• TFIDB EN
 • మ్యాడ్
  U/ATelugu
  మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? అనేది మిగతా కథ.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  YouSay Review

  MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!

  ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయ...read more

  How was the movie?

  @maheshYadavv

  8 months ago

  తారాగణం
  సంగీత్ శోభన్దామోధర్ "DD"
  నార్నే నితిన్అశోక్
  రామ్ నితిన్మనోజ్
  శ్రీ గౌరీ ప్రియా రెడ్డిశృతి
  అనంతిక సనీల్‌కుమార్జెన్నీ
  గోపికా ఉద్యానరాధ
  రఘు బాబు
  కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం
  రాచ రవిప్యూన్
  మురళీధర్ గౌడ్గణేష్ తండ్రి
  విష్ణు ఓయీగణేష్ "లడ్డూ"
  రవి ఆంటోనిఆంథోనీ రోడ్రిగ్జ్
  శ్రీకాంత్ ఎన్ రెడ్డి
  రఘురామ్ శ్రీపాదజిరాక్స్ జనార్ధన్
  అనుదీప్ కెవి
  అతిధి పాత్ర
  సిబ్బంది
  కళ్యాణ్ శంకర్దర్శకుడు
  హారిక సూర్యదేవర నిర్మాత
  సాయి సౌజన్య నిర్మాత
  కళ్యాణ్ శంకర్రచయిత
  భీమ్స్ సిసిరోలియోసంగీతకారుడు
  షామ్‌దత్ సైనుదీన్
  సినిమాటోగ్రాఫర్
  దినేష్ కృష్ణన్సినిమాటోగ్రాఫర్
  నవీన్ నూలిఎడిటర్ర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
  MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
  నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..  టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
  అక్టోబర్ 06 , 2023
  శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  శ్రీ గౌరి ప్రియ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో 'మ్యాడ్‌' (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన 'లవర్‌' సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది.  శ్రీ గౌరి ప్రియ ఎప్పుడు పుట్టింది? 1998, డిసెంబర్ 13న జన్మించింది శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? మెయిల్(2021) అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా పరిచయమైంది. కానీ మ్యాడ్(2023) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. శ్రీ గౌరి ప్రియ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  శ్రీ గౌరి ప్రియ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ శ్రీ గౌరి ప్రియ అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, ఇండియన్, చైనీస్ వంటకాలు శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ శ్రీ గౌరి ప్రియకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు శ్రీ గౌరి ప్రియ తల్లిదండ్రుల పేరు? శ్రీనివాస్ రెడ్డి, వసుంధర శ్రీ గౌరి ప్రియ ఏం చదివింది? BBA శ్రీ గౌరి ప్రియ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.15-20 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. శ్రీ గౌరి ప్రియ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది శ్రీ గౌరి ప్రియ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/srigouripriya/?hl=en https://www.youtube.com/watch?v=ugEm7OrVkfE
  ఏప్రిల్ 05 , 2024
  Furiosa A Mad Max Saga Movie Review: ఎడారిలో అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ‘ఫ్యూరియోసా’ ఎలా ఉందంటే?
  Furiosa A Mad Max Saga Movie Review: ఎడారిలో అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ‘ఫ్యూరియోసా’ ఎలా ఉందంటే?
