
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
2024 June 510 months ago
రాజు యాదవ్ చిత్రం జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రివ్యూస్
How was the movie?
తారాగణం

గెటప్ శ్రీను

రాకెట్ రాఘవ
భూషణ్ కళ్యాణ్
అంకిత ఖరత్
పవన్ రమేష్

చక్రపాణి ఆనంద
ఆర్.జె. హేమంత్
శ్రీమణి

సంతోష్ కల్వచెర్ల
జబర్దస్త్ సన్నీ
ఉత్తర ప్రశాంత్
శ్రీరామ్
సిబ్బంది
కృష్ణమాచారిదర్శకుడు
రాజేష్ కల్లెపల్లినిర్మాత
ప్రశాంత్ రెడ్డినిర్మాత
హర్షవర్ధన్ రామేశ్వర్సంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు

Raju Yadav Review : 'రాజు యాదవ్'గా గెటప్ శ్రీను మెప్పించాడా? ఈ రివ్యూలో తెలుసుకోండి!
నటీనటులు : గెటప్ శ్రీను, అంకితా కరాట్, హేమంత్, ఆనంద్ చక్రపాణి, నమని ప్రశాంత్ తదితరులు
డైరెక్టర్ : కృష్ణమాచారి. కె
సినిమాటోగ్రాఫర్ : సాయిరాం ఉదయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, స్వాతి పసుపులేటి
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). అంకిత కరాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటన సినిమాపై అంచనాలను పెంచింది. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?
కథేంటి
ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఊరిలో చాలా సరదాగా ఉండే అబ్బాయి. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా అతడికి ప్రమాదం జరుగుతుంది. దీంతో ఓ వైద్యుడ్ని సంప్రదిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి రాని చికిత్స చేయడంతో రాజు స్మైలింగ్ డిజార్డర్ అనే వ్యాధి బారిన పడతాడు. అప్పటి నుంచి రాజు నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా స్విటీ (అంకితా)తో ప్రేమలో పడినప్పుడు అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ప్రేమకు అతడి నవ్వు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? రాజు-స్విటీ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హాస్య నటుడు గెటప్ శ్రీను.. రాజు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడు. అటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ తాను అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేయసి పాత్రలో అంకితా కరాట్ పర్వాలేదనిపింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చక్కటి నటన కనిబరిచాడు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణమాచారి.. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఫన్, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించారు. స్మైలింగ్ డిజార్జర్ అనే సమస్యతో హాస్యాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అదే సమయంలో ఆ డిజార్డర్ చుట్టే భావోద్వేగ సన్నివేశాలను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలకు సినిమా హత్తుకునేలా చేశారు. ముఖ్యంగా గెటప్ శ్రీను, ఆనంద్ చక్రపాఠి మధ్య వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది. కొన్ని సీన్లు సాగదీతలా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
గెటప్ శ్రీను నటనకామెడీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 24 , 2024

This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
రాజు యాదవ్
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju yadav). అంకిత కారాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
లవ్ మీ
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ మీ’ (Love Me). అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్ యూ డేర్’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
డర్టీ ఫెలో
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్ డ్రామా చిత్రమని మూవీ యూనిట్ తెలిపింది.
ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా
ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్, క్రిస్ హేమ్స్‌వర్త్ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్ మ్యాక్స్’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man MovieEnglishLions Gate PlayMay 24
మే 20 , 2024

OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!
ఎన్నికల హడావుడితో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. అనుకున్న దాని ప్రకారం మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మే 31 కి వాయిదా పడింది. కానీ జబర్దస్త్ కమెడియన్ గెటప్(OTT Release Movies Telugu) శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ చిత్రం ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే విక్రమ్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం అపరిచితుడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఇవి తప్పితే థియేటర్లలో అలరించే చిత్రాలేవి ఈవారం లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటిపై ఓ లుక్ వేద్దాం
థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు
రాజు యాదవ్
గెటప్ శ్రీను, అంకిత ఖారత్ జంటగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్(Raju yadav). ఈ సినిమాను సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. క్రికెట్ ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాజు యాదవ్(గెటప్ శ్రీను) మూతికి బలమైన గాయం అవుతుంది. ఆ గాయం వల్ల అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. అతని స్మైలింగ్ ఫేస్ చూసిన అంకిత ఖారత్ అతనికి దగ్గరవుతుంది. అయితే కొన్నినాటకీయ పరిణామాల తర్వాత అతన్ని దూరం పెడుతుంది. అప్పుడు రాజు యాదవ్ ఏం చేశాడు. తన లోపాన్ని అధిగమించేందుకు ఏం చేశాడు అనేది మిగతా కథ. కాగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఈవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు(OTT Release Movies Telugu)
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేసేందుకు 20పైగా సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో ముఖ్యంగా గాడ్జిల్లాX కాంగ్(తెలుగు డబ్బింగ్), చోరుడు(తెలుగు డబ్బింగ్)తో పాటు బస్తర్: ది నక్సల్స్ స్టోరీ, జర హట్కే జర బచ్కే వంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. మరి ఏఏ ప్లాట్ ఫామ్స్‌లో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేయండి.
TitleCategoryLanguagePlatformRelease DateVidya Vasula AhamMovieTeluguAhaMay 17Blood of Zeus S2Series EnglishNetflixMay 15Ashley Madison: Sex, Lies & ScandalSeries EnglishNetflixMay 15Madame WebMovieEnglishNetflixMay 16Bridgerton Season3 Part - 1 SeriesEnglishNetflixMay 16The 8 ShowSeriesKoreanNetflixMay 17Thelma the UnicornMovieEnglish NetflixMay 17PowerMovieEnglishNetflixMay 17CrashSeriesKoreanDisney+ HotstarMay 13ChoruduMovieTelugu DubbedDisney+ HotstarMay 14Uncle SamsikSeriesKoreanDisney+ HotstarMay 15Bahubali: Crown of BloodAnimates SeriesHindiDisney+ HotstarMay 17Outer Range Season 2SeriesEnglishAmazon PrimeMay 16AaveshamMovieTelugu DubbedAmazon PrimeMay 1799SeriesEnglishAmazon PrimeMay 17Bastar: The Naxal StoryMovieHindiZee5May 17Thalaimai SeyalagamSeriesTamilZee5May 17Godzilla x Kong: The New EmpireMovieTelugu DubbedBook My ShowMay 13Demon SlayerSeriesJapaneseJio CinemaMay 13C.H.U.E.C.O Season 2SeriesSpanishJio CinemaMay 14Zara Hatke Zara BachkeMovieHindiJio CinemaMay 17LampanSeriesMarathiSony LivMay 16
మే 14 , 2024

