• TFIDB EN
  • రూల్స్ రంజన్!
    UATelugu
    మనో రంజన్(కిరణ్ అబ్బవరం) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన లైఫ్‌లో కఠినమైన రూల్స్‌ పెట్టుకుని జీవిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత ఫ్రెండ్ సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకున్న.. మనో రంజన్.. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి షాకవుతాడు. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @prudhvi

    average

    average

    1 year ago

    తారాగణం
    కిరణ్ అబ్బవరం
    నేహా శెట్టి
    మెహర్ చాహల్
    వెన్నెల కిషోర్
    సుబ్బరాజు
    హైపర్ ఆది
    హర్ష చెముడు
    అన్నూ కపూర్
    అజయ్
    నాగినీడు
    అతుల్ పర్చురే
    విజయ్ పాట్కర్
    మకరంద్ దేశ్‌పాండే
    సుదర్శన్
    గోపరాజు రమణ
    అభిమన్యు సింగ్
    సిద్ధార్థ్ సేన్
    గుల్షన్ పాండే
    సిబ్బంది
    రత్నం కృష్ణదర్శకుడు
    AM రత్నం
    నిర్మాత
    రత్నం కృష్ణరచయిత
    అమ్రిష్సంగీతకారుడు
    దులీప్ కుమార్ M. S.సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు   నేహా శెట్టి ముద్దు పేరు?  నేహా  నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు   నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక  నేహా శెట్టి  అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి  ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి  తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి  ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి  ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి  ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే  నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి  ఏం చదివింది? డిగ్రీ  నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.  నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.  వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.  డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.  ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.  రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.  నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.  View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.  View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.  నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.  డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.  టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:  నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.  https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.  రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.  రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_  నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ అబ్బవరం.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొద్దికాలంలోనే నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  'ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం' చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'వినరో భాగ్యము విష్ణుకథ', మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు కిరణ్ అబ్బవరంతొలి సినిమా? రాజా గారు రాణి వారు కిరణ్ అబ్బవరం ఎక్కడ పుట్టాడు? రాయచోటి, ఆంధ్రప్రదేశ్ కిరణ్ అబ్బవరం పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, జులై 15 కిరణ్ అబ్బవరం వివాహం అయిందా? ఇంకా జరగలేదు. కిరణ్ అబ్బవరంకు లవర్ ఉందా? తెలియదు కిరణ్ అబ్బవరం ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి కిరణ్ అబ్బవరం తొలి హిట్ సినిమా? SR కళ్యాణమండంపం చిత్రం నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చింది. కిరణ్ అబ్బవరంకు ఇష్టమైన కలర్? బ్లాక్ కిరణ్ అబ్బవరం తల్లిదండ్రుల పేరు? తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారని కిరణ్ చెప్పాడు.  కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ప్రదేశం? రాయచోటి కిరణ్ అబ్బవరం ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. కిరణ్ అబ్బవరం అభిరుచులు? సినిమాలు చూడటం, కథలు రాయడం కిరణ్ అబ్బవరం ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 8 సినిమాల్లో నటించాడు.  కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ఆహారం? బిర్యాని కిరణ్ అబ్బవరం సినిమాకి ఎంత తీసుకుంటాడు? వరుస ఫ్లాప్స్ వల్ల తాను రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని.. సినిమా హిట్ అయితే మాత్రం లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకు సినిమాకు రూ.1.5కోట్లు తీసుకునే వాడు. https://www.youtube.com/watch?v=FbS3ZzfE44k
    మార్చి 21 , 2024
    This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.. రూల్స్ రంజన్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. మామ మశ్చీంద్ర వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. చిన్నా సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం 'చిత్త'. తెలుగులో 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మంత్‌ ఆఫ్ మధు క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. 800 శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌గా వస్తున్న చిత్రం '800'. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్‌ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7) TitleCategoryLanguagePlatformRelease DateBeckham SeriesEnglishNetflixOct  04Race to the SummitMovieGermanNetflixOctober 04Everything Now SeriesEnglishNetflixOctober 05Sister Death MovieEnglish NetflixOctober 05Miss Shetty Mr. Polishetty MovieTelugu Movie NetflixOctober 05  Fair Play           MovieEnglishNetflixOctober 06Insidious: The Red DoormovieEnglishNetflixOctober 06Strong Girl Nam SoonSerieskoreanNetflixOctober 07    Mumbai Diaries Season 2SeriesHindi Amazon PrimeOctober 06    Totally Killer MovieEnglishAmazon PrimeOctober 06Desperately Seeking Soulmate SeriesEnglish Amazon PrimeOctober 06Haunted Mansion      Movie English HotstarOctober 04Loki: Season 2SeriesEnglishHotstarOctober 06Mr. Pregnant MovieTeluguAhaOctober 06The Great Indian SuicideMovieTeluguAhaOctober 06Nee Vente NenuMovieTeluguCine BazaarOctober 06Gadar 2MovieHindiZee5October 06The Nun 2           MovieEnglishBook My ShowOctober 03Gran Turismo MovieEnglishBook My ShowOctober 05Asteroid City MovieEnglish Book My ShowOctober 06