  నటీనటులు : అన్య టేలర్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, టామ్‌ బుర్కె, అలైలా బ్రౌనీ, జాన్‌ హౌవర్డ్‌, ల్యాచీ హుల్మే,  అంగుస్‌ శాంప్సన్‌ తదితరులు డైరెక్టర్‌ : జార్జ్‌ మిల్లర్‌ సంగీతం : జుంకీ ఎక్స్‌ఎల్‌ సినిమాటోగ్రాఫర్‌ : సైమన్‌ డుగ్గాన్‌ ఎడిటర్‌ : మార్గరేట్‌ సిక్సెల్‌ నిర్మాత: డౌగ్‌ మిచెల్‌ గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga Review In Telugu). 2015లో వచ్చిన ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’.. యాక్షన్ సినిమాల్లో బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన మూవీ కావడంతో భారత్‌ సహా వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. తొలి భాగంలో ఆమె సిటాడెల్‌ రాజు దగ్గర నుంచి తప్పించుకోవడం చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ఆమె బాల్యం? సిడాడెల్‌ రాజు వద్దకు ఎలా వచ్చింది? అందుకు కారణం ఎవరు? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది చూపించారు. ‘థోర్’, ‘ఎక్స్‌ట్రాక్షన్’ లాంటి చిత్రాలతో భారత ఆడియన్స్‌కు దగ్గరైన క్రిస్ హెమ్స్‌వర్త్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి భూమి సారం కోల్పోయి ఎడారిగా మారే కాలంలో కథ జరుగుతుంటుంది. తల్లి మేరి (చార్లీ ఫ్రేజర్‌)తో ఉన్న ఫ్యూరియోసా (అన్య టేలర్‌)ను ఓ బైకర్‌ యంగ్‌ ఎత్తుకుపోతుంది. వెతుక్కుంటూ వచ్చిన మేరీని ఆ ముఠా లీడర్‌ డెమంటస్‌ (క్రిస్‌ హెమ్స్‌వర్త్‌).. ఫ్యూరియోసా కళ్ల ముందే దారుణంగా హత్య చేస్తాడు. ఆపై ఆమెను సంధిలో భాగంగా సిటాడెల్‌ రాజుకు ఇచ్చేస్తాడు. రాజు నుంచి తప్పించుకున్న ఫ్యూరియోసా మగ వేషం ధరించి ఓ కారణం చేత సిటాడెల్‌ సైన్యాధికారికి కుడి భుజంగా మారుతుంది. ఫ్యూరియోసా కథ చివరికి ఏమైంది? తన తల్లిని చంపిన డెమెంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎడారిలోనూ పండగల విత్తనం ఆమె చేతికి ఎలా వచ్చింది? దాంతో ఆమె ఏం చేసింది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే చిన్నప్పటి ఫ్యూరియోసాగా (Furiosa: A Mad Max Saga Review In Telugu) అలైలా బ్రౌనీ, పెద్దయ్యాక ఫ్యూరియోసాగా అన్యా టేలర్‌ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో అన్యా టేలర్‌ ఇరగదీసింది. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. ఇక ప్రతినాయకుడు డెమెంటస్‌ పాత్రలో క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ జీవించాడు. ఇప్పటివరకూ హీరోగానే పరియం ఉన్న అతడు విలన్‌గానూ తన మార్క్‌ ఏంటో చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ జార్జ్‌ మిల్లర్‌ మంచి థ్రియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించాడు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌లో తెరకెక్కించాడు డైరెక్టర్‌. పెద్దగా ల్యాగ్‌ లేకుండా సినిమా మెుదలైన 10 నిమిషాలకే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. ఫ్యూరియోసాను డెమెంటస్ గ్యాంగ్ ఎత్తుకుపోవడం, ఆమె తల్లిని చంపడం, ఫ్యూరియోసా ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరడం ఇలా  కథ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. హీరోగా అందరికీ పరిచయమైన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ను ఈవిల్‌ వెర్షన్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నాడు. అయితే యాక్షన్‌ సీన్లు మరీ లెంతీగా ఉండటం, ఎడారిలో వచ్చే క్లైమాక్స్‌ ఛేజ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్‌ వస్తుంది.  టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Furiosa: A Mad Max Saga Review In Telugu).. ప్రతీ విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్‌ సైమన్‌ డుగ్గాన్‌ పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫ్యూచరిక్‌ విజువల్‌ వండర్‌గా ఆయన మూవీని తీర్చిదిద్దాడు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. గ్రాఫిక్స్‌ టీమ్‌ పనితీరు కూడా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ అన్య టేలర్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌సాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  
  మే 24 , 2024
  Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
  Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
  ప్రతీ సంవత్సరం స్టార్‌ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్‌ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.  శౌర్యువ్‌ నాని హీరోగా తెరక్కిన హాయ్‌ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.  కళ్యాణ్‌ శంకర్‌ కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్‌ చేసిన ప్రమోషన్స్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.  క్లాక్స్‌ చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.  వేణు యెల్దండి ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.  షణ్ముఖ ప్రశాంత్ ఈ ఏడాది విడుదలైన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  మురళి కిషోర్ కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్‌.
