• TFIDB EN
  • సాహసం
    UATelugu2h 40m
    తాత రాసిన వీలునామా దొరుకుతుంది. అందులో వారసుల కోసం వజ్రాలు దాచినట్లు ఉంటుంది. దీంతో వజ్రాలు వెతుక్కుంటూ హీరో పాకిస్తాన్‌ వెళ్తాడు. వజ్రాల నిధి కోసం హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    ఇన్ ( Telugu )నాట్‌ అవైలబుల్‌ ఇన్‌ తెలుగు
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    గోపీచంద్
    గౌతమ్ కుమార్ వర్మ
    తాప్సీ పన్ను
    శ్రీనిధి
    శక్తి కపూర్
    సుల్తాన్
    సుమన్
    సత్యనారాయణ వర్మ
    పారు గంభీర్
    జరా
    రాజ్ సింగ్ అరోరా
    దిలావర్
    అలీ
    ఖయామత్ రాజు
    వాసు ఇంటూరి
    గౌతమ్ స్నేహితుడు
    సూర్య
    శ్రీనిధి తండ్రి
    నారాయణ మూర్తినరేంద్ర వర్మ
    సిబ్బంది
    చంద్రశేఖర్ యేలేటి
    దర్శకుడు
    బివిఎస్ఎన్ ప్రసాద్
    నిర్మాత
    రాధా కృష్ణ కుమార్
    రచయిత
    చంద్రశేఖర్ యేలేటి (డైలాగ్స్)రచయిత
    షామ్‌దత్ సైనుదీన్
    సినిమాటోగ్రాఫర్
    సైనుదీన్సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్ర్
    చంద్ర శేఖర్ జి. వి.ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌ 5) ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్‌ చేస్తూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు! ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్‌, డిజిటల్‌ పేజ్‌ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్‌ స్టెప్పులు వేసి అదరగొట్టారు.  ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.  https://twitter.com/mr_rowdi/status/1775554308127551770?s=20 https://twitter.com/mr_rowdi/status/1775581652800131408 విజయ్‌, మృణాల్‌ కూడా ఇంతే! ఫ్యామిలీ స్టార్‌ సినిమాలోని 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. హుక్‌ స్టెప్పులతో ఆడియన్స్‌ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి. https://twitter.com/i/status/1775183286417125744 సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఇదే ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు  వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.  'హిట్ కొట్టేసారండీ'  ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్‌ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని 'హిట్ కొట్టేసారండీ' అని కంప్లీమెంట్‌ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్‌ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్‌ ఇట్‌ అంటూ దేవరకొండను హగ్‌ చేసుకుందట. మరోవైపు విజయ్‌ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు. 
    ఏప్రిల్ 04 , 2024
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు రచన, దర్శకత్వం: అభిమన్యు సంగీతం: ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా విడుదల తేదీ: 16-02-2024 ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.  కథ అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్‌ పనితీరు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 16 , 2024
    TAAPSEE PANNU: ఇంత అందం దారి మళ్లిందా?... హాట్ అందాలతో రెచ్చిపోయిన తాప్సీ!
    TAAPSEE PANNU: ఇంత అందం దారి మళ్లిందా?... హాట్ అందాలతో రెచ్చిపోయిన తాప్సీ!
    సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పొన్ను ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది.  హాట్‌లుక్‌లో అందాల కనువిందు చేసింది  పాలవన్నెల పరువాలు ప్రదర్శిస్తూ షేక్ చేసింది ముద్దుగుమ్మ. నగుమోము వయ్యరాలను ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.  గోల్డ్ కలర్ డ్రెస్‌లో.. థండర్ థైస్, నాభి అందాలు చూపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.  తడిసిన చీరలో నాభి కేంద్రం కనిపించేలా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది ఈ కుర్రది రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే ఆకట్టుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ ఢిల్లీ భామ.  Mr. పర్‌ఫెక్ట్‌, సాహసం, కాంచన 2, ఘాజీ, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. తెలుగులో చాలా కాలం వరకు కెరీర్ బాగానేసాగిన తాప్సి స్టార్ హీరోలతో మాత్రం అనుకున్నంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.  గోపిచంద్‌తో సాహసం సినిమా ఆమె కెరీర్‌లో మంచి హిట్ పడ్డప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి బికినీ అందాలతో రెచ్చిపోయింది.  కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తాప్సి చాలా చేంజ్ అవుతూ వచ్చింది. పింక్ వంటి సందేశాత్మక చిత్రంలో నటించి మంచిపేరు తెచ్చుకుంది. నామ్‌ శభానా, బద్లా వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది.  సినిమాల్లోనే కాకుండా వ్యాపారిగానూ రాణిస్తుంది ఈ బ్యూటీ. పూణే 7 Aces బ్యాడ్మింటన్‌ ఫ్రాంఛైజీకి యజమాని.  అంతేకాదు, వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థను కూడా నడిపిస్తోంది. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్‌ చిత్రంతో తెలుగులో మెరిసింది తాప్సీ.   తాజాగా షారుఖ్ ఖాన్‌తో డుంకీ సినిమాలో నటించి నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏలియన్, ఓ లడ్కీ హై కహాన్ అనే చిత్రాల్లో నటిస్తోంది.
