• TFIDB EN
  • మున్నా
    U/ATelugu2h 54m
    కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రభాస్
    మహేష్ అలియాస్ మున్నా కుమార్
    మనోజ్ నందం
    టీనేజ్ మున్నా కుమార్
    ప్రకాష్ రాజ్
    కమలాకర్ అలియాస్ ఖాఖా
    కోట శ్రీనివాసరావు
    మంత్రి శ్రీనివాసరావు
    రాహుల్ దేవ్
    ఆత్మ
    కావేరి
    మున్నా తల్లి
    సుకన్య
    తరువాత మున్నా సవతి తల్లి
    సూర్య
    నిధి తండ్రి
    సుధ
    నిధి తల్లి
    తనికెళ్ల భరణి
    ఖాసిం
    పోసాని కృష్ణ మురళి
    కిషన్
    బ్రహ్మాజీ
    పురుషోత్తం
    నల్ల వేణుటిల్లు
    వేణు మాధవ్
    as Spoon Mohan
    చలపతి రావు
    హోంమంత్రి ఎం. సుధాకర్
    రఘు బాబు
    సత్తి పాండు
    సమీర్
    పోలీస్ ఇన్స్పెక్టర్
    గుండు సుదర్శన్
    పూజారి
    ఉత్తేజ్
    తుపాకీ విక్రేత
    సంద్రనిధి స్నేహితుడు
    శ్రీధర్ప్రకాష్
    ప్రభాస్ శ్రీను
    శ్రీధర్ అనుచరుడు
    ఫిష్ వెంకటయ్య
    కాకా హెంచ్మాన్
    శ్రియా శరన్
    సిబ్బంది
    వంశీ పైడిపల్లి
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    హారిస్ జయరాజ్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిధి అగర్వాల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నిధి అగర్వాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా.. యూత్‌ మంతి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మరి నిధి అగర్వాల్‌కు(Some Lesser Known Facts about Nidhhi Agerwal)  ఇంకా ఏమేమి ఇష్టమో ఈ కథనంలో చూద్దాం. నిధి అగర్వాల్ ముద్దు పేరు? నిధి నిధి అగర్వాల్ ఎప్పుడు పుట్టింది? 1993, ఆగస్టు 17న జన్మించింది నిధి అగర్వాల్ తొలి సినిమా? మున్నా మైఖెల్(2017) నిధి అగర్వాల్ తెలుగులో నటించిన తొలి సినిమా? మిస్టర్ మజ్ను(2018) నిధి అగర్వాల్  ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు  నిధి అగర్వాల్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ నిధి అగర్వాల్  ఏం చదివింది? BBA, క్రిష్ట్ యూనివర్సిటీ ( బెంగుళూరు) నిధి అగర్వాల్  అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నిధి అగర్వాల్‌కు అఫైర్స్ ఉన్నాయా? బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నయి. నిధి అగర్వాల్‌కు  ఇష్టమైన కలర్ ? వైట్, బ్లాక్ నిధి అగర్వాల్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నిధి అగర్వాల్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నిధి అగర్వాల్  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nidhhiagerwal/?hl=en నిధి అగర్వాల్‌కు గుడి ఎక్కడ కట్టారు? చెన్నైలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఆమెకు గుడి కట్టారు.
