UATelugu
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో జీవిస్తుంటాడు. పెద్ద తమ్ముడు ముత్తువేల్ (సందీప్ కిషన్) ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ సమస్యలు తెస్తుంటాడు. ఆ ఊళ్ళో దొరై (శరవణన్), సీతారాం (ఎస్.జే. సూర్య) అనే ఇద్దరు రౌడీలు ఉండగా ఓ రోజు దొరై అనూహ్యంగా చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారాం టార్గెట్ చేస్తాడు. దొరైని చంపింది ఎవరు? రాయన్ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
Watch
2024 Aug 134 months ago
రాయన్ చిత్రం ఆగస్టు 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రివ్యూస్
YouSay Review
Raayan Movie Review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ మెప్పించిందా?
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాయన్‘ (Raayan Movie Telugu Review). ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ ...read more
How was the movie?
తారాగణం
ధనుష్
S. J. సూర్య
సందీప్ కిషన్
కాళిదాస్ జయరామ్
సెల్వరాఘవన్
ప్రకాష్ రాజ్
అపర్ణ బాలమురళి
వరలక్ష్మి శరత్‌కుమార్
శరవణన్
అరవింద్ ఆకాష్
జయరామ్
నందా దురైరాజ్
సిబ్బంది
ధనుష్
దర్శకుడుకళానిధి మారన్
నిర్మాతధనుష్
రచయితAR రెహమాన్
సంగీతకారుడుఓం ప్రకాష్
సినిమాటోగ్రాఫర్ప్రసన్న జికె
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
D50: స్టార్లతో ధనుష్ ఫిల్మ్.. రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘రాయన్’
హీరో ధనుష్ 50వ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. బడా తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనుంది.
సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్, ధనుష్ సోదరీమణులు, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరాం, దసరా విజయన్, తదితరులు ఇందులో నటిస్తున్నారు.
ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
ఫ్యామిలీ చుట్టూ తిరిగే రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు.
ఇందులో ధనుష్, సందీప్ కిషన్ అన్నదమ్ములుగా నటించనున్నారు. సందీప్‌కు జోడీగా అపర్ణను తీసుకున్నారు.
ధనుష్‌కి హీరోయిన్‌ని ఇంకా ఎంపిక చేయలేదు. ఈ సినిమా కోసం ధనుష్ తన జుట్టును కత్తిరించుకున్నాడట.
చెన్నై వీధుల్లో జులై 1 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఓ గ్లింప్స్‌ని రిలీజ్ చేయనున్నారు.
తొలుత ఏకధాటిగా 90 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను ధనుషే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే 1 నిమిషం ఉన్న వీడియో గ్లింప్స్‌ని రెడీ చేశారట.
కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం ధనుష్ గడ్డం, జుట్టు పెంచాడు. ఇప్పుడు రాయన్ కోసం బొత్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది.
జూన్ 13 , 2023
Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది.
థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు.
3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది
తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది.
ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి.
ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్.
ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
అక్టోబర్ 23 , 2023
Raai Laxmi: బికినీలో రాయ్ లక్ష్మి సొగసుల సెగలు.. కుర్రాళ్లకు రత్తాలు హాట్ ట్రిట్
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
సెప్టెంబర్ 08 , 2023
This Week Movies: ‘రాయన్’ వచ్చేస్తున్నాడు.. ఒక్క వారంలో 18 చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు!
‘కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆ స్థాయి సక్సెస్ అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో జులై చివరి వారంలో ఆడియన్స్‌ను పలకరించేందుకు ఓ బడా చిత్రంతో పాటు రెండు చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలోనూ మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
రాయన్
ధనుష్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్’ (Raayan Movie). ఇందులో దుషారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలపై సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.
పురుషోత్తముడు
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). హాసిని సుధీర్ కథానాయిక. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాలకు నచ్చే పండగ లాంటి సినిమా ఇదని చిత్ర బృందం తెలిపింది.
ఆపరేషన్ రావణ్
రక్షిత్ అట్లూరి హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ రావణ్’ (Operation Raavan). వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా చేసింది. జులై 26న ఈ థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్ నటి రాధిక ఇందులో కీలక పాత్ర పోషించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ఇది ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఓటీటీ విడులయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
రాజు యాదవ్
గెటప్ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా జులై 24న ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’ (Aha) ఈ సినిమాను వీక్షించవచ్చు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను.. ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి, నవ్వులు పంచారు. హీరోయిన్‌గా అంకిత కారాట్ ఆకట్టుకున్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateCleo Season 2SeriesEnglishNetflixJuly 25The DecameronSeriesEnglishNetflixJuly 25Tokyo SwindlersSeriesEnglish/JapaneseNetflixJuly 25Elite Season 8SeriesEnglishNetflixJuly 26GhostbustersMovieEnglishNetflixJuly 26The Dragon Prince Season 6SeriesEnglishNetflixJuly 26The Ministry of Ungentlemanly WarfareMovieEnglishAmazon July 25Bloody IshqMovieHindiHotstarJuly 26Chutney SambarSeriesTamil HotstarJuly 26Bhaiyyaji MovieHindiZee 5July 26Chalte Rahe ZindagiMovieHindiZee 5July 26KalMovieTamil AhaJuly 23Grand MaaMovieTamil AhaJuly 24Which Brings To Meet YouMovieEnglishJio CinemaJuly 26
జూలై 22 , 2024
Raayan Movie Review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ మెప్పించిందా?
