UATelugu
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పార్వతీశం.. లక్షల్లో జీతం సంపాదిస్తుంటాడు. ఓ రోజు మార్కెట్‌లో కూరగాయలు అమ్మె మహాలక్ష్మీని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? పార్వతీశం ప్రేమను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది? మహాలక్ష్మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం నటింటిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా...read more
How was the movie?
తారాగణం
పార్వతీశం
ప్రణీక అన్విక
హర్ష వర్ధన్
ముక్కు అవినాష్
మహబూబ్ బాషా
కేదార్ శంకర్
హర శ్రీనివాస్
రష్మిత పంతగానిని
సిబ్బంది
విఎస్ ముఖేష్దర్శకుడు
అఖిలేష్ కలారునిర్మాత
విఎస్ ముఖేష్రచయిత
జో ఎన్మావ్సంగీతకారుడు
సురేంద్ర చిలుములసినిమాటోగ్రాఫర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Market Mahalakshmi Review: మంచి సందేశంతో వచ్చిన ‘మార్కెట్ మహాలక్ష్మీ’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
దర్శకత్వం : వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: విశ్వనాధ్ కూచనపల్లి
నిర్మాత: అఖిలేష్ కలారు
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం నటింటిన లేటెస్ట్ చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi). వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19) విడులైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పని చేసే కేదార్ శంకర్ కొడుకును (పార్వతీశం) కష్టపడి సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్ చేస్తాడు. లక్షల్లో జీతం వస్తున్న కుమారుడికి రూ.కోటి కట్నం ఇచ్చే యువతితో పెళ్లి చేసేందుకు యత్నిస్తాడు. అయితే పార్వతీశం మాత్రం మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? సాఫ్ట్‌వేర్ అయిన పార్వతీశం.. మహాలక్ష్మీనే ఎందుకు ప్రేమించాడు? కొడుకు ప్రేమ వ్యవహారం తెలిసి కేదార్ శంకర్ ఏం చేశాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో పార్వతీశం చక్కగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అటు మార్కెట్ మహాలక్ష్మీ పాత్రలో ప్రణికాన్విక ఒదిగిపోయింది. తొలి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. అటు పార్వతీశం ఫ్రెండ్ పాత్రలో ముక్కు అవినాష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తిలా మహబూబ్ బాషా నవ్వులు పూయించాడు. హీరోయిన్ సోదరుడిగా అతడు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. జయ, పద్మ, కేదార్ శంకర్, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటింటి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వీఎస్ ముఖేష్ కొత్త తరహా ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య లవ్ మెుదలైతే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో కథను నడిపించాడు. మహిళా సాధికారత ఎంత అవసరమో ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. అయితే మహాలక్ష్మీ ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడ మరింత కామెడీ పండించే అవకాశమున్నా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌ను బలమైన సన్నివేశాలతో నడిపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా
ఇక టెక్నికల్ అంశాల విషయానికి.. జో ఎన్మవ్ అందించిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. మార్కెట్‌లోని సన్నివేశాలు మాంటేజ్ షాట్లు సినిమాకు అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ నటనసందేశండైలాగ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ లవ్ ట్రాక్‌సాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
టెనెంట్
హాస్య నటుడు సత్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్' (Tenant). ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ.
శశివదనే
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ ప్రేమ కథ సాగనుంది.
పారిజాత పర్వం
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.
లవ్ మౌళి
అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు.
మార్కెట్ మహాలక్ష్మీ
కేరింత ఫేమ్ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్, మహబూబ్ భాషా, ముక్కు అవినాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది.
శరపంజరం
నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
మారణాయుధం
సీనియర్ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మారణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది.
లవ్ యూ శంకర్
దర్శకుడు రాజీవ్ ఎస్.రియా.. ‘మై ఫ్రెండ్ గణేశా’ యానిమేషన్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్ యూ శంకర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, తనీషా జంటగా నటించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
సైరెన్
జయం రవి (Jayam Ravi) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యపాత్రలు పోషించారు.
మై డియర్ దొంగ
ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు.. అనుకోని పరిస్థితుల్లో అక్కడే బందీగా చిక్కుకుపోతే ఏం జరిగింది? దొంగకు, యువతికి మధ్య ఏర్పడిన స్నేహం ఎలాంటి మలుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది.
కాటేరా
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
ఏప్రిల్ 15 , 2024
Summer Heroines 2024: వేసవి హీట్ మరింత పెంచేందుకు సిద్ధమవుతున్న అందాలు భామలు వీరే!
