• TFIDB EN
  • నిజం (2003)
    UTelugu3h 7m

    అమాయకుడైన సీతారాం తండ్రిని కొంతమంది చంపుతారు. అయితే అతని తల్లి, అతని తండ్రి చావుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబుజి. సీతారాం
    రక్షితజాంకి
    గోపీచంద్దేవాదాయ శర్మ దేవుడు
    రాశిమల్లి
    ప్రకాష్ రాజ్ACP రాజ నరేంద్ర
    జయ ప్రకాష్ రెడ్డిసిద్దా రెడ్డి
    రంగనాథ్ సీతారాం తండ్రి
    తాళ్లూరి రామేశ్వరి సీతారాం తల్లి
    విజయచందర్డిజిపి
    జీవాడీసీపీ మురళీకృష్ణ
    కాంత రావుసామాజిక కార్యకర్త నారాయణరావు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యంట్రాఫిక్ కానిస్టేబుల్
    కొండవలస లక్ష్మణరావుసీతారాం పొరుగు
    మణి చందనఒక ఐటెమ్ నంబర్ రాతలు
    ఆలపాటి లక్ష్మి
    మాస్టర్ ఘటమనేని జయ కృష్ణయువ సీతారాం
    సిబ్బంది
    తేజదర్శకుడు
    తేజనిర్మాత
    ఆర్పీ పట్నాయక్సంగీతకారుడు
    సమీర్ రెడ్డిసినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం.   కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.  దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.  అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.  అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.  అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.  ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.  మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.   ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. 
    ఆగస్టు 14 , 2023
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో  అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
    Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్‌ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న  చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.  Courtesy Instagram: samantha ఆదే కారణమా? గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది.  ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది. సమంత రాబోయే సినిమాలు శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న  మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్‌ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. అభిమానుల అండ ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు  కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
    జూలై 05 , 2023
    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?
    ‘ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అది చూసిన మహేష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.  మహేష్ ద్విపాత్రిభినయం! లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న 'SSMB29' మూవీలో మహేష్‌ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్‌ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. SSMB29 కథకు ప్రేరణ అతడే! మహేష్‌ - రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాని స్పెషల్‌ రోల్‌..! 'SSMB 29' గురించి మరో రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాని (Nani) ఓ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్‌ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు.  శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు! ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.  https://telugu.yousay.tv/ssmb-29-is-this-mahesh-babus-final-look-in-rajamoulis-film.html
    మార్చి 12 , 2024
    Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
    Pushpa 3: నో డౌట్‌.. ‘పుష్ప 3’ సినిమా పక్కా.. మైండ్‌ బ్లోయింగ్ అప్‌డేట్స్‌ మీకోసం!
    సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న ‘పుష్ప 2’ అందరి దృష్టి పడింది. అయితే సినిమాకు కొనసాగింపుగా ‘పార్ట్‌ 3’ (Pushpa 3) కూడా ఉండొచ్చని ఇటీవలే బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాటిని నిజం చేస్తూ తాజాగా ‘పుష్ప 3’పై సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది.  వచ్చే ఏడాది సమ్మర్‌లో.. ఈ ఏడాది ఆగస్టు 15న 'పుష్ప 2' విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో డే అండ్‌ నైట్‌ షూటింగ్‌ చేస్తూ పుష్ప టీమ్‌ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. 'పుష్ప 3'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డైరెక్టర్‌ సుకుమార్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 'పుష్ప 3' లో వచ్చే సీన్లకు ప్రస్తుత షూటింగ్‌ లోకేషన్స్‌ సరిగ్గా సరిపోతాయని భావించి ఈ షూట్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ‘పుష్ప 3’ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే యోచనలో సుకుమార్‌ టీమ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.  జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్‌! ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ ఐటెం సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ‘పుష్ప 2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ పెట్టాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్‌ దిశా పటాని (Disha Patani) ఎంపికచేసినట్లు మెున్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్‌ ప్రకారం.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరును ఐటెం సాంగ్‌ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్టులో కన్నాపెద్దగా ఈ రెండో పార్టులో ఈ ఐటెం సొంగ్ ఉండాలని చిత్ర నిర్వాహకులు, దర్శకుడు భావిస్తున్నారట. కాబట్టి జాన్వీ కపూర్‌కు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా ఆమె అయితేనే సరిగ్గా ఉంటుందని పుష్ప టీమ్ అభిప్రాయపడుతోందట. మరి జాన్వీ కపూర్ ఈ ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.  ‘పుష్ప 3’పై బన్నీ ఏమన్నాడంటే! ఇటీవల జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘పుష్ప 3’ సినిమా గురించి తొలిసారి బన్నీ మాట్లాడాడు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరోవైపు మొదటి భాగంతో పోలిస్తే ‘పుష్ప 2’లో పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని బన్నీ తెలిపాడు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని వివరించాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి.  బన్నీ నా రోల్‌ మోడల్‌: సమంత ఇదిలాఉంటే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ప్రశంసల వర్షం కురిపించింది. తమిళనాడులోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన కల్చరల్ కార్నివాల్‌లో పాల్గొన్న సమంత అక్కడ బన్నీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది. అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటూ ఆకాశానికెత్తింది. ‘బన్నీ ఓ పవర్ హౌజ్ పర్ఫార్మర్‌గా మారాడు. అతని నుంచి నేర్చుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను’ అని సమంత చెప్పింది. కాగా గతంలో వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో నటించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. 
