ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ప్రభాస్
రిషి/ రెబల్తమన్నా భాటియా
నందినిదీక్షా సేథ్
ఒక అనాథ రిషి ప్రేమలో పడతాడు కానీ సింహాద్రి మరియు జయరామ్ కొడుకుల చేతిలో చనిపోతాడుబ్రహ్మానందం
నరస రాజుఅలీ
కమల్ హాసన్ శివశంకర్ప్రభ
జయరామ్ అలియాస్ రాబర్ట్ చేతిలో భూపతి భార్య కూడా చంపబడుతుందిసుప్రీత్
రిషికి ప్రతీకారం తీర్చుకోవడంలో సహాయం చేసిన భూపతి అనుచరుడు స్టీఫెన్ మరియు రాబర్ట్ చేతిలో చంపబడతాడుతేజ్ సప్రు
స్టీఫెన్ మరియు రాబర్ట్ అసిస్టెంట్ మరియు నందిని తండ్రి బ్యాంకాక్‌లో పనిచేస్తున్నారువిక్రమ్ సింగ్
డేవిడ్భరత్ రెడ్డి
జయరామ్ కొడుకుఎంఎస్ నారాయణ
శాస్త్రిఅనంత్ బాబు
శాస్త్రిరవి నాయర్సంజయ్
జూనియర్ రేలంగిజూనియర్ శాస్త్రి
కెల్లీ డోర్జీ
APC-MI6శ్రీమాన్
అజయ్చలపతి రావు
పోలీస్ ఆఫీసర్విన్సెంట్ అశోకన్
వరదన్జీవా
శంకర్కోవై సరళ
నందిని అత్తహేమ
రిషి అత్తషానూర్ సనా
నందిని స్నేహితురాలురజిత
నందిని అత్తసిబ్బంది
రాఘవ లారెన్స్
దర్శకుడుJ. భగవాన్నిర్మాత
జె. పుల్లారావునిర్మాత
S. చిన్నాసంగీతకారుడు
రాఘవలారెన్స్సంగీతకారుడు
మార్తాండ్ కె. వెంకటేష్
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమలు’ తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మమితా బైజుకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్ చిత్రం విడుదలై పాజిటివ్ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్, మమితా బైజు జంటగా నటించిన తమిళ మూవీ ‘రెబెల్’ (Rebel).. మార్చి 22న థియేటర్లలో రిలీజైంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతోనే మమితా బైజు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime).. విడుదలయ్యి రెండు వారాలు కాకుండానే ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటి?
కథిరేసన్ ఓ మలయాళీ కుర్రాడు. ఉన్నత చదువుల కోసం మున్నార్ నుంచి పాలక్కాడ్ వస్తాడు. అక్కడ కొందరు తమిళ స్టూడెంట్స్‌తో జరిగిన గొడవ కథిరేసన్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. కాలేజీ గొడవగా మొదలైన ఈ ఇష్యూ.. రాజకీయ రంగును ఎలా పులుముకుంది? సారా అనే అమ్మాయితో అతడి ప్రేమ ట్రాక్ ఎలా మెుదలైంది? ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం అతడు ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది రెబెల్ మూవీ కథ.
https://twitter.com/i/status/1773963043392872495
సినిమా ఎలా ఉందంటే?
కేరళలోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు నికేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. కేరళలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా కథను నడిపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. తమిళం, మలయాళ స్టూడెంట్స్ మధ్య తరచూ జరిగే గొడవలను డైరెక్టర్ కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. జీవి ప్రకాశ్ అద్భుతంగా నటించాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు నటనకు స్కోప్ దక్కింది. సినిమాలోని బీజీఎమ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. సిద్ధూ కుమార్ మంచి సంగీతాన్ని ఈ చిత్రానికి అందించాడు. అరుణ్ రాధా కృష్ణన్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. అయితే దర్శకుడు నికేష్ తాను అనుకున్న పాయింట్‌ను ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లో భావోద్వేగాలను పండించే సన్నివేశాలకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని తీసుకురాలేదు. తమిళ్, మలయాళం విద్యార్థుల మధ్య గోడవలకు గల అసలైన కారణాన్ని బాగా చెప్పలేదు. ఈ చిత్రం అంతిమంగా మత రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి నచ్చుతుంది. ఎందుకంటే చాలా సన్నివేశాలు అనేక రాజకీయ కోణాలతో ముడిపడి ఉంటాయి.
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 06 , 2024
Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్? రాజాసాబ్ రిలీజ్ డౌటే!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న మూవీ కావడంతో ‘రాజాసాబ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తన కాలుకు గాయమైనట్లు ప్రభాస్ సోమవారం (డిసెంబర్ 16) స్వయంగా ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు ఏర్పడ్డాయి.