నటీనటులు : ధనుష్, సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు
కథ & దర్శకత్వం : ధనుష్
సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
ఎడిటింగ్ : ప్రసన్న జి.కె
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్
విడుదల తేదీ : 26 జులై, 2024
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ చిత్రం 'రాయన్' (Raayan Movie Telugu Review). ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) కీలక పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్(Prakash Raj), ఎస్. జే. సూర్య (S.J. Surya), జయరామ్ (Jayaram), వరలక్ష్మీ (Varalaxmi) ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ధనుష్‌కు మరో విజయాన్ని అందించిందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
గ్లోబల్ స్టార్ ధనుష్ ఎప్పటిలాగే ఈ సినిమాలో చక్కటి నటన కనబరిచాడు. రాయన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. అటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది. రాయన్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిది. సందీప్ ఇప్పటివరకూ చేసిన వాటిలో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అటు ఎస్.జే సూర్య, ప్రకాష్ రాజ్ తమ అద్భుత నటనతో తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సెల్వరాఘవన్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తన కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన రాయన్‌కు ధనుష్ దర్శకత్వం వహించారు. స్టోరీ పరంగా చూస్తే ఓ సాధారణ రీవేంజ్ డ్రామాగా అనిపించినప్పటికీ ధనుష్ తనదైన డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు డైమన్షన్స్‌లో కథ నడిపి మెప్పించాడు. పోరాట ఘట్టాలు, ఎమోషనల్ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. తద్వారా ప్రేక్షకులను కథలో లీనమయ్యేట్టు చేశారు. అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్, క్లైమాక్స్ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే రొటిన్ స్టోరీ కావడం, తర్వాత జరగబోయేది ముందే ఊహించగలడం, తమిళ నేటివిటికి దగ్గరగా ఉండటం, అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకు మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారింది. యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్ చేసింది. అయితే పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. బోరింగ్ సన్నివేశాలను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు మరింత వెయిటేజీ వచ్చేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
ధనుష్, సందీప్ కిషన్ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఅక్కడక్కడ బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
‘రాయన్’ సినిమాపై పబ్లిక్ టాక్
'రాయన్' చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ మంది ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ నటన, నేపథ్య సంగీతాన్ని హైలెట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ఏవో చూద్దాం.
రాయన్ ఫస్టాఫ్, సెకండాఫ్, ధనుష్ ఎంట్రీ, ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్, సందీప్ కిషన్ నటన అదిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా 4.6/5 రేటింగ్ ఇచ్చాడు.
https://twitter.com/review0813/status/1816622242421522704
రాయన్ మూవీ రా అండ్ రస్టిక్‌గా ఉందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ధనుష్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయని పేర్కొన్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్‌ను ధనుష్ తన వర్కింగ్ స్టైల్‌తో గుర్తు చేశారని ప్రశంసించారు. ఎస్.జే సూర్య నటన, ఏ.ఆర్. రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచాయని రాసుకొచ్చాడు.
https://twitter.com/LetsXOtt/status/1816651224956981478
రాయన్ ఒక సాధారణ రివేంజ్ డ్రామా అయినప్పటికీ ధనుష్ టేకింగ్ చాలా కొత్తదనాన్ని ఇచ్చిందని ఇంకో నెటిజన్ పోస్టు పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ మూవీకి సెకండ్ హీరో అంటూ రాసుకొచ్చాడు.
https://twitter.com/CinemaWithAB/status/1816657822026764609
రాయన్ సినిమా అద్భుతంగా ఉందంటూ ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. 'ఆల్‌రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని ధనుష్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. ఈ మూవీలో సందీప్ కిషన్ మేజర్ రోల్ పోషించాడని ఎక్కడా ల్యాగ్స్, బోరింగ్ సీన్స్ లేవని రాసుకొచ్చారు.
https://twitter.com/PikuOffl/status/1816649186571698503
జూలై 26 , 2024
Nandini Rai: ఎద పొంగులతో రెచ్చిపోయిన నందిని రాయ్.. ఈమె చాలా హాట్ గురూ!
ప్రముఖ నటి నందిని రాయ్ తన హాట్ అందాలతో మరోమారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ బ్రాలో ఎద పొంగులను ఆరబోసి రచ్చ రచ్చ చేసింది.
ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ హాట్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందిని రాయ్ ఇండస్ట్రీలోకి రాక ముందు మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకుంది.
2010లో మిస్ ఆంధ్రాగా ఎంపికైన ఈ భామ.. ఆ తర్వాత 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా పని చేసింది.