  డిసెంబర్ 16 , 2023
  This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
  This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
  గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు రాజు యాదవ్‌ జబర్దస్త్ ఫేమ్‌ గెటప్‌ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju yadav). అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. లవ్‌ మీ ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్‌ యూ డేర్‌’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని  ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  డర్టీ ఫెలో శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్‌ డ్రామా చిత్రమని మూవీ యూనిట్‌ తెలిపింది.  ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man MovieEnglishLions Gate PlayMay 24
  మే 20 , 2024
  Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా? 
  Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా? 
  ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే  గత కొద్ది కాలంగా  ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.  చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.  వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.  https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.  రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.  https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,  గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.  https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.  https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.  https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.  https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
  మార్చి 06 , 2024
  Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
  Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
  సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.  మూవీ ప్లాట్‌ ఏంటంటే..  కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.  మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..  గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.  కథ ఏంటంటే..  ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.  ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.  కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే..  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌. 
  జూన్ 06 , 2024
  Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
  Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  స్పైడర్‌ మ్యాన్స్‌ స్పెప్పులేస్తే.. గుంటూరు కారం సినిమాలో వచ్చే ‘మావ ఎంతైన’ పాటలో మహేష్‌ తన డ్యాన్స్‌తో అదరగొడతాడు. ముఖ్యంగా సాంగ్‌ ఎండింగ్‌లో వచ్చే ‘సర్రా.. సర్రా.. సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ హైలెట్‌గా అనిపిస్తుంది. బీట్‌కు తగ్గట్లు స్పెప్పులేసి మహేష్‌ అలరిస్తాడు. అయితే ఈ మ్యూజిక్‌కి స్పైడర్‌ మ్యాన్‌ (Spider Man) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ నెటిజన్‌కు వచ్చింది. స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేసిన డ్యాన్స్‌ను.. ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌కు సరిగ్గా సింక్‌ అయ్యేలా ఎడిట్‌ చేశాడు. స్పైడర్‌ మ్యాన్‌ తెలుగు వెర్షన్‌ పాటకు డ్యాన్స్‌ వేస్తే... అందరికీ కనుల విందుగా ఉంటుందంటూ వీడియోకు క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోపై మీరూ లుక్కేయండి.  https://twitter.com/i/status/1781273824639725625 ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే.. మహేష్‌ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ స్టెప్పులు వేసిన వీడియోపై ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పులు భలే సింక్ అయ్యాయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆసక్తికరంగా.. స్పైడర్‌ మ్యాన్‌ : గుంటూర్‌ కార్‌ 'హోమ్‌' (Spiderman: Guntur Kar'Home') అంటూ ఈ వీడియోకు ఫన్నీ టైటిల్‌ కూడా ఇచ్చాడు. మహేష్‌, స్పైడర్‌ మ్యాన్‌ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందంటూ మరో ఫ్యాన్‌ అభిప్రాయపడ్డాడు. SSMB 29 తర్వాత మహేష్‌ క్రేజ్‌ హాలీవుడ్‌ స్థాయికి చేరుకుంటుందని అప్పుడు ఇది నిజంగానే సాధ్యమవుతుందని ఇంకో నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ తనకు ఎంతో ఇష్టమని మరికొందరు పోస్టు చేస్తున్నారు.  