• TFIDB EN
  • రత్నం (2024)
    UATelugu
    రత్నం (విశాల్‌).. ఏపీ, తమిళనాడు బోర్డర్‌లో జీవిస్తుంటాడు. జననీని (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Tamil )
    Watch
    2024 May 237 months ago
    ఒకరోజు ముందుగానే(మే 23) రత్నం సినిమా ప్రైమ్‌ వీడియోలోకి వచ్చేసింది.
    2024 May 227 months ago
    విశాల్ నటించిన రత్నం సినిమా మే 24 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
    రివ్యూస్
    YouSay Review

    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?

    యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ...read more

    How was the movie?

    తారాగణం
    విశాల్
    రత్నం
    ప్రియా భవానీ శంకర్
    జనని
    సముద్రకని
    రామచంద్రరాజు
    గౌతమ్ వాసుదేవ్ మీనన్
    యోగి బాబు
    మురళీ శర్మ
    హరీష్ పేరడి
    మోహన్ రామన్
    విజయకుమార్
    రాజేంద్రన్
    జయప్రకాష్
    వెట్టై ముత్తుకుమార్
    తులసి
    J. లివింగ్స్టన్
    ముత్తుకాళై
    అరవింద్ ఖఠారే
    మీసాయి రాజేంద్రన్
    సిబ్బంది
    హరి
    దర్శకుడు
    కార్తేకేయన్ సంతానంనిర్మాత
    అలంకార్ పాండియన్నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ఎం. సుకుమార్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
    Rathnam Movie First Review: యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపిన విశాల్‌.. ‘రత్నం’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, యోగి బాబు, మురళిశర్మ, హరీష్‌ పెరడి, మోహన్‌ రమన్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు కథ, దర్శకత్వం: హరి సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్‌ ఎడిటింగ్‌ : టీ.ఎస్‌. జై నిర్మాత : కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌ విడుదల తేదీ: 26 ఏప్రిల్‌, 2024 యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్‌ చిత్రం ‘రత్నం’ (Rathnam Movie Review In Telugu). గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి ‘భరణి’, ‘పూజా’ ఘన విజయాలను సాధించాయి. దీంతో మూడోసారి ఈ హిట్‌ కాంబో రిపీట్‌ కావడంతో ‘రత్నం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించింది. సముద్రఖని, యోగి బాబు, మురళిశర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశాల్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? రత్నం సినిమా అంచనాలు అందుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి? రత్నం (విశాల్‌).. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సరిహద్దుల్లో జీవిస్తుంటాడు. జననీ (ప్రియా భవానీ శంకర్‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే కొందరు గ్యాంగ్‌స్టర్లు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు రత్నం ఏం చేశాడు? వారి బారి నుంచి జననీని ఎలా కాపాడాడు? అసలు జననీని చంపేందుకు గ్యాంగ్‌స్టర్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో విశాల్‌ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా భవానీ శంకర్‌ మెప్పించింది. విశాల్‌తో వచ్చే ఏమోషనల్‌ సీన్స్‌లో ఈ అమ్మడు పోటీపడి మరి నటించింది. కామెడియన్ యోగిబాబు మరోమారు తన మార్క్‌ కామెడీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేశాడు. గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని, మురళి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ హరి.. ఎప్పటిలాగే ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేశారు. అదిరిపోయే యాక్షన్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఇచ్చారు. ఫస్టాఫ్‌లో విశాల్ ఇంట్రో సీన్స్, ప్రియా భవానీ శంకర్ మధ్య వచ్చే ఏమోషన్ సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌లో డెప్త్‌ కంటే సినిమాటిక్‌ టోన్‌ ఎక్కువగా ఉంది. యోగిబాబు కామెడీ సీన్లు తమిళ నేటివిటితో ఉండటం.. తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. ఇక డైరెక్టర్‌ హరి గత చిత్రాలతో పోలిస్తే స్క్రీన్‌ప్లే కూడా చాలా పూర్‌గా ఉంది. అయితే విశాల్‌ అభిమానులు, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చాలా ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండటం మూవీకి ప్లస్‌. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఎమోషనల్‌, యాక్షన్‌ సీక్వెన్‌లో దేవి ఇచ్చిన BGM.. ఆ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. అటు ఎం. సుకుమార్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంది. టీ.ఎస్‌ జై ఎడిటింగ్‌ వర్క్స్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ విశాల్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కంటెంట్‌ లేకపోవడంఆసక్తి పెంచని స్క్రీన్‌ ప్లే Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 26 , 2024
