రివ్యూస్
How was the movie?
తారాగణం
చిరంజీవి
విక్రమ్ మరియు దత్తాత్రేయరమ్య కృష్ణన్
దత్తాత్రేయ గర్ల్ ఫ్రెండ్ (వాయిస్ ఓవర్ రోజా రమణి)నగ్మా
విక్రమ్ ప్రేమికుడు (వాయిస్ ఓవర్ రోజా రమణి)రోజా సెల్వమణి
పృథ్వీ భార్య (వాయిస్ ఓవర్ రోజా రమణి)రంగనాథ్
పృధ్వీ తండ్రిశరత్ సక్సేనా
బెనర్జీసలీం గౌస్
కోట శ్రీనివాసరావు
బ్రహ్మానందం
సర్వ మంగళంపొన్నంబలం
కాంత రావు
దత్తాత్రేయ తండ్రిసుధాకర్
సిబ్బంది
కె. రాఘవేంద్రరావు
దర్శకుడునాగేంద్ర బాబు
నిర్మాతపవన్ కళ్యాణ్
నిర్మాతవిద్యాసాగర్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా..
1. నకిలీ మనిషి (1980)
చిరంజీవి తొలిసారి 'నకిలీ మనిషి' చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు.
2. బిల్లా రంగా (1982)
ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
3. రోషగాడు (1983)
చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్ స్మిత నటించారు.
4. సింహపురి సింహం (1983)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.
5. జ్వాల(1985)
రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు.
6. రక్త సింధూరం (1985)
రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు.
7. దొంగమొగుడు (1987)
ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు.
8. యముడికి మొగుడు (1988)
రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో మెప్పించారు.
9.రౌడీ అల్లుడు (1991)
కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.
10. ముగ్గురు మొనగాళ్లు (1994)
ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి... పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
11. రిక్షావోడు (1995)
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు.
12. స్నేహం కోసం (1999)
కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది.
13. అందరివాడు (2005)
చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
14. ఖైదీ నంబర్ 150 (2017)
ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు.
మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.
నవంబర్ 10 , 2023
HBD Chiranjeevi: మెగాస్టార్ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు
విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
రోల్స్ రాయిస్ ఫాంటమ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
టయోటా ల్యాండ్ క్రూయిజర్
చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.
రేంజ్ రోవర్ వోగ్
ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.
2. విలాసవంతమైన ఇల్లు
హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన & విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు.
3. ప్రైవేటు జెట్
చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
4. రియల్ ఎస్టేట్
మెగాస్టార్ చిరంజీవి రియల్ ఎస్టేట్ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
5. అంజనా ప్రొడక్షన్స్
1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్’ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్ నుంచే వచ్చాయి.
6. కేరళ బ్లాస్టర్స్
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్ టెండూల్కర్ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ సైతం ఈ ఫుట్‌బాల్ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.
7. చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్
1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను మెగాస్టార్ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్ & ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
8. చిరంజీవి నెట్‌వర్త్
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.
ఆగస్టు 22 , 2023
కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ స్టోరీ లైన్ ఇదే! సిక్రెట్ ఆపరేషన్‌లో ముగ్గురు…
]అమిగోస్ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.విడుదల
ఫిబ్రవరి 13 , 2023
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు మరో క్రేజీ ఆఫర్.. డెబ్యూ లేకుండానే ముగ్గురు స్టార్ హీరోలతో!
దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రాని పేరు ప్రఖ్యాతలు.. కొందరికి రాత్రికి రాత్రే వచ్చేస్తుంటాయి. ఒక్క బ్లాక్ బాస్టర్‌తో స్టార్లుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా హీరోల్లో ఇలాంటి పరిస్థితి కనిపించేంది. కానీ, ప్రస్తుతం ఈ ట్రెండ్ హీరోయిన్ల వైపు మళ్లింది. ఒక్క సక్సెస్‌తో హీరోల కంటే హీరోయిన్లే ఔట్‌స్టాండింగ్ ఫేమ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందుకు విరుద్దం. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్ కానప్పటికీ ఆమె టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రవితేజ, విజయ్‌దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమాకు ఓకే చెప్పింది.
దుల్కర్ సల్మాన్‌కు జోడీగా..
