• TFIDB EN
  • సంతోషం
    UTelugu2h 30m
    కార్తిక్‌.. భాను అక్క పద్మావతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తుంది. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన కార్తిక్‌ను చూసి భాను ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగార్జున
    కార్తీక్
    ప్రభుదేవా
    పవన్
    గ్రేసీ సింగ్
    కార్తీక్ భార్య
    శ్రియా శరన్
    భాను
    కె. విశ్వనాథ్
    రామచంద్రయ్య
    కోట శ్రీనివాసరావు
    హింసరాజు / విక్రమ్
    బ్రహ్మానందం
    గిరి
    సునీల్
    క్రాంతి కుమార్ / సీతయ్య
    చంద్ర మోహన్
    చంద్రం
    పరుచూరి బ్రదర్స్
    వెంకట్ రావు
    పృథివీరాజ్
    శ్రీరామ్
    బెనర్జీ
    సూరి
    ఆహుతి ప్రసాద్
    ప్రసాద్
    ప్రీతి నిగమ్
    రాణి
    సుమిత్ర
    లక్ష్మి
    సుధ
    సావిత్రి
    తనికెళ్ల భరణి
    శంకర్ మెల్కోటే
    మెల్కోటే
    ఎల్బీ శ్రీరామ్
    వజ్జ వెంకట గిరిధర్వివాహ వరుడు
    ఆజం
    మధు మణిమాలిక
    ఇందు ఆనంద్
    అనిత చౌదరిఅనిత
    లహరిదుర్గ
    స్వప్న
    దేవిశ్రీ
    సరస్వతమ్మ
    మాస్టర్ అక్షయ్ లక్కీ
    సోఫియా హక్
    ఐటెం సాంగ్‌లో సోఫియా హక్ $
    సిబ్బంది
    దశరధ్
    దర్శకుడు
    కెఎల్ నారాయణనిర్మాత
    ఆర్పీ పట్నాయక్
    సంగీతకారుడు
    S. Gopal Reddyసినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Happy Wedding Anniversary మహేశ్‌ బాబు-నమ్రత శిరోద్కర్‌
    Happy Wedding Anniversary మహేశ్‌ బాబు-నమ్రత శిరోద్కర్‌
    ]మహేశ్‌-నమ్రత జంట ఇలాగే కలిసి మెలిసి సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ YouSay తరఫున జంటతారలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
    ఫిబ్రవరి 10 , 2023
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    Holi 2024: రంగుల్లో నిండైన అందాలు చూస్తారా?
    సోమవారం హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో సంతోషం హోలీని జరుపుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు భామలు ముఖానికి రంగులతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.  యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)తో కలిసి హోలీ వేడుకలను జరుపుకున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నాడు.  https://twitter.com/i/status/1772544977396220385 బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani).. స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి హోలీ జరుపుకుంది. అప్‌కమింగ్‌ చిత్రం ‘బడేమియా చోటేమియా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు తారలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) స్టార్‌ నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన తల్లితో కలిసి హోలీ వేడుకలను జరుపుకుంది. తల్లితో అన్యోన్యంగా ఉన్న ఫొటోను కాజల్ షేర్ చేసింది.  హాట్‌ బ్యూటీ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. పెళ్లి తర్వాత వచ్చిన తొలి హోలీని ఘనంగా జరుపుకుంది. భర్త జాకీ భగ్నానీతో కలిసి హోలీ డేను ఎంజాయ్ చేసింది.  View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా(Raashii Khanna) చేతులకు రంగుతో ఫొటోకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.  యంగ్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya).. హోలీ రోజును చాలా సంతోషంగా జరుపుకుంది.  యంగ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ సైతం స్నేహితులతో కలిసి హోలీని ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.  View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) నటి మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) కూడా హోలీ రోజున ఓ సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ముఖం, శరీరంపైన రంగులు ఉండటం గమనించవచ్చు.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ (Kriti Sanon).. మిత్రులతో హోలీని జరుపుకుంది. హ్యాపీ హోలీ అంటూ ఈ భామ కన్ను గీటుతూ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.  నటి రాయ్‌ లక్ష్మీ (Raai Lakshmi) హోలీ రోజున ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రంగులతో తడిచిన ఒంటితో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది.  ప్రముఖ నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi)... నైజీరియాలో హోలీ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తితో దిగిన ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా హోలీ రోజున సందడి చేసింది. నుదురు, బుగ్గపైన రంగుతో క్యూట్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది.  హోలీని బాగా సెలబ్రేట్‌ చేసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శివాలిక ఒబెరాయ్‌ ఉంది.  యంగ్‌ హీరోయిన్‌ రుహానీ శర్మ.. స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొంది.  మెగా డాటర్స్‌ సుస్మిత (Susmitha), శ్రీజ (Sreeja).. హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని.. సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  బాలీవుడ్‌ భామ అవనీత్‌ కౌర్‌.. హోలీ రోజున సోషల్‌ మీడియాలో తళుక్కుమంది.  ప్రముఖ నటి ఆకాంక్ష సింగ్‌.. హోలీ సందర్భంగా ముఖాన రంగుతో ఫ్యాన్స్‌కు ఓ కొంచె చూపు విసిరింది.  పాపులర్‌ హీరోయిన్‌ శోభితా దూలిపాల (Sobhita Dhulipala).. డ్రెస్‌ మెుత్తం రంగుల మయం అయ్యేలా హోలీ జరుపుకుంది.  హాట్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.. కోలకత్తాలో ఫ్యాన్స్‌తో కలిసి హోలీ జరుపుకుంది. తన స్టెప్పులతో అక్కడి వారిని ఉర్రూతలూగించింది. మీరు చూసేయండి.  View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez)
    మార్చి 26 , 2024
    <strong>Stars celebrate Christmas 2024: క్రిస్మస్‌ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!</strong>
    Stars celebrate Christmas 2024: క్రిస్మస్‌ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!