2011లో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రం ద్వారా నందిని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘మాయ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తెలుగు షోలో నందిని రాయ్ పాల్గొంది. తన అందం, అభినయం, గ్లామర్‌తో ఆ సీజన్‌లో వీక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన నందినికి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్ వరుస అవకాశాలు అందేలా చేశాయి. దీంతో ఆమె ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజనీ’, ‘కోతి కొమ్మచ్చి’ చిత్రాల్లో నటించింది.
ఈ ఏడాది విడుదలైన వారసుడు, భాగ్‌సాలే, సీఎస్‌ఐ సనాతన్ మూవీల్లోనూ నందిని రాయ్ మెరిసింది. అలాగే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి వెబ్ సిరీస్‌లలోనూ ఆమె అదరగొట్టింది.
ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్‌లను నిర్వహిస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5.3 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆమె ఏ హాట్ ఫొటోను పోస్టు చేసినా వారు విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు.
నవంబర్ 15 , 2023
నటనకు కేరాఫ్ విజయ్ సేతుపతి.. ఈ 5 సినిమాలు తప్పక చూడాల్సిందే
]ఈ చిత్రం చూశాక ప్రేక్షకులకు ‘రాయనం’ పాత్ర గుర్తిండిపోతుంది. తండ్రిగా, జమీందారుగా విజయ్ సేతుపతి ప్రేక్షకులను మెప్పించాడు. క్రూరత్వం ప్రదర్శిస్తూనే మనసులోని ప్రేమను కళ్లలో చూపించేలా నటించాడు విజయ్ సేతుపతి.
ఫిబ్రవరి 13 , 2023
Raayan Day 1 Collection: ‘రాయన్’ను దెబ్బతీసిన హాలీవుడ్ చిత్రం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'రాయన్' (Rayaan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ముఖ్య పాత్ర పోషించాడు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), ఎస్.జే. సూర్య (S.J Surya), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రం జులై 26న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. రొటిన్ రివేంజ్ డ్రామా అని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిశాయి. సినిమా తమకు బాగా నచ్చిందని మెజారిటీ ప్రేక్షకులు నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయన్ తొలి రోజు ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.
తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా ‘రాయన్’ రూపొందింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన (జులై 26) ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.20.7 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా రూ.15.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే 'రాయన్'కు తమిళనాడులో అత్యధికంగా రూ.10.6 కోట్లు వచ్చాయి. ఏపీ & తెలంగాణలో రూ. 2 కోట్లు, కర్ణాటకలో రూ.1.8 కోట్లు, కేరళలో రూ.90 లక్షలు, రెస్ ఆఫ్ ఇండియా రూ.40 లక్షలు వసూలైనట్లు వివరించాయి. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డెడ్‌పూల్ వోల్వరైన్ డామినేషన్
మార్వెల్ సూపర్ హీరో సిరీస్‌లో భాగంగా రూపొందిన ‘డెడ్‌పూల్ & వోల్వరైన్’ చిత్రం శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ‘రాయన్’కు ఈ హాలీవుడ్ చిత్రం నుంచి గట్టిపోటీ ఎదురైంది. దేశంలోని సినీ ఆడియన్స్ ఈ మార్వెల్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. బుక్‌మైషోలో రాయన్‌కు 2 లక్షల 73 వేల టికెట్లు బుక్ అయితే ‘డెడ్‌పూల్ & వోల్వరైన్’కు 3 లక్షల 25 వేల బుకింగ్స్ వచ్చాయి. ఈ హాలీవుడ్ చిత్రానికి దేశంలో తొలి రోజు రూ. 21.5 కోట్లు (NET) వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లీష్ వెర్షన్‌లో రూ.11.7 కోట్లు, హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ.1.2 కోట్లు, తమిళంలో రూ.1.1 కోట్లు వసూలైనట్లు వివరించాయి. దీన్ని బట్టి చూస్తే ‘రాయన్’ వసూళ్లను ఈ హాలీవుడ్ చిత్రం ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థమవుతుంది.
‘రాయన్’లో హైలెట్స్ ఇవే!
గ్లోబల్ స్టార్ ధనుష్ 'రాయన్' సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. నటనే కాదు తనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో కూడా ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు. కథగా చూస్తే ‘రాయన్’లో కొత్తదనం ఏమీ కనిపించదు. అయితే కొన్ని మలుపులు, కుటుంబ డ్రామా, కథా నేపథ్యం ఈ సినిమాను ప్రత్యేకంగా మార్చేశాయి. ఒక మామూలు కథని ధనుష్ తన అండర్ ప్లే నటనతో, వైవిధ్యమైన కొన్ని మాస్ ఘట్టాలతో రక్తి కట్టించాడు. ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఆయన ఈ సినిమాకు సెకండ్ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వచ్చాయి.
‘రాయన్’ కథ ఏంటంటే
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తువేల్ (సందీప్ కిషన్), మాణిక్యం(కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషారా విజయన్) దుర్గతో కలిసి జీవిస్తుంటాడు. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే ముత్తువేల్ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(ఎస్.జే. సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో రాయన్‌ను సీతారం టార్గెట్ చేస్తాడు. దొరైని ఎవరు చంపారు? రాయన్‌ను సీతారాం ఎందుకు టార్గెట్ చేశాడు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ తమ్ముళ్లు ఏం అయ్యారు? అన్నది స్టోరీ.