జర్మనీలో చికిత్స
హీరో ప్రభాస్ (Rebel Star Prabhas) చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్స అనంతరం కొంతకాలం పాటు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అయితే తొలుత ప్రభాస్ కాలు బెణికిందని మాత్రమే వార్తలు వచ్చాయి. ప్రభాస్ సైతం స్వల్పగాయమే అంటూ స్పెషల్ నోట్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే గాయం తీవ్రత పెద్దదిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.
https://twitter.com/TeluguChitraalu/status/1868623178979024900
రాజాసాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం వేగంగా షూటింగ్ కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కాలికి గాయం కావడం షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్రభాస్, కమెడియన్ సత్య మధ్య చాలా వరకూ సీన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ జనవరి చివరి వారంలో తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ సైతం పెండింగ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’ చెప్పిన టైమ్‌కు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గాయంపై ప్రభాస్ ఏమన్నారంటే?
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కాలికి గాయం కావడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నట్లు ప్రభాస్ ఓ పోస్టు రిలీజ్ చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నా’ అని ప్రభాస్ పేర్కొన్న పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.
https://twitter.com/NishitShawHere/status/1868554693749960915
నయన్ స్పెషల్ సాంగ్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం వీరితో పాటు నయనతార (Nayanthara) కూడా సినిమాలో యాడ్ అయినట్లు తెలుస్తోంది. నయన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు లేడీ సూపర్ స్టార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ - నయనతార కలిసి ‘యోగి’ (Yogi) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత వారిద్దరు సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు.
డిసెంబర్ 17 , 2024
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్‌లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
నవంబర్ 05 , 2024
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
15 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927
ఏకైకా సౌత్ హీరోగా ప్రభాస్
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్, పఠాన్ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.
త్వరలో టాప్-3లోకి ‘కల్కి’
తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, జవాన్ సినిమాలకు షాక్ తప్పేలా లేదు.
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది.
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 13 , 2024
Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 11 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్ చిత్రం దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో 'కల్కి' మేనియా కొనసాగుతోంది. అక్కడి ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి.
11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 11 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సత్తా ఏంటో మరోమారు నిరూపితమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/VyjayanthiFilms/status/1810220707357565060
నార్త్ అమెరికాలో రికార్డు
కల్కి సినిమాకు నార్త్ అమెరికాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అక్కడి సినీ లవర్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మెుదటి 9 రోజుల్లోనే ఈ చిత్రం 14.82 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.123.76 కోట్లకు సమానమని పేర్కొన్నాయి. ఈ వీకెండ్‌కు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగినట్లు చెబుతున్నారు.
https://twitter.com/PrathyangiraUS/status/1809472342265065863
రూ.1000 కోట్లకు అడుగు దూరంలో!
‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇంకో రూ.100 కోట్లు సాధిస్తే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. తద్వారా రిలీజ్‌కు ముందు పెట్టుకున్న టార్గెట్‌ను అందుకుంటుంది. బుధవారం నాటికి రూ.1000 కోట్ల మార్క్‌ను కల్కి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకూ ఏ కొత్త సినిమా లేకపోవడం కల్కికి కలిసిరానుంది. కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
https://twitter.com/i/status/1808841062838063340
డే1 కలెక్షన్స్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘లెట్స్ సెలబ్రేట్ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/Kalki2898AD/status/1806617136690839769
ఫస్ట్ వీకెండ్ ఎంత వచ్చిందంటే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్ వీక్ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
జూలై 08 , 2024
Vijay Deverakonda: ‘కల్కి’ రెండో ట్రైలర్‌లో విజయ్ దేవరకొండను గమనించారా? రాజమౌళి పాత్ర అదేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. సినిమా విడుదల (జూన్ 27)కు మరో నాలుగు రోజుల సమయమే ఉన్నందున శుక్రవారం.. రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తొలి ట్రైలర్‌లా ఈ వీడియోలో కూడా హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్స్ సీన్స్‌తో నింపేశారు. అయితే ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేపారు. ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ సైతం ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ పాత్రలో విజయ్ దేవరకొండ!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో పలువురు స్టార్ క్యాస్ట్ నటించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించినట్లు గత కొంతకాలంగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో విజయ్ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ ట్రైలర్‌లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్‌ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. మహాభారతం సీక్వెన్స్‌లో విజయ్ అర్జునుడిగా కనిపించడం ఖాయమని అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.
https://twitter.com/i/status/1804410479642841242
ట్రైలర్‌లో మరో నటి రివీల్
కల్కి సెకండ్ ట్రైలర్‌లో ఓ హీరోయిన్‌ను చూపించి దర్శకుడు నాగ్ అశ్విన్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆ నటి మరెవరో కాదు.. మాళవిక నాయర్ (Malvika Nair). గతంలో వైజయంతీ నెట్‌వర్క్ బ్యానర్‌లలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లోను ఆమె కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ఆమె నటించడం విశేషం. వైజయంతి బ్యానర్‌లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’లోనూ మాళవిక సందడి చేసింది. ట్రైలర్‌లోని ఆమె లుక్‌ను కొందరు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ఆమె పాత్రలో పోషించిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
రాజమౌళి పాత్ర అదేనా?
కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆర్‌జీవీ పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా మారడం గమనార్హం.
సెకండ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
కల్కి సెకండ్ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్ సీన్స్‌తో నింపేసారు. లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.'ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనుషులు మారరు, మారలేరు' అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మధ్య కూడా ఫైట్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక హీరోయిన్ దీపికా పదుకొణె, శోభనను కూడా కాసేపు చూపించారు. ఆఖర్లో ప్రభాస్ డైలాగ్ కూడా బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి ట్రైలర్ భారీ యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా ఉంది. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 16 గంటల్లో 7.9 మిలియన్ వ్యూస్ సాధించింది.
https://www.youtube.com/watch?v=-rTzyZZGJ84
జూన్ 22 , 2024
Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
అశ్వత్థామ ఎవరంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్ లుక్స్ అచ్చం అలాగే ఉండటం గమనార్హం.
గ్లింప్స్‌లో ఏముంది?
కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది.
https://twitter.com/i/status/1782338404421927223
రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్!
అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్ అశ్విన్ కూడా అమితాబ్ బచ్చన్ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్ ‘భైరవ’ టీజర్ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.
నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!
‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్’లోనే విడుదల తేదీని రివీల్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఏప్రిల్ 22 , 2024
Kalki 2898 AD: శివరాత్రి స్పెషల్.. సాలిడ్ అప్‌డేట్‌తో ముందుకొస్తున్న ‘కల్కీ’ టీమ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). మైథాలజీ ఇన్‌స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అంచనాలు మరింత హైప్‌లోకి వెళ్లాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండనుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే నేడు శివరాత్రి సందర్భంగా మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌కి రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించి పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.
పోస్టర్‌లో ఏముంది?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్‌లో ప్రభాస్ పాత్ర పేరును మూవీ టీమ్ ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే ఇవాళ శివరాత్రి సందర్భంగా హీరో పేరును ప్రకటించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కల్కిలో ప్రభాస్ పేరు ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఇప్పటికే ఆలోచనల్లో పడిపోయారు.
https://twitter.com/chitrambhalareI/status/1766015501350883362
ఇటలీలో ప్రభాస్, దిశా పటానీ..
తాజాగా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోను మేకర్స్ గురువారం షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటని చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ (Prabhas), దిశా పటానీ (Disha Patani) మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో దిశా పటానీతో పాటు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆ రోజు రావడం పక్కా!
ప్రభాస్ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తూ ఆ కన్ఫ్యూజన్‌ను దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే!
‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి టీమ్ రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍లో కూడా క్రేజ్ ఉంది.
మార్చి 08 , 2024
Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ!
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.
రాజమౌళిపై సైతం
దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్, రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్!
ప్రభాస్, గోపిచంద్ మధ్య మంచి ప్రెండ్‌షిప్ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్ సందర్భంగా గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
ప్రభాస్ బర్త్‌డే కానుక
ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్ చేసి రిలీజ్ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్’ అంటూ వదిలిన ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
https://www.youtube.com/watch?v=gTA9ghC4ehs
అక్టోబర్ 15 , 2024
Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ హీరోనే.. అతడి హెల్పింగ్ నేచర్‌కు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్ పేరు మరోమారు మార్మోగుతోంది.
రూ. 2 కోట్లు విరాళం
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్ టీమ్ ప్రకటించింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్ రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు.
అండగా సెలబ్రిటీలు!
ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.
గతంలోనూ ఇలాగే..
కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/i/status/1821114197213626764
డైరెక్టర్స్‌కు భారీ విరాళం
ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రభాస్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఆగస్టు 07 , 2024
Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
దేశం మెచ్చిన నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
డైరెక్టర్స్‌కు భారీ విరాళం
లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్ చేయాలంటూ ప్రభాస్ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫుల్ స్వింగ్‌లో ప్రభాస్!