    క్రిస్మస్‌ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్‌ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పండగ జరుపుకుంటే మరికొందరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు విదేశాల్లో పండగను ఆస్వాదించారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. రామ్‌చరణ్‌ - ఉపాసన జంట.. కూతురు క్లింకారతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పనిచేసే వారితో కలిసి సంతోషంగా ఈ పండగ చేసుకున్నారు.&nbsp; స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hegde).. క్రిస్మస్‌ రోజున ఎంతో సరదాగా గడిపింది. క్రిస్మస్‌ ట్రీ పక్కన కాఫీ దాగుతూ బ్యూటీఫుల్‌ ఫొటోను షేర్‌ చేసింది.&nbsp; బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ కియారా అద్వానీ (Kiara Advani) తన భర్త సిద్ధార్ధ్‌ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంది. భర్తను ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ జంట విక్కీ కౌషల్‌ (Vicky Kaushal) - కత్రీనా కైఫ్‌ (Katrina Kaif) విదేశాల్లో క్రిస్మస్‌ జరుపుకుంది. శాంటా క్లాజ్‌ గెటప్‌లో ఉన్న వ్యక్తితో వారు దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.&nbsp; హీరోయిన్‌ డింపుల్‌ హయాతీ ఇంట్లోనే క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడిపింది. క్రిస్మస్‌ ట్రీ, కేక్‌ మధ్య ఆమె దిగిన ఫొటో అలరిస్తోంది.  ప్రముఖ నటి కీర్తి సురేష్‌ (Keerthi Suresh) 'బేబీ జాన్‌' హీరో వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan)తో కలిసి క్రిస్మస్‌ జరుపుకుంది. చేతులు చాచి వారిద్దరు దిగిన ఫొటోపై మీరు ఓ లుక్కేయండి.&nbsp; స్టార్‌ హీరోయిన్‌ నయనతార (Nayanthara).. భర్త విఘ్నేష్‌, కవల పిల్లలతో క్రిస్మస్‌ రోజున సరదాగా గడిపింది. క్రిస్మస్‌ ట్రీ వద్ద ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ బాక్సులను పిల్లలకు ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.&nbsp; మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) తన తల్లితో కలిసి క్రిస్టమస్‌ జరుపుకుంది. తలపై క్రిస్మస్‌ టోపీతో తల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో ఆకట్టుకుటోంది.&nbsp; క్రిస్మస్‌ సందర్భంగా రణ్‌బీర్‌ (Ranbir Kapoor) - అలియా (Alia Bhatt) జంట మరోమారు తళుక్కుమంది. కూతురు రాహాతో కలిసి వారు సంతోషంగా దిగిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ (Sara Ali Khan) క్రిస్మస్‌ రోజున సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో దిగిన ఫొటో ప్రత్యేకంగా నిలుస్తోంది. వారిద్దరు క్రిస్మస్‌ ట్రీ ఎదుట ఫొటోకు ఫోజులిచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోని (MS Dhoni) కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్‌ క్యాప్‌తో భార్య, కూతురుతో అతడు దిగిన ఫొటో క్రికెట్ లవర్స్‌ను తెగ మెప్పిస్తోంది.