• TFIDB EN
  • నేనూ.. శైలజా...
    UTelugu2h 15m
    హీరో హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. కానీ, హరి (రామ్‌) లవ్‌ను శైలజా (కీర్తి సురేష్‌) రిజెక్ట్ చేస్తుంది. అయితే దానికి కారణం ఏంటో తెలుసుకున్న హీరో ఏం చేశాడు? శైలజకు ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ పోతినేని
    హరి
    కీర్తి సురేష్
    శైలజ అకా సాయిలు
    సత్యరాజ్
    శైలజ తండ్రి
    ప్రిన్స్ సెసిల్
    శైలజ సోదరుడు
    శ్రీముఖి
    హరి కవల సోదరి
    ప్రదీప్ రావత్
    మహర్షి
    రోహిణి
    శైలజ తల్లి
    ధన్య బాలకృష్ణ
    కీర్తి
    హిమజ
    పనిమనిషి
    విజయకుమార్
    శైలజ తాత
    నరేష్
    హరి తండ్రి
    సుడిగాలి సుధీర్
    హరి స్నేహితుడు
    వంశీ కృష్ణ
    విలన్
    చైతన్య కృష్ణ
    రాజశ్రీ కొడుకు
    రాజశ్రీ నాయర్శైలజ అత్త
    కృష్ణ భగవాన్
    శ్రీనివాస స్నేహితుడు
    ప్రగతి మహావాది
    హరి తల్లి
    బేబీ యోధపూజ
    తాన్యా హోప్
    చిత్ర శుక్లా
    అతిథి పాత్ర
    సిబ్బంది
    కిషోర్ తిరుమల
    దర్శకుడు
    స్రవంతి రవి కిషోర్
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Antony Thattil: కీర్తి సురేష్‌ పెళ్లాడే ఆంటోని తట్టిల్‌ ఎంత గొప్పోడో తెలుసా?</strong>
    Antony Thattil: కీర్తి సురేష్‌ పెళ్లాడే ఆంటోని తట్టిల్‌ ఎంత గొప్పోడో తెలుసా?
    యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthy Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంటోనిగురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోని తట్టిల్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; ఆంటోని తట్టిల్‌ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే యంగ్‌ బిజినెస్‌ మ్యాన్‌గా ఆంటోని రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు.&nbsp; తొలుత ‘ఎస్పిరోస్‌ విండో సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించారు. దానిని దుబాయ్‌కు విస్తరించి అక్కడ కేంద్రంగా పని చేస్తున్నారు.&nbsp; ఆ తర్వాత కైపాలత్‌ హబీబ్‌ ఫారుఖీ అనే బిజినెస్‌ మెన్‌తో కలిసి మరో కంపెనీని చెన్నైలో రిజిస్టర్‌ చేశారు. వారితో పాటు మరో ముగ్గురు కంపెనీలో షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలతో పాటు ఆంటోనీకి పలు రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి. హోమ్‌ టౌన్‌ కొచ్చిలో వాటి ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.&nbsp; ప్రముఖ నటి కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు.&nbsp; కీర్తి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తుండగా ఆంటోని ఆమెతో రిలేషన్‌ను కొనసాగిస్తూనే చదువుపై ఫోకస్‌ పెట్టాడు.&nbsp; మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని ఆంటోని (Antony Thattil) చిన్నప్పటి నుంచి కలలు కనేవారు. తన లక్ష్యానికి కీర్తితో ఉన్న రిలేషన్ అడ్డురాకుండా రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు.&nbsp; ఫలితంగా అటు బిజినెస్‌, ఇటు లవ్‌ లైఫ్‌లోనూ సక్సెస్‌ అయ్యి ప్రస్తుత యువతకు ఆంటోని ఎంతో ప్రేరణగా నిలస్తున్నారు.&nbsp; డిసెంబర్‌ 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి (Keerthy Suresh Marriage) జరగనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. పెళ్లి పనులు కూడా మెుదలైనట్లు సమాచారం.&nbsp; అంటోనీ (Antony Thattil)కి తమ కూతుర్ని ఇచ్చేందుకు కీర్తి తల్లిదండ్రులు సురేశ్‌, మేనక ఎంతో సంతృప్తిగా ఉన్నారట. వీరి పెళ్లికి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట.&nbsp; ఇదిలా ఉంటే ఇటీవల తన పెళ్లి (Keerthy Suresh Marriage) గురించి కీర్తి సురేష్ స్పందించింది. పెళ్లి ఎప్పుడని ఆంగ్ల పత్రిక ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అంటూ బదులిచ్చింది.&nbsp; గతేడాది కూడా అంటోనితో ఉన్న రిలేషన్‌ గురించి పరోక్షంగా కీర్తి హింట్ ఇచ్చింది. సరైన సమయం వచ్చిన మిస్టరీ మ్యాన్‌ను బయటపెడతానంటు చెప్పుకొచ్చింది.&nbsp; 2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేశ్. ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించి ఇంప్రెస్‌ చేసింది.&nbsp; తెలుగులో చేసిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్‌ లైఫ్‌కు టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది.&nbsp; ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
    నవంబర్ 19 , 2024
    <strong>Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!</strong>
    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది.&nbsp; చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్‌' మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు. ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.&nbsp; ఐరెన్‌ లెగ్‌గా ముద్ర కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.&nbsp; మహానటితో కెరీర్‌ టర్నింగ్‌ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.&nbsp; వరుస ఫెయిల్యూర్స్ ‘మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,&nbsp; రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.&nbsp; కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌ గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు. https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk కీర్తి స్పెషల్‌ టాలెంట్‌ కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్‌' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి.. ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
    అక్టోబర్ 17 , 2024
