• TFIDB EN
 • మహానటి
  UTelugu2h 49m
  దిగ్గజ నటి సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆమె ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? ఆమె జీవితంపై నటుడు జెమినీ గణేషన్‌ ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? వంటి అంశాలను ఇందులో చూపించారు. సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించింది.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  కీర్తి సురేష్
  నిస్శంకర సావిత్రి
  దుల్కర్ సల్మాన్
  జెమినీ గణేషన్
  సమంత రూత్ ప్రభు
  మధురవాణి
  విజయ్ దేవరకొండ
  విజయ్ ఆంథోని
  రాజేంద్ర ప్రసాద్
  కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి
  భానుప్రియ
  దుర్గాంబ
  దివ్య వాణిసుబద్రమ
  మోహన్ బాబు
  ఎస్వీ రంగారావు
  ప్రకాష్ రాజ్
  ఆలూరి చక్రపాణి
  శ్రీనివాస్ అవసరాల
  ఎల్వీ ప్రసాద్
  నాగ చైతన్య
  అక్కినేని నాగేశ్వరరావు
  మనోబాల
  పి.పుల్లయ్య
  షాలినీ పాండే
  సుశీల
  క్రిష్ జాగర్లమూడి
  కెవి రెడ్డి
  తరుణ్ భాస్కర్
  సింగీతం శ్రీనివాసరావు
  తులసి
  మధురవాణి తల్లి
  మురళీకృష్ణమధురవాణి తండ్రి
  నరేష్
  కెమెరామెన్ కేశవ
  తనికెళ్ల భరణి
  ప్రజావాణి సంపాదకులు
  మహేష్ ఆచంటసత్య
  సాయి మాధవ్ బుర్రా
  పింగళి
  డాని శాంచెజ్-లోపెజ్ లక్స్ ప్రకటన ఫోటోగ్రాఫర్
  సాయి తేజస్వినిబిడ్డ సావిత్రి
  చైత్రబిడ్డ సుశీల
  రామ్ చరణ్బాల సతీష్
  సిబ్బంది
  నాగ్ అశ్విన్
  దర్శకుడు
  ప్రియాంక దత్
  నిర్మాత
  మిక్కీ J. మేయర్
  సంగీతకారుడు
  కోటగిరి వెంకటేశ్వరరావు
  ఎడిటర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! 
  Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! 
  ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.  అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా  బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.  బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.  https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.  కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
  మే 29 , 2024
  Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
  Kalki 2898 AD Sequel: ప్రభాస్‌ ‘కల్కి’ రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానుందా? నెట్టింట ఆసక్తికర చర్చ!
  ప్రస్తుతం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా.. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీగా  అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ బజ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  రెండు కంటే ఎక్కువ భాగాలుగా! ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ సైతం మెుదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్‌) బుజ్జి వీడియో అభిమానులకు సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్‌ సైతం ఫ్యాన్స్‌ను మరింత ఖుషి చేస్తోంది. దీని ప్రకారం కల్కి చిత్రం రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  కారణం ఇదేనట! ‘కల్కి 2898 ఏడీ’ కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు టాక్‌. బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు రెండు కంటే ఎక్కువ భాగాలు అవసరం అవుతాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మెుదట కల్కీకి సంబంధించి ఓ సీక్వెల్‌ ప్లాన్‌ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్‌లోనూ కథ చెప్పలేకపోతే మిగతా పార్ట్స్‌ గురించి ఆలోచించాలని మేకర్స్‌ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ  ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  నేడు బిగ్ ఈవెంట్‌ ‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇవాళ (మే 22) రామోజీ ఫిల్మ్‌ సిటీలో పెద్ద ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ నిర్వహించనుంది. ఇప్పటికే స్టేజీ సిట్టింగ్‌ కూడా రెడీ అయ్యింది. సా. 5 గంటలకు ఈ వేడుక మెుదలకానుంది. కల్కి సినిమా మెుదలు పెట్టిన తర్వాత భారత్‌లో చేస్తున్న తొలి ఈవెంట్‌ కావడంతో దీనిపై అందరిలోనూ హైప్‌ ఏర్పడింది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. కల్కి సినిమాలో భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య రిలేషన్‌ ఏంటో ఈ ఈవెంట్‌లో చెప్పనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. 