&nbsp; తమిళ స్టార్ హీరో శివకార్తికేయ (Sivakarthikeyan) తన కుమారుడు గుగన్‌ దాస్‌తో పండగను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. క్రిస్మస్‌ ట్రీ ముందు కుమారుడితో అందమైన సెల్ఫీ దిగి నెట్టింట పోస్టు చేశాడు.&nbsp; మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), భార్య లావణ్య త్రిపాఠితో కలిసి విదేశాల్లో క్రిస్మస్‌ జరుపుకున్నాడు. ధ్రువపు జింకతో వారు జిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.&nbsp; స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ (Shruti Hassan).. క్రిస్మస్‌ ట్రీతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. మోడ్రన్‌ డ్రెస్‌లో ఆమె దిగిన ఫొటో నెటిజన్లను మెప్పిస్తోంది.&nbsp; తెలుగు హీరోయిన్‌ నభా నటేష్‌ (Nabha Natesh) క్రిస్మస్‌ రోజున చాలా సంతోషంగా గడిపింది. వివిధ రకాల ఫోజుల్లో క్రిస్టమస్‌ చెట్టుతో ఫొటోలు దిగింది. వాటిని మీరూ చూసేయండి.&nbsp; కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) ఇంట్లోనే క్రీస్తు పండగను చేసుకుంది. క్రిస్మస్‌ ఎంతో ఉత్తేజకరమైన రోజని ఆమె పేర్కొన్నారు.&nbsp; తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా (Eesha Rebba) తలపై శాంటా క్లాజ్‌ హెయిర్‌ బాండ్‌ పెట్టుకొని పోస్టు చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది.&nbsp; టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. పారిస్‌ నగరంలో క్రిస్మస్‌ను ఘనంగా చేసుకుంది. ఈఫిల్‌ టవర్‌ కనిపించేలా ఆమె దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.&nbsp; ‘హనుమాన్‌’ ఫేమ్‌ అమృత అయ్యర్‌ (Amrita Aiyer) క్రిస్మస్‌ ట్రీ పక్కన ఎంతో అందంగా ఫొటో దిగింది. క్రిస్మస్‌ వెలుగుల మధ్య ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; అందాల భామ హన్సిక (Haniska) ఈ పండగ సందర్భంగా తళుక్కున మెరిసింది. క్రిస్మస్‌ చెట్టు, శాంటా క్లాజ్‌ బొమ్మ పక్కన ఎంతో స్టైలిష్‌గా ఫొటో దిగింది.&nbsp; ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మీ (Ray Lakshmi) క్రిస్మస్‌ వెలుగుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. ఫ్యాన్స్‌ను ఉత్తేజపరుస్తూ ఆమె ఇచ్చిన ఫోజు మెప్పిస్తోంది.&nbsp; 'గద్దల గణేష్‌' ఫేమ్‌ మృణాళిని రవి (Mirnalini Ravi).. విదేశాల్లో క్రిస్మస్ పండుగను ఆస్వాదించింది. అక్కడి వీధుల్లో విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆమె దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటి రుక్సార్‌ ధిల్లాన్‌ (Ruksar Dillon) కూడా ఘనంగా జరుపుకుంటోంది. రెడ్‌ కలర్‌ డ్రెస్‌, మ్యాచింగ్‌ హెయిర్‌ బ్యాండ్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది.&nbsp;
    డిసెంబర్ 26 , 2024
    Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?
    Mrunal Thakur: అంతర్జాతీయ స్థాయికి చేరిన మృణాల్‌ క్రేజ్.. ఒక్క సినిమాతో ఇంత సాధ్యమా?