    మార్చి 07 , 2024
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
     SSMB29: మహేష్ బాబు ముందు బిగ్ ఛాలెంజ్… ఎలా హ్యాండిల్ చేస్తాడో మరి!
    సూపర్ స్టార్ మహేష్‌తో చేయబోయే SSMB29 చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్‌ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కౌబాయ్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంజర్‌ మూవీ కోసం హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ... కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్‌లో పడింది. మహేష్‌బాబు స్టామినాకు తగ్గ హిట్ పడలేదన్నది నిజం. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమాపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.   గ్లోబల్ స్థాయి అయితే రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి, RRR ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ స్టార్లుగా ఎదిగిపోయారు. ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా హిట్‌ అవడం ఖాయం. కానీ ఆ తర్వాత చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. మహేష్‌కు లాభమా నష్టమా? ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఇదే నియమం లెక్కతప్పకుండా కొనసాగుతుంది. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్స్‌గా మూటగట్టుకున్నారు. దీంతో SSMB 29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేస్తారు?  ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తారు? సగటు సూపర్ స్టార్ అభిమానిని తొలచివేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుంది. మరి దానిని నిలబెట్టుకునేలా మహేష్ బాబు తన తదుపరి SSMB30 సినిమాను ఎలా ఎంచుకుంటాడు? అతని కెరీర్‌కు బిగ్‌ ఛాలెంజ్ అంటూ ఇండస్ట్రీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. SSMB29 క్రియేట్ చేస్తున్న బజ్.. మహేష్ బాబుకు లాభంతో పాటు నష్టాన్ని కూడా తెచ్చిపెట్టనుందని ఊహిస్తున్నారు. గతంలో ఇదే విధంగా రాజమౌళితో ఇండస్ట్రీ హిట్లు అందుకున్న తెలుగు హీరోలు ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక వరుసగా పరాజయాలు పొందారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్స్ అందుకున్న హీరోల జాబితాను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూ. NTR రాజమౌళి తన మెుదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1'ను జూ. ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్‌ అయింది. మళ్లీ తారక్‌తో "సింహాద్రి" సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ తీసిన 'ఆంధ్రావాల' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు RRRలో తారక్ నటించి గ్లోబర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ప్రభాస్‌ 2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్‌ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.  ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ రేంజ్‌ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రామ్‌చరణ్‌ RRRకు ముందు రామ్‌చరణ్‌తో 'మగధీర' సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్‌ తీసిన ఆరెంజ్‌ సినిమా దారుణంగా విఫలమైంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా తీస్తున్న రామ్‌చరణ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో వేచి చూడాల్సి ఉంది. ఇక రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా తర్వాత ఫ్లాప్‌ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.  మహేష్ బాబు కూడా అదే పరిస్థితా? దీంతో మహేష్ బాబు కూడా SSMB29 తర్వాత ఇతర టాలీవుడ్ అగ్రహీరోల మాదిరి బోల్తా పడుతాడా లేక గత చరిత్రను తిరిగి రాస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అంది. అటు ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  వరల్డ్ వైడ్ బజ్ మరోవైపు మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కోసం తన లుక్స్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన అన్న కొడుకు మ్యారెజ్ కార్డు ఇవ్వడానకి వెళ్లినప్పుడు.. మహేష్ బాబు పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కువ జుట్టు, ఒత్తైన గడ్డంతో హాలీవుడ్ హీరోలా మహేష్ కనిపించాడు. అలాగే కొన్ని స్టంట్స్‌ నేర్చుకునేందుకు జర్మనీలో ఇటీవల మహేష్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. అటు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిఫ్ట్ కూడా ఫైనల్ చేసి రాజమౌళికి వినిపించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నుంచి నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం వంటి అంశాలను చిత్ర యూనిట్ పరిశీలించనున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వరల్డ్‌ వైడ్‌గా క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.
