ATelugu2h 23m
పోలీసు ఆఫీసర్ కావాలని హీరో (తిరుపతి) కలలు కంటుంటాడు. మరోవైపు అదే పోలికలతో ఉన్న ఏసీపీ బల్‌దేవ్ సహాయ్ మనుషులు హోం మంత్రి తమ్ముడ్ని కిడ్నాప్ చేస్తారు. అనంతరం అండర్‌గ్రౌండ్‌కు తీసుకెళ్తారు. పోలీసు అధికారి లాగే ఉన్న తిరుపతిని చూసి బలదేవ్ సహాయ్ స్థానంలోకి హోంమంత్రి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ బల్‌దేవ్ సహాయ్ ఏమయ్యాడు? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
తిరుపతిరెజీనా కసాండ్రా
వైష్ణవిహన్సిక మోత్వాని
తన ఉంగరాలకు అదృష్ట శక్తులు ఉన్నాయని మరియు తిరుపతి ప్రేమ ఆసక్తి ఉందని అందరినీ ఫూల్స్ చేస్తుంది.బ్రహ్మానందం
చివరికి బలదేవ్ తన తమ్ముడు తిరుపతి అని భార్యను మోసం చేస్తాడు.ప్రకాష్ రాజ్
అతను మొదట బల్దేవ్‌ను ద్వేషించడం ప్రారంభించాడు కానీ నెమ్మదిగా అతని అభిమానిగా మారడం ప్రారంభించాడు.ముఖేష్ రిషి
హోం మంత్రి జయవర్ధన్వినయ ప్రకాష్
బలదేవ్ తల్లికోట శ్రీనివాసరావు
బలదేవ్ మామపోసాని కృష్ణ మురళి
రాజాసంపత్ రాజ్
గంగూలీ భాయ్అజయ్
కుందన్సుబ్బరాజు
రాజీవ్ఆదిత్య మీనన్
ACP గౌతమ్హరీష్ ఉత్తమన్
కిషోర్ వర్ధన్ / చోటుబ్రహ్మాజీ
వెంకట్ప్రగతి మహావాది
జయవర్ధన్ భార్యసుమిత్ర
జయవర్ధన్ తల్లిసురేఖ వాణిపద్మ
సప్తగిరి
బెళహరిఉత్తేజ్
తివారీసత్యం రాజేష్
రాజేష్శివన్నారాయణ నారిపెద్ది
రాజేష్ తండ్రిపృధ్వీ రాజ్
క్యాబినెట్ మంత్రిజీవా
జయవర్ధన్ సహాయకుడుహర్ష చెముడు
వైవా హర్షకాశీ విశ్వనాథ్
నిరుపమ తండ్రిసూర్య
డాక్టర్ నిజోయ్సమీర్
డాక్టర్సత్య ప్రకాష్
ఫిరోజ్ భాయ్రఘు కారుమంచి
రఘునర్సింగ్ యాదవ్
గుండు సుదర్శన్
శంకర్ మెల్కోటే
డాక్టర్జోగి బ్రదర్స్ కానిస్టేబుల్స్
మీనాగీత
ఎంఆర్ గోపకుమార్
స్వయంగాకళాభవన్ మణి
స్వయంగాతనికెళ్ల భరణి
స్వయంగాసిబ్బంది
కెఎస్ రవీంద్ర
దర్శకుడురాక్లైన్ వెంకటేష్
నిర్మాతతమన్ ఎస్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
Nayanthara: నయనతార టాప్-10 పవర్ ఫుల్ రోల్స్.. ఆమె నటనకు సెల్యూట్ చేయాల్సిందే!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
సెప్టెంబర్ 08 , 2023
PAWAN KALYAN: IMDBలో పవర్ స్టార్ టాప్ రేటెడ్ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్ క్రేజ్ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్ రేటెడ్ పవన్ మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. తొలి ప్రేమ
IMDBలోని పవన్ కల్యాణ్ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ అని సాంగ్.
2. ఖుషి
పవన్ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్ మేనరిజమ్స్, సొంతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ మూవీకే హైలెట్ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.
3. తమ్ముడు
1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్ కల్యాణ్ నటించాడు. ఇందులో పవన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.
4. జల్సా
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.
5. బద్రి
పూరి జగన్నాథ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్' అనే డైలాగ్ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.
6. అత్తారింటికి దారేది
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.
7. గోపాల గోపాల
పవన్ కల్యాణ్, వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్ దేవుడిలా కనిపించడం విశేషం.