    This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.. రూల్స్ రంజన్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. మామ మశ్చీంద్ర వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. చిన్నా సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం 'చిత్త'. తెలుగులో 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మంత్‌ ఆఫ్ మధు క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. 800 శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌గా వస్తున్న చిత్రం '800'. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్‌ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7) TitleCategoryLanguagePlatformRelease DateBeckham SeriesEnglishNetflixOct  04Race to the SummitMovieGermanNetflixOctober 04Everything Now SeriesEnglishNetflixOctober 05Sister Death MovieEnglish NetflixOctober 05Miss Shetty Mr. Polishetty MovieTelugu Movie NetflixOctober 05  Fair Play           MovieEnglishNetflixOctober 06Insidious: The Red DoormovieEnglishNetflixOctober 06Strong Girl Nam SoonSerieskoreanNetflixOctober 07    Mumbai Diaries Season 2SeriesHindi Amazon PrimeOctober 06    Totally Killer MovieEnglishAmazon PrimeOctober 06Desperately Seeking Soulmate SeriesEnglish Amazon PrimeOctober 06Haunted Mansion      Movie English HotstarOctober 04Loki: Season 2SeriesEnglishHotstarOctober 06Mr. Pregnant MovieTeluguAhaOctober 06The Great Indian SuicideMovieTeluguAhaOctober 06Nee Vente NenuMovieTeluguCine BazaarOctober 06Gadar 2MovieHindiZee5October 06The Nun 2           MovieEnglishBook My ShowOctober 03Gran Turismo MovieEnglishBook My ShowOctober 05Asteroid City MovieEnglish Book My ShowOctober 06
    అక్టోబర్ 02 , 2023
    <strong>Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్</strong>
    Niharika Konidela: బెడ్రూమ్ సీన్లలో రెచ్చిపోయి నటించిన నిహారిక.. వీడియో వైరల్
    మెగా డాటర్‌ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా, నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా ఆమె తనదైన ముద్ర ఇండస్ట్రీపై వేసింది. అటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి మంచి మార్కులు కొట్టేసింది. 2020 డిసెంబర్‌లో చైతన్య కృష్ణను వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గతేడాది జులైలో అతడితో విడిపోవడంతో తిరిగి ఈ అమ్మడి దృష్టి సినిమాలపై పడింది. ఇటీవలే ప్రొడ్యుసర్‌గా మారి 'కమిటీ కుర్రోళ్లు' అనే బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం తీసింది. అటు తమిళంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా సైతం నటిస్తోంది. అందులో నిహారిక చేసిన రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  రొమాంటిక్‌ సాంగ్‌లో.. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) అనే చిత్రంలో నిహారిక (Niharika Konidela) నటిస్తోంది. షాన్‌ నిగమ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారికతో పాటు ఐశ్వర్య దుత్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైనర్‌ రిలీజ్‌ చేయగా దానికి విశేష స్పందన వచ్చింది. తాజాగా షాన్‌ నిగమ్‌, నిహారిక మధ్య సాగే ఓ రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మణి రత్నం 'సఖి' సినిమాలో మాధవన్‌, షాలిని మధ్య వచ్చే 'నగిన నగిన' పాటను రీమిక్స్‌ చేసి దీన్ని విడుదల చేశారు. ఈ పాటలో నిహారిక తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఇందులో నిహారిక, షాన్‌ నిగమ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు, బోల్డ్‌ - రొమాంటిక్‌ డ్యాన్స్‌ ఉన్నాయి. నిహారిక ఈ స్థాయిలో రొమాన్స్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ తమిళ సాంగ్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు నిహారిక ప్రదర్శనను ప్రశంసిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.  