రివ్యూస్
How was the movie?
తారాగణం
అల్లరి నరేష్
బండి సూర్య ప్రకాష్వరలక్ష్మి శరత్‌కుమార్
సూర్య డిఫెన్స్ లాయర్ప్రవీణ్
సూర్య బెస్ట్ ఫ్రెండ్ మరియు హెల్పర్హరీష్ ఉత్తమన్
ఒక అవినీతి పోలీసు అధికారివినయ్ వర్మ
అవినీతిపరుడైన మాజీ హోం మంత్రిప్రియదర్శి పులికొండ
ఆది సహాయంశ్రీకాంత్ అయ్యంగార్
ర్ సివిఎల్ నరసింహారావు
ఒక సామాజిక కార్యకర్తరాజ్యలక్ష్మి
రాజగోపాల్ భార్యదేవీ ప్రసాద్
సూర్య తండ్రిఆనంద చక్రపాణి
మీనాక్షి తండ్రిప్రమోదినిసూర్య తల్లి
కృష్ణేశ్వరరావు
చంద్రయ్యసిబ్బంది
విజయ్ కనకమేడలదర్శకుడు
సతీష్ వర్మనిర్మాత
శ్రీచరణ్ పాకాల
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అల్లరి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కితకితలు, బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. నాంది చిత్రం వంటి సూపర్ హిట్ తర్వాత యాక్షన్ చిత్రాల వైపు తన పంథాను మార్చుకున్నాడు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ మీకోసం.
అల్లరి నరేష్ అసలు పేరు?
ఎడారా నరేష్
అల్లరి నరేష్ ముద్దు పేరు?
సడెన్ స్టార్
అల్లరి నరేష్ ఎత్తు ఎంత?
6 అడుగులు
అల్లరి నరేష్ తొలి సినిమా?
రఘుబాబు డైరెక్షన్లో వచ్చిన అల్లరి అతని మొదటి చిత్రం. ఈ చిత్రం పేరే తర్వాత అతని ఇంటి పేరుగా మారిపోయింది.
అల్లరి నరేష్ ఎక్కడ పుట్టాడు?
చెన్నై, తమిళనాడు
అల్లరి నరేష్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జూన్ 30, 1982
అల్లరి నరేష్‌కు వివాహం అయిందా?
విరూప కంటమనేనితో (2015) అల్లరి నరేష్‌కు పెళ్లి జరిగింది.
అల్లరి నరేష్ ఫస్ట్ క్రష్ ఎవరు?
ఫర్జానా. ఈమె అల్లరి నరేష్‌తో కలిసి సీమశాస్త్రి సినిమాలో నటించింది.
అల్లరి నరేష్ ఫెవరెట్ హీరో?
నాగార్జున
అల్లరి నరేష్ తొలి హిట్ సినిమా?
తొలి చిత్రం అల్లరి మంచి గుర్తింపు తెచ్చింది. బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, నాంది, కితకితలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
అల్లరి నరేష్‌కు ఇష్టమైన కలర్?
వైట్ అండ్ బ్లాక్
అల్లరి నరేష్‌కు ఇష్టమైన సినిమా?
గీతాంజలి
అల్లరి నరేష్ తల్లిదండ్రుల పేర్లు?
సరస్వతి కుమారి, ఈవీవీ సత్యనారాయణ
అల్లరి నరేష్‌కు ఇష్టమైన ప్రదేశం?
అమెరికా
అల్లరి నరేష్ చదువు?
B.com
అల్లరి నరేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.
అల్లరి నరేష్‌కు ఇష్టమైన ఆహారం?
చేపల పులుసు
అల్లరి నరేష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.2.5 నుంచి రూ.3 వరకు తీసుకుంటున్నాడు
అల్లరి నరేష్ అభిరుచులు?
క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం
అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్?
రఘుబాబు
https://www.youtube.com/watch?v=L6NPy-viALo
మార్చి 21 , 2024
Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్ అని తెలుసా? గెస్ట్ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్ వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్ మెుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్ఫుల్ క్యామియో లేదా రోల్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
చిరు క్యామియో
చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్ రీమేక్ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.
https://twitter.com/i/status/1212794102867083265
అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు
మిస్టర్ బచ్చన్
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్ వేసేలా చేసింది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్ అదిరిపోయే క్యామియోస్ ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలు పోషించారు.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్ లెంగ్త్ రోల్లో నటించాడు.
జైలర్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
విక్రమ్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్బంప్స్ తెప్పించారు.
