UTelugu2h 5m
రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
సునీల్
రాఘవరావు కొడుకుసలోని అశ్వాని
అపర్ణనాగినీడు
రామినీడుసుప్రీత్
మల్లాసూరిప్రభాకర్
బైరెడ్డిబ్రహ్మాజీ
శ్రీకాంత్రైలులో SS కంచిసహ-ప్రయాణికుడు
అనుజ్ గుర్వారా
వ్యాపారవేత్త ఘనశ్యామ్దాస్సుబ్బరాయ శర్మ
రాము మామరావు రమేష్
బ్రోకర్శ్రీ సింహ
ఓబులేశుచత్రపతి శేఖర్
రాము తండ్రిసిబ్బంది
ఎస్ఎస్ రాజమౌళి
దర్శకుడుశోబు యార్లగడ్డ మరియు ప్రసాదం భాయ్ దేవినేని
నిర్మాతశోబు యార్లగడ్డనిర్మాత
ప్రసాద్ దేవినేనినిర్మాత
ఎంఎం కీరవాణి
సంగీతకారుడుకోటగిరి వెంకటేశ్వరరావు
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్ చంద్ర, కిషోర్ కుమార్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, మైమ్ గోపి, రూపలక్ష్మీ తదితరులు
రచన, దర్శకత్వం : కరుణ కుమార్
సంగీతం : జి. వి. ప్రకాష్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్
ఎడిటింగ్ : కార్తికేయ శ్రీనివాస్
నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల
విడుదల తేదీ: 14-11-2024
మెగా హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review)
కథేంటి
మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చిన రతన్ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
వాసు పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్ స్టైల్, వాకింగ్ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనితో పాటు నవీన్ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఒకప్పటి గ్యాంగ్ స్టార్ రతన్ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్ అయ్యింది. కెమెరామెన్ కిషోర్ కుమార్ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా పీరియాడిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్ డైరెక్టర్ జి. వి. ప్రకాష్ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటనయాక్షన్ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 14 , 2024
DEVARA: 23 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో.. మెుదలైన రోజే క్లోజ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం 'దేవర'. గత కొన్నెళ్లుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 27) గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అనిరుధ్ సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇకపై మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో 23 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న రాజమౌళి ఫ్లాప్ రికార్డును తారక్ బద్దలు కొట్టాడని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తనయుడే డిక్లేర్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్!
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటివరకూ వెంటనే హిట్ కొట్టిన సందర్భం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో డిజాస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచారు. ఇది 23 ఏళ్ల క్రితం వచ్చిన రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’ నుంచి కొనసాగుతూ వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ చిత్రాల తర్వాత తారక్ ఘోర పరాజయాలను చవి చూశాడు. అలాగే ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ, ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్, ‘ఈగ’ తర్వాత నాని ఫ్లాప్‌లు అందుకున్నవారే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్, రానా, అనుష్క కూడా తమ నెక్ట్స్ చిత్రాల్లో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్’ తర్వాత తారక్ నటించిన చిత్రం కావడంతో సహజంగానే ‘దేవర’పై అందరిలోనూ ఆందోళనలు రేకెత్తాయి.
23 ఏళ్ల రికార్డు బద్దలు
రాజమౌళి ఫ్లాప్ రికార్డు సెంటిమెంట్ మెుదలైందే తారక్‌తో అని అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2001లో రిలీజైన స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి ఈ ఫ్లాపుల పరంపర కొనసాగుతూ వస్తోంది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే రోజైన సెప్టెంబర్ 27న దేవర రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంటే ఈ ఫ్లాపుల సెంటిమెంట్ 23 ఏళ్ల కిందట ఏ హీరోతో మెుదలైందో, ఏ రోజు మెుదలైందో, మళ్లీ ఇన్నాళ్లకు అదే హీరోతో, అదే రోజుతో ముగిసిందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళికి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్‌ను తారక్ బద్దలు కొట్టాడని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ హీరో కూడా రాజమౌళి ప్లాపుల సెంటిమెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు పెడుతున్నారు.
