రివ్యూస్
How was the movie?
తారాగణం
మహేష్ బాబు
జి. సీతారాంరక్షిత
జాంకిగోపీచంద్
దేవాదాయ శర్మ దేవుడురాశి
మల్లిప్రకాష్ రాజ్
ACP రాజ నరేంద్రజయ ప్రకాష్ రెడ్డి
సిద్దా రెడ్డిరంగనాథ్
సీతారాం తండ్రితాళ్లూరి రామేశ్వరి
సీతారాం తల్లిబ్రహ్మాజీ
CIవిజయచందర్
డిజిపిజీవా
డీసీపీ మురళీకృష్ణసుమన్ సెట్టి
బద్దుకాంత రావు
సామాజిక కార్యకర్త నారాయణరావురాళ్లపల్లి
కసాయిధర్మవరపు సుబ్రహ్మణ్యం
ట్రాఫిక్ కానిస్టేబుల్కొండవలస లక్ష్మణరావు
సీతారాం పొరుగుదువ్వాసి మోహన్
పాటిల్తిరుపతి ప్రకాష్
షకీలా
మణి చందన
ఒక ఐటెమ్ నంబర్ రాతలుఆలపాటి లక్ష్మి
మాస్టర్ ఘటమనేని జయ కృష్ణయువ సీతారాం
సిబ్బంది
తేజ
దర్శకుడుతేజనిర్మాత
ఆర్పీ పట్నాయక్
సంగీతకారుడుసమీర్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్, నెగిటివిటీ మెుదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
ఆడియన్స్ ఏమంటున్నారు?
ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ యావరేజ్ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం.
https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234
https://twitter.com/i/status/1776636730034245707
https://twitter.com/plaasya/status/1777072948597428600
విజయ్‌కు ముందే తెలుసా?
‘ఫ్యామిలీ స్టార్’ గురించి ఇద్దరు యూట్యూబ్ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమాపై హేట్ లేదని చెప్పాడు. అయితే విజయ్ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా నిర్మాత దిల్ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/chanticomrade_/status/1776839226312753263
విజయ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మెుదటి నుంచి విజయ్ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. కారణం ఏదైనా విజయ్ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్, నెగిటివ్స్ బయటకు వస్తున్నాయి.
దిల్ రాజుపై నెగిటివిటీ
దిల్ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్ మెుదలయ్యాయి. తమిళ స్టార్ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్ రాజు రిలీజ్ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ విషయంలోనూ దిల్ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అటు డైరెక్టర్ పరుశురామ్.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్’పై పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఫేక్ రివ్యూస్
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది.
రిలీజ్‌కు ముందే ట్రోల్స్!
వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్ మెుదలయ్యాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్ కాస్ట్యూమ్స్ ధరిస్తాడని.. బ్రాండెండ్ షూస్ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్ రాజు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ అబ్బాయిని సూపర్ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్ రాజు బదులిచ్చారు.
‘గుడ్ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’
తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.
అయితే దిల్ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు.
https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
ఏప్రిల్ 08 , 2024
సింగర్ మంగ్లీపై నిజంగా రాళ్ల దాడి జరిగిందా? మంగ్లీ ఏం చెప్పిందంటే?
]కన్నడ ప్రజలను తనపై చూపిన ప్రేమను మరవలేనని.. ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో ఫొటోలు, వీడియోలను చూస్తేనే
అర్ధమవుతోందని చెప్పింది.కన్నడ ప్రజల ప్రేమ గొప్పది
ఫిబ్రవరి 13 , 2023
Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.
7/G బృందావన కాలనీ
లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.
ప్రేయసి రావే
ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
మహర్షి
ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
అభినందన
లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.
ఓయ్
మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది.
సుస్వాగతం
జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ప్రేమిస్తే
ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది.
ఆగస్టు 14 , 2023
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.
ఆ భయం అక్కర్లేదు!
దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సాంగ్ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ మిడిల్‌లో సాధ్యం కాకపోతే ఎండ్ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1832446641393246291
దుమ్మురేపిన తారక్
‘దేవర’ నుంచి సెప్టెంబర్ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్ హైట్‌పైనా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నిటినీ తారక్ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.
https://twitter.com/DevaraMovie/status/1835018489784123480
జాతీయస్థాయిలో ట్రెండింగ్
దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
https://twitter.com/DevaraMovie/status/1835682846092226856
'పుష్ప 2'ను దాటేసిన 'దేవర'
విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Manchu Manoj: మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్.. అసలు నిజం చెప్పిన పని మనిషి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు కుటుంబంలో ఘర్షణలు తీవ్రరూపం తీసుకున్నాయి. నిన్నటి నుంచి హైడ్రామాగా కొనసాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా తీవ్ర మలుపు తీసుకున్నాయి.మంచు మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్‌బాబు ఇంటి గేట్లు మూసేశారు. దీంతో మనోజ్ ఒక్కసారిగా తన అనుచరులతో కలిసి గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లారు. దీంతో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేట్లు తోసుకుంటూ వెళ్లిన మంచు మనోజ్‌పై మోహన్‌బాబు ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు.