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారువారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే కీర్తి సురేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Keerthy Suresh)&nbsp; విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; కీర్తి సురేష్ దేనికి ఫేమస్? కీర్తి సురేష్.. మహానటి, సర్కారువారి పాట వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. కీర్తి సురేష్ వయస్సు ఎంత? 1992, అక్టోబర్ 17న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు  &nbsp;కీర్తి సురేష్ ముద్దు పేరు? కీర్తమ్మ కీర్తి సురేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 2 అంగుళాలు&nbsp; కీర్తి సురేష్ ఎక్కడ పుట్టింది? చెన్నై Screengrab Instagram: keerthysureshofficial కీర్తి సురేష్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు కీర్తి సురేష్ అభిరుచులు? యోగ, ట్రావెలింగ్, స్మిమ్మింగ్ కీర్తి సురేష్‌కు ఇష్టమైన ఆహారం? దోశ కీర్తి సురేష్ అభిమాన నటుడు? సూర్య, విజయ్ &nbsp;తెలుగులో కీర్తి సురేష్ తొలి సినిమా? నేను శైలజ(2016) కీర్తి సురేష్ నటించిన తొలి తెలుగు సినిమా? శ్రీ కీర్తి సురేష్ ఏం చదివింది? ఫ్యాషన్ డిజైన్‌లో BA హానర్స్  Courtesy Instagram: Keerthy suresh కీర్తి సురేష్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్లు వరకు ఛార్జ్ చేస్తోంది. కీర్తి సురేష్ తల్లిదండ్రుల పేర్లు? సురేష్ కుమార్, మేనక కీర్తి సురేష్‌కు అఫైర్స్ ఉన్నాయా? తమిళంలో కమెడియన్ సతీష్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ఎన్ని అవార్డులు గెలిచింది? మహానటి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి సురేష్ అందుకుంది. తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/keerthysureshofficial/?hl=en కీర్తి సురేష్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? ఇంతవరకు అలాంటి సీన్లలో నటించలేదు కీర్తి సురేష్ ఫెవరెట్ హీరోయిన్ సిమ్రాన్ కీర్తి సురేష్ గురించి మరికొన్ని విషయాలు కీర్తి సురేష్ తండ్రి సురేష్, మలయాళం మెగాస్టార్ మమ్మూటి ఇద్దరు కాలేజీ రోజుల్లో క్లాస్‌మెట్స్&nbsp;తన స్కూల్ డేస్‌లో కీర్తి సురేష్ అనేక స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు గెలుచుకుంది.కీర్తి సురేష్ సోదరి రేవతి మంచి VFX స్పెషలిస్ట్, షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థలో పనిచేస్తోంది.కీర్తి సురేష్ తండ్రి ఫిల్మ్ మేకర్ కాగా ఆమె తల్లి మేనక 100కు పైగా చిత్రాల్లో నటించింది. https://www.youtube.com/watch?v=dCuIkapXKDY
    ఏప్రిల్ 16 , 2024
    <strong>Keerthi Suresh: ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు కీర్తి సురేష్.. అవసరమా?</strong>
    Keerthi Suresh: ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు కీర్తి సురేష్.. అవసరమా?
    స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) అనగానే ముందుగా అందరికీ ‘మహానటి’లో ఆమె చేసిన సావిత్రి పాత్రే గుర్తుకు వస్తుంది. అలాగే ‘నేను శైలజ’, ‘నేను లోకల్‌’, ‘దసరా’ చిత్రాల్లో ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్‌గా కనిపించిన కీర్తినే తెలుగువారికి జ్ఞాపకం వస్తుంది. అటు తమిళంలోనూ ఎక్కడా స్కిన్‌ షో చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్‌ గాడి తప్పిందన్న మాటలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌లో చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్‌ ‘బాబీ జాన్‌’ కీర్తి సురేష్‌కు ఎన్నడు లేనన్ని విమర్శలు తీసుకొస్తోంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; గ్లామర్‌ డోస్‌ పెచ్చిన కీర్తి..! బాలీవుడ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో కలిసి 'బేబీ జాన్‌' అనే చిత్రంలో కీర్తి సురేష్‌ (Keerthi Suresh)&nbsp; నటిస్తోది. హిందీలో ఆమెకు ఇదే ఫస్ట్‌ డైరెక్ట్‌ ఫిల్మ్‌. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ కలిస్‌ తెరకెక్కిస్తున్నారు. దీనిని వన్‌ స్టూడియోస్, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, మురాద్, ఖేతానీ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పెషల్‌ క్యామియో కూడా ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్‌ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ‘బేబీ జాన్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నయన్ మటక్కా’ ప్రొమోను విడుదల చేశారు. నవంబర్ 25న ఫుల్‌ వీడియో సాంగ్‌ రానుంది. అయితే ఈ ప్రోమోలో వరుణ్‌తో కలిసి కీర్తి సురేష్‌ స్టెప్పులు ఇరగదీసింది. క్రేజీ ఎక్స్‌ప్రెషన్స్‌ మెప్పించింది.&nbsp; గతంలో ఎప్పుడు చేయనంత స్కిన్‌ షోను పాటలో చేయడం విశేషం. మీరు ఓ లుక్కేయండి. https://twitter.com/Atlee_dir/status/1860286469799358567 ఏకిపారేస్తున్న నెటిజన్లు తెలుగు, తమిళ చిత్రాల్లో ఇప్పటివరకూ ట్రెడిషనల్‌ పాత్రల్లో మెరిసిన కీర్తి సురేష్‌ (Keerthi Suresh)&nbsp; బాలీవుడ్‌ మూవీ కోసం ఈ స్థాయి అందాల ప్రదర్శన చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం ఈ స్థాయి గ్లామర్‌షోలు అవసరమా అని నిలదిస్తున్నారు. బాలీవుడ్‌కు వెళ్లాక కీర్తి అస్సలు ఆగడం లేదని, ఇక బికిని ఒక్కటే బ్యాలెన్స్ అని విమర్శిస్తున్నారు. శుక్రవారం (నవంబర్‌ 22) రిలీజ్‌ చేసిన 'నయిన్ మటక్కా' పోస్టర్‌లోని కీర్తి బోల్డ్‌ లుక్‌ను హైలెట్ చేస్తున్నారు. ఆమె వరకూ క్రాప్‌ చేసి నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. సౌందర్య లాగా పద్దతిగా కీర్తి సురేష్ ఉంటుందని భావించానని కానీ ఆమె కూడు మెుదలుపెట్టిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇందులో లిప్‌లాక్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెటిజన్లు మరింత ఫైర్ అవుతున్నారు.&nbsp; https://twitter.com/actresshub12/status/1860014335965430164 https://twitter.com/vadakkunanbar/status/1860292687834022060 https://twitter.com/starksscollect/status/1860019946300022889 https://twitter.com/Kishore_krrish5/status/1860309046496247907 https://twitter.com/BharathEditzX/status/1860309038719991922 https://twitter.com/BhargavOG/status/1860302445882278305 చిన్ననాటి స్నేహితుడితో కీర్తి పెళ్లి! యంగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు. ఆంటోని తట్టిల్‌ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే యంగ్‌ బిజినెస్‌ మ్యాన్‌గా రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు. ‘ఎస్పిరోస్‌ విండో సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించి దానిని దుబాయ్‌కు విస్తరించాడు. అలాగే కొచ్చిలో పలు రిసార్ట్స్‌ కూడా ఉన్నాయి.&nbsp; https://twitter.com/MogaliReports/status/1858741516308553729