సమ్మర్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ లాంటిది. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్న, పెద్ద సినిమాలు సమ్మర్‌లో విడుదలయ్యేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో వినోదాలు పంచడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా అందులోని కథానాయకులు వేసవి హీట్‌ను తమ అందచందాలతో మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ భామలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి? అవి ఎప్పుడు విడుదలవుతాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.
మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మృణాల్ ఠాకూర్.. ఈ సమ్మర్‌లో సరికొత్త మూవీతో వస్తోంది. యంగ్ హీరో విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లో మరోమారు సందడి చేయబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
దివ్యాంశ కౌషిక్ (Divyansha Kaushik)
‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ద్వారా అలరించనున్న మరో నటి దివ్యాంశ కౌషిక్. ఇందులో ఈ భామ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. 2019లో వచ్చిన మజిలీ సినిమా ద్వారా దివ్యాంశ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ, పోలీసు వారి హెచ్చరిక, మైఖేల్ తదితర చిత్రాల్లో నటించింది.
అంజలి (Anjali)
ప్రముఖ హీరోయిన్ అంజలి కూడా ఈ వేసవిని మరింత హీటెక్కించేందుకు రెడీ అవుతోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషించారు.
స్వర్ణిమా సింగ్ (Swarnima Singh)
హర్షివ్ కార్తీక్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బహుముఖం' (Bahumukham). 'గుడ్, బ్యాడ్ యాక్టర్' అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో స్వర్ణిమా సింగ్ కథానాయికగా చేసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami)
మీనాక్షి గోస్వామి కథానాయికగా చేసిన లేటెస్ట్ చిత్రం 'భరతనాట్యం'. ఈ మూవీ ద్వారానే మీనాక్షి తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా ఓ యువకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందన్న కాన్సెప్ట్‌తో రూపొందింది.
ప్రనీకాన్వికా (Praneekaanvikaa)
ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న మరో చిన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మీ'. కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రణీకాన్వికా నటించింది. ఇదే ఆమెకు మెుదటి సినిమా. ఈ మూవీ విజయం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
కోమలి ప్రసాద్ (Komali Prasad)
యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ కూడా.. ఈ వేసవిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశివదనే’ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ‘నేను సీతాదేవి’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కోమలి.. ‘హిట్ 2’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. శశివదనే సినిమా విజయంపై ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ సినిమా సెక్సెస్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ భామ నటించిన రెండో చిత్రం 'లవ్ మి ఇఫ్ యు డేర్' కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నెల 25 నుంచి తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనుంది.
ఏప్రిల్ 03 , 2024
100cr CLUB: టాలీవుడ్‌లో ఇప్పటిదాకా రూ. 100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలివే!!
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాల హవా నడుస్తోంది. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే చెప్పాలి. సినిమాకు మార్కెట్ పెరగటంతో పాటు ప్రేక్షకులు కూడా అదేస్థాయిలో ఆదరిస్తున్న కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. టాలీవుడ్‌లో ఈ జాబితాలో సుమారు 40 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 100 కోట్ల క్లబ్‌లో టాప్‌లో ఉన్నాడు.రూ.100 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు, హీరోలు ఎవరో ఓ సారి చూద్దాం.
హీరో -సినిమాలు
హీరో సినిమాలుమహేశ్‌బాబు6అల్లు అర్జున్5ప్రభాస్4ఎన్టీఆర్ 4చిరంజీవి 3రామ్ చరణ్ 3పవన్ కల్యాణ్3బాలకృష్ణ 2
మహేశ్ బాబు
100 కోట్లకు పైన కలెక్ట్ చేయాలంటే మహేశ్ బాబుకు సాధ్యం. ఎందుకంటే ఆయన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సులభంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేశ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
సినిమా కలెక్షన్‌సరిలేరు నీకెవ్వరు 237 కోట్లుసర్కారు వారి పాట192 కోట్లుమహర్షి 184 కోట్లుభరత్ అనే నేను178 కోట్లుశ్రీమంతుడు 153 కోట్లుదూకుడు 101 కోట్లు
ప్రభాస్
ఎక్కువ సినిమాలు మహేశ్‌కు ఉండొచ్చు గానీ ఎక్కువ కలెక్షన్లు మాత్రం ప్రభాస్‌వే. బాహుబలి లాంటి సినిమాలను కొట్టే సినిమా రావాలంటే అది మళ్లీ ప్రభాస్ నుంచే రావాలి.