మంచు మోహన్ బాబు కుటుంబ విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. జల్‌పల్లిలోని నివాసం నుంచి తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను బయటకు పంపించాలనే నిర్ణయాన్ని మోహన్ బాబు తీసుకున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న సమస్యలు ఈ పరిణామానికి దారితీశాయి. మనోజ్ తన ఇంట్లో ఇక ఉండటానికి వీలులేదని మోహన్ బాబు స్పష్టంగా ప్రకటించారు.
https://twitter.com/klapboardpost/status/1866498406912598450
ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ తన సామాన్లను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడు పెద్ద వాహనాలను ఏర్పాటు చేసి, తన వ్యక్తిగత వస్తువుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఘర్షణలు తీవ్రతకు చేరుకున్న కారణంగా, ఈ పరిణామం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
పోలీసుల బందోబస్తు
ఇంటిలో అనవసర గొడవలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు జల్‌పల్లి నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో మనోజ్ తన సామగ్రిని ఇంటి బయటకు తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇటీవల, భద్రత కల్పించాల్సిందిగా డీజీ ఇంటెలిజెన్స్‌కు మనోజ్ విజ్ఞప్తి చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో, బౌన్సర్ల వివాదం కూడా మరింత చర్చనీయాంశమైంది. విష్ణు బౌన్సర్లను ఇంటి నుంచి బయటకు పంపించడంతో, మనోజ్ తన భద్రత కోసం పోలీసులపై ఆధారపడ్డారు.
మీడియాపై మోహన్‌బాబు దాడి
మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న పరిణామాలను కవర్ చేసేందుకు వెెళ్లిన మీడియాపై మోహన్ బాబు అతని అనుచరులు దాడి చేశారు. జర్నలిస్టుల చేతిలోని మైక్‌లు ధ్వంసం చేసి దుర్బాషలాడారు. మోహన్ బాబు తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు.
మోహన్‌బాబుపై చేయి చేసుకున్న మనోజ్?
శనివారం రాత్రి మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఆ ఇంట్లో పనిచేసే పని మనిమనిషి తెలిపారు. ఈక్రమంలో అడ్డు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తిపై మనోజ్ దాడి చేశాడని ఆమె తెలిపారు. తన స్టాఫ్‌ను ఏం అనొద్దని మోహన్ బాబు అన్నారని కానీ మనోజ్ పట్టించుకోలేదని తెలిపారు. ఈక్రమంలో మాట మాట పెరిగి మనోజ్... మోహన్ బాబుపై చేయి చేసుకున్నారని పని మనిషి తెలిపింది. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్‌బాబుతో పాటు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని ఆమె తెలిపారు. అప్పటి నుంచే ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు.
https://twitter.com/NtvTeluguLive/status/1866399846258917662
విభేదాలు ఎటువైపు?
ఇప్పటివరకు ఐక్యంగా కనిపించిన మంచు కుటుంబం, ఇప్పుడు విభజన దిశగా సాగుతోందని భావిస్తున్నారు. కుటుంబ ఘర్షణల కారణంగా వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధాలు మరింత క్షీణించాయి.
ఈ పరిణామం మంచు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను మరింత వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్‌లో ఈ సమస్యలు ఎలా పరిష్కరించబడతాయో వేచిచూడాల్సి ఉంది.
డిసెంబర్ 10 , 2024
Renu Desai: రేణూ దేశాయ్‌కు గుండె జబ్బు.. అసలు నిజం బయటపెట్టిన రేణూ
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 14 , 2023
Sonakshi Sinha: సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్ నటుడితో రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి నెట్టింట పంచుకోవడంతో పెళ్లి విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసుపత్రి బయట సోనాక్షి సిన్హా కనిపించడం చర్చనీయాశంగా మారింది. పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అయ్యిదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతా? సోనాక్షి ఎందుకు ఆస్పత్రికి వెళ్లింది? అందుకు గల కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ఆస్పత్రి వీడియో వైరల్
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తాజాగా నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెకు పెగ్నెన్సీ వచ్చిందన్న రూమర్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పెళ్లైన ఐదు రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చెకప్ చేయించుకోవడం కోసమే నవ దంపతులు ఆసుపత్రికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లై వారం కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
https://twitter.com/i/status/1806851946453574006
https://twitter.com/kapil9994/status/1806705767241715793
నిజం ఏంటంటే?
ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా.. సోనాక్షి సిన్హాకు స్వయానా తండ్రి. అయితే ఒత్తిడి కారణంగా శత్రుఘ్న కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలో కోకిలా బెన్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రిని యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సోనాక్షి సిన్హా తన భర్తతో ఆసుపత్రికి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చాయి.
విందుతో పరిచయం
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ విందులో తొలిసారి సోనాక్షి, జహీర్ ఇక్బాల్ కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి 'డబుల్ ఎక్సెల్' ఫిల్మ్ కూడా చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురుంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లితో ఈ రూమర్లకు సోనాక్షి జంట బ్రేక్ వేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును జహీర్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోనాక్షి స్టార్‌డమ్
శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి చిత్రం 'దబాంగ్' (Dabangg) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన రాజో పాండే పాత్రలో సోనాక్షి అదరగొట్టింది. తన తర్వాతి చిత్రం అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో ‘రౌడీ రాథోడ్’ (Rowdy Rathore)లో కనిపించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు మారిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓమై గాడ్, దబాంగ్ 2, యాక్షన్ జాక్సన్, లింగా, అకిరా, ఫోర్స్ 2, దంబాగ్ 3, డబుల్ ఎక్స్ఎల్ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కకుడా, నికితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్ చిత్రాల్లో సోనాక్షి నటిస్తోంది.
జూన్ 29 , 2024
Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.
Courtesy Instagram: samantha
ఆదే కారణమా?
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది.
సమంత రాబోయే సినిమాలు
శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
అభిమానుల అండ
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూలై 05 , 2023
SRIDEVI: శ్రీదేవితో బాలకృష్ణ అందుకే నటించలేదు...NTR అసలు కారణం కాదు
]అంతే తప్ప ఎన్టీఆర్‌తో నటించిన హీరోయిన్లతో నటించొద్దనే నియమం బాలయ్య పెట్టుకోలేదనేది నిజం
ఫిబ్రవరి 24 , 2023
అల్లు అర్జున్‌తో జతకట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బాలివుడ్ భామలు
]మౌని రాయ్
పుష్ప రాజ్ అలియాజ్ అల్లు అర్జున్‌తో పనిచేయాలని నిజంగా కోరుకుంటున్నా
ఫిబ్రవరి 11 , 2023
HBD Suriya: సూర్యను ‘వేస్ట్ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్ నటనతో సౌత్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూర్య అసలు పేరు ఇదే!
సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్ (Vijay)తో కలిసి సూర్య నటించాడు.
ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి!
సూర్య తండ్రి శివ కుమార్ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్ శరవణన్, డూయింగ్ మై డూకామ్’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.
రూ.600 జీతంతో ఉద్యోగం
హీరోగా నటించిన తండ్రి శివకుమార్, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.
కెమెరా ఫియర్
కెరీర్ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్స్ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట.
రఘువరన్ వ్యాఖ్యలతో మార్పు
సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్?’ అని రఘువరన్ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు.
తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు
షార్ట్ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.
సూర్య డబ్బింగ్ చెప్పారని తెలుసా!
ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్ వెర్షన్‌లో హీరో అభిషేక్ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్ చూపించారు.
అవార్డులే అవార్డులు
27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ఛాయిస్) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్, 5 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డ్స్, 2, ఎడిసన్ అవార్డ్స్, 2 సైమా అవార్డ్స్, 6 విజయ్ అవార్డ్స్ అందుకున్నారు.
సేవా కార్యక్రమాలు
మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించడం గమనార్హం.
‘కంగువా’గా రాబోతున్న సూర్య
సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
జూలై 23 , 2024
WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023
నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్‌లో ప్రదర్శన చేసిన ఈ నటి ఎవరు?
]ఏదేమైనా, ఓ చిన్న పట్టణంలో డ్యాన్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. ఫిఫా ప్రపంచకప్‌లో స్టేజీ ప్రదర్శన చేసే స్థాయికి నోరా ఎదిగింది. నిజంగా
ఈ నటి ప్రస్థానం స్ఫూర్తిదాయకం.స్ఫూర్తిదాయకం..
