• TFIDB EN
  • లవ్ స్టోరీ
    UATelugu2h 45m
    రేవంత్‌(నాగ చైతన్య) జుంబా సెంటర్‌ నడుపుతుంటాడు. మౌనిక (సాయి పల్లవి) జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? కలిసి బతికేందుకు వారు ఎలాంటి సాహసం చేశారు? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SonyLivఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Prime
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగ చైతన్య
    రేవంత్
    సాయి పల్లవి
    మౌనిక రాణి అలియాస్ మౌని
    రాజీవ్ కనకాల
    మౌనిక మామయ్య
    దేవయాని
    మౌనిక తల్లి
    ఈశ్వరి రావు
    రేవంత్ తల్లి
    ఉత్తేజ్
    ఇమ్మన్నా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్
    ఆనంద చక్రపాణి
    మౌనిక తండ్రి
    గంగవ్వ
    రానా దగ్గుబాటి
    న్యాయమూర్తి
    సిబ్బంది
    శేఖర్ కమ్ముల
    దర్శకుడు
    నారాయణ్ దాస్ కె నారంగ్నిర్మాత
    పుస్కర్ రామ్ మోహన్ రావునిర్మాత
    పవన్ సి హెచ్సంగీతకారుడు
    విజయ్ సి. కుమార్
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
    Baby Movie Review: యూత్‌ని కట్టిపడేసిన బేబీ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడా?
    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, తదితరులు డైరెక్టర్: సాయి రాజేశ్ నిర్మాత: శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) మ్యూజిక్: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి కలర్ ఫొటో వంటి సినిమాకు కథ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ సినిమా తర్వాత స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ వహించిన సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్, మ్యూజిక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. చిత్రబృందం కూడా పూర్తి నమ్మకంతో ఉంది. మరి, ఈ మూవీ ప్రేక్షకుడిని మెప్పించిందా? ట్రయాంగిల్ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాడా? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటంటే? ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌కి దగ్గరవుతుంది. శారీరకంగానూ ఒకటవ్వాల్సి వస్తుంది. మరి, వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఆనంద్ ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? ప్రచార చిత్రాలను బట్టే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమైపోయింది. సినిమా చివరికి విషాదాంతమవుతుందని సూచిస్తూ డైరెక్టర్ సినిమాని మొదలు పెట్టాడు.  తొలుత ఆనంద్, వైషూల మధ్య వచ్చే స్కూల్ డేస్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పెద్దగా డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగే ఈ సీక్వెన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. ఆనంద్‌కి తెలియకుండా విరాజ్‌తో వైష్ణవి బంధాన్ని కొనసాగించడం, విరాజ్ అసలు వ్యక్తిత్వాన్ని ఆలస్యంగా తెలుసుకోవడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. యూత్ ఆలోచనకు తగ్గట్టు సన్నివేశాలు సాగడంతో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.  ఎవరెలా చేశారంటే? సినిమాకు ఆనంద్, వైష్ణవి ప్రాణం పోశారు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో పోటీ పడి మరీ నటించారు. ఆటోడ్రైవర్‌గా ఆనంద్ చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేసినా చివర్లో కాస్త తడబడినట్లు అనిపించింది. ఇక బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గర్ల్‌గా వైష్ణవి చక్కగా చేసింది.  లుక్స్ పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. ఒక రకంగా వైష్ణవి పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ సన్నివేశాల్లో అందాలు ఒలికించి.. భావోద్వేగ భరిత సీన్లకు న్యాయం చేసింది. ఇక విరాజ్ అశ్విన్, నాగబాబు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  టెక్నికల్‌గా.. తెలిసిన కథే అయినప్పటికీ సినిమాను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సాయిరాజేశ్. డైలాగ్స్‌తో ప్రేక్షకుడ‌్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లేను ప్రజెంట్‌ చేశాడు. ఎమోషనల్ సీన్లను చక్కగా తీశాడు. అయితే, క్లైమాక్స్‌లో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్లను పేలవంగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లను సాగదీసినట్లు ఉంటుంది. ఇక, విజయ్ బుల్గానిని మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాల్ రెడ్డి అందించిన విజువల్స్ సహజంగా ఉన్నాయి.  ప్లస్ పాయింట్స్ కథనం, డైలాగ్స్ నిర్మాణ విలువలు యూత్ ఎలిమెంట్స్ సంగీతం మైనస్ పాయింట్స్ సాగతీత సన్నివేశాలు క్లైమాక్స్ చివరగా.. యూత్‌ మనసును కట్టిపడేసే చిత్రమే ‘బేబీ’ రేటింగ్: 3/5 https://www.youtube.com/watch?v=_npN4uwDMLk
    జూలై 14 , 2023
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.  ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.   ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 