  మే 22 , 2024
  Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
  Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌.. ఎందుకంటే?
  సలార్‌ (Salaar) తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‍, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్‌ న్యూస్‌ బయటకొచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.  మహేష్‌ బాబు డబ్బింగ్‌? (Mahesh Babu Dubbing) కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్‌ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే రివీల్‌ చేసింది. అయితే ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్‌ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్‌ వాయిస్‌ ఇస్తే సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  గతంలో ఇలాగే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఇలా డబ్బింగ్‌ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన అనుభవం ఉంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. సంజయ్‌ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్‌ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ చేత ఎలాగైన డబ్బింగ్‌ చెప్పించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్‌ ‘SSMB29’ సినిమా షూట్‌ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి. కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్‌’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.  ‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్‌ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. 
  మే 08 , 2024
  కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh)  విషయాలు ఇప్పుడు చూద్దాం.  కీర్తి సురేష్ దేనికి ఫేమస్? కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ వయస్సు ఎంత? 1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు   కీర్తి సురేష్ ముద్దు పేరు? కీర్తమ్మ కీర్తి సురేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు  కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది? చెన్నై Screengrab Instagram: keerthysureshofficial కీర్తి సురేష్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు కీర్తి సురేష్ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్ కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం? దోశ కీర్తి సురేష్ అభిమాన నటుడు? సూర్య, విజయ్  తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా? నేను శైలజ(2016) కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ కీర్తి సురేష్ ఏం చదివింది? ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్  Courtesy Instagram: Keerthy suresh కీర్తి సురేష్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు? సురేష్ కుమార్, మేనక కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా? తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది? మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/keerthysureshofficial/?hl=en కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్ సిమ్రాన్ కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్ తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది. https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
  ఏప్రిల్ 16 , 2024
  Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
  Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
  ప్రస్తుతం దేశంలో 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) ఫీవర్‌ నడుస్తోంది. గ్లోబల్‌ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌ను తలపించాయి. ఇక ఏమాత్రం వేచి ఉండలేమన్న స్థాయిలో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా అమెరికాలో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా అక్కడ కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు బద్దలు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'.. జూన్‌ 27న (Kalki Release Date) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండంతో అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. అమెరికా ప్రీ బుకింగ్స్‌ హిస్టరీలో సరికొత్త చరిత్రను కల్కి క్రియేట్‌ చేసింది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా ప్రీ బుకింగ్స్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్ కలెక్షన్స్‌ క్రాస్‌ చేసిన తొలి భారతీయ చిత్రంగా కల్కి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గతంలో ఈ రికార్డు 'ఆర్‌ఆర్‌ఆర్‌' పేరిట ఉండేది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ అయిన టికెట్ల సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.  దిశా పటానీ.. క్యారెక్టర్‌ రివీల్‌ కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని (Disha Patani).. ఇలా పలువురు స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ల పేర్లను పోస్టర్ల రూపంలో చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.  నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో మూవీలోని ఆమె పాత్ర పేరును కల్కి టీమ్‌ రివీల్‌ చేసింది. క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దిశా గోడకు ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.  బుజ్జిని నడిపిన ఆనంద్‌ మహీంద్ర ‘కల్కి’లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా బుధవారం నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకుంది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆనంద్‌ మహీంద్ర బుజ్జితో ఫొటోలు దిగారు. కాగా, బుజ్జి వెహికల్‌ తయారీకి.. 'మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ' టీమ్‌ సహాయపడినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ వాహనం రెండు మహీంద్ర ఇ-మోటర్లతో నడుస్తుందని చెప్పారు. నాగ్ అశ్విన్‌, అతడి టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.  https://www.youtube.com/watch?v=wS0gKXgO_AA&t=25s