‘డెడ్‌పూల్ & వోల్వరైన్’ స్టోరీ ఇదే
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ (ర్యాన్ రేనాల్డ్స్) సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వోల్వరైన్ (హ్యూ జాక్‌మన్) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వోల్వరైన్‌తో కలిసి డెడ్‌పూల్ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.
జూలై 27 , 2024
Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్ తేజ్.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్, రవివర్మ తదితరులు
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్
సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్
సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల తేదీ : ఆగస్టు 25, 2023
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
కథలోకి వెళితే ఆచార్య (నాజర్) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్ స్కామ్ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్ అర్జున్ (వరుణ్‌తేజ్)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20
ఎలా సాగిందంటే
గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.
ఎవరెలా చేశారంటే..?
గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్ లేదు. అయినప్పటికీ వరుణ్ ఉన్నంతలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్ నటనయాక్షన్ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్ & నో ట్విస్ట్స్
సినిమా రేటింగ్: 2.5/5
https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
ఆగస్టు 28 , 2023
Hanuman Movie Review: సూపర్ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్’ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య
దర్శకుడు : ప్రశాంత్ వర్మ
సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర
ఎడిటింగ్: సాయిబాబు తలారి
నిర్మాత: నిరంజన్ రెడ్డి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్’ అందుకున్నాడా? ఈ సూపర్ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్, భావోద్వేగ సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్ చేస్తుంది. వినయ్ రాయ్ (Vinay Rai) స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్ హీరో అవ్వాలనే కోరికతో విలన్ చేసే ప్రయత్నాలను ప్రశాంత్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.
సాంకేతికంగా
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్, నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్
రేటింగ్ : 3.5/5
జనవరి 12 , 2024
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024
Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు
రచన, దర్శకత్వం: అమిత్ రాయ్
విడుదల తేదీ: ఆగస్టు 11
2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్‌లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20
ఎలా ఉంది?
ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు?
ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది.
https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20
టెక్నికల్‌గా
సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం.
పాజిటివ్ పాయింట్స్
నటీనటులు
కథ
కామెడీ
రచన
నెగెటివ్ పాయింట్స్
కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్
కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 3.25/5
https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
ఆగస్టు 11 , 2023
Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు.
దర్శకత్వం: అనిల్ కన్నెగంటి
సంగీతం: వికాస్ బాడిస
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ: 20-07-2023
టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని సమర్పిస్తుండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. మరి ఈ ‘హిడింబ’ కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కథేంటి
అభయ్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ శిక్షణలో ఉండగా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్దరూ ఓ కేసు విషయమై మళ్లీ కలిసి పని చేయాల్సి వస్తుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాప్‌లకు సంబంధించిన కేసది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో బోయ అనే కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసును ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు? అసలు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేరస్థుడెవరు? అండమాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగకు ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే..
ఎవరెలా చేశారంటే
నటుడిగా అశ్విన్‌ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమిది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్రలో నందితా నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మకరంద్ దేశ్ పాండే పాత్ర సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్రను దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఎలా సాగిందంటే
టైటిల్స్ కార్డ్స్‌తోనే దర్శకుడు అనిల్ కన్నెగంటి నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నగరంలో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వడం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్యను రంగంలోకి దింపడం.. ఇలా చకచకా కథ పరుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆరంభమైనప్పటి నుంచి సినిమా ఒక్కసారిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. పెద్దగా కష్టపడకుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించదు. మధ్యలో ఓ పాటతో నాయకానాయికల ప్రేమకథను చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. దాంట్లో పెద్దగా ఫీల్ కనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్. హీరోలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ఎపిసోడ్ అది. పతాక సన్నివేశాలు ఊహలకు అందని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తికరంగా అనిపించదు.
డైరెక్షన్ & టెక్నికల్ అంశాలు
దర్శకుడు అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా, దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసినప్పుడు దీంట్లో ఏదో వెలితి కనిపిస్తుంది. చాలా సన్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్రథమార్ధంలో మానవ అవయవాల అక్రమ రవాణా ఎపిసోడ్‌ను టచ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వలేదు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంట్విస్ట్‌లుపోరాట ఘట్టాలు,నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్
రేటింగ్ 2.5/5
https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
ఆగస్టు 08 , 2023
Pareshan Review: కామెడీ ఓకే.. ‘పరేషాన్’తో మసూద హీరో హిట్ కొట్టినట్లేనా!