మరో రికార్డు.. గుంటూరు కారంలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మహేష్‌ బాబు, శ్రీలీల (Sreeleela), పూర్ణ (Purna) ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల మార్క్‌ను ఈ సాంగ్‌ అందుకుంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఇది నిలిచింది. సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్‌ అయితే ఏకంగా 245 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉంది. https://www.youtube.com/watch?v=Ldn11dMHTJ8
  ఏప్రిల్ 20 , 2024
  PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
  PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
  పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్.  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఆయన క్రేజ్‌ను మ్యాచ్ చేయడం అంటే అంత తేలిక కాదు.   అటు సినీరంగంలోనూ, రాజకీయాల్లోనూ కొనసాగుతూ తనదైన ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గురించి నెటిజన్లు గూగుల్‌లో శోధన మొదలు పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ? దానికి గూగుల్ ఇచ్చిన క్రేజీ సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్ర: పవన్ కళ్యాణ్ ఇళ్లు ఎక్కడ? గూ: హైదరాబాద్‌- జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2021లో ఓ ఇళ్లును కొనుగోలు చేశాడు. అక్కడే తన  భార్య  అన్నా లెజ్నెవా వారి కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటంతో తన నివాసాన్ని అమరావతికి మార్చాడు. ప్ర: పవన్ కళ్యాణ్ పట్టిన రోజు ఎప్పుడు? గూ: పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 1971లో జన్మించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఎత్తు ఎంత? గూ: 1.78 మీటర్లు ప్ర: పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ పేరు? గూ: కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్ర: పవన్ కళ్యాణ్ పూర్తిగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ ఏది? గూ: కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు ప్ర: పవన్ కళ్యాణ్ ఏ ప్రొడక్షన్ నెట్‌వర్క్‌ క్రింద సినిమాలను నిర్మిస్తున్నారు? గూ: అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్ర: పవన్ కళ్యాణ్‌ తొలి హీరోయిన్ పేరు ఏమిటి? గూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ పవన్ ఫస్ట్ హీరోయిన్ ప్ర: పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు పొందిన మొదటి భార్య గురించి? గూ: నందిని. పవన్ కళ్యాణ్‌కు నందిని సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం కావడం జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. విడాకుల అనంతరం నందిని తన పేరును జాన్వీగా మార్చుకుని డా. కృష్ణా రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? గూ: ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారు.." నాకు ఒక వ్యక్తితో బంధం కుదరలేదు. నేను మరొకరిని వివాహం చేసుకోవలసి వచ్చింది. అలాగే ఇది కోరికతోనో, వ్యామోహంతోనో జరగలేదు. అవి అలా జరిగాయి. కానీ బాధను మాత్రం మిగిల్చాయి. ప్ర: పవన్ కళ్యాణ్ ఫొన్ నంబర్? గూ: 99047081XX లాస్ట్ రెండు డిజిట్స్ మాత్రం తెలియదు. ప్ర: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఎవరు? గూ: అన్నా లెజ్నెవా రష్యన్ మోడల్, నటి.  తీన్‌మార్ చిత్రం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.  వీరి వివాహం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్- ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయంలో జరిగింది. ప్ర: పవన్ కళ్యాణ్‌కు ఎంత మంది పిల్లలు? గూ: పవన్‌ కళ్యాణ్‌కు నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సంతానంగా అకీరా, ఆద్య. మూడో భార్య అన్నా లెజ్నెవాకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా జన్మించారు.
  మార్చి 19 , 2024
  Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!
  Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!