    అక్టోబర్ 02 , 2023
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
    ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  మా బావ మనోభావాలు.. ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్‌.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్‌ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. https://www.youtube.com/watch?v=DCrO12C5oho ఓ రెండు ప్రేమ మేఘాలిలా 'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.  https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI మాస్టారు మాస్టారు ధనుష్ హీరోగా రూపొందిన 'సార్‌' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్‌ ఆలపించారు.  https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 పొట్టిపిల్ల జబర్దస్త్‌ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్‌ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్‌ చేసుకొని షేర్‌ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.  https://www.youtube.com/watch?v=CDNb6zyybDg చంకీల అంగీలేసి హీరో నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్‌ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్‌ చేసి అలరించారు.  https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c నచ్చావులే నచ్చావులే సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు. https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI ఆరాథ్య విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్‌ యూత్‌కు మరింత బాగా కనెక్ట్‌ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.  https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo సమ్మోహనుడా.. రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్‌ ఈ ఏడాది సోషల్‌ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్‌ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్‌ రిలీజ్ అనంతరం ట్రెండ్‌ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం. https://www.youtube.com/watch?v=aJQcn34K_S8 నిజమే నే చెబుతున్నా ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాలోని 'నిజ‌మే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ పాటకు శ్రీమ‌ణి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. https://www.youtube.com/watch?v=2pgx-tajxwE జ‌మల్ జ‌మాలో యానిమ‌ల్ సినిమాలోని ‘జ‌మల్ జ‌మాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ప‌దిహేను గంట‌ల్లోనే ఏడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జ‌మల్ జ‌మాలో పాట నిజానికి ఒక ఇరాన్‌ సాంగ్. ఈ పాట‌ను ఇరానియ‌న్ క‌వి బిజాన్ స‌మాంద‌ర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుక‌ల‌తో పాటు ఇత‌ర పంక్ష‌న్స్‌లో ఈ పాట త‌ప్ప‌కుండా ఉండ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది.  https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
    డిసెంబర్ 28 , 2023
    Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
    Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
    తారాగణం:  కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ డైరెక్టర్: రతినం కృష్ణ నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి సంగీతం: అమ్రీష్ సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్ టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్‌ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన  మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.  కథ మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్‌ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్‌ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది.  సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది. ఎవరెలా చేశారంటే? గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్‌నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది.  మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టెక్నికల్‌గా.. రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. బలాలు ఫస్టాప్ కామెడీ ట్రాక్ నెహా శెట్టి గ్లామర్ బలహీనతలు అనవసరమైన ఎలివేషన్స్ సెకండాఫ్ స్టోరీ చివరగా..  రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్ రేటింగ్: 2.5/5
    అక్టోబర్ 06 , 2023
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  యువ నటుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న రిలీజ్‌ కానుంది.  ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.  నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్‌ 6, 1999లో జన్మించింది.  సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. మిస్‌ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.  2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.  పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా చేశాడు.  ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.  2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.  యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో చెరగని ముద్ర వేసింది.  ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్‌ రంజన్‌' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.  ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.  యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.  ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
    ఏప్రిల్ 13 , 2024
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.  హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.  https://twitter.com/i/status/1332879102211096577 ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్‌కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్‌ చెప్పాలని నిర్ణయించుకుందట. కిరణ్‌-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్‌’ (Meter), ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.  ప్రస్తుతం ‘దిల్‌ రుబా’ అనే చిత్రం కిరణ్‌ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్‌ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఇక రహస్య గోరక్‌ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్‌ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.  అదే ఏడాది 'బాయ్స్‌ ఇన్ స్కూల్‌' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్‌' అనే తమిళ్‌ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది. 
    మార్చి 11 , 2024
    National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?