సినిమాకలెక్షన్‌బాహుబలి-21749 కోట్లుబాహుబలి-1600 కోట్లుసాహో 417 కోట్లురాధేశ్యామ్151 కోట్లు
చిరంజీవి
ఈతరం హీరోలతో పోటీ పడుతూ రూ.100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోవడం కేవలం మెగాస్టార్‌కే చెల్లింది. యంగ్ హీరోలను దాటి 3 సినిమాలు 100 కోట్లు వసూలు చేయడం బాస్ క్రేజ్‌కు నిదర్శనం
సినిమాకలెక్షన్‌సైరా నరసింహా రెడ్డి248 కోట్లువాల్తేరు వీరయ్య200 కోట్లుఖైదీ నం.150166 కోట్లు
అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ సినిమా కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్‌లో బాస్‌గా ఎదిగేందుకు అల్లు అర్జున్‌కు చక్కటి అవకాశముంది.
సినిమాకలెక్షన్‌పుష్ప-ది రైజ్369 కోట్లుఅల వైకుంఠపురములో274 కోట్లుసరైనోడు 120 కోట్లుడీజే 115 కోట్లురేసు గుర్రం 102 కోట్లు
రామ్ చరణ్
RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌చరణ్, అంతకు ముందే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్‌కు వచ్చిన క్రేజ్‌కు ఈ లిస్ట్‌లో తన సినిమాలు పెరుగుతాయడనడంలో సందేహం లేదు.
సినిమాకలెక్షన్RRR 1131కోట్లురంగస్థలం 213 కోట్లుమగధీర 125 కోట్లు
జూ. ఎన్టీఆర్
RRRతో రామ్ చరణ్‌కు ఎంత పేరొచ్చిందో అంతకు 10 రెట్లు ఎక్కువే పేరు సంపాదించాడు తారక్. తనకున్న వాక్ చాతుర్యంతో మరింత ఎక్కువ ఫ్యాన్‌బేస్ సొంతం చేసుకున్నాడు. 100 కోట్ల క్లబ్‌లో తారక్ కూడా మరింత దూసుకెళ్లబోతున్నాడు.
సినిమాకలెక్షన్RRR1131కోట్లుఅరవింద సమేత155 కోట్లుజై లవకుశ145 కోట్లుజనతా గ్యారేజ్126 కోట్లు
పవన్ కల్యాణ్
టాలివుడ్‌లో అరాచక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌కు ఈ క్లబ్‌లో 3 సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే తప్పకుండా కుర్ర హీరోలను దాటి ముందుకెళ్లే అవకాశముంది.
సినిమాకలెక్షన్‌భీమ్లా నాయక్ 161 కోట్లువకీల్ సాబ్138 కోట్లుఅత్తారింటికి దారేది 131 కోట్లు
బాలకృష్ణ
అఖండ సినిమాతో బాలయ్య ప్రభంజనం సృష్టించాడు. ఆ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఇటీవల విడుదలైన వీరసింహా రెడ్డి కూడా అదే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న NBK 108 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు.
సినిమాకలెక్షన్‌అఖండ 133 కోట్లువీరసింహా రెడ్డి109 కోట్లు
మరికొన్ని సినిమాలు
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2 రూ.100కోట్లు వసూలు చేసింది. కుటుంబ కథా చిత్రం కావటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రవితేజ ధమాకా, నాని దసరా చిత్రాలు ఈ క్లబ్‌లో ఉన్నాయి.
సినిమాహీరో కలెక్షన్F2 వెంకటేశ్-వరుణ్ తేజ్143 కోట్లుగీత గోవిందంవిజయ్ దేవరకొండ 130 కోట్లుదసరా నాని 110 కోట్లుధమాకా రవితేజ 108 కోట్లు
పాత రోజుల్లో సినిమా హిట్ లెక్కలు రోజుల్లో చూసేవారు. సిల్వర్ జుబ్లీ, గోల్డెన్ జుబ్లీ, 100 డేస్ ఫంక్షన్లు చేసేవారు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా పక్కా కమర్షియల్ అయిపోయింది. హిట్ లెక్కలు కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇక 100 కోట్ల క్లబ్ గురించి మాట్లాడటం మానేసి రూ.1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
https://telugu.yousay.tv/ott-movies-10-movies-to-watch-on-ott-with-friends.html
https://telugu.yousay.tv/movie-releases-movies-releasing-in-theaters-otts-this-week-april-28.html
ఏప్రిల్ 26 , 2023
Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సగం రీమేక్‌లే..
సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దిగజారిన స్థాయి?
తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది.
తేడాకొడుతున్న రీమేక్?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే
.
సక్సెస్ ఫార్ములా?
చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.
రీమేక్స్ వద్దు..
చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
ఆగస్టు 11 , 2023
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్‌షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్‌షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్‌షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్‌సిరీస్‌ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్‌షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5 (Pushpa 2 Release Date)న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా చిత్ర బృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించింది. వీటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇలా మూవీలో కీ రోల్ పోషించిన అందరూ హాజరయ్యారు. కానీ, ‘పుష్ప 2’లో విలన్‌గా చేసిన మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ మాత్రం ఒక్క ఈవెంట్‌కు హాజరుకాలేదు. మూవీ టీమ్‌పై ఫహాద్ చాలా కోపంగా ఉన్నాడని, అందుకే ఈవెంట్స్ రావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోమ్ టౌన్ ఈవెంట్‌లోనూ మిస్సింగ్!
అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా చేసిన ‘పుష్ప’ (Pushpa: Part 1) చిత్రం 2021లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీసు ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కనిపించాడు. అతడి నటన నెక్స్ట్ లెవల్లో ఉందంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. వాస్తవానికి అతడి పాత్ర నిడివి తొలి భాగంలో తక్కువే అయినా ‘పుష్ప 2’లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తాడని మేకర్స్ తెలిపారు. దీంతో ఫహాద్ ఏ స్థాయిలో మాయ చేస్తాడోనని అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో ఫహాద్ కనిపించకపోవడం ఓ పజిల్‌గా మారిపోయింది. స్వరాష్ట్రం కేరళలోని కొచ్చిలో జరిగిన ఈవెంట్‌కు సైతం అతడు దూరంగా ఉన్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Pre release Event)కు సైతం ఫహాద్ డుమ్మా కొట్టాడు. దీంతో మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఫహాద్ ఈవెంట్స్‌కు హాజరు కావట్లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి.
రెమ్యూనరేషన్ కారణమా?
రెమ్యూనరేషన్ విషయంలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే ఫహాద్ పాత్రకు సంబంధించి రెండు పార్ట్స్ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ‘పుష్ప’ రిలీజ్‌కు ముందు వరకు ఫహాద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీంతో అప్పటి డిమాండ్‌కు అనుగుణంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక రేటు ఫిక్స్ చేసింది. అయితే ‘పుష్ప’ తర్వాత ఫహాద్ మార్కెట్ భారీగా పెరిగింది. కమల్ హాసన్, రజనీకాంత్ స్టార్ హీరోలతో ‘విక్రమ్’, ‘వేట్టయాన్’ వంటి బ్లాక్ బాస్టర్స్ చేశాడు. ఇటీవల ‘ఆవేశం’తో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు. దీంతో ‘పుష్ప 2’ చిత్రానికి 2021లో ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ కాకుండా ఇప్పటి మార్కెట్‌ను బట్టి పారితోషికాన్ని ఫహాద్ కోరినట్లు సమాచారం. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారమే చెల్లిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తేల్చి చెప్పిందని కూడా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఓ వైపు అల్లు అర్జున్‌కు రూ.300 కోట్లు ఇచ్చి, తనకు మాత్రం తక్కువ ఇస్తున్నారన్న భావన ఫహాద్‌లో బలంగా పడిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ‘పుష్ప 2’ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నాడని అభిప్రాయపడుతున్నారు.
షూటింగ్స్ విషయంలోనూ..
ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) గత మూడేళ్లుగా చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘పుష్ప 2’ డేట్స్ ఇచ్చేశాడు. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ అనేక సార్లు వాయిదా పడటం కూడా ఫహాద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని అంటున్నారు. పదే పదే షూటింగ్ వాయిదా పడటం వల్ల ఫహాద్ ఇచ్చిన డేట్స్ పూర్తిగా నిర్విర్యం అయిపోయినట్లు సమాచారం. మళ్లీ కొత్త డేట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పడల్లా అప్పటికే ఒప్పుకున్న మరో చిత్రం డేట్స్ క్లాష్ అయ్యేవని టాక్. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వద్దకు ఫహాద్ తీసుకెళ్లినప్పటికీ పెద్దగా రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై బహిరంగంగానే సన్నిహితులతో చెప్పుకొని ఫహాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని ఫిల్మ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
‘పుష్ప వల్ల ఒరిగిందేం లేదు’
ఈ ఏడాది మేలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’పై ఫహాద్ ఫాజిల్ ఓపెన్ గానే తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పట్లో ఆ కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పుష్ప తర్వాత పాన్ ఇండియా యాక్టర్‌గా మారారని కాంప్లీమెంట్స్ వస్తున్నాయి.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా దానికి ఈ మలయాళ హీరో ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్‌కి గురి చేసింది. ‘పుష్ప సినిమా నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ విషయం సుకుమార్ సార్‌కి కూడా చెప్పాను. ఇందులో నేనేం దాచడం లేదు. అలా అని అబద్దం కూడా చెప్పట్లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. మలయాళం భాష తెలియని వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాకు ఆనందాన్ని కలిగించింది’ అని స్పష్టం చేశాడు. ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా సినిమా వల్ల తనకు ఎలాంటి లాభం చేకూరలేదని ఫహద్ ఫాజిల్ చెప్పడం అప్పట్లో ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరిచింది.