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. ఫ్రాన్స్‌లో జరిగే 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననుంది.&nbsp;ఈ మేరకు నిర్వహకుల నుంచి ఆహ్వానం అందినట్లు మృణాల్‌ తెలిపింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2023లో తొలిసారి పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు మృణాల్‌ చెప్పింది. గ్లోబల్‌ ఫిల్మ్‌మేకర్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.&nbsp; మృణాల్‌తో పాటు అనుష్క శర్మ, మానుషి చిల్లర్‌, సారా అలీఖాన్‌ కూడా కేన్స్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే అదితిరావు, ఐశ్వర్యరాయ్‌, అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొనే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; తెలుగులో వచ్చిన సీతారామం చిత్రంతో మృణాల్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా ఈ భామకు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కాయి. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనే స్థాయికీ మృణాల్‌ ఎదిగింది.&nbsp; ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో NANI 30 ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.&nbsp; NANI 30 సినిమాతో పాటు హిందీలో పూజా మెరీ జాన్‌, పిప్పా, ఆంఖ్‌ మిచోలి సినిమాల్లో మృణాలు నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది.&nbsp; ఓవైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతూనే సోషల్‌ మీడియాలోనూ మృణాల్ సూపర్‌ యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. మృణాలు ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా ‌అవుతున్నారు. ఆమె అందచందాలకు ముగ్దులవుతున్నారు. నెట్టింట మృణాల్‌ ఇస్తున్న హాట్‌ ట్రీట్‌ను తీసుకునేందుకు నెటిజన్లు ఆమెను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్‌ చేసిన బోల్డ్‌ ఫొటోలను లైక్, షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.&nbsp; ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోయిన్లలో మృణాల్‌ ఠాకూర్ ఒకరు. ఆమె ఖాతాను 8.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    మే 16 , 2023
    <strong>Jathara Video Song: యూట్యూబ్‌ను షేక్‌ ఆడిస్తున్న ‘గంగమ్మ జాతర’ వీడియో సాంగ్!</strong>
    Jathara Video Song: యూట్యూబ్‌ను షేక్‌ ఆడిస్తున్న ‘గంగమ్మ జాతర’ వీడియో సాంగ్!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్‌ చేస్తోందో అందరికీ తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 6న రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఇప్పటికీ సాలిడ్‌ వసూళ్లను సాధిస్తోంది. ఇందులో బన్నీ నటన నెక్స్ట్‌ లెవల్లో ఉంది. ముఖ్యంగా జాతర సీన్‌లో అతడి పర్‌ఫార్మెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పించిందని ఆడియన్స్‌ చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా మూవీలోని ఫుల్ వీడియో సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాాజాగా మోస్ట్‌ వాంటెడ్ జాతర పాటను రిలీజ్‌ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలిచిన ఈ పాటను విడుదల చేయడంతో సినీ లవర్స్‌ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న సాంగ్‌.. 'పుష్ప 2' చిత్రంలోని జాతర సాంగ్‌ను మేకర్స్‌ తాజాగా రిలీజ్ చేశారు. మెుత్తం 3 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లోకి వచ్చింది.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సాంగ్‌ అందుబాటులోకి వచ్చింది.  ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్‌లో నాలుగు గంటల వ్యవధిలోనే 6 లక్షల మంది ఈ పాటను వీక్షించారు. ప్రతీ నిమిషానికి వ్యూస్‌ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడు. గంగమ్మ జాతర సాంగ్‌లో కళ్లకు కాటుక, ఒంటికి నీలిరంగు పట్టుచీర, చేతులకు గాజులు, కాళ్లకు గజ్జ కట్టి తన మెస్మరైజ్‌ డ్యాన్స్‌తో అందరికీ పూనకాలు తెప్పించాడు. విడుదల నేపథ్యంలో ఈ పాట గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ పాటకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్స్‌ను ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. https://www.youtube.com/watch?v=Qye2HPaiB98 సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్‌.. దర్శకుడు సుకుమార్‌ ఎంతో క్రియేటివ్‌గా జాతర ఎపిసోడ్‌ను రూపొందించారు. జాతర సీక్వెన్స్‌ను మెుత్తం మూడు డైమన్షన్స్‌లో రూపొందించారు. సాంగ్‌తో పాటు అద్భుతమైన ఫైట్‌, హృదయాలకు హత్తుకునే ఎమోషన్స్‌ను ఈ ఎపిసోడ్‌లో చక్కగా చూపించాడు. బన్నీ నటన సినిమా మెుత్తం ఒక ఎత్తు.. ఈ ఒక్క జాతర ఎపిసోడ్‌లో మరో ఎత్తు అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. ఈ సీక్వెన్స్‌లో బన్నీ నటనకు మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు సైతం వచ్చాయి. కాగా, ఏటా తిరుపతిలో జరిగే ఈ ప్రసిద్ధ గంగమ్మ జాతరను ఆధారంగా చేసుకొని సుకుమార్‌ ఈ ఎపిసోడ్‌ను రూపొందించడం విశేషం.  