• TFIDB EN
  • లౌక్యం
    UATelugu2h 29m
    హీరో తన ఫ్రెండ్‌ కోసం విలన్‌ చెల్లెల్ని కిడ్నాప్‌ చేసి వారికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత విలన్‌ నుంచి తప్పించుకొని నగరానికి వచ్చిన హీరో అక్కడ తొలిచూపులోనే హీరోయిన్‌ను ప్రేమిస్తారు. తీరా ఆమె విలన్‌ రెండో చెల్లెలు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    గోపీచంద్
    వెంకటేశ్వర్లు వెంకీ
    రకుల్ ప్రీత్ సింగ్
    చంద్రకళ చందు
    బ్రహ్మానందం
    సిపాన శ్రీధర్ సిప్పీ
    ముఖేష్ రిషి
    కేశవ రెడ్డి
    సంపత్ రాజ్
    వరంగల్ బాబ్జీ
    రాహుల్ దేవ్
    సత్య
    చంద్ర మోహన్
    వెంకీ తండ్రి
    ప్రగతి మహావాది
    వెంకీ అమ్మ
    భరత్ రెడ్డి
    భరత్
    ప్రభాకర్
    శంకర్
    హంస నందిని
    హంస సిప్పీ
    పోసాని కృష్ణ మురళి
    గుప్తాజీ
    కృష్ణ భగవాన్
    నానో శాస్త్రి
    రఘు బాబు
    లీల
    పృధ్వీ రాజ్
    పృధ్వీరాజ్$
    బెనర్జీ
    మంత్రి
    సత్యం రాజేష్
    వెంకీ స్నేహితుడు
    గుండు సుదర్శన్
    దర్శకుడు
    గిరిధర్ వెంకీ స్నేహితుడు
    కాశీ విశ్వనాథ్
    ప్రిన్సిపాల్
    రఘు కారుమంచి
    బాబ్జీ అనుచరుడు
    రామచంద్ర కాలేజీ విద్యార్థి
    షకలక శంకర్
    విద్యార్థి
    సారిక రామచంద్రరావుదర్శకుడు
    హరీష్ శివముఖేష్
    సిబ్బంది
    శ్రీవాస్ ఓలేటి
    దర్శకుడు
    వి. ఆనంద్ ప్రసాద్నిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    కోన వెంకట్
    స్క్రీన్ ప్లే
    గోపీమోహన్
    స్క్రీన్ ప్లే
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?
    నటీనటులు: గోపిచంద్‌, డింపుల్‌ హయాతి, ఖుష్బు, నాజర్‌, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్‌ శ్రీను దర్శకత్వం: శ్రీవాస్‌ సంగీతం: మిక్కి జే. మేయర్ సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి నిర్మాతలు: T.G విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గోపిచంద్‌, శ్రీవాస్‌ కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి హిట్‌ సాధించడంతో ఈ రామబాణంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్‌ వంటి దిగ్గజ నటులతో పాటు, అలీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, గెటప్‌ శ్రీను వంటి కామెడీ స్టార్లు నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్లే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామబాణం చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో గోపిచంద్‌ హిట్‌ కొట్టినట్టేనా? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి: విలువలు, నియమాలతో కూడుకున్న అందమైన ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంపై కార్పొరేట్ మాఫియా కన్నుపడుతుంది. వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పవర్‌ ఉపయోగించుకొని కష్టాలు పెడుతుంది. ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో (గోపిచంద్‌) శత్రువుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఆ హీరో ఎదుర్కొనే అడ్డంకులు, చివరికి వారిని ఎలా కాపాడుతాడు అనేది అసలు కథ. ‌హీరో కుటుంబానికి కార్పోరేట్‌ మాఫియాకు వైరం ఎందుకు వస్తుంది?. జగపతి బాబు, గోపిచంద్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? తెలియాలంటే రామబాణం చూడాల్సిందే. ఎవరేలా చేశారంటే: ఎప్పటిలాగే రామబాణంలో కూడా గోపిచంద్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో గోపిచంద్‌ నటన సినిమాకే హైలెట్‌ అని చెప్పొచ్చు. అటు హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఎంతో గ్లామర్‌గా కనిపించింది. జగపతి బాబు పాత్ర కూడా సినిమాకు చాలా కీలకం. ఆ పాత్రను తన ‌అద్బుతమైన నటనతో జగపతిబాబు నిలబెట్టాడు. ఇక సప్తగిరి, వెన్నెల కిషోర్‌, అలీ, గెటప్‌ శ్రీను, సత్య కామెడీ బాగుంది.  సాంకేతికంగా: టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీవాసు ఈ సినిమాకు మంచి కథే తీసుకున్నప్పటికీ..  సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడో చూసిన కథలా సినిమా అనిపిస్తుంది.  రామబాణం  ఫ్యామిలీ కథ అయినప్పటికీ కొత్తనం లేకపోవడం మైనస్. రోటీన్‌గా ముందుకు సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్టాఫ్ సీన్లు డీసెంట్‌గా ఉన్నప్పటికీ… సెకండాఫ్‌లో స్టోరీ నెమ్మదించింది.  అయితే  కామెడీ, యాక్షన్‌ డ్రామాలతో ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ చేశాడు. సెంటిమెంట్‌ సీన్లు బాగా పండాయి. ఇక మిక్కీ జే. మేయర్‌ అందించిన  BGM యాక్షన్‌  సీన్లను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి. ప్లస్‌ పాయింట్స్‌ గోపీచంద్ నటనయాక్షన్, కామెడీ సీన్స్నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీత సీన్స్సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్ రేటింగ్‌: 2.75/5
    మే 05 , 2023
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. మరోమారు హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.  టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం రకుల్‌ షేర్ చేసిన నావెల్‌ షో పిక్స్‌.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.  టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.  ‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  https://twitter.com/i/status/1672013355924738048 అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్‌ G’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  ఈ ఏడాది ‘అయాలన్‌’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంతో రకూల్‌ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం రకుల్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.  అలాగే ప్రస్తుతం రకుల్‌ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్‌, దే దే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.  ఇక రకుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.  రకూల్‌ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను వరుసగా షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 08 , 2024