    ఏప్రిల్ 06 , 2024
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌  విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన  ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక  విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.  సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.  ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
    డిసెంబర్ 21 , 2023
    Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
    Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
    మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్‌ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమ‌లు’ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ మ‌మితా బైజుకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్‌ చిత్రం విడుదలై పాజిటివ్‌ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.  స్ట్రీమింగ్ ఎక్కడంటే? సంగీత దర్శకుడు జీవి ప్రకాష్‌, మ‌మితా బైజు జంటగా న‌టించిన త‌మిళ మూవీ ‘రెబెల్’ (Rebel).. మార్చి 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతోనే మ‌మితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime).. విడుదలయ్యి రెండు వారాలు కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.  కథేంటి? క‌థిరేస‌న్ ఓ మ‌ల‌యాళీ కుర్రాడు. ఉన్న‌త చ‌దువుల కోసం మున్నార్ నుంచి పాల‌క్కాడ్ వ‌స్తాడు. అక్క‌డ కొంద‌రు త‌మిళ స్టూడెంట్స్‌తో జ‌రిగిన గొడ‌వ క‌థిరేస‌న్ జీవితాన్ని ఎలాంటి మ‌లుపు తిప్పింది. కాలేజీ గొడ‌వ‌గా మొద‌లైన ఈ ఇష్యూ.. రాజ‌కీయ రంగ‌ును ఎలా పులుముకుంది? సారా అనే అమ్మాయితో అతడి ప్రేమ ట్రాక్‌ ఎలా మెుదలైంది? ఆమె ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం అతడు ఎలాంటి పోరాటం చేశాడ‌ు? అన్నది రెబెల్ మూవీ క‌థ‌.  https://twitter.com/i/status/1773963043392872495 సినిమా ఎలా ఉందంటే? కేర‌ళ‌లోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు నికేష్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.  కేరళలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా కథను నడిపించి డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తమిళం, మలయాళ స్టూడెంట్స్‌ మధ్య తరచూ జరిగే గొడవలను డైరెక్టర్‌ కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. జీవి ప్రకాశ్ అద్భుతంగా నటించాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు నటనకు స్కోప్ దక్కింది. సినిమాలోని బీజీఎమ్‌ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సిద్ధూ కుమార్ మంచి సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాడు. అరుణ్ రాధా కృష్ణన్ కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడు నికేష్ తాను అనుకున్న పాయింట్‌ను ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లో భావోద్వేగాలను పండించే సన్నివేశాలకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని తీసుకురాలేదు. తమిళ్, మలయాళం విద్యార్థుల మధ్య గోడవలకు గల అసలైన కారణాన్ని  బాగా చెప్పలేదు.  ఈ చిత్రం అంతిమంగా మత రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది. ఎందుకంటే చాలా సన్నివేశాలు అనేక రాజకీయ కోణాలతో ముడిపడి ఉంటాయి. Telugu.yousay.tv Rating : 2.5/5
    ఏప్రిల్ 06 , 2024
    Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
    Top 5 Upcoming Movies in 2023: రూ.500 కోట్ల వసూళ్లపై కన్నేసిన సినిమాలు.. బాక్సాఫీస్ షేక్ కావాల్సిందేనా..!  
    ‘వంద కోట్లు కొల్లగొట్టిన సినిమా రా అది’ అని జనరల్‌గా మాట్లాడుకుంటుంటాం. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి కలెక్షన్లు ఒక ప్రామాణికత. ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయ్? వసూళ్లెంత? అనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కలెక్షన్ల కౌంట్ ఎగబాకిన కొద్దీ సినిమా సక్సెస్ స్థాయి పెరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే సంప్రదాయం ఉంటుంది. ఎన్నో సినిమాలు హిట్టవుతాయి. కానీ, కొన్నే ల్యాండ్‌మార్క్ వసూళ్లను అందుకుంటాయి. రానున్న సినిమాలపై కూడా ఈ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి, ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేయగల సినిమాలేంటో చూద్దాం.  జవాన్(JAWAN) షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక పదుకొణె, నయనతార.. ఇలా ప్రధాన తారాగణం నటించిన సినిమా ఇది. క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెప్టెంబర్‌ 7న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. చిత్రంపై భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. షారూక్ ఖాన్‌ని గుండుతో చూపించడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటుల మార్కెట్‌, కంటెంట్‌ని బట్టి ఈ సినిమా రూ.500 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.  https://www.youtube.com/watch?v=k8YiqM0Y-78 సలార్(SALAAR) మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా ప్రభాస్ సలార్‌ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ అనంతరం, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పైగా, సినిమాలోని నటీనటులు మూవీ గురించి గొప్పగా చెబుతుండటం మరింత ఆసక్తిని పెంచింది. కేజీఎఫ్2కి, దీనికి లింక్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టంగా కనిపించింది. ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్‌తో సినిమా వస్తోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీకి హొంబలే ఫిల్మ్ భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లపై కన్నేసింది. సినిమా టాక్ బాగుంటే ప్రభాస్ మార్కెట్‌కి ఇది సాధ్యమే.  https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso లియో(LEO) ‘విక్రమ్’ మూవీ బ్లాక్‌బస్టర్ అనంతరం లోకేష్ కనగరాజ్ తీస్తున్న చిత్రమే ‘లియో’. దళపతి విజయ్ నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు దీనిని దక్కించుకున్నట్లు టాక్. దీంతో విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ఇందులో కనిపించనున్నారట. LEO - Bloody Sweet Promo | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh యానిమల్(ANIMAL) రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించింది. ఈ మూవీ కూడా 5 భాషల్లో విడుదల అవుతోంది. తొలుత ఆగస్టు 11న విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాలతో సినిమా రిలీజ్ ఈ ఏడాది డిసెంబర్‌ 1కి వాయిదా పడింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  https://www.youtube.com/watch?v=EywX_uxreYA డంకీ(DUNKI) రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, సంజూ వంటి సినిమాలను తీశాడు. యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించగలడు. ఇప్పుడు షారూక్ ఖాన్‌ని ‘డంకీ’(DUNKI)గా చూపించబోతున్నాడు. పూర్తి కామెడీ చిత్రంగా రాజ్‌కుమార్ హిరాణీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ మూవీ సైతం రూ.500 కోట్లకు పైగా వసూళ్లపై కన్నేసింది.  https://www.youtube.com/watch?v=aNxd01VzJsw&t=1s
    ఆగస్టు 10 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!
    Mannara Chopra: ఎద అందాలతో మాయ చేస్తున్న మన్నారా చోప్రా!
    యంగ్‌ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra).. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాలో తళుక్కుముంది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా సెలెనా రఫుల్‌ షోల్డర్‌ మ్యాక్సీ డ్రెస్‌ (Selena Ruffle Shoulder Maxi Dress)లో ఫొటోషూట్‌ నిర్వహించిన ఈ సుందరి.. తన అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.  మ్యాచింగ్‌ ఎయిర్‌ రింగ్స్‌, వాచ్‌ ధరించి యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌తో కనువిందు చేసింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజన్లు మైమరిపోతున్నారు. మన్నారా లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)కు స్వయానా సోదరి అయిన ఈ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. 2014లో 'ప్రేమ గీమా జాంతా నై' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మన్నారా పరిచయమైంది. ఆర్‌.వి సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సింగర్‌ శ్రీరామ చంద్ర హీరోగా చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో జిద్‌ (Zid) సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. అందులో మన్నారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన్నారా.. అక్కడ 'సందమరుతమ్‌', 'కావల్‌' చిత్రాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోకపోవడంతో తిరిగి టాలీవుడ్‌పై మన్నారా ఫోకస్‌ పెట్టింది. తెలుగులో సునీల్‌తో 'జక్కన్న' (Jakkanna), సాయిధరమ్‌ తేజ్‌తో 'తిక్క' (Thikka), పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 'రోగ్‌' (Rough) వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు.  ఆ తర్వాత రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తిరిగి తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన  'సీత' (Sita) సినిమా అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా ఈ భామకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేదు. దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన మన్నారా.. Bigg Boss 17 హిందీలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అక్కడ తన ప్రవర్తన, ఆటతీరుతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.  గతేడాది 'భూత్‌మేట్‌' అనే హిందీ సిరీస్‌లో మన్నారా మెరిసింది. పారి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల 'డ్యాన్స్‌ దివానే 4' అనే హిందీ షోలో గెస్ట్‌ అప్పిరియన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది.  తాజాగా తెలుగులో 'తిరగబడరా సామి' అనే చిత్రంలో ఈ భామ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తికాగా.. విడుదలకు సిద్ధంగా ఉంది.  అటు పంజాబీలో ఓహీ చాన్ ఓహీ రాతన్‌ అనే చిత్రంలో మన్నారా చోప్రా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు వికీపిడీయా ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ కూడా త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
    మార్చి 12 , 2024
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.  సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.  ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి. 