https://twitter.com/Thyview/status/1875028995022188940 రెండ్రోజుల్లో ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు! గత ఏడాది డిసెంబర్‌ 4న విడుదలైన 'పుష్ప 2' చిత్రం ప్రస్తుత నాలుగో వారంలోనూ సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నాలుగు వారాల్లో రూ.1799 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే 2017లో రిలీజైన బాహుబలి 2 రూ.1810 కోట్ల వసూళ్ల దేశంలోనే సెకండ్ హయేస్ట్‌ గ్రాసింగ్‌ మూవీగా ఉంది. ఈ లెక్కన 'పుష్ప 2' చిత్రం రెండు, మూడు రోజుల్లో 'బాహుబలి 2'ను ఈజీగానే క్రాస్‌ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే దర్శకధీరుడు రాజమౌళి సినిమాలన్నింటినీ బన్నీ-సుకుమార్ ద్వయం వెనక్కి నెట్టినట్లు అవుతుంది. https://twitter.com/PushpaMovie/status/1874811437031514348
    జనవరి 03 , 2025
    <strong>Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;</strong>
    Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ ‘పూరి మ్యూజింగ్స్‌’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్‌ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్‌ మీడియా అనేది జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన సాధనమని, అయితే దానికి దూరంగా ఉంటే కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, విడాకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం పూరి జగన్నాథ్ అభిప్రాయం ప్రకారం.. ‘‘సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ప్రారంభమైన సాధనంగా కనిపించింది. కానీ, ఇప్పుడు మన జీవితాల్లో డిజిటల్‌ దెయ్యంలా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల మనం ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం మొదలుపెట్టాం. కొత్త దుస్తులు కట్టినా, ఇంట్లో సంతోషంగా ఉన్నా, స్నేహితులతో గడిపినా ప్రతి క్షణం ఫొటో తీసి పోస్ట్ చేయడంపై ఆసక్తి పెరిగింది. కానీ దీని వల్ల మానసిక శాంతి పోయి, అసూయ, అసంతృప్తి పెరుగుతున్నాయి.’’ ట్రోలింగ్‌ సమస్య ‘‘మీరు ఏ ఫొటో పోస్ట్ చేసినా అది అందరికి నచ్చదు. మీరు మాల్దీవుల్లో బికినీ ఫొటో పంచుకున్నా ట్రోలింగ్‌ తప్పదు. కొందరు విమర్శిస్తారు, మరికొందరు అసభ్యంగా మాట్లాడతారు. వాటిని చూసి బాధపడుతూ మీ పని మానేసి బాధతో కూర్చుంటారు. ఎందుకంటే, ఆ ఫొటోలు చూసే వాళ్లు కూడా పని లేని వాళ్లే. చివరకు మీరు కూడా అదే స్థితిలో పడిపోతారు.’’ సోషల్ మీడియా కారణంగా విడాకులు ‘‘తాజా సర్వే ప్రకారం, 10 విడాకుల్లో 3 వివాహాలు సోషల్ మీడియా కారణంగా బంధాలు దెబ్బతినడం వల్లే జరుగుతున్నాయి. కుటుంబ సంబంధాల నాశనం ప్రధానంగా డిజిటల్ వేదికల వల్లే జరుగుతోంది. ఇంట్లో గొడవలు, అశాంతికి సోషల్ మీడియా ప్రధాన కారణమని గుర్తించాలి’’ అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలి పూరి ఇంకా మాట్లాడుతూ,‘‘మీ ఇంట్లో జరిగే విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. మీ వ్యక్తిగత జీవితం గురించి బైట చెప్పకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లైన వారైతే ప్రతి ఫొటో, ప్రతి అంశం పంచుకోవడం ఆపేయాలి. మీ జీవితంలోని ఆనందాలు, కష్టాలు మీలోనే ఉంచుకోండి. మీ కుటుంబం మీదే దృష్టి పెట్టండి. దానివల్లనే జీవితానికి స్థిరత్వం వస్తుంది’’ అన్నారు. నెగెటివిటీకి దూరంగా ఉండండి ‘‘మీరు ఏ ఫొటో పెడితే అది నెగెటివిటీని ఆకర్షిస్తుంది. మీ కుక్క ఫొటో పెడితే అది అనారోగ్యానికి గురవుతుంది. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఫోటో పెడితే ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు వస్తాయి. ఈ ప్రవర్తన ద్వారా ఇతరుల అసూయ మీకు సమస్యలను తీసుకురాగలదు’’ అని పూరి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి కొత్త తీర్మానం ‘‘కొత్త సంవత్సరం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కనీసం ఒక్క నెల అయినా డిజిటల్‌ డిటాక్స్‌ చేపట్టండి. మీరు మీ జీవితంలో మానసిక శాంతి అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. మీ బంధాలు బలపడతాయి, విడాకులు తగ్గుతాయి, జీవితంలో సంతోషం పెరుగుతుంది’’ అని పూరి పేర్కొన్నారు. సమాజానికి పూరి సూచనలు పూరి చివరగా చెబుతూ..‘‘మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు మీ కుటుంబసభ్యులు. వాళ్లతో గడపడానికి మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. డిజిటల్ ప్రపంచాన్ని వినియోగించండి కానీ అది మిమ్మల్ని మింగివేయకూడదు.’’ ఈ సందేశం ద్వారా పూరి జగన్నాథ్ నేటి యువతికి మరియు కుటుంబాలకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని అందించారు.
    డిసెంబర్ 30 , 2024
    <strong>Keerthi Suresh Wedding: కీర్తి పెట్టిన ఆ హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం తెలుసా?</strong>
    Keerthi Suresh Wedding: కీర్తి పెట్టిన ఆ హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం తెలుసా?