ఫిబ్రవరి 13 , 2023
Trisha: డేటింగ్‌లో విజయ్ - త్రిష? కీర్తి సురేష్ పెళ్లిలో రివీలైన బంధం!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు డేటింగ్ (Trisha Vijay Dating)లో ఉన్నట్లు కూడా నెట్టింట రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి ప్రయాణించినట్లు ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఈ ఫొటోలతో వీరి సంబంధం గురించి సోషల్ మీడియాలో మరోమారు చర్చ మొదలైంది. వీరు నిజంగానే డేటింగ్‌లో ఉన్నారనేందుకు ఈ ఫొటోలు, వీడియోలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
చెకింగ్ దగ్గర దొరికేసిన జంట..
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తన చిరకాల మిత్రుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గురువారం (డిసెంబర్ 12) గోవాలో పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి అతి ముఖ్యులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్, త్రిష జంటగా ఈ పెళ్లికి హాజరయ్యారంటూ గురువారమే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్, త్రిష స్పెషల్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు చెకింగ్ సందర్భంగా విజయ్, త్రిష జంటగా కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/TrollywoodX/status/1867249542149926983
త్రిష-విజయ్ లుక్స్ అదరహో..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో త్రిష సాధారణ వైట్ టీ-షర్ట్ ధరించగా, విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌తో చక్కగా కనిపించాడు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వారిద్దరిని చెక్ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ కెమెరాలో వారిని బంధించారు. చెకింగ్ అనంతరం త్రిష, విజయ్ తమ కారుల్లో ఎక్కి హడావిడీగా వెళ్లిపోయారు. కాగా, స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణం చేసిన వారి లిస్ట్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో త్రిష, విజయ్ పేర్లతో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రయాణించినట్లు వివరాలు ఉన్నాయి.
https://twitter.com/rajubhai_DMK/status/1867463962440478816
నెటిజన్ల రియాక్షన్ ఇదే
విజయ్, త్రిష (Trisha Vijay Dating)కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ‘వెడ్డింగ్‌లో పాల్గొంటే తప్పేముంది?’ అని కొందరు విజయ్ జంటను సమర్థిస్తున్నారు. పెళ్లై పిల్లలను పెట్టుకొని విజయ్ ఇలా చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ఏమాత్రం అమోదయోగ్యం కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలోనూ విజయ్ హుందాగా ఉండాల్సిన అవసరముందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం త్రిష, విజయ్ వ్యవహారం కీర్తి సురేష్ పెళ్లి కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
విజయ్ జంటకు మంచి క్రేజ్
విజయ్ - త్రిష (Trisha Vijay Dating) జంటకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వారు ఇప్పటివరకూ 8 చిత్రాల్లో కలిసి నటించారు. గతేడాది వచ్చిన లియో సినిమాలో విజయ్‌కి జోడీగా త్రిష నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాలోనూ త్రిష ఓ స్పెషల్ సాంగ్‌లో తళుక్కుముంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలం నుంచే వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు మెుదలయ్యాయి. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అతడి పొలిటికల్ ప్రత్యర్థులు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారన్న ప్రచారం కూడా తమిళనాడులో ఉంది. ఏది ఏమైనా తన రిలేషన్ గురించి విజయ్ - త్రిష క్లారిటీ ఇచ్చే వరకూ ఈ చర్చ ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
డిసెంబర్ 13 , 2024
Pragya nagra Viral Video: ప్రైవేట్ వీడియోపై స్పందించిన హీరోయిన్ ప్రగ్యా నగ్రా
తెలుగు ప్రేక్షకులను లగ్గం సినిమాతో ఆకట్టుకున్న ప్రగ్యా నగ్రా తన జీవితంలో ఎదురైన ఒక అసహజ అనుభవంపై స్పందించారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఆమెపై ఎవరో సృష్టించిన ఒక ఫేక్ వీడియో (pragya nagra viral video) వైరల్ కావడం, ఆమె పేరును ఎక్స్ వేదికలో ట్రెండింగ్ చేయడం జరిగిన ఘటన ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆ వీడియోపై ఆమె స్పందించారు.
ప్రగ్యా నగ్రా స్పందన
సోషల్ మీడియాలో తనదిగా వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై ప్రగ్యా ఎక్స్ వేదిక ద్వారా తన ఆవేదనను పంచుకున్నారు.