    మార్చి 12 , 2024
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌ సంగీతం: రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌ విడుదల: 22-12-2023 పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌లార్‌’. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఎప్ప‌ట్నుంచో  ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ కటౌట్‌కు తగిన హిట్‌ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు ఖాతాలో మరో బ్లాక్‌ హిస్టర్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్‌ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని ఖాన్సార్‌కు రూలర్‌గా చూడాలనేది రాజమన్నార్‌ కోరిక‌. దీంతో వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్‌. తన కటౌట్‌కు తగ్గట్లు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని స్నేహితుడిగా ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి,  శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’తో మరోమారు తన మార్క్‌ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత  ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన క‌థ‌ని అల్లారు. కె.జి.యఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్ర‌భాస్‌కి త‌గ్గట్టు మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్‌కు ఎలివేష‌న్ల‌ు ఇచ్చి అభిమానుల‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు డైరెక్టర్. ఓవరాల్‌గా స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్‌నీల్‌ సక్సెస్ అయ్యారు.  సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రభాస్, పృథ్వీ నటనయాక్షన్‌ సన్నివేశాలుభావోద్వేగాలు, క్లైమాక్స్ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 22 , 2023
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.  అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్‌తో సలార్ లింక్ సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్‌ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి చూపించారు.  అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్‌)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు.  ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్‌) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.  ఫ్యాన్స్ రచ్చ రచ్చ మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్‌ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్‌ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  సలార్‌తో నడిచేది వీరే.. ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని  కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
    జూలై 06 , 2023
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!
    ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం.. సుహాసిని బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందమైన నటీమణుల్లో సుహాసినీ ముందు వరుసలో ఉంటుంది. చంటిగాడు సినిమాతో మెుదట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ వెండితెర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సీరియళ్లపై తన దృష్టిని కేంద్రీకరించి సూపర్‌ సక్సెస్‌ అయింది. శివశంకరి, అపరంజి, అనుబంధాలు, అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత, అనుబంధ ఆలయం వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, భోజ్‌పూరి సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తూ సుహాసిని అలరిస్తోంది.  ప్రీతి అస్రాని బుల్లితెరపై అలరిస్తున్న అందాల భామల్లో ప్రీతి అస్రాని కూడా ఒకరు. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమాల్లో తన కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ టెలివిజన్‌ రంగంలోనూ నటిస్తూ అలరిస్తోంది. పక్కింటి అమ్మాయి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ప్రీతి.. సోషల్‌, మిన్నాలే 9 ఆవర్స్‌ వంటి ప్రముఖ  షోలలో కనిపించింది. అంతేగాక మళ్లీరావా, హ్యాపీ వెడ్డింగ్, సీటీమార్‌, దొంగలున్నారు జాగ్రత్త, యశోధ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  నవ్య స్వామి నటి నవ్య స్వామి కూడా అందమైన బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ భామ ఓ కన్నడ టీవీ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత వాణి-రాణి, నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి తెలుగు సీరియళ్లలో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టెలివిజన్‌ షోలలోనూ కనిపిస్తూ నవ్య అలరిస్తోంది.  ఐశ్వర్య పిస్సే 33 ఏళ్ల ఐశ్వర్య పిస్సే బుల్లితెల నటిగా రాణిస్తోంది. తన గ్లామర్‌తో టెలివిజన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ సీరియళ్లలో నటించి చాలా బాగా పాపులర్‌ అయింది. సర్వమాంగళ మాంగల్యే, అగ్నిసాక్షి, ముక్కు పుడక వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.  శోభా శెట్టి కన్నడ నటి శోభా శెట్టి బుల్లితెరపై పాపులర్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్‌తో ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఆమె చేసిన ప్రతినాయిక పాత్రకు ‘మా పరివార్‌’ అవార్డు వరించింది. అష్టా-చమ్మా సీరియల్‌లోనూ చేసిన ఈ భామ తన నటన ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.  ప్రియాంక జైన్‌ నటి ప్రియాంక జైన్‌ కూడా తన అందం అభినయంతో బుల్లితెర ప్రేక్షుకలను అలరిస్తోంది. \రంగీ తరంగా అనే తమిళ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తెలుగు, తమిళ సిరీయళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన మౌన రాగం సీరియల్‌ ఈ భామను అందరూ గుర్తుపట్టేలా చేసింది. ఇందులో అమ్ములు పాత్రలో ప్రియాంక జైన్‌ అద్భుతంగా నటించింది. 
    ఏప్రిల్ 13 , 2023
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!
    Mirna Menon: టాలీవుడ్‌లో మెరిసిన మరో అందాల తార.. మిర్నా మీనన్‌ హోయలకు ముగ్దులవుతున్న ప్రేక్షకులు..!
    అల్లరి నరేష్‌ తాజాగా నటించిన ‘ఉగ్రం’ మూవీలో ‘మిర్నా మీనన్‌’ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది. తమిళ చిత్రం ‘సంతానథెవన్‌’ చిత్రంతో మిర్నా మీనన్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే చిన్న సినిమా కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.  తన తర్వాతి చిత్రంలో ఏకంగా మోహన్‌ లాల్‌ పక్కనే ఛాన్స్‌ కొట్టేసింది ఈ భామ. బిగ్‌ బ్రదర్ చిత్రంలో ఆర్య శెట్టి పాత్రలో మిర్నా మెరిసింది ఆది సాయికుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘క్రేజీ ఫెల్లో’ సినిమా ద్వారా మిర్నా మీనన్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రెండో చిత్రం ఉగ్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  ఉగ్రం సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందని మిర్నా మీనన్ ఓ ఇంటర్యూలో చెప్పింది. నరేష్‌తో పాటే తన పాత్ర సాగుతుందని చెప్పుకొచ్చింది.  ఉగ్రంలో పాత్ర కోసం చాలా హోంవర్క్‌ చేసినట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పింది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.  ఉగ్రం సినిమా షూటింగ్‌లో 75 రోజులు పాల్గొన్నట్లు నటి చెప్పింది. అయితే అందులో 55 రోజులు నైట్‌ షూట్లేనని వివరించింది.  కెరీర్ ఆరంభంలో ఇలాంటి పాత్ర చేయడమంటే ఏ నటికైనా సవాలేనని నటి చెప్పింది. ఆ సవాల్‌ను స్వీకరించి ఎంతో కష్టపడి చేసినట్లు చెప్పుకొచ్చింది.  ఉగ్రంలో నరేష్‌తో పాటు తాను కూడా రియల్‌ స్టంట్స్‌లో పాల్గొన్నట్లు ఈ భామ తెలిపింది. ట్రైలర్‌లో చూపించిన కారు ప్రమాదం రియల్‌ స్టంట్‌లో భాగమేనని స్పష్టం చేసింది. కారు స్టంట్‌ చేస్తున్నపుడు నరేష్‌కు గాయమైందని మిర్నా మీనన్‌ తెలిపింది. ఆ సమయంలో తాను కూడా కింద పడిపోయినట్లు చెప్పుకొచ్చింది.