డిసెంబర్ 03 , 2024
Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?
ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
కంగువా కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంగువా' (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 14) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి కంగువాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.
‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే!
దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్రణవకోన, కపాల కోన, సాగర కోన, అరణ్యకోన, హిమ కోన అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఏ కోనతోనూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.
మట్కా ఓపెనింగ్స్ మరీ దారుణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూసి ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు కరుణ కుమార్ చాలా రొటీన్ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్ తేజ్ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఒక్క పాయింట్ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?
సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం.
కథ
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
సినిమా ఎలా ఉందంటే?
చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి.
భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికత
సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది. వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు.
బలాలు
బలమైన కథ
దుల్కర్ సల్మాన్ నటన
నేపథ్య సంగీతం, ట్విస్టులు
బలహీనతలు
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
చివరగా
‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం..
రూల్స్ రంజన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.
మామ మశ్చీంద్ర
వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
చిన్నా
సిద్ధార్థ్, అంజలీ నాయర్ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం 'చిత్త'. తెలుగులో 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మంత్ ఆఫ్ మధు
క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు.
800
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం '800'. మురళీ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7)
TitleCategoryLanguagePlatformRelease DateBeckham SeriesEnglishNetflixOct 04Race to the SummitMovieGermanNetflixOctober 04Everything Now SeriesEnglishNetflixOctober 05Sister Death MovieEnglish NetflixOctober 05Miss Shetty Mr. Polishetty MovieTelugu Movie NetflixOctober 05 Fair Play MovieEnglishNetflixOctober 06Insidious: The Red DoormovieEnglishNetflixOctober 06Strong Girl Nam SoonSerieskoreanNetflixOctober 07 Mumbai Diaries Season 2SeriesHindi Amazon PrimeOctober 06 Totally Killer MovieEnglishAmazon PrimeOctober 06Desperately Seeking Soulmate SeriesEnglish Amazon PrimeOctober 06Haunted Mansion Movie English HotstarOctober 04Loki: Season 2SeriesEnglishHotstarOctober 06Mr. Pregnant MovieTeluguAhaOctober 06The Great Indian SuicideMovieTeluguAhaOctober 06Nee Vente NenuMovieTeluguCine BazaarOctober 06Gadar 2MovieHindiZee5October 06The Nun 2 MovieEnglishBook My ShowOctober 03Gran Turismo MovieEnglishBook My ShowOctober 05Asteroid City MovieEnglish Book My ShowOctober 06
అక్టోబర్ 02 , 2023
Adipurush: ఆదిపురుష్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్… ప్రమాదంలో బాహుబలి-2, RRR రికార్డ్స్?
ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.
బాహుబలి 2
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించింది.
కేజీఎఫ్ 2
కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.
సాహో
బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రోబో 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
జూన్ 16 , 2023
iQOO Neo 8 Review: ఐక్యూ నుంచి మరో అధునాతన ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!
ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మే 23న iQoo Neo 8 అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే దీన్ని మెుదట చైనాలో తీసుకొస్తామన్న ఐక్యూ.. ఆ తర్వాత భారత్‌లోనూ లాంచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఐక్యూ ఫోన్లకు మార్కెట్‌లో మంచి బ్రాండ్ ఉండటంతో కొత్తగా రాబోయే స్మార్ట్‌ఫోన్‌పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో iQoo Neo 8 ప్రత్యేకతలు ఏంటీ? అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఏమున్నాయి? ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల స్కీన్‌తో రానుంది. దీనిని 1.5K AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేటుతో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ పనిచేస్తుంది.
ఫోన్ స్టోరేజ్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 16GB RAMతో తీసుకొస్తున్నారు. ర్యామ్ కేపాసిటీ అధికంగా ఉండటంతో ఈ ఫోన్ చాలా ఫాస్ట్‌గా పనిచేయనుంది. అలాగే ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. Micro SD కార్డుకు కూడా ఇది సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రొసెసర్ వర్క్ చేస్తుంది.
కెమెరా
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 50MPతో వస్తోంది. ఈ ఫోన్ అల్ట్రావైడ్, డెప్త్ సెన్సార్లతో బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్ వైపు 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. దీనితో క్వాలిటీ సెల్ఫీ కెమెరాలు, వీడియోలు తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరాకు ఫ్లాష్ లైట్‌ను కూడా జోడించారు.