బ్రహ్మాస్త్ర
రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ క్యామియో ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తన మార్క్ చూపించి అదరగొట్టాడు.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్ చేసిన ’మగధీర’, బ్రూస్లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేయడం విశేషం.
లాల్ సింగ్ చద్దా
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్’ చిత్రంలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ ‘మైక్ టైసన్’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సెప్టెంబర్ 18 , 2024
Kalki 2898 AD: రామ్‌చరణ్ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్ వైడ్‌గా సినిమాపై అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్ షురూ చేశారు.
క్లింకారకు స్పెషల్ గిఫ్ట్
సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.
చిన్నారులపై ఫోకస్
సాధారణంగా ఏ సినిమా మేకర్స్ అయినా రిలీజ్ సందర్భంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల కిడ్స్ను టార్గెట్ చేస్తూ 'బుజ్జి అండ్ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.
కారణం ఇదేనా!
‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్ సిరీస్ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.
కల్కి రన్‌టైమ్ లాక్?
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు.
జూన్ 03 , 2024
Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
నటినటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా, నాగ మహేష్, రమేష్ రెడ్డి
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జాదవ్
సంగీతం: సాయిచరణ్ పాకాల
ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. తద్వారా మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్ హిట్ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి:
నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్(అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అసలు ఈ శివకుమార్ ఎవరు?. హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్ ఎలా చెక్ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే:
సీరియస్ పోలీసు ఆఫీసర్ రోల్లో అల్లరి నరేష్ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్ మిర్నా మీనన్ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికంగా:
దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్ సీన్ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటననేపథ్య సంగీతంయాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ సీన్స్‌సాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
మే 05 , 2023
This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.
రామబాణం
హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది.
ఉగ్రం
నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
ది కేరళ స్టోరీ
విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది.
విరూపాక్ష(మళయాలం)
తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.
అరంగేట్రం
కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
యాద్గిరి అండ్ సన్స్
వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.
OTT విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4MeterMovieTeluguNetflix May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
మే 02 , 2023
Ananya Nagalla: ఇండస్ట్రీలో కమిట్మెంట్పై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్గా, మరికొన్నింటిలో క్యారెక్టర్ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె నటించి పొట్టేల్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనన్య నాగళ్ల హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించగా అనన్యకు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె ఇచ్చిన అదిరిపోయే సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ సినిమా పొట్టేల్. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్ ట్రైలర్ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్మెంట్ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్ అగ్రిమెంట్లోనే కమిట్మెంట్ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.
https://twitter.com/tfpcin/status/1847262295266865248
నెగిటివ్ వైపే చూస్తున్నారు: అనన్య
మనిషి జీవితంలో లాగానే ఇండస్ట్రీలో కూడా నెగిటివ్, పాజిటివ్ అనే రెండు అంశాలు ఉంటాయని అనన్య అన్నారు. మీరు ఎక్కువగా నెగిటివ్ వైపే చూస్తున్నరంటూ రిపోర్టర్‌కు చురకలు అంటించారు. ఇండస్ట్రీలో ఛాన్స్ ఇచ్చే ముందు కమిట్మెంట్ ఉంటుందనేది బుల్ షిట్ వ్యవహారమంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై రిపోర్టర్ మాట్లాడుతూ ‘కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు (రెమ్యూనరేష్), ఇవ్వకపోతే ఒక రేటు ఉంటుందని ఇండస్ట్రీ వాళ్లే చెబుతుంటారు' అని అన్నారు. అప్పుడు అనన్య బదులిస్తూ ‘మీరు ఎలాంటి ఎక్స్పిరియన్స్ లేకుండా విన్నమాట చెబుతున్నారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నా. కమిట్మెంట్ ఇక్కడ లేదు' అంటూ ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్
అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్ చేశారు. మహిళా రిపోర్టర్ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498
ఫ్లైట్‌లో అనన్య ప్రమోషన్స్
‘పొట్టేల్’ చిత్రంలో చంద్ర కృష్ణ, అనన్య జంటగా నటించారు. ఈ నెల 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నటి అనన్య నాగళ్ల విమానంలో చిత్ర ప్రమోషన్స్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మూవీ పోస్టర్లు, కరపత్రాలు పంచి పెట్టింది. తమ సినిమాను చూసి ఆదరించాలని కోరింది. అనన్యతో పాటు ‘పొట్టేల్’ టీమ్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొత్త తరహా ప్రమోషన్స్‌కు అనన్య నాంది పలికారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.
https://twitter.com/wareymedia/status/1846883443424272530
అక్టోబర్ 19 , 2024
Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున స్పెషల్ పోస్టు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531
రెండేళ్లుగా ప్రేమాయణం!
నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.
సమంతతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్' అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
సమంత కంటే చాలా బోల్డ్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 08 , 2024
Failure Hero’s: స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా విఫలమవుతున్న టాలీవుడ్ హీరోలు తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవా నడుస్తోంది. దిగ్గజ నటుల కుటుంబం నుంచి వచ్చిన వారు ఇప్పుడు స్టార్ హీరోలుగా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, మహేశ్ బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లు టాలీవుడ్లో దిగ్గజ హీరోలుగా స్థిరపడ్డారు. అయితే స్టార్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కాలక్రమంలో కొందరు అవకాశాలు లేక సినిమాలకు దూరం కాగా, మరికొందరు ఉపయోగించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చుద్దాం.
అక్కినేని అఖిల్:
అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే అతడు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ కొట్టిన అఖిల్.. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఏజెంట్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఫలితంగా అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంది.
అల్లు శిరీష్:
చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ (Allu Sirish) మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఊర్వశివో.. రాక్షసివో’ ఫెయిల్యూర్స్‌తో శిరీష్ సినీ కెరీర్ మరింత డల్ అయ్యింది.
అల్లరి నరేష్:
దిగ్గజ హాస్య దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నరేష్ (Allari Naresh) తన తొలి చిత్రం ‘అల్లరి’ తోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ‘తొట్టి గ్యాంగ్’, ‘సీమశాస్త్రి’, ‘బెండు అప్పారావు’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ దశలో కామెడీ స్టార్‌గా ఎదుగుతున్నట్లే కనిపించిన నరేష్.. వరుస ఫ్లాప్‌లతో ఆ ట్యాగ్‌కు దూరమయ్యాడు. వరుసగా సినిమాలు చేసినా అవేమి చెప్పుకోదగ్గ హిట్స్ ఇవ్వకపోవడంతో నరేష్‌కు హీరో అవకాశాలు తగ్గాయి. దీంతో కారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నరేష్.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలతో అలరించాడు. ఇటీవల ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానికం’ సినిమాలతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు నరేష్.
సుశాంత్:
అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ (Sushanth) 2008లో కాళిదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవగా తర్వాతి ఏడాది వచ్చిన కరెంటు మూవీతో సుశాంత్ పర్వాలేదనిపించాడు. కానీ అడ్డా, దొంగాట, ఆటాడుకుందా రా, చిలాసౌ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సుశాంత్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా వైకుంఠపురం చిత్రంలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సుశాంత్ రావణాసుర, భోళాశంకర్ చిత్రాల్లో నటించారు.
ఆది పినిశెట్టి:
దిగ్గజ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఆది పినిశెట్టి (Aadi pinisetty) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2006లో ఒక V చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద హీరో రెంజ్ సంపాదించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తున్నాడు.
ఆది:
నటుడు సాయికుమార్ వారసుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ తో మంచి యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, గరం వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్ ఒడిదొడుకులకు లోనైంది. దీంతో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇటీవలే ‘మేక పులి’ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నాడు.
రాజా గౌతం:
హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతం 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గౌతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ 2014లో ‘బాసంతి’ సినిమాతో గౌతమ్ ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఫెయిలవ్వగా ఆ తర్వాత మను, బ్రేక్ ఔట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.
అరుణ్ దాసరి:
టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంతో మంది నటులను స్టార్ హీరోలుగా తీర్చిదిద్దారు. అలాంటి దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అరుణ్ దాసరి తెలుగు ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమయ్యారు. 2001లో చిన్నా సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన అరుణ్ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘ఆది విష్ణు’ చిత్రం సైతం ఫ్లాప్‌గా నిలవడంతో అరుణ్ హీరో కెరీర్ మసకబారిపోయింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఏప్రిల్ 03 , 2023
Nandini Rai: ఎద పొంగులతో రెచ్చిపోయిన నందిని రాయ్.. ఈమె చాలా హాట్ గురూ!
ప్రముఖ నటి నందిని రాయ్ తన హాట్ అందాలతో మరోమారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ బ్రాలో ఎద పొంగులను ఆరబోసి రచ్చ రచ్చ చేసింది.
ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ హాట్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందిని రాయ్ ఇండస్ట్రీలోకి రాక ముందు మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకుంది.
2010లో మిస్ ఆంధ్రాగా ఎంపికైన ఈ భామ.. ఆ తర్వాత 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసింది.