    ఆగస్టు 14 , 2023
    <strong>Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;</strong>
    Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;
    అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై&nbsp; అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌ కోసం సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.&nbsp; శివరాత్రి స్పెషల్ సాంగ్‌ నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్‌’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. శివరాత్రి థీమ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్‌ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్‌. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్‌. షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.&nbsp; https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016 తండేల్‌ స్టోరీ ఇదే నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్‌ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్‌ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.&nbsp; చైతూ ఆశలన్నీ తండేల్‌ పైనే! ప్రస్తుతం నాగ చైతన్య తన&nbsp; ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్‌ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్‌' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్‌ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Ram Charan - Suriya: రామ్‌ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?</strong>
    Ram Charan - Suriya: రామ్‌ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?
    టాలీవుడ్‌లో మల్టీ స్టారర్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో స్టార్‌ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (తారక్‌ - రామ్‌చరణ్‌), వాల్తేరు వీరయ్య (చిరు - రవితేజ), ‘సలార్‌’ (ప్రభాస్‌ - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌), కల్కి (ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌) చిత్రాలు ఏ స్థాయి సక్సెస్‌ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మైండ్‌ బ్లోయింగ్‌ మల్టీ స్టారర్‌ తెలుగులో రాబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దక్షిణాది స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, సూర్యలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్‌ - సూర్య మధ్య వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.&nbsp; బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ప్రభాస్‌తో సినిమా తర్వాతే! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో డైరెక్టర్‌ హను రాఘవపూడి ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవలే ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్‌ నిర్మించబోయే ఈ సినిమాకు 'ఫౌజి' అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హను గత చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్‌ డ్రామాగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా తర్వాతనే రామ్‌చరణ్‌-సూర్య కాంబో మూవీపై హను రాఘవపూడి దృష్టి పెడతారని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చరణ్‌-సూర్య బిజీ బిజీ ప్రస్తుతం రామ్‌ చరణ్‌, సూర్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలో నటిస్తుండగా సూర్య 'కంగువ' (Kanguva) చేస్తున్నాడు. సూర్య చిత్రం అక్టోబర్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. అటు రామ్‌చరణ్‌ డిసెంబర్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే ఛాన్స్ ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను లాక్‌ చేశారు. ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.&nbsp; మెగా మల్టీస్టారర్‌ లోడింగ్..! మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్‌ కోసం మెగాస్టార్‌ ఓ స్పెషల్‌ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్‌ కల్యాణ్‌ సైతం 'శంకర్‌ దాదా MBBS', 'శంకర్‌ దాదా జిందాబాద్‌' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
    జూలై 31 , 2024