https://twitter.com/SivareddE/status/1865713969794806123 నెటిజన్ల మండిపాటు 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) మూవీ సాంగ్‌ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి బోల్డ్‌ రొమాంటిక్‌ పాటల్లో నటించి మెగా ఫ్యామిలీ పరువు తీసిందని ఆరోపిస్తున్నారు. గ్లామర్‌ పాత్రలు చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చక్కగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావొచ్చు కదా అని సూచిస్తున్నారు. మూడు నిమిషాల సాంగ్‌లోనే ఈ స్థాయిలో గ్లామర్‌ షో చేస్తే ఇక సినిమాలో ఇంకెంత ఎక్స్‌పోజింగ్ ఉంటుందోనని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం నిహారికకు అండగా నిలుస్తున్నారు. దారుణంగా విమర్శించేంత ఎక్స్‌పోజింగ్‌ నిహారిక చేయలేదని మద్దతిస్తున్నారు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు పోషించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేస్తున్నారు.&nbsp;&nbsp; https://twitter.com/naprapanchamm/status/1865716593709244888 https://twitter.com/Manaki_Enduku_/status/1866059745263484992 గతంలో విజయ్ సేతుపతితో.. 'మద్రాస్‌ కారణ్‌' (Madras Kaaran) చిత్రానికి వాలి మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నిహారిక చేస్తోన్న ఫస్ట్‌ తమిళ చిత్రం కాదు. ఆమె గతంలో తమిళంలో ఓ చిత్రం చేసింది. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా చేసిన 'ఓరు నళ్లనాళ్‌ పాతు సోల్రెన్‌' చిత్రంలో నిహారిక నటించింది. 2018లో ఈ సినిమా విడుదలైంది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌గా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ చిత్రాలు చేసింది. ‘డార్లింగ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాల్లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం 'మద్రాస్‌ కారణ్‌'తో పాటు తెలుగులో ‘వాట్‌ ద ఫిష్‌’ చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే నిర్మాతగాను రాణించేందుకు ప్రయత్నిస్తోంది. 
    డిసెంబర్ 09 , 2024
    <strong>OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్‌.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!</strong>
    OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్‌.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
    పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్‌ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్‌ తిరిగి షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ను సైతం మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో పవన్‌ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.&nbsp; ముందే ‘ఓజీ’ రిలీజ్‌? పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ సుజీత్‌ మూవీని త్వరగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్‌ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ను త్వరగా ఫినిష్‌ చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను స్టార్ట్‌ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.  హరిహర వెనక్కి తగ్గాల్సిందే! పవన్‌ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా రానుంది. అయితే పవన్‌ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్‌ వచ్చినప్పటికీ క్రిష్‌ 60 శాతం షూటింగ్‌ ఫినిష్‌ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి క్రిష్‌ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్‌ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్‌ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్‌ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్‌ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉన్న దృష్ట్యా పవన్‌ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.&nbsp; ఓజీపై ఎందుకంత హైప్‌? పవన్‌ కల్యాణ్‌ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్‌ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్‌ యాక్టింగ్‌ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్‌ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.  https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385 ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సంగతేంటి? గబ్బర్‌ సింగ్ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత పవన్ కల్యాణ్‌ - హరీశ్‌ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్‌ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్‌ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్‌ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp;
    నవంబర్ 11 , 2024
    <strong>Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!</strong>
    Hari Hara Veera Mallu: సమ్మర్‌ బరిలో పవర్‌స్టార్‌.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్‌ దేవరకొండ!