8. గబ్బర్ సింగ్
హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.
9. వకీల్‌సాబ్
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్ సాబ్ (Vakeel saab). హిందీ పింక్ చిత్రానికి ఇది రీమేక్. 2021లో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్ సంపాదించింది.
10. పంజా
‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్, అంజలి లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం.
జూలై 31 , 2023
WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.
పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023
WOMEN DAY SPECIAL: తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
]చంద్రముఖిచంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2023
WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం.
సీతారామం
సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2024
Akhanda Movie Dialogues: గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే
కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన అఖండ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన చిత్రం ఇది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వచ్చిన సెకండ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరగా నటించిన తీరు ప్రేక్షుకులను మెప్పించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎలివేషన్, బాలయ్య డైలాగ్ మాడ్యులేషన్‌కు బాగా హెల్ప్ అయింది. ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ అభిమానుల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ పవర్ ఫుల్ డైలాగ్స్‌ను మీరు ఓసారి చూసేయండి.
“ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!”
“ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!“
“హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.”
“నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!”
“విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.”
“నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.”
“లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.”
“ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!”
“మీరు మా అంటే సెల్‌లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్‌కి పంపించా..”
“మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువుకు ఎదురెళ్తాం”.
“దేవుడిని కరుణించమని అడగాలి, కనిపించమని కాదు.”
“రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది, అడుక్కుంటే వచ్చేది కాదు.”
“మేము ఎక్కడికైనా వెళ్తే తల దించుకోము.. తల తెంచుకుని వెళ్లిపోతాం.”
అక్టోబర్ 26 , 2024
Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ స్టైలిష్, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్‌కమింగ్ హీరో మేకోవర్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.
బాలయ్య సినిమాతో ఎంట్రీ?
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న 'అఖండ' (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్ రాశారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
హనుమాన్ దర్శకుడితో!
మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్ ఫిల్మ్ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ (Hanuman) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్ వర్మకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ రిలేషన్‌తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
హ్యాండ్సమ్ లుక్‌లో..
నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లోకి మారిపోయాడు. హీరో కటౌట్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్‌తో మోక్షజ్ఞ మెస్మరైజ్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్ హీరో మెటీరియల్ అని తన న్యూ లుక్ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు.
https://twitter.com/AKKINENI_9999/status/1808086164647153776
29 ఏళ్లకు తెరంగేట్రం!
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్.. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్‌గా మోక్షజ్ఞ లుక్ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
జూలై 09 , 2024
OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పవన్ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ముందే ‘ఓజీ’ రిలీజ్?
పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ మూవీని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
హరిహర వెనక్కి తగ్గాల్సిందే!
పవన్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. అయితే పవన్ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్ వచ్చినప్పటికీ క్రిష్ 60 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న దృష్ట్యా పవన్ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 11 , 2024
Pawan Kalyan: సెలబ్రిటీలను టార్గెట్ చేసిన పవన్.. ఏ క్షణమైనా పోసాని, ఆర్జీవీ అరెస్టు!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పదేళ్ల రాజకీయ నిరీక్షణ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుపించుకోగా అతను కూడా కొద్ది నెలలకే అధికార వైకాపా ప్రభుత్వంలో చేరిపోయారు. దీంతో పవన్‌ను టార్గెట్ చేస్తూ వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సైతం పవన్ దారుణ విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి పెద్ద ఎత్తున పవన్‌పై టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఆర్జీవీ పవన్‌ను ట్రోల్ చేస్తూ ఏకంగా సినిమా కూాడా తీశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-భాజపా) అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పవన్‌ను ఎంతగానో విమర్శించిన ఆర్జీవీ, పోసానిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఆర్జీవీపై వరుస కేసులు
సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఇవాళ (నవంబర్ 11) ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ‘వ్యూహం’ మూవీ ప్రమోషన్ల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ (Nara Lokesh), బ్రాహ్మణి (Nara Brahmani), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఆర్జీవీపై సమీప స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆర్జీవీపై గుంటూరు జిల్లా తాళ్లురు పోలీసు స్టేషన్‌లోనూ కేసు పెట్టారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు పోలీసులకు ఇవాళ కంప్లైంట్ చేశారు. డైరెక్టర్ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో తుళ్లూరు పోలీసులు సైతం ఆర్జీవీ కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీని విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
త్వరలో పోసాని అరెస్టు!
పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. వైసీపీ స్థాపన తరువాత జగన్ పంచకు చేరారు. 2019 ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. జగన్ సీఎం అయ్యాక వైసీపీ నేతల కంటే మరింత ఘాటుగా పవన్, చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా పవన్‌పై పలు ప్రెస్‌మీట్లలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. పవనో మెంటల్ కేసని, పైసల కోసమే మెగా ఫ్యామిలీ పార్టీలు పెట్టిందని గతంలో పోసాని మండిపడ్డారు. మట్టిగొట్టుకుపోతావ్ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గతంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమోచ్చినట్లు తిట్టిన వారిపై పాత కేసులను తిరగదోడుతుండటంతో ఓ క్షణమైన పోసాని అరెస్టు కావొచ్చని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
సినీ నటి శ్రీరెడ్డి (Sri Reddy) వైసీపీ మద్దతుదారులనేదీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కల్యాణ్ తల్లిని సైతం ఆమె దూషించిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వారిపై ఏపీ పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో శ్రీరెడ్డిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తనను క్షమించాలంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియోను సైతం రిలీజ్ చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పేరును ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పింది. ఇకపై తన మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టనని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.
ప్రకాష్ రాజ్‌పై చర్యలుంటాయా?
ఇటీవల తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) వివాదం జరిగిన సంగతి తెలిసిందే. పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ప్రకాష్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సందించారు. జస్ట్ ఆస్కింగ్ హ్యాష్‌ట్యాగ్‌తో పవన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. పవన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రకాష్‌రాజ్‌కు సంబంధం లేని విషయంలో దూరి మరి విమర్శలు చేయడంపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌పైనా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత కేసులనే ఏపీ పోలీసులు తిరగదోడుతున్నారు. పైగా ప్రకాష్ రాజ్‌పై ఏ స్టేషన్‌లోనూ కేసు నమోదు కానందున ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 11 , 2024
Akira Nandan: అకీరా నందన్ గురించి ఈ టాప్ - 10 సీక్రెట్స్ తెలుసా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్ కల్యాణ్ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం.
అకీరానందన్ 2004 ఏప్రిల్ 8న పవన్ - రేణు దేశాయ్ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.
అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్, రానా, వరుణ్ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.
అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.
అకీరా నందన్ ఫేవరేట్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదట. యంగ్ హీరో అడివి శేష్ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్ గతంలో వెల్లడించింది.
ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు.
అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.
ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్ కల్యాణే చూసుకుంటున్నారు.
తన తల్లికి పవన్ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్ అకీరాలో రాకుండా రేణు దేశాయ్ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట.
అకీరానందన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.
ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.
అక్టోబర్ 21 , 2024
Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన పవన్ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీగా మారిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే పవన్ తీరిక చేసుకొనిమరి పెండింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల హరిహర వీరమల్లును సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు కల్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటైన ‘ఓజీ’ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లును రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తుండటంతో ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.
https://twitter.com/mogali_sat77717/status/1846452019868877252
ఓజీ షూటింగ్ రీస్టార్ట్
పవన్ కల్యాణ్ పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది.
https://twitter.com/DVVMovies/status/1846206901295763648
త్వరలోనే సెట్స్‌పైకి పవన్!
ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ఓజీ షూటింగ్‌ను తిరిగి పునఃప్రారంభించారు సుజీత్. ముందుగా పవన్ లేని సీన్స్‌ను డైరెక్టర్ సుజీత్ షూట్ చేయనున్నారు. కొద్ది రోజుల్లో పవన్ కూడా ఈ మూవీ షూటింగ్ పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓజీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ షూట్‌లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
హైప్ పెంచిన థమన్!
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడు. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ vs విజయ్ దేవరకొండ!
‘హరిహర వీరమల్లు’ రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అటు హరిహర వీరమల్లు టీమ్ కూడా అదే డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను విజయ్ దేరరకొండ ఢీకొట్టక తప్పదని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. కాబట్టి పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్టోబర్ 16 , 2024
OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్ పెంచిన థమన్.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్ పక్కా’!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థమన్ ఏమన్నారంటే?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
పాన్ ఇండియా స్థాయిలో
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్ సైతం ఓజీ హైప్ క్రియేట్ చేసింది.
https://twitter.com/tollymasti/status/1822184749072294337
అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్!