    మే 03 , 2023
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా  విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో  హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.  ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
    డిసెంబర్ 01 , 2023
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా, నాగ మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.   సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?
    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆదరించట్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన యశోద అంతంతమాత్రంగానే నడిచింది. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావటం లేదు. ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువ వచ్చాయని చెబుతున్నారు. అంటే సామ్ ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. దీంతో ఆమె కెరీర్‌కు దాదాపు ఎండ్‌ కార్డ్‌ పడిందని అంతా భావిస్తున్నారు. సామ్‌ ప్రాజెక్టులు సామ్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. విజయ దేవరకొండ సరసన ఖుషీ అనే చిత్రంలో చేస్తోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో మజిలీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో సిటాడెల్‌ రీమేక్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది సామ్. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ రెండు మినహా ఆమె మరో చిత్రానికి కమిట్ అవ్వలేదు. దర్శకులెవ్వరూ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తోంది.  మయోసైటిస్‌ సమస్యలు మయోసైటిస్ వ్యాధి సామ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. యశోద సినిమా సమయంలో వ్యాధి సోకటంతో ఇబ్బంది పడుతుంది. సెలైన్ బాటిల్‌పైనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుని శాకుంతలం సినిమా చేసినప్పటికీ వివిధ సమస్యల కారణంగా ప్రచార కార్యక్రమాలు, షూటింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనలేకపోయింది సమంత. కొన్ని సందర్భాల్లో ఈ సూచనలు స్పష్టంగా కనిపించాయి. మరి, ఇలాంటి సమయంలో నిర్మాతలు డబ్బులు పెట్టి షూటింగ్స్‌ ఆలస్యం చేసుకోవటం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. అందం తగ్గిపోయిందా? సమంత లుక్‌ కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నంత అందంగా ఇప్పుడు ఆమె కనిపించట్లేదు. ఈ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. సామ్ అందం తగ్గిపోయిందని.. ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ… చాలామంది విమర్శలు చేస్తున్నారు.  సమంత పనైపోయింది నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రేంజ్ పడిపోయిందని.. అందుకే వచ్చిన సినిమాలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆఫర్ల కోసం డ్రామాలు ఆడుతుందని ఓ అడుగు ముందుకేశారు. యశోద రిలీజ్‌ సమయంలో ఏడవటం.. శాకుంతలం అప్పుడు ఆరోగ్యం బాలేదని డ్రామాలు ఆడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఏం మాయ చేశావే నాగ చైతన్య సరసన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. జెస్సీగా అందరి మనసులు దోచి అభిమానులను సంపాదించింది. మెుదటి సినిమానే హిట్ కావటంతో పాటు అందం, అభినయం ఉండటంతో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి చేతి నిండా సినిమాలతో వెలుగు వెలిగింది.  ఫ్యాన్‌ బేస్‌ సమంత ఫ్యాన్ బేస్‌ కూడా చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే సినిమాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆమె నుంచి చిత్రం వస్తున్నా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒకప్పుడున్నంత ఫాలోయింగ్‌ సామ్‌కు ఇప్పుడు లేదనే చెప్పాలి. ఇన్ని ఒడుదొడుకుల నడుమ సమంత ఇండస్ట్రీలో ఎలా నెట్టుకు వస్తుందో చూడాలి. 