2011లో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రం ద్వారా నందిని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘మాయ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తెలుగు షోలో నందిని రాయ్ పాల్గొంది. తన అందం, అభినయం, గ్లామర్‌తో ఆ సీజన్లో వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన నందినికి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్ వరుస అవకాశాలు అందేలా చేశాయి. దీంతో ఆమె ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజనీ’, ‘కోతి కొమ్మచ్చి’ చిత్రాల్లో నటించింది.
ఈ ఏడాది విడుదలైన వారసుడు, భాగ్‌సాలే, సీఎస్ఐ సనాతన్ మూవీల్లోనూ నందిని రాయ్ మెరిసింది. అలాగే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి వెబ్ సిరీస్‌లలోనూ ఆమె అదరగొట్టింది.
ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లను నిర్వహిస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్స్టాగ్రామ్ ఖాతాను 5.3 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె ఏ హాట్ ఫొటోను పోస్టు చేసినా వారు విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు.
నవంబర్ 15 , 2023
Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్ కెరీర్ బెస్ట్ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: పాయల్ రాజ్‌పూత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమిర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకత్వం: అజయ్ భూపతి
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి
నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
విడుదల: 17-11-2023
‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమాతోనే నటి పాయల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి దగ్గరైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్లు ఈ ఆసక్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మంగళవారం కథేంటి? తెరపై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయల్- అజయ్‌లకు విజయాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.
కథ
మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామదేవత మాలచ్చమ్మ జాతర జరిపించకపోవడమే ఇందుకు కారణమని ఊరి ప్రజలు భావిస్తారు. అయితే ఈ మిస్టరీ మర్డర్స్ వెనుక ఏదో కుట్ర ఉందని ఎస్ఐ (నందితాశ్వేత) భావిస్తుంది. కానీ, ఊరి జమీందారు ప్రకాశం (చైతన్య కృష్ణ) మాటలకు కట్టుబడి ఇమె ఇన్వేస్టిగేషన్‌కు ఎవరూ సరిగా సహకరించరు. మరి ఆ హత్యలకు వెనుక ఉన్న మర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయల్ రాజ్‌పుత్) తిరుగుతోందని ఊరి ప్రజలు ఎందుకు భ్రమపడ్డారు? ఈ హత్యలకు శైలుకు సంబంధం ఉందా? మహాలక్ష్మీపురం నుంచి ఆమె వెలివేయబడటానికి కారణం ఏమిటి? అన్నదే మంగళవారం సినిమా కథ.
ఎలా సాగిందంటే?
సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్నతనం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరి గోడలపై రాయడం.. వారంతా గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్ ఇస్తాయి. ద్వితీయార్ధం మళ్లీ శైలు గతంతోనే మొదలవుతుంది. శైలుకు జరిగిన అన్యాయం, ఆమెకున్న మానసిక రుగ్మత, దానివల్ల తను పడే యాతన రెండో పార్ట్‌లో చూపించారు. పతాక సన్నివేశాలు మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?
శైలు పాత్రలో పాయల్ చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్‌తో పాటు నటనలోనూ అదరగొట్టింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కగా జీవించింది. ఎస్సై పాత్రలో నందితా శ్వేత ఆద్యంతం సీరియస్ లుక్‌లో కనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. అజయ్ ఘోష్ - లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. జమిందారుగా చైతన్య కృష్ణ పాత్రను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు అజయ్ ఈ సినిమాను మిస్టీక్ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్ టచ్ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్రమ సంబంధాల వ్యవహారం, డబల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్లో మైనస్లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజయ్ రాసుకున్న కథ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. కానీ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. అజనీష్ నేపథ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాటను స్వరపరిచిన తీరు.. దాన్ని తెరపై చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్రహణం మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
పాయల్ నటన, గ్లామర్‌అజనీష్ సంగీతంట్విస్ట్‌లు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం ముగింపు
రేటింగ్ : 3/5
నవంబర్ 17 , 2023
Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు.
దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
సంగీతం: వికాస్ బాడిస
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ: 20-07-2023
టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని సమర్పిస్తుండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ఈ ‘హిడింబ’ కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కథేంటి
అభయ్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ శిక్షణలో ఉండగా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్దరూ ఓ కేసు విషయమై మళ్లీ కలిసి పని చేయాల్సి వస్తుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో బోయ అనే కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసును ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు? అసలు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేరస్థుడెవరు? అండమాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే..