సంగీత దర్శకుడు థమన్ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్ డేట్‌ను సైతం కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్ మరింత ఇష్టుడిగా మారిపోయారు.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 05 , 2024
Pawan Kalyan: హిందీ షోలో పవన్‌పై రూ.1.60 లక్షల ప్రశ్న.. నార్త్‌లోనూ క్రేజ్ మాముల్గా లేదుగా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టాలీవుడ్‌తో పాటు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకొని సత్తా చాటారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఏపీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత హిందీ టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ప్రశ్న వేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రశ్న ఎంటంటే?
ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.
https://twitter.com/i/status/1834848187862986820
పవన్ లైనప్
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు భారీ చిత్రాలు సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలను పవన్ ఫినిష్ చేయాల్సి ఉంది. ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే తప్పుకోవడంతో ఆ బాధ్యతలను జయకృష్ణ చేపట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్’ సింగ్ రావాల్సి ఉంది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో 'ఓజీ' చిత్రాన్ని పవన్ పట్టాలెక్కించారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన గ్లింప్స్, ప్రమోషన్ పోస్టర్స్ ఇప్పటికీ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా 'ఓజీ' కోసం పవన్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇందులో తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.
రాజకీయాల్లో బిజీ బిజీ
ఏపీ ఎన్నికలకు మూడు నెలల ముందే పవన్ షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. దీంతో అప్పటివరకూ చురుగ్గా షూటింగ్ జరుపుకున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఏపీ ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన అద్భుత విజయాన్ని సాధించడం, అతడు కూటమిగా ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంతా చకచకా జరిగిపోయింది. అయితే తాను సినిమాల్లో నటిస్తానని పవన్ స్పష్టం చేశారు. కానీ, తన తొలి ప్రాధాన్యత ప్రజాసేవకే అని, వీలైనప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు షూటింగ్‍లు చేసి పెండింగ్‍లో ఉన్న చిత్రాలు పూర్తి చేస్తానని పవన్ చెప్పారు. దీంతో వాయిదా పడ్డ సినిమాలు తిరిగి పట్టాలెక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
జనసేనాని పవన్ కల్యాణ్ తిరిగి మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హరివీర మల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదే రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 20 రోజుల పాటు షూటింగ్‌లోనే ఉండనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 14 , 2024
HBD Nidhhi Agerwal: ‘హరి హర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్.. నిధి అగర్వాల్‌ను సర్‌ప్రైజ్ చేసిన టీమ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్టు 17) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో నిధి అదరగొట్టింది. మహారాణి గెటప్‌లో ఒంటిపై ఆభరణాలతో ఆమె మరింత అందంగా కనిపించింది. అసలే షూటింగ్ జరగట్లేదన్న ఆందోళనలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిధి పోస్టర్ సంతోషాన్ని కలిగిస్తోంది.
https://twitter.com/FilmyNagri/status/1824752513574134185
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాజాసాబ్' చిత్రంలోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌లో నిధి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/rajasaabmovie/status/1824688858853937198
నిధి హైదరాబాద్‌లోనే జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం బెంగళూరు. బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే జీసినిమా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది.
నాగ చైతన్య హీరోగా చేసిన 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో చిత్ర పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ఆ తర్వాత చైతూ సోదరుడు అక్కినేని అఖిల్ పక్కన ఈ అమ్మడికి అవకాశం దక్కింది. 'మిస్టర్ మజ్ను'లో వారిద్దరు కలిసి చేశారు. అది కూడా ఫెయిల్ అయింది.
అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలూ ఫ్లాపవడంతో నిధి కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. దీనితో నిధికి టాలీవుడ్ లోనూ చుక్కెదురయింది.
అవకాశాలు సన్నగిల్లాయి అనుకుంటున్న సమయంలోనే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'లో నిధికి అవకాశం దక్కింది. ఆ మూవీ హిట్ కావడంతో నిధికి వరుస ఆఫర్లు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో నిధి హీరోయిన్‌గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ ఈ సినిమాకు షెడ్యూల్స్ ఇవ్వకపోవడంతో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
ఓ వైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. 'ఈశ్వరన్', 'కలగ తలైవన్' చిత్రాలతో తమిళ ప్రేక్షకులను పలకరించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ నిధి చాలా చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.
గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నిధిని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాను 29.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఆగస్టు 17 , 2024
Hari Hara Veera Mallu: పవన్ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్.. టీజర్ కోసం సిద్ధంకండి!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవన్ చేతిలో 'ఓజీ' (OG), ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. క్రిష్ (Krish) దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మినహా మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి అడపాదడపా ఏదోక అప్‌డేట్ వస్తూనే ఉంది. దీంతో పవన్ - క్రిష్ చిత్రంపై అభిమానుల్లో ఆశలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి (ఏప్రిల్ 17)ని పురస్కరించుకొని హరి హర వీరమల్లు యూనిట్ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఇవాళ (ఏప్రిల్ 17) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మీ ముందుకు... ‘ధర్మం కోసం యుద్ధం’.. త్వరలో’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్ ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో అని కాకుండా ఒక డేట్‌ను అనౌన్స్ చేసి ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.
ఆందోళనలకు చెక్!
పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో ఆయన చేతిలోని చిత్రాలన్నీ హోల్డ్‌లో పడిపోయాయి. అసలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ పైన ఎక్కువ అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ మెుదలై మూడేళ్లు దాటినా.. ఇప్పటివరకు విడుదల తేదీపై క్లారిటీ లేదు. పైగా డైరెక్టర్ క్రిష్.. అనుష్కతో ఓ సినిమాకు కూడా అనౌన్స్ చేయడంతో ఇక హరిహర వీరమల్లు ఇప్పట్లో రానట్లేనని అంతా భావించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హరిహర వీరమల్లు నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయి.
ఏప్రిల్ 17 , 2024
PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే... దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఆయన క్రేజ్‌ను మ్యాచ్ చేయడం అంటే అంత తేలిక కాదు. అటు సినీరంగంలోనూ, రాజకీయాల్లోనూ కొనసాగుతూ తనదైన ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గురించి నెటిజన్లు గూగుల్‌లో శోధన మొదలు పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏంటీ? దానికి గూగుల్ ఇచ్చిన క్రేజీ సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్ర: పవన్ కళ్యాణ్ ఇళ్లు ఎక్కడ?
గూ: హైదరాబాద్- జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2021లో ఓ ఇళ్లును కొనుగోలు చేశాడు. అక్కడే తన భార్య
అన్నా లెజ్నెవా వారి కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటంతో తన నివాసాన్ని అమరావతికి మార్చాడు.
ప్ర: పవన్ కళ్యాణ్ పట్టిన రోజు ఎప్పుడు?
గూ: పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 1971లో జన్మించారు
ప్ర: పవన్ కళ్యాణ్ ఎత్తు ఎంత?
గూ: 1.78 మీటర్లు
ప్ర: పవన్ కళ్యాణ్ సొంతంగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ పేరు?
గూ: కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్
ప్ర: పవన్ కళ్యాణ్ పూర్తిగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ ఏది?
గూ: కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు
ప్ర: పవన్ కళ్యాణ్ ఏ ప్రొడక్షన్ నెట్‌వర్క్ క్రింద సినిమాలను నిర్మిస్తున్నారు?
గూ: అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
ప్ర: పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్ పేరు ఏమిటి?
గూ: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ పవన్ ఫస్ట్ హీరోయిన్
ప్ర: పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు పొందిన మొదటి భార్య గురించి?
గూ: నందిని. పవన్ కళ్యాణ్‌కు నందిని సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం కావడం జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. విడాకుల అనంతరం నందిని తన పేరును జాన్వీగా మార్చుకుని డా. కృష్ణా రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు.
ప్ర: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు?
గూ: ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పారు.." నాకు ఒక వ్యక్తితో బంధం కుదరలేదు. నేను మరొకరిని వివాహం చేసుకోవలసి వచ్చింది. అలాగే ఇది కోరికతోనో, వ్యామోహంతోనో జరగలేదు. అవి అలా జరిగాయి. కానీ బాధను మాత్రం మిగిల్చాయి.
ప్ర: పవన్ కళ్యాణ్ ఫొన్ నంబర్?
గూ: 99047081XX లాస్ట్ రెండు డిజిట్స్ మాత్రం తెలియదు.
ప్ర: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఎవరు?
గూ: అన్నా లెజ్నెవా రష్యన్ మోడల్, నటి. తీన్‌మార్ చిత్రం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. వీరి వివాహం 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్- ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయంలో జరిగింది.
ప్ర: పవన్ కళ్యాణ్‌కు ఎంత మంది పిల్లలు?
గూ: పవన్ కళ్యాణ్‌కు నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సంతానంగా అకీరా, ఆద్య. మూడో భార్య అన్నా లెజ్నెవాకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా జన్మించారు.