    నవంబర్ 23 , 2024
    <strong>Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?</strong>
    Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
    నటీనటులు : రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్‌ విజయ్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌ సంగీతం : జేబీ సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన లేటెస్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్‌ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్‌ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్‌ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్‌ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో రాజ్‌ తరుణ్‌ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్‌ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్‌ తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సెకండ్‌ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్‌ విజయ్‌, రఘుబాబు, అంకిత ఠాకూర్‌, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్‌ &amp; యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్‌ పరిచయం, వారి లవ్‌ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్‌ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్‌. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్‌ తరుణ్‌ను ఎన్నో మాస్‌ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్‌ రాజ్‌తరుణ్‌ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్‌ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రాజ్‌తరుణ్‌ నటనలవ్‌ ట్రాక్‌యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ వర్కౌట్‌ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    <strong>Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది?</strong>
    Shivam Bhaje Movie Review: కళ్లు పోయిన హీరోకి దైవ బలంతో చూపు వస్తే.. ఆ తర్వాత ఏం జరింది?
    నటీనటులు :&nbsp; అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ డైరెక్టర్‌ : అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ సంగీతం : వికాస్‌ బడిశా ఎడిటర్‌ : ఛోటా కె. ప్రసాద్‌ నిర్మాత : మహేశ్వర రెడ్డి విడుదల తేదీ : ఆగస్టు 01, 2024 ప్రముఖ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌. అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ రూపొందించిన ఈ చిత్రంలో హైపర్ ఆది, అర్బాజ్‌ ఖాన్‌, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న ‘శివం భజే’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథేంటి చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో శైలజ (దిగంగనా సూర్యవంశీ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్‌లో జాబ్ చేస్తుంటుంది. అయితే&nbsp; ఓ గొడవ కారణంగా చందుకి కళ్లు పోతాయి. శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ పరిణామంతో అతడి కంటికి ఆపరేషన్‌ జరిగి చూపు వస్తుంది. అయితే కొత్త కళ్లు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తుంటాయి. అసలు చందుకి పెట్టిన కళ్ళు ఎవరవి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? శత్రుదేశాలతో ఓ సాధారణ రికవరీ ఏజెంట్‌ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? శివుడి అనుగ్రహంతో చందు నిర్వహించిన కార్యం ఏంటి? కథలో డోగ్రా (కుక్క) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే చందు పాత్రలో హీరో అశ్విన్‌ బాబు అద్భుత నటన కనబరిచాడు. రెండు డైమన్షన్స్‌లో చక్కటి వేరియేషన్స్‌ చూపించాడు. శైలజా పాత్రలో హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీ ఆకట్టుకుంది. అశ్విన్‌, దిగంగన మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. ఇక పోలీసు ఆఫీసర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ మెప్పించాడు. హాస్య నటుడు హైపర్‌ అది తన పంచులతో నవ్వులు పూయించాడు. బ్రహ్మాజీ, మురళి శర్మ తమదైన సెటిల్‌ నటనతో మెస్మరైజ్‌ చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒక మిస్టరీ కథకు డివోషనల్ అంశాలను ముడిపెడుతూ దర్శకుడు అబ్దుల్‌ అప్సర్‌ హుస్సేన్‌ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ఈ క్రైమ్‌ డ్రామాలోని కొన్ని సస్పెన్స్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే శత్రుదేశాల తాడి నేపథ్యంలో అల్లిన స్టోరీ లైన్‌ కూడా మెప్పిస్తుంది. అయితే కథ బాగున్నా స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరపైన ప్రజెంట్‌ చేయలేకపోయాడు. హత్యలకు సంబంధించిన ట్రాక్‌ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. హీరో అశ్విన్‌ బాబు క్యారెక్టర్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్‌ లాజిక్స్‌ దూరంగా అనిపిస్తాయి. కథ స్లోగా సాగడం, తొలి భాగంలో ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్‌ మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు. కథతో సంబంధం లేని సీన్స్‌ ఎక్కువ ఉండటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్‌ సీన్స్‌ను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా ప్రజెంట్‌ చేశారు. వికాస్ బడిస సంగీతం పర్వాలేదు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్‌ అశ్విన్‌ బాబు నటనసస్పెన్స్ సీన్స్‌క్లైమాక్స్‌ మైసన్ పాయింట్స్‌ స్లో నారేషన్‌ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడంఅసందర్భమైన సన్నివేశాలు&nbsp; Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; .