భాగ్యశ్రీ బోర్సే పేరు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. గతంలో దర్శకుడు పరుశురామ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రవి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇందులో నటించేందుకు భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో భాగ్యశ్రీ క్రేజ్ టాలీవుడ్‌లో మామూల్గా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భాగ్యశ్రీ ప్రాజెక్ట్స్
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే తెలుగులో రెండు స్టార్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో తొలిసారి టాలీవుడ్ ఆఫర్‌ను భాగ్యశ్రీ బోర్సే దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - గౌతం తిన్ననూరి (Gowtam Tinnanuri) కాంబోలో వస్తోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగ్యశ్రీ పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే నాని - భాగ్యశ్రీ కాంబోపై అధికారిక ప్రకటన సైతం రానుంది. ఇలా డెబ్యూ రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..
భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ.. సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
జూన్ 11 , 2024
Doppelganger: అమిగోస్ సినిమా మాదిరి తెలుగులో వచ్చిన 5 డోపుల్ గ్యాంగర్ చిత్రాలు
]ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తుల కలయిక ఎన్ని విధ్వంసాలను సృష్టించిందో చూపించడమే అమిగోస్ కథ అని తెలుస్తోంది.
ఫిబ్రవరి 11 , 2023
NBK 109 vs Devara: బాక్సాఫీస్ బరిలో బాలయ్య, తారక్, రవితేజ .. ఎవరిది పైచేయి?
టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.
బాలయ్య vs రవితేజ
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్ త్వరగా షూట్ చేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్ శంకర్ ఫుల్ ఫోకస్ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.
గతంలో బాలయ్యదే పైచేయి
బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేవర నుంచి గట్టిపోటీ తప్పదా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని కొరటాల టీమ్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్ చూసేయండి.
https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
జూన్ 13 , 2024
Bhagyashri Borse : టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండ ‘VD 12’, నాని - సుజీత్ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్ అయ్యింది. దీంతో టాలీవుడ్‌కు మరో కొత్త స్టార్ హీరోయిన్ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భాగ్యశ్రీ బోర్సే ఎవరు?
బాలీవుడ్‌కు చెందిన యువ నటి.
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర ఔరంగబాద్‌లో భాగ్యశ్రీ జన్మించింది.
భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది?
ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు?
తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.
భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత?
178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు)
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది?
నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.
భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి?
ఈ భామ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.
భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి?
హిందూ
భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌ను ఎలా ప్రారంభించింది?
సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.
భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్ అయ్యింది?
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్ వచ్చింది.
భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది?
2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'యారియన్ 2' ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది.
భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు?
రాజ్యలక్ష్మీ
భాగ్యశ్రీ బోర్సే అప్‌కమింగ్ తెలుగు చిత్రాలు?
‘మిస్టర్ బచ్చన్’, ‘VD 12’, ‘Nani 32’
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ ఫుడ్?
తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు?
ఫేవరేట్ యాక్టర్స్ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్ చేయలేదు.
భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్ ఏది?
https://www.instagram.com/bhagyashriiborse/?hl=en
ఏప్రిల్ 12 , 2024
HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిరులో కసి పెంచిన ఘటన
ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్, మేకప్‌మ్యాన్ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు.
చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి
1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు.
చిరు మెస్మైరైజింగ్ డ్యాన్స్‌కు కారణం ఇదే!
కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట. సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.
రివ్యూవర్ నుంచి పద్మ విభూషణ్ స్థాయికి..
మెగాస్టార్ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్ స్టోరీస్ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.
కుర్ర హీరోలకు అండగా..
కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు.
కళామతల్లి ముద్దు బిడ్డగా..
ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా.
సేవా కార్యక్రమాల్లో ముందజ..
సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
ఆగస్టు 22 , 2024
Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.
https://twitter.com/i/status/1772544977396220385
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
స్టార్ నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.
హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.
View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.
యంగ్ హీరోయిన్ మెహరీన్ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
నటి మాళవిక మోహనన్ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
నటి రాయ్ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.
ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.
హోలీని బాగా సెలబ్రేట్ చేసుకున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ శివాలిక ఒబెరాయ్ ఉంది.
యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.
మెగా డాటర్స్ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
బాలీవుడ్ భామ అవనీత్ కౌర్.. హోలీ రోజున సోషల్ మీడియాలో తళుక్కుమంది.
ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.
పాపులర్ హీరోయిన్ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.
హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.
View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
మార్చి 26 , 2024
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు
నందమూరి బాలకృష్ణ ఎవరు?
బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం.
నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు?
చెన్నై
నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 జూన్ 10
నందమూరి బాలకృష్ణ భార్య పేరు?
వసుంధర దేవి
బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని)
నందమూరి బాలకృష్ణ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు?
తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ
బాలకృష్ణ అభిమాన నటుడు?
నందమూరి తారక రామారావు
బాలకృష్ణ అభిమాన హీరోయిన్?
సావిత్రి
బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు?
మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ.
బాలకృష్ణకు ఇష్టమైన కలర్?
వైట్
బాలకృష్ణ ఏం చదివాడు?
నిజాం కాలేజీలో డిగ్రీ
బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 108 సినిమాల్లో నటించాడు
బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం?
చికెన్ పలావు
బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.
బాలకృష్ణ 100వ సినిమా పేరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM
బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
హిందూపురం
బాలయ్య గెలుచుకున్న అవార్డులు?
బాలయ్య 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
మార్చి 19 , 2024
వెంకటేష్ (Venkatesh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన అరుదైన నటుల్లో వెంకటేష్ ఒకరు. ఆయన నటనతో ప్రేక్షకులకు కంటనీరు తెప్పించిన సందర్భాలెన్నో. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకుని ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు ఆయన సొంతం చేసుకున్నారు. ఇటు కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తూ తన తోటి నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల చేత్ వెంకీ మామాగా పిలిపించుకుంటున్న వెంకటేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వెంకటేష్ ఎవరు?
టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన వెంకటేష్ ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడి గారు రెండవ కుమారుడు.
వెంకటేష్ ముద్దు పేర్లు?
విక్టరీ వెంకటేష్, వెంకీ మామా
వెంకటేష్ ఎత్తు ఎంత?
5 అడుగుల 11 అంగుళాలు
వెంకటేష్ ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
వెంకటేష్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 డిసెంబర్ 13
వెంకటేష్ భార్య పేరు?
నీరజ
వెంకటేష్- నీరజ దంపతులకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు అమ్మాయిలు( ఆశ్రిత, భావన, హయవాహిని), ఒక అబ్బాయి( అర్జున్)
వెంకటేష్ అభిరుచులు?
క్రికెట్ ఆడటం, చూడటం
వెంకటేష్‌కు ఇష్టమైన ఆహారం?
కబాబ్స్ అండ్ హలీం
వెంకటేష్ అభిమాన నటుడు?
కమల్ హాసన్
వెంకటేష్ అభిమాన హీరోయిన్?
సౌందర్య
వెంకటేష్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?
ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, సూర్యవంశం, ఎఫ్2, నారప్ప
వెంకటేష్ ఇష్టమైన కలర్?
బ్లూ
వెంకటేష్ ఏం చదివాడు?
MBA
వెంకటేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 75 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=R3jZ-Nr_mhw
వెంకటేష్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నారు.
వెంకటేష్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
వెంకటేష్ మొత్తం 6 నంది అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు.
మార్చి 19 , 2024
Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో 'మనోహరి' అంటూ ఐటెం సాంగ్ పాడిన ముగ్గురు వయ్యారి భామల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనువిందు చేయనుంది. మట్కాలో నోరా ఫతేహితో పాటు మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అటు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ సొగసుల కోవ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇక నోరా పర్సనల్ విషయాలకొస్తే.. నోరా పుట్టి పెరిగింది కెనడాలో. చదువు కూడా బాగానే చదివింది. టోరంటోలోని యార్క్ యూనివర్సిసిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సంపాదించింది.
ఇక సుందరాంగికి డ్యాన్స్ అంటే మక్కువ. అందులోనూ బెల్లీ డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది.
https://twitter.com/Paleolitelly/status/1696461720754008307?s=20
యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో తొలుత మోడలింగ్ చేసిన నోరా.. ఆతర్వాత యాక్టింగ్ వైపు తన దృష్టి మరల్చింది. కెనడా నుంచి ఇండియాకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.