మార్చి 19 , 2024
Ustaad Bhagat Singh: ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్ గట్టి కౌంటర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్ ఇచ్చేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరో గ్లింప్స్ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’
భగత్ బ్లేజ్(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8
అధికార వైసీపీకి గట్టి కౌంటర్!
ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్’ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1770055005283688593
పొలిటికల్ హీట్ పెంచిన డైలాగ్స్!
మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
మార్చి 19 , 2024
OG Movie Story: పవన్ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)?
ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ డేట్ అప్‌డేట్ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ సుజీత్ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.
సుజీత్ ‘డీపీ’ వైరల్
ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్ కల్యాణ్) కాగా, మరొకరు డైరెక్టర్ సుజీత్. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.
ఓజీపై శ్రియారెడ్డి హైప్
సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్ లైఫ్ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 17 , 2024
Cameraman Gangatho Rambabu: థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్ రచ్చ… సినిమా రీరిలీజ్‌కు కారణమదే!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ మూవీ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించింది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. బద్రి (2000) తర్వాత పవన్ - పూరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. అప్పట్లో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇవాళ ఈ సినిమా రీరిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీరిలీజ్‌కు కారణమదేనా!
టాలీవుడ్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ (Cameraman Gangatho Rambabu Re Release) ఒకరు. పైగా ఏపీ రాజకీయాల్లో జనసేన (Janasena Party) అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ రీరిలీజ్ కావడం ఆసక్తి రేపుతోంది. ఆయన పొలిటికల్ మైలేజ్‌ను మరింత పెంచేందుకు సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ సినిమా రీరిలీజ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
‘కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా రీరిలీజైన థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజైనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పేపర్ కటింగ్స్‌ను గాల్లోకి విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా మూవీలోని సీన్లను నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. #CameramanGangathoRambabu హ్యాష్‌ట్యాగ్‌తో ఆ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్లలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu Re Release) చిత్రాన్ని ప్రదర్శించారు. హీరో ఎంట్రీ సందర్భంగా ఫ్యాన్స్ చేసిన గోలతో థియేటర్ దద్దరిల్లింది. మరికొన్ని థియేటర్లలోనూ పవన్ ఎంట్రీ సందర్భంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
https://twitter.com/i/status/1755066839678460162
https://twitter.com/i/status/1755059327348752417
https://twitter.com/i/status/1755080872309490050
సినిమా ప్రదర్శనకు ముందు సంధ్య థియేటర్ బయట ఫ్యాన్స్ నినాదాలు చేశారు. పవన్ అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’ పేరుతో పరిసరాలను దద్దరిల్లేలా చేశారు. అదే సమయంలో ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. బాణాసంచా సైతం కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
https://twitter.com/i/status/1755097512300691556
https://twitter.com/i/status/1755050940854575519
https://twitter.com/i/status/1755076337927410140
ఏపీలోని వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ సందడి చేశారు. ముఖ్యంగా ఓ థియేటర్‌కు భారీగా వచ్చిన పవన్ ఫ్యాన్స్.. జనసేన జెండాలను ప్రదర్శించారు. స్క్రీన్ వద్దకు వెళ్లి ఈలలు, కేకలు వేస్తూ ఊర్రూతలూగించారు.
https://twitter.com/i/status/1755058297563185509
పవన్ ఎంట్రీ సందర్భంగా నటుడు ఎం.ఎస్ నారాయణ చెప్పే డైలాగ్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
https://twitter.com/i/status/1755087745880564102
సినిమాలోని ‘ఎక్స్‌ట్రాడ్నరీ’ పాట సందర్భంగా ఫ్యాన్స్ మరింత ఊగిపోయారు. కుర్చీలపైన నిలబడి మరి పవన్ స్టెప్పులను ఎంజాయ్ చేశారు.
https://twitter.com/i/status/1755074209372385626
‘మెలికలు తిరుగుతుంటే’ పాట కూడా పవన్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ పాటలో పవన్ స్టెప్పులను హైలేట్ చేస్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/i/status/1755130614301569433
https://twitter.com/i/status/1755074988850438494
ఓ థియేటర్‌లో పదుల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ స్క్రీన్ వద్దకు వెళ్లి చిందులు వేశారు. పాటను హమ్ చేస్తూ గోల గోల చేశారు.
https://twitter.com/i/status/1755087070811537517
పవన్ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిచేలా సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1755120800028582335
https://twitter.com/i/status/1755087298054766925
https://twitter.com/i/status/1755117782461567301
ఫిబ్రవరి 07 , 2024