  జూన్ 13 , 2024
  WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
  WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
  తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.  పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం. సీతారామం  సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు. కర్తవ్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది. ధర్మ యోగి హీరోయిన్‌ త్రిషను విలన్‌ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం. శివగామి బాహుబలిలో ప్రభాస్‌ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. అత్తారింటికీ దారేది పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్‌ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఓసేయ్ రాములమ్మ ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్‌ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.  చంద్రముఖి చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
  మార్చి 07 , 2024
  Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
  Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
  బాహుబలి ముందు వరకూ టాలీవుడ్‌ (Tollywood)కే పరిమితమైన ప్రభాస్‌.. ఆ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసపెట్టి జాతీయ స్థాయి చిత్రాలు చేస్తున్న ప్రభాస్‌.. రీసెంట్‌గా సలార్‌ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ను అందుకున్నాడు. ప్రభాస్‌ (Prabhas) కటౌట్‌కు తగ్గ సినిమా వచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్‌ అప్‌కమింగ్‌ చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై పడింది. ఎవడే ‘సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.  ఆ భయం లేనట్లే! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లింప్స్‌ వీడియో విడుదల చేసి అందరి కన్ఫ్యూజన్ దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1761054691193225602 బడ్జెట్‌ ఎంతంటే? సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ప్రభాస్‌ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే హాట్ బాంబ్ దిశా పటానీ కూడా కల్కిలో కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.  కల్కీలో నాని, తారక్‌! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) పరశురాముడిగా, నాని (Nani) కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ఈ మధ్య వార్తలు జోరు అందుకున్నాయి. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా నటిస్తారని ఓ టాక్ ఉంది. ఇదే నిజమైతే ప్రభాస్‌ కల్కీ చిత్రంతో అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టార్‌ హీరోల పాత్రలపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది. 
  ఫిబ్రవరి 28 , 2024
  VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
  VD13: వరుసగా సమంత, శ్రీలీల, మృణాల్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. పెట్టి పుట్టాడు పో!
  ‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్‌ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.  సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.  సమంత మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.  ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.  సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.  శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.  ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.  మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.  బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.  గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్‌ అని కామెంట్ చేస్తున్నారు.  లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు. 
  జూన్ 14 , 2023
  Annusriya Tripathi: ఆ హీరోకు వీరాభిమానిని.. ‘రజాకార్‌’ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం!
  Annusriya Tripathi: ఆ హీరోకు వీరాభిమానిని.. ‘రజాకార్‌’ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం!
  తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా యంగ్‌ బ్యూటీ ‘అనుశ్రియా త్రిపాఠి’ (Annusriya Tripathi) మంచి గుర్తింపు పొందింది.  నిజాం భార్య అజ్మా ఉన్నీసా పాత్రలో నటించి ఆమె తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఆ పాత్రలో ఈ భామ అందం చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  యూపీలోని అయోధ్యలో 1999లో పుట్టిన ఈ భామ.. బెంగళూరు డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి పెంచుకుంది.  కాలేజీ పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్‌ కావాలని అనుశ్రియ తండ్రి సూచించారు. దీంతో మూడేళ్ల పాటు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయిన ఈ భామ.. నటి కావాలన్న కోరికతో ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కెరీర్‌ ప్రారంభంలో మెుదట మోడలింగ్‌గా అనుశ్రియా వర్క్‌ చేసింది. 2018లో చత్తీస్‌ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.  ‘రజాకార్‌’లో పాత్ర కోసం తానే స్వయంగా దర్శకుడు యాట సత్యనారాయణను సంప్రదించినట్లు అనుశ్రియా తెలిపింది. ఆడిషన్స్‌లో పాల్గొని యూనిట్‌ మెప్పించినట్లు పేర్కొంది. నిజాం భార్య పాత్ర గురించి తొలుత సవాల్‌గా అనిపించిందట. కథలో ఉన్న గ్లామర్‌ రోల్‌ తనదే కావడంతో వెంటనే ఓకే చెప్పేసిందట.  బలమైన కథా నేపథ్యం ఉన్న 'రజాకార్‌' చిత్రంతో తన సినీ కెరీర్‌ ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని అనుశ్రియా చెప్పింది. ఆ పాత్రతో తన కెరీర్‌ మెుదలై తన కల నెరవేర్చిందని పేర్కొంది.  ‘రజాకార్‌’ తనకో మంచి అవకాశమని అనుశ్రియా తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. సీనియర్‌ నటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు, యాక్టింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నట్లు పేర్కొంది.  ఇక ఇష్టమైన హీరోల విషయానికి వస్తే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో ‘రణ్‌బీర్‌ కపూర్‌’ (Ranbir Kapoor).. టాలీవుడ్‌లో ‘రామ్‌చరణ్‌’ (Ramcharan) అంటే చాలా ఇష్టమట. వారి నటనకు వీరాభిమానినని అనుశ్రియా తెలిపింది.  హీరోయిన్స్‌లలో ‘అనుష్క శెట్టి’ (Anushka Shetty), కీర్తి సురేష్‌ (keerthi Suresh) అంటే చాలా ఇష్టమట. మహానటిలో కీర్తి నటన చూసి తాను ఫిదా అయినట్లు అనుశ్రియా తెలిపింది.  మంచి కథయితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ భామ చెప్పింది. ఫేవరేట్‌ నటీనటులతో కలిసి పనిచేస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని పేర్కొంది. అటు ఈ బ్యూటీకి నగలు, చీరలతో ఫొటో షూటింగ్‌ అంటే మహా ఇష్టమట. ఆ ఫోటోలను ఇన్‌స్టాలోనూ ఎక్కువగా షేర్‌ చేస్తుంటుంది. గ్లామర్‌ ఫొటోలతోనూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
  మార్చి 18 , 2024
  Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
  Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
  టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.  2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.  https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.  4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.  5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.  6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.  7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.  8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.  9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.  10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు. 
  మే 09 , 2023
  Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
  Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు. గ్లింప్స్‌ చెప్పే సీక్రెట్స్ ఇవే! కాగా, ప్రాజెక్ట్‌ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు. https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20 అమితాబ్‌ పాత్ర నిడివి తక్కువేనా? ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్‌ బచ్చన్‌) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్‌) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.  https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20 ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా? ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు హీరోయిన్‌ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్‌ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్‌ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్‌ చేయాలని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భావిస్తున్నారు.  చీకటికి రారాజు అతడే? ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్‌ వీడియోతో ‌అది కన్‌ఫార్మ్‌ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్‌Kలో కమల్‌ హాసన్‌ నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్‌ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్‌ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్‌ హాసన్‌ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.  https://twitter.com/i/status/1672854637014138880 సూపర్ రెస్పాన్స్ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.  https://twitter.com/THR/status/1682126315229683715?s=20 విడుదల తేదీ? ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
  జూలై 21 , 2023
  Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
  Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
  ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే  వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్  బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్  ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.    మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.   అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.  విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.  పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ  అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
  ఏప్రిల్ 12 , 2023
  WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
  WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్‌ ప్యాక్‌డ్‌ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
  తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.  పాజిటివ్‌, నెగటివ్‌ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి. అరుంధతి కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్‌ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది. మహా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు. కర్తవ్యం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది. ధర్మ యోగి హీరోయిన్‌ త్రిషను విలన్‌ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం. శివగామి బాహుబలిలో ప్రభాస్‌ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్‌ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు. అత్తారింటికీ దారేది పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్‌ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఓసేయ్ రాములమ్మ ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్‌ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.  చంద్రముఖి చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
  మార్చి 07 , 2023
  Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
  Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
  తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’  పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన  జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన  శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.  బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
  సెప్టెంబర్ 06 , 2023
  మెహ్రీన్ పిర్జాదా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  మెహ్రీన్ పిర్జాదా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  మెహ్రీన్... 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Mehreen Pirzada)  ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. మెహ్రీన్ పిర్జాదా ఎప్పుడు పుట్టింది? 1995, జనవరి 5న జన్మించింది మెహ్రీన్ పిర్జాదా తొలి సినిమా? కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016) మెహ్రీన్ పిర్జాదా ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  మెహ్రీన్ పిర్జాదా ఎక్కడ పుట్టింది? బతిండా, పంజాబ్ మెహ్రీన్ పిర్జాదా ఏం చదివింది? డిగ్రీ మెహ్రీన్ పిర్జాదా అభిరుచులు? పుస్తకాలు చదవడం, మోడలింగ్ మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ఆహారం? చేపల వేపుడు, రాగి ముద్ద మెహ్రీన్ పిర్జాదాకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ప్రదేశం లండన్ మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరో? రణబీర్ కపూర్ మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరోయిన్? ఐశ్వర్య రాయ్ మెహ్రీన్ పిర్జాదా పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది మెహ్రీన్ పిర్జాదా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mehreenpirzadaa/?hl=en మెహ్రీన్ పిర్జాదా బాయ్ ఫ్రెండ్? హరియాణా ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి నిశ్చయమైనప్పటికీ... వ్యక్తిగత కారణాలతో వీరు విడిపోయారు. మెహ్రీన్ పిర్జాదా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మెహ్రీన్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. డవ్ ఇండియా, పియర్స్, థమ్స్అప్ యాడ్స్‌లో నటించింది. https://www.youtube.com/watch?v=5VD3YejRDhk
  ఏప్రిల్ 06 , 2024
  Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
  Tollywood Disaster Sequels: భారీ అంచనాలతో వచ్చి చతికలపడ్డ టాప్ 13 సీక్వెల్‌ చిత్రాలు ఇవే!
  గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్‌ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్‌ పార్ట్‌ ఆడియన్స్‌ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  మనీ మనీ మోర్‌ మనీ  జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్‌ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.  Money Money More Money Wallpapers శంకర్‌దాదా జిందాబాద్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ  చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్‌ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కిక్‌  2 రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ చిత్రాల్లో ‘కిక్‌’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్‌-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.  సర్దార్ గబ్బర్ సింగ్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్‌ డిజాస్టర్‌ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మన్మథుడు 2 అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.  గాయం 2 1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్‌ చిత్రానికి ప్రవీణ్‌ శ్రీ దర్శకత్వం వహించారు.  ఆర్య-2  అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్‌ మాత్రమే తెచ్చుకుంది.  చంద్రముఖి 2 & నాగవల్లి తెలుగులో వచ్చిన టాప్‌-5 హారర్‌ చిత్రాల్లో రజనీకాంత్‌ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్‌ చేశాడు.  రోబో 2 రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించాడు.  సత్య 2 రామ్‌గోపాల్‌ వర్మను బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించాడు.  వెన్నెల 1/2  రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'వెన్నెల 1/2' (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్‌ దర్శకత్వం వహించడం విశేషం. అవును 2 విభిన్నమైన హారర్‌ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2)  మాత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది.  మంత్ర 2 కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్‌ & సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్‌ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది. 
  ఫిబ్రవరి 22 , 2024
  Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
  Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్‌ తెలుసా?
  అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) డైరెక్షన్‌ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్‌ సైడ్‌ లవ్‌ అనే ఇంట్రస్టింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తొలి రోజు డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా థియేటర్లలో 125 రోజులకు పైగా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 2004 మే7న ఈ సినిమా రిలీజ్‌ కాగా, నేటితో సరిగ్గా 20 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన తెర వెనక రహాస్యాలపై ఓ లుక్కేద్దాం. దిల్‌ సక్సెస్‌తో సుకుమార్‌కు ఛాన్స్‌ నితీన్‌ హీరోగా చేసిన ‘దిల్‌’ చిత్రానికి డైరెక్టర్‌ సుకుమార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో నిర్మాత దిల్‌ రాజుకు సుకుమార్‌ ‘ఆర్య’ స్టోరీ వినిపించారు. ఇంప్రెస్‌ అయిన అతడు..  ‘దిల్‌’ సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా డైరెక్షన్‌ ఛాన్స్ ఇస్తా అని సుకుమార్‌కు మాటిచ్చారు. ఈ లోపు పూర్తి కథ సిద్ధం చేసుకో అని సూచించారు. ఆ తర్వాత రిలీజైన ‘దిల్‌’.. బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో సుకుమార్‌కు డైరెక్టర్‌ ఛాన్స్ వచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత ఆర్య సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ పడింది.  మిస్‌ చేసుకున్న అల్లరి నరేష్‌ ఆర్య చిత్రానికి తొలుత హీరోగా అల్లరి నరేష్‌ను సుకుమార్ అనుకున్నారట. అతడ్ని దృష్టిలో పెట్టుకొనే కథను కూడా రాశారట. అయితే కొన్ని కారణాల వల్ల కథ ఆయన వరకూ వెళ్లలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో నరేష్‌ స్వయంగా పంచుకున్నారు. ‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’ అని నరేశ్‌ అన్నారు.  https://twitter.com/i/status/1787548147520061468 బన్నీని అలా ఫైనల్‌ చేశారు! ఆర్య కథ సిద్ధమైన తర్వాత హీరోను ఎవరు పెట్టాలన్న సందేహం కొన్ని రోజుల పాటు దర్శక నిర్మాతలను వెంటాడిందట. హీరో కోసం వెతుకున్న క్రమంలోనే దిల్‌ మూవీ స్పెషల్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో బన్నీ కూడా వెళ్లాడు. అల్లుఅర్జున్‌ చలాకీ తనం, కామెడీ టైమింగ్‌ చూసి తన కథకు బన్నీ అయితేనే సరిగ్గా సరిపోతాడని దిల్‌ రాజుతో సుకుమార్‌ అన్నాడట. వెళ్లి అల్లు అర్జున్‌తో మాట్లాడరట. గంగోత్రి తర్వాత చాలా కథలు విని విసిగిపోయిన బన్నీ రొటీన్‌ స్టోరీ అనుకొని నో చెప్పారట. ఎట్టకేలకు విన్నాక కథ బన్నీకి బాగా నచ్చిందట. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌కు కూడా ఇంప్రెస్‌ కావడంతో సినిమా పట్టాలెక్కింది.  అసిస్టెంట్‌గా చేసిన స్టార్‌ డైరెక్టర్‌ కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి హిట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఆర్య మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాదు ఓ సీన్‌లోనూ ఆయన కనిపించాడు. ఇక ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ తొలుత కాస్త గందరగోళం నెలకొందట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీకి ఏ పేరు పెడితే బాగుంటుందా? అని దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్‌ రాజు తెగ ఆలోచించారట. ఈ క్రమంలో ‘నచికేత’ టైటిల్‌ పెడితే ఎలా ఉంటుదని చిత్ర యూనిట్‌ యోచించిందట. చివరకు బన్నీ పాత్ర పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారట.  https://twitter.com/i/status/1787674074585714980 120 రోజుల్లో షూటింగ్‌ పూర్తి ఆర్య చిత్ర షూటింగ్‌ను దర్శకుడు శరవేగంగా పూర్తి చేశాడు. 2003 నవంబరు 19న ఈ సినిమా లాంఛనంగా మెుదలవ్వగా.. 120 రోజుల్లోనే  పూర్తి చేశారు. అటు సుకుమార్‌ - దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో తొలిసారి వచ్చిన ఈ మూవీ ఆల్బమ్‌.. మ్యూజిక్‌ లవర్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా తెలుగు అక్షరాలమాలకు కొత్త అద్దం చెప్పే ‘అ అంటే అమలాపురం..’ పాట అప్పట్లో మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆటోలు, ట్రాక్టర్లు, ఫంక్షన్లు, ఈవెంట్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించేది.  ఆర్యతో వారికి స్టార్‌డమ్‌ ఆర్య సినిమా సక్సెస్‌.. డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌, నిర్మాత దిల్‌ రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, డీవోపీ రత్నవేలు జీవితాలను మార్చివేసింది. వారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. గంగోత్రి తర్వాత బన్నీ చేసిన రెండో చిత్రం ఆర్య. ఈ సినిమాలో బన్నీ స్టైల్‌, డ్యాన్స్‌, గ్రేస్‌, యాక్షన్‌ చూసి తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఆర్య వచ్చి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా హీరో బన్నీ ఎక్స్‌ వేదికగా ప్రత్యేక పోస్టును సైతం పెట్టాడు. 'నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అని బన్నీ పోస్టు పెట్టాడు.