కార్తికేయ స్పెషల్ పోస్టు
ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ట్వీట్ చేశాడు. ‘ఫైనల్‌గా 23 ఏళ్ల మిత్‌ను బ్రేక్ అయింది. అది కూడా ఏ వ్యక్తితో ఏ రోజు అయితే మొదలైందో మళ్లీ అదే రోజు అదే వ్యక్తితో బద్దలైంది. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఎంతో దగ్గరగా, ఆయన ఎదుగుదల, సక్సెస్‌ను చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలను చూస్తున్నాను. తెలుగు సినిమాకు ఆయన చేస్తున్న కృషిని చూస్తూ ఉన్నాను. నాకు అస్సలు మాటలు రావడం లేదు. ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది. దేవర ది బిగ్గెస్ట్ మాస్ సెలెబ్రేషన్స్ ఇన్ సినిమా. ఇక ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. ఆల్ హెయిల్ ది టైగర్’ అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
https://twitter.com/ssk1122/status/1839476779175567669
ఫ్యాన్స్‌తో దేవర చూసిన జక్కన్న
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ‘దేవర’ (Devara Release) సందడి కనిపిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ (NTR) నటించిన సోలో మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో సినిమాహాళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) వీక్షించారు. కుటుంబసభ్యులతో కలిసి బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌కు వచ్చిన జక్కన్న అక్కడి సినీప్రియులకు అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశారు. మరోవైపు, చెన్నైలోని ఓ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్. చిత్రంలోని ఫియర్ సాంగ్‌ను ఆలపించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
https://twitter.com/ArtistryBuzz/status/1839517947548794958
https://twitter.com/AnirudhTrend/status/1839516079560802450
సెప్టెంబర్ 27 , 2024
Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఇవే!
భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్ బాగుంటే మరో భాషలోకి రిమేక్ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana)
టాలీవుడ్‌లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
ఒక్కడు (Okkadu)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. కన్నడలో 'అజయ్' పేరుతో పునీత్ రాజ్‌కుమార్ (Punit Raj Kumar) నటించాడు.
మర్యాద రామన్న (Maryada Ramanna)
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.
వర్షం (Varsham)
ప్రభాస్ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'వర్షం'. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్’ (2004), తమిళంలో ‘మజాయ్’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది.
పోకిరి (Pokiri)
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో వచ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాషల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్' (2009), కన్నడలో దర్శన్ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.
డార్లింగ్ (Darling)
ప్రభాస్ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్ హీరోగా 'బుల్‌బుల్', హిందీలో 'సబ్సే బధాకర్ హమ్' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
విక్రమార్కుడు (Vikramarkudu)
రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్’ (2012), బంగ్లాదేశ్ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్', ఒడియాలో 'బిశ్వంత్' పేర్లతో రిలీజ్ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు.
ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే
వెంకటేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది. తమిళం, బెంగాలీ, భోజ్‌పురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది.
మార్చి 23 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్లోబల్ స్థాయి
అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి.
మహేష్‌కు లాభమా నష్టమా?
ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు? ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది.
ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
మహేష్ బాబు కూడా అదే పరిస్థితా?
దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వరల్డ్ వైడ్ బజ్
మరోవైపు మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
ఫిబ్రవరి 14 , 2024
Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ ఆసిస్టెంట్ డైరెక్టర్లు:
శ్రీకాంత్ ఓదెల(srikanth odela)
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు. శ్రీకాంత్ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్ చెప్పారంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అర్థమవుతోంది.
https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html
https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20
బుచ్చిబాబు(Buchi Babu Sana)
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తారని స్వయంగా చరణ్ చెప్పే స్థాయికి ఎదిగాడు.
పల్నాటి సూర్యప్రతాప్(Palnati surya pratap)
సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంటగా ‘18 పేజెస్’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.
రాజమౌళి ఆసిస్టెంట్ డైరెక్టర్లు: (Rajamouli assistant directors)
G.R కృష్ణ( GR KRISHNA )
టాలీవుడ్ డైరెక్టర్ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు.
కరుణ కుమార్ ( KARUNA KUMAR)
మరో టాలీవుడ్ డైరెక్టర్ కరుణ కుమార్ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.
అశ్విన్ గంగరాజు (ASHWIN GANGA RAJU)
డైరెక్టర్ అశ్విన్ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..!
రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది.
రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఏప్రిల్ 06 , 2023
ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్ సూపర్… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్ వచ్చినట్లేనా?
నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు.
డైరెక్టర్: ఓం రౌత్
నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్.
మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర
ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.
అదే కథ..
రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్ డిజైన్ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు.
ఎవరెలా చేశారు?
రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.
టెక్నికల్‌గా
రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
పోరాట సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
గ్రాఫిక్స్
సాగతీత సన్నివేశాలు
ఎడిటింగ్
చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు.
రేటింగ్: 2.75/5
జూన్ 16 , 2023
Aay Movie Review: ఎన్టీఆర్ బావమరిది ఖాతాలో మరో హిట్ పడినట్లేనా?
నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు
దర్శకుడు: అంజి కె మణిపుత్ర
సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి
నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్’ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అమలాపురంకు చెందిన కార్తీక్ (నార్నే నితిన్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కార్తీక్ పాత్రలో నార్నే నితిన్ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అతనిలో పరిణతి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చమైన గోదావరి అమ్మాయిగా తెరపై సందడి చేసింది. ఫ్రెండ్స్ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా కసిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. అయితే రొటీన్ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్ చేయడం, లాజిక్ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకామెడీక్లైమాక్స్
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందేలా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 16 , 2024
Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్ ఎలా ఉందంటే?
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, ప్రణీత్ రెడ్డి కల్లెం, ఫిష్ వెంకట్, రాజ్ తిరణ్‌దాస్, శ్రీరామ్ రెడ్డి తదితరులు..
దర్శకత్వం : మల్లిక్ రామ్
సంగీతం: రామ్ మిర్యాల, శ్రీచరణ్ పరకాల, ఎస్.ఎస్ థమన్,
సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ : 29-03-2024
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). బ్లాక్ బాస్టర్ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్, ప్రమోషన్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.
ఎవరెలా చేశారు
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు.
డైరెక్షన్ ఉందంటే
డైరెక్టర్ మల్లిక్ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్’ను కూడా ఫన్ & ఎంటర్‌టైన్‌మెంట్ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్ వెర్షన్ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అయితే కామెడీ, డైలాగ్స్ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్ విషయంలో మల్లిక్ రామ్ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్, కామెడీ పరంగా చూస్తే మల్లిక్ రామ్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు.
ప్లస్ పాయింట్స్
సిద్ధు జొన్నలగడ్డ నటనకామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీఆకట్టుకోని ట్విస్టులు
Telugu.yousay.tv Rating : 3.5/5
https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
మార్చి 29 , 2024
69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
నాని.. డబుల్ ధమాకా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్ నాన్న) నాని నామినేట్ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్ కేసరి), ధనుష్ (సర్), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఆనంద్ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.
బేబీ చిత్రం హవా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (సాయి రాజేష్), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్ రోహిత్) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164
ఫిల్మ్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే...
ఉత్తమ చిత్రం
బేబీబలగందసరాహాయ్ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టిసామజవరగమనసలార్: పార్ట్-1 సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్ కేసరి)చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)ధనుష్ (సర్)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)నవీన్ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)కీర్తిసురేశ్ (దసరా)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ దర్శకుడు:
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)కార్తిక్ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)సాయి రాజేశ్ (బేబీ)శౌర్యువ్ (హాయ్ నాన్న)శ్రీకాంత్ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం)
ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్ కేసరి)శ్రియారెడ్డి (సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్)శ్వేతరెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి -హాయ్ నాన్న)శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు -సర్)
ఉత్తమ గాయకుడు:
అనురాగ్ కుల్‌కర్ణి (సమయ-హాయ్ నాన్న)హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి -టైటిల్ సాంగ్)పీవీఎన్‌ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్ శ్రీరామ్ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:
బేబీ (విజయ్ బుల్గానిన్)బలగం (భీమ్స్ సిసిరిలియో)దసరా (సంతోష్ నారాయణ్)హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్)ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్)వాల్తేర్ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ -హాయ్ నాన్న)అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్)
జూలై 17 , 2024
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Adipurush Trailer Review: ఆ తప్పు మళ్లీ చేయలేదు.. నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రూతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదల చేసిన టీజర్‌పై ఎన్నో వివాదాలు చెలరేగగా వాటిని సరిచేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైలర్ ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
ట్రైలర్ యాంగిల్
ఆదిపురుష్ ట్రైలర్‌ను రామ భక్తుడు అంజనేయుడి యాంగిల్‌లో చూపించారు. “రఘు రాముడు మనషిగా పుట్టిన భగవంతుడు. ఆయన జీవితం ధర్మానికి.. సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుని గాథ. యుగయగాలకు సజీవం.. నా రాఘవుని కథే రామాయణం అంటూ వాయిస్ ఓవర్ ద్వారా సినిమా కథా సారాంశాన్ని చెప్పారు.
https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc
ట్రైలర్‌లో ఏముంది?
ట్రైలర్‌లో రావణుడు సీతమ్మతల్లిని అపహహించడానికి వెళ్లడం, జటాయువు రక్షించేందుకు రావడం. వానర సైన్యాన్ని ఏకం చేసి లంకపై యుద్ధం ప్రకటించడం వంటివి చూపారు. లంకపై యుద్ధం ప్రకటించి రావణాసురిడిని వధించి సీతమ్మ తల్లిని కాపాడటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
శ్రీరాముడిగా (ప్రభాస్) సంభాషణలు ఆకట్టుకున్నాయి. లంకలో ఉన్న సీత మాతను తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని చాటింది. ట్రైలర్‌ను చూస్తుంటే ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం మొత్తం కాకుండా సీతాపహరణం వర్గం వరకే పరిమితం చేశారని తెలుస్తోంది.