This Week Movies: ‘రాయన్’ వచ్చేస్తున్నాడు.. ఒక్క వారంలో 18 చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు!
‘కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆ స్థాయి సక్సెస్ అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో జులై చివరి వారంలో ఆడియన్స్‌ను పలకరించేందుకు ఓ బడా చిత్రంతో పాటు రెండు చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలోనూ మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
రాయన్
ధనుష్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్’ (Raayan Movie). ఇందులో దుషారా విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలపై సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.
పురుషోత్తముడు
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). హాసిని సుధీర్ కథానాయిక. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని వర్గాలకు నచ్చే పండగ లాంటి సినిమా ఇదని చిత్ర బృందం తెలిపింది.
ఆపరేషన్ రావణ్
రక్షిత్ అట్లూరి హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘ఆపరేషన్ రావణ్’ (Operation Raavan). వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా చేసింది. జులై 26న ఈ థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్ నటి రాధిక ఇందులో కీలక పాత్ర పోషించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ఇది ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఓటీటీ విడులయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
రాజు యాదవ్
గెటప్ శ్రీను కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). మేలో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా జులై 24న ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’ (Aha) ఈ సినిమాను వీక్షించవచ్చు. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీను.. ఓ సమస్య ఉన్న వ్యక్తిగా నటించి, నవ్వులు పంచారు. హీరోయిన్‌గా అంకిత కారాట్ ఆకట్టుకున్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateCleo Season 2SeriesEnglishNetflixJuly 25The DecameronSeriesEnglishNetflixJuly 25Tokyo SwindlersSeriesEnglish/JapaneseNetflixJuly 25Elite Season 8SeriesEnglishNetflixJuly 26GhostbustersMovieEnglishNetflixJuly 26The Dragon Prince Season 6SeriesEnglishNetflixJuly 26The Ministry of Ungentlemanly WarfareMovieEnglishAmazon July 25Bloody IshqMovieHindiHotstarJuly 26Chutney SambarSeriesTamil HotstarJuly 26Bhaiyyaji MovieHindiZee 5July 26Chalte Rahe ZindagiMovieHindiZee 5July 26KalMovieTamil AhaJuly 23Grand MaaMovieTamil AhaJuly 24Which Brings To Meet YouMovieEnglishJio CinemaJuly 26
జూలై 22 , 2024

Movie Ticket Rs.99 at Multiplexes: మల్టీప్లెక్సుల్లో రూ.99కే సినిమా టికెట్.. ఈ ఆఫర్ ఆరోజు మాత్రమే!
సాధారణంగా మల్టీప్లెక్సుల్లో సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక టికెట్‌కు రూ. 250కి పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మే 31న మాత్రం.. సినీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. కేవలం రూ.99 టికెట్‌తో ఎంచక్కా మల్టీప్లెక్సుల్లో ఎంచక్కా సినిమాను చూసేయచ్చు. ఏ షో అయినా, ఏ సినిమా అయిన చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ కల్పిస్తోంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఆఫర్ ఎందుకంటే?
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association Of India) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఆ రోజున రూ.99లకే తమ మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసే వెసులుబాటు కల్పిస్తుసందర్భంగా న్నట్లు చెప్పింది. పీవీఆర్ - ఐనాక్స్ సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం మే 31 ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని అసోసియేషన్ స్పష్టం చేసింది.
https://twitter.com/MAofIndia/status/1795374893879710125
ఇలా బుక్ చేసుకోండి!
మే 31 సినిమా చూడాలని భావిస్తున్న వారు టికెట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మై షో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.99తో పాటు అదనంగా జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా కేవలం రూ.99కే సినిమాను వీక్షించవచ్చు. మీ వెసులుబాటుకు తగ్గట్లు టికెట్ కొనుగోలు చేసుకోండి.
https://twitter.com/girishjohar/status/1795734272068006128
ఈ సినిమాలు చూడొచ్చు!
ప్రస్తుతం థియేటర్లలో ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’, ‘రాజు యాదవ్’ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే యంగ్ హీరో విష్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ రోజే థియేటర్లలోకి వస్తోంది. కాబట్టి మే 31న కొత్త సినిమాలను రూ.99లకే చూసే అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.
https://twitter.com/tanaymehrotra1/status/1795748420206100853
గతంలోనూ ఇలాగే..
రూ.99లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 13న 'నేషనల్ సినిమా డే' సందర్భంగా కూడా ఈ ఆఫర్‌ను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సినీ లవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. ఈసారి కూడా ఆ స్థాయిలోనే స్పందన ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఫ్యామిలీ అంతా తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడాలనుకుంటే ఈ సదావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
https://twitter.com/AndhraBoxOffice/status/1711404182790680809
మే 29 , 2024