ప్రస్తుతం దేశంలో ఏ స్టార్ హీరో చేతిలో లేనన్ని పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్ సీక్వెల్’ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
ఏప్రిల్ 23 , 2024
Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్ చాలు’ వీడియో వైరల్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అటువంటి టాప్ హీరోలు ఒక సినిమాను ప్రమోట్ చేస్తే ఇంకెంత అటెన్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ సైతం ఏపీ ఉపముఖ్యమంత్రి తన మూవీ షూటింగ్స్‌లోనే పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘డ్రింకర్ సాయి’ సినిమా యూనిట్ వారిచేత సరికొత్త ప్రమోషన్స్‌కు తెర లేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కటౌట్‌తో ప్రమోషన్స్
ధర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కల్యాణ్, ప్రభాస్ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. వారి సమక్షంలో తన సినిమా ఈవెంట్ జరగాలన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. హీరో ధర్మ.. ప్రభాస్‌కు అభిమాని కావడంతో డార్లింగ్ పోస్టర్‌ను సైతం వేదికపై పెట్టారు. ఇది చూసి ఈవెంట్‌కు వచ్చిన వారంతా చప్పట్లో వారిని అభినందించారు.
https://twitter.com/tollymasti/status/1866099251031450077
పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా?
ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్ వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రింకర్ సాయి టీమ్ కూడా స్టేజీపై పవన్, ప్రభాస్ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రభాస్, పవన్‌పై అభిమానంతోనే డైరెక్టర్, హీరో తమ హీరోల పోస్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయా హీరోల అభిమానులను తమ సినిమా చూసేలా ప్రేరేపించడం కోసమే వారు ఈ విధంగా చేసి ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ‘డ్రింకర్ సాయి’ టీమ్ ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు.
https://twitter.com/shreyasmedia/status/1866107400769433812
ఆ సినిమాలు కూడా అంతే..
ఇటీవల విడులైన 'మట్కా' (Matka) సినిమా కోసం హీరో వరుణ్ తేజ్ (Varun Tej) వినూత్నంగా ప్రమోషన్స్ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు. తన గత చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని చేసిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) బామ్మర్ది సుధీర్ బాబు (Sudheer Babu) కూడా తన రీసెంట్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) సినిమాకు సరికొత్తగా ప్రమోషన్స్ చేశాడు. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ ప్రమోషన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి.
https://twitter.com/SkyPspk/status/1856617018276839798
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/isudheerbabu/status/1842084097621164229
డిసెంబర్ 10 , 2024
The Raja Saab: ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఏమిటంటే?
వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్‌కు మరో సర్‌ఫ్రైజ్ ట్రీట్ ఇచ్చారు. ఆయన నెక్స్ట్ చిత్రం రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డెట్‌ను ఈరోజు సాయంత్రం 5.03 గంటలకు చిత్ర బృందం రివీల్ చేసింది.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
కలర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బైక్‌పై వచ్చిన ప్రభాస్ లుక్ అదిరిపోయింది. డార్లింగ్ గెటప్‌లో ప్రభాస్ హ్యండ్సమ్‌గా కనిపించారు. ప్లవర్ బొకేతో బైక్ దిగి మెస్మరైజ్ చేశాడు. బొకేలోని ప్లవర్స్ తెంపి ఓ కారు అద్దంలో తన అందం చూసుకుంటూ దిష్టి తీసుకోవడం అదిరిపోయింది.
https://www.youtube.com/watch?v=YFZMBqyXkqQ
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన కంటెంట్‌పై ఫోకస్ పెడుతూ చక్కని విజయాలు అందుకుంటున్నారు. సలార్, కల్కి2898ఏడి విజయాలతో ఇండియాలో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. కల్కి చిత్రం రూ. 1100 కోట్లు క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.
రొమాంటిక్ హరర్ జనర్‌లో..
కల్కి సక్సెస్ నుంచి బయటకు వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. కల్కి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న స్పిరిట్‌లో నటించాల్సి ఉండగా.. ప్రభాస్ చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వరుసగా మాస్ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్, కాస్త వాటికి విరామం ఇచ్చి రొమాంటిక్ జనర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కల్కి తర్వాత రాజా సాబ్ చిత్రాన్నే తొలుత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం రొమాంటిక్ హరర్ జనర్‌లో తెరకెక్కుతోంది.
సాయంత్రం 5 గంటలకు సర్‌ప్రైజ్
ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రాజా సాబ్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను సోమవారం (జులై 29 ) సాయంత్రం 5:03 గంటలకి రిలీజ్ చేసి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. గ్లింప్స్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హ్యాండ్సమ్ లుక్ బాగుందని పోస్ట్ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆ హిందీ సాంగ్ రీమిక్స్
'రాజా సాబ్' (Raja Saab) చిత్రంలో ఒకప్పటి సూపర్ హిట్ హిందీ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని డైరెక్టర్ మారుతీ భావిస్తున్నారట. ఈ విషయమై మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ 'ఓ కైకే పాన్ బనారస్ వాలా' పాటను రీమేక్ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
1940 బ్యాక్‌డ్రాప్‌లో..