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    గతవారం రోజుల నుంచి సరైన హిట్‌ లేక థియేటర్లు చిన్నబోతున్నాయి. చిన్న చిన్న సినిమాలు సందడి చేసినప్పటికీ.. వాటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp; గతవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నిఖిల్ నటించిన 'స్పై' డిజాస్టర్‌గా నిలిచింది. సామజవరగమణ సినిమా&nbsp; ఒక్కటే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ వారం ఏయే సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ఏయే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూద్దాం. &nbsp;బేబీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'.&nbsp; ఈ చిత్రం జులై 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం సినిమాపై చాలా కన్ఫడెంట్‌గా ఉంది. ఇప్పటిటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చిత్రం తెరకెక్కినట్లు తెలిసింది.&nbsp; ఇద్దరి యువకుల ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం గాఢంగా ఆమెను లవ్ చేసే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. నాయకుడు&nbsp; ఉద‌య‌నిధి స్టాలిన్‌, ఫ‌హాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ్&nbsp; హిట్ చిత్రం 'మామ‌న్నన్'. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా జులై 14న రిలీజ్ కానుంది. జూన్ 29న తమిళ్‌లో రిలీజైన ఈ మూవీ రూ.40కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రూలింగ్ పార్టీ లీడ‌ర్‌తో ఓ తండ్రీకొడుకులు సాగించిన‌ పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. తొలిసారి కమెడియన్ వడివేలు ఎమ్మెల్యే పాత్రలో సీరియస్‌ రోల్ చేశాడు. &nbsp;మహావీరుడు శివ కార్తికేయన్‌ లీడ్‌ రోల్‌లో మడోన్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేసిన యాక్షన్‌ చిత్రం మహావీరుడు (Mahaveerudu).&nbsp; ఈ మూవీ జులై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రచారాన్ని మూవీ యూనిట్ ప్రారంభించింది. శివ కార్తికేయన్‌ను మునుపెన్నడు చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. భారతీయన్స్‌: ది న్యూ బ్లడ్‌&nbsp; ప్రముఖ రచయిత ధీన్ రాజ్ డైరెక్టర్‌గా మారి తీసిన చిత్రం 'భారతీయన్స్'.&nbsp; ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ఘర్షణల్లో&nbsp; చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచిన భారతీయ సైనికుల పోరాట పటిమ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ హీరోలు. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాంరా, ఈశ్వర్, కలిసుందాంరా వంటి హిట్‌ చిత్రాలకు ధీన్‌ రాజ్ కథ అందించిన సంగతి తెలిసిందే.&nbsp; మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికరింగ్‌ పార్ట్‌ 1 మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కీలక పాత్రలో వస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్ (Mission Impossible Dead Reckoning)&nbsp; క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ ఈ చిత్రాన్ని యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్‌-1 జులై 12న రిలీజ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమా సందడి చేయనుంది. ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు TitleCategoryLanguagePlatformRelease DateBird Box BarcelonaMovieEnglishNetflixJuly 14KoharaWeb SeriesHindiNetflixJuly 15Transformers: Rise of the Beasts&nbsp;movieEnglishPrimeJuly 11Mayabazaar For Sale&nbsp;Web SeriesteluguZEE5July 14Janaki Johnny&nbsp;Web SeriesMalayalamDisney + HotstarJuly 11The Trial&nbsp;Web seriesHindiDisney + HotstarJuly 14Crime Patrol – 48 HoursMovieHindiSony LivJuly 10College Romance July 25Web seriesHindiSony LivJuly 25
    జూలై 10 , 2023
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు రంగబలి(Rangabali) నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది.&nbsp; రుద్రంగి(Rudrangi) బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; భాగ్ సాలే(Bhaag Saale) శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది. ఇద్దరు(Iddaru)&nbsp; యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది.&nbsp; సర్కిల్(Circle) ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’.&nbsp; నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్.&nbsp; ఓ సాథియా (Oo Sathiya) దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది. 7.11 PM ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది. మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader) మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది.&nbsp; నాతో నేను(Natho Nenu) సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateIshq Next DoorMovieHindiJio CinemaJuly 3GoodNightMovieTamilDisney + HotstarJuly 3BabylonMovieEnglishAmazon PrimeJuly 5Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6The Pope's ExorcistMovieEnglishNetflixJuly 7DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7TarlaMovieHindiZee5July 7IB 71MovieHindiDisney + HotstarJuly 7FarhanaMovieTamil/TeluguSony LivJuly 7BlindMovieHindiJio CinemaJuly 7 APP ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.&nbsp;&nbsp;&nbsp;
    జూలై 03 , 2023
    <strong>Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!</strong>
    Surya In Dhoom 4: షారుక్‌కి విలన్‌గా సూర్య.. బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమేనా!
    బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్‌ చిత్రాల సిరీస్‌లో 'ధూమ్‌' (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; సూర్య పాత్ర అదే? హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది.&nbsp; ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్‌. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్. చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్‌-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; 12 వేల థియేటర్లలో ‘కంగువా’! సూర్య ప్రస్తుతం 'కంగువా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్‌లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్‌ 15న కంగువాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్‌ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
    సెప్టెంబర్ 16 , 2024
    <strong>RC 17: పాన్‌ వరల్డ్‌ స్థాయిలో చరణ్‌-సుకుమార్‌ చిత్రం.. రికార్డులు దాసోహం కావాల్సిందే!</strong>
    RC 17: పాన్‌ వరల్డ్‌ స్థాయిలో చరణ్‌-సుకుమార్‌ చిత్రం.. రికార్డులు దాసోహం కావాల్సిందే!
    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో మెగా పవర్‌ స్టార్‌ 'రామ్‌ చరణ్‌' (Ram Charan) ఒకరు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత అతడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అయితే నటుడిగా రామ్‌ చరణ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన చిత్రం మాత్రం 'రంగస్థలం' (Rangasthalam). డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ మెగా వారసుడి నటనకు ఇండస్ట్రీ మెుత్తం ఫిదా అయ్యింది. చరణ్‌లోని అసలైన నటుడ్ని సుకుమార్‌ బయటకు తీసుకొచ్చారని సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అటువంటి చరణ్‌-సుక్కు కాంబోలో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC 17’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి చాలా రోజుల తర్వాత క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో.. రామ్‌ చరణ్‌- సుకుమార్‌ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని మించి 'RC 17' ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాన్‌ ఇండియా స్థాయిలో చరణ్‌-సుక్కు మూవీ రూపుదిద్దుకుంటుందని ఫ్యాన్స్‌ భావిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'RC 17' గ్లోబల్ స్థాయిలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఓ సమస్యను కీ&nbsp; పాయింట్‌గా చేసుకొని సుక్కు ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్‌ టేకింగ్‌కు పాన్‌ వరల్డ్‌ స్థాయి మూవీ పడితే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. 'RC 17'కు సంబంధించి త్వరలోనే కీలక అప్‌డేట్స్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ తర్వాతే! గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ప్రకటించిన విధంగానే ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్షన్‌లో చరణ్‌ నటించనున్నారు. 'RC 16' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్‌ తర్వాత చరణ్‌-సుకుమార్‌ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.&nbsp; సెట్స్‌పైకి ఎప్పుడంటే? డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. డిసెంబర్‌ 6న సినిమా రిలీజ్‌ చేసేందుకు శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ‘RC 17’ ప్రాజెక్ట్‌పై సుకుమార్‌ పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టే అవకాశముంది. అయితే ఇప్పటికే రామ్‌చరణ్‌ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను సుకుమార్‌ మెుదలుపెట్టినట్లు కూడా టాక్ ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సుకుమార్‌ భావిస్తున్నారు.&nbsp; చరణ్‌కు విలన్‌గా సూర్య! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అతడి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందట. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్‌-సూర్య మధ్య వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.&nbsp;
    ఆగస్టు 08 , 2024
    <strong>Balakrishna - Ram: టాలీవుడ్‌లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?</strong>
    Balakrishna - Ram: టాలీవుడ్‌లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?
    టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది ఆడియన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్‌ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్‌ కూడా&nbsp; మల్టీస్టారర్‌ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిరు-పవన్‌-చరణ్‌, రామ్‌చరణ్‌-సూర్య కాంబినేషన్స్‌పై గాసిప్స్‌ వచ్చాయి. తాజాగా బాలయ్య-రామ్‌ పోతినేని కాంబో చిత్రంపైనా జోరుగా ప్రచారం మెుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మల్టీస్టారర్‌ లోడింగ్‌..! మాస్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామ్‌ పోతినేని (Ram Pothineni) ముందు వరుసలో ఉంటారు. నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా మాస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అటు రామ్‌ కెరీర్‌ ప్రారంభంలో లవర్‌ బాయ్‌ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవల యాక్షన్‌ చిత్రాలపై ఫోకస్‌ పెట్టారు. ఇస్మార్ట్‌, స్కంద, డబుల్‌ ఇస్మార్ట్‌ వంటి యాక్షన్‌ చిత్రాల్లో నటించాడు. అటువంటి ఈ ఇద్దరి హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ రాబోతున్నట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్త నిజమైతే మాస్‌ ఆడియన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.&nbsp; గుడ్‌ ఫ్రెండ్‌షిప్‌ హీరో రామ్‌, నందమూరి బాలకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ విషయం తొలిసారి స్కంద ఆడియో ఫంక్షన్‌లో బయటపడింది. బోయపాటి, రామ్‌ కాంబోలో రూపొందిన ‘స్కంద’ ఆడియో రిలీజ్‌ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా హీరో రామ్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. రామ్‌ తన స్పీచులో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్క తరాన్ని అలరించేందుకు అల్లాడుతుంటే బాలయ్య మాత్రం మూడు తరాలను అలరిస్తూనే ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచేత్తారు. అటు బాలయ్య రామ్‌ను ఆకాశానికెత్తారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఓ సినిమాలో కలిసి నటిస్తే ఇక రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్‌ అంటున్నారు.&nbsp; చరణ్‌ - సూర్య కాంబోపై బజ్‌! గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan), తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్‌ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్‌ - సూర్య మధ్య వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.&nbsp; బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; మెగా హీరోలతో మల్టీస్టారర్‌! మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్‌ కోసం మెగాస్టార్‌ ఓ స్పెషల్‌ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్‌ కల్యాణ్‌ సైతం 'శంకర్‌ దాదా MBBS', 'శంకర్‌ దాదా జిందాబాద్‌' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
    ఆగస్టు 03 , 2024
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌ దర్శకులు: వినోద్ గాలి సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్ ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్ విడుదల తేదీ : జులై 4, 2024 ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్‌ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి వరంగల్‌కు చెందిన మదన్‌ (సిద్ధూ పవన్‌).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్‌ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్‌)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్‌ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్‌ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్‌ ఎలా మ్యానేజ్‌ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్‌ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్‌ కథ.&nbsp; ఎవరెలా చేశారంటే సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే.. బోల్డ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ సిరీస్‌ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్‌ అయ్యారు. రొటీన్‌ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్‌ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్‌ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్‌ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్‌ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్‌ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్‌ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్‌ పరంగా రిఫ్రెష్‌మెంట్‌ ఫీల్‌ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది.&nbsp;క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ.. అది మెయిన్‌ క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్‌ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్ర‌మిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్‌ కామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసెకండ్‌ లవ్‌ ట్రాక్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    జూలై 04 , 2024
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    Prasanna Vadanam Review: నటుడిగా మరో మెట్టు ఎక్కేసిన సుహాస్‌.. ‘ప్రసన్న వదనం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు రచన, దర్శకత్వం: అర్జున్‌ వైకే సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌ ఆర్‌ నిర్మాత: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌ విడుదల తేదీ: 03-05-2024 సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్ ఇందులో నటించాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం (మే 3) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూ తెలుసుకుందాం.  కథేంటి రేడియో జాకీగా పనిచేస్తున్న సూర్య (సుహాస్‌) జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయి ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే సమస్య బారిన సూర్య పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటాడు. ఒక రోజు సూర్య కళ్లెదుట ఓ యువతి హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారో స్పష్టంగా చూడలేకపోయినా పోలీసులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఏసీపీ వైదేహీ (రాశి సింగ్‌) వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. ఈ క్రమంలో సూర్యపై దాడి జరుగుతుంది. అనూహ్యంగా సూర్యనే ఈ హత్య కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? పాయల్‌తో హీరో లవ్ స్టోరీ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరో సుహాస్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా సుహాస్‌ ఇంకాస్త మెరుగయ్యాడని చెప్పవచ్చు. పాత్రకు అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్ని పలికించి మెప్పించాడు. ఇక సుహాస్‌కు జోడీగా పాయల్‌ ఓకే అనిపించింది. వారి మ‌ధ్య వచ్చే  స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. పోలీసు ఆఫీసర్‌గా రాశి సింగ్‌కు మంచి పాత్రే దక్కింది. ఆ రోల్‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే డిజార్డర్‌ ఉన్న హీరో పాత్రలను గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ దర్శకుడు అర్జున్‌ వైకే ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ను కథాంశంగా తీసుకోవడం కొత్తగా అనిపించింది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్యపై ప్రారంభంలోనే ప్రేక్షకులకు ఓ అవగాహన తీసుకొచ్చి తదుపరి సన్నివేశాలపై ఆసక్తి రగిలించాడు. హీరోకు స్నేహితుడి మధ్య వచ్చే సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. విరామానికి ముందు వచ్చే అనూహ్య మలుపుతో కథ రసవత్తరంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలతో సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. అయితే అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. అలాగే దర్శకుడు క‌థ‌ని న‌డిపించిన విధాన‌ం ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది.  