నటీనటులు : తిరువీర్, పావని, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, శ్రుతి రయాన్
దర్శకత్వం: రోనాల్డ్ రూపక్ సన్
సంగీతం: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రఫీ: వాసు
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. తెలంగాణ యాస, భాషతో పాటు సంస్కృతి సంప్రదాయల మేళవింపుతో వచ్చి ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఫిదా, బలగం, జాతి రత్నాలు, దసరా వంటి చిత్రాలు అలా వచ్చి భారీ హిట్ అందుకున్నవే. తాజాగా రూపొందిన ‘పరేషాన్’ మూవీ సైతం తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కింది. రోనాల్డ్ రూపక్ సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. ఈ సినిమాని సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించగా, హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (జూన్ 2) పరేషాన్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అందరినీ ఆకట్టుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ:
ఐజాక్(తిరువీర్) ITI చదివి పనిపాట లేకుండా స్నేహితులతో ఖాళీగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి విపరీతంగా తాగుతూ గొడవలు పడుతుంటాడు. ఐజాక్‌ను చూసి విసిగిపోయిన తండ్రి సమర్పణం (మురళీధర్ గౌడ్) తన సింగరేణి ఉద్యోగం కుమారుడికి ఇప్పించాలని భావిస్తాడు. అందుకోసం భార్య నగలు అమ్మి లంచం డబ్బు సిద్ధం చేస్తాడు. అయితే ఆ డబ్బును ఆపదలో ఉన్న ఫ్రెండ్స్‌కు ఐజాక్ ఇస్తాడు. డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయి శిరీష (పావని కరణం) గర్భవతి కావడం ఐజాక్ చిక్కులు తెచ్చిపెడుతుంది. అబార్షన్ కోసం సిద్దం చేసిన డబ్బును ఎవరో కాజేయడంతో ఐజాక్ కొత్త సమస్యల్లో చిక్కుకుంటాడు. దీంతో డబ్బు కోసం ఐజాక్ తెగ పరేషాన్ అవుతుంటాడు. డబ్బు కోసం ఐజాక్ ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
ఐజాక్ పాత్రలో తిరువీర్ అద్భుత నటన కనబరిచాడు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలో జీవించేశాడు. మసూద తర్వాత నటనలో మరింత మెరుగైనట్లు కనిపించాడు. అటు ఫ్రెండ్స్ పాత్రలైన ఆర్జీవీ, మైదాక్, సత్తి(అర్జున్ కృష్ణ) ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అవుతాయి. డబ్బు కోసం వారు పడే బాధలు థియేటర్‌లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సత్తి పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక తండ్రి పాాత్రలో మురళీధర్ గౌడ్ ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. కొడుకు ఫ్యూచర్ కోసం తాపత్రయపడే తండ్రిగా అలరించాడు. హీరోయిన్ శిరీష పాత్రలో పావని తన పరిధిమేరకు నటించిం మెప్పించింది. సినిమాలో చాలావరకు కొత్తవారే ఉన్నప్పటికీ ఆ నటనలో మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు చేశారు. అయితే కొన్ని సీన్లలో మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ రోనాల్డ్ రూపక్ సన్ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని తెరకెక్కించడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. నవ్వుల కోసమే సీన్లు చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది. ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. సినిమాలో ఎక్కువ భాగం తాగుడే ఉండటం వల్ల ప్రేక్షకుడికి కాస్త విసుగ్గా అనిపిస్తుంది. అయితే ప్రధాన పాత్రల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ను మాత్రం డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఆ కామెడీ చాలా ఫ్రెష్ ఫీలింగ్‌ను తీసుకొస్తుంది. అయితే సీన్లను మరింత క్వాలిటీగా రాసుకుని మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకు తిరుగుండేది కాదు.
టెక్నికల్‌గా
సినిమాటోగ్రఫీ పరేషాన్ చిత్రానికి ప్లస్ అని చెప్పొచ్చు. వాసు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చక్కగా తన కెమెరాతో చూపించారు. ఎడిటింగ్ పరంగా ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. యశ్వంత్ నాగ్ సంగీతం పర్వాలేదు. అయితే BGM సో సోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లకు నేపథ్య సంగీతం మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. అసలు సింక్ అయినట్లు అనిపించదు. నిర్మాణ పరంగా మేకర్స్ రాజీ పడినట్లు కనిపిస్తుంది. ఆచి తూచి ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేఎడిటింగ్నేపథ్య సంగీతం
రేటింగ్ : 2.5/5
జూన్ 02 , 2023
కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన టాప్ 10 చిత్రాలు
]10.శుభసంకల్పంశుభసంకల్పం కుటుంబ కథా చిత్రంగా వచ్చి మంచి విజయం సాధించింది. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
ఫిబ్రవరి 11 , 2023
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్‌ల పాత్ర అమోఘం. అద్భుతమైన అభినయంతో పాటు, అందంతో కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కను సైగలతోనే మాట్లాడగల నేర్పుతో అలరిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభతోనే కష్టపడి ఎదిగిన ఈ కథానాయికల అందం, నటన మనం మరిచిపోలేము. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా వెతికిన టాప్ తెలుగు హీరోయిన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరోయిన్ . ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) ద్వారా నటిగా పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢచారి చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా ఆమె హీరో నాగచైతన్యను వివాహం చేసుకుంది.
Meenakshi Chaudhary
మీనాక్షి చౌదరి.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్. హరియాణాలో పుట్టి పెరిగిన మీనాక్షి.. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసింది. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (2021) ఫిల్మ్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హిట్ 2, గుంటూరు కారం, లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో క్రేజ్ సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 9 సినిమాలు చేసింది.
Sreeleela
శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. పెళ్లి సందD చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది
Samantha
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తోంది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది.