  యంగ్‌ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra).. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాలో తళుక్కుముంది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా సెలెనా రఫుల్‌ షోల్డర్‌ మ్యాక్సీ డ్రెస్‌ (Selena Ruffle Shoulder Maxi Dress)లో ఫొటోషూట్‌ నిర్వహించిన ఈ సుందరి.. తన అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.  మ్యాచింగ్‌ ఎయిర్‌ రింగ్స్‌, వాచ్‌ ధరించి యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌తో కనువిందు చేసింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు మైమరిపోతున్నారు. మన్నారా లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు స్వయానా సోదరి అయిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. 2014లో 'ప్రేమ గీమా జాంతా నై' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మన్నారా పరిచయమైంది. ఆర్‌.వి సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్‌ శ్రీరామ చంద్ర హీరోగా చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో జిద్‌ (Zid) సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అందులో మన్నారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా.. అక్కడ 'సందమరుతమ్‌', 'కావల్‌' చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోకపోవడంతో తిరిగి టాలీవుడ్‌పై మన్నారా ఫోకస్‌ పెట్టింది. తెలుగులో సునీల్‌తో 'జక్కన్న' (Jakkanna), సాయిధరమ్‌ తేజ్‌తో 'తిక్క' (Thikka), పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 'రోగ్‌' (Rough) వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు.  ఆ తర్వాత రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తిరిగి తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన  'సీత' (Sita) సినిమా అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా ఈ భామకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు. దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన మన్నారా.. Bigg Boss 17 హిందీలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అక్కడ తన ప్రవర్తన, ఆటతీరుతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.  గతేడాది 'భూత్‌మేట్‌' అనే హిందీ సిరీస్‌లో మన్నారా మెరిసింది. పారి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల 'డ్యాన్స్‌ దివానే 4' అనే హిందీ షోలో గెస్ట్‌ అప్పిరియన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది.  తాజాగా తెలుగులో 'తిరగబడరా సామి' అనే చిత్రంలో ఈ భామ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తికాగా.. విడుదలకు సిద్ధంగా ఉంది.  అటు పంజాబీలో ఓహీ చాన్ ఓహీ రాతన్‌ అనే చిత్రంలో మన్నారా చోప్రా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు వికీపిడీయా ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
  మార్చి 12 , 2024
  Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
  Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
  టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,  ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.  ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
  జూన్ 20 , 2023
  ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
  ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
  గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది. దసరా- మార్చి 30 నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్‌ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. OTT విడుదలలు శ్రీదేవి శోభన్ బాబు సంతోశ్‌ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీదేవీ శోభన్‌ బాబు. గత నెలలో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఓటీటీ: డిస్పీ+హాట్‌స్టార్‌ తేదీ : మార్చి 30 అమిగోస్‌ కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినంతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో జనాలకు బాగానేే వినోదాన్ని పంచింది. కల్యాణ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే   ఓటీటీలో సందడి చేయబోతోంది. ఓటీటీ: నెట్‌ ఫ్లిక్స్‌ తేదీ: ఏప్రిల్‌ 01 అసలు రవిబాబు దర్శకత్వంలో ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అసలు’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా కథ ఓ అమ్మాయి జర్నీ, అందులోని సవాళ్ల చుట్టూ జరిగే థ్రిల్లర్‌గా ఉంటనుంది. ఓటీటీ: ఈటీవీ విన్‌ తేదీ: ఏప్రిల్ 05 అన్ని ఓటీటీ విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateGODARIDocumentaryTeluguAhaMarch 31SattiGaani RendekaraluMovieTeluguAhaApril 01My Little Pony- Tell Your TaleWeb seriesenglishNetflixMarch 27Emergency NYCWeb seriesenglishNetflixMarch 29UnseenmovieenglishNetflixMarch 29Almost Pyaar with DJ MohbatMovieHindiNetflixMarch 31Murder Mistery 2MovieEnglishNetflixMarch 31Company of HeroesMovieEnglishNetflixApril 01Jar Head 3 - The SiegeMovieEnglishNetflixApril 01ShehzadaMovieHindiNetflixApril 01Spirit UntamedMovieEnglishNetflixApril 01WarSailerSeriesEnglishNetflixApril 02Avatar 2MovieenglishDisney+HotstarMarch 28GaslightMovieHindiDisney+HotstarMarch 31All That BreathesMovieHindiDisney+HotstarMarch 31AgilanMovieTamilZee5March 31AyothiMovieTamilZee5March 31United Kache MovieHindiZee5March 31Tetris MovieEnglishApple TvMarch 31MummiesMovieEnglishBookMyShowMarch 27BhageeraMovieTamilMobiMarch 31Indian SummersMovieHindiMX PlayerMarch 27
  మార్చి 27 , 2023
  EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
  EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
  టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.  శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.   రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.  బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.  లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌  రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.  సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి. 