నేటి జనరేషన్‌కు తగ్గట్టుగా
ట్రైలర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ నేటి జనరేషన్‌కు అర్థమయ్యే రీతిలో సరికొత్తగా తెరకెక్కించారు. ఆధుకతలో రామాయణ కథను భాగం చేస్తూ విజువల్స్ గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు.
హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ను కలబోసి నేటి తరం దృష్టి కోణంలో కథ నడిచినట్లు తెలుస్తోంది.
బలహీనతలు:
ట్రైలర్‌లో వచ్చిన కొన్ని సీన్లు బాహుబలి సినిమాను గుర్తు చేశాయి. వానరసేనకు శ్రీరాముడు(ప్రభాస్) ధైర్యం చెప్పే సీన్ బాహుబలి సీన్‌ను గుర్తు చేస్తుంది.
తెలుగు ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ కొంచెం అర్థం కావు. బహుశా హిందీ మాతృకలో సినిమా తీయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది.
డైలాగ్స్ తెలుగు నెటివిటికి తగ్గట్టుగా వస్తే బాగుండేది. సినిమాలో ఆ ప్రయత్నం జరిగి ఉండొచ్చు.
ఫైనల్‌గా
భరత జాతి ఎంతగానో ఆరాధించే రామాయాణం ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరికెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కానుంది. మొత్తంగా గతంలో టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. మొత్తంగా కొత్త ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు చిత్ర యూనిట్.
మే 09 , 2023
Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరు, బన్నీ, తారక్, మహేష్ స్ట్రాంగ్ కౌంటర్!
వెనక్కి తగ్గిన కొండా సురేఖ
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కూడా కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమంటూ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన స్వశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఎంతో ఆదర్శమని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.
కోర్టుకు వెళ్లిన నాగార్జున
తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) న్యాయస్థానం తలుపుతట్టాడు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.
అసలేం జరిగిందంటే?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను వివాదంలోకి లాగారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్ పార్టీలు చేయడంతో పాటు సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. అంతటితో ఆగకుండా నాగ చైతన్య - సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు సమంతను నాగార్జున ఫోర్స్ చేయగా ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో మాట వింటే విను.. లేదంటే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారని మంత్రి సురేఖ అన్నారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపడంతో నాగార్జున, అమలతో పాటు ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
https://twitter.com/i/status/1841433938297807337
https://twitter.com/FierceZen82/status/1841698670783189472
మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొండి: నాగార్జున
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా నాగార్జున పోస్టు పెట్టాడు.
https://twitter.com/iamnagarjuna/status/1841446247242035233
యాక్టర్ల జీవితాలను హైడ్‌లైన్స్ కోసం వాడొద్దు: నాగ చైతన్య
మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు ఆమోదనీయం కాదని నటుడు నాగచైతన్య వ్యాఖ్యానించారు. ‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య (Naga Chaitanya) పేర్కొన్నారు.
https://twitter.com/chay_akkineni/status/1841529895031050723
నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు: సమంత
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల (Konda Surekha Comments)పై సమంత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను (Samantha) వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని సామ్ పేర్కొంది.
ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు : చిరంజీవి
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
https://twitter.com/KChiruTweets/status/1841684462767313169
చౌకబారు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేష్ బాబు
నటుడు మహేష్ బాబు సైతం ఎక్స్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. 'మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకూ వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే సినీరంగాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి’ అని మహేష్‌బాబు పేర్కొన్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1841752300517290457
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: తారక్
వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని జూ. ఎన్టీఆర్ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని రాసుకొచ్చారు.
https://twitter.com/tarak9999/status/1841571689982730392
అసహ్యం వేస్తోంది: నాని
యంగ్ హీరో నాని కూడా మంత్రి కొండ సురేఖకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’ అని ఎక్స్‌లో నాని పోస్టు పెట్టారు.
https://twitter.com/NameisNani/status/1841541476083499197
రాజకీయ లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు: వెంకటేష్
సీనియర్ నటుడు వెంకటేష్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
https://twitter.com/VenkyMama/status/1841696634889240644
ఈ ప్రవర్తన చాలా అగౌరవం: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
https://twitter.com/alluarjun/status/1841692652388970952
అక్టోబర్ 03 , 2024
Pedda Kapu 1 Review: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, నాగ బాబు, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్
డైరెక్టర్: శ్రీకాంత్ అడ్దాల
సంగీతం: మిక్కీ జే. మేయర్
సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు
నిర్మాత: మిర్యాల రమేష్, మిర్యాల సత్యనారాయణ
క్లాస్ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం.