    ఫిబ్రవరి 14 , 2024
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    Poonam Pandey: పూనం పాండేపై నెటిజన్లు కన్నెర్ర.. ఏకిపారేస్తూ షాకింగ్‌ కామెంట్స్!
    బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్‌ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్‌ మీడియాకు వెల్లడించారు. అయితే, నటి మరణ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పూనం పాండేనే ప్రకటించారు. తాను బతికే ఉన్నట్లు ఓ వీడియో సందేశాన్ని సైతం విడుదల చేశారు. అందుకే ఇలా చేశా: పూనం పాండే తను చనిపోయినట్లు స్వయంగా ప్రకటించుకున్న పూనం పాండే.. అందుకు గల కారణాలను తాజా వీడియోలో వివరించారు. తాను బాధపడుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడి ఏటా వేలాది మంది మహిళలు చనిపోతున్నట్లు పూనం తెలిపారు. ఆ వ్యాధి బారిన పడితే ఏమి చేయాలన్న అవగాహన చాలా మంది మహిళలకు ఉండటం లేదన్నారు. ఇతర క్యాన్సర్ల లాగే సర్వైకల్‌ క్యాన్సర్‌ను కూడా జయించవచ్చని తెలిపారు. కొన్ని రకాల టెస్టుల ద్వారా ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ (HPV Vaccine) తీసుకోవడం ద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడ్డవచ్చని ఆమె సందేశం ఇచ్చారు.  https://twitter.com/i/status/1753677207913070756 ఏకిపారేస్తున్న నెటిజన్లు మరోవైపు పూనం పాండే చేసిన పనిపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్వైకర్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్న ఆమె ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదని అంటున్నారు. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి కూడా ఆ వ్యాధిపై అవగాహన కల్పించే మార్గముందని చెబుతున్నారు. మరణం అనేది ఎప్పటికీ జోక్‌ కాదని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.  పూనం పాండే తీసుకున్న నిర్ణయం అగౌరవంగా ఉందని.. ఇలాంటివి యాక్టింగ్‌ స్కూల్‌లో చేసుకుంటే బాగుంటుందని మరో నెటిజన్‌ అన్నారు. హెల్త్‌కేర్‌కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరువ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయని చెప్పారు.  అటు పూనం పాండే ఫేక్‌ మరణవార్త గురించి కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఒక డెడ్‌బాడీని లిఫ్ట్‌లోకి తీసుకురాగా అది పూనం పాండే లాగా నేను బతికే ఉన్నానని తిరిగి లేచినట్లు ఆ వీడియోలో ఉంది.  https://twitter.com/araza52505/status/1753689758847611052 మరికొందరు నెటిజన్లు ఇంకా విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుత డీప్‌ఫేక్‌ వీడియోలు విస్తృతంగా పెరిగిపోవడంతో ఆమె రిలీజ్‌ చేసిన వీడియో కూడా అలాంటిదేనని ఓ నెటిజన్లు కామెంట్‌ పెట్టాడు. ఆమె నిజంగానే చనిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.  ఇది ఆమె పబ్లిసిటీ స్టంట్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ఇది పూర్తిగా హేయమైన చర్య అంటూ మరో వ్యక్తి అభిప్రాయ పడ్డాడు.  ఆమె క్యాన్యర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయదని తన గురించి ప్రచారం కోసమే హేయమైన చర్యకు పూనుకున్నారని ఓ నెటిజన్‌ అన్నారు. ఆమె మరణవార్త విని తాను చాలా ఫీల్‌ అయ్యాయని.. ఎందుకంటే తన తండ్రి కూడా అలాగే చనిపోయాడని అతడు చెప్పుకొచ్చాడు. ‘అందరూ నన్ను క్షమించండి’ పూనం ఫేక్‌ మరణవార్తపై విమర్శలు వస్తోన్న వేళ ఆమె మరో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తను చేసిన పని వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారు క్షమించాలని అందులో కోరారు. ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేయాలన్నది తన ఉద్దేశం కాదని.. సర్వైకల్‌ క్యాన్సర్‌పై విస్తృత ప్రచారం కోసమే తాను ఇలా చేశానని పునరుద్ఘటించారు. ఈ ఫేక్‌ మరణవార్తను కాసేపు పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ సర్వైకర్‌ క్యాన్సర్‌ గురించే చర్చించుకున్నారని గుర్తు చేసారు. ఆ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలగడం అత్యవసరమని చెప్పారు. తన మరణవార్త ద్వారా ఏం జరగాలని ఆశించానో అది నేరవేరిందని అన్నారు. ఇలా చెప్తునందుకు తాను గర్వపడుతున్నట్లు వీడియోను ముగించారు.   https://twitter.com/i/status/1753677387232096338
    ఫిబ్రవరి 03 , 2024
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    Hanuman Viral Video: ‘హనుమాన్‌’ చూస్తూ థియేటర్లో మహిళ వింత ప్రవర్తన.. కారణం దైవమా? దెయ్యమా?