    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్‌ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అయితే అదే రోజున విజయ్‌ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.&nbsp; సమ్మర్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో పవన్‌ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్‌ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్‌ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ఫస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం! పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్‌ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)&nbsp; కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఆ చిత్రాల్లోనూ కదలిక! హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ పవన్‌ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్‌ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్‌ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్‌ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్‌ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్‌ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్‌ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;&nbsp; పవన్‌ vs విజయ్‌ దేవరకొండ! హరి హర వీరమల్లు రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్‌ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్‌' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌ సందర్భంగా రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్‌ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.&nbsp;
    సెప్టెంబర్ 23 , 2024
    <strong>Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;</strong>
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.&nbsp; విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!&nbsp; ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.&nbsp; https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.&nbsp;
    జూలై 27 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌&nbsp; తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న&nbsp; థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..&nbsp; పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.&nbsp; (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.&nbsp; మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.&nbsp; యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి &amp; హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,&nbsp; మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన&nbsp; కృష్ణ (రాహుల్ విజయ్)ని&nbsp; ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.&nbsp; మూవీ ప్లాట్‌ ఏంటంటే.. &nbsp;కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.&nbsp; మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp; గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది.&nbsp;ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..&nbsp; గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.&nbsp; కథ ఏంటంటే..&nbsp; ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.&nbsp; ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.&nbsp; కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే.. &nbsp;రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌.&nbsp;
    జూన్ 06 , 2024
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!&nbsp;
    Day 1 Collections: ‘డే 1 కలెక్షన్స్‌’లో ఆ యంగ్‌ హీరోనే టాప్‌.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ఆ ఇద్దరికీ నిరాశే!&nbsp;
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండు మూడు ఆసక్తికర సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. కుర్ర హీరోలు విష్వక్‌ సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ చిత్రాలతో పోటీపడ్డారు. శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి? ఏ కుర్ర హీరో బాక్సాఫీస్‌ వద్ద పైచేయి సాధించాడు? ఈ కథనంలో చూద్దాం. [toc]&nbsp; గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి&nbsp; విశ్వ‌క్ సేన్ లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’.. శుక్రవారం విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 8.2 కోట్ల‌కు గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఫలితంగా విశ్వ‌క్ సేన్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒకటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ నిలిచింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌.. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. శ‌ని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద జోరు చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. విశ్వక్‌ వన్‌మ్యాన్‌ షో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో లంక‌ల ర‌త్న అనే యువ‌కుడిగా విశ్వ‌క్ సేన్ యాక్టింగ్‌, అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్ అభిమానుల‌ను ఫిదా చేసింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ అద‌ర‌గొట్టాడ‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. మరోవైపు హీరోయిన్‌ నెహా శెట్టితో అతడి కెమెస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.&nbsp; కథేంటి కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; గం.. గం.. గణేశా&nbsp; ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘గం గం గ‌ణేశా’ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ విష్వక్‌ మూవీతో పోలిస్తే కలెక్షన్ల పరంగా బాగా వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ&nbsp; మూవీ ఫ‌స్ట్ డే రూ.80-90 లక్షల వ‌ర‌కు గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.50 ల‌క్ష‌ల‌కుపైగా షేర్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొంటున్నాయి. ఈ మౌత్ టాక్ పబ్లిసిటీతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు బాగా పెరిగే అవకాశముందని అభిప్రాయ పడుతున్నాయి.