బ్యాటరీ
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అధిక బ్యాటరీ సామర్థ్యం వల్ల ఫోన్ ఛార్జింగ్ లైఫ్ ఎక్కువగా ఉండనుంది.
5G సపోర్ట్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్‌ను 5Gతో తీసుకొస్తున్నారు. అలాగే డ్యూయల్ 4G VoltE, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్‌తో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ బరువుతో విడుదల చేయనున్నట్లు సమాచారం.
కలర్స్
iQoo నియో 8 స్మార్ట్‌ఫోన్ రెండు వర్షన్‌లలో తీసుకుస్తున్నారు. ఈ ఫోన్ iQoo నియో 8, iQoo నియో 8 proగా రానుంది. బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ధర ఎంతంటే?
iQOO Neo 8 ఫోన్ భారత్‌లో ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని రూ. 44,990కు విక్రయించవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మే 23న క్లారిటీ రానుంది.
మే 17 , 2023
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్ సేన్ మార్కెట్.. సత్యదేవ్, ఆశోక్ గల్లా పరిస్థితి మరీ దారుణం!
ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అయితే విష్వక్, సత్యదేవ్ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకోగా అశోక్ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.
‘మెకానిక్ రాకీ’ కలెక్షన్స్ ఎంతంటే
విష్వక్ సేన్ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో విష్వక్ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్ ఇచ్చారు. యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్ రాకీ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ డే 1 కలెక్షన్స్ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.
‘జిబ్రా’ కలెక్షన్స్ ఎంతంటే
సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి.
దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్ ఎంతంటే
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి.
నవంబర్ 23 , 2024
Predicted Box office Capacity: రాజమౌళి, ప్రభాస్, తారక్, బన్నీ.. బాక్సాఫీస్ బరిలో ఎవరి బలమెంత..?
టాలీవుడ్‌లో ఒకప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మాములూ విషయం కాదు. ఒక చిత్రం తన లైఫ్‌టైమ్‌లో రూ.100 కోట్లు క్రాస్ చేసిందంటే గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి దెబ్బకు టాలీవుడ్ ఖ్యాతీ గ్లోబల్ స్థాయికి చేరింది. మన హీరోలు తొలిరోజే ఈజీగా రూ.100 కోట్లు సాధిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సైతం దేవరతో తొలిరోజే ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. సాలిడ్ హిట్ పడితే ఈజీగా ఆ మార్కెట్‌ను అందుకోగలరు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రూ.1000 కోట్లకు పైగా మార్కెట్!
దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే గ్లోబల్ స్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే జాతీయస్థాయిలో బజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' (రూ.1,810 కోట్లు), 'RRR' (రూ.1,300 కోట్లు) చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో 'SSMB 29' చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం రూ.2000 కోట్లు కొల్లగొడుతుందని ఇప్పటినుంచే అంచనాలు ఉన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) డైరెక్టర్లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సృష్టించుకున్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని ప్రతీ ఒక్కరూ అంటుంటారు. అందుకు తగ్గట్లే ఆయన రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’, ‘రాజాసాబ్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి అంచనాలను అందుకుంటూ విజయం సాధిస్తే ఈజీగానే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి.
రూ.700-1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల వరకూ మార్కెట్ కలిగిన డైరెక్టర్లు, హీరోలు మెుత్తం ఐదుగురు ఉన్నారు. ముందుగా హీరోల విషయానికి వస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్ అందుకునే సత్తా ఉంది. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చిత్రంతో డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'పుష్ప 2'పై దేశవ్యాప్తంగా బజ్ ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ వస్తే ఈజీగానే రూ.700-1000 కోట్లు రావొచ్చు. మహేష్ తన తర్వాతి చిత్రం రాజమౌళితో చేయబోతున్నాడు. ఆ సినిమాతో మహేష్ ఈజీగా రూ.1000 కోట్ల మార్కెట్‌లో చేరిపోతాడు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి చిత్రం ప్రభాస్‌తో చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేయవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి ప్రాజెక్ట్స్ తారక్ (NTR31), ప్రభాస్ (Salaar 2)తో ఉండటంతో అతడ్ని కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు.
రూ. 500-700 కోట్ల మార్కెట్
ఈ మార్కెట్ రేంజ్‌లో టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ramcharan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సరైన హిట్ పడితే వారి చిత్రాలు ఈజీగానే రూ. 500-700 కోట్లు సాధిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఇప్పటికే దేవర సక్సెస్‌తో ఈజీగానే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రామ్‌చరణ్ కూడా డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ తరహాలోనే చరణ్ కూడా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఓజీపై ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్‌కు సరైన సక్సెస్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన్ను ఎవరు ఆపలేరని ఇప్పటికే ఇండస్ట్రీలో నిరూపితమైంది.