    జనవరి 09 , 2024
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు మరో మలయాళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సిద్ధమవుతోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లేటెస్ట్‌ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్‌’ (Manjummel Boys Telugu Release) తెలుగులోనూ విడుదల కాబోతోంది. గత నెల ఫిబ్రవరిలో కేరళలో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మలయాళ సినిమాలపై ఆసక్తి కనబరిచే టాలీవుడ్‌ ఆడియన్స్‌.. ఈ చిత్రం ఎప్పుడు తెలుగులో వస్తుందా ‌అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది. తెలుగులో వచ్చేది ఆ రోజే! ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ‘మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆ పోస్టర్‌కు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.  ‘ప్రేమలు’ రికార్డ్‌ను బద్దలుకొట్టేనా? మలయాళం సూపర్‌ హిట్‌ సినిమా ‘ప్రేమలు’ (Premalu).. మార్చి 8న తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించింది. తద్వారా తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును ‘మంజమ్మల్‌ బాయ్స్‌’ బీట్‌ చేస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో వస్తుడంటంతో తెలుగులోనూ మంచి పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి.  రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌  సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా దీనిని తెరకక్కించాడు. రిలీజ్‌ అనంతరం గొప్ప సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం.. మలయాళంలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అటు తమిళంలోనూ ఇటీవల ఈ చిత్రం రిలీజ్‌ కాగా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా,  ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు. అటు  ఈ సినిమా కథేంటి? ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 27 , 2024
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను (Taapsee Pannu) సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బో (Mathias Boe)తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  మార్చి 20న ఈ జంట ప్రీవెడ్డింగ్‌ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం.  ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక (Kanika Dhillon) తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువురు వెల్లడిస్తున్నారు.  తాప్సీ - మథియాస్‌ వేడుకకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాప్సీ అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా వాటిపై తాప్సీ స్పందించారు.  ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని ఆమె పేర్కొంది.  బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఓ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని అప్పట్లో పేర్కొంది. ఇలా దశాబ్ద కాలం  నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.  ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.  ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.  2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను ఇటీవల ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    మార్చి 25 , 2024
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను  కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన  తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.  మార్చి 29న తెలుగులోకి..! శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.  కలెక్షన్స్‌లో టాప్‌- 5 ఇవే 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్‌), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్‌) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.  ఈ సినిమా కథేంటి? 2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’  చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 19 , 2024
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్‌ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్‌ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/memesbyAru/status/1762745277944054182 తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ (Mathias Boe)ని వివాహం చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మార్చి నెలఖారు లోపు పెళ్లి బంధంతో వీరు ఒక్కటవుతారని సమాచారం.  సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారిపోయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తాప్సి - మథియస్‌ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని అంటున్నారు.  సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.  సుమారు పదేళ్లుగా తాప్సీ - మథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఈ జంట చాలా జాగ్రత్త పడింది. ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.  బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఆ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.  ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.  ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.  2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    ఫిబ్రవరి 28 , 2024
    RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
    RRR | OSCARS: ‘నాటు నాటు'ను ఏళ్ల తరబడి స్మరించుకుంటాం’.. ప్రధాని మోదీ
