రివ్యూస్
How was the movie?
తారాగణం
గోపీచంద్చిన్నా
కామ్నా జెఠ్మలానీమహేశ్వరి / మహి
బిజు మీనన్భగవతి
చంద్ర మోహన్చిన్నా నాన్న
అలీగోకుల్
రమాప్రభమహి అమ్మమ్మ
వేణు మాధవ్వేణు
సుమన్ సెట్టిస్టూడెంట్
ధర్మవరపు సుబ్రహ్మణ్యంప్రిన్సిపాల్
జీవాఇన్స్పెక్టర్
జివి సుధాకర్ నాయుడుమస్తాన్
వజ్జ వెంకట గిరిధర్స్టూడెంట్
అమిత్స్టూడెంట్
వేణుభగవతి అనుచరులు
చిట్టిచిన్నా తమ్ముడు
టార్జాన్గౌరీ
విజయ సింగ్చిన్నా తల్లి
జాహ్నవిమహి స్నేహితురాలు
సిబ్బంది
అమ్మ రాజశేఖర్దర్శకుడు
పోకూరి బాబు రావునిర్మాత
మరుధూరి రాజా (డైలాగ్స్)రచయిత
మణి శర్మ
సంగీతకారుడుఅమ్మ రాజశేఖర్కథ
Ch. రమణ రాజుసినిమాటోగ్రాఫర్
గౌతం రాజుఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
ఆషికా రంగనాథ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఆషికా రంగనాథ్.. తెలుగులో అమిగోస్ చిత్రం ద్వారా పరిచయమైంది. నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఆషికా రంగనాథ్‌కు బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఆషికా రంగనాథ్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Ashika Ranganath) ఓసారి చూద్దాం
ఆషికా రంగనాథ్ వయస్సు ఎంత?
1996, ఆగస్టు 5న జన్మించింది
ఆషికా రంగనాథ్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అమిగోస్(2023)
ఆషికా రంగనాథ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
Courtesy Twitter: Ashika Ranganath
ఆషికా రంగనాథ్ ఎక్కడ పుట్టింది?
హసన్, కర్ణాటక
ఆషికా రంగనాథ్ ఉండేది ఎక్కడ?
బెంగుళూరు
ఆషికా రంగనాథ్ ఏం చదివింది?
డిగ్రీ
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
మోడలింగ్, బెంగుళూరులో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన ఆహారం?
చికెన్ సూప్
View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన కలర్ ?
వైట్
ఆషికా రంగనాథ్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి నుచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఆషికా రంగనాథ్ తల్లిదండ్రుల పేరు?
సుధా, రంగనాథ్
ఆషికా రంగనాథ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఆషికా రంగనాథ్ మోడలింగ్ చేసేది
ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ashika_rangnath/?hl=en
ఆషికా రంగనాథ్ హీరో?
సుదీప్
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
ఆషికా రంగనాథ్‌కు డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.
https://www.youtube.com/watch?v=dnUayT-BsXU
ఏప్రిల్ 16 , 2024
Ramayanam: రణ్‌బీర్ - సాయి పల్లవి ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్.. ఎందుకంటే?
రామయాణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో మరో సినిమా రాబోతోంది. దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) 'రామాయణం' (Ramayanam)పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ (Yash) కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) భాగం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
ఆ బాధ్యత అప్పగింత!
లేటెస్ట్ బజ్ ప్రకారం... రామాయణ తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)కు మేకర్స్ అప్పగించినట్లు సమాచారం. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు పేర్కొంటున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు.
బన్నీ చేతుల్లో త్రివిక్రమ్ భవితవ్యం!
ఈ ఏడాదిలో 'గుంటూరు కారం' (Guntur Kaaram)తో ప్రేక్షకులను మెప్పించిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ఆయన చెప్పారు. అయితే బన్నీ'పుష్ప 2'తో ఫుల్ బిజీగా ఉండటం.. దాని తర్వాత అట్లీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్ చేరడం ఖాయమని చెప్పవచ్చు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఛాన్స్ వుంది.