    ఏప్రిల్ 17 , 2023
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్‌, ప్రణీత్‌ రెడ్డి కల్లెం, ఫిష్‌ వెంకట్‌, రాజ్‌ తిరణ్‌దాస్‌, శ్రీరామ్‌ రెడ్డి తదితరులు.. దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌ సంగీతం: రామ్‌ మిర్యాల, శ్రీచరణ్‌ పరకాల, ఎస్‌.ఎస్‌ థమన్‌, సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు ఎడిటింగ్‌ : నవీన్ నూలి నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ విడుదల తేదీ : 29-03-2024 సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్‌ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్‌, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.  ఎవరెలా చేశారు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. డైరెక్షన్‌ ఉందంటే డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్‌’ను కూడా ఫన్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. అయితే కామెడీ, డైలాగ్స్‌ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్‌ విషయంలో మల్లిక్‌ రామ్‌ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్‌, కామెడీ పరంగా చూస్తే మల్లిక్‌ రామ్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు.  టెక్నికల్‌గా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ సిద్ధు జొన్నలగడ్డ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్ రొటీన్ స్టోరీఆకట్టుకోని ట్విస్టులు Telugu.yousay.tv Rating : 3.5/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 29 , 2024
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) యుగం నడుస్తోంది. మెున్నటి వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలుగా ఉన్న థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించేశాయి. బడా హీరోల చిత్రాలు మినహా.. అత్యధిక శాతం చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney + Hotstar), సోనీలివ్‌ (SonyLIV), ఈటీవీ విన్‌ (ETV Win), వూట్‌ (Voot), ఆహా (Aha) వంటి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు - సిరీస్‌లు విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.  ఓటీటీ ఏర్పాటుకు కారణం ఇదే! మలయాళం నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కంటెంట్‌ ఉన్న కథలను మాలీవుడ్‌ నిర్మిస్తుందన్న పేరు ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. కొందరైతే సబ్‌టైటిల్స్‌ పెట్టుకొని మరి మాలీవుడ్‌ సినిమాలను వీక్షిస్తున్నారు. ఇది గమనించిన కేరళ ప్రభుత్వం.. డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో కొత్త ఓటీటీ యాప్‌ను మూవీ లవర్స్‌ ముందుకు తీసుకొస్తోంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. 60 మంది ఉద్యోగులతో.. కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) రేపు స్వయంగా ‘సీస్పేస్‌’ (CSpace) యాప్‌ను లాంచ్‌ చేస్తారు. ఉదయం 9.30 గంటలకు.. కైరళి థియేటర్‌లో జరగనున్న లాంచ్‌ ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సజీ చెరియన్ (Saji Cherian) కూడా హాజరవుతారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు ‘సీస్పెస్’ ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - KSFDC (Kerala State Film Development Corporation) చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న KSFDCనే ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మంది సిబ్బందిని సెలక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.  ప్రత్యేక పానెల్‌ ఏర్పాటు! ఈ ‘సీస్పేస్‌’ ఓటీటీలో ఎటువంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను సైతం KSFDC సంస్థ ఏర్పాటు చేసింది. బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఈ ప్యానెల్‌ ఏర్పాటైంది. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ ప్యానెల్‌ చేతుల్లోనే ఉండనుంది. సీస్పేస్ లాంచ్ సందర్భంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’ ఎలా పనిచేస్తుంది? ‘సీస్పేస్‌’ యాప్‌ను మాస, త్రైమాసిక, వార్షిక చెల్లింపుల విధానంలో కాకుండా ‘పే పర్‌ వ్యూ‘ (Pay Per View) స్కీమ్‌తో రన్‌ చేయనున్నారు. ఇందులో సినిమా చూడాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును చిత్ర నిర్మాతలకు సీస్పేస్‌ ప్యానెల్ అందజేస్తుంది. ఒకవేళ తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ వస్తే సగం ధరకే వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’తో ఎవరికి లాభం! కేరళలో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు సీస్పేస్‌ చెక్‌ పెట్టనుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఈ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. అలాగే థియేటర్లు దొరక్క సమస్యలు ఎదుర్కొనే నూతన దర్శకులు తమ చిత్రాలను సీస్పేస్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చని సూచించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అటు ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు  స్పష్టం చేశారు.