    RRR చిత్రంలో నాటునాటు పాటకి ఆస్కార్  రావటం పట్ల చిత్రబృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి టీమ్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు తెలుపుతున్నారు. ప్రపంచస్థాయికి భారతీయ సినిమా వెళ్లిందంటూ ప్రశంసిస్తున్నారు.  దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు చరణ్, ఎన్టీఆర్‌లపై పొగడ్తల వర్షం కురుస్తుంది.  RRR చిత్రబృందం ఆస్కార్‌ అందుకోవటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.  “ నాటునాటు పాటకి ఆస్కార్‌తో దేశం గర్విస్తోంది. ఈ పాటను కొన్ని ఏళ్లతరబడి స్మరించుకుంటారు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు” అంటూ ప్రధాని కొనియాడారు.  https://twitter.com/narendramodi/status/1635132805628956674 బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో RRRలోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిత్రబృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు వెంకయ్య.  https://twitter.com/MVenkaiahNaidu/status/1635135662734319616 దేశం మెుత్తం స్టెప్పులు వేసిన పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కీరవాణి, చంద్రబోస్‌ సహా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.  https://twitter.com/RahulGandhi/status/1635140606862454784 ఆస్కార్‌ గెలిచి ఆర్ఆర్‌ఆర్ చిత్రం చరిత్ర సృష్టించిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. భారతదేశ గర్వించ దగ్గ విషయం ఒకటైతే, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి మరింత గర్వకారణంం అన్నారు.  https://twitter.com/ncbn/status/1635117591806234624 దర్శక ధీరుడు రాజమౌళి దార్శనికత, సాహసం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కారం అందుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇందులో చరణ్ కూడా భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు. https://twitter.com/KChiruTweets/status/1635113504758964227 ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు జనసేనాని పవన్ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. “ ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన RRRలోని ఈ నాటు నాటు… గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారత సినిమా స్థాయి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా చేసిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు” చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం భారతీయులను, తెలుగు సినిమాను గర్వించేలా చేసిందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు తమిళిసై. https://twitter.com/DrTamilisaiGuv/status/1635141311887192064 విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ.. ఆస్కార్ ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. ఆస్కార్ అవార్డుతో  తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణమని చెప్పారు సీఎం. ఆర్ఆర్‌ఆర్ ఆస్కార్ అందుకోవటంతో ఆనందంలో మునిగి తేలుతున్న వారిలో తాను కూడా చేరానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కీరవాణి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్‌. https://twitter.com/KTRBRS/status/1635138037549248512 RRR హీరోయిన్ అలియా భట్ నాటు నాటుకు ఆస్కార్‌ రావడం పట్ల తన సంతోషాన్ని ఇన్‌స్టా స్టోరీలో వ్యక్తపరిచింది. సెలబ్రేషన్ ఎమోజీలతో ఆనందాన్ని పంచుకుంది. ఆస్కార్ అవార్డు గెలవటంపై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “ ఇప్పటికీ నాకు కలగానే ఉంది. మాకు అంతులేని మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప వ్యక్తులు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు పొందటానికి కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌కు అభినందనలు. తారక్‌తో కలిసి మరోసారి డాన్స్ చేసి రికార్డులు బద్ధలుకొట్టాలని ఆశిస్తున్నాను. ఈ అవార్డు భారత చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క నటుడు, టెక్నిషియన్‌కు అంకితం” అన్నారు.   https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?s=20 నాటు నాటు పాట ఆస్కార్ గెలవడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఆస్కార్ సాధించాం అంటూ తన సంతోషాన్ని ట్వీట్ చేశారు. RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, నాటు నాటు సాంగ్ రాసిన గేయ రచయిత చంద్రబోస్‌ను తారక్ అభినందించారు. మొత్తం RRR చిత్రబృందానికి ఆయన శుక్షాకాంక్షలు తెలిపారు. https://twitter.com/tarak9999/status/1635151033432432641?s=20
    మార్చి 13 , 2023
    <strong>Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్‌ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు భారతీయుడు 2 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సారంగదరియా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మహారాజా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.&nbsp; ధూమం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateReceiverSeriesEnglishNetflixJuly 10Wild Wild PunjabMovieHindiNetflixJuly 10Vikings : Wall HallaSeriesEnglishNetflixJuly 11Commander Karan SaxenaSeriesHindiHotstarJuly 8MastermindSeriesEnglishHotstarJuly 10Agni SakshiSerial SeriesTeluguHotstarJuly 12Show TimeSeriesEnglishHotstarJuly 1236 DaysSeriesTelugu/HindiSonyLIVJuly 12Pil&nbsp;MovieHindiJio CinemaJuly 12 గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు &amp; వెబ్‌ సిరీస్‌లు.. గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.&nbsp; TitleCategoryLanguagePlatformMirzapur 3SeriesTelugu/ HindiAmazon PrimeMalayali From IndiaMovieTelugu/ MalayalamSonyLIVFuriosa: A Mad Max SagaMovieEnglish/ TeluguAmazon PrimeSasi MadanamSeriesTeluguETV WinMarket MahalakshmiMovieTeluguAhaBhaje Vayu VegamMovieTeluguNetflixSathyabamaMovieTeluguAmazon PrimeLove MouliMovieTeluguAhaVindu BhojanamMovieTeluguAhaGuruvayoor AmbalanadayilMovieTelugu/ MalayalamAhaAham RebootMovieTeluguAha
    జూలై 08 , 2024
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో&nbsp; అంతం చేస్తాడు. అటువంటి&nbsp; బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.&nbsp; భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.&nbsp; కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.&nbsp; కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.&nbsp; రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో&nbsp; రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.&nbsp; పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.&nbsp; అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.&nbsp; పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.&nbsp; సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.&nbsp; బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.&nbsp; అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.&nbsp;
    ఫిబ్రవరి 29 , 2024
    Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?
    Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?
    తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. సస్పెన్స్‌తో కూడిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సరిగ్గా అదే కోవాలోని కథను ఎంచుకున్నారు డైరెక్టర్ బాబా పీఆర్. 'సైదులు' అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకుని పెద్ద సాహసమే చేశారు. రచ్చ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సూర్య భరత్ చంద్ర 'అష్టదిగ్భంధనం' సినిమాలో హీరోగా నటించాడు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? ఓ రాజకీయ పార్టీ అధినేత వద్ద పనిచేస్తున్న శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్‌కు ఎమ్మెల్యే టికెట్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తాను కూడా పోటీచేయాలని ఆ పార్టీ అధినేత రాములన్నకు చెబుతాడు. రూ.50 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తానని చెబుతాడు. దీంతో తన మనుషులతో కలిసి శంకర్ ప్లాన్ వేస్తాడు. శంకర్ వేసిన స్కెచ్‌లో హీరో హీరోయిన్లు( సూర్య, విషికా కోటా) ఎలా ఇరుక్కుంటారు. రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన రూ.100కోట్లు ఎక్కడ దాచాడు? ఆ డబ్బును ఎవరు కొట్టెశారు. అసలు అష్టదిగ్బంధనం ప్లాన్ చేసింది ఏవరు? అనే ట్విస్ట్‌లు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. సినిమా ఎలా ఉందంటే? "యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది.. ఈ యుద్ధం రాజ్యం కోసమే, రాణి కోసమో, అధికార కోసమో కాదు.. అహం కోసం. అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది" అనే డైలాగ్ ట్రైలర్‌లో వినిపిస్తుంది.&nbsp; ఇదే డైలాగ్‌ను సినిమా మొత్తం కథలో చూపించాడు దర్శకుడు బాబా పి.ఆర్.&nbsp; ఇగోతో ఓ వ్యక్తి చేసే పని ఎక్కడికి దారి తీస్తుంది? అనేది ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో కథ సాదా సీదా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచుతుంది.&nbsp; సెకండాఫ్ వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని చోట్ల సిల్లీ పాయింట్లు ఉన్నా&nbsp; ఓవరాల్‌గా సినిమా బాగుందని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ప్రేష్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. హీరో భరత్ చంద్ర యాక్టింగ్ పర్వాలేదు. హీరోయిన్ విషికా కోటా... అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ నచ్చుతుంది. రౌడీ షీటర్ శంకర్ పాత్రలో నటించిన మహేష్ రావుల్ విలనిజాన్ని బాగా చూపించాడు. యాక్షన్ సీన్స్‌లో జీవించాడు. మిగతా పాత్రలు కూడా తమ క్యారెక్టర్ల పరిధిమేరకు నటించారు.&nbsp; సాంకేతికంగా సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. జాక్సన్ విజయన్ మ్యూజిక్, సాంగ్స్, బీజీఎమ్ పర్వాలేదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాలోని కొన్ని సీన్లలో సత్య తన ఎడిటింగ్‌కు ఇంకాస్త మెరుగుపెడితే బాగుండేది. బలాలు థ్లిల్లర్ కథాంశం ఇంటర్వెల్ ట్విస్ట్ విలన్ శంకర్ క్యారెక్టరైజేషన్ బలహీనతలు కొన్నిచోట్ల లాజిక్ మిస్ సిల్లీ సీన్స్ చివరగా: థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలు కోరుకునే వారికి ఈ చిత్రం నచ్చుతుంది రేటింగ్: 3.5/5
    సెప్టెంబర్ 25 , 2023
    <strong>HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!</strong>
    HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!
    అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్‌, క్లాస్‌, ఆధ్యాత్మికం, లవ్‌ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్‌ ‌అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్‌ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 'శివ'తో సెన్సేషన్‌ సాధారణంగా కెరీర్‌ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్‌ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్‌ వర్మకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్‌ స్టెప్‌ ‌అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా&nbsp; ‘శివ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నాగ్‌ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్‌ - రామ్‌గోపాల్‌ వర్మ చెక్‌ పెట్టారు.&nbsp; వైవిధ్యతకు ప్రాధాన్యం శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్‌ నేచురల్‌ హెయిస్ట్‌ ఫిల్మ్‌, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్‌’లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా మారిపోయాడు.&nbsp; ‘అన్నమయ్య’ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ రావడం విశేషం.&nbsp; మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు.. ‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.&nbsp; కొత్తవారికి ఛాన్స్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్‌ (మాస్‌), విజయ్‌ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్‌ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్‌. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్‌ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్‌, ఫాజిల్‌, రవిచందర్‌, మహేష్‌ భట్‌ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్‌ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్‌ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్‌ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్‌ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/thokkaloteja/status/1828863171152757038 బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా.. సాధారణంగా స్టార్‌డమ్‌ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తారక్‌ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్‌ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1829013612117230039 ఫిట్‌నెస్‌ మంత్ర నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్‌ ఫిజిక్‌ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్‌ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్‌’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్‌ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
    ఆగస్టు 29 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్‌ 27న ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు నింద వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చైతన్యరావు, హెబ్బా పటేల్‌ ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జూన్‌ 21న&nbsp; ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకుంటున్నాయి. OMG హస్యనటుడు వెన్నెల కిషోర్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు రక్షణ పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ర‌క్ష‌ణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ఇందులో పాయల్‌ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.&nbsp; బాక్‌ సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్‌’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్‌-3 నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్‌ జూన్‌ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
    జూన్ 17 , 2024
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్‌ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్‌ వెనక్కి తగ్గలేదు. అజిత్‌ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్‌ స్టంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పల్టీ కొట్టిన అజిత్‌ కారు! ప్రస్తుతం అజిత్‌ (Ajith) తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’ (Vida Muyarchi)లో నటిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.&nbsp; https://twitter.com/Fukkard/status/1775813515233878447 ‘ధైర్యానికి హద్దులు ఉండవు’ ఈ వీడియోను షేర్‌ చేసిన లైకా ప్రొడక్షన్స్‌.. దీనికి అదిరిపోయే క్యాప్షన్ సైతం ఇచ్చింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా, ‘విదా ముయార్చి’ చిత్రానికి మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
    ఏప్రిల్ 04 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.&nbsp; భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman&nbsp;MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon&nbsp;March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ&nbsp; సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.&nbsp; సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్&nbsp; చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. 7:11PM టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు.&nbsp; తెలుగులో మంచి విజయం సాధించింది. ఒకే ఒక జీవితం తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. Disco Raja సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. Mark Antony టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. Krrish 3 సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్‌ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. Robo 2.o సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు. Robo&nbsp; రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే&nbsp; ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. 24 టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు. Skylab సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు. Srivalli బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.&nbsp; Taxiwaala ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది.&nbsp; మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది. Tik Tik Tik సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో&nbsp; జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు. Chandamama Lo Amrutham చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. Yuganiki Okkadu తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు. ఆదిత్య 369 తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. Kalki 2898 AD సైన్స్‌ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.&nbsp; కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024&nbsp; సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
    నవంబర్ 07 , 2023
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024
    <strong>Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే&nbsp; ఓ వీర సైనికుడి గాథ</strong>
    Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే&nbsp; ఓ వీర సైనికుడి గాథ
    చిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్‌, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్‌, లల్లు, శ్రీకుమార్‌, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌, వివేక్‌ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024 భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్‌, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం. కథ ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని&nbsp; ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి. ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. అలాగే కశ్మీర్‌లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి&nbsp; ఖాజీపత్రి ఆపరేషన్‌ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే? ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది. సాంకేతికత ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి. బలాలు బలమైన కథ సెకాండాఫ్ బలమైన ఎమోషన్స్ శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బలహీనతలు పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు చిరవగా మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది. రేటింగ్: 4/5
    నవంబర్ 01 , 2024

    @2021 KTree