‘ఆదిపురుష్’లా జరగకూడదు!
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని డైలాగ్స్‌పై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదిపురుష్ తెలుగు వెర్షన్ చూసిన వారు కూడా సంభాషణలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి తప్పిదం పునరావృతం కాకుండా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే త్రివిక్రమ్‌ను డైలాగ్స్ అందించాల్సిందిగా మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 04 , 2024
Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్ ఉగ్రరూపం.. ‘యానిమల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉండటంతో ‘యానిమల్’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ.
ఎవరెలా చేశారంటే
తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్ చేశారన్న కోపంతో హీరో గన్ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్ ఆయన మార్క్ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్ యాక్షన్ సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్ - బాబీ డియోల్ మధ్య ఫైట్ సీన్స్ సందీప్ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్ ఫీలవుతారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.
ప్లస్ పాయింట్
రణ్‌బీర్ నటనయాక్షన్ సీన్లునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్
నిడివిసాగదీత సీన్లు
రేటింగ్ : 4/5
డిసెంబర్ 01 , 2023
Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్ కపూర్ ప్లేట్ ఫిరాయించాడా!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్’ (Animal). నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో అనేక విమర్శలను సైతం మూటగట్టుకుంది. తీవ్ర హింసతోపాటు పలు సీన్స్‌లో మహిళను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి ఈ విమర్శలపై రణ్‌బీర్ కపూర్ స్పందించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
‘అది నా బాధ్యత’
గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడారు. ‘యానిమల్ (Animal) విషయంలో అందరి అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం తమ బాధ్యతని రణ్‌బీర్ అన్నారు. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. నటీ నటులకు ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను యానిమల్ సినిమా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మూవీ గురించి విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/IFFIGoa/status/1860953456476835977
అలా చెప్పకుండా తప్పుచేశారా?
‘యానిమల్’ గురించి రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. విమర్శకుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పడం తమకు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓ రకంగా వారికి మద్దతు తెలియజేయడమేనని అభిప్రాయపడుతున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని రణ్‌బీర్ నేరుగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలా కాకుండా ‘కర్ర ఇరగొద్దు.. పాము చావొద్దు’ అన్న విధంగా రణ్‌బీర్ వ్యాఖ్యలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి కూడా కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఎనిమిది రోజులపాటు..
గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) (IFFI) వేడుకగా జరుగుతోంది. నవంబర్ 20న ప్రారంభమైన ఈ వేడుక నవంబర్ 28 వరకు జరగనుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్ దిగ్గజాలను నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు రణ్‌బీర్ తన ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశమంతా రాజ్‌కపూర్ సినిమాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే వారి సినిమాల గురించి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు.
ఇద్దరూ బిజీ బిజీ
‘యానిమల్’తో సాలిడ్ విజయాన్ని అందుకున్న సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సందీప్ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే నెల డిసెంబర్‌లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుంది. మరోవైపు ‘యానిమల్’ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామయణ’ (Ramayana) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా ఆయన చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
నవంబర్ 25 , 2024
Deepika Padukone: రణ్‌వీర్ - దీపికా విడాకులు తీసుకోబోతున్నారా?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. నటుడు రణ్‌వీర్.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడంతో సంచలనంగా మారింది. త్వరలో వీరిద్దరు వీడిపోతున్నారా? అన్న ఊహాగానాలకు ఇది తెరలేపింది.
తాజాగా రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను (Ranveer Singh Removes Wedding Pictures) పరిశీలించిన కొందరు ఫ్యాన్స్.. అందులో పెళ్లి ఫొటోలు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ మేటర్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
చిత్ర పరిశ్రమలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధమవుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు బాలీవుడ్ వర్గాలు, జాతీయా మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ, రణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఫొటోలు (Ranveer and Deepika's divorce Rumours) మాత్రమే మిస్ అయ్యాయి. దీపికతో మాములుగా దిగిన ఫొటోలు అంతే ఉన్నాయి. దీంతో రణ్‌వీర్ కావాలనే ఈ ఫొటోలను డిలీట్ చేసి తమ మధ్య ఉన్న మనస్పర్థలను బహిర్గతం చేశారని రూమర్లు మెుదలయ్యాయి.