Allu Arjun: పోలీసుల ఎదుట కంటతడి పెట్టిన బన్నీ? పొరపాటు జరిగిందని అంగీకారం?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్ ఇంటి నుంచి బన్నీ బయలుదేరారు. అతడితో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉ.11 గంటలకు అల్లు అర్జున్ విచారణ మెుదలైంది. ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు.
అల్లు అర్జున్ ఎమోషనల్..
పోలీసుల విచారణ సందర్భంగా హీరో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపించిన వీడియో చూసి ఆయన ఎమోషనల్ అయినట్లు సమాచారం. తన వల్ల కొన్ని పొరపాటులు జరిగాయని పోలీసులతో అల్లు అర్జున్ అన్నట్లు తెలుస్తోంది. మెుత్తం 3 గంటల 35 నిమిషాల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించగా.. కొన్ని ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని బన్నీ చెప్పారు. మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.
అల్లు విచారణ పూర్తి
అంతకుముందు అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశ్నించారు. తొక్కిససలాటకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన 10నిమిషాల వీడియోను చూపించి కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బన్నీ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం అతడ్ని విడిపెట్టినట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్‌ను పోలీసులు ఇంటి వద్ద విడిచిపెట్టారు.
https://twitter.com/ANI/status/1871431900340142523
ఆ ప్రశ్నలకు బన్నీ మౌనం..!
చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. ‘తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా’ అని పోలీసులు ప్రశ్నించగా అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించగా ఈ క్వశ్చన్‌కు కూడా బన్నీ సైలెంట్‌గానే ఉన్నారని సమాచారం.
https://twitter.com/TOIHyderabad/status/1871462776591548839
బన్నీ కోసం 50 ప్రశ్నలు!
సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మెుత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలను బన్నీకి సంధించినట్లు తెలిసింది. దీనిపై బన్నీ ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం బన్నీ ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
https://twitter.com/timesofindia/status/1871431495480750275
బన్నీని అడిగిన ప్రధాన ప్రశ్నలు ఇవే!
తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ కోసం 50 ప్రశ్నలను చిక్కడపల్లి పోలీసులు రెడీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
1. సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు ఎవరి అనుమతి తీసుకున్నారు?
2. పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు?
3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఉందా? లేదా?
4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
5. రేవతి మరణం గురించి ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు?
6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
11. అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
13. పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు?
14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?
డిసెంబర్ 24 , 2024

Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్ పాత్రలు ఇవే!
సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్ దర్శకులు హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్ లభించి సినిమా హిట్ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
భిక్షు యాదవ్ (Sye)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్ పాత్ర కంటే.. విలన్ బిక్షు యాదవ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్ రావత్ కెరీర్‌ను మలుపుతిప్పింది.
https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b
అలీభాయ్ (Pokiri)
పోకిరిలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన అలీభాయ్ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్ రాజ్ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్ రాజ్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV
భల్లాలదేవ (Baahubali)
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.
https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv
పశుపతి (Arundhati)
తెలుగులో అతి భయంకరమైన విలన్ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.
https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3
కాట్‌రాజ్ (Chatrapathi)
ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9
పండా (Gharshana)
ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.
https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml
మద్దాలి శివారెడ్డి (Race Gurram)
రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్. అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.
https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H
వైరం ధనుష్ (Sarrainodu)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.
https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw
భవాని (Siva)
శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్ (Raghuvaran) స్టార్ విలన్‌గా మారిపోయాడు.
https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT
బుక్కా రెడ్డి (Rakta Charitra)
రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.
https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0
అమ్రీష్ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari)
చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్ నటన మెప్పిస్తుంది.
https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc
రణదేవ్ బిల్లా (Magadheera)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్ రణదేవ్ బిల్లాకు స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. దేవ్ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.
https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN
మంగళం శ్రీను (Pushpa)
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో.. నటుడు సునీల్ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్, నటన ఎంతగానో ఆకట్టుకుంది.
https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
మార్చి 20 , 2024

Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ 23న స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. తాము ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో పోస్టర్ లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే?
ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Director Maruti) తెరకెక్కిస్తున్న 'ది రాజాసాబ్' (The Raja Saab) చిత్రంలో మాళవికా మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా చేస్తున్నారు. బుధవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్ సింహాసనం మీద నోటిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు గణనీయ సంఖ్యలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/rajasaabmovie/status/1849400931978240114
అదేం పోస్టర్ అంటూ ట్రోల్స్!
రాజాసాబ్ తాజా పోస్టర్ చూసి తాము తీవ్రంగా డిజప్పాయింట్ అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ నోట్లో సిగర్ పెట్టుకొని ఉన్న పోస్టర్‌ను ‘సై’ సినిమాలోని బిక్షు యాదవ్‌తో పోలుస్తున్నారు. బర్త్‌డే రోజున ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేసి రాజాసాబ్ టీమే ప్రభాస్‌ను ట్రోల్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్ లుక్‌కు కాంపిటీషన్ ఇచ్చేలా ప్రభాస్ పోస్టర్ ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మోషన్ వీడియోలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా పూర్‌గా ఉందని, సడెన్‌గా చూసి ఫ్యాన్ మేడ్ అనుకున్నానని ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్‌ను ఇలా ఒక్క పోస్టర్ గురించి ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభాస్‌ను టార్గెట్ చేస్తున్న వారికి డార్లింగ్ ఫ్యాన్స్ దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్ సక్సెస్‌ను తట్టుకోలేకనే ఇలా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.
https://twitter.com/apashyam_kiriki/status/1849072391244091807
https://twitter.com/globalstar_ntr/status/1849035870319362545
https://twitter.com/RavirockzNTR/status/1849018605377348020
https://twitter.com/Niteesh__09/status/1849012939560264070
పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జోరు
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
250 రోజులపాటు ట్రెండింగ్
మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'సలార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చి అదరగొట్టింది. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని హాట్‌స్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. 250 రోజుల పాటు వరుసగా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచినట్లు పేర్కొంది. దీంతో ప్రభాస్ దూకుడు ఓటీటీలోనూ కొనసాగుతోందంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సలార్‌ను హై వోల్టేజ్ చిత్రంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాను నింపేశారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.
https://twitter.com/DisneyPlusHS/status/1849068031244402840
అక్టోబర్ 24 , 2024

Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్ క్లాస్ ఎమోషన్స్!
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు.
దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
సంగీతం: స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె.
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
నిర్మాత: రాకేష్ వర్రే
నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేది: జులై 19, 2024
హీరోగా వినోద్ కిషన్ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?
కథేంటి
లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు. మూసీ నది ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడుతుంటాడు. మరోవైపు భార్య వరలక్ష్మీ కుటుంబ భారం మెుత్తం తానే మోస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి రియల్ ఎస్టేట్ కోసం వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్)తో లక్ష్మణ్‌కు పరిచయమవుతుంది. శ్వేతను ట్రాప్ చేసేందుకు తాను డబ్బున్న వ్యక్తినని లక్ష్మణ్ కటింగ్ ఇస్తాడు. భార్య పేరు వాడుకొని బస్తీ మెుత్తం అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మీ ఏం చేసింది? లక్ష్మణ్‌కు శ్వేత భర్త ఎలా గుణపాఠం చెప్పాడు? పేక మేడలు లాంటి హీరో కలలు నిజమయ్యాయా? లేదా? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
తమిళ నటుడు వినోద్ కిషన్ తెలుగులో నేరుగా చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. లక్ష్మణ్ పాత్రలో అతడు చక్కగా ఒదిగిపోయాడు. గాల్లో మేడలు కడుతూ కాలక్షేపం చేసే భర్త పాత్రలో అద్భుతన నటన కనబరిచాడు. మరోవైపు కుటుంబ భారం మోసే మిడిల్ క్లాస్ వైఫ్ పాత్రలో అనూష క్రిష్ణ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్ కూడా మంచి నటన కనబరిచింది. సినిమా మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
హైదరాబాద్ బస్తీలో ఉండే నిరుపేదల జీవితాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు నీలగిరి మామిళ్ల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటుందనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు. బస్తీల్లో ఉండే పరిస్థితులు అక్కడి పిల్లలను ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే దానికి ఫన్ టచ్ ఇచ్చారు డైరెక్టర్. అంతేకాదు మహిళ సాధికారతను సైతం చూపించే ప్రయత్నం చేశారు. జీవితంలో కష్టపడందే ఏది సాధ్యం కాదన్న సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. ఫస్టాఫ్ మెుత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కమర్షియల్ హంగులు లేకపోవడం, రొటిన్ స్టోరీ, కొన్ని సన్నివేశాలు గతంలోనే చూసిన భావనను కలిగించడం వంటివి మూవీకి మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయాలకు వస్తే సంగీతం బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా చాలా రిచ్‌గా నిర్మించారు.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారగణం నటనకథనం, స్క్రీన్‌ప్లేసందేశం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
జూలై 19 , 2024

This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్ బ్రేకులు వేయగలవా!
థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
స్వాగ్ (Swag)
వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ (Swag Movie) ‘రాజ రాజ చోర’ వంటి సూపర్ హిట్ తర్వాత హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగర్కర్ కీలక పాత్రలు పోషించారు.
చిట్టి పొట్టి (Chitti Potti)
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
దక్షిణ (Dakshina)
తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తులసిరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా సాయిధన్సిక ఇందులో కనిపించనున్నారు.
కలి (Kali)
ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ (Kali). ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
బహిర్భూమి (Bahirbhoomi)
నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లింక్'. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
సెప్టెంబర్ 30 , 2024