&nbsp; కామెడీ ప్రధానం బలం క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ‘గం గం గణేశా’ చిత్రానికి ఉద‌య్ బొమ్మిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కామెడీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. గం గం గ‌ణేశా మూవీలో ప్ర‌గ‌తి శ్రీవాస్త‌వ‌, న‌య‌న్‌సారిక హీరోయిన్లుగా న‌టించారు. బేబీ స‌క్సెస్ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన మూవీ ఇది. ఇందులో ఆనంద్‌ దేవరకొండ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు. హాస్యనటులు ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిషోర్‌తో కలిసి నవ్వులు పూయించాడని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.&nbsp; భజే వాయు వేగం కార్తికేయ గుమ్మ‌కొండ హీరోగా న‌టించిన ‘భ‌జే వాయు వేగం’.. శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే మెుదటి రోజు ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. తొలి రోజు ఈ చిత్రం రూ.50 లక్షల లోపే గ్రాస్‌ రాబట్టినట్లు ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశముందని చెబుతున్నాయి.&nbsp; క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్‌, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.&nbsp; కథేంటి తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.&nbsp;
    జూన్ 01 , 2024
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు దర్శకత్వం: కృష్ణ చైతన్య సంగీతం: యువన్ శంకర్ సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ : 31-05-2024 విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్‌ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్‌ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్‌ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లలో మాస్‌ జాతరే అన్నట్లు విష్వక్‌ నటన ఉంటుంది. ఇక హీరోయిన్‌ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.&nbsp; ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది.&nbsp; మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె &nbsp; ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్‌ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ స్లోగా నడవడం, రొటీన్‌ సన్నివేశాలు, రెగ్యులర్‌ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్‌ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విష్వక్‌ సేన్‌ నటన డైలాగ్స్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రెగ్యులర్‌ స్టోరీ స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; Public Talk On Gangs of Godavari సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/raghav917252/status/1796382241532334575 చాలా రోజుల తర్వాత హౌస్‌ ఫుల్స్‌ చూస్తున్నట్లు మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్‌ అంటూ వ్యాఖ్యానించాడు.&nbsp; https://twitter.com/PulakithSai/status/1796399917969412273 ఫస్టాఫ్‌ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్‌ కొట్టదని స్పష్టం చేశాడు.&nbsp; https://twitter.com/PinkCancerian/status/1796336006402355622 పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్‌ వెర్షన్‌లా గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి ఉందని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు&nbsp; బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్‌ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
    మే 31 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు. రత్నం విశాల్‌ (Vishal) హీరోగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రం ‘రత్నం’ (Rathnam movie). ప్రియా భవానీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రుస్లాన్ ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా జంటగా కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’ (Ruslaan). జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు టిల్లు స్క్వేర్‌ టాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 26 నుంచి టిల్లు స్క్వేర్ ప్రసారం కానుంది.&nbsp; భీమా మ్యాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘భీమా’ (Bhimaa). మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా, ఈ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 25 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateFight for paradiseSeriesEnglishNetflixApril 23BrigantiSeriesEnglishNetflixApril 23Deliver meMovieEnglishNetflixApril 24City HunterMovieJapanese/EnglishNetflixApril 25Dead Boy DetectivesSeriesEnglishNetflixApril 25Tillu SquareMovieTeluguNetflixApril 26GoodBye EarthSeriesEnglish/KoreanNetflixApril 26Dil Dosti DilemmaMovieHindiAmazon PrimeApril 25BhimaaMovieTeluguDisney + HotstarApril 25CrackMovieHindiDisney + HotstarApril 26The ZenecksMovieEnglishJio CinemaApril 22We Are Hear S4SeriesEnglishJio CinemaApril 27Kung Fu Panda 4MovieEnglishBook My ShowApril 26
    ఏప్రిల్ 22 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.&nbsp; కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌&nbsp; హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి&nbsp; ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా&nbsp; మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.&nbsp; సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది.&nbsp;
    మార్చి 09 , 2024