  మే 04 , 2024
  EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
  EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
  సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.  ప్రకాష్‌ రాజ్‌  ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్‌ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్‌.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈ సీన్‌లో నటించమని ప్రకాష్‌ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్‌ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్‌ తెగ ఆలోచిస్తుంటారు.  https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp మహేష్‌ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన స్పైడర్‌ (Spyder) సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్‌ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్‌ కెరీర్‌లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.  మోహన్‌ బాబు 2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్‌ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్‌ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్‌ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.  https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X వెంకటేష్‌  టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్‌ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్‌.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.  రామ్‌ చరణ్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్‌ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్‌ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. అసలు చరణ్‌.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.  https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db ప్రభాస్‌ ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్‌’.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్‌ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ను డైరెక్టర్‌ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.  https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
  ఏప్రిల్ 30 , 2024
  శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. 'రామన్‌ రాఘవ్‌ 2.0' అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..  బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం.  శోభిత దూళిపాళ ఎప్పుడు పుట్టింది? 1991, మే 31న జన్మించింది శోభిత దూళిపాళ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? రామం రాఘవం 2.o శోభిత దూళిపాళ ఎత్తు ఎంత? 5 అడుగుల 9అంగుళాలు  శోభిత దూళిపాళ ఎక్కడ పుట్టింది? తెనాలి, ఆంధ్రప్రదేశ్ శోభిత దూళిపాళ తెలుగులో నటించిన తొలి సినిమా? గూడాచారి(2018) శోభిత దూళిపాళ అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ శోభిత దూళిపాళకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, టిబెటన్ వంటకాలు, నూడిల్స్ శోభిత దూళిపాళకు ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్ శోభిత దూళిపాళకు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, మహేష్ బాబు శోభిత దూళిపాళ తల్లిదండ్రుల పేరు? వేణు గోపాల్ రావు, శాంత శోభిత దూళిపాళ ఏం చదివింది? BCom, శోభిత దూళిపాళ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. శోభిత దూళిపాళ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది. శోభిత దూళిపాళ అవార్డులు? శోభిత దూళిపాళ 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచింది. 2013లోనే జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో విజేతగా నిలిచింది. శోభిత దూళిపాళకు ఎఫైర్స్ ఉన్నాయా? టాలీవుడ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sobhitad/?hl=en&img_index=6 https://www.youtube.com/watch?app=desktop&v=nJyjdLURscA
  ఏప్రిల్ 05 , 2024
  Devara: ‘పాతాల భైరవి’ గెటప్‌లో జూ.ఎన్టీఆర్.. తాత స్టైల్‌ను ఫాలో అయ్యింది అందుకేనా? 
  Devara: ‘పాతాల భైరవి’ గెటప్‌లో జూ.ఎన్టీఆర్.. తాత స్టైల్‌ను ఫాలో అయ్యింది అందుకేనా? 