‘‘ఆ వీడియో నిజం కాదని మీరు అందరూ తెలుసుకోండి. ఈ వ్యవహారం ఒక భయంకరమైన కల అనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచాలి, కానీ అతి దుర్మార్గమైన వ్యక్తులు దాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెత్త వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో ప్రాచుర్యం చేయడం నన్ను తీవ్రంగా బాధ పెట్టింది.’’ అని పేర్కొన్నారు.
తనను అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ‘‘ఇలాంటి సంఘటన (pragya nagra viral video)మరొక అమ్మాయికి జరగకూడదని ఆకాంక్షిస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేయడం జరిగింది.
ప్రగ్యా నగ్రా కెరీర్ ప్రారంభం
హరియాణాలోని అంబాలాకు చెందిన ప్రగ్యా నగ్రా మోడల్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. వివిధ ఉత్పత్తులకు సంబంధించి 100కు పైగా ప్రకటనల్లో మోడల్‌గా నటించి గుర్తింపు పొందారు.
ప్రగ్యా నగ్రా విద్యాభ్యాసం మెుత్తం ఢిల్లీలోనే జరిగింది. స్కూలింగ్, కాలేజ్ స్టడీస్‌తో పాటు మోడలింగ్ కెరీర్ కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే మెుదలైంది. ఆమె తండ్రి భారత మిలటరీలో పని చేశారు. దీంతో కాలేజీ డేస్‌లో ఆర్మీలో చేరాలని భావించింది. ఇందుకోసం ఎన్‌సీసీ స్టూడెంట్‌గా చేసింది.
మోడలింగ్‌లోకి వచ్చాక ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. దీంతో నటిగా కెరీర్‌లో (pragya nagra viral video)స్థిరపడాలని నిర్ణయించుకొని సినిమాల వైపు అడుగులు వేసింది.
సినీ ప్రయాణం
ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జీవా కథానాయకుడు. ఆ తర్వాత మలయాళంలో నథికళిల్ సుందరి యుమనా, N4 చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె తొలి చిత్రం లగ్గం. ఈ చిత్రంలో సాయి రోనక్ హీరోగా రూపొందింది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు.
లగ్గం మూవీ డిజిటల్ విడుదల
ప్రస్తుతం లగ్గం చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారాలపై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
మహిళల భద్రతపై ప్రగ్యా నగ్రా ఆందోళన
ఈ సంఘటన ప్రగ్యాను కుదిపేసింది. ఆమె ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ కంటెంట్‌ను పంచుకోవడాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘టెక్నాలజీని ఉపయోగించే విధానం బాధ్యతతో ఉండాలి’’ అనే సందేశాన్ని అందించారు.
ప్రగ్యా నగ్రా తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ సద్వినియోగం మాత్రమే మన జీవితాలను మెరుగుపరుస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు.
డిసెంబర్ 07 , 2024
Lokesh Kanagaraj: రజనీకాంత్ ఆరోగ్యంపై లోకేష్ కనగరాజ్ తాజా అప్‌డేట్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘రజనీ కంటే షూటింగ్ ముఖ్యం కాదు’
రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్ కనగరాజ్ మండిపడ్డారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.
రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే?
రజనీకాంత్ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కూలీలో స్టార్ క్యాస్ట్!
రజనీకాంత్ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
సైమన్ యాక్షన్ సీన్ లీక్
రజనికాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ పోషిస్తున్న సైమన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ గతంలో రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్ సీన్ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్ రూత్ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్ (విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్ కూడా చెప్పాడు. ఈ క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్ చేశారు..
https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582
లోకేష్‌పై పవన్ ప్రశంసలు
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్ వంటి స్టార్ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
https://twitter.com/i/status/1841446808888758277
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
అక్టోబర్ 05 , 2024
Nayanthara: భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్!
తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.
ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్ కపుల్ అని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్ శివన్ తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.
ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది. 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్ జంట తల్లిదండ్రులయ్యారు. ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్.శివన్, ఉలగ్ దైవాగ్ ఎన్. శివన్ అని పేర్లు పెట్టారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.
నయనతార ప్రస్తుతం టెస్ట్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘తన్ని ఒరువన్ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది.
ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి.
తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది.
ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ.
ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ వచ్చాడు. అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 18 , 2024
Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!