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. &nbsp;దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.&nbsp; ఈరోజు&nbsp; #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20 ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్‌ తన అకౌంట్‌కు జత చేశారు.&nbsp; ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు. https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20 అందుకేనా ఇన్‌స్టా? ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.&nbsp; జులై&nbsp; 'బ్రో' నెల మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది.&nbsp; చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.&nbsp; పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించింది.&nbsp; పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్‌ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.&nbsp; క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.&nbsp; నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.&nbsp;
    జూలై 04 , 2023
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    MOVIE RELEASES: ఈ వారం ( ఏప్రిల్ 28 )న థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు
    వేసవి సెలవులు వచ్చాయి. ఈ వారం పెద్ద సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. మణిరత్నం, అక్కినేని అఖిల్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నారు. అంతేకాదు, బ్లాక్‌ బస్టర్ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి, ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే వాటి గురించి తెలుసుకుందాం.&nbsp; ఏజెంట్‌ అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా వస్తున్న ఏజెంట్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా… హిపాప్‌ తమిజా సంగీతం అందించాడు. ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రంపై అంచానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.&nbsp; https://telugu.yousay.tv/sentiment-followed-for-agent-akhil.html పొన్నియన్ సెల్వన్ 2 పొన్నియన్ సెల్వన్ మెుదటి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది PS-2. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా కూడా 28న రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఏజెంట్‌తో పోటీ పడుతోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా.. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. పార్ట్‌ 2 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.&nbsp; https://telugu.yousay.tv/box-office-do-you-know-how-much-ps2-will-make.html రారా.. పెనిమిటి నందితా శ్వేత సింగిల్ క్యారెక్టర్‌లో రూపొందిన సినిమా రారా.. పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28న విడుదలవుతుంది. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త కోసం ఎదురుచూసే విరహ వేదనే ఈ చిత్రం. తెరపై ఒక్క పాత్రే కనిపించినా.. చాలా పాత్రలు వినిపిస్తాయి.&nbsp; హాలీవుడ్‌ ‘శిసు’ హిస్టారికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న హాలీవుడ్‌ మూవీ శిసు. జల్మరీ హెలెండర్ దర్శకత్వం వహించాడు. జొర్మా తొమ్మిలా, అక్సెల్‌ హెన్ని, జూన్ డూలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా వస్తుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు దసరా నాని హీరోగా వచ్చిన మాస్ పీరియాడికల్ చిత్రం దసరా. మార్చి 30న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.&nbsp; సిటాడెల్ అమెరికన్ స్పై థ్రిల్లర్‌ సిటాడెల్ వెబ్ సిరీస్‌ తెలుగులో రాబోతుంది. రిచర్డ్‌ మ్యాడన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మెుదట తొలి రెండు ఎపిసోడ్‌లను తీసుకువస్తారు. తర్వాత మేలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదల చేస్తారు. ఈ సిరీస్‌ హిందీ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. https://telugu.yousay.tv/this-is-why-i-left-bollywood-says-india-priyanka-chopra.html వ్యవస్థ జీ 5 వేదికగా వెబ్‌ సిరీస్‌లు అలరిస్తున్నాయి. మరో కొత్త వెబ్ సిరీస్‌ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. న్యాయవ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు ఆనంద్‌ రంగ్ దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచెరపాలెం, నారప్పతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్‌, సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరికొన్ని Title CategoryLanguagePlatformRelease DateCourt lady&nbsp;Series&nbsp;Hindi&nbsp;NetflixApril 26Novoland&nbsp;Series&nbsp;English&nbsp;Nerflix&nbsp;April 26The good bad mother&nbsp;Series&nbsp;EnglishNetflixApril 27Eka&nbsp;Series&nbsp;English&nbsp;NetflixApril 28Before life after deathMovieEnglish&nbsp;Netflix&nbsp;April 28Pathu thala&nbsp;MovieTamil&nbsp;Amazon primeApril 27U turnMovieHindi&nbsp;Zee5April 27Scream 6MovieEnglish&nbsp;Book my showApril 26thurumukhamMovie&nbsp;Malayalam&nbsp;Sony liv&nbsp;April 28Save the tigersSeries&nbsp;Telugu&nbsp;disney+hotstarApril 27Peter pan and vendiSeries&nbsp;English&nbsp;disney+hotstarApril 28
    ఏప్రిల్ 24 , 2023
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Pratibha Ranta: ‘లాపతా లేడీస్‌’ బ్యూటీ ప్రతిభా రత్న గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?&nbsp;</strong>
    Pratibha Ranta: ‘లాపతా లేడీస్‌’ బ్యూటీ ప్రతిభా రత్న గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?&nbsp;