    National Cinema Day: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. మల్టీప్లెక్స్‌లో రూ.99కే మూవీ టికెట్‌. ఎందుకో తెలుసా?
    మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (Multiplex Association of India) సినీ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. PVR, INOX, సినీ పోలిస్‌ (Cinepolis), మిరాజ్‌(Miraj), సిటీప్రైడ్‌, ఏషియన్‌ (Asian), మూవీ టైమ్‌, వేవ్‌, ఎమ్‌2కే, డిలైట్‌ సహా 4వేలకు పైగా థియేటర్లలో రూ.99కే సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’ (National Cinema Day)గా పేర్కొంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.  ఒక్కరోజు మాత్రమే! అక్టోబర్‌ 13న మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అయితే రూ.99 లకే టికెట్‌ కావాలనుకునేవారు ఆఫ్‌లైన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత థియేటర్ల కౌంటర్ల వద్ద టికెట్ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ వస్తే టికెట్‌ ధరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక రిక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్స్‌కు రూ.99 ఆఫర్‌ వర్తించదు.  గతేడాదే ప్రారంభం ఎగ్జిబిటర్లకు దిశానిర్దేశం చేసే మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (M.A.I).. గతేడాది సెప్టెంబరు 23న ‘నేషనల్‌ సినిమా డే’ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఆ ఒక్క రోజే 6.5 మిలియన్స్‌కుపైగా ఆడియన్స్‌ మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూశారు. తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో ప్రేక్షకులకు మరోసారి ఆఫర్‌ ఇచ్చింది.  కరోనానే కారణం..!  తొలుత సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’ నిర్వహించాలని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ భావించింది. కొవిడ్‌ రెండు వేవ్‌ల తర్వాత భారత్‌లో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకున్న రోజు కావడంతో దానికి గుర్తుగా సెప్టెంబర్‌ 16ను ‘నేషనల్‌ సినిమా డే’గా జరుపుకోవాలని నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో దానిని సెప్టెంబరు 23కి వాయిదా వేశారు. చివరకూ అక్టోబరు 13ను ‘నేషనల్‌ సినిమా డే’గా ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం విడుదలైన, త్వరలో విడుదలకానున్న చిత్ర బృందాలకు ఇది కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులకు పండగే! ఇక వచ్చే వారం పలు బడా చిత్రాలు రిలీజ్‌ కాబోతున్నాయి. రామ్‌ పోతినేని ‘స్కంద’ (Skanda), రాఘవ లారెన్స్‌ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2), వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) తదితర చిత్రాలు వచ్చే శుక్రవారం (సెప్టెంబరు 28) రిలీజ్ కానున్నాయి. అటు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ (Peda Kapu-1), కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) అక్టోబరు 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    సెప్టెంబర్ 24 , 2023
    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
    విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్‌. ఆయన ఎవరో కాదు చియాన్‌ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.  శివ పుత్రుడు పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్‌ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు. అపరిచితుడు  శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.  మల్లన్న విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్‌ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.  ఐ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్‌ చేసిన రోల్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్‌ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.  నాన్న విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్‌ ఇప్పటికే చాలామందిని మెప్పించింది. ఇంకొక్కడు ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్‌ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్‌ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్‌ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. తంగలాన్ విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.  https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
    ఏప్రిల్ 18 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5  (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.  https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన  రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.  Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.  Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL  ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత  కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.  Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు  BMW X5  ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  Lamborghini Aventador Roadster   లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.  ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography  ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ  కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL  దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2  అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.  వోల్వో XC90 T8 ఇది  వోల్వో  ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు   ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.  ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ  కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.  విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు  https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు  లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.  అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.  Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.  తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,  టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.  అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా  రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,  రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-   రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.  విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో  స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్  హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-  దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్   సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 
    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రోల్స్ రాయిస్ ఫాంటమ్  ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్  చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్  ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. 2. విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన & విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. 3. ప్రైవేటు జెట్‌ చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 4. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.  5. అంజనా ప్రొడక్షన్స్‌ 1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి.  6. కేరళ బ్లాస్టర్స్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.  7. చిరంజీవి బ్లడ్‌ & ఐ బ్యాంక్‌ 1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ & ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  8. చిరంజీవి నెట్‌వర్త్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా.  
    ఆగస్టు 22 , 2023
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. [toc] Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.   మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల  మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్‌ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.  https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్  న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC  అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.  https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.  అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన  ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.  View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్‌ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్‌ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.  షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
    అక్టోబర్ 22 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్‌ రోల్స్‌ చేసిన ఏకైక హీరోగా ఘనత!
    తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్‌ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా. 1.Apoorva Sahodarulu (1986) బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు. 2. Ramudu Bheemudu (1988) రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు. 3. Brahmarshi Viswamitra (1991) నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 4. Aditya 369 (1991) ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు. 5. Maatho Pettukoku (1995) ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు. 6. Sri Krishnarjuna Vijayam (1996) సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు. 7. Peddannayya (1997) బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు. 8. Sultan&nbsp; (1999) శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్‌ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్‌ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు. 9. Chennakesava Reddy (2002) మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు. 10. Allari Pidugu (2005) జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు. 11. Okka Magadu&nbsp; (2005) బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు. 12. Pandurangadu&nbsp; (2008) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు. 13.Simha&nbsp; (2010) మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది. 14. Parama Veera Chakra&nbsp; (2011) దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు. 15. Adhinayakudu&nbsp; (2012) పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు. 16. Legend&nbsp; (2014) బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్‌ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు. Balakrishna's Legend Movie First Look Posters 17. Akhanda (2021) బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది. 18. Veera Simha Reddy&nbsp; (2023) గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్&nbsp; అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
    నవంబర్ 09 , 2023
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    Pushpa 2 Second Single: శ్రీవల్లితో పుష్ప గాడి డ్యూయెట్‌.. రేపు ఎప్పుడంటే?
    టాలీవుడ్‌లో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa : The Rule) ఒకటి. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇటీవలే ‘పుష్ప 2 ‘టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయగా అది పాన్‌ ఇండియా స్థాయిలో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇదే ఊపులో రెండో సింగిల్‌కు కూడా చిత్ర యూనిట్‌ ముహోర్తం ఖరారు చేసింది.&nbsp; రిలీజ్‌ ఎప్పుడంటే! ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్‌ను రేపు (మే 23) ఉదయం 11:07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇందులో రష్మిక మందనతో బన్నీ చిందేయబోతున్నట్లు చెప్పింది. ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తుందని చెప్పుకొచ్చింది. ‘పుష్ప పుష్ప..' సాంగ్‌తో ఇటీవల పుష్ప రాజ్ దుమ్మురేపాడు. ఇప్పుడు శ్రీవల్లి తన సామితో కలిసి మన మనసులు కొల్లగొట్టబోతుంది అంటూ మేకర్స్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. #Pushpa2SecondSingle హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.&nbsp; ఆ పాటను మరిపిస్తుందా! పుష్ప సినిమాలోని 'నా సామీ రారా సామీ' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్‌ మెలోడీగా వచ్చిన ఈ పాట అప్పట్లో యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రష్మిక నడుమును బెండ్‌ చేసి వేసే హుక్‌ స్టెప్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ స్టెప్‌ను అప్పట్లో యూత్‌ రీల్స్‌ చేసి తెగ ట్రెండ్‌ చేశారు. ఇప్పుడు ‘పుష్ప 2’ నుంచి రాబోతున్న సెకండ్‌ సింగిల్‌.. రొమాంటిక్‌ సాంగ్‌ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ‘నా సామి రారా సామీ’ రేంజ్‌లోనే ఈ పాట ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=vdY5SFZBgnk ఐటెం సాంగ్‌పై ఫోకస్‌! (Pushpa 2 Item Song) ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. రొమాంటిక్‌ పాట రేపు (మే 23) ఫ్యాన్స్‌ను అలరించనుంది. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్‌ దృష్టి ఐటెం సాంగ్‌ వైపు మళ్లింది. పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందే అందరికీ తెలిసిందే. ఇందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో 'పుష్ప 2' అదే రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ఈ మూవీలో ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. అదే సమయంలో మరో నటిని తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించలేదు. అయితే ఆగస్టు 15న సినిమా రిలీజ్‌ కానుండటంతో త్వరగా సాంగ్‌ను రూపొందించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది.&nbsp;
    మే 22 , 2024
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    <strong>Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!</strong>
    Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!