అయితే బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. రణ్‌వీర్ ఈ మధ్యే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆర్చీవ్ చేశారట. ఆ కారణంగా తన అకౌంట్‌లో 2023కి ముందు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయ్యి కనబడటం లేదట.
ప్రస్తుతం ఈ జంట తమ తమ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక దీపిక ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. వీరి జోడీని తెరపై చూసేందుకు ఇరువురు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
2013లో రిలీజైన రామ్‌లీలా సినిమాలో దీపికా - రణ్‌వీర్ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించారు.
దాదాపు ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018లో దీపికా - రణ్‌వీర్ సింగ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలా మంది హాజరయ్యారు.
అయితే రణ్‌వీర్ - దీపికా (Deepika & Ranveer's Relationship) విడాకులపై రూమర్లు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు వీరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు దీపికా చేసిన వ్యాఖ్యలు రణ్‌వీర్‌కు కోపం తెప్పించాయి. ఇక వారు విడిపోవడం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ, అది తప్పను ఈ జంట నిరూపించింది.
మే 08 , 2024
Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.
https://twitter.com/i/status/1772544977396220385
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)
స్టార్ నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.
హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.
View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet)
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.
యంగ్ హీరోయిన్ మెహరీన్ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
నటి మాళవిక మోహనన్ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
నటి రాయ్ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.
ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.
హోలీని బాగా సెలబ్రేట్ చేసుకున్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ శివాలిక ఒబెరాయ్ ఉంది.
యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.
మెగా డాటర్స్ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
బాలీవుడ్ భామ అవనీత్ కౌర్.. హోలీ రోజున సోషల్ మీడియాలో తళుక్కుమంది.
ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.
పాపులర్ హీరోయిన్ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.
హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.
View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
మార్చి 26 , 2024
Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మార్చి 25 , 2024
Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్ (Animal). బుధవారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజవ్వగా ఇందులో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) లిప్‌లాక్‌లతో అదరగొట్టారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాటలో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు.
https://twitter.com/ilysmnojk/status/1712018933333778570?s=20
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సాంగ్‌ను ముద్దుతో ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. చూడండి ఏం చేశాడో’ అని రణ్‌బీర్‌పై రష్మిక ఫ్యామిలీ ఫైర్ అవుతుంటారు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని రణ్‌బీర్, రష్మిక.. కుటుంబ సభ్యుల ముందే లిప్‌లాక్ చేసుకోవడం షాక్‌కి గురిచేస్తుంది.
ఆ తర్వాత ఫ్లైట్ జర్నీలో రష్మిక, రణ్‌బీర్ ముద్దుల్లో మునిగిపోయినట్లుగా చూపించారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించి పాటను ఎండ్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్‌లో రణ్‌భీర్, రష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది.
రష్మికకు ఇది హిందీలో మూడో చిత్రం. అంతకుముందు అమితాబ్ బచ్చన్‌తో గుడ్ బై (Good Bye), సిద్దార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ (Mission Majnu) చిత్రాలు చేసినప్పటికీ గ్లామర్ షో చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. తాజాగా రణ్‌బీర్ సినిమాలో మాత్రం ఈ భామ రెచ్చిపోయినట్లే కనిపిస్తోంది.
రష్మికకు లిప్‌లాక్ సీన్ కొత్తేమి కాదు. గతంలో విజయ్ దేవరకొండతో చేసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ ఈ భామ ముద్దు సీన్‌లో నటించింది. తాజాగా యానిమల్ చిత్రంలో ఇలా లిప్‌లాక్ సీన్ చేయడం ద్వారా బాలీవుడ్‌కు గట్టి సందేశాన్ని రష్మిక ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎటువంటి సాహసాలకైనా రెడీ అనే మెసేజ్‌ను ఈ భామ పంపింది.
అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మార్క్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించాడు. గతంలో అర్జున్ రెడ్డి మూవీ పోస్టర్‌ను సందీప్ లిప్‌లాక్‌తోనే రిలీజ్ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. తాజాగా యానిమల్ ఫస్ట్ సింగిల్ పోస్టర్‌ను సైతం ఘాటైన ముద్దుతో చూపించడం సందీప్ వంగాకే చెల్లింది.
ఇదిలా ఉంటే రణ్‌బీర్, రష్మిక లిప్‌లాక్ సీన్లను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రష్మిక, అర్జున్ రిలేషన్‌లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా నుంచే వీరి ప్రేమాయణం ప్రారంభమైందని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యాన్స్ రష్మికపై మండిపడుతున్నారు.
మరికొందరు నెటిజన్లు యానిమల్ ఫస్ట్ సింగిల్‌పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. లిరిక్స్, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయని పేర్కొంటున్నారు. పాట చూస్తుంటే యానిమల్ మూవీ అర్జున్‌రెడ్డికి మరో వెర్షన్‌లా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవసరమా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు.
యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్యయంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు.
అక్టోబర్ 11 , 2023
Rangabali Movie Review: రంగబలితో నాగశౌర్య సక్సెస్ అందుకున్నట్లేనా.. మూవీ ఎలా ఉంది?
నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
దర్శకుడు: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీతం: పవన్ సీహెచ్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య ఇందులో మాస్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సారి ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? మాస్ ఆడియెన్స్‌ని నాగశౌర్య బుట్టలో వేసుకున్నాడా? వంటి అంశాలను రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
శౌర్య(నాగశౌర్య) పనీపాట లేకుండా తిరిగే అబ్బాయి. రాజవరంలో తండ్రి విశ్వం(రమణ) మెడికల్ షాపుని నిర్వహిస్తుంటాడు. కొడుకుకి మెడికల్ షాపును అప్పజెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాలని భావిస్తాడు విశ్వం. ఇందుకోసం ఫార్మసీ ట్రైనింగ్‌కి వైజాగ్ పంపిస్తాడు. అక్కడ శౌర్య సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. కానీ, వీరి ప్రేమను అంగీకరించడానికి సహజ తండ్రి అడ్డు చెబుతాడు. రాజవరంలోని రంగబలి సెంటర్ ఇందుకు ప్రధాన కారణం. మరి వీరి ప్రేమకి, రంగబలికి సంబంధం ఏంటి? ప్రేమ కోసం హీరో ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
రంగబలి చూసిన ఆడియన్స్‌కు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసిన భావనే కలుగుతుంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. సత్య చేసే కామెడీ ఫస్టాఫ్‌లో బోర్ కొట్టకుండా చేస్తుంది. ఇక ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ సీన్లతో నడుస్తుంది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోరు సెకండాఫ్‌లో ఉండదు. ఇక, క్లైమాక్స్ తీసికట్టుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కథ అందరికీ తెలిసేలా ఉన్నా ప్రభావవంతమైన కథనంతో ప్రేక్షకుడిని రంగబలి మెప్పించలేకపోయింది.
ఎవరెలా చేశారు?
సొంతూరిలో రాజులా బతకాలనే భావనతో ఏమైనా చేసే యువకుడి పాత్రలో నాగశౌర్య మెప్పించాడు. లుక్స్‌తో క్లాస్, బాడీతో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజ ఫర్వాలేదనిపించింది. హీరోతో రొమాన్స్ పండించింది. ఇక కమెడియన్ సత్య కడుపుబ్బా నవ్వించాడు. ఇతరులు సంతోషపడితే చూడలేని అగాధం పాత్రలో ఇరగదీశాడు. ఫస్టాఫ్ మొత్తం తన కామెడీనే గుర్తుండిపోయేలా చేశాడు. ఇక, విలన్‌గా షైన్ టామ్ చాకోకు సరైన క్యారెక్టర్ పడలేదనిపించింది. డిజైన్ చేసిన మేరకు తన పాత్రలో మెప్పించాడీ మలయాళ నటుడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శరత్ కుమార్, తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా?