Courtesy Instagram: samantha
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
Sai Pallavi
సాయిపల్లవి భారతీయ సినీ నటి. మలయాళం చిత్రం ప్రేమమ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలోని మలర్ క్యారెక్టర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంసీఎ, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి వంటి చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
Kiara Advani
కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ . ఆమె హిందీ మరియు తెలుగు భాషా చిత్రాలలో పని చేస్తుంది. ఆమె హాస్య చిత్రం ఫగ్లీ (2014)లో తొలిసారిగా నటించింది. స్పోర్ట్స్ బయోపిక్ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016)లో MS ధోని భార్యగా నటించింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ లస్ట్ స్టోరీస్ (2018)లో లైంగికంగా సంతృప్తి చెందని భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మరియు పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను మేయిన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
Rukshar Dhillon
రుక్సర్ థిల్లాన్ టాలీవుడ్‌కు చెందిన నటి. 2016లో కన్నడ సినిమా 'రన్ ఆంటోని'తో సినీ రంగ ప్రవేశం చేసింది. ‘ఆకతాయి’ (2017) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'కృష్ణార్జున యుద్ధం' (2018), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (2022), ‘నా సామిరంగా’ (2024) చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యింది.
Samyuktha Menon
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్‌తో నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. సంయుక్త మీనన్ తెలుగు కంటే ముందు మలయాళం చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పాప్‌కార్న్, థివాండి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
Keerthy Suresh
కీర్తి సురేష్ తెలుగులో 'నేను శైలజ'(2016) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నేను లోకల్(2017), మహానటి(2017) వంటి సూపర్ హిట్లతో స్టార్ హిరోయిన్ స్థాయికి ఎదిగింది. మిస్ ఇండియా(2020), రంగ్ దే(2021), సర్కారు వారి పాట(2022)వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్‌లోను చాలా చిత్రాల్లో కీర్తి నటించింది. రెమో, బైరవా, సర్కార్, తొడరి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహానటిలో ఆమె నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.
Divyansha Kaushik
దివ్యాంశ కౌశిక్ తెలుగు చిత్రం మజిలీ (2019)తో తొలిసారిగా నటించింది, దీని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును అందుకుంది.
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది.
Mirnalini Ravi
మృణాళిని రవి 'గద్దలకొండ గణేష్' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చింద్రా’ చిత్రాల్లో నటించింది. మృణాళిని నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు'లోనూ మంచి నటన కనబరిచి అభిమానులను అలరించింది.
Kethika Sharma
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగ రంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది.
Chandini Chowdary
చాందిని చౌదరి తెలుగులో మధురం సినిమాతో ఆరంగేట్రం చేసింది. 'కలర్ ఫొటో' సినిమాతో గుర్తింపు పొందింది. తన సహజమైన నటన, అందంతో అవకాశాలను అందిపుచ్చుకుంది. గ్లామర్ పరంగా మెప్పిస్తూనే.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ముంబై బామలకు తీసిపోకుండా దూసుకెళ్తోంది. సమ్మతమే, హౌరా బ్రిడ్జ్, గామి చిత్రాల్లో లీడ్ రోల్‌లో నటించి సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Eesha Rebba
ఈష రెబ్బ తెలుగు సినీ నటి. 'అంతకు ముందు... ఆ తరువాత'(2013) చిత్రం ద్వరా హీరోయిన్‌గా పరిచయమైనది. బందిపోటు, బ్రాండ్ బాబు సినిమాల్లో హిరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ సహాయ నటి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఈష రెబ్బ సినిమాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించింది. 3 రోజస్, పిట్టకథలు, మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
Priyanka Jawalkar
"ప్రియాంక జవాల్కర్ తెలుగు సినిమా నటి. కలవరం ఆయే సినిమా(2017) సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మరాఠి కుటుంబానికి చెందిన ప్రియాంక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న ప్రియాంక ఎన్.జె.బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్‌లో నటనతో పాటు గ్లామర్‌కు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవి తేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.
Courtesy Instagram: Dimple Hayathi
Pujita Ponnada
పూజిత పొన్నాడ టాలీవుడ్‌కు చెందిన నటి. విశాఖపట్నంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ నగరాల్లో పెరిగింది. ఊపిరి (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. 'రన్' (2020) సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఇప్పటివరకూ తెలుగులో 18 చిత్రాల్లో నటించింది.
Ananya Nagalla
అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. మల్లేశం(2019) సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్', వకీల్ సాబ్, మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని రాజా మహేంద్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేసింది. కొన్నిరోజులు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.
Courtesy Instagram:Ananya Nagalla
డిసెంబర్ 04 , 2024
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడిపోనున్నారా? నెట్టింట వైరల్
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) విశ్వ సుందరిగా గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో చాలా మందికి ఆమె కలల రాకుమారి. ఈ క్రమంలోనే సడెన్‌గా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)ను వివాహామాడి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఐశ్వర్య అందానికి అభిషేక్ తగడంటూ బహిరంగంగానే అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా ఈ జంట కొనసాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య-అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ఓ నటి కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.