కథ:
1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిందంటే?
ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఎవరేలా చేశారంటే
పెదకాపు పాత్ర చేసిన విరాట్ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్ ప్రగతి పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లేవిరాట్, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్పాటలు
రేటింగ్ : 3/5
సెప్టెంబర్ 29 , 2023
Shruti Marathe: ‘దేవర’లో తారక్ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.
దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్ మీరాస్ కాలేజీ (St. Mira's College)లో ఆమె చదువుకుంది.
కెరీర్ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.
అలా మరాఠీ సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.
2008లో వచ్చిన 'సనాయ్ చౌగదే' (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.
ఆ తర్వాత 'ఇందిరా విఝా' (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.
2016లో వచ్చిన బుధియా సింగ్ - బొర్న్ టూ రన్' (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడాది 'వెడ్డింగ్ యానివర్సరీ'తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది.
'బార్డ్ ఆఫ్ బ్లడ్' (Bard Of Blood) వెబ్‌సిరీస్‌లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్‌లో 'దేవర'నే మెుదటి సినిమా.
శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘట్నేకర్ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.
విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేస్తుందట.
ఈ సోషల్ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది.
మార్చి 27 , 2024
NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్!
టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ చిత్రం 'అఖండ 2' కాదా?
బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్ సంగీతం అందింబోతున్నారు.
ఏపీ ఎన్నికల తర్వాతే షూట్!
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.
నాని డైరెక్టర్‌తో సినిమా!
ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
మార్చి 14 , 2024
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్ కంటే ఇంకా బెటర్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
డైలాగ్
ఓ సీన్‌లో హీరోయిన్ లిల్లీ జోసేఫ్ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది
లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్
టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా?
లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్
టిల్లు : చర్చి ఫాదరా?
https://twitter.com/i/status/1774726359111307728
డైలాగ్
లిల్లీ ఫాదర్: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?
టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు
డైలాగ్
టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
https://twitter.com/i/status/1774992506087944622
డైలాగ్
ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
https://twitter.com/i/status/1773542640488784015
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
https://twitter.com/i/status/1773655054655856994
డైలాగ్
సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.
లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ
అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
టిల్లు: పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం
https://twitter.com/i/status/1772913769770803358
డైలాగ్
లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
టిల్లు: నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని
https://twitter.com/i/status/1774319933129916896
డైలాగ్
లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్ సూపర్‌గా అనిపిస్తుంది.
టిల్లు: ఫ్రెండ్స్ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్ ఏ నల్లమల్ల ఫారెస్ట్.. విత్ నల్ల చీర.. ఫిల్మ్ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్ మాల్కాజ్ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్, హార్ట్ బ్రేక్, హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ జానర్‌లో వచ్చింది.
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8
డైలాగ్: బర్త్ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో..
టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్ జోకర్ అంటారు'
https://www.youtube.com/watch?v=sARNpvr4IoE
పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ...
టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు..
అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..!
టిల్లు: అచ్చా షాప్ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ..
పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు..
పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో..
టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని.
మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం
పిన్ని: నీకోసమేరా పిచ్చోడా..
టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను.
పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..
టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..
టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో..
టిల్లు: డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు.
వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు...
టిల్లు: ఉన్నడా భాయ్ ఫ్రెండ్..
లిల్లీ: నీకెందుకు..?
టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా...
లిల్లీ: లేదంటే..
టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..
లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..
టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..
మందు గురించి మాట్లాడే టైంలో..
టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా..
కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో
టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు..
లిల్లీ: స్మైలింగ్..
టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా..
లిల్లీ: లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా?
టిల్లు: నాదా...? నా హార్ట్ చాలా వీకూ..
** రొమాంటిక్ మ్యూజిక్…**
టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా..
లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్ ఏంటో తెలిసిననాడు మాట్లాడు.
టిల్లు: నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా..
లిల్లీ: Do You Know the best part Of Kiss
టిల్లు: Kiss
లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..
పబ్‌లో టిల్లుతో లిల్లీ
లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food
'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది.
లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్
షానన్: ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..!
క్లైమాక్స్‌లో లాస్ట్ డైలాగ్
లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్?
టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది.
https://twitter.com/i/status/1773940395300544591
ఏప్రిల్ 02 , 2024