా అనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ముఖ్యంగా కంగువా పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో సూర్య తన విశ్వరూపం చూపించాడు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాల వ్యక్తీకరణ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటాడు. ఇక విలన్‌గా బాబీ డియోల్ దుమ్మురేపారు. సూర్యకు సమఉజ్జీగా, క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడు. హాట్‌ బ్యూటీ దిశా పటాని తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాన్సిస్‌ పాత్రతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. కమెడియన్‌ యోగిబాబు అక్కడక్కడ నవ్వులు పూయించాడు. జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, కె.ఎస్‌. రవికుమార్‌, హరీష్ ఉత్తమన్‌లకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ సరికొత్త కథతో కంగువాను రూపొందించారు. ఫ్రాన్సిస్‌ పాత్రతో సినిమాను మెుదలుపెట్టిన దర్శకుడు కథలోకి వెళ్లేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. ఓ చిన్న పాప ఫ్రాన్సిస్‌ లైఫ్‌లోకి రావడం, ఆమె ద్వారా గత జన్మను లింకప్ చేసి కథలోకి తీసుకెళ్లాడు. కంగువా ఎంట్రీ నుంచి అసలు కథను ప్రారంభించారు డైరెక్టర్‌. 1000 ఏళ్ల కిందట తెగలు ఎలా ఉండేవి? వారి మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నది ఆసక్తిగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్‌ వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశారు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, యాక్షన్‌ సీక్వెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్‌ గూస్‌బంప్స్‌ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాలు, విలన్‌ పాత్ర కాస్త బలహీనంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ విషయాలకు వస్తే&nbsp; (Kanguva Movie Review)అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకు మంచి ఔట్‌పుట్‌ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్‌. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా కలిసొచ్చాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సూర్య నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంకొరవడిన ఎమోషన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024

    @2021 KTree