త్వరలో విడాకులు?
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉంటే ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికార్లు చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ (Nimrat Kaur)తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆమె కారణంగా వారి మధ్య దూరం కూడా పెరిగిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి త్వరలోనే నిమ్రత్‌ను పెళ్లి చేసుకోనే ఆలోచనలో అభిషేక్ ఉన్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలను ఖండిస్తూ ఐశ్వర్య-అభిషేక్ ఒక్క ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
https://twitter.com/VermaJi_1991/status/1849041394007970125
దూరం పెట్టిన ఐశ్వర్య!
గత కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కేవలం తన కూతురితోనే కనిపిస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు సైతం ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్ వారితో లేకపోవడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. రీసెంట్‌గా ఐశ్వర్య రాయ్ తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడిపారు. కూతురు ఆరాధ్యతో కలిసి కజిన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు. ఈ ఫ్యామిలీ ఈవెంట్‌కు సైతం అభిషేక్ హాజరుకాలేదు. విడాకుల రూమర్స్ మెుదలైనప్పటి నుంచి ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ జంటగా కనిపించకపోవడంతో ఐశ్వర్య కూడా అభిషేక్‌ను దూరం పెడుతోందన్న వార్తలు బలపడుతున్నాయి.
View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)
ఏకీపారేస్తున్న నెటిజన్లు!
అభిషేక్‌తో విడాకుల అంశంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున ఐశ్వర్యరాయ్‌కు అండగా నిలుస్తున్నారు. అభిషేక్ తనకు కరెక్ట్ కాదని తొలి నుంచి తాము చెబుతూనే వస్తున్నామని గుర్తుచేస్తున్నారు. గోల్డ్ (నిమ్రత్ కౌర్)ను వెతుక్కునే ప్రయత్నంలో డైమండ్ (ఐశ్వర్యరాయ్)ను కోల్పోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ సైతం ఈ వ్యవహారంలో ఐశ్వర్యకు అండగా నిలుస్తున్నారు. గతంలో ఐశ్వర్య - సల్మాన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆమె సల్మాన్‌కు బ్రేకప్ చెప్పి అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాంగ్ ఛాయిస్ అంటూ సల్మాన్ ఫ్యాన్స్ ఐశ్వర్యను ట్రెండ్ చేస్తున్నారు. ఐశ్వర్య కంటే నిమ్రత్ పెద్ద గ్లామరస్ కూడా కాదమని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Aliaashiqk_/status/1848991129292709904
https://twitter.com/Shivamsaxenaspn/status/1849361527221936381
https://twitter.com/Mohit_patrkar/status/1849359255951827095
https://twitter.com/CRAZY6801/status/1849356496238493953
ఎవరీ నిమ్రత్ కౌర్?
నిమ్రత్ గౌర్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. హిందీలో 10 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటోంది. గతేడాది 'స్కూల్ ఆఫ్ లైస్' వెబ్‌సిరీస్‌లోనూ ఫీమేల్ లీడ్‌గా నటించి ఆకట్టుకుంది. అభిషేక్ నటించిన 'దస్వి' (2022) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఉండగా ఇటీవల అది ప్రేమగా మారి పెళ్లి వరకూ దారితీసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్‌తో ‘సెక్షన్ 84’ చిత్రం సైతం నిమ్రత్ కౌర్ చేస్తోంది. దీంతో అమితాబ్‌కు కూడా ఆమెపై పాజిటివ్ ఓపినియన్ ఏర్పడిందన్న అభిప్రాయం కూడా బాలీవుడ్ వర్గాల్లో ఉంది.
అక్టోబర్ 24 , 2024
Rukmini Vasanth: తారక్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన తారక్ సరసన నటిస్తుందన్న వార్తలు రావడంతో ఈ అమ్మడి పేరు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
బెంగళూరులో పుట్టిన రుక్మిణీ వసంత్‌ది ఆర్మీ బ్యాగ్రౌండ్. తండ్రి వసంత్ వేణుగోపాల్ ఆర్మీలో కల్నల్‌గా చేశారు. 2007లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ వద్ద జరిగిన పోరులో మరణించారు.
ఆయన మరణానంతరం అశోక చక్రతో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రుక్మిణి తల్లి పేరు సుభాషిణీ. భరత నాట్యంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది.
రుక్మిణీ వసంత్ ఆర్మీ స్కూల్‌లో చదువుకుంది. నటనపై ఆసక్తితో లండన్ వెళ్లి బ్లూమ్స్ బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి పట్టా పొందింది.
2019లో 'బీర్బల్ కేస్ 1' అనే కన్నడ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. అదే ఏడాది 'అప్‌స్టార్స్'తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.
'సప్త సాగరాలు దాటి - ఏ, బి' చిత్రాల్లో ప్రియా అనే పాత్రలో రుక్మిణీ నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది.
ప్రియా పాత్రకు గాను సైమాలో ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. క్రిటిక్స్ విభాగంలో ఈ అవార్డు అందుకోవడం గమనార్హం.
