• TFIDB EN
 • రెడ్ (2021)
  U/ATelugu2h 26m

  సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. ఈ క్రమంలో ఆకాశ్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆకాశ్‌ను హత్య చేసింది ఎవరు? అనేది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  రామ్ పోతినేనిసిద్ధార్థ్ మరియు ఆదిత్య
  మాళవిక శర్మసిద్ధార్థ్ ప్రేమికుడు
  అమృత అయ్యర్ఆదిత్య ప్రేమికుడు
  సంపత్ రాజ్సీఐ నాగేంద్ర
  వెన్నెల కిషోర్యామిని ఏకపక్ష ప్రేమికుడు
  నాసర్జస్టిస్ కృష్ణమూర్తి
  పోసాని కృష్ణ మురళిఅడ్వ. పార్థసారథి
  సత్య అక్కలఆదిత్య స్నేహితుడు
  సోనియా అగర్వాల్సిద్ధార్థ్ మరియు ఆదిత్య తల్లి
  రవి ప్రకాష్సిద్ధార్థ్ ఆదిత్య తండ్రి
  పవిత్ర లోకేష్కాన్-ఆర్టిస్ట్ మరియు ఆదిత్య భాగస్వామి
  సూర్య శ్రీనివాస్ సిద్ధార్థ్ స్నేహితుడు
  హెబ్బా పటేల్ఐటెమ్ నంబర్
  సిబ్బంది
  స్రవంతి రవి కిషోర్నిర్మాత
  మణి శర్మసంగీతకారుడు
  సమీర్ రెడ్డిసినిమాటోగ్రాఫర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
  Sriya Reddy: సలార్ ముద్దుగుమ్మ శ్రియా రెడ్డి అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
  శ్రియా రెడ్డి అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  సలార్‌లో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ నటనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రియారెడ్డి గతంలో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు... కానీ ఈమె మరెవరో కాదు హీరో విశాల్‌కు స్వయాన వదిన.  హీరో విశాల్ సోదరుడు విక్రమ్‌ను పెళ్లి చేసుకున్న ఈ సుందరాంగి.. సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది. లేటు వయసులోనూ తన ఒద్దికైన ఫిజిక్‌తో పెద్దసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. సలార్ సినిమాలో శ్రియా రెడ్డి.. పృథ్విరాజ్ సవతి తల్లి కూతురిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందానికి కుర్రకారు దాసోహమంటున్నారు. 40ఏళ్ల వయసులోనూ ఈ ఘాటు అందాలు ఏంటని నెటిజన్స్ తమ కామెంట్లకు పనిచెబుతున్నారు. 2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రియా రెడ్డికి అవకాశాలు అంతంత మాత్రమే వచ్చినా... తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ బామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా రెడ్డి, హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది. ముఖ్యంగా చీర కట్టులో ఎద అందాల ఆరబోతతో కవ్విస్తుంటుంది. చీరలోనో కాదు మోడ్రన్ డ్రెస్‌లోనూ కావాల్సినంత అందాన్ని అప్పనంగా అభిమానులకు అందిస్తుంటుంది. పదునైన చూపులతో గాలం వేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది.  ప్రస్తుతం శ్రియారెడ్డి ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 1.6మిలియన్ దాటింది. సలార్ మూవీ హిట్‌తో ఈ కుందనపు బొమ్మకు అవకాశాలు దక్షిణాదిలో వెల్లువెత్తుతున్నాయి.  మరి భవిష్యత్‌లో ఈ ఘాటు అందం ఎన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి.