    ఆగస్టు 01 , 2024
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల జాతర చేస్తోంది. ఒక్క పక్క టెలివిజన్ షోలు చేస్తూనే ఇన్‌స్టాలో హాట్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. కొద్దిరోజులుగా శ్రీముఖి ఇన్‌స్టాలో హట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది. తాజాగా మిల్కీ వైట్, లైట్ పింక్ లెహంగాలో ఈ శ్రీముఖి తళుక్కున మెరిసింది. ఎప్పటికప్పుడూ హాట్ ఫొటో షూట్లతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తన ప్రతి గ్లామరస్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. బిగ్ బాస్ 3 రన్నరప్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. అప్పట్లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ పొత్తినేని సిస్టర్ క్యారెక్టర్ చేసింది.&nbsp; తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాలోనూ శ్రీముఖి మెరిసింది. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఈ అల్లరి పిల్ల ఎదురుచూస్తోంది. బీబీజోడీ, పటాస్ వంటి టెలివిజన్ షోలతో క్రేజ్ సంపాదిస్తోంది. మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ దూసుకెళ్తోంది
    ఏప్రిల్ 06 , 2023
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
    టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి Sobhita Dhulipala శోభితా ధూళిపాళ&nbsp; టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది. Meenakshi Chaudhary మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్‌ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్‌ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది. Sreeleela శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది Samantha సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. Courtesy Instagram: samantha Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది . Sai Pallavi సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. Kiara Advani కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ .  ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. Rukshar Dhillon రుక్సర్‌ థిల్లాన్‌ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్‌ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది. Samyuktha Menon సంయుక్త మీనన్  తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. Keerthy Suresh కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్‌ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.  Divyansha Kaushik దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది. Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. Mirnalini Ravi మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్‌' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది. Kethika Sharma కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. Chandini Chowdary చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Eesha Rebba ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్‌ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. Priyanka Jawalkar "ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్న ప్రియాంక ఎన్‌.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. Courtesy Instagram: Dimple Hayathi Pujita Ponnada పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్‌' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది. Ananya Nagalla అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. Courtesy Instagram:Ananya Nagalla
    డిసెంబర్ 04 , 2024
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Mangalavaaram Review: ‘మంగళవారం’లో పాయల్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: పాయల్‌ రాజ్‌పూత్‌, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్‌ అమిర్‌, రవీంద్ర విజయ్‌, కృష్ణ చైతన్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు దర్శకత్వం: అజయ్‌ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్‌ ఎడిటింగ్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపల్లి సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ విడుదల: 17-11-2023 ‘RX 100’ సినిమాతో సినీప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఆ సినిమాతోనే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. తిరిగి వారి కాంబోలోనే తేరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘మంగళవారం’. డార్క్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇటీవల రిలీజైన టీజ‌ర్, ట్రైలర్లు ఈ ఆస‌క్తిని మరింత పెంచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మ‌రి ఈ మంగ‌ళ‌వారం క‌థేంటి? తెర‌పై ఎలాంటి వినోదాన్ని పంచింది? పాయ‌ల్- అజ‌య్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్ర‌జ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. మంగళవారం రోజునే ఈ మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ‌దేవ‌త మాల‌చ్చ‌మ్మ జాత‌ర జ‌రిపించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఊరి ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ మిస్ట‌రీ మ‌ర్డ‌ర్స్ వెనుక ఏదో కుట్ర ఉంద‌ని ఎస్ఐ (నందితాశ్వేత‌) భావిస్తుంది. కానీ, ఊరి జ‌మీందారు ప్ర‌కాశం (చైత‌న్య కృష్ణ‌) మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఇమె ఇన్వేస్టిగేష‌న్‌కు ఎవ‌రూ స‌రిగా స‌హ‌క‌రించ‌రు. మరి ఆ హ‌త్య‌ల‌కు వెనుక ఉన్న మ‌ర్మం ఏమిటి? దెయ్యం రూపంలో శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) తిరుగుతోంద‌ని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు భ్ర‌మ‌ప‌డ్డారు? ఈ హ‌త్య‌ల‌కు శైలుకు సంబంధం ఉందా? మ‌హాల‌క్ష్మీపురం నుంచి ఆమె వెలివేయ‌బ‌డ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే మంగ‌ళ‌వారం సినిమా క‌థ‌. ఎలా సాగిందంటే? సినిమాలో తొలి 15 నిమిషాలు శైలు చిన్న‌త‌నం, రవితో ఆమె ప్రేమకథ, అతడి కుటుంబ నేపథ్యం చుట్టూ సాగుతుంది. ఆ త‌ర్వాత క‌థ వ‌ర్త‌మానంలోకి వ‌స్తుంది. జంట‌ల పేర్లు ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాయడం.. వారంతా గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే చనిపోవడం తొలి భాగంలో చూపిస్తారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు తొలి భాగంలో థ్రిల్‌ ఇస్తాయి. ద్వితీయార్ధం మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం, ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త, దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న రెండో పార్ట్‌లో చూపించారు. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.&nbsp; ఎవరెలా చేశారంటే? శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌లోనూ అదరగొట్టింది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో చ‌క్క‌గా జీవించింది. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా స్కోప్‌ లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ&nbsp; ట్రాక్ న‌వ్వులు పూయిస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు అజయ్‌ ఈ సినిమాను మిస్టీక్‌ థ్రిల్లర్‌లా మెుదలుపెట్టి మధ్యలో హారర్‌ టచ్‌ ఇచ్చి ఆఖర్లో ఓ సందేశంతో ముగించారు. అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం, డబల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించేలా ఉన్నాయి. ఈ విషయంలో అజయ్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. మరోవైపు ప్రథమార్థంలో కథే కనిపించకపోవడం, ద్వితియాతార్థంలో పాత్రలకు సరైన ముగింపు ఇవ్వకపోవడం అతడి డైరెక్షన్‌లో మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్‌ సినిమాని ముగించిన తీరు ఆడియన్స్‌కు అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు. కానీ థ్రిల్లింగ్‌ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. టెక్నికల్‌గా&nbsp; టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. అజ‌నీష్ నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ పాయ‌ల్ న‌ట‌న‌, గ్లామ‌ర్‌అజ‌నీష్ సంగీతంట్విస్ట్‌లు మైనస్‌ పాయింట్స్‌ &nbsp;నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం&nbsp;ముగింపు రేటింగ్‌ : 3/5
    నవంబర్ 17 , 2023
    <strong>KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు</strong>
    KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు
    విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి.&nbsp; కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్&nbsp; పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది. సాంకేతిక విభాగం: ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరగా మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని&nbsp; బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రేటింగ్ : 3.5/5
    నవంబర్ 01 , 2024
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
    భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్‌ అనగానే ముందుగా అందరికీ ‘రామ్‌ గోపాల్‌ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్‌ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆరాధ్య దేవి (Aaradhya Devi) ఆర్జీవీ అప్‌కమింగ్‌ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్‌ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్‌ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.&nbsp; Aaradhya Devi Hot images gallery ఇర్రా మోర్‌ (Irra Mor) ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్‌ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.&nbsp; శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava) హాట్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది. Shanvi Srivastava Hot images gallery పూజా భలేకర్‌ (Pooja Bhalekar) హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్‌ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్‌ అందాలను ఆర్జీవీ క్యాప్చర్‌ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్‌ హాట్‌ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.&nbsp; Pooja Bhalekar Bikini images gallery నైనా గంగూలి (Naina Ganguly) ఆర్జీవీ టాలెంటెడ్‌ హీరోయిన్లతో పాటు బోల్డ్‌ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్‌ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్‌ షో చేసింది.&nbsp; అప్సర రాణి (Apsara Rani) ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్‌ బాంబ్‌ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్‌ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. Apsara Rani Hot images gallery ఊర్మిళ (Urmila Matondkar) ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్‌’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్‌’, ‘జంగిల్‌’, ‘దావుద్‌’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్‌, అందమైన హీరోయిన్‌ ఉంటే సినిమాను సక్సెస్‌ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.&nbsp; అక్కినేని అమల (Akkineni Amala) స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.&nbsp; శ్రీదేవి (Sridevi) రామ్‌గోపాల్‌ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్‌ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్‌ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్‌ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రేవతి (Revathi) ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్‌ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్‌’, ‘అబ్‌ తక్‌ ఛాపన్‌’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్‌ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్‌ గోపాల్‌ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; మహేశ్వరి (Maheswari) ఒకప్పటి స్టార్‌ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్‌ రోల్‌లో నటించింది. హర్రర్‌ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేశాయి. మనీషా కోయిరాలా (Manisha Koirala) ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్‌ రిటర్న్స్‌’, ‘దర్వాజ బంద్‌’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్‌ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.&nbsp; సుస్మితా సేన్‌ (Sushmita Sen) ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్‌ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్‌ మెరిసింది.&nbsp; ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్‌' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌త https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