అలా బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన నోరా..2014లో బాలీవుడ్‌లో ‘రోర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఊపిరి సినిమాలో నాట్య మయూరిగా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ బాంబ్.. టెంపర్ చిత్రంలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' పాటలో రెచ్చిపోయింది.
టెంపర్‌లో ఐటెం సాంగ్.. నోరాకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. బాహుబలి, కిక్ 2, ఊపిరి, లోఫర్, షేర్ చిత్రాల్లో తన అందచందాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.
ప్రస్తుతం సెక్సీ డాల్ 100%, మడగావ్ ఎక్స్‌ప్రెస్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
నోరా తన అందం, నటనతోనే కాకుండా పలు రియాల్టీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహహించింది. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ దివానే 3, ఇండియా బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించింది.అంతేకాదు పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌లోని తన అందాల దాడితో రచ్చ చేసింది. 'బేబి మర్‌వాకే మనేగి', 'అచ్చా సిలా దియా', డ్యాన్స్ మేరీ రాణి వంటి వీడియో ఆల్బమ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
సెప్టెంబర్ 01 , 2023
Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.
https://twitter.com/tarak9999/status/1691728962731589669?s=20
దేవరలో ‘భైరా’గా
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.
ఆదిపురుష్
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.
హిందీ చిత్రాలు
30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.
2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.
ఫ్యూచర్ విలన్
ప్రస్తుతం టాలీవుడ్ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 16 , 2023
Mega Princess: రామ్‌చరణ్‌కే కాదు.. ఈ స్టార్ హీరోలకు కూడా తొలి సంతానం అమ్మాయే తెలుసా!
రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించడంతో మెగా కాంపౌండ్‌లో సంబరాలు మొదలయ్యాయి. సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రామ్‌చరణ్ మాదిరిగానే తొలి సంతానంగా కుమార్తెకు జన్మనిచ్చిన హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి, ఆ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
చిరంజీవి- సుస్మిత
చిరంజీవికి తొలి సంతానం అమ్మాయే. చిరు పెద్ద కూతురు సుస్మిత. ప్రస్తుతం సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
బాలకృష్ణ- బ్రాహ్మణి
నటసింహం బాలకృష్ణకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బ్రాహ్మణి. ఆ తర్వాత తేజస్విని, మోక్షజ్ఞ జన్మించారు. బ్రాహ్మణి నారా లోకేశ్ భార్య. హెరిటేజ్ గ్రూప్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
మోహన్ బాబు- లక్ష్మి
మంచు వారింట మహాలక్ష్మిలా తొలుత అడుగు పెట్టింది లక్ష్మి. మంచు లక్ష్మి తర్వాత విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రయ్యారు. మంచు లక్ష్మి ప్రజెంటర్, ప్రొడ్యూసర్, నటిగా రాణిస్తున్నారు.
వెంకటేశ్- ఆశ్రిత
విక్టరీ వెంకటేశ్‌కి మొదట అమ్మాయే పుట్టింది. పెద్ద కూతురు ఆశ్రిత ఫుడ్ వ్లాగర్. ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’ పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని మెయింటేన్ చేస్తుంటారు.
రజినీ- సౌందర్య
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఇద్దరూ అమ్మాయిలే. పెద్ద కుమార్తె సౌందర్య నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఐశ్వర్య దర్శకురాలిగా పనిచేస్తుంది. ఐశ్వర్య మాజీ భర్తే హీరో ధనుష్.
కమల్- శృతి
విలక్షణ నటుడు కమల్ హాసన్‌కి తొలుత శృతి హాసన్ పుట్టింది. నటిగా, సింగర్‌గా శృతి హాసన్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. కమల్ చిన్న కుమార్తె అక్షర.
రాజశేఖర్- శివాణి
రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు శివాణి. చిన్న కుమార్తె పేరు శివాత్మిక. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ- మోక్షద
రవితేజకు తొలి సంతానంగా కూతురు జన్మించింది. మోక్షద భూపతిరాజు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తనయుడు మహాధన్ జన్మనిచ్చాడు.
అనిల్- సోనమ్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కి సోనమ్ కపూర్ జన్మించింది. సోనమ్ పలు సినిమాలలో హీరోయిన్‌గా చేసింది. ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుంది.
మరికొంత మంది..