మరోవైపు ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్‌పై సైన్ చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు ఉన్నాయి.‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్ 'ఫౌజి'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రం షూటింగ్ పనులను అక్టోబర్‌లో మొదలు పెట్టేందుకు డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.
ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించే అవకాశం ఉన్నట్టు టాక్. ఇక ఫౌజీ అంటే జవాన్ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జూలై 29 , 2024
Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా?
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్ రెడ్డి ‘యానిమల్’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘అమ్మను ఎదిరించాను’
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) రంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల్లో తల్లి రోల్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడో వివరించాడు. తన అమ్మతో తాను చాలా చనువుగా ఉంటానని సందీప్ తెలిపారు. ఆమె తనను బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తన మదర్ చాలా సహకరించిందని, యాక్టింగ్ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ వరకు ఎన్నో విషయాల్లో ఆమె సపోర్ట్ ఉందని చెప్పారు. అమ్మతో ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆమెను ఎదిరించిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పించారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తల్లి- కుమారుడు సెంటిమెంట్‌తో సినిమా తీస్తే అది పాజిటివ్‌గా ఉంటుందని, అందులో హింసకు చోటుండదని చెప్పుకొచ్చాడు.
తండ్రి-కొడుకుల బాండింగ్ సూపర్బ్
సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ‘యానిమల్’(Animal) చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో వైలెన్స్‌తో పాటు తండ్రీ, తనయుల మధ్య అనుబంధాన్ని సందీప్ చక్కగా చూపించాడు. యాక్షన్ & ఎమోషన్ డ్రామా ఫిల్మ్‌గా కళ్లకు కట్టాడు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తండ్రి పాత్రలో యాక్ట్ చేయగా రణ్‌బీర్ కపూర్ తనయుడిగా చేశాడు. బాబీదేవోల్ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానున్న విషయం తెలిసిందే.
మూడు విభిన్న లుక్స్‌తో..
యానిమల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో సందీప్ (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్ రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. పోలీసు లుక్‌తో పాటు మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్ అలరించే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్ ఎండింగ్‌లోపు సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో..
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది.
డిసెంబర్ 07 , 2024
OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్? సాహోతో కనెక్షన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ఓజీ (OG Movie) చిత్రాలను ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. హరి హర వీరమల్లు షూటింగ్ ఈ వీకెండ్‌తో పూర్తవుతుందన్న వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్ సుజీత్ సైతం ‘ఓజీ’ శరవేగంగా ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ లేని సన్నివేశాలను చకా చకా షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఓజీ’ సంబంధించి దిమ్మతిరిగే బజ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పవచ్చు.
‘ఓజీ’లో ప్రభాస్..?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సంబంధించి కళ్లు చెదిరే క్యామియో ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని కూడా ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే 'ఓజీ'పై ఉన్న అంచనాలు తారా స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రభాస్, పవన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండగా ఉంటుందని చెప్పవచ్చు.
https://twitter.com/TBO_Updates/status/1862813629441011860
‘సాహో’తో కనెక్షన్ ఉందా?
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ చేసిన సాహో (Saaho) చిత్రానికి కూడా యంగ్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహించారు. అందులో ప్రభాస్‌ను చూపించిన విధానం, మేకింగ్స్ స్కిల్స్ ఆడియన్స్‌ను చాలా ఇంప్రెస్ చేశాయి. అయితే ప్రభాస్ ‘ఓజీ’తో ‘సాహో’కి కనెక్షన్ ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సాహో’లోని ప్రభాస్ పాత్ర ‘ఓజీ’లో కనిపించొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా, ఆ సినిమాలో ప్రభాస్ సైతం గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఫస్టాఫ్ మెుత్తం పోలీసు ఆఫీసర్‌గా కనిపించి తోటి అధికారులను బురిడి కొట్టిస్తాడు. సెకండాఫ్‌లో అతడి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను దర్శకుడు సూజీత్ చూపించాడు. ఓజీలోనూ పవన్ గ్యాంగ్‌స్టర్ గానే చేస్తుండటంతో ఆ పరంగా ‘సాహో’తో ఏమైనా లింక్ ఉండే అవకాశముందని నెటిజన్లు భావిస్తున్నారు.
https://twitter.com/GetsCinema/status/1862830321810493680
బ్యాంకాక్‌లో కలుస్తారా?
‘ఓజీ’ (OG) షూటింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ బయట కొచ్చింది. బ్యాంకాంక్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్‌తో పవన్ (Pawan Kalyan) షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ వచ్చేవారంలో బ్యాంకాంక్ వెళ్లి ఓజీ షూట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుత అప్‌డేట్స్ ప్రకారం హీరో ప్రభాస్ సైతం బ్యాంకాక్ షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. అదే జరిగితే ప్రభాస్, పవన్‌లను భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో చూసే అవకాశం దక్కుతుంది. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అకీరానందన్ సైతం!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వచ్చింది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారట. అతడి ఎంట్రీ నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు.