This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం.
రామబాణం
హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది.
ఉగ్రం
నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
ది కేరళ స్టోరీ
విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది.
విరూపాక్ష(మళయాలం)
తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది.
అరంగేట్రం
కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
యాద్గిరి అండ్ సన్స్
వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది.
OTT విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateClifford the Big Red DogMovieEnglishNetflixMay 2Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2SanctuaryMovieEnglishNetflixMay 4The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4MeterMovieTeluguNetflix May 53MovieTeluguNetflixMay 5YogiMovieTeluguNetflixMay 5Rowdy FellowMovieTeluguNetflixMay 5ThammuduMovieTeluguNetflixMay 5AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5Match FixingMovieTeluguETV WinMay 5Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5FirefliesSeriesHindiZEE 5May 5Shebhash FeludaMovieBengaliZEE5May 5Corona PapersMovieMalayalamDisney HotstarMay 5Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
మే 02 , 2023

Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
దిగ్గజ నటుడు వెంకటేష్ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
‘తెలియక రియల్ గన్ గురిపెట్టా’
‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్ గారు నీకు రియల్ గన్ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్ కంగారు పడ్డారు. వెంటనే గన్ నుంచి బుల్లెట్స్ తీశారు. అది జస్ట్ ఇలా టచ్ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్ గన్ అని తెలియక గణేష్ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు' అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్ రావిపూడి తెలిపారు.
https://twitter.com/i/status/1859203309460242668
'అప్పుడే పరిశ్రమ బాగుంటుంది'
‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు. సీనియర్ నటుడు నరేష్ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్ వెంకటేష్ అని కొనియాడారు.
https://twitter.com/i/status/1859532368333373653
https://twitter.com/i/status/1859206087821737998
సంక్రాంతికి హ్యాట్రిక్ చిత్రాలు!
2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్ పెట్టారని వ్యాఖ్యానించారు.
https://twitter.com/i/status/1859522147229573619
70% థియేటర్లు దిల్‌రాజుకే!
2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
నవంబర్ 21 , 2024

Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్.. మరి ‘జపాన్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు
దర్శకత్వం: రాజు మురుగన్
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు
విడుదల తేదీ: నవంబర్ 10, 2023
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రమోషనల్ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ & ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
కార్తీ నటనకామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ
రేటింగ్: 2.5/5
నవంబర్ 10 , 2023

Malli Pelli Review: నరేష్- పవిత్ర రిలేషన్‌కి కొత్త అర్థం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ
డైరెక్టర్ : M.S. రాజు
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి : బాల్ రెడ్డి
నరేష్ - పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమా వివాదస్పదంగా మారింది. నరేష్ వైవాహిక, వ్యక్తిగత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై నిషేధం విధించాలని నరేష్ మూడో భార్య కోర్టుకు కూడా వెళ్లింది. ఇన్ని వివాదాల మధ్య ఇవాళ (మే 26) మళ్లీ పెళ్లి సినిమా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుందా?
ఈ చిత్రం ద్వారా నరేష్ ఇచ్చిన సందేశం ఏంటీ? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి మధ్య జరిగిన సంఘటనల సమాహారమే ‘మళ్లీ పెళ్లి’ సినిమా కథ. ఈ చిత్రం స్టోరీని చెప్పడం కంటే థియేటర్‌లో వీక్షించడమే బెటర్. నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో సినిమా అంతా సాగింది. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించారు. నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఎక్కడ వచ్చాయి కూడా సినిమాలో తెరకెక్కించారు. నరేష్-పవిత్ర ఓ హోటల్ లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా కథలో ఇమిడి ఉన్నాయి. నరేష్ జీవితంలోని వివాదాల సుడిగుండం గురించి ఒక స్పష్టత కావాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ నటన ఆకట్టుకుంది. రమ్య రఘుపతి పాత్ర పోషించిన వనిత కూడా మెప్పించింది. అన్ని యదార్థ సంఘటనలే కావడంతో నరేష్, పవిత్ర నటన కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ తమ పరిధి మేరకు నటించి అలరించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మళ్లీ పెళ్లి సినిమాకు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చాలా చక్కగా తెరకెక్కించారు. తొలిభాగం కాస్త ల్యాగ్ అనిపించిన సెకాండాఫ్‌లో వచ్చే నరేష్ - పవిత్ర మధ్య లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే సినిమాలో పవిత్ర లోకేష్ క్యారెక్టర్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. నరేష్ మూడో భార్యను పాజిటివ్‌గా చూపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది డైరెక్టర్, నరేష్‌కే తెలియాలి. అయితే, నరేష్ స్టోరీ తెలియని వారికి మాత్రం సినిమా అంతగా ఎక్కదు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నరేష్, పవిత్ర నటనక్లైమాక్స్లవ్ సీన్స్నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఫస్టాప్సాగదీతఆసక్తి పెంచేలా కథ లేకపోవడం
రేటింగ్ : 2.5/5
మే 26 , 2023