  డిసెంబర్ 26 , 2023
  Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో వివాహ బంధంలోకి స్నేహరెడ్డి అడుపెట్టి నేటికి 13 వసంతాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ఎంతో మంది సెలబ్రెటీల చేత ఐకానిక్ జంటగా స్నేహ రెడ్డి- బన్నీ జంట గుర్తింపు పొందింది. కేవలం ఓ స్టార్ హీరో భార్యగా మాత్రమే  కాకుండా స్నేహా రెడ్డి తనకంటూ  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్‌పై తనకున్న అభిరుచి ఇతర దృక్కొణాలు ఆమెను లేడీ ఐకానిక్ స్టార్‌గా నిలిపాయి. ఈక్రమంలో స్నేహా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్‌లో తగ్గేదేలే  స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రాంలో స్నేహాకు ఏకంగా  9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  అందంలోనూ టాప్ ప్రస్తుతం స్నేహారెడ్డి వయసు 38. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తనది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ స్నేహా రెడ్డి ఫిట్‌గా ఉంటారు.  రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో రన్నింగ్ ఆమె డైలీ హ్యాబిట్ ఫ్యాషన్ ఐకాన్ ఏ సెలబ్రెటీతో పోల్చినా ఫ్యాషన్‌లో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఇటీవలే సిల్వర్ ఆకులతో ఎంబ్రాయిడరీ చేయించిన చీరను స్నేహా రెడ్డి ధరించింది. దీని ధర సుమారు రూ.1.45కోట్లు ఉంటుందని అంచనా  ప్రతిరోజు యోగా చేయడం స్నేహ దినచర్య. యోగా మెళకువలు, ఫ్యాషన్ టిప్స్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. యాక్టివ్ రెస్పాన్స్ ఫుడ్, ట్రావెల్ అంటే స్నేహా రెడ్డికి మక్కువ. ఎప్పుడూ వీటికి సంబంధించిన అంశాలను తను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఉంటుంది. సినిమాల్లోకి స్నేహరెడ్డి? ఇంత అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్నేహా రెడ్డి త్వరలో మేకప్ వేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. మలయాల సినిమాతో స్నేహా రెడ్డి ఎంట్రీ ఉంటుందట. ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు సమాచారం. మలయాళంలో అల్లు అర్జున్‌కి క్రేజ్ ఎక్కువ. అందుకే తన డెబ్యూ సినిమాకు అక్కడ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.
  మార్చి 06 , 2024
  Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
  Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
  సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్‌ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్‌’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నెట్టింట సందీప్‌ మేనియా ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్‌ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.  https://twitter.com/i/status/1760151102740464016 https://twitter.com/i/status/1760137348128358646 ‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’ సందీప్‌ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్‌ ప్రతినిధి సందీప్‌ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి. https://twitter.com/i/status/1758682406754861236 సందీప్‌ ఫేవరేట్‌ స్టార్లు వారే! సందీప్‌ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్‌ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్‌ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్‌ అందరికీ కాంపీటిషన్‌ పెడితే తాను ఫస్ట్‌ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్‌ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.   https://twitter.com/i/status/1757377128511778830 ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్‌ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.  సందీప్‌పై హీరోయిన్‌ సెటైర్! డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.  మిగతా అవార్డులు.. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగంలో.. అటు టెలివిజన్‌ విభాగంలో దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.
  ఫిబ్రవరి 21 , 2024
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.  యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.  ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
  ఫిబ్రవరి 29 , 2024
  <strong>విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న&nbsp; విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం.. విజయ్ దేవరకొండ అసలు పేరు? దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు విజయ్ దేవరకొండ తొలి సినిమా? నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం&nbsp;అయ్యాడు విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు? ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు VDKకు ఇష్టమైన కలర్? తెలుపు, బ్లాక్, బ్రౌన్ విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ? మే 9, 1989 విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం? విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు లవర్ ఉందా? విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది. విజయ్ దేవరకొండ వ్యాపారాలు? రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా? కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు? విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం? చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ. https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