    సంక్రాతికి విడుదలైన హనుమాన్‌ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతూ తన జైత్రయాత్రను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్‌ రావడం పక్కా అని వీక్షకులు చెబుతున్నారు. సినిమాలోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని చిత్రం విడుదలైనప్పటికీ నుంచి ఆడియన్స్‌ పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో (Hanuman Viral Video) బయటకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.  మహిళ విచిత్ర ప్రవర్తన హనుమాన్‌ క్లైమాక్స్‌ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఒంట్లోకి ఎవరో ఆవహించినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనతో సినిమా చూస్తున్నవారు షాకయ్యారు. ఆ మహిళను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. https://twitter.com/i/status/1752014453342969952 ఒంట్లోకి దేవుడు వచ్చాడా? ఉప్పల్‌లోని ఏసియన్‌ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటను చూస్తూ ఆ మహిళ పూనకం వచ్చినట్లు ప్రవర్తించిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఒంట్లోకి దేవుడు పూనాడని అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉండొచ్చని అంటున్నారు. గ్రామ దేవతలు ఆవహించినప్పుడు కొందరి ప్రవర్తన సరిగ్గా ఇలాగే ఉంటుందని గుర్తు చేస్తున్నారు.  దుష్టశక్తే ఈ పని చేసిందా? మరికొందరు నెటిజన్లు మరో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంలో నెగిటివ్‌ ఎనర్జీ ఉండి ఉండవచ్చని అంటున్నారు. హనుమాన్‌ మూవీ చూస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. హనుమాన్‌ దెబ్బకి ఆ దుష్టశక్తి ఆమె ఒంట్లో నుంచి వెళ్లిపోయి కూడా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఈ రెండు విభిన్నమైన వాదనలలో ఏది నిజమో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.  అసలు నిజం ఇదే! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా చూస్తున్న క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చాయని మహిళ సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకే ఆమె ఊగిపోయిందని సమాచారం. కొద్ది సేపటి తర్వాత సదరు మహిళ సాధారణ స్థితిలోకి వచ్చేసిందని చెబుతున్నారు. అసలు నిజం బయటకు వచ్చేలోపే వీడియో వైరల్‌ కావడంతో విభిన్నమైన అభిప్రాయాలు బయటకొచ్చాయి.  రూ.300 కోట్ల దిశగా పరుగులు ఇక హనుమాన్‌ సినిమా (Hanuman Collections) విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రూ.300 కోట్ల మార్క్‌ను ‌అందుకునేందుకు చకా చకా అడుగులు వేస్తోంది. హనుమాన్‌ మ్యానియా థియేటర్లలో కొనసాగుతుండటంతో ఈ వారంలోనే రూ.300 కోట్ల గ్రాస్‌ వచ్చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తూ సీక్వెల్‌పై ఫోకస్‌ పెట్టారు. 