Game Changer Teaser: ఆ మూడింటితో సినిమాపై హైప్ పెంచిన రామ్‌చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
టీజర్ గ్రాండ్ రిలీజ్
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
https://youtu.be/OXe7N7-xMKM?si=BCd-Cbbs34DeiwT2
త్రీ డిఫరెంట్ లుక్స్‌లో…
కాలేజీ బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అన్న డైలాగ్‌తో టీజర్ మెుదలైంది. ఇందులో చరణ్ త్రీ డిఫరెంట్ డైమన్షన్స్‌లో కనిపించాడు. పాతకాలం వ్యక్తిలా, కాలేజీ కుర్రాడిలా, ప్రభుత్వ ఆఫీసర్‌గా ఇలా మూడు లుక్స్ అదరగొట్టాడని చెప్పవచ్చు. టీజర్‌ను ఎక్కువగా యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్‌తో అదిరిపోయే BGMతో పర్ఫెక్ట్‌గా కట్ చేశారు. చివర్లో చరణ్ ‘ఐ యాం అన్ ప్రిడిక్టబుల్’ అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని రామ్ చెప్పకనే చెప్పాడు.
ఫ్యాన్స్.. మాస్ సెలబ్రేషన్స్
గేమ్ ఛేంజర్ టీజర్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్ణాటకలోని 11 నగరాల్లో 11 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రతిభా థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అటు ఏపీలోని వైజాగ్ (సంగం-శరత్ థియేటర్), రాజమండ్రి (శివజ్యోతి థియేటర్), విజయవాడ (శైలజా థియేటర్), కర్నూల్ (వి మెగా థియేటర్), నెల్లూర్ (S 2 థియేటర్), బెంగళూరు (ఊర్వశి థియేటర్), అనంతపూర్ (త్రివేణి థియేటర్), తిరుపతి (పీజీఆర్ థియేటర్) నగరాల్లో టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్‌కు ముందే భారీగా అయా థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/censorReport_/status/1855228209064759425
https://twitter.com/Rams41380829/status/1855228328787235323
https://twitter.com/sivacherry9/status/1855214405321101433
https://twitter.com/TweetRamCharan/status/1855215658340065747
https://twitter.com/Rishi_JSP/status/1855228307438190787
https://twitter.com/megafanforever3/status/1855228287502414266
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ నిర్వహించాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్ ప్లేసులో ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ అయిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్ ఆహ్వానాన్ని పవన్ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
దిల్ రాజు 50వ చిత్రంగా..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్ ఛేంజర్ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు 'గేమ్ ఛేంజర్'కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
నవంబర్ 09 , 2024

The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?
నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్, అశుతోష్ రానా, పావని రెడ్డి, కేశవ్ దీపక్, సుధా, భానుచందర్ తదితరులు
డైరెక్టర్: అనిష్ కురువిల్లా
సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్
సంగీతం : శక్తికాంత్ కార్తిక్
ఎడిటింగ్: ఉమైర్ హాసన్, ఫయాజ్ రాయ్
నిర్మాతలు: గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట
ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్, నందు, అశుతోష్ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్టరీ ఛేదించేందుకు తాపత్రయపడే యువకుడిగా నందు తన పాత్రకు న్యాయం చేశాడు. కన్నింగ్ సైంటిస్ట్ పాత్రకు అశుతోష్ రానా వందశాతం న్యాయం చేశాడు. తేజస్వి మదివాడ, అక్షర గౌడ నటనతో కంటే తమ గ్లామర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచందర్, సోనియా అగర్వాల్, అజయ్ కతుర్వార్, సత్యకృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనిష్ కురువిల్లా ఐలాండ్ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్, క్లాస్ ఇలా విభిన్న నేపథ్యాలతో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ తెలియని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హత్యలు చేస్తున్నారు? ఒకరిని మరికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వరకు ఐలాండ్ గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. బీచ్ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్ సెటప్ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనఆసక్తికర కథనంట్విస్టులు
మైనస్ పాయింట్స్
బోల్డ్ కంటెంట్‌లెక్కకు మించిన పాత్రలు
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 21 , 2024

MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
వేసవి సెలవులకు సమయం ఉండటంతో పెద్ద చిత్రాలు రాకముందే చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. స్పసెన్స్ థ్రిల్లర్లు, మోస్ట్ వెయిటింగ్ వెబ్ సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.
సీఎస్‌ఐ సనాతన్
ఆది సాయి కుమార్, మిషా నారంగ్ జంటగా నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది… ఈ చిత్రంతో మెప్పిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ట్యాక్సీ
వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ కీలక పాత్రుల్లో నటించిన చిత్రం ట్యాక్సీ. వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హరీశ్ సజ్జా దర్శకత్వం వహించగా.. హరిత సజ్జా నిర్మించారు. ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నారు.
నేడే విడుదల
చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథతో రామ్ రెడ్డి పన్నాల నేడే విడుదల చిత్రాన్ని రూపొందించారు. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 10న రిలీజ్ అవుతోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు.
వాడు ఎవడు
యదార్థ సంఘటనల ఆధారంగా వాడు ఎవడు చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తికేయ, అఖిల్ నాయర్ హీరో హీరోయిన్లుగా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 10న విడుదలకు సిద్ధమయ్యింది. ఎస్. శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ఆడమ్ డ్రైవర్ ‘65’
హాలీవుడ్ నుంచి వస్తున్న మరో యాక్షన్, అడ్వెంచరస్ మూవీ 65. ఆడమ్ డ్రైవర్, అరియానా గ్రీన్‌బ్లాట్, క్లో కోల్‌మన్ నటించారు. స్కాట్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 10న రిలీజ్ కానుంది. స్పెస్ షిప్‌లో తెలియని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే కథతో తెరకెక్కించారు.
యాంగర్ టేల్స్
డిస్లీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మరో వెబ్ సిరీస్ రానుంది. దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్, బింధు మాధవి, మడోనా సెబాస్టియన్ వంటి స్టార్ నటులు ఇందులో ఉన్నారు. మార్చి 9న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో ఆశలతో ఉండే నలుగురికి నచ్చని జీవితం ఎదురైతే ఎలా అనేది కథాంశం. సుహాస్ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.
రానా నాయుడు
బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటి రానా నాయుడు. వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటిస్తున్న వెబ్‌సిరీస్‌పై అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరికీ ఇదే తొలి వెబ్ సిరీస్ కాగా… మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. రే డొనోవాన్ టీవీ సిరీస్ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దారు.
మరికొన్ని ఓటీటీ రిలీజ్‌లు
Title CategoryLanguagePlatformRelease DateRekhaMovieMalayalamNetflixMarch 10The glorySeriesKoreanNetflixMarch 10Happy family: conditions applySeriesHindiPrime videoMarch 10Chang can dunkMovieEnglish disney+hotsarMarch 10Run baby runMovietamil/telugudisney+hotsarMarch 10Ram yo Moviekannadazee5March 10Bommai nayagiMovietamilzee5March 10Boudy canteenMovieBangla zee5March 10Accident farmer and coSeriesTamil Sony livMarch 10christyMoviemalayalamSony livMarch 10Bad trip Movie TeluguSony livMarch 10
మార్చి 06 , 2023

Game Changer: 'మేము మూలాలు మర్చిపోలే'.. బన్నీకి పవన్ చురకలు?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రంపై సినీ లవర్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) చేసింది. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఏపీలోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బన్నీకి పవన్ చురకలు!
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ (Allu Arjun)కు పరోక్షంగా చురకలు అంటించారు. 'మేము మూలాలు మర్చిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా.. రామ్‌చరణ్ ఉన్నా.. ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఈ రోజు కల్యాణ్ బాబు అనండి.. ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి.. ఏది అన్న కూాడా ఆయనే ఆద్యులు (చిరంజీవి). నేను మూలాలు మర్చిపోను' అంటూ చెప్పుకొచ్చారు.
https://twitter.com/Aryashree69/status/1875561189297848476
ఏకైక గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్: చరణ్
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌లో రామ్‌చరణ్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 'గేమ్ ఛేంజర్ టైటిల్ శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ నిజ జీవితంలో గేమ్ ఛేంజర్ ఎవరో అందరికీ తెలుసు. కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్‌కు ఉన్న ఏకైక గేమ్ ఛేంజర్ ఇవాళ పవన్ కల్యాణ్ గారు. అలాంటి ఆయన పక్కన నేను నిలబడటం చాలా అదృష్టం' అని చరణ్ చెప్పుకొచ్చారు.
https://twitter.com/10TvTeluguNews/status/1875561046905426062
పవన్‌కు థ్యాంక్స్: దిల్‌రాజు
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. 'గేమ్ ఛేంజర్ కథ ప్రస్తుత సమాజానికి అద్ధం పడుతుంది. రామ్‌చరణ్ నటన నేషనల్ అవార్డు వచ్చే లెవల్లో ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతికి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము అడగ్గానే సమయాన్ని కేటాయించినందుకు పవన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో ఇచ్చినందుకు నా ధన్యవాదాలు' అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చారు.
రెండు కొత్త సాంగ్స్ రిలీజ్..
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. మెగా ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు. బ్యాక్ టూ బ్యాక్ రెండు కొత్త పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్, సినిమా గేమ్ ఛేంజర్ రామ్‌చరణ్ సమక్షంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది' అంటూ వ్యాఖ్యానించారు.
https://twitter.com/AlwayzRamCharan/status/1875545320534503879
https://twitter.com/Pirateishere_/status/1875546243805671786
చరణ్‌పై అంజలి కామెంట్స్..
‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పవన్ గురించి మాట్లాడుతూ.. ‘మీపైనా నాకు చాలా గౌరవముంది. మీతో వకీల్‌సాబ్‌లో నటించారు. మీ గ్రోత్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరింది. ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి’ అని పేర్కొంది. అలాగే చరణ్ గురించి ప్రస్తావిస్తూ ‘ఎలాంటి కోస్టార్స్‌తో చేస్తే కంఫర్టబుల్‌గా ఫీలవుతామో అలాంటి యాక్టర్ చరణ్. మీతో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది. మీతో మరిన్ని చిత్రాలు చేయాలి’ అని అంజలి చెప్పుకొచ్చింది.
నేషనల్ అవార్డు పక్కా..
ఏపీలోని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ముందుగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. ‘గేమ్ ఛేంజర్‌తో రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న క్యారెక్టరైజేషన్ ఆయనది. సీన్లు బాగా వచ్చాయి. ఎస్.జే సూర్య పక్కన కనిపించే పొలిటిషియన్ పాత్ర చేశా. తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెప్పా’ అంటూ చెప్పుకొచ్చారు.
https://twitter.com/OnlyForRC45/status/1875536386679566757
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
'గేమ్ ఛేంజర్' చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ ధరల పెంపుతో పాటు, (Game Changer Ticket Rates) బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్లీప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
జనవరి 04 , 2025