  మార్చి 19 , 2024
  <strong>Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?</strong>
  Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
  నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు. దర్శకుడు: శివ తూర్లపాటి సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్ ప్రముఖ హీరోయిన్‌ ‘అంజలి’ లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి దర్శకుడు శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) హ్యాట్రిక్‌ ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతింటాడు. పొట్టకూటి కోసం మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సత్య హీరోగా ఓ సినిమా అవకాశం వస్తుంది. ఊటీలో రిసార్టు నడుపుతున్న అంజలి ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అయితే దెయ్యాల కోటగా పిలవబడుతున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్ జరపాలని ప్రొడ్యూసర్ ఓ కండీషన్‌ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్‌ మహల్‌ గతం ఏంటి? మహల్‌లో షూటింగ్‌ మెుదలుపెట్టిన శ్రీను &amp; టీమ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే ప్రముఖ నటి అంజలి ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో అదరగొట్టింది. పతాక సన్నివేశాల్లో తన అత్యుత్తమ యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని హార్రర్‌ సీన్లలో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్‌ నానిగా సునీల్‌ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్‌ మాధవ్‌ నటన మెప్పిస్తుంది.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఈ సీక్వెల్‌ మూవీ.. తొలి భాగం చూడనివారికి కూడా అర్థమయ్యేలా డైరెక్టర్‌ శివ తుర్రపాటి తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సంగీత మహల్‌కు వెళ్లిన తర్వాత అసలు కథను మెుదలుపెట్టాడు. ఆ మహల్‌ చరిత్ర... అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరును దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ క్రమంలో తీసుకొచ్చిన విరామ సన్నివేశాలతో ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పరంగా చూస్తే లాజిక్‌కు దూరంగా చాలా అంశాలే ఉన్నాయి. బలమైన ఎమోషన్స్‌ కూడా కొరవడ్డాయి. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మెరుపులు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు సంభాషణలు రాసుకోవడం కాస్త ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా దర్శకుడిగా శివ తన పాత్రకు కొంతమేర న్యాయం చేశారు. టెక్నికల్‌గా సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకి సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం బాగా కలిసొచ్చింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్‌ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ అంజలి నటనకామెడీ సన్నివేశాలుకొన్ని హార్రర్‌ అంశాలు మైనస్‌ పాయింట్స్‌&nbsp; కథలో బలం లేకపోవడంలాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
  ఏప్రిల్ 12 , 2024
  <strong>Spirit Movie: ప్రభాస్‌ భార్యగా రష్మిక.. సోదరిగా కీర్తి సురేష్‌.. గెస్ట్‌ రోల్‌లో త్రిష.. కాంబో మామూల్గా లేదుగా?</strong>
  Spirit Movie: ప్రభాస్‌ భార్యగా రష్మిక.. సోదరిగా కీర్తి సురేష్‌.. గెస్ట్‌ రోల్‌లో త్రిష.. కాంబో మామూల్గా లేదుగా?
  టాలీవుడ్‌ సెన్సేషన్‌ సందీప్‌ రెడ్డి వంగా.. తీసిన మూడు చిత్రాలతోనే పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ‌అర్జున్‌ రెడ్డితో డైరెక్టర్‌గా తెరంగేట్రం చేసిన సందీప్‌.. రీసెంట్‌గా ‘యానిమల్‌’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కుపిరించాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రం స్పిరిట్‌పై అందరి దృష్టి పడింది. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇందులో హీరోగా నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటికి రాగా అది ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.&nbsp; షూటింగ్‌ మరింత ఆలస్యం ప్రభాస్‌ - సందీప్‌రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రం త్వరలోనే మెుదలు కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్‌లో మెుదలు కాదట. తాజాగా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో స్పిరిట్ పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టోరీ, స్క్రిప్ట్‌ వర్క్‌ సహా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అటు నటీనటుల ఎంపికపైనా త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ను వెనకెనక్కి జరుపుతున్నారని సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.