రూ.200-500 కోట్ల మార్కెట్
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఈ జాబితాలోకి తీసుకొని రావచ్చు. 69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ ఎంట్రీ తర్వాత చిరుకి సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఈజీగానే రూ.200-500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక బాలయ్య నటించిన గత మూడు చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK109’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. అతడితో బాలయ్య క్లాష్ వర్కౌట్ అయితే అలవోకగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన గత చిత్రం ‘గుంటూరు కారం’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ. 250 కోట్లు సాధించింది. అతడి నెక్స్ట్ ఫిల్మ్ అల్లు అర్జున్‌తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబో సక్సెస్ అయితే రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’ చిత్రంతో అమాంతం తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. దీంతో అతడి తర్వాత చిత్రాల మార్కెట్ రూ.200 పైనే ఉండనుంది.
సెప్టెంబర్ 28 , 2024
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్ డియో డైరెక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్' హీరోయిన్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘ప్రేమించి మోసం చేశావ్’
యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్ పెట్టారు. దీనికి మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్ - అడివి శేష్ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.
https://twitter.com/AdiviSesh/status/1868899040303431969
హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్!
డెకాయిట్ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్ తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్ పెయిర్ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424
డెకాయిట్ స్టోరీ ఇదే!
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్ చేయగా ఇందులో అడివి శేష్, శ్రుతి హాసన్ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
https://twitter.com/TrackTwood/status/1737423086188925221
అడివి శేష్ ఫిల్మ్ జర్నీ ఇదే..
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ 17 , 2024
Kavya Thapar Hot Navel: చీర పక్కకు జరిపి నాభి అందాలతో మతి పోగొడుతున్న కావ్యా థాపర్
గ్లామరస్ డాల్ కావ్యా థాపర్ మరో సారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తన హాట్ ఫొటో షూట్ షేర్ చేసి మతులు పోగొడుతోంది.
రెడ్ శారీలో నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతోంది. ఇంపైన ఎద ఎత్తులతో అట్రాక్ట్ చేస్తోంది.
బ్యాక్ స్లీవ్ లెస్ జాకెట్‌లో కావ్యా థాపర్ అందాలను అప్పనంగా ప్రదర్శించింది. ఆమె బ్యాక్ కర్వ్స్ హీట్ పెంచేలా ఉన్నాయి.
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు "లవ్లీ", "సో హాట్" లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్ చేస్తున్నాయి.
మతి పొగొట్టే ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక కావ్యా థాపర్ కెరీర్ టాలీవుడ్‌లో ఆశించినంతగా సాగడం లేదు. “అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని” అనే సామెత మాదిరి ఆమె కెరీర్ సాగుతోంది.
అవకాశాలు దండిగా వస్తున్నా.. సరైన హిట్ మాత్రం ఈ గ్లామర్ డాల్‌కు పడటం లేదు.
ఇటీవల కావ్య థాపర్ హీరోయిన్‌గా వచ్చిన 'విశ్వం' యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో అమ్మడి అందాల ఆరబోతను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అంతకుముందు డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోనూ కావ్య థాపర్ అందాల దాడి చేసింది. అందాల ప్రదర్శన మీదనే ఫొకస్ పెట్టింది.
గోపీచంద్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటన పరంగా కావ్యాకు పెద్దగా స్కోప్ లభించలేదు. కానీ, గ్లామర్ పరంగా ఆమె పెద్ద మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు.
తన అందచందాలతో మరోమారు యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా 'గుంగురు గుంగురు పార్టీ' అంటూ సాగే మాస్ సాంగ్‌లో కావ్యా దుమ్మురేపింది.
ఇటీవల వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌లోనూ కావ్యా థాపర్ గ్లామర్ పరంగా రెచ్చిపోయి నటించింది. రామ్‌కు పోటీగా చిందులేసి సాంగ్స్‌లో రచ్చ రచ్చ చేసింది.
మహారాష్ట్రకు చెందిన కావ్యా థాపర్ 2013లో వచ్చిన ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా నటన కెరీర్ ప్రారంభించింది.
2018లో తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ (Ee Maaya Peremito) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2019లో 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' (Market Raja MBBS) తమిళ చిత్రం చేసినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
2021లో యంగ్ హీరో సంతోష్ శోభన్ పక్కన ‘ఏక్ మినీ కథ’లో నటించి హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. అమృతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
2022లో 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సైషా ఒబరాయ్ పాత్రలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సినిమా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.