    2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్‌' అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. దీంతో ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రత్న పేరు ఒక్కసారిగా వైరల్‌ అవుతోంది.&nbsp; తొలి చిత్రంతోనే ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు రెడీ అవ్వడంతో ఈమె గురించి తెలుసుకునేందుకు సినీ లవర్స్‌ తెగ సెర్చ్‌ చేస్తున్నారు.&nbsp; తను నటించిన లాపతా లేడీస్‌ భారత్‌ తరపున ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపికవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రతిభా తెలిపింది.&nbsp; View this post on Instagram A post shared by Pratibha Ranta (@pratibha_ranta) ‘లాపతా లేడీస్‌’ సెలక్ట్‌ కావాలని తాను ఎంతగానో కోరుకున్నానని, ఫైనల్‌గా తమ ఆశలు నిజమయ్యాయని ప్రతిభా పేర్కొంది. ఇక 'లాపతా లేడీస్‌' చిత్రానికి బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావు దర్శకత్వం వహించారు.&nbsp;స్పర్శ్‌ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ప్రతిభా రత్న వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్‌ 17, 2000లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లాలో జన్మించింది.&nbsp; స్కూల్లో చదువుకునే రోజుల్లోనే రంగస్థలంలో నటించింది. నటనపై ఆసక్తితో సోదరితో కలిసి సిమ్లా నుంచి ముంబయికి వచ్చేసింది. అలా ముంబయిలో ఫిల్మ్‌ మేకింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నటనలో కావాల్సిన అన్ని మెళుకువులను నేర్చుకుంది. ఈ క్రమంలోనే నృత్యంలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పలు స్టేజీ షోలలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. 'కురబాన్‌ హువా' సీరియల్‌ ద్వారా 2020లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. నాలుగేళ్ల పాటు టెలివిజన్‌లో అలరించింది.&nbsp; 'లాపతా లేడీస్‌' చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో జయా సింగ్‌/పుష్ప రాణిగా కనిపించి ఆకట్టుకుంది.&nbsp; బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌లోనూ ఈ అమ్మడు నటించింది. షమా అనే పాత్రలో కనిపించింది.&nbsp; ఫిట్‌నెస్‌కు ప్రతిభ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఆసనాలు, స్టంట్‌లతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంది.&nbsp; ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ ప్రతిభా రత్న చురుగ్గా వ్యవహరిస్తోంది. తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.&nbsp; ప్రస్తుతం ప్రతిభా రత్న ‌అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన ప్రతీ ఫొటోను లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!</strong>
    Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్‌ రొమాన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘VS14’లో హీరోయిన్‌ ఫిక్స్‌! విష్వక్‌ సేన్‌ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి  ప్రియాంక అరుళ్‌ మోహనన్‌ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్‌ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించనున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో 'దివ్య శ్రీపాద' ఒకరు. రీసెంట్‌గా 'సుందరం మాస్టర్‌' (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు 'డియర్‌ కామ్రేడ్‌', 'కలర్ ఫొటో', 'మిస్ ఇండియా', 'జాతి రత్నాలు' వంటి హిట్&nbsp; చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం దివ్య శ్రీపాద అసలు పేరు? దివ్య దృష్టి దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది? 1996, సెప్టెంబర్ 5న జన్మించింది దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది? దివ్య శ్రీపాద హైదరాబాద్‌లో జన్మించింది. దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా? డియర్ కామ్రెడ్ (2019)&nbsp; దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్‌సిరీస్ హెడ్స్ అండ్ టేల్స్(2021) దివ్య శ్రీపాద ఎత్తు ఎంత? 5 అడుగుల 6గుళాలు&nbsp; దివ్య శ్రీపాద అభిరుచులు? కూకింగ్ దివ్య శ్రీపాద&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్?&nbsp; వైట్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ దివ్య శ్రీపాద ఏం చదివింది? MBA దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది. దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. https://www.youtube.com/watch?v=P1fCyBtJyC0 దివ్య శ్రీపాద ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/divyasripada/
    ఏప్రిల్ 29 , 2024
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి&nbsp; తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్? &nbsp;బ్లాక్ నవీన్ పొలిశెట్టి&nbsp; తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు? &nbsp;ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
    మార్చి 21 , 2024
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీనా మజాకా!
    ఈ వారం రిలీజ్‌ కాబోతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'ఓం భీమ్‌ బుష్‌' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్‌ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు.&nbsp; ‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్‌ వచ్చేశాయ్‌’ ‘ఓం భీమ్ బుష్‌’ ట్రైలర్‌ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్‌ యూవీ క్రియేషన్స్‌ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్‌ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్‌ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; సెన్సార్‌ పూర్తి 'ఓం భీమ్ బుష్‌' చిత్రం.. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్‌. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్‌ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.&nbsp; శ్రీవిష్ణు ఖాతా మరో హిట్‌? ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్‌ లెన్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓమ్‌ బీమ్‌ బుష్‌'. సెన్సార్‌ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్‌ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్‌ బుష్‌’ కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.&nbsp; https://twitter.com/i/status/1770390528661839896
    మార్చి 20 , 2024

    @2021 KTree