ఎవరెలా చేశారంటే
నటుడిగా అశ్విన్‌ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్రలో నందితా నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మకరంద్ దేశ్ పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రను దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఎలా సాగిందంటే
టైటిల్స్ కార్డ్స్‌తోనే దర్శకుడు అనిల్ కన్నెగంటి నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నగరంలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆద్యను రంగంలోకి దింపడం.. ఇలా చకచకా కథ పరుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆరంభమైనప్పటి నుంచి సినిమా ఒక్కసారిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. పెద్దగా కష్టపడకుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించదు. మధ్యలో ఓ పాటతో నాయకానాయికల ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దాంట్లో పెద్దగా ఫీల్ కనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం సర్ప్రైజ్. హీరోలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ఎపిసోడ్ అది. పతాక సన్నివేశాలు ఊహలకు అందని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తికరంగా అనిపించదు.
డైరెక్షన్ & టెక్నికల్ అంశాలు
దర్శకుడు అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా, దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసినప్పుడు దీంట్లో ఏదో వెలితి కనిపిస్తుంది. చాలా సన్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్రథమార్ధంలో మానవ అవయవాల అక్రమ రవాణా ఎపిసోడ్‌ను టచ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వలేదు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంట్విస్ట్‌లుపోరాట ఘట్టాలు,నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్
రేటింగ్ 2.5/5
https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
ఆగస్టు 08 , 2023
Anni Manchi Sakunamule Review: కామెడీ, ఏమోషనల్ సీన్స్ ఓకే.. కానీ!
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, గౌతమి, రావు రమేష్, వెన్నెల కిషోర్
డైరెక్టర్: B.V. నందిని రెడ్డి
సంగీతం: మిక్కీ J. మేయర్
నిర్మాత : ప్రియాంక దత్
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా చేసిన తాజా చిత్రం ‘అన్ని మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ఇవాళ (మే 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నందిని రెడ్డి మరో హిట్ కొట్టారా? లేదా? శోభన్ తన నటనతో ఆకట్టుకున్నాడా? వంటి అంశాలు ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సినిమా కథ మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రారంభమవుతుంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీరికి పుట్టిన హీరో, హీరోయిన్లు (ఆర్య, రిషి) పొరపాటున మారిపోతారు. వైద్యులు ఒకరిబిడ్డను మరొకరికి అప్పగిస్తారు. అయితే నరేష్, రాజేంద్ర ప్రసాద్‌లకు వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. ఆర్య, రిషిలు పెరిగి పెద్దవారైనట్లే వారి ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఆ వివాదాన్ని వారు ఎలా పరిష్కరించుకున్నారు? పిల్లలు మారిపోయిన విషయాన్ని వారు ఎలా తెలుకున్నారు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
హీరో సంతోష్ శోభన్ తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి పాత్రలో శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో శోభన్ చాలా మెరుగైనట్లు కనిపించాడు. హీరోయిన్ మాళవిక సైతం తన పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. మాళవిక, శోభన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ జంట స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక సినిమాకు ప్రధాన బలం ఇతర తారాగణం అని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి వంటి అనుభవజ్ఞులైన నటులు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో తమ నటన పాఠవాలను చాటుకున్నారు.
సాంకేతికంగా…
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకు నందిని రెడ్డి పెట్టింది పేరు. అన్నీ మంచి శకునములే సినిమా ద్వారా సింపుల్ ఫ్యామిలీ డ్రామాను ప్రజెంట్ చేయాలని భావించి నందిని రెడ్డి తడబడింది.
అనుకున్న కథను తెరపై చూపించడంతో డైరెక్టర్ విఫలమయ్యారు. కొన్ని సీన్లు మరీ నత్తనడకన సాగినట్లు అనిపిస్తాయి. ఎమోషనల్, కామెడీ సీన్స్ మినహా సినిమా అంతా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఇక మిక్కీ J. మేయర్ అందించిన పాటలు కూడా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్ లుక్‌లో కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
సంతోష్ శోభన్ నటనకామెడీఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
సాగదీతబోరింగ్ సీన్స్‌పాటలునేపథ్య సంగీతం
రేటింగ్: 2.5/5
మే 18 , 2023
NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !
తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మిస్ ఇండియా 2023
మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న జరిగిన ఫైనల్స్ జరగ్గా… ఆమె అందానికి అందరూ దాసోహం అయ్యారు. విజేతగా ప్రకటిస్తూ జడ్జీలు నిర్ణయం తీసుకున్నారు. కిరీటాన్ని పెట్టి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు బాటలు వేశారు. దీంతో నందినీ గుప్తా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
చిన్ననాటి కల
నందినీ 10 ఏళ్ల వయసు నుంచే మిస్ ఇండియా కావాలని కలలు కంటోంది. ఈ విషయాన్ని తన బయోలో వెెల్లడించింది ఈ అందాల తార. చిన్నతనంలోనే వివిధ కార్యక్రమాలకు హోస్టింగ్ చేయడం పట్ల ఆసక్తి చూపించేదట. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంవైపు అడుగులు వేసింది నందినీ. చిన్న పట్టణం నుంచి ప్రపంచ వేదికపైకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించింది. “రోలర్ కోస్టర్ రైడ్ కంటే ఈ ప్రయాణం తక్కువేం కాదు. కష్టం, సంకల్పం, అంతులేని మద్దతు నా విజయానికి కారణం. ప్రతిక్షణం దేశం గర్వించేలా చేసేందుకు కష్టపడతాను. ఈ విజయం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అంకితం” అని పేర్కొంది.
స్ఫూర్తినిచ్చింది వీళ్లే
రతన్ టాటా, ప్రియాంక చోప్రా తనకు ఆదర్శమని నందినీ గుప్తా వెల్లడించారు. “రతన్ టాటా నా జీవితంలో అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి. మానవత్వంతో సంపాదించిన చాలా మెుత్తం చారిటీకి ఖర్చు చేస్తారు. ఎంతో మంది ఆయన్ని ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఉంటారు. అందుకే రతన్ టాటా నాకు స్ఫూర్తి” అని చెప్పింది. అంతేకాదు, ప్రియాంక చోప్రా కూడా అంతే స్ఫూర్తినిచ్చినట్లు వెల్లడించింది. చిన్న వయసులోనే భారతదేశం గర్వించేలా ప్రపంచ వేదికపై మిస్ వరల్డ్‌గా నిలిచిన ఆమె ప్రయాణం తనను ప్రేరేపించిందని చెప్పింది నందినీ గుప్తా.
నందినీ లక్ష్యం
రాజస్థాన్ కోటాలో లభించే అత్యంత మన్నికైన ఫాబ్రిక్ గురించి ప్రచారం కల్పించాలని చూస్తోంది మిస్ ఇండియా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి ప్రచారం కల్పించి నేతన్నలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు… చాలామందికి ఉపాధి కల్పించాలనేది ఆమె లక్ష్యం.
విశ్వ సుందరి అవుతుందా?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే 71వ మిస్ వరల్డ్ పోటీల్లో నందినీ గుప్తా పోటీ పడబోతుంది.ఇందుకోసం ఎంతవరకైనా కష్టపడతానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి, ఈ పోటీల్లో గెలిచి విశ్వ సుందరిగా రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి.
ఏప్రిల్ 17 , 2023
MM కీరవాణి గురించి ఇప్పటి వరకు మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
]1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు 8 ఫిల్మ్ పేర్ అవార్డులు, 11 నంది అవార్డులు వచ్చాయి. తాజాగా RRR చిత్రంలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నారు.అవార్డులు - అంతర్జాతీయ గుర్తింపు
ఫిబ్రవరి 13 , 2023
సమంత త్వరగా కోలుకో.. మేమున్నాం అంటున్న టాలీవుడ్
]సమంత ఈ వ్యాధి బారిన పడడానికి చై, సామ్ బ్రేకప్పే కారణమని కొందరు అంటున్నారు. సమంత కుంగుబాటుకు గురైందని.. తద్వారా ఈ వ్యాధి అటాక్ చేసినట్లు చెబుతున్నారు. నాగచైతన్యని కొందరు నిందిస్తున్నారు.విడిపోవడమే కారణమా?
ఫిబ్రవరి 11 , 2023
శర్వానంద్- రక్షితారెడ్డి నిశ్చితార్థం... రక్షితా రెడ్డికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
]ఎంగియం ఏ పొద్దుం అనే తమిళ సినిమాలో నటించి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో SIIMA అవార్డు సాధించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.అవార్డులు ?
ఫిబ్రవరి 11 , 2023
Tirumala Laddu : సినీ హీరోలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!
తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్‌కు వార్నింగ్!