&nbsp; ప్రభాస్‌ రాకతో రణ్‌బీర్‌ వెనక్కి! సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్‌ మూవీ ‘యానిమల్‌’ (Animal)కు సీక్వెల్‌ కూడా రానున్న విషయం తెలిసిందే. యానిమల్‌ పార్క్‌ (Animal Park) పేరుతో రానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ మరింత వైలెంట్‌గా కనిపించనున్నాడు. అయితే ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కనుందని ఓ దశలో బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. యానిమల్‌ పార్క్‌ స్టోరీ కూడా రెడీగా ఉండటంతో సందీప్‌ ముందుగా ఈ సీక్వెన్స్‌ పైనే ఫోకస్‌ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. అయితే ఆయన తాజా ప్రకటనతో స్పిరిట్‌ మూవీనే ముందుగా రాబోతున్నట్లు మరోమారు కన్ఫార్మ్‌ అయ్యింది. దీంతో రణ్‌బీర్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్‌ ముందుకు వచ్చినట్లైంది.&nbsp; ముగ్గురు హీరోయిన్లు! ‘స్పిరిట్‌’ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్న దానిపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రముఖ మూవీ వెబ్‌సైట్‌ IMDBలో అభిమానులు మాత్రం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు అప్‌డేట్ చేశారు. స్పిరిట్‌ మూవీ క్యాస్ట్ విభాగంలో రష్మిక, త్రిష, కీర్తిసురేష్‌లను చేర్చారు. అంతేకాదు ఇందులో ప్రభాస్‌ భార్యగా రష్మిక, సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుందని, త్రిష కెమియో రోల్ చేయనున్నట్లు కూడా రాసుకొచ్చారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.&nbsp;
  మార్చి 29 , 2024
  Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
  Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
  బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌ (Animal). బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ రిలీజవ్వగా ఇందులో ర‌ణ్‌బీర్‌ క‌పూర్‌ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) లిప్‌లాక్‌ల‌తో అద‌ర‌గొట్టారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట‌లో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు. https://twitter.com/ilysmnojk/status/1712018933333778570?s=20 డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సాంగ్‌ను ముద్దుతో ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. చూడండి ఏం చేశాడో’ అని రణ్‌బీర్‌పై రష్మిక ఫ్యామిలీ ఫైర్‌ అవుతుంటారు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని రణ్‌బీర్‌, రష్మిక.. కుటుంబ సభ్యుల ముందే లిప్‌లాక్‌ చేసుకోవడం షాక్‌కి గురిచేస్తుంది.&nbsp; ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక, ర‌ణ్‌బీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు. ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లుగా చూపించి పాట‌ను ఎండ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌లో ర‌ణ్‌భీర్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. రష్మికకు ఇది హిందీలో మూడో చిత్రం. అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్ బై (Good Bye), సిద్దార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్నూ’ (Mission Majnu) చిత్రాలు చేసినప్పటికీ గ్లామర్‌ షో చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. తాజాగా రణ్‌బీర్‌ సినిమాలో మాత్రం ఈ భామ రెచ్చిపోయినట్లే కనిపిస్తోంది. రష్మికకు లిప్‌లాక్‌ సీన్‌ కొత్తేమి కాదు. గతంలో విజయ్‌ దేవరకొండతో చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనూ ఈ భామ ముద్దు సీన్‌లో నటించింది. తాజాగా యానిమల్‌ చిత్రంలో ఇలా లిప్‌లాక్‌ సీన్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌కు గట్టి సందేశాన్ని రష్మిక ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎటువంటి సాహసాలకైనా రెడీ అనే మెసేజ్‌ను ఈ భామ పంపింది. &nbsp; అటు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తన మార్క్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించాడు. గతంలో అర్జున్‌ రెడ్డి మూవీ పోస్టర్‌ను సందీప్‌ లిప్‌లాక్‌తోనే రిలీజ్‌ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. తాజాగా యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌ పోస్టర్‌ను సైతం ఘాటైన ముద్దుతో చూపించడం సందీప్‌ వంగాకే చెల్లింది.  &nbsp; ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ సీన్లను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రష్మిక, అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. డియర్‌ కామ్రేడ్‌ సినిమా నుంచే వీరి ప్రేమాయణం ప్రారంభమైందని సోషల్‌ మీడియాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఫ్యాన్స్‌ రష్మికపై మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌పై ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. లిరిక్స్‌, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయని పేర్కొంటున్నారు. పాట చూస్తుంటే యానిమ‌ల్ మూవీ అర్జున్‌రెడ్డికి మ‌రో వెర్ష‌న్‌లా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా అంటూ మ‌రో నెటిజ‌న్ ప్రశ్నించాడు.&nbsp; యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషించారు.&nbsp;
  అక్టోబర్ 11 , 2023
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.&nbsp; ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.&nbsp; గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.&nbsp; అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.&nbsp; ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది.&nbsp;
  ఫిబ్రవరి 27 , 2024

  @2021 KTree