గతేడాది విజయ్ ఆంటోని సరసన 'బిచ్చగాడు 2'లో కావ్య నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కావ్యాకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాది రవితేజ సరసన ఈగిల్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కావ్యకు నిరాశే మిగిలింది.
ఆ తర్వాత వచ్చిన ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు హిట్ కాకపోవడంతో కావ్యా థాపర్ మళ్లీ ఢీలా పడిపోయింది.
తాజాగా వచ్చిన ‘విశ్వం’ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా పర్వాలేదనిపించడంతో కావ్యా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో సైతం కావ్యా నటించింది. క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) సిరీస్‌లలో ముఖ్య పాత్రలు పోషించింది.
తెలుగులో భాషలో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు కావ్య చెప్పింది. షూటింగ్ సమయంలో గోపిచంద్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు వివరించింది.
ఓవైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ఖాతా నుంచి ఏ ఫొటో వచ్చిన వెంటనే ట్రెండ్ చేస్తున్నారు.
నవంబర్ 18 , 2024
Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్ సాంగ్ (Pushpa 2 Item Song)ను సుకుమార్ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇటీవల సాంగ్ షూటింగ్ సెట్ నుంచి శ్రీలీల ఫొటోలు సైతం బయటకొచ్చాయి. ఇదిలాఉంటే శ్రీలీల పారితోషికంకు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. దీంతో ఆమెకు అన్యాయం జరిగిందన్న వాదనలు ఊపందుకున్నాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
సమంతతో పోలిస్తే అన్యాయం!
2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. ఇందుకు గాను సామ్ అప్పట్లోనే రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీలకు రూ.2 కోట్ల పారితోషికం ఇవ్వడంపై ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. శ్రీలీలకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సమంతకు ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీలకు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని ఫిల్మ్ వర్గాలు ఖండిస్తున్నాయి. శ్రీలీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మూడు గంటల సినిమా చేస్తే రూ.4-5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’లో 3 నిమిషాల పాటకే ఆమెకు రూ. 2 కోట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఆమెకు తన మార్కెట్ విలువ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ను అందిందని పేర్కొంటున్నారు.
శ్రీలీల.. బన్నీ ఛాయిస్!
పుష్ప 2 ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదని సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జునే శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
పాట్నాలో ట్రైలర్ రిలీజ్
దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు రీసెంట్‌గా ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఇందులో గన్ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1855922382181134676
నవంబర్ 13 , 2024
Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్ హీరో.. బిగ్ ఫైట్ తప్పదా?
ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు తమిళ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’తో బాక్సాఫీస్ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs Dhanush) అంటూ సవాలు విసురుతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ vs ధనుష్
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The Rajasaab). డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్‌లో తొలిసారి హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో ‘ది రాజాసాబ్’పై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రభాస్ (Prabhas vs Dhanush)ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ది రాజాసాబ్’ రిలీజ్ రోజునే తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఇడ్లీ కడై'ను (Idli Kadai) వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆ రోజునే ఎందుకంటే!
'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు) చిత్రానికి స్టార్ హీరో ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిత్యామీనన్ చేస్తోంది. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ పతకాలపై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, షాలినీ పాండేలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే బరిలో ప్రభాస్ సినిమా ఉన్నప్పటికీ ధనుష్ తన ‘ఇడ్లీ కడై’ చిత్రాన్ని రిలీజ్ చేయడం వెనక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. మన తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో తమిళ వాళ్లకు ఏప్రిల్‌లో వచ్చే న్యూ ఇయర్ కూడా అలాంటిదే. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళనాడులో న్యూ ఇయర్ జరుపుకుంటారు. పైగా దానికి లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతోంది. అందుకే ధనుష్ ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారు. మొత్తానికి 'ది రాజా సాబ్'తో పాటు ధనుష్ మూవీ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. మరి ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే.
https://twitter.com/dhanushkraja/status/1854758303399919813
అక్కడ ప్రభాస్‌కు ఎదురుదెబ్బ!
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)కు తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రభాస్‌తో పోలిస్తే మాత్రం కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా ధనుష్ కంటే చాలా పెద్దది. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ‘ది రాజాసాబ్’కు 'ఇడ్లీ కడై' నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. అయితే తమిళనాడులో మాత్రం ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ ధనుష్ పేరు చెబితే అభిమానులు ఊగిపోతుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ‘ది రాజాసాబ్’కు (Prabhas vs Dhanush) గట్టి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. తమిళనాడు కలెక్షన్స్‌లో భారీగా కోత పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అరడజను పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
నవంబర్ 09 , 2024
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.
‘హనుమాన్’గా తొలుత యష్
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
అక్టోబర్ 30 , 2024