    ఏప్రిల్ 24 , 2024
    <strong>Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌.. ‘క్వార్టర్‌, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’</strong>
    Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్‌ సంచలన కామెంట్స్‌.. ‘క్వార్టర్‌, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ మూవీకి సాధ్యం కాని కలెక్షన్స్‌ సాధిస్తూ పలు రికార్డులను కొల్లగొడుతోంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్‌ నటన చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సౌత్‌, నార్త్‌, ఓవర్సీస్‌ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క చోట పుష్ప గాడి ప్రభంజనం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఈ స్థాయి సక్సెస్‌ సాధిస్తే సంబంధిత ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి, సలార్‌ సినిమా విషయంలో మనం ఇది చూశాం. కానీ ‘పుష్ప 2’ సక్సెస్ విషయంలో టాలీవుడ్‌ మౌనం వహిస్తోంది. పైగా కొందరు స్టార్స్‌ ఆ సినిమాను కించపరుస్తూ మాట్లాడటం చర్చకు తావిస్తోంది.  ‘క్వార్టర్ ఇస్తే ఎవరైనా వస్తారు’ ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) 'పుష్ప 2' చిత్రంపై సంచలన కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన 'మిస్‌ యు' చిత్రం ఈ వారమే తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'ను కించపరిచేలా మాట్లాడాడు. పాట్నాలో భారీ జనసందోహంలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌పై ఆయన సెటైర్లు వేశారు. 'మన దేశంలో జనసమీకరణం పెద్ద విషయమేమి కాదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక కన్‌స్ట్రక్షన్‌ దగ్గ జేసీబీ వర్క్‌ జరుగుతున్నప్పుడు జనాలు గుమ్మికూడతారు. బిర్యానీ, క్వార్టర్‌ సీసా ఇస్తే పొలిటికల్‌ మీటింగ్‌కు జనాలు ఎగబడతారు. పొలిటికల్‌ మీటింగ్స్‌కు జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయని నమ్మకం లేదు. ఇండియాలో జనం గుమికూడడం సహజమే. ఇది చాలా చిన్న విషయం' అంటూ సిద్ధార్థ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు సోమవారం జరిగిన హరికథ వెబ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’ అంటూ సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడిన సంగతి తెలిసిందే.  https://twitter.com/WhatTheFuss_/status/1866378487784742950 రాజమౌళి మౌనం ఎందుకు? దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) ఇండస్ట్రీ నుంచి ఏ మంచి సినిమా వచ్చిన దగ్గరుండి ప్రశంసలు కురిపిస్తారు. ‘సలార్‌’ (Salaar), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో పాటు ఇటీవల వచ్చిన ‘దేవర’ గురించి కూడా ఆయన స్పందించారు. అటువంటి రాజమౌళి ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత సినిమా గురించి ఒక్క కామెంట్‌ చేయకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు స్వయంగా హాజరైన రాజమౌళి తాను అప్పటికే చూసిన ఇంట్రడక్షన్‌ సీన్‌పై భారీగా హైప్‌ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. అటువంటి జక్కన్న సినిమా రిలీజ్‌ తర్వాత సడెన్‌గా మౌన మునిగా మారిపోవడంపై సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేశాడని తెగ ఆలోచిస్తున్నారు.  మహేష్‌ రివ్యూ ఎక్కడ? సూపర్‌ స్టార్‌ మహేష్‌ (Mahesh Babu) గత కొంతకాలంగా రివ్యూవర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలను స్వయంగా చూడటమే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కల్కి వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో పాటు మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా 2 వంటి చిన్న సినిమాలకు సైతం మహేష్‌ ప్రశంసలు కురిపించారు. కానీ యావత్‌ దేశాన్ని షేక్‌ చేస్తోన్న 'పుష్ప 2' మాత్రం మహేష్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అయితే దీనికి ఓ బలమైన కారణమే ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. బాలయ్య టాక్‌షోలో బన్నీ చేసిన వ్యాఖ్యలు మహేష్‌ను నొప్పించి ఉంటాయని అంటున్నారు. ఆ షోలో  ప్రభాస్‌, మహేష్‌లలో నీకు ఎవరు పోటీ? అని బన్నీని బాలయ్య అడుగుతాడు. అప్పుడు ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ పాడుతూ తనకు తనతోనే పోటీ అంటూ బన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఈ సమాధానం మహేష్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు.  బన్నీ యాటిట్యూడే కారణమా? ‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంపై టాలీవుడ్‌ పెద్దలు సంతోషంగా ఉన్నప్పటికీ ఆ సినిమా చేసిన డ్యామేజ్‌ విషయంలో మాత్రం వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని ఓ మహిళ మృతి సంగతి తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెన్‌ఫిట్‌ షోలకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతికి రాబోయే చిత్రాలు బాగా ఎఫెక్ట్‌ కానున్నాయి. బన్నీ ఆ రోజు థియేటర్‌కు రాకుండా ఉంటే ఇలాంటి తప్పిదం జరిగేది కాదని సినీ పెద్దలు భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో అతడు వ్యవహార శైలి కూడా సరిగా లేదని అభిప్రాయపడుతున్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సక్సెస్‌పై ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రశంసలు రావట్లేదని టాక్‌ వినిపిస్తోంది. 
    డిసెంబర్ 10 , 2024
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    Allu Arjun : వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలికిన అల్లు అర్జున్.. పవన్‌ కళ్యాన్‌కు గట్టి షాక్!