నవంబర్ 30 , 2024
Sandeep Reddy Vanga: తన లుక్‌తో హీరో మేకోవర్‌ను డిసైడ్ చేస్తున్న సందీప్ రెడ్డి.. ఇదేందయ్యా ఇది నేనెక్కడా చూడలా!
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఒక సినిమాను ఇలా ఉంటూనే ఆడియన్స్ చూస్తారు? అనే అభిప్రాయం నుంచి కొత్తగా తీస్తే కచ్చితంగా ఆదరిస్తారని నిరూపించాడు. సంచనాల దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్ వర్మను సైతం తన మేకింగ్ స్కిల్స్‌తో సర్‌ప్రైజ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇదంతా ఆన్ స్క్రీన్‌పైన ప్రతీ ఒక్కరు గమనించినవే. కానీ ఆఫ్ స్క్రీన్‌లోనూ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కు ఓ ప్రత్యేకత ఉంది. చాలా నిశితంగా పరిశీలిస్తే తప్పా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అదేంటో ఈ కథనంలో చూద్దాం.
హీరోలకు తగ్గట్లు మేకోవర్
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఇప్పటివరకూ మూడు చిత్రాలు తీశాడు. తన ఫస్ట్ తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసి సందీప్ సక్సెస్ అయ్యాడు. గతేడాది ‘యానిమల్’ (Animal)తో వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించాడు. ఇదిలా ఉంటే సందీప్ తన సినిమాల షూటింగ్ సమయంలో విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుంటారు. తమ సినిమాల్లో హీరోలు ఏ మేకోవర్‌లో అయితే ఉంటారో సరిగ్గా అదే స్టైల్‌లోకి తన లుక్‌ను మార్చుకుంటాడు. ఇది చాలా మంది గమనించకపోవచ్చు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు వస్తే అందులో విజయ్ దేవరకొండ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించాడు. సందీప్ కూడా షూటింగ్ సమయంలో సరిగ్గా అదే లుక్‌ను మెయిన్‌టెన్ చేశాడు. ‘యానిమల్’ మూవీలోనూ రణ్‌బీర్ సింగ్ పాత్రకు తగ్గట్లు హెయిర్ చాలా పొడుగ్గా పెంచి, రణ్‌బీర్ స్టైల్‌లో గడ్డం పెంచాడు. మూవీ ప్రమోషన్స్‌కు సైతం అదే లుక్‌లో హాజరయ్యారు.
https://www.reddit.com/r/tollywood/comments/1gwzj5e/vanga/#lightbox
స్పిరిట్ లుక్‌లోకి సందీప్!
‘యానిమల్’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ‘స్పిరిట్’ (Spirit) అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆల్‌మోస్ట్ కాన్ఫర్మ్ అయ్యింది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా కొత్త లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పటివరకూ చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ ఇదే కావొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. రీసెంట్‌గా సందీప్‌తో దిగిన ఫొటోలను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇందులో సందీప్ గడ్డం లేకుండా కనిపించాడు. షార్ప్ మీసాలు, పిల్లి గడ్డంతో స్మార్ట్‌గా దర్శనమిచ్చాడు. దీంతో ‘స్పిరిట్’ ప్రభాస్ కూడా ఇదే మేకోవర్‌లో కనిపించే ఛాన్స్ ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి జరుగుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.
https://twitter.com/PrasanthVarma/status/1858346779604906308
మూడు విభిన్న లుక్స్‌లో ప్రభాస్!
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్ లుక్ అనుగుణంగా పోలీసు పాత్రకు ప్రభాస్ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది కాకుండా మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్ అలరించే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్‌లో సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
యూరప్‌లో ప్రభాస్ రొమాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం 'ది రాజాసాబ్' (The Raja Saab) చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి (Director Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (S.S. Thaman) సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మెుత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో రెండు సాంగ్స్ విదేశాల్లో షూట్ చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్, హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) కాంబోలో ఈ రెండు డ్యూయెట్ పాటలు ఉంటాయని సమాచారం. ఈ సాంగ్స్ షూట్ కోసం వారు త్వరలోనే యూరప్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో మూవీ టీమ్ ఉన్నట్లు సమాచారం.
నవంబర్ 22 , 2024
Rana Daggubati: బాహుబలి కలెక్షన్లు అంతా ఉత్తిదేనా? రానా ఎందుకు అలా అన్నాడు?
ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కలెక్షన్స్ బట్టి కాకుండా ఎన్ని రోజులు ఆడింది అన్నదానిని కొలమానంగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కలెక్షన్స్‌ను బట్టి ఆ సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ సైతం ఏ రోజుకారోజు వసూళ్లను ప్రకటిస్తూ ఆడియన్స్‌లో హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మేకర్స్ అనౌన్స్ చేసే కలెక్షన్స్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుందన్న కామెంట్స్ ఇండస్ట్రీలో తరుచూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) మూవీ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కలెక్షన్స్‌పై రానా ఏమన్నారంటే?
దగ్గుబాటి రానా (Rana Daggubati)కు నటుడిగా టాలీవుడ్ (Tollywood)లో మంచి పేరుంది. ‘బాహుబలి’ (Baahubali) ‘బాహుబలి 2 (Baahubali 2)’ తర్వాత అతడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. రీసెంట్‌గా రజనీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాలోనూ రానా ప్రతీనాయకుడిగా కనిపించి తన మార్క్ చూపించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా మూవీ కలెక్షన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాక్సాఫీస్ నంబర్లు అనేది ఒక కామెడీ విషయం. చాలా మందికి తెలుసో లేదో పోస్టర్స్‌లో నెంబర్స్ అనేది టైం పాస్‌కి వేస్తారు. అవి రియల్ నెంబర్స్ కాదు. జస్ట్ మార్కెటింగ్ కోసం వేస్తారు. వచ్చే గ్రాస్‌కి ఫైనల్‌గా వచ్చే డబ్బులకు సంబంధం ఉండదు’ అని అన్నాడు. దీంతో రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మా హీరోల చిత్రాలకు వచ్చిన కోట్ల కలెక్షన్స్ నిజం కాదా? అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1858578978132685054
ఈసారి బూతులు తగ్గించి..
బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో రానా (Rana Daggubati) చేసిన తొలి వెబ్‌సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన వెంకటేష్ ఈ సిరీస్‌లో బూతులు మాట్లాడటాన్ని ఆడియన్స్ తీసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా సిరీస్ లేదని అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు పార్ట్ 2 త్వరలోనే రానున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సీజన్ 2పై రానా మాట్లాడారు. సెకండ్ సిరీస్ షూటింగ్ పూర్తైనట్లు చెప్పారు. తొలి సీజన్‌తో పోలిస్తే ఈసారి కంటెంట్, భాష మెరుగ్గా ఉంటుందని రానా హామీ ఇచ్చాడు. అయితే తొలి సిరీస్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దని ముందే సూచించామని రానా గుర్తుచేశారు. కానీ ఎవరు వినలేదని అందుకే ఆ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయని అభిప్రాయపడ్డారు.
అమెజాన్‌లో రానా టాక్ షో
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన ఈ టాక్ షో మంచి బజ్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ కూడా దగ్గుబాటి రానా హోస్ట్‌గా ఓ టాక్ షోను ప్లాన్ చేసింది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకు రామ్‌గోపాల్ వర్మ, నాని, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, శ్రీలీల గెస్టులుగా రానున్నట్లు సమాచారం. తొలి సీజన్‌లో 8 ఎపిసోడ్స్ ఉంటాయని తాజా ఇంటర్వ్యూలో రానా (Rana Daggubati) చెప్పాడు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభాస్, బాలకృష్ణలను ఈ టాక్ షోకు ఆహ్వానించాలని ఉందని రానా తెలిపారు. దీనిపై వారితో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. దీంతో రెబల్, నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 19 , 2024
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!
టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లి టాపిక్ చాలా సార్లు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్ హీరోయిన్స్ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే?
ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్ తర్వాత యావత్ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది.
మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్
ప్రభాస్ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.
‘ఫౌజీ’ షూట్‌లో ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ తాజాగా ఈ మూవీ షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్ మలయాల భామ నమిత ప్రమోద్ కూడా సెకండ్ ఫీమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది.
పీరియాడికల్ లవ్ స్టోరీ!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రజాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ కథను రాసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియడ్‌లో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియన్ పారా మిలిటరీకి చెందిన సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొని తన లుక్స్‌తో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది.
అక్టోబర్ 26 , 2024
HBD Prabhas: ప్రభాస్ ‘డార్లింగ్’ పిలుపు వెనక ఇంత కథ ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన నటన, మంచితనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నటుడిగా గుర్తింపు సంపాదించాడు. సినిమా హీరోగా ప్రభాస్ సృష్టించిన రికార్డులు ఏ కథానాయకుడికి సాధ్యంకాదని చెప్పవచ్చు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడి వ్యక్తిగత, ఫిల్మ్ కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం.