  యంగ్‌ టైగర్‌ జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)కు తాత నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) అంటే అమితమైన ప్రేమ. తనకు తాత అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే చాలా వేదికలపై తారక్‌ వెల్లడించాడు. అటు ఫ్యాన్స్‌ (Jr NTR Fans) కూడా తారక్ అచ్చం వాళ్ల తాత లాగే ఉంటాడని అంటుంటారు. తారక్‌లోని నటనా నైపుణ్యం కూడా తాత నుంచి వచ్చిందేనని వ్యాఖ్యానిస్తుంటారు. ఇదిలా ఉంటే జూ.ఎన్టీఆర్‌కు.. రామారావు చేసిన చిత్రాల్లో ‘పాతాళ భైరవి’ అంటే మహా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని కూడా ఓ దశలో తారక్‌ భావించారు. అయితే రీసెంట్‌గా ‘దేవర’ నుంచి విడుదలైన ఫొటోలో తారక్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘పాతాళ భైరవి’లో ఎన్టీఆర్‌లాగా తారక్ ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.  తాతను దింపేసిన తారక్‌! పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ రోల్‌కు సంబంధించిన ఫొటోనే శుక్రవారం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ‘గడ్డం ఒకటే తేడా అని మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) డైలాగ్‌ను కామెంట్స్‌ రూపంలో పెడుతున్నారు.  పాతాళ భైరవి రీమేక్ ఏమైంది? తన తాతకు సంబంధించిన సినిమాను చేయాల్సి వస్తే కచ్చితంగా ‘పాతాల భైరవి’ (Patala Bhairavi) రీమేక్‌ చేస్తానని గతంలో జూ.ఎన్టీఆర్‌ తెలిపాడు. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి ద్వారా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా అప్పట్లో మెుదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ‘పాతాల భైరవి’ చిత్రానికి ఈ రోజుల్లో పెద్దగా ఆదరణ లభించకపోవచ్చని పలువురు పెద్దలు తారక్‌తో అన్నట్లు సమాచారం. ఈ జనరేషన్‌ వారికి ఆ సినిమా పెద్దగా ఎక్కక పోవచ్చని వారు వ్యాఖ్యానించారట. దీని గురించి సమాలోచనల్లో పడ్డ తారక్‌.. చివరికీ వారి మాటలతో ఏకీభవించినట్లు తెలిసింది. అలా ‘పాతాళ భైరవి’ రీమేక్‌ పనులు ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయాయి. అయితే ఆ సినిమాలో తాత గెటప్‌లో కనిపించాలన్న కోరికను ఇన్నాళ్లకు తారక్‌.. ‘దేవర’ రూపంలో తీర్చుకున్నట్లు తెలుస్తోంది.  రామారావు గెటప్‌లో తారక్‌! దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) సినిమాలో ఓ సీన్‌లో తారక్‌ (Jr NTR) అచ్చం తన తాత లాగే కనిపిస్తాడు. ముఖ్యంగా జూనియర్‌ యమ గెటప్‌లో.. గతంలో ఎన్టీఆర్‌ చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను చాలా అద్భుతంగా చెబుతాడు. నిమిషం పాటు ఉండే ఆ డైలాగ్‌ను అచ్చం రామారావు లాగా గుక్క తిప్పుకోకుండా చెప్పి ఎన్టీఆర్‌ అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. నటనలోనే కాదు డైలాగ్‌ డెలివరీలోనూ తాతకు తగ్గ వారసుడ్ని అని నిరూపించుకున్నాడు. అప్పట్లో ఈ డైలాగ్‌.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రామారావు, తారక్‌ చెప్పిన డైలాగ్‌ను సరిపోలుస్తూ వచ్చిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి.  https://twitter.com/i/status/1571718233828511744
  మార్చి 23 , 2024
  Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
  Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
  నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌ శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  
  మార్చి 22 , 2024
  Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
  Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
  సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో  అంతం చేస్తాడు. అటువంటి  బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.  భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.  కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.  కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.  రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో  రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.  పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.  అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.  పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.  ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.  సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.  బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.  అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు. 
  ఫిబ్రవరి 29 , 2024
  Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
  Successful Actress 2023: ఈ ఏడాది తమ స్టార్‌డమ్‌ను అమాంతం పెంచుకున్న హీరోయిన్లు వీరే!