మంచు విష్ణు, దివంగత నందమూరి తారకరత్న, ఆది సాయికుమార్, అల్లరి నరేష్, రణ్‌బీర్ కపూర్, అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పలువురు సెలబ్రిటీలకు మొదటి సంతానం అమ్మాయే.
జూన్ 22 , 2023
KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి.
దర్శకుడు: ఫర్హద్ సమ్జీ
నటీ నటులు: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్
సంగీతం: రవి బస్రూర్, హిమేశ్ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వి. మణికందన్
కథ
భాయ్ జాన్( సల్మాన్ ఖాన్) తన ఊరిలో శక్తివంతమైన నాయకుడు. అమ్మాయిలంటే పడుదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాలనుకుంటాడు. తన ముగ్గురు సోదరులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే అతని ముగ్గురు తమ్ముళ్లు తన అన్నయ్యకు పెళ్లి చేసి వాళ్ల ప్రేమకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మిని ( పూజా హెగ్డే) ప్రేమించేలా చేస్తారు. ఆమె ప్రేమలో పడిన భాయ్ జాన్, భాగ్యలక్ష్మికి ప్రాణ హాని ఉందని తెలిసి ఆమెను ఎలా కాపాడతాడు. అసలు భాగ్యలక్ష్మికి విలన్ నుంచి ఉన్న ఆపద ఏంటి? భాగ్యలక్ష్మిని భాయి జాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే
ఈ సినిమాను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు రెండు సార్లు చూశారు. అజిత్ హీరోగా నటించిన వీరమ్ చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయినా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ అదే కథను కాటమ రాయుడుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దీన్ని కిసీకా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్ తీశాడు.
చిత్రంలో స్వల్పంగా మార్పులు మాత్రమే చేశారు. అచ్చుగుద్దినట్లు కాటమరాయుడు చూస్తున్నట్లే అనిపిస్తుంది.సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో కామెడీతో మెప్పించాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ మధ్యలో మాస్ ఫైట్లు అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది.
సెకాండాఫ్ సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వెంకటేశ్, సల్మాన్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక సల్లు భాయ్ లుంగీలో చేసిన డాన్స్ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. క్లైమాక్స్ అంతా రొటీన్‌గానే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి.
ఎవరెలా చేశారు
సినిమా మెుత్తం సల్మాన్ ఖాన్ వన్ మేన్ షో. చిత్రం మెుదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సల్లు భాయ్‌దే హవా. కామెడీ, ఫైట్లతో అలరించాడు. మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. పూజా హెగ్డే నటనతో మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విక్టరీ వెంకటేశ్, షెహనాజ్ గిల్ సహా మిగతా వారందరూ తమ పరిధి మేరకు నటించారు. పాటలో రామ్ చరణ్ డాన్స్ బాగుంది.
సాంకేతిక పనితీరు
సినిమాటోగ్రఫీ బాగుంది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రానికి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్ ప్లేపై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. అచ్చుగుద్దినట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
సల్మాన్ ఖాన్
పూజా హెగ్డే
కామెడీ
బలహీనతలు
తెలిసిన కథ
రేటింగ్ : 2.75/5
ఏప్రిల్ 21 , 2023
REVIEW: కోనసీమ థగ్స్
దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం.
చిత్రబృందం:
దర్శకత్వం: బృందా గోపాల్
సంగీతం: సామ్ CS
నటీనటులు: హ్రిదు హరూన్, అనస్వర రాజన్, బాబీ సింహా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి
కథ:
శేషు( హ్రిదు హరూన్) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?. దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ.
ఎలా ఉందంటే:
దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ చక్కగా సెట్ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.
సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.
నటీ,నటుల పెర్ఫార్మెన్స్
హ్రిదు హరూన్ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్ అనిపించుకున్నాడు. హీరోయిన్ అనస్వర రాజన్ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
బలాలు:
కథ,
సెకండాఫ్
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
బీజీఎం
బలహీనతలు
ఫస్టాఫ్
కథనం
సమీక్ష:
ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది.
రేటింగ్: 2.75
ఫిబ్రవరి 24 , 2023
Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా రెండు పాటలు, ఓ సీన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో అనౌన్స్ చేసిన టైమ్‌కు పుష్ప 2 వస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప మేకింగ్‌కు సంబంధించి ఊహించని ట్విస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాథ్యతలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీని పెట్టుకొని థమన్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం చర్చలు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సుకుమార్ అసంతృప్తి!
సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి ర్యాపో ఉంది. సుకుమార్ ఇప్పటివరకూ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీనే సంగీతం సమకూర్చారు. అంతేకాదు ఆయా చిత్రాల ఆల్బమ్స్ సూపర్ డూపర్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2’ బాధ్యతలు సైతం దేవిశ్రీకి సుకుమార్ అందించారు. పుష్ప 2 పాటల విషయంలో సంతృప్తి చెందిన సుకుమార్ నేపథ్యం సంగీతం విషయంలో మాత్రం అసంతప్తిగా ఉన్నారట. సినిమా రిలీజ్‌కు 29 రోజుల సమయంలో మిగిలి ఉండటం, దేవిశ్రీకి ఇంకా చేతినిండా పని ఉండటంతో థమన్ చేత బీజీఎం ఇప్పించాలని సుకుమార్ నిర్ణయించారట. ఇందుకోసం థమన్‌తో చర్చలు సైతం జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌ను సుకుమార్‌కు వినిపించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
థమన్‌కే ఎందుకు!
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman)కు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందిస్తాడని పేరుంది. ఇటీవల కాలంలో థమన్ పాటల కన్నా బీజీఎంతోనే ఎక్కువగా అల్లాడిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘వకీల్‌సాబ్’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘బ్రో’ ‘స్కంద’ వంటి చిత్రాలకు థమన్ ఏ స్థాయి బీజీఎం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా థమన్‌నే ఏరికోరి సుకుమార్ బీజీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు థమన్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు. ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్ ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో థమన్‌కు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. కాబట్టి 'పుష్ప 2'కు థమన్ నేపథ్య సంగీతం అందించినా అది కచ్చితంగా అదిరిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
తెరపైకి మరో మ్యూజిక్ డైరెక్టర్!
థమన్‌తో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘కాంతార’, ‘మంగళవారం’ లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath)ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సమయం లేనందున థమన్‌కు తొలిభాగం, అజనీష్‌కు సెకండ్ పార్ట్ బాధ్యతలు అప్పగిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పనిచేయనున్నారు. అయితే థమన్ ఒక్కరే నేపథ్యం సంగీతం అందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్‌గా చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
‘పుష్ప 2’ అరుదైన ఘనత
పుష్ప (Pushpa 2) కి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్‌లోనూ పుష్ప’ (2021) సక్సెస్ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది.
https://twitter.com/PushpaMovie/status/1854036371146695000
నవంబర్ 07 , 2024
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.
నవంబర్ 06 , 2024
Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్, కూల్ డ్రింక్స్.. ఫొటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహించేందుకు థియేటర్స్ యజమానులు రెడీ అయ్యారు.
నెల రోజుల్లో పుష్పగాడి రాక
'పుష్ప 2' రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి పుష్ప టీమ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 5) సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పుష్పరాజ్ (అల్లు అర్జున్), భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే ట్రైలర్‌ను (pushpa 2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
https://twitter.com/PushpaMovie/status/1853694508623683871
గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్!
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్ అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేయోచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
పాప్‌కార్న్ డబ్బాలతో ప్రమోషన్స్
‘పుష్ప2’ విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉండటంతో అటు విదేశాల్లోనూ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు. పుష్ప బ్రాండ్ పాప్‌కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను యూఎస్‌లోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13న విడుదలయ్యే ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా ఇలాంటి ప్రత్యేక ప్రమోషన్ చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 టీమ్ వీటికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకోవడం విశేషం.
https://twitter.com/RegalMovies/status/1853467449280082009
ఈనెల 6 నుంచి ఐటెం సాంగ్ షూట్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా ఫైనల్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 6 నుంచి సాంగ్ షూట్ కూడా మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో ఏ స్థాయిలో స్టెప్పులు ఇరగదీస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
‘పుష్ప 3’ పక్కా
‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ సైతం మూడో పార్ట్ గురించి పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్ 3 కి సంబంధించి సాలిడ్ లీడ్ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అటు సుకుమార్ సైతం రామ్‌చరణ్‌తో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత ‘పుష్ప 3’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
https://twitter.com/i/status/1849383805657690194
నవంబర్ 05 , 2024