ఒక చిన్న విషయాన్ని అనుకుని దానిని సినిమాగా డెవలప్ చేశాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. తొలి సినిమా అయినప్పటికీ కొన్ని సీన్లలో తన ప్రతిభను కనబర్చాడు. అయితే, ఓవరాల్‌గా ప్రేక్షకుడిని సాటిస్‌ఫై చేయలేకపోయాడు. క్లైమాక్స్‌ని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ పాటలు పెద్దగా బయటికి రాలేవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=e9d9qhvI3dk
ప్లస్ పాయింట్స్
కామెడీ
నటీనటులు
మైనస్ పాయింట్స్
పేలవ కథ, కథనం
క్లైమాక్స్
పాటలు
రేటింగ్: 2.25/5
https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ
జూలై 07 , 2023
Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..!
రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు.
చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించాడు. సీతాపహరణం నుంచి రావణ సంహారం వరకు కథాంశంగా తీసుకుని ఆదిపురుష్‌ని తెరకెక్కించారు. అయితే, నితేశ్ తివారి తీయబోయే రామాయణం విజువల్ వండర్‌గా ఉండనుందట. స్టోరీ లైన్‌పై స్పష్టత లేనప్పటికీ రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించాలన్న సంకల్పంతో డైరెక్టర్ ఉన్నాడు. ఇందుకు అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు.
తారాగణం..
రామాయణం కథ అందరికీ తెలిసిందే. కానీ, దానిని చూపించడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే. అందుకే ప్రతి చిన్న విషయంలో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం ప్రధానంగా తారాగణంపై ఫోకస్ పెట్టింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీతగా అలియాను ఎంచుకున్నారు. దీపావళికి దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఉండనుంది.
రావణుడిగా యశ్..
కీలకమైన రావణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురితో డైరెక్టర్ చర్చించాడు. లేటెస్ట్‌గా కేజీఎఫ్ స్టార్ యశ్‌ని ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే, జనవరిలోనే మేకర్లు యశ్‌ని కలిశారట. అప్పటినుంచి స్క్రిప్ట్ చర్చల్లోనే వీరున్నారట. విలన్ రోల్ చేయడానికి యశ్ దాదాపుగా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో యశ్ రోల్‌ని కన్ఫర్మ్ చేయనుంది. వాస్తవానికి తొలుత హృతిక్ రోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి పరిశీలించి చూశారు. అయితే, విక్రమ్‌వేదలో నెగెటివ్ రోల్ దెబ్బకొట్టడంతో హృతిక్ రామాయణం ప్రాజెక్టుకు నో చెప్పాడు.
లుక్ టెస్ట్..
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లుక్ టెస్ట్ నడుస్తోంది. రాముడి పాత్రకు తగ్గట్టు రణ్‌బీర్ తనను తాను మలుచుకోనున్నాడు. పైగా, వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇటీవల వీరిద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర హిట్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్‌లో షూట్..
డిసెంబరు నుంచి ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. అన్నీ కుదిరితే 2025 దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను మధు మంతెన వర్మ, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీనిని తీసుకు రానున్నారు.
జూన్ 08 , 2023
Keerthy Suresh: నలుపు రంగు చీరలో మతిపోగొడుతున్న కీర్తి సురేష్..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూన్ 02 , 2023
Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్
యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని
మోటివేట్ చేసే అంశం?
అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి.
https://twitter.com/anusuyakhasba/status/1646470630639034368
ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర?
అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా..
https://twitter.com/anusuyakhasba/status/1646469527897800706
ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు?
అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలనేదే నా తాపత్రయం.
https://twitter.com/anusuyakhasba/status/1646463701757878274
ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా?
అను: హనుమంతుడు నా ఫేవరెట్. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు.
https://twitter.com/anusuyakhasba/status/1646461240250896389
https://telugu.yousay.tv/trolls-on-anasuya-they-dont-understand.html
ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు.
అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్ చేయడం కరెంట్ కాదు.
https://twitter.com/anusuyakhasba/status/1646458862214733824
ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు భయం వేయలేదా?
అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది.
https://twitter.com/anusuyakhasba/status/1646456898613579776
ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా?
అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం.
https://twitter.com/anusuyakhasba/status/1646455609506816001
ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్ చెప్పిండి?
అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది.
https://twitter.com/anusuyakhasba/status/1646455293927374851
ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా?
అను: అది నిజం కాదు.
https://twitter.com/anusuyakhasba/status/1646438774950477826
ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు?
అను: నథింగ్.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు.
https://twitter.com/anusuyakhasba/status/1646437957228965889
https://telugu.yousay.tv/anasuyas-romance-with-sunflowers.html
ఏప్రిల్ 14 , 2023
TAPSEE PANNU: నీలం రంగు చీరకట్టి… నాభి చుట్టు గొలుసు పెట్టిన సొట్ట బుగ్గల సుందరి
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
మార్చి 17 , 2023
Kalki 2898 AD: ప్రభాస్ కోసం రంగంలోకి మహేష్.. ఎందుకంటే?
సలార్ (Salaar) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో హాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ న్యూస్ బయటకొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు డబ్బింగ్? (Mahesh Babu Dubbing)
కల్కి చిత్రం (Prabhas New Movie)లో హీరో ప్రభాస్ విష్ణు మూర్తి అవతారంలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అతడి పాత్ర పేరు 'భైరవ' అని చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది. అయితే ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్‌ను ఉపయోగించుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రభాస్ ఎంట్రీకి, ఎలివేషన్స్‌కు మహేష్ వాయిస్ ఇస్తే సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయమై మహేష్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో ఇలాగే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు. గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన అనుభవం ఉంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) - త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ (Jalsa Movie) సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సంజయ్ సాహు పాత్రను పరిచయం చేస్తూ తన వాయిస్‌తో చక్కటి ఎలివేషన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఇది ‘జల్సా’ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మహేష్ చేత ఎలాగైన డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుదలతో ఉన్నట్లు ఫిల్స్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘SSMB29’ సినిమా షూట్ కోసం సిద్దమవుతున్నాడు. మరి ఈ ఆఫర్‌కు మహేష్ ఓకే చెప్తాడో లేదో చూడాలి.
కల్కి వెనక లెజెండరీ డైరెక్టర్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Prabhas New Movie Director).. కల్కి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ద్వాపర యుగం నుంచి కలియుగం అంతంలో కల్కి అవతరించే వరకు ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. మహాభారతం నాటి పాత్రలతో ముడిపడి ఉన్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై ఇతిహాసాల ప్రభావం కూడా గట్టిగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో పౌరాణిక చిత్రాలపై పట్టున్న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) ఈ సినిమా విషయంలో తన వంతు సాయం అందిస్తున్నట్లు సమాచారం. ‘మాయాబజార్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం కల్కికి ఉపయోగపడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
‘ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు’
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి’ (Prabhas New Movie) సినిమాపై రానా (Rana Daggubati) ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో వ్యాఖ్యానించాడు. ‘భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. ఈ ఇండియన్ ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నా’ అని అన్నాడు. కాగా, ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
మే 08 , 2024
Anasuya Bharadwaj: థైస్ అందాలతో రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూలై 25 , 2023
Anasuya Bharadwaj: కైపెక్కించే ఫోజుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రంగమ్మత్త!
బుల్లితెర యాంకర్ & నటి అనసూయ భరద్వాజ్ మరోమారు గ్లామర్ ఫొటోలతో తళుక్కుమంది. హాఫ్ జాకెట్‌లో సింధూర పువ్వులా మెరిసిపోయింది.
ట్రెండీ లెహంగా, మ్యాచింగ్ టాప్ ధరించిన అనసూయ.. మతులు పోగెట్టో ఫోజులతో అలరించింది.