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.  https://twitter.com/i/status/1755616891970949447 రకుల్‌-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.  బీటౌన్‌ నిర్మాత  జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్‌ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.  https://twitter.com/i/status/1757012094317396389 ఇక రకుల్‌-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్‌ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.  అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్‌ చేసుకున్నారని టాక్‌.  కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రకుల్‌ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా  ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.  2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా రకుల్‌ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://twitter.com/i/status/1662932748166889473 ‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్‌ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్‌ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్‌ హిట్ కావడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టింది.  అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.  ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్‌ G’ (Doctor G), ‘థ్యాంక్‌ గాడ్‌’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్‌' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రకుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్‌ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.  అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్‌' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్‌ కపూర్‌ హీరోగా చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ రకుల్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 
    ఫిబ్రవరి 12 , 2024
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    Rakul Preet Singh: గడ్డకట్టించే నీటిలో బికినితో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
    యంగ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన గ్లామర్‌ షోను మరింత పెంచింది. బికిని డ్రెస్‌లో తన హాట్‌ హాట్‌ అందాలను చూపించి కుర్రకారును ఉర్రూతలూగించింది.  https://twitter.com/FilmsLoveLife/status/1654814001186983937 మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో రకుల్‌ ఐస్‌ బాత్‌ చేసింది.  గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది.  https://twitter.com/PavaNTRRR/status/1654834348858949633 రకుల్‌ ఈ వీడియోకు ‘క్రియో ఇన్‌ మైనస్‌ 15 డిగ్రీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె క్రియోథెరపీ చేయించుకుంటుందోని.. అందుకే ఈ ఫీట్‌ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రకుల్‌ తన సొగసైన నడుమును చూపించి మతిపొగొట్టింది.  వంపులు తిరిగిన నడుమును చూసిన నెటిజన్లు రకుల్‌ పిచ్చెక్కిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గిల్లీ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.  లౌక్యం, కరెంట్‌ తీగ, పండగ చేస్కో, కిక్‌ 2, బ్రూస్‌లీ వంటి వరుస సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  అయితే, ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇటీవల కట్‌పుట్‌లి డాక్టర్‌ G, థ్యాంక్‌ గాండ్‌, ఛత్రివలి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో రకుల్‌ నటిస్తోంది. అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్‌’ అనే సైంటిఫిక్‌ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
    మే 08 , 2023
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య  దర్శకుడు: క్లాక్స్ సంగీతం: మణిశర్మ నిర్మాణ సంస్థ: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌  నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)  సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్  విడుదల తేది: ఆగస్ట్‌ 25, 2023 కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎల్బీ శ్రీరామ్‌, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్‌ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ  ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్‌ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్‌ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) పెద్ద ప్లాన్‌ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్‌ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్‌ ఘోష్‌ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, డేనియల్‌గా రాంప్రసాద్‌ మెప్పించారు. రాజ్‌ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  ఎలా సాగిందంటే సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడంతో కథలో వేగం మిస్‌ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్‌, బ్రహ్మం, డేనియల్‌ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్‌ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్‌ అవుతుంది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం  జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్‌ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో  మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్‌ చేశాడు.  టెక్నికల్‌గా  చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్‌ అని చెప్పవచ్చు. సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్‌ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుహీరో, హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌సాగదీత సీన్లు  రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=98y83GscKEI
    ఆగస్టు 25 , 2023

    @2021 KTree