    స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి (Keerthi Suresh Wedding) ఘనంగా జరిగింది. తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను ఆమె బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడింది. గురువారం (డిసెంబర్‌ 12) గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం కీర్తి - ఆంటోని వివాహం జరిగింది.&nbsp; ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. కొత్త వధూవరులను వారు ఆశీర్వదించారు.&nbsp; పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కీర్తి సురేష్‌ స్వయంగా పంచుకుంది. దీనికి #ForTheLoveOfNyke అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చింది.&nbsp; ఆంటోని తట్టిల్‌ తాళి (Keerthi Suresh Wedding) కడుతున్న ఫొటోను సైతం కీర్తి పంచుకుంది. మూడు ముళ్లు వేస్తున్న క్రమంలో ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది.&nbsp; ప్రస్తుతం కీర్తి సురేష్‌ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.&nbsp; స్టార్ హీరోయిన్స్‌ హన్సిక, ప్రియాంక మోహన్‌, సంయుక్త, రాశిఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కీర్తి సురేష్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కీర్తి ఫొటోలతో పాటు&nbsp; హ్యాష్‌ట్యాగ్‌ కూడా నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఆమె పెట్టిన #ForTheLoveOfNyke హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం ఏంటా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.&nbsp; హ్యాష్‌ట్యాగ్‌లోని చివరి పదం ‘Nyke’ అని ఉంది. దీని ప్రకారం భర్త అంటోనీ ఇంగ్లీషులో ‘NY’తో ముగుస్తుంది. అలాగే కీర్తి పేరు ‘KE’తో మెుదలవుతుంది. ఈ రెండిటిని కలిపి ‘Nyke’ అని పెట్టి ఉండొచ్చని సమాచారం.&nbsp; లేదంటే అంటోనిని ముద్దుగా నైక్‌ (Nyke) అని కీర్తి పిలుస్తుండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం #ForTheLoveOfNyke హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఇదిలా ఉంటే కీర్తి సురేశ్‌ - ఆంటోనీ (Keerthi Suresh - Antony Thattil Wedding) దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పారు.&nbsp; దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.&nbsp; ఆంటోనీ (Antony Thattil)ది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది.&nbsp; కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అప్పటినుంచి ఆంటోని-కీర్తి ఒకరికొకరు ప్రేమలో ఉన్నారని కథనాలు వచ్చాయి. కీర్తి సురేష్‌&nbsp; (Keerthi Suresh Wedding)&nbsp; సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె ‘రఘుతాత’ చిత్రంతో ప్రేక్షకులను పలకించారు. ఆ మూవీ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రస్తుతం ఆమె ‘రివాల్వర్‌ రీటా’, ‘బేబీ జాన్‌’ చిత్ర పనుల్లో బిజీగా ఉంది. ‘బేబీజాన్‌’ చిత్రం ద్వారానే ఆమె తొలిసారి హిందీలో అడుగుపెట్టింది.&nbsp; బేబీ జాన్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించాడు. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల డిసెంబర్‌ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp;
    డిసెంబర్ 12 , 2024
    <strong>Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత రష్మిక - విజయ్‌ దేవరకొండ పెళ్లి?</strong>
    Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్‌ తర్వాత రష్మిక - విజయ్‌ దేవరకొండ పెళ్లి?