సోఫాలో పడుకొని అందాల విందు చేసింది. హాట్ హాట్ స్టిల్స్‌తో ఆకట్టుకుంది.
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 - 2022 మధ్య బుల్లితెర యాంకర్‌గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్‌లో అనసూయ న్యూస్ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్, గాయత్రి సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. ప్రస్తుతం పుష్ప2 చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది.
తాజాగా విమానం సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో అనసూయ బిజీబిజీగా గడుపుతోంది.
జూన్ 01 , 2023
REVIEW: కృష్ణ వంశీ మార్క్ భావోద్వేగాలతో నిండిన 'రంగమార్తాండ'
కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కృష్ణ వంశీ. కొద్దిరోజులుగా హిట్ చిత్రాలు తీయకపోయినా తన మార్క్ ఎవ్వరూ మర్చిపోలేదు. వంశీ ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కించాడు. ఉగాది రోజున సినిమా విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్ షోలు వేశారు. మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కృష్ణ వంశీ సక్సెస్ బాట పట్టాడా? అనేది చూద్దాం.
దర్శకుడు: కృష్ణవంశీ
నటీ నటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, తదితరులు
సంగీతం: ఇళయ రాజా
సినిమాటోగ్రఫీ: రాజ్.కె. నళ్లీ
కథేంటీ?
రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ.
ఎలా ఉందంటే?
రాఘవరావు, చక్రవర్తి పాత్రలతో కథను ఆరంభించిన దర్శకుడు రంగమార్తాండ బిరుదు తీసుకొని నాటకాలకు స్వస్థి పలికిన వ్యక్తి పాత్రలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. కోడలికి ఆస్తి పంచి, కుమార్తెకు ప్రేమించిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసి తన బాధ్యతలు నిర్వర్తించిన పెద్దమనిషి సాధారణమైన జీవితాన్ని చూపించాడు.
ఆనందంగా గడుపుదామనుకున్న వ్యక్తికి కోడలు పెట్టే అవమానాలు, కూతురు ఇంటికి వెళ్లిన అతడికి ఎదురయ్యే పరిణామాలు దిక్కుతోచని స్థితిలో పడేస్తాయి.కుటుంబ విలువలను చక్కగా చూపించే కృష్ణవంశీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చూపించాడు.
మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్చాడు వంశీ. తెలుగు నాటకరంగం ఎంత గొప్పదో వివరించే సన్నివేశాలు అదిరిపోతాయి.
ఎవరెలా చేశారంటే?
నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రకాశ్ రాజ్ ఈ సినిమాతో శిఖరాన్ని చేరుకున్నాడు. రాఘవపాత్రకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరంటే అతిశయోక్తి కాదు.
పంచతంత్రం సినిమాతో రూటు మార్చిన బ్రహ్మానందం భావోద్వేగపూరితమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఆయనలో సరికొత్త కోణం కనిపిస్తుంది. భర్త చాటు భార్యగా కేవలం కళ్లతోనే హావాభావాలు పలికించే పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది.
రాఘవరావు కోడలి పాత్రలో అనసూయ, కుమార్తెగా శివాత్మిక, మిగిలిన పాత్రల్లో నటించిన రాహుల్ సిప్లిగంజ్, అలీ రాజా, ఆదర్శ్ వారి రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ తరం యువత ఎలా ఉంటారనే కోణంలో మెప్పించారు.
సాంకేతికత విలువలు
రంగమార్తాండ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో తన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుత యువత, తల్లిదండ్రుల మధ్య సంఘర్షణను చూపించండంలో విజయం సాధించాడు .
సినిమాకు మరో పిల్లర్ సంగీతం. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన వినసొంపైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది.
ఇక్కడ మరోవ్యక్తి గురించి చెప్పుకోవాల్సిందే. ఆకెళ్ళ శివ ప్రసాద్ మాటలు సినిమాకు ప్రధాన బలం. సినిమాలపై అతడికి ఉన్న అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది.