తిరుమల లడ్డుపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన వివాదస్పద ట్వీట్‌పై పవన్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్‌కు సంబంధం ఏంటని నిలదీశారు. తిరుపతిలో మరోమారు అపవిత్రం జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను ఇస్లాంని నిందించానా? లేక క్రిస్టియానిటీని తప్పుబట్టానా? అంటూ పవన్ అన్నారు. హిందువుల దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? అంటూ ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏం జరిగింతో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందని కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు.
https://twitter.com/i/status/1838470602098913294
‘అపహాస్యం చేస్తే ఊరుకోను’
ప్రకాష్ రాజ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో వాళ్లు కూడా మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని పవన్ హెచ్చరించారు. మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. ‘లడ్డు చాలా సెన్సిటివ్’ అంటూ జోకులు వేస్తున్నారని నటుడు కార్తీ పేరు చెప్పకుండానే ఫైర్ అయ్యారు. మరోమారు అలా అనొద్దని పరోక్షంగా హెచ్చరించారు. అలా చెప్పే ధైర్యం కూడా చేయొద్దన్నారు. నటులుగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని స్ట్రాంగ్‌గా చెప్పారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండని సూచించారు.
https://twitter.com/i/status/1838465598713372823
‘నటుల కంటే సనాతన ధర్మమే గొప్పది’
టికెట్ల కోసం ఎన్నో ప్రయాశలు పడి సినిమా చూసే అభిమానులకు సైతం పవన్ చురకలు అంటించారు. మతాలతో సంబంధం లేకుండా సినిమాలు చూసే ప్రేక్షకుల్లో కూడా హిందువులు ఉన్నారని గుర్తుచేశారు. వారు కూడా తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడాలని సూచించారు. సినిమాల గురించి గంటలు గంటలు మాట్లాడతారని, సనాతన ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. హీరోల కంటే పైస్థాయిలో హిందూ ధర్మాన్ని చూడాలని, ఒక హీరోగా తానే ఈ విషయాన్ని చెబుతున్నానని సినీ లవర్స్‌కు విజ్ఞప్తి చేశారు. హిందువులంటే మెత్తని మనుషులు ఏం చేయరన్న భావన సమాజంలో ఉందని పవన్ అన్నారు. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. మీకు నమ్మకాలు లేకుంటే ఇంట్లో కూర్చోవాలని అంతే కాని మమ్మల్ని ఏమి అనొద్దని, సెక్యులరిజం గురించి సూక్తులు చెప్పొద్దని పేర్కొన్నారు.
పవన్‌కు సారి చెప్పిన కార్తీ
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. తిరుమల వివాదం గురించి మాట్లాడమని కార్తీని కోరగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు.
https://twitter.com/CinemaniaIndia/status/1838484585325215936
వచ్చాక మీకు ఆన్సర్ ఇస్తా: ప్రకాష్ రాజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ట్వీట్ చేశారు. 'పవన్ కల్యాణ్ గారు ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.
https://twitter.com/prakashraaj/status/1838505132025168154
అంతకుముందు ఏం జరిగిందంటే?
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో నటుడు ప్రకాష్ ఇటీవల శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం ఎక్స్ వేదికగా స్పదించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కోట్ చేస్తూ ‘మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు) #జస్ట్ ఆస్కింగ్’ అని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే నటుడు మంచు విష్ణు స్పందించారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అంటూ వ్యాఖ్యానించారు. మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ హెచ్చరించారు.
https://twitter.com/prakashraaj/status/1837104811419775430
సెప్టెంబర్ 24 , 2024
Bangalore Rave Party Case: నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చిన పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటి హేమ (Actress Hema) పేరు వినిపించడమే ఇందుకు కారణం. నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని చెప్పుకొచ్చారు. తను డ్రగ్స్ తీసుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
నటి హేమకు షాక్
బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై ఏకంగా 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఇందులో నటి హేమ పేరును సైతం చేర్చడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటి హేమ (Actress Hema) పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్‌ను ఆమె సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఛార్జ్ షీట్‌కు జత చేశారు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా ఈ ఛార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన మరో 9 మందిపై కూడా ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా చేర్చడం గమనార్హం. అయితే హేమతో పాటు హాజరైన మరో యాక్టర్‌కు మాత్రం డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సమసిపోయిందనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఆసక్తికరంగా మారింది.
హేమను అరెస్టు చేస్తారా?