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ చెప్పినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. వారిద్దరు కలిసి విహారయాత్రలు, రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. రీసెంట్‌గా 'పుష్ప 2' కి సంబంధించి జరిగిన చెన్నై ఈవెంట్‌లో రష్మిక నేరుగా విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు హింట్‌ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్‌ (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement)కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌ చేస్తోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పుష్ప 2 రిలీజ్‌ తర్వాత నిశ్చితార్థం? అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. గత మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెంచేస్తోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 విడుదలైన డిసెంబర్‌ 5 తర్వాత ఏ క్షణమైన ఈ గుడ్‌న్యూస్‌ వినొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో రష్మిక, విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ వార్త నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. అదే జరిగితే తమ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్స్ చేస్తున్నారు.  చెన్నై ఈవెంట్‌లో రష్మిక హింట్‌ కొద్దిరోజుల క్రితం చెన్నై వేదికగా జరిగిన 'పుష్ప 2' ప్రమోషనల్ ఈవెంట్‌లో రష్మిక మందన్న కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్‌ దేవరకొండతో లవ్‌&nbsp; (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రేమ, పెళ్లి ప్రశ్నలపై ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చింది. ‘మీకు చాక్లెట్‌ బాయ్‌ అంటే ఇష్టమా? లేదా రౌడీ బాయ్‌ అంటే ఇష్టమా?’ అని అడగ్గా ‘ఆ రెండింటి కాంబినేషన్‌ అంటే ఇష్టం’ అని రష్మిక అన్నది. ‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’ అని యాంకర్‌ ప్రశ్నించగా ‘ఇది అందరికీ తెలిసిన విషయమే’ అని నవ్వులు పూయించింది. దీంతో విజయ్‌ దేవరకొండతో ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పిందని నెటిజన్లు చర్చించుకున్నారు.&nbsp; https://twitter.com/BRKTelugu_1/status/1860986326138671208 విజయ్‌-రష్మిక రెస్టారెంట్‌ పిక్‌ వైరల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడి గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే ఒకే ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న వారి ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఇలాంటి ఫొటో ఒకటి మరోమారు నెట్టింట వైరల్ అయ్యింది. ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి ఫుడ్‌ తిన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారన్ని మాత్రం తెలియలేదు. ఇందులో విజయ్ ఫేస్‌ స్పష్టంగా కనిపించినప్పటికీ రష్మిక ఫేస్‌ సరిగా కనిపించలేదు. అయితే తాను ఫుడ్‌ తింటున్నట్లు రష్మిక ఓ ఫొటో షేర్‌ చేయగా అది ఆ రెస్టారెంట్‌లో తీసింది కావడం గమనార్హం. ఈ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేశారు. మరోమారు విజయ్‌ జోడి దొరికేసిందంటూ పోస్టులు పెట్టారు. https://twitter.com/celebspot8688/status/1860540536295424339 డేటింగ్‌పై లీక్‌ ఇచ్చేసిన విజయ్‌! రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇటీవల 'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. ఆ సాంగ్‌ ప్రమోషన్స్ సందర్భంగా రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్‌ కాదని, కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్‌&nbsp; 'VD12' ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది.&nbsp; ఇది పూర్తయ్యాక ఆయన మైత్రి మూవీ మేకర్స్‌లో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కించనున్నారు.&nbsp; విజయ్‌ తమ్ముడితో చెప్పింది గుర్తుందా! విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్‌ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో  రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. అప్పట్లో రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా, ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని రష్మిక చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని ‘ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా’ అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బాయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. https://twitter.com/GulteOfficial/status/1795136777625403525
    డిసెంబర్ 02 , 2024
    <strong>Sobhita Dhulipala: నాగ చైతన్య భలే చిలిపి! ఏం చేశాడో చూడండి!</strong>
    Sobhita Dhulipala: నాగ చైతన్య భలే చిలిపి! ఏం చేశాడో చూడండి!
    ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్‌ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ సమంతతో విడాకుల అనంతరం చైతూ ఈ పెళ్లికి రెడీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తోడు సామ్‌ తమ విడాకుల గురించి తరుచూ ఏదోక కామెంట్స్‌ చేస్తుండటం కూడా చైతూ సెకండ్‌ మ్యారేజ్‌పై అందరి ఫోకస్‌ పడేలా చేసింది. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి పనులు మెుదలైనట్లు తెలుస్తోంది. వారిద్దరు హల్దీ వేడుకలు (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; పసుపు దుస్తుల్లో.. అక్కినేని నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్‌ 4న గ్రాండ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హల్దీ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ వేడుకల్లో (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చైతూ-శోభితా చాలా సంతోషంగా కనిపించారు. కుటుంబ సభ్యులు వారికి పసుపు నీటితో మంగళ స్నానం చేయించారు. శోభితాపై నీళ్లు పోస్తున్న సందర్భంలో తీసిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఆ సమయంలో చైతన్య చిలిపి చేష్టలు చేసినట్లు తెలుస్తోంది. చేతిలోకి నీళ్లు తీసుకొని శోభిత ముఖాన చైతూ చల్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ హల్దీ ఫొటోలు అక్కినేని అభిమానులు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.&nbsp; https://twitter.com/etimes/status/1862417583234027679 https://twitter.com/i/status/1862343687931298101 నాగేశ్వరరావు విగ్రహం ఎదుట.. నాగచైతన్య - శోభిత వివాహం డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఇరుకుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. రీసెంట్‌గా తమ పెళ్లి గురించి మాట్లాడిన నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్దంగా శోభిత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అతిథుల జాబితాను శోభితాతో కలిసి తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో వాస్తవం లేదట నాగచైతన్య - శోభిత పెళ్లి (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony)ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా స్ట్రీమింగ్‌ చేసేందుకు నెట్‌ ఫ్లిక్‌ వర్గాలు రూ.50 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో నయనతార-విఘేష్‌ తరహాలోనే చైతూ కూడా తన పెళ్లిని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని సమాచారం. స్ట్రీమింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు అక్కినేని ఫ్యామిలీని సంప్రదించలేదని తెలుస్తోంది. అవి జస్ట్‌ పుకార్లు మాత్రమేనని ఫిల్మ్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.