    జనవరి 30 , 2024
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న.. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. టైట్‌ ఫిట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోసింది. కొంటె చూపులతో మత్తెక్కించే ఫోజుల్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి.  విజయ్‌ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తాజాగా పుకార్లు రేకెత్తాయి.  విజయ్‌, రష్మిక వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని టాక్‌ వినిపించింది. మంచి రోజు చూసుకొని ఎంగేజ్‌మెంట్‌, కొద్ది రోజుల వ్యవధిలోనే వివాహాం కూడా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.  నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్‌ టీమ్‌ తాజాగా స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.  ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం విజయ్‌, రష్మిక కలిసి వర్క్‌ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్‌, డిన్నర్‌ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్‌ వినిపించాయి.  రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్‌ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్‌ వీడియో ఘటనపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్‌ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్‌' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.  2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.  అదే ఏడాదిలో వచ్చిన విజయ్‌ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్‌ మూవీ పర్వాలేదనిపించింది.  ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్‌’, బన్నీతో  ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.  హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌ బై’, సిద్దార్థ్‌ మల్హోత్రాతో జంటగా ‘మిషన్‌ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.  ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో ఈ భామ నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.  పుష్ప-2తో పాటు రష్మిక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది. 
    జనవరి 09 , 2024
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. డిసెంబర్‌ 11 - 17 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు పిండం శ్రీరామ్‌ లేటెస్ట్‌ హారర్‌ మూవీ ‘పిండం’ (Pindam) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సాయికిరణ్‌ దైదా తెరకెక్కించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ‘మరణం అనేది నిజంగానే అంతమా? కోరికలు తీరని ఆత్మలు మనకు నిజంగానే హాని చేయగలవా?’ అంటూ ఇటీవల విడుదల చేసిన ప్రచారం చిత్రం భయపెడుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. కలశ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కలశ’ (Kalasa) ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. కొండా రాంబాబు తెరకెక్కించిన చిత్రాన్ని రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జోరుగా హుషారుగా విరాజ్‌ అశ్విన్‌ హీరోగా అను ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’ (joruga husharuga). నిరీష్‌ తిరువిధుల నిర్మాతగా వ్యవహరించారు. పూజిత పొన్నాడ కథానాయిక. ‘బేబీ’తో ఆకట్టుకున్న విరాజ్‌ హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెంచేశాయి. యువతను మెప్పించేలా ప్రచార చిత్రాలు ఉండటంతో సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. డిసెంబరు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తికమక తాండ కవలలైన హరికృష్ణ, రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రం ‘తికమక తాండ’(tikamaka tanda). యాని, రేఖ నిరోషా కథానాయికలు. వెంకట్‌ దర్శకత్వం వహించారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చే క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘చే’. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం చెప్పుకోతగ్గ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ కావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపై పడింది. సరిగ్గా దీన్ని వినియోగించుకుంటున్న ఓటీటీ సంస్థలు ఈ వారం ఏకంగా 32 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో వీక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉండటం విశేషం. ఈవారం రిలీజ్‌ కాబోతున్న వాటిలో ముఖ్యమైనవి ఏవో ఇప్పుడు చూద్దాం.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTiger 3MovieTelugu/HindiAmazon PrimeDec 12Deaths GameSeriesEnglishAmazon PrimeDec 15Reacher Season 2SeriesEnglishAmazon PrimeDec 15FalimyMovieMalayalamDisney+HotstarDec 15The Freelancer Season 2SeriesHindiDisney+HotstarDec 15Japan MovieTeluguNetflixDec 11Single Inferno Season 3SeriesEnglish/KoreanNetflixDec 12The Crone Season - 6MovieEnglishNetflixDec 14Sesham Mike-il FathimaMovieMalayalamNetflixDec 15YellowMovieEnglishNetflixDec 15UstaadTv ShowTeluguEtv WinDec 15The BlackeningMovieEnglishJio CinemaDec 15Koose Munisamy VeerappanSeriesTelugu/TamilZee 5Dec 14
    డిసెంబర్ 11 , 2023
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..  టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    Mega Princess: ఈ ఆడ బిడ్డ మాకు ‌అపురూపం.. ఎమోషనలైన చిరంజీవి!