    ఏపీ ఎన్నికల ప్రచారంలో శనివారం (మే 11) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో ప్రత్యర్థులుగా మారారు. ముఖ్యంగా బన్నీ.. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి మెగా ఫ్యాన్స్‌కు, జన సైనికులకు షాకిచ్చాడు. సీఎం జగన్‌ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. మరోవైపు అదే సమయంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌.. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించి బాబాయి గెలుపునకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుత ఈ రెండు ఘటనలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ ఎన్నికల వేళ మెగా ఫ్యామిలీ రెండు విడిపోయిందా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్‌ కోసం బన్నీ! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి&nbsp; మద్దతు&nbsp; తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లాడు. దీంతో బన్నీ వ్యవహార శైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇటీవల ట్విటర్‌లో పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ.. పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్‌ బరిలో ఉన్నారు.&nbsp; https://twitter.com/i/status/1789232102518444087 బన్నీకి ఘన స్వాగతం భార్య సతీమణితో కలిసి నంద్యాల వచ్చిన బన్నీకి వైకాపా అభ్యర్థి శిల్పా రవి దంపతులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బన్నీ రాక గురించి తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున నంద్యాల రోడ్లపైకి చేరుకున్నారు. అతడి రేంజ్‌ రోవర్‌ కారును చుట్టుముట్టారు. వేలాది అభిమానుల మధ్య శిల్ప ఇంటికి చేరిన బన్నీ.. బాల్కనీ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అవి చూసిన జనసైనికులు బన్నీ చర్యపై మండిపడుతున్నారు. బన్నీ నిజస్వరూపం బయటపడిందంటూ ఘాటుగా పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1789223801865359728 చంద్రబాబు రియాక్షన్‌ నంద్యాలలో బన్నీ పర్యటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పందించాడు. స్నేహితుడని భావించి అల్లు అర్జున్‌ వైకాపా అభ్యర్థి ఇంటికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని పట్టుకొని వైకాపా చౌకబారు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ వెంట ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/SumanthOffl/status/1789218767366652109 పిఠాపురంలో రామ్‌చరణ్‌ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో గత కొన్ని రోజులుగా తారల సందడి నెలకొండి. పవన్‌కు మద్దతు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన బాబాయ్‌ కోసం తల్లి సురేఖ, మామ అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్లాడు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగిన రామ్‌చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. కేరంతలు, ఆనందోత్సాహాల మధ్య తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన చరణ్‌.. పట్టణంలో పర్యటిస్తున్నారు. కాగా, నేటితో ఏపీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.&nbsp; https://twitter.com/i/status/1789234120356499943
    మే 11 , 2024
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
    Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
    నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్&nbsp; ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్‌: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023&nbsp;&nbsp; సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్షన్ ఎలా ఉందంటే? విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నాగ చైతన్య నటనసస్పెన్స్‌ &amp; క్యూరియాసిటీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 01 , 2023
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు&nbsp; దర్శకత్వం : డా. హరిత గోగినేని సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి&nbsp; విడుదల తేదీ: డిసెంబర్‌ 14, 2024 ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్‌ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్‌ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్‌ సంపత్‌ (అరవింద్‌ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్‌ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్‌ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review) ఎవరెలా చేశారంటే నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్‌ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్‌ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్‌ కథతో పాటే ట్రావెల్‌ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్‌, సీనియర్‌ నటి పవిత్ర లోకేష్‌ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; https://twitter.com/IndianClicks/status/1867486641822347748 డైరెక్షన్ ఎలా ఉందంటే ‘ఫియర్‌’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఫార్మెట్‌ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్‌ వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్‌ వర్క్‌ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ వేదిక నటనఫియర్‌ ఎలిమెంట్స్‌ట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ కథనంలో తడబాటుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    డిసెంబర్ 13 , 2024
    <strong>Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?</strong>
    Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?
    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ఫ్యాన్స్‌ (Mega Fans) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ‘పుష్ప 2’ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామంటూ కూడా మెగా ఫ్యాన్స్‌ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. అయితే అల్లు వర్సెస్‌ మెగా వివాాదాని (Allu Vs Mega Families)కి కేంద్రంగా మారిన ప్రాంతం ఏపీలోని నంద్యాల. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఆ ఏరియాలో ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌, జన సైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా నంద్యాలలోని బన్నీ ఫ్యాన్స్ అత్యవసర మీటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో నంద్యాల కేంద్రంగా మరో రచ్చ మెుదలవుతుందా అన్న అనుమానాలు మెుదలయ్యాయి.&nbsp; మీటింగ్‌ అందుకేనా! ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Vs Mega Families) ఒక చోట సమావేశం కాబోతున్నారు. ఆత్మకూరు రోడ్డులోని చెరువుకట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10:30కు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నంద్యాల ట్విటర్ హ్యాండిల్స్‌ ద్వారా ట్రెండింగ్‌ చేస్తున్నారు. అయితే మెగా - అల్లు ఫ్యామిలీ రచ్చకు కారణమైన నంద్యాలలో ఫ్యాన్స్ ఈ మీటింగ్‌ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశం ద్వారా మరో వివాదానికి వారు తెరలేపుతారా? అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 'పుష్ప 2' సినిమా నేపథ్యంలోనే ఈ భేటి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ కోసం తమ అభిమాన హీరోకు ఏ విధంగా సాయపడాలి? ఎలా అండగా నిలవాలి? మెగా ఫ్యాన్స్ చేస్తున్న నెగిటివ్‌ ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలి? అన్న దానిపై ఈ మీటింగ్‌లో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/NandyalTimes/status/1861659960972632065 నంద్యాల ఘటన గుర్తుందా? ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి&nbsp; మద్దతు&nbsp; తెలపడానికి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నంద్యాలకు వెళ్లారు. దీంతో అప్పట్లోనే బన్నీ వ్యవహార శైలి ఏపీ రాజకీయాలతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్‌ ద్వారా ‘ఆల్‌ ది బెస్ట్‌’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్‌ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ట్విటర్‌లో ఒక పోస్టు మాత్రమే పెట్టిన బన్నీ పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా రావడం పొలిటికల్‌ వర్గాల్లో (Allu Vs Mega Families) హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో బన్నీ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోగా కూటమి అభర్థి, టీడీపీ నేత ఫరూఖ్‌ ఘన విజయం సాధించారు.&nbsp; https://twitter.com/aaa_cinemas/status/1789215453405208730 ‘కిస్సిక్‌’ నేపథ్యంలోనూ బన్నీపై ట్రోల్స్‌! నంద్యాల ఘటన నుంచి బన్నీని టార్గెట్‌ చేసిన మెగా ఫ్యాన్స్‌ (Allu Vs Mega Families) అతనిపై విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. బన్నీ తాజా చిత్రం ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో ఈ ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఐటెం సాంగ్‌ ‘కిస్సిక్‌’ను ఆధారంగా చేసుకొని ఓ ఎడిటింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ సందర్భంగా స్టార్‌ హీరోయిన్స్ రష్మిక మందన్న, శ్రీలీలను బన్నీ ఆలింగనం చేసుకోగా కిస్సిక్‌ లిరిక్స్‌ను వాటికి మ్యాచ్‌ అయ్యేలా ఎడిట్‌ చేశారు. ‘దెబ్బలు పడతాయిరో మామా’ గత చిత్రాల్లో బన్నీపై చేయిచేసుకున్న వీడియోలను దానికి జత చేశారు. ప్రస్తుతం ఈ ఎడిటింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/Jalsa44/status/1860990666245091594 బన్నీ ఇన్‌స్టా పోస్టుపై వివాదం సోషల్‌ మీడియాలో బన్నీ, పవన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున వార్‌ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్‌ ఈవెంట్‌లోని పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించాయి. ఏం పీకలేరు బ్రదర్‌ అంటూ 'పీకే' (పవన్‌ కల్యాణ్‌) హైలెట్ చేస్తూ ఇంగ్లీష్‌ టెక్ట్స్‌లో ఉన్న ఓ ఫ్లకార్డ్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శ్రీలీలతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అందులో పోస్టర్‌ కనిపించింది. అయితే ఇది యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే బన్నీ పెట్టాడా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ పోస్టును చూసి పవన్ ఫ్యాన్స్ మరోమారు బన్నీపై రెచ్చిపోయారు. అటు అల్లు ఆర్మీ సైతం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడం మెుదలుపెట్టింది. ఇది గమనించిన బన్నీ ఆ ఫ్లకార్డ్‌ను తీసేసి క్రాప్‌ ఇమేజ్‌ను మరోమారు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే జరగాల్సిన ఫ్యాన్‌ డ్యామేజ్ అంతా అప్పటికే జరిగిపోయిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. https://twitter.com/7theDestroyeRRR/status/1860759885773942867
    నవంబర్ 28 , 2024
    <strong>Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;</strong>
    Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;
    నటీనటులు : చంద్రహాస్‌, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీనివాస్‌ మెహత్‌ సంగీతం : అశ్విన్‌ హేమంత్‌ సినిమాటోగ్రఫీ : అస్కర్‌ అలీ ఎడిటిర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు: ప్రభాకర్‌, మలయజ ప్రభాకర్‌ విడుదల తేదీ: 04-10-2024 బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ (Prabhakar) కుమారుడు చంద్రహాస్‌ (Chandrahas) యాటిట్యూడ్‌ స్టార్‌ (Attitude Star)గా సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రామ్‌ నగర్‌ బన్నీ' గురించి కూడా కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్‌ అంటూ చంద్రహాస్‌ చేసిన కామెంట్స్‌ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాటిట్యూడ్‌ స్టార్‌ హిట్‌ కొట్టాడా? హీరోగా ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీ (చంద్రహాస్‌)కి అమ్మాయిలు అంటే వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఏకంగా ముగ్గురితో (విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి)తో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తాడు. అనుకోని పరిస్థితులు ఎదురై పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి సైతం మాటిస్తాడు. ఆమె కంపెనీలోనే ఉద్యోగానికి కూడా చేరతాడు. అయితే ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని బన్నీ గ్రహిస్తాడు. తను నిజంగా ప్రేమిస్తోందని శైలు (విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే శైలుకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు బన్నీ ఏం చేశాడు? శైలు ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు చంద్రహాస్‌ పలు వేదికలపై చూపించిన యాటిట్యూడే ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. నటుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ నటన పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా భయం, బెరుకు లేకుండా నటించాడు. డ్యాన్స్‌, పైట్స్‌లో అదరగొట్టాడు. రొమాంటిక్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శైలుగా చేసిన విస్మయ శ్రీ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్ర దారులు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శ్రీనివాస్ మహత్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ‘రామ్‌ నగర్‌ బన్నీ’ని తెరకెక్కించారు. చంద్రహాస్ కోసమే ఈ కథను రాసినట్టుగా అనిపిస్తుంది. సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జోడించి ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా జులాయిగా తిరిగే సాధారణ కుర్రాడిగా చూపించి సక్సెస్‌ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్‌ను కలగలిపి పక్కా కమర్షియల్‌ మూవీగా తీర్చిదిద్దారు. సాగదీత సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌లో చంద్రహాస్‌ తడబాటు కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికొస్తే మూడు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ చంద్రహాస్‌ నటనకమర్షియల్‌ హంగులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుపేలవమైన ఎమోషనల్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
    Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?
    ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది "కథ వెనుక కథ"(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య  తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం. నటీనటులు విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్. కథ సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ సినిమా ఎలా ఉందంటే? ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్‌ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది.&nbsp; మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో&nbsp; ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది. ఎవరెలా చేశారంటే?  హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది.  వైవిధ్యమైన పాత్రలో  కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది.  సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్‌ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా సినిమా టెక్నికల్‌ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్‌ పనిచెబితే బాగుండేది. బలాలు కథనం ప్రీ క్రైమాక్స్ డైరెక్షన్ బలహీనతలు తొలి 20 నిమిషాలు బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్ Telugu.yousay.tv Rating: 3.5/5
    మార్చి 30 , 2024

    @2021 KTree