  ఈ ఏడాది టాలీవుడ్‌ చాలా మంది హీరోయిన్లకు కలిసొచ్చింది. వారు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రత్యేకించి కొందరు మాత్రం ఈ ఏడాది తమ తల రాతలను మార్చుకున్నారు. తమకంటూ స్టార్‌ స్టేటస్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక 2023 ఏడాదిలో తమకు తిరుగులేదని వారు నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు సాధించిన ఘనతలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.  శ్రీలీల ఈ ఏడాది చాలా బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో శ్రీలీల (Sreeleela) ప్రథమ స్థానంలో ఉంటుంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. రవితేజ పక్కన ‘ధమాకా’లో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా ఆ తర్వాత వరుసగా రామ్‌తో ‘స్కంద’, బాలయ్య కూతురిగా 'భగవంత్‌ కేసరి', పంజా వైష్ణవ్‌ తేజ్‌తో 'ఆదికేశవ', నితీన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం మహేష్‌, విజయ్‌ దేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ సరసన శ్రీలీల నటిస్తోంది. కీర్తి సురేష్‌ యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. నాని సరసన ఆమె నటించిన 'దసరా' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. రూ.100 కోట్లకు పైగా ఇందులో తన నటనకు గానూ కీర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు ‘భోళాశంకర్‌’ సినిమాలో చిరంజీవి సోదరిగా నటించి మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ పక్కన ‘మామన్నన్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  రష్మిక మందన్న ఈ ఏడాది రష్మిక మందన్న(Rashmika Mandanna) తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో నటించిన ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిస్టర్‌ మజ్నూ’ చేసింది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా ఆమె నటించిన ‘యానిమల్‌’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సమంత ఈ ఏడాది సమంత (Samantha)కు మిశ్రమ స్పందన ఎదురైంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోగా విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ మూవీ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు తమిళం, ఇంగ్లీష్‌లో తెరకెక్కుతున్న బైలింగ్విల్‌ ఫిల్మ్‌ ‘చెన్నై స్టోరీస్‌’లోనూ నటించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.  సంయుక్త మీనన్‌ ఈ ఏడాది సంయుక్త మీనన్‌ (Samyuktha menon)కు మంచి విజయాలను అందించింది. ధనుష్‌ సరసన ఆమె నటించిన 'సార్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె చేసిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో సంయుక్త తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అనుష్క శెట్టి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన స్టార్‌ నటి అనుష్క (Anushka Shetty) ఈ ఏడాది మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'మిస్ శెట్టి మిష్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా అనుష్కకు గట్టి కమ్‌బ్యాక్‌ లభించిందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌లో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్‌ (Shruti Haasan)కు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా నానితో ‘హాయ్‌ నాన్న’ చిత్రంలోనూ ఓ పాటలో స్టెప్పులేసి అదరగొట్టింది. అలాగే ప్రభాస్‌ సరసన 'సలార్‌' సినిమాలోనూ శ్రుతి హాసన్‌ నటించింది. 
  డిసెంబర్ 19 , 2023
  Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్‌.. మూవీ హిట్టా? ఫట్టా?
  Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్‌.. మూవీ హిట్టా? ఫట్టా?
  నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు దర్శకుడు : వక్కంతం వంశీ నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంగీతం: హారిస్ జయరాజ్ సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023 'భీష్మ' సినిమా తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ చేసిన లేటెస్ట్‌ చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man). వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ మూవీని ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా... రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్‌ అని సినిమా విడుదలకు ముందు నితిన్‌ చెప్పాడు. మూవీ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ అభి (నితిన్) సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఎక్స్ట్రా ఆర్టిస్ట్‌గా సాగిపోతున్న అభి లైఫ్‌లోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్‌వాల్వ్‌ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)కి సైతాన్‌ సంబంధం ఏంటి ? చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో నితిన్‌ చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా లుక్‌, స్టైలింగ్‌ బాగుంది. ఇక శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. పాటలకే ఆమె పరిమితమైంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు రాజశేఖర్‌ పూర్తి న్యాయం చేశారు. హీరోకి తండ్రిగా రావు రమేష్‌ చాలా బాగా నటించాడు. తనదైన పంచ్‌లతో ఫన్ క్రియేట్ చేశారు. ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వక్కంతం వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్‌ బలహీనంగా ఉన్నప్పటికీ కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను నవ్వించడంలో ఆయన కొంతమేర సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. అయితే తొలి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ సెకండ్‌హాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్‌ కంటే ఫస్టాఫ్‌ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను లాజిక్‌కు చాలా దూరంగా చూపించారు డైరెక్టర్‌. అటు హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ను కూడా బలంగా చూపలేక పోయారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి అందించిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. అయితే సాగదీత సీన్లు అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉండాల్సింది.  ప్లస్‌ పాయింట్స్‌ నితిన్‌ నటనహాస్య సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ బలహీనమైన స్టోరీలవ్‌ ట్రాక్‌ రేటింగ్‌: 2.5/5
  డిసెంబర్ 08 , 2023

  @2021 KTree