    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిరంజీవి ఎమోషనల్.. ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సంతోష క్షణాలు నిజం కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పొయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కి సుస్వాగతం. నీ రాక‌తో లక్షలాది మంది ఉన్న మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. నీ రాక వల్ల రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులైతే, మేం గ్రాండ్ పేరెంట్స్ అయ్యాం. ఈ ఆనంద క్షణాలు సంతోషంగా గ‌ర్వంగా ఉన్నాయి' అంటూ లిటిల్ మెగా ప్సిన్సెస్ రాక‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.  https://twitter.com/KChiruTweets/status/1671005792965902337?s=20 అలాగే అపోలో ఆస్పత్రి వద్ద వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఉద్దేశిస్తూ మెగాస్టార్ మాట్లాడారు. తన మనవరాలి రాకపై ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం 1.49 నిమిషాలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం.. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరూ తల్లిదండ్రులు కావాలని, మాచేతుల్లో బిడ్డను పెట్టాలని మేము కోరుకున్నాం. అతి ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల నెరవేరింది అని చెప్పుకొచ్చారు. https://twitter.com/TweetRamCharan/status/1671049788777975808?s=20 11 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. జూన్ 14న 11వ వివాహ వార్షికోత్సవం సైతం జరుపుకున్నారు. వారం రోజులు తిరగక ముందే మెగా ప్రిన్సెస్ రావడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరిసింది.  రామ్‌చరణ్- ఉపాసనలు తాము పేరెంట్స్ అవుతున్నామనే విషయాన్ని ఎప్పడెప్పుడూ చెబుతారా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.  చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఉపాసన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది.  డెలివరీ కోసం అంతర్జాతీయ వైద్య బృందం తన డెలివరీ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యులను ఎంచుకుంది. డాక్టర్ సుమనా మనోహర్,  డాక్టర్ రూమా సిన్హా  అపోలో ఆస్పత్రుల్లో OB/GYN బృందంలో కీలకంగా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ కూడా ఉపాసన డెలివరి బృందంలో భాగంగా మారారు. వీరి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఉపాసన. డెలివరీ డేట్ దగ్గరపడటంతో ఆపోలో ఆస్పత్రిలో  ఈ అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలోఉపాసన ప్రసవించింది. ఐకాన్ స్టార్ రాక.. రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో వారిని విష్ చేసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ‌అపోలో ఆస్పత్రి వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహారెడ్డి దంపతులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని దీవించారు. రామ్‌చరణ్- ఉపాసనలకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/ANI/status/1671037419255373824?s=20  అటు చరణ్‌-ఉపాసనలకు శుభాకాంక్షలు చెప్పేందుకు మెగా ఫ్యాన్స్‌ ఆస్పత్రికి పొటెత్తారు. సోషల్ మీడియాలోనూ #MegaPrincess హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    దేశంలో ‘ఆదిపురుష్‌’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్‌ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్‌ నిజంగానే దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆదిపురుష్‌ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్‌ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్‌ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్‌ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్‌ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్‌ బడ్జెట్‌ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్‌’ నిలిచింది.  పెట్టుబడికి ఢోకా లేదు ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్‌ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారానే బడ్జెట్‌ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్‌ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్‌ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్‌ కలెక్షన్స్‌ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్‌ టీమ్‌ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  దంగల్‌ VS ఆదిపురుష్‌ దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్‌ చేయాలంటే ఆదిపురుష్‌ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్‌.. చైనా, హాంకాంగ్‌, మలేషియా, UAE, బ్రిటన్‌, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్‌ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్‌ కథ యూనివర్సల్‌ సబ్జెట్‌ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్‌ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్‌ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్‌ టాక్‌ తోడైతే ఆదిపురుష్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.  రిలీజ్ ఎప్పుడంటే? ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్‌ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్‌’ జూన్‌ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, వంశీ, ప్రమోద్‌, ఓంరౌత్‌ నిర్మించారు. 
    మే 11 , 2023
    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!
    Ponniyin Selvan-2 Review: పొన్నియన్‌ సెల్వన్‌ నటుల విశ్వరూపం… మణిరత్నం నుంచి మరో కళాఖండం!