చదువులో యావరేజ్
ప్రభాస్ చదువు పరంగా యావరేజ్ స్టూడెంట్. తరగతిలో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవాడు కాదట. డ్రిల్ పిరియడ్ కోసం తెగ ఎదురుచూసేవాడట. క్లాస్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆటలు ఆడేవాడు.
మతిమరుపు ఎక్కువ
ప్రభాస్‌కు కాస్త మతిమరుపు ఉంది. అందుకే స్కూల్ డేస్ నుంచి తన ఫ్రెండ్స్ గజినీలా చూసేవారని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తెలిపాడు. పరీక్షలకు పెన్ను మర్చిపోయి హాజరయ్యేవాడినని చెప్పుకొచ్చాడు. పుస్తకం ఒక చోట పెట్టి మరో దగ్గర వెతికేవాడినని తెలిపాడు. చిన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగైనట్లు స్పష్టం చేశాడు.
‘నువ్వు హీరో ఏంట్రా’
కెరీర్ ప్రారంభంలో సినిమా హీరో అవుతా అని ప్రభాస్ తన స్నేహిడితో చెప్పాడట. అప్పుడు అతడు పెద్దగా నవ్వి 'నువ్వు హీరో ఏంట్రా బాబూ' అని సమాధానం ఇచ్చాడట. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు తొలుత షాకై తర్వాత వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణకు పంపించారు. మూడు నెలల ట్రైనింగ్ తీసుకున్నాక 'ఈశ్వర్' ఆఫర్ వచ్చింది.
డార్లింగ్ పిలుపుకు కారణం ఇదే
ప్రభాస్ నోట తరుచూ డార్లింగ్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. స్నేహితులను, బాగా దగ్గరైన వారిని డార్లింగ్ అంటూ అతడు సంబోధిస్తుంటాడు. డార్లింగ్ అని పిలవడానికి గల కారణాన్ని ప్రభాస్ ఓ సందర్భంలో తెలియజేశాడు. ఎవరినైనా బ్రదర్, అన్నా అని పిలవాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన దర్శకుడు పూరి జగన్నాథ్ 'బుజ్జిగాడు' సినిమాతో ఈ పదాన్ని మరింత పాపులర్ చేశాడు. అదే పేరుతో డార్లింగ్ సినిమా కూడా రావడం గమనార్హం.
అతిథి పాత్రలు
రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో వచ్చిన 'యాక్షన్ జాక్సన్' (2014) సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపించాడు. అజయ్ దేవ్‌గన్ హీరోగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వచ్చే ‘పంజాబీ మస్త్’ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
పెదనాన్నతో రెండు చిత్రాలు
దివంగత నటుడు కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్‌కు పెద్దనాన్న అవుతారు. కృష్ణం రాజు నట వారసుడిగానే ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. పెదనాన్న అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రాణం. ఆయనతో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ఆ రెండు చిత్రాలు ఎన్నో మధురానుభూతులను అందించాయని ప్రభాస్ చెబుతుంటాడు.
ముచ్చటగా మూడుసార్లు
ప్రభాస్ తన కెరీర్‌లో ఇద్దరు హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశాడు. త్రిష (Trisha), అనుష్క (Anushka) లతో కలిసి మూడేసి చిత్రాల చొప్పున స్క్రీన్ పంచుకున్నాడు. త్రిషతో ‘బుజ్జిగాడు’, ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు చేశాడు. అనుష్కతో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’లో నటించాడు.
తొలి దక్షిణాది హీరో
ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో (బాహుబలి గెటప్పు) మైనపు విగ్రహం కలిగిన తొలి దక్షిణాది హీరోగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, రీసెంట్‌గా రామ్‌చరణ్ ఈ ఘనత సాధించారు.
నటుడు కాకుంటే..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ప్రభాస్ ఓ సందదర్భంలో తెలియజేశాడు. ఒకవేళ తాను నటుడి కాకపోయుంటే హోటల్ రంగంలో స్థిరపడేవాడినని చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 23 , 2024
The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్’ సినిమా నుంచి ఓ రొమాంటిక్ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్ అప్‌డేట్ అదుర్స్
ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్ ట్రీట్ (టీజర్/ట్రైలర్ రిలీజ్) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రిలీజ్ కానుంది.
రాజా సాబ్ ఫొటో లీక్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రిలీజ్ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్‌గా చూపిస్తుండటంతో ఈ హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ లాంగ్ హెయిర్‌తో ఫుల్ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్ రిద్ది కుమార్ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్ సందర్భంగా మానిటర్ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది.
https://twitter.com/Baahubali230/status/1848209164553814057
రీ-రిలీజ్‌ల సందడి
మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్ చేసి స్పెషల్ షోస్ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’, ‘రెబల్’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు.
భారీ ధరకు మ్యూజిక్ రైట్స్
రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్ రాజాసాబ్ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
అక్టోబర్ 21 , 2024