ప్రస్తుతం తెలుగులో నిఖిల్‌కు జోడీగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం చేస్తోంది. తెలుగులో రుక్మిణీ చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే.
దీంతోపాటు విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రానున్న చిత్రానికి సైతం హీరోయిన్‌గా ఈ అమ్మడు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
అటు తమిళంలో విజయ్ సేతుపతితో ఏస్ (Ace) అనే చిత్రంలో రుక్మిణీ నటిస్తోంది. అలాగే శివకార్తికేయన్‌తో 'SKxARM' అనే ప్రాజెక్ట్ చేస్తుంది.
అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌తో 'భైరాతి రణగల్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్‌లో రిలీజ్ కానుంది. దాంతోపాటు బాఘీరా అనే మరో కన్నడ ఫిల్మ్‌లోనూ ఈ ముద్దు గుమ్మ నటిస్తోంది.
రుక్మిణీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమట. కోన్ లేదా కప్ అనే తేడా లేకుండా ఎంచక్కా లాగించేస్తుందట.
రుక్మిణీకి డ్యాన్స్‌పై మంచి పట్టుంది. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తుండటం, ట్రావెలింగ్‌కు వెళ్లడం వంటివి చేస్తుంటానని ఈ అమ్మడు చెప్పింది.
అక్టోబర్ 14 , 2024
Mahesh Babu: ‘మహేష్‌ను చూసి నేర్చుకోండి’.. తమిళ ఆడియన్స్ ప్రశంసలు!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. ఈ స్టార్ హీరో మంచి మనసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కూడా మహేష్ గురించి తెగ పొగిడేస్తున్నారు. మహేష్ చేసిన ఓ పనికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ లాంటి జీరో ఇగో హీరోను ఇప్పటివరకూ చూడలేదంటూ ఆకాశానికెత్తుతున్నారు. అసలు మహేష్ బాబు ఏం చేశారు? కోలీవుడ్ ఫ్యాన్స్ ఎందుకు ఆ స్థాయిలో మెచ్చుకుంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.
‘రాయన్’పై మహేష్ రివ్యూ..!
ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా 'రాయన్' టీమ్‌ను అభినందించాడు. ధనుష్ సహా ప్రధాన తారాగణం యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్‌రాజ్, సందీప్ కిషన్‌లు ఉత్తమంగా నటించారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. ‘రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. అటు మహేష్ బాబు పోస్టుపై నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) స్పందించాడు. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
https://twitter.com/urstrulyMahesh/status/1817979697126588552
‘జీరో ఈగో’ అంటూ ప్రశంసలు
కోలీవుడ్ హీరో ధనుష్ నటన, డైరెక్షన్ స్కిల్స్‌ను మహేష్ బాబు మెచ్చుకోవడంపై తమిళ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా గురించి ఒక్కరు మాట్లడలేదని కామెంట్స్ చేస్తున్నారు. 'జీరో ఈగో'తో మహేష్ చేసిన ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ మంచి మనసు ఏంటో ఈ పోస్టుతో తమకు అర్థమైందని తమిళ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అటు మహేష్ - ధనుష్ కాంబోలో ఓ సినిమా పడితే రికార్డ్స్ బద్దలేనని అభిప్రాయపడుతున్నారు. అటు తమిళ నటి అపర్ణ బాలమురళి కూడా మహేష్ పోస్టుకు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త సినిమాపై రివ్యూ ఇవ్వాల్సిందే!
మహేష్ ఓ సినిమాకు రివ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆయన తనకు నచ్చిన కొత్త సినిమాల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ'పై కూడా మహేష్ ఈ విధంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటనకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిక్ విజన్‌కు హ్యాట్యాఫ్ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అలాగే 'హరోం హర', 'భజేవాయు వేగం' , ‘ప్రేమలు’ తదితర చిత్రాలపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఒక సినిమాను ప్రశంసించారంటే ఆ మూవీలో ఏదోక ప్రత్యేకత ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ రివ్యూ ఇచ్చాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో 'SSMB29' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు మహేష్ సైతం ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్‌తో ముఖాన గడ్డంతో హాలీవుడ్ హీరోగా మారిపోయాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను జర్మనీలో స్టార్ చేయనున్నట్లు సమాచారం. అటు ఈ మూవీకి 'ఆజానుబాహుడు', 'మహారాజ్', 'GOLD' టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 9న మూవీకి సంబంధించి ఏదోక అప్‌డేట్ ఉండొచ్చని అంటున్నారు.
జూలై 30 , 2024
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్? ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.
రిలీజ్ ఆ రోజేనా?
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్ ఛేంజర్'ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
https://twitter.com/i/status/1815052022200013098
ప్రభాస్ బాటలో రామ్‌చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్ కానుకగానే విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్ 22న వచ్చిన సలార్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్ క్రిస్మస్‌కే రిలీజ్ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్ (సైంధవ్), తేజ సజ్జా (హనుమాన్) వంటి స్టార్ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్ యూనిట్ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్ & కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ప్రభాస్ తరహాలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కథ ఇదేనా?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్ ఛేంజర్’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్ ఛేంజర్’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్ పేర్కొంది. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
జూలై 22 , 2024