బలాలు
నటీనటులు
దర్శకత్వం
సంగీతం
మాటలు
బలహీనతలు
తారాబలం లేకపోవటం
రేటింగ్: 3.5/5
మార్చి 21 , 2023
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టును ఖండిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరోవైపు బన్నీ అరెస్టును భారాస కీలక నేత కేటీఆర్ సైతం ఖండించంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బన్నీ నివాసానికి మెగా బ్రదర్స్
బన్నీ అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అటు సోదరుడు నాగబాబు కూడా చిరంజీవి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను తోడుగా ఉన్నామని మెగా బ్రదర్స్ అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
https://twitter.com/DailyCultureYT/status/1867498589523783717
https://twitter.com/SureshPRO_/status/1867498295825678422
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం మేజిస్ట్రేట్ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి రిమాండ్ విధించే విషయమై కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.
బన్నీ కోసం చిరంజీవి..
అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను ఆయన ఉన్నపళంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రనిర్మాత దిల్ రాజు, మరికొందరు డైరెక్టర్స్‌తో కలిసి ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు సోదరుడు అల్లు శిరీష్ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బన్నీని కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.
https://twitter.com/Abhinaytweets06/status/1867492787072938070
బన్నీ అరెస్టుపై కేటీఆర్ ఫైర్..
అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టుపై భారస నేత, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయెుద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌ను కూాడా అరెస్టు చేయాలి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ రాసుకొచ్చారు.
https://twitter.com/KTRBRS/status/1867480142085578958
https://twitter.com/NAR_Handle/status/1867482837689282809
అరెస్టుపై సీఎం రియాక్షన్ ఇదే..
అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టంం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పకొచ్చారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
అరెస్టు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ తరపున అతడి లాయర్లు న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద తమ పిటిషన్ స్వీకరించి బన్నీ అరెస్టును సోమవారం వరకూ వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను స్థానిక కోర్టులో చిక్కడపల్లి పోలీసులు హాజరు పరిచే అవకాశముంది. ఈలోపు హైకోర్టు ధర్మాసనం తీర్పు వస్తే దాని ప్రభావం పోలీసులపై పడొచ్చు.
డిసెంబర్ 13 , 2024
Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్’ ఆ స్థాయిలో ఉందా?
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు
రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
విడుదల తేదీ: 25-10-2024
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రంపై మంచి ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.
ప్లస్ పాయింట్స్
కథప్రధాన తారాగణం నటనసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Sai Pallavi: సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్.. రావణుడిగా యష్.. బాలీవుడ్‌లో మరో ‘రామాయణం’!
అందాల తార సాయి పల్లవి బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న ‘రామాయణం’ చిత్రంలో ఆమె సీతా దేవి పాత్రను పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2024లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు గతంలో ప్రచారం సాగింది. చివరికీ సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.
రామయాణం చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ కుమార్ తెరకెక్కించనున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడి పాత్రను పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
సహజంగా నటించి ఏ పాత్రకైనా ఒక మంచి విలువను తీసుకొచ్చే సాయి పల్లవి.. ఇక సీతగా ఆ క్యారెక్టర్‌కు ఎంతటి నిండుతనాన్ని తీసుకొస్తుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి మేకర్స్ సాయిపల్లవిని సంప్రదించగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సాయిపల్లవికి పెళ్లి అయ్యిందంటూ ఇటీవల తెగ రూమర్స్ వచ్చాయి. తమిళ దర్శకుడు వేణు ఊడుగులను ఆమె వివాహం చేసుకున్నట్లు నెట్టింట విస్తృతంగా ప్రచారం జరిగింది. వారు దండలతో ఉన్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
పెళ్లిపై జరుగుతున్న రూమర్స్‌పై సాయిపల్లవి స్పందించింది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫొటోలను క్రాప్ చేసి డబ్బుకోసం నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉందని పేర్కొంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యేనని మండిపడింది.
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది ఈ భామ. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. నాగ చైతన్యతో సాయి పల్లవికి ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్ స్టోరీ తెలుగులో సూపర్ హిట్ అయింది.
అక్టోబర్ 04 , 2023