    తమిళ్‌ సూపర్ స్టార్లతో దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌కు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందంటే? కొందరు అర్థంకాలేదన్నారు. అయితే.. ఆ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు విడిచిపెట్టారు దర్శకుడు. వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు పొన్నియన్ సెల్వన్‌ 2ని తీర్చిదిద్దారు. గత నెల రోజుల నుంచి భారీగా ప్రమోషన్లు చేసిన ఈ చిత్రం విడుదలయ్యింది. మరీ, సినిమా విజయం సాధించిందా? మణిరత్నం మ్యాజిక్ పనిచేసిందా? అనేది సమీక్షిద్దాం. దర్శకుడు: మణిరత్నం నటీ నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్‌ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ కథేంటి? చోళ రాజ్య రాకుమారుడు అరుణ్మొళి ( జయం రవి ) ని అంతమెుందించడానికి జరిగిన కుట్రతో మెుదటి భాగం పూర్తవుతుంది. అతడు నిజంగానే చనిపోయాడా? లేదా సామంతరాజుల కుట్రలు తెలుసుకోవాలని వెళ్లిన వల్లవరాయుడు ( కార్తీ ) కాపాడాడా? తమ్ముడి మరణించినట్లు వస్తున్న వార్తలతో ఆదిత్య కరికాలుడు( విక్రమ్ ) ఏం చేశాడు ? చోళుల అంతం చూడాలని నందినీ( ఐశ్వర్య రాయ్‌ ) ఎందుకు అనుకుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానమే పొన్నియన్ సెల్వన్‌ 2 కథ.  ఎలా ఉంది మెగాస్టార్‌ వాయిస్‌ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అరుణ్మోళిని వల్లవరాయుడు, నందినీ, బుద్దిస్టులు కాపాడటంతో కథ మెుదలవుతుంది. కుట్ర విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడి ఎత్తుగడలతో చకచకా ముందుకు కదులుతుంది.  ఆదిత్య కరికాలుడు- నందినీ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఇద్దరూ ఎదురుపడిన సంఘటన మరో లెవల్‌లో ఉంటుంది. చోళులను అంతం చేయాలని నందినీ ఎందుకు అనుకుంటుందనే సన్నివేశాలతో పాటు రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకునే పళవెట్టురాయర్‌ ఎత్తుగడలతో ఎక్కడా బోర్ కొట్టదు.  త్రిష, ఐశ్వర్య రాయ్‌ ఇద్దరూ కలిసి కనిపించిన ఫ్రేమ్ చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా మెరిశారు. సినిమా ప్రారంభమైన తర్వాత డీసెంట్ స్క్రీన్‌ప్లే వెళ్లినప్పటికీ కాస్త స్లో నరేషన్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ఇది మణిరత్నం స్టైల్‌ అయినప్పటికీ మరికొంత మెరుగ్గా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్‌ను త్వరగా ముగించాలని చేసినట్లు అనిపిస్తుంది. మరింత ఫోకస్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేది. ఎవరెలా చేశారు ? పొన్నియన్ సెల్వన్ 2లో విక్రమ్‌ తన విశ్వరూపం చూపించాడు. మెుదటిపార్ట్‌లో తక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉన్నప్పటికీ ఇందులోనూ ఆయనదే హవా. మరో గుర్తుండిపోయే క్యారెక్టర్‌ అంటే ఐశ్వర్య రాయ్‌ అనే చెప్పాలి. నెగటివ్ షేడ్‌ ఉన్న పాత్రలోనూ నటించి మెప్పించింది. జయం రవి, కార్తీ తమ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో చాలామంది కనెక్ట్ అయ్యేది వల్లవరాయన్ కార్తీ పాత్రతోనే. ప్రేక్షకులు ఈ సినిమాలోనూ ఆ క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తారు. త్రిష, శోభితా దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి పాత్రల పరిధి మేరకు నటించారు.  దర్శకుడు మణిరత్నం మెుదటి భాగంతో పోలిస్తే రెండో పార్ట్‌ను కాస్త మెరుగ్గా తీశారని చెప్పవచ్చు. సినిమాను నీట్‌గా హ్యాండిల్ చేశారు. స్లో నెరేషన్ చేసినప్పటికీ ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టడం ఖాయమే.  సాంకేతిక పనితీరు సినిమాకు హైలెట్‌గా నిలిచింది సినిమాటోగ్రఫీ. రవి వర్మన్ తన పనితీరుతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దర్శకుడి ఊహా చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా ప్రేక్షకులకు చూపించిన గొప్పతనం ఆయనకే దక్కుతుంది. ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్‌. ఈ చిత్రంలో ఏ. ఆర్‌.రెహమాన్‌ తన ప్రతిభ చూపించినప్పటికీ కొన్ని చోట్ల మరింత బాగుండాలి అనిపిస్తుంది. మెుత్తంగా ఫర్వాలేదనే చెప్పాలి. కానీ, రెహమాన్ నుంచి ఆశించినంత స్థాయిలో లేదు.  బలాలు కథ, కథనం నటీనటులు సినిమాటోగ్రఫీ బలహీనతలు స్లో నరేషన్ రేటింగ్ : 3.25/5
    ఏప్రిల్ 28 , 2023

    @2021 KTree