    "పుష్ప 2"&nbsp; సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ పుష్ప పార్ట్ 1లో "పుష్పరాజ్" పాత్రలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. "తగ్గేదే లే" అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, "పుష్ప 2"లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "పుష్ప-2" పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు. రష్మిక మందన్న క్రేజ్ మొదటి భాగంలో "శ్రీవల్లి" పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. "పుష్ప" సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్‌ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.&nbsp; ఫుల్ జోష్‌లో అభిమానులు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.&nbsp; నాన్‌ థియేట్రికల్‌ రికార్డు పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్. పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్ ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.&nbsp; ఓ&nbsp; సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు. "జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్." ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్‌ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.&nbsp; అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం." అనే డైలాగ్&nbsp; సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. . “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” &nbsp;అనే ఈ&nbsp; డైలాగ్&nbsp; అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
    అక్టోబర్ 26 , 2024
    <strong>Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?</strong>
    Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్‌ తప్పదా?
    జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్‌ రిలీజ్‌ చేసిన దేవర టీమ్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 10) ట్రైలర్‌నూ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. తారక్‌ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్‌ ట్రైలర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్‌ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; డ్యూయల్ అంటే ఫసక్కేనా! ‘దేవర’ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్‌ రోల్స్‌ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్‌’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్‌ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్‌, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్‌’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్‌ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్‌’ కేవలం రెండు కోట్ల మార్జిన్‌ (రూ.28 కోట్ల గ్రాస్‌) మాత్రమే సాధించింది. అయితే తారక్‌ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.&nbsp; ‘దేవర’ హిట్‌ కష్టమేనా! జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్స్‌ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్‌ చెక్‌ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్‌ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.&nbsp; ‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్‌! తారక్‌ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్‌ వెంటాడే ప్రమాదం ఉంది.&nbsp; దేవర ట్రైలర్‌ ఎలా ఉందంటే? దేవర ట్రైల‌ర్‌ ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?</strong>
    HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్‌ సీక్రెట్స్‌ ఇవే?
    టాలీవుడ్‌కు టాలెంటెడ్‌ యంగ్‌ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్‌’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్‌లో స్టార్‌ హీరోయిన్‌ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం. శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్‌ రెడ్డి, వసుంధర. శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తి చేసింది.&nbsp; స్కూల్‌ డేస్‌ నుంచే కల్చరల్‌ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్‌, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది. శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్‌ సింగర్‌ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్‌ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది. ప్రముఖ టెలివిజన్‌ షో ‘బోల్‌ బేబీ బోల్‌’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్‌ సీజన్‌లో రన్నరప్‌గా, మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్‌ చాతుర్యంతో టెలివిజన్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసింది.&nbsp; 2016లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్‌' మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు.&nbsp; ఆ తర్వాత చేసిన 'మనలో ఒకడు', 'ఫిదా' చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్‌ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు. దీంతో మోడలింగ్‌ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్‌ హైదరాబాద్‌ టైటిల్‌ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది.&nbsp; View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ఆహాలో వచ్చిన ‘మెయిల్‌’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది.&nbsp; ఆ తర్వాత సుహాస్‌ నటించిన 'రైటర్‌ పద్మభూషణ్‌' సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.&nbsp; గతేడాది వచ్చిన 'మ్యాడ్‌' చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది.&nbsp; ఈ ఏడాది తమిళంలో 'ట్రూ లవర్‌' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్‌ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) ప్రస్తుతం మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 'ప్రొడక్షన్ నెం.27' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ', 'మనలో ఒక్కడు' చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది.&nbsp; తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది.&nbsp; ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్‌ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్‌ అని స్పష్టం చేసింది.&nbsp; ఫుడ్‌ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్‌, జపనీస్‌ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది.&nbsp; ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.&nbsp; శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు.
    నవంబర్ 13 , 2024
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; హిందీలో తగ్గేదేలే! గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆదరణ లభించింది. బన్నీ అద్భుతమైన నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘పుష్ప 2’ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ నార్త్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. తెలుగులో ఈ సాంగ్‌ 20 గంటల వ్యవధిలో 84 లక్షల వ్యూస్‌ సాధిస్తే.. హిందీలో ఏకంగా కోటి వ్యూస్‌ రాబట్టడం విశేషం. ఈ లిరికల్‌ సాంగ్‌ను తెలుగులో 4.8 లక్షల మంది లైక్‌ చేయగా.. హిందీలో 5.2 లక్షలుగా ఉంది. కాగా, విడుదలైన ఆరు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా పుష్పగాడి హవా మెుదలైందంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; టైటిల్‌ సాంగ్ అదరహో.. బుధవారం సాయంత్రం పుష్ప 2 సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 02 , 2024

    @2021 KTree