    మార్చి 06 , 2024
    janhvi kapoor:  లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
    janhvi kapoor:  లేత పరువాలను అడ్డు చీరలో దోపుకున్న జాన్వీ కపూర్.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ అందాల ప్రదర్శన
    బాలీవుడ్ అందాల క్వీన్ జాన్వీ కపూర్ ఒక్కసారిగా రవివర్మ కుంచె గీసిన బొమ్మగా మారిపోయింది. పరువాలను అడ్డు చీరలో దోపుతూ ఫొటో షూట్‌కు పొజులిచ్చింది. అచ్చం రవివర్మ గీసిన పెయింటింగ్‌లా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలను నెటిజన్ల తెగ పొగుతుతున్నారు. కేరళ కుట్టిలా ముస్తాభై నేల మీద కూర్చోని అందాలను అమర్చింది ఈ కొంటె పిల్ల. జబ్బల అందాలు, సొగసైన ఎద అందాల అచ్చాదనను ఎకరువు పెడుతూ తళుక్కున మెరిసింది ముగ్దమైన కళ్లు, సగం తెరుచుకున్న ఎర్రని లాలీపప్స్ వంటి పెదాలు, పొడవైన నల్లని జుట్టులో దోపిన కలువ పూల అందాల్లో జాన్వీ అందాలకే అందంగా నిలిచింది. అతిలోక సుందరి శ్రీదేవికి తగిన తనయగా తన అందానికి మరింత హంగులు అద్దింది. చూపు తిప్పుకోలేని భంగిమలో కుర్రకారును టెంఫ్ట్ చేస్తోంది.  రాఖీ పండగ సందర్భంగా కవ్వించే సొగసులతో కుదురుగా ఉండనివ్వడం లేదంటే నమ్మండి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. దీంతో కుర్రాళ్లు తమ పదునై కామెంట్లకు పని చెబుతున్నారు. ఈ ఫొటోలను ట్యాగ్ చేస్తూ ... ఇది ఆర్ట్ గొప్పతనం అంటూ పోస్ట్ చేసింది. ఇక పోస్ట్‌కు రిప్లే ఇస్తూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. జాన్వీ అందాలను పొగుడుతూ తమలోని కామెంట్ల కవిత్వానికి పని చెప్పారు. లుకింగ్ గార్జియస్, డ్రీమీ, ఏంజెల్‌లా ఉన్నావని కొందరూ, అతిలోక సుందరిని మించిపోయావంటూ తెగ పొగుడుతున్నారు.  స్టార్ కిడ్ అయినప్పటికీ జాన్వీ బాలీవుడ్‌లో గొప్పగా అయితే లాంచ్‌ కాలేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటనలో పరిపక్వతను సాధిస్తోంది. తాజాగా వరుణ్‌ దావణ్‌తో `బవాల్‌` చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.  ఈ సినిమా ఓటీటీలో విడుదలై ప్రశంసలందుకుంది.  ఇప్పుడు ఈ సొగసుల సోయగం తెలుగులో భారీగా ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ- జూ. ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాలో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్‌పై తన ఇష్టాన్ని పలు ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ అల్లరి పిల్ల నేరుగా ఆయన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేయడం విశేషం.  అయితే దేవర కంటే ముందుగానే జాన్వీ.. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. కానీ కుదరలేదు.  అయితే ఆ సినిమాలో నటించకపొవడం జాన్వీకి మంచే చేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా ఆమె కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన తల్లి శ్రీదేవి లాగా పాన్ ఇండియన్ హీరోయిన్‌గా ఎదిగేందుకు అన్ని విధాల దేవర సినిమా అయితే ఉపయోగపడనుంది. ఈ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాన్వీ పరిచయం కానుంది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు హిందీలో.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉలజ్ సినిమాల్లో నటిస్తోంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా జాన్వీకి మాత్రం బిగ్‌ బ్రేక్ రాలేదు. మరి జూ. ఎన్టీఆర్ దేవరతో ఆ బ్రేక్ వస్తుందో చూడాలి మరి.
    ఆగస్టు 31 , 2023

    @2021 KTree