టాలీవుడ్ ఖ్యాతిని పాన్ ఇండియా లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఇందులో బన్నీ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో విలన్‌గా చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌తెలుగుతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ పరిచయమయ్యాడు. బన్నీ తర్వాత ఆ స్థాయిలో పుష్పలో ఆకట్టుకున్నాడు ఫహాద్ ఫాసిల్. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ఫాహాద్ ఫాజిల్ పుష్ప చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
‘పుష్ప నాకు చేసిందేమీ లేదు’
తాజాగా ఫిల్మ్ కంపానియన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాట్లాడాడు. ‘పుష్ప’ సినిమాపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘పుష్ప’ తర్వాత ఫహాద్.. కేరళ హద్దులు దాటి పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నట్లు యాంకర్ అన్నారు. ఇందుకు అందుకు ఫహాద్ బదులిస్తూ.. ’అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్‌కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలోనే సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు’ అని అన్నారు.
‘సుకుమార్ కోసమే ఒప్పుకున్నా’
ఓ సందర్భంలో మీతో పాటు కూర్చోడానికి బాలీవుడ్ నటుడు కాస్త వెనకడుగు వేశాడని.. మీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని యాంకర్.. ఫహాద్‌తో అన్నారు. పుష్ప వల్లనే మీరు ఈ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు ఫహాద్ స్పందిస్తూ.. ‘పుష్ప కేవలం సుకుమార్‌పై ఉన్న ప్రేమతో మాత్రమే చేశా. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది అని మాత్రం నేను అనుకోవడం లేదు’ అని ఫహాద్ స్పష్టం చేశాడు.
నా ఫేవరేట్ స్టార్స్ వారే: ఫహాద్
యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ తాను పాన్ ఇండియా స్టార్‌ను కాదని కేవలం నటుడిని మాత్రమేనని ఫహాద్ తేల్చి చెప్పాడు. ఇక తనకు రాజ్ కుమార్ మంచి నటుడని తెలిపాడు. రణ్‌బీర్ కపూర్ దేశంలోనే అత్యుత్తమ యాక్టర్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఫహాద్ నటించిన ఆవేశం చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.
మే 07 , 2024
SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
‘ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అది చూసిన మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
మహేష్ ద్విపాత్రిభినయం!
లేటెస్ట్ బజ్ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
SSMB29 కథకు ప్రేరణ అతడే!
మహేష్ - రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నాని స్పెషల్ రోల్..!
'SSMB 29' గురించి మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నాని (Nani) ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.
శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు!
ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్ అంటే సెట్స్ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
https://telugu.yousay.tv/ssmb-29-is-this-mahesh-babus-final-look-in-rajamoulis-film.html
మార్చి 12 , 2024
Pushpa 3: నో డౌట్.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్ మీకోసం!
సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప 2’ అందరి దృష్టి పడింది. అయితే సినిమాకు కొనసాగింపుగా ‘పార్ట్ 3’ (Pushpa 3) కూడా ఉండొచ్చని ఇటీవలే బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నిజం చేస్తూ తాజాగా ‘పుష్ప 3’పై సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది.
వచ్చే ఏడాది సమ్మర్‌లో..
ఈ ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డే అండ్ నైట్ షూటింగ్ చేస్తూ పుష్ప టీమ్ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజా బజ్ ప్రకారం.. 'పుష్ప 3'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డైరెక్టర్ సుకుమార్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 3' లో వచ్చే సీన్లకు ప్రస్తుత షూటింగ్ లోకేషన్స్ సరిగ్గా సరిపోతాయని భావించి ఈ షూట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ‘పుష్ప 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసే యోచనలో సుకుమార్ టీమ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ పెట్టాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని (Disha Patani) ఎంపికచేసినట్లు మెున్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్ ప్రకారం.. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరును ఐటెం సాంగ్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు భావిస్తున్నారట. కాబట్టి జాన్వీ కపూర్‌కు ఉన్న ఫేమ్ దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా ఉంటుందని పుష్ప టీమ్ అభిప్రాయపడుతోందట. మరి జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
‘పుష్ప 3’పై బన్నీ ఏమన్నాడంటే!
ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బెర్లిన్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘పుష్ప 3’ సినిమా గురించి తొలిసారి బన్నీ మాట్లాడాడు. పార్ట్-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరోవైపు మొదటి భాగంతో పోలిస్తే ‘పుష్ప 2’లో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని బన్నీ తెలిపాడు. ముఖ్యంగా పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్, తెరపై వాటి ఎగ్జిక్యూషన్, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని వివరించాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
బన్నీ నా రోల్ మోడల్: సమంత
ఇదిలాఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్‌లో పాల్గొన్న సమంత అక్కడ బన్నీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటూ ఆకాశానికెత్తింది. ‘బన్నీ ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’ అని సమంత చెప్పింది. కాగా గతంలో వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది.
మార్చి 07 , 2024