  మే 07 , 2024
  Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
  Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
  ‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఫహాద్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్‌ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.  ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే! మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్‌.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్‌ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.  ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి? ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.  ADHD వ్యాధి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.  కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఫహాద్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ఫహాద్‌.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్‌' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్‌' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు. 
  మే 28 , 2024
  Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
  Bhagyashri Borse : టాలీవుడ్‌ రైజింగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
  సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ముగ్గురు స్టార్‌ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, విజయ్‌ దేవరకొండ ‘VD 12’, నాని - సుజీత్‌ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్‌ అయ్యింది. దీంతో టాలీవుడ్‌కు మరో కొత్త స్టార్‌ హీరోయిన్‌ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. భాగ్యశ్రీ బోర్సే ఎవరు? బాలీవుడ్‌కు చెందిన యువ నటి. భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర ఔరంగబాద్‌లో భాగ్యశ్రీ జన్మించింది. భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది? ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు.   భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు? తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.   భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.  భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత? 178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు) భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది? నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.  భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి? ఈ భామ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.  భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి? హిందూ భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌ను ఎలా ప్రారంభించింది? సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్‌ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.  భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్‌ అయ్యింది? క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్‌ వచ్చింది.  భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది? 2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'యారియన్‌ 2' ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు? రాజ్యలక్ష్మీ భాగ్యశ్రీ బోర్సే అప్‌కమింగ్‌ తెలుగు చిత్రాలు? ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘VD 12’, ‘Nani 32’ భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్‌ ఫుడ్‌? తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.  భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు? ఫేవరేట్‌ యాక్టర్స్‌ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్‌ చేయలేదు.  భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌ ఏది? https://www.instagram.com/bhagyashriiborse/?hl=en
  ఏప్రిల్ 12 , 2024
  SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
  SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో కొత్తగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్‌ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో మహేష్‌ నాల్గోసారి సినిమా చేయబోతున్నట్లు బజ్‌ వినిపిస్తోంది.  మహేష్‌ - గురూజీ కాంబోలో..! రాజమౌళితో సినిమా తర్వాత మహేష్‌ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తీయనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మహేష్‌ రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ (Guntur Karam)తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. SSMB 29 తర్వాత కూడా మహేష్‌ తిరిగి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘SSMB 30’ పేరుతో రానున్న ఈ చిత్రం.. భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందట. ‘గుంటూరు కారం’ షూటింగ్‌ టైమ్‌లోనే ఈ సినిమా కథ గురించి డిస్కషన్‌ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రూపొందటానికి చాలా సమయం పట్టనుంది.  త్రివిక్రమ్‌కు మాటిచ్చిన మహేష్‌! SSMB30 సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందనున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ సమయంలోనే మరోమారు కలిసి పనిచేద్దామని మహేష్ అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ అది నెరవేరలేదు. అయితే మహేష్‌ ప్రామిస్ చేసినా కూడా SSMB30 పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు. 
  మార్చి 27 , 2024

  @2021 KTree