బెంగళూరు పార్టీ కేసుకు గతంలో అరెస్టు అయిన హేమకు జూన్‌లో అక్కడి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దగ్గర డ్రగ్స్ లభించలేదని ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను హేమకు మంజూరు చేశారు. అయితే తాజాగా చార్జ్‌షీట్‌లో దాఖలైన నేపథ్యంలో ఆమె బెయిల్ రద్దయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు తిరిగి హేమను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
‘నిరూపిస్తే దేనికైనా రెడీ’
బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. తన నుంచి ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ బెంగళూరు పోలీసులు తీసుకోలేదని ఆమె తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. మరి బెంగళూరు రేవ్ పార్టీ కేసు మున్ముందు ఎలాంటి ములుపులు తిరుగుతోందనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ 12 , 2024
Simbaa Movie Review: ‘సింబా’ ఇచ్చిన సందేశం బాగుంది.. కానీ!
నటీనటులు : జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, వశిష్ట ఎన్. సింహ, దివి వడ్త్యా, కబిర్ దుహన్ సింగ్, శ్రీనాథ్ మాగంటి
డైరెక్టర్ : మురళి మనోహార్
సంగీతం : కృష్ణ సౌరభ్
నిర్మాత : సంపత్ నంది, డి. రాజేందర్ రెడ్డి
విడుదల: 09-08-2024
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
హైదరాబాద్‌లో పార్థ గ్రూప్‌కి చెందిన కీలక వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అదే గ్రూప్‌నకు చెందిన మరో వ్యక్తిని కూడా చంపేస్తారు. అయితే ఈ హత్యల వెనక స్కూల్ టీచర్ అక్షిక (అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వస్తారు. వాళ్లని అరెస్టు కూడా చేస్తారు. ఈ క్రమంలో ఈసారి అందరు చూస్తుండగానే మరో హత్య జరుగుతుంది. ఆ హత్యలో ప్రముఖ డాక్టర్ పాలుపంచుకోవడంతో కథ పోలుసులు అయోమయంలో పడతారు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ (కబీర్‌సింగ్) మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? ఈ మర్డర్స్‌కు ఫారెస్ట్ మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? పార్థతో అతడికి ఉన్న విభేదాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతి బాబు ఆకట్టుకున్నారు. ఓ వైపు చక్కటి హావా భావాలను పలికిస్తూనే యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టారు. ఇక టీచర్ అక్షిక పాత్రలో అనసూయ తనదైన నటనతో మెప్పించింది. ఏమాత్రం తడబాటు లేకుండా తనకిచ్చిన పాత్రలో జీవించింది. అటు దివి, మాగంటి శ్రీనాథ్, వశిష్ఠ సింహా పాత్రలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విశిష్ఠ సింహా నటన మెప్పిస్తుంది. సీనియర్ నటీమణులు గౌతమి, కస్తూరి ద్వితీయార్థంలో సందడి చేశారు. ప్రతినాయకుడిగా నటించిన కబీర్ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు మురళి మనోహర్ క్రైమ్ & ఇన్వెస్టిగేటివ్ స్టోరీకి పర్యావరణ అంశాలను జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనసూయ పాత్ర పరిచయం, దివి-మాగంటి శ్రీనాథ్ లవ్ ట్రాక్, రెండు హత్యల తాలుకూ సంఘటనలతో తొలి భాగాన్ని ఆసక్తిగా నడిపించారు డైరెక్టర్. అయితే ఈ మధ్యలో వచ్చే పోలీసు ఇన్వెస్టిగేషన్ రొటిన్‌గా అనిపిస్తుంది. అసలు లాజికల్‌గా ఉండదు. ఇక సెకండాఫ్‌లో ఫారెస్ట్ మ్యాన్‌గా జగపతిబాటు ఎంట్రీ, చెట్లని రక్షించడం, చెట్లను ప్రేమించడం వంటి సందేశంతో వచ్చే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. కానీ, హృదయాలను హత్తుకునే సంభాషణలు లేకపోవడంతో దర్శకుడు ఇచ్చిన సందేశం ఆడియన్స్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. బయోలాజికల్ మెమెురీ కాన్సెప్ట్ మాత్రం సినిమాలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫారెస్ట్ మ్యాన్ ఎపిసోడ్‌ను ఇంకాస్త బెటర్‌గా ప్రెజంట్ చేసి ఉంటే బాగుండేది. మూవీ కాన్పెప్ట్ బాగున్నా సమర్థవంతంగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లడంతో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే కృష్ణ సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కృష్ణప్రసాద్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
జగపతిబాబు, అనసూయ నటనసందేశంద్వితియార్థం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 09 , 2024
This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో రిలీజయ్యే చిత్రాలు
కీడా కోలా
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మా ఊరి పొలిమేర 2
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
12 ఫెయిల్
విక్రాంత్ మస్సే హీరోగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
స్కంద
యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
అక్టోబర్ 30 , 2023