సాంకేతికంగా.. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా చంద్రశేఖరన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజయ్‌ బుల్గానిన్ అందించిన పాటలు కన్నా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలను BGM బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎక్కడ రాజీపడినట్లు కనిపించలేదు. ప్లస్‌ పాయింట్స్ సుహాస్‌ నటనమలుపులుసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్ ప్రారంభ సీన్స్నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5 
    మే 03 , 2024
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రీతు వర్మ తెలుగులో పెళ్లి చూపులు (2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో రీతు వర్మ నటించింది. కణం, మార్క్ ఆంటోని వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే రీతు వర్మ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About ritu varma)&nbsp; విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; రీతు వర్మ దేనికి ఫేమస్? రీతు వర్మ.. పెళ్లిచూపులు, వరుడు కావలెను, కణం చిత్రాల్లో లీడ్ రోల్&nbsp; చేసి గుర్తింపు పొందింది. రీతు వర్మ వయస్సు ఎంత? 1990, మార్చి 10న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 33 సంవత్సరాలు&nbsp; రీతు వర్మ ముద్దు పేరు? రీతు రీతు వర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు రీతు వర్మ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ రీతు వర్మకు వివాహం అయిందా? ఇంకా కాలేదు రీతు వర్మ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, సినిమాలు చూడటం రీతు వర్మకు ఇష్టమైన ఆహారం? ఇటాలియన్ వంటకాలు రీతు వర్మ ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రణ్‌బీర్ కపూర్ రీతు వర్మకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్, శ్రీదేవి రీతు వర్మ ఫెవరెట్ సినిమాలు? క్వీన్, హేట్ లవ్ స్టోరీస్ రీతు వర్మ సిగరెట్ తాగుతుందా? తెలియదు రీతు వర్మ మద్యం తాగుతుందా? తెలియదు &nbsp;&nbsp;రీతు వర్మ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? పెళ్లి చూపులు రీతు వర్మ ఏం చదివింది? మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది రీతు వర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. రీతు వర్మ తల్లిదండ్రుల పేర్లు? దిలిప్ కుమార్ వర్మ, సంగీత వర్మ రీతు వర్మకు అఫైర్స్ ఉన్నాయా? తెలియదు రీతు వర్మ ఎన్ని అవార్డులు గెలిచింది? పెళ్లి చూపులు చిత్రానికిగాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది రీతు వర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rituvarma/ రీతు వర్మ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు https://www.youtube.com/watch?v=m3ldXnuR8Po
    ఏప్రిల్ 08 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను (Taapsee Pannu) సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బో (Mathias Boe)తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు&nbsp; మీడియాలో వార్తలు వస్తున్నాయి.&nbsp; మార్చి 20న ఈ జంట ప్రీవెడ్డింగ్‌ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం.&nbsp; ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక (Kanika Dhillon) తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువురు వెల్లడిస్తున్నారు.&nbsp; తాప్సీ - మథియాస్‌ వేడుకకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాప్సీ అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా వాటిపై తాప్సీ స్పందించారు.&nbsp; ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని ఆమె పేర్కొంది.&nbsp; బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఓ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని అప్పట్లో పేర్కొంది. ఇలా దశాబ్ద కాలం&nbsp; నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.&nbsp; ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.&nbsp; ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.&nbsp; 2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను ఇటీవల ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    మార్చి 25 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్&nbsp; పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ&nbsp; కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా &nbsp; టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ&nbsp; న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్‌ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్‌ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/memesbyAru/status/1762745277944054182 తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ (Mathias Boe)ని వివాహం చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మార్చి నెలఖారు లోపు పెళ్లి బంధంతో వీరు ఒక్కటవుతారని సమాచారం.&nbsp; సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారిపోయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తాప్సి - మథియస్‌ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని అంటున్నారు.&nbsp; సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; సుమారు పదేళ్లుగా తాప్సీ - మథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఈ జంట చాలా జాగ్రత్త పడింది. ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.&nbsp; బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఆ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.&nbsp; ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.&nbsp; ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.&nbsp; 2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.&nbsp; ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    ఫిబ్రవరి 28 , 2024
    Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!
    Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్‌.. రావణుడిగా యష్‌.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!
    అందాల తార సాయి పల్లవి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.&nbsp; 2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్‌ చేసినట్లు సమాచారం అందుతోంది.&nbsp; రామయాణం చిత్రాన్ని బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ కుమార్‌ తెరకెక్కించనున్నట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; ఈ చిత్రంలో కేజీఎఫ్‌ హీరో యష్‌ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్‌కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్‌ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్‌ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి.&nbsp; పెళ్లిపై జరుగుతున్న రూమర్స్‌పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్‌ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.
    అక్టోబర్ 04 , 2023
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!
    స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌ ద్వారా తనలోని బోల్డ్ యాంగిల్‌ను సమంత చూపించి అక్కడ క్లిక్ అయింది.&nbsp; పుష్ప క్రేజ్‌తో రష్మిక ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై ఆమె సైన్ చేసింది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది.&nbsp; టాలీవుడ్‌లో విరాటపర్వం తర్వాత సాయి పల్లవికి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. భోళాశంకర్‌లో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ తిరస్కరించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తానని అప్పట్లో బాహాటంగానే చెప్పింది. గ్లామర్ షోలకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో జాగ్రత్తలు పాటింటే సాయి పల్లవి.. మరి బాలీవుడ్‌లో ఏలాంటి కంటెంట్‌కు ఓకే చెప్పిందో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ అంటేనే గ్లామర్ షోకు పెద్ద పీట వేస్తుంది. మరి సాయి పల్లవి మడి కట్టుకోకుండా అందాల ఘాటు పెంచుతుందా? లేక దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.&nbsp; ఆమిర్ ఖాన్‌ కొడుకు జునైద్ ఖాన్‌తో సాయిపల్లవి చేసే సినిమా మంచి లవ్ స్టోరీగా సునీల్ పాండే తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండటంతో&nbsp; సాయి పల్లవి కథ వినగానే ఓకే చెప్పిసిందని టాక్. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం జునైద్ ఖాన్ యాశ్ రాజ్ ఫిల్మ్స్‌ నిర్మాణంలో వస్తున్న మహారాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే జునైద్‌ ఖాన్‌కు ఫస్ట్ సినిమా. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; తొలి సినిమా రిలీజ్‌ కాకముందే బాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా స్థిరపడేందుకు సాయి పల్లవితో మరో లవ్ స్టోరీకి జునైద్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.
    సెప్టెంబర్ 14 , 2023
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్&nbsp; డైరెక్టర్ - పీ మహేష్ బాబు నిర్మాత -&nbsp; ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి బ్యానర్ - UV క్రియేషన్స్ సంగీతం - రధన్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే&nbsp; జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం.. కథేంటంటే..? మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.&nbsp; హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది.&nbsp; క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్. ఎలా ఉందంటే?&nbsp; రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.&nbsp; ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్‌ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది.&nbsp; ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్‌’గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు. బలాలు నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు బలహీనతలు సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు టెక్నికల్ పరంగా.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్‌ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి. చివరగా.. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 07 , 2023

    @2021 KTree