&nbsp; రెండేళ్లుగా ప్రేమాయణం సమంతతో విడాకుల అనంతరం నటుడు నాగచైతన్య (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) శోభితకు దగ్గరయ్యాడు. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు, డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చైతూ-శోభిత ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్‌ 4న బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.&nbsp; శోభితా సీక్రెట్స్‌ ఇవే శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో పుట్టింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచి సత్తా చాటింది. హిందీలో వచ్చిన ‘రామన్‌ రాఘవన్‌ 2.0’ (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.&nbsp; ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన గూఢచారి చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘మేజర్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా మెరిసింది. రీసెంట్‌గా హిందీలో 'లవ్‌, సితారా' అనే చిత్రం చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    నవంబర్ 29 , 2024
    <strong>Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌&nbsp;</strong>
    Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌&nbsp;
    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'జీబ్రా' (Zibra). 'పుష్ప'లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్‌ టాక్‌తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్‌గా సక్సెస్‌ మీట్‌ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్‌ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.&nbsp; సత్యదేవ్‌ ఏం రాశారంటే? ‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్‌ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు. 'ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్‌ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్‌ మాస్టర్‌ సినిమాని మీరు థియేటర్‌లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు. https://twitter.com/ActorSatyaDev/status/1861276550337073501 ప్రతీ సినిమాకు ఎదురీతే టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్‌ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్‌ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్‌లో కనిపించకపోవడంతో సత్యదేవ్‌ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్‌కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్‌ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్‌ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్‌ ఫిల్మ్‌ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కొవిడ్‌ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన 'తిమ్మరుసు'పై కూడా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్‌ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన 'కృష్ణమ్మ' రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్‌కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్‌ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు.&nbsp; 'జీబ్రా' నిజంగానే బాగుందా? దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్‌ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్‌ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్‌ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్‌ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్‌ విషయంలో గ్యాంగ్‌స్టర్ అయిన విలన్‌ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్‌ పెద్దగా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు.&nbsp; స్టోరీ ఏంటంటే? మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.
    నవంబర్ 26 , 2024
    <strong>HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!</strong>
    HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
    తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్‌ ఒకరు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్‌ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం. శ్రియా శరణ్‌ 1982 సెప్టెంబర్‌ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్‌ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్‌ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్‌ చేశారు. 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్‌ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్‌’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్‌ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.&nbsp; తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.&nbsp; రామ్‌చరణ్, తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్‌ రోల్‌లో నటించింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.&nbsp; గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా ‘షోటైమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్‌ పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp; సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్‌ వీడియోలలోనూ శ్రియా శరణ్‌ మెరిసింది. 'తిరకటి క్యూన్‌ హవా', 'కహిన్‌ దూర్‌', 'రంగ్‌ దే చునారియా', 'బరి బరి సాంగ్‌' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.&nbsp; ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్‌.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్‌?</strong>
    Chiranjeevi - Balakrishna: బాలకృష్ణతో మల్టీస్టారర్‌.. చిరంజీవి ఛాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్‌?
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్‌ 1) బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దర్శకుడు బోయపాటితో పాటు ఇతర కథా రచయితలకు బంపరాఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; బాలయ్యతో మల్టీస్టారర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ బాలకృష్ణ సినీ స్వర్ణోత్వవ వేడుకల్లో మెగాస్టార్‌ చిరంజీవి క్రేజీ కామెంట్స్‌ చేశారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుక మాత్రమే కాదని యావత్ తెలుగు సినీ పరిశ్రమ వేడుక అని అన్నారు. ఇండస్ట్రీలో ఫ్యాక్షన్‌ సినిమాలకు బాలయ్య మారుపేరుగా మారారని కొనియాడారు. ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఒకరకంగా బాలకృష్ణనే తనకు ప్రేరణ అని చిరు చెప్పుకొచ్చారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే తాను నటించడానికి సిద్ధమని మెగాస్టార్ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ‘నీవూ రెడీనా’ అని అనగానే బాలకృష్ణ సైతం డబుల్ ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో డైరెక్టర్‌ బోయపాటి శ్రీనును ప్రత్యేకంగా సూచిస్తూ మీరు కథ రాస్తే నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్‌ చేశారు. అదే సమయంలో వైవీఎస్‌ చౌదరి పేరును కూడా చిరు ప్రస్తావించారు.&nbsp; https://twitter.com/i/status/1830519890249421017 బోయపాటే ఎందుకు? బాలయ్య గోల్డెన్‌ జూబ్లీ వేడుకలకు ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్లు హాజరయ