Allu Arjun Arrest: బన్నీ అరెస్టు తప్పదా? అదే జరిగితే పదేళ్ల జైలు శిక్ష!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం సర్వత్రా బ్లాక్‌బాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే అదే సమయంలో 'పుష్ప 2'ను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ దుర్ఘటనపై హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దీంతో త్వరలో అల్లు అర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేస్తారా? అన్న అనుమానం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీలో మెుదలైంది.
కేసుకు కారణాలు ఇవే!
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)పై కేసు పెట్టినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై సైతం సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రీమియర్స్ సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఈ కేసు పెట్టినట్లు తెలిపారు. సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం తమకు లేదని డీసీపీ తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సమాచారం ఇవ్వకపోగా పబ్లిక్‌ను అదుపుచేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అక్షాంశ్ యాదవ్ స్పష్టం చేశారు.
https://twitter.com/jsuryareddy/status/1864416102232805676
https://twitter.com/media5zone/status/1864748218325557304
సెక్షన్స్ ఏం చెబుతున్నాయి?
అల్లు అర్జున్‌పై నమోదు చేసిన 105, 118(1)r/w3(5) BNS సెక్షన్స్ లీగల్‌గా చాలా స్ట్రాంగ్ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 105ను ప్రాణ నష్టం కేసు లేదా హత్య కింత పరిగణిస్తారని తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణం పోవడంలో పరోక్షంగా అతడి ప్రమేయం ఉన్నందున ఈ సెక్షన్‌కు బన్నీ బాథ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరో సెక్షన్ 118(1) ‘నేరాన్ని ప్రేరేపించారు’ అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతుందని అంటున్నారు. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకొని నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుందని చెబుతున్నారు.
https://twitter.com/CNBCTV18News/status/1864572311036473766
బన్నీ అరెస్టు తప్పదా?
చిక్కడపల్లి పోలీసులు అల్లుఅర్జున్‌ను అరెస్టు (Allu Arjun Arrest) చేసే అవకాశం లేకపోలేదని నేర విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ వద్ద భారీ రద్దీ ఏర్పడింది. అయితే తన రాకకు సంబంధించి బన్నీ ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఈ కేసు నుంచి అతడు బయటపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ వెళ్లినట్లైతే అతడికి చిక్కులు తప్పవని చెబుతున్నారు. బన్నీ ముందస్తు సమాచారం ఇచ్చాడా? లేదా? అన్నదానిపై పోలీసులు కూడా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం మాత్రమే తమకు ఇన్‌ఫర్మేషన్ ఇవ్వలేదని డీసీపీ ప్రకటించారు. థియేటర్ నిర్వాహకులకు బన్నీ చెప్పి ఉండి, వారు మాత్రం నిర్లక్ష్యం వహించి ఉంటే మాత్రం బన్నీ సేఫయ్యే ఛాన్సెస్ ఉన్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలీసులకు సైతం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బన్నీకి లేదా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెుత్తం మీద ఈ కేసుపై చిక్కడపల్లి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నందున అరెస్టులకు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.
రూ.25 లక్షల సాయం
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై అల్లు అర్జున్ (Allu Arjun Arrest) స్పందించారు. స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని బన్నీ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి రేవతి చనిపోయిందని తెలియగానే తనతో పాటు మూవీ టీమ్ అంతా షాకైందని చెప్పారు. ఫ్యాన్స్‌తో సినిమా చూడటమనేది గత 20 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని బన్నీ అన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఈ ఘటనతో తమని ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. తన తరపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. మృతురాలి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
https://twitter.com/alluarjun/status/1865063351451292062
డిసెంబర్ 07 , 2024

Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్’లో ఆ యంగ్ హీరోనే టాప్.. పాజిటివ్ టాక్ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!
గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం.
[toc]
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 8.2 కోట్లకు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఫలితంగా విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వసూళ్లను రాబట్టినట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
విశ్వక్ వన్‌మ్యాన్ షో
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో లంకల రత్న అనే యువకుడిగా విశ్వక్ సేన్ యాక్టింగ్, అతడి క్యారెక్టరైజేషన్ అభిమానులను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
కథేంటి
కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్ లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
గం.. గం.. గణేశా
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విష్వక్ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.80-90 లక్షల వరకు గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 లక్షలకుపైగా షేర్ రాబట్టినట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.
కామెడీ ప్రధానం బలం
క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించాడు. కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. గం గం గణేశా మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌సారిక హీరోయిన్లుగా నటించారు. బేబీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్ దేవరకొండ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిషోర్‌తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.
కథేంటి
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది కథ.
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్ రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలు పోషించారు.
కథేంటి
తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్ టైసన్)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్ విలన్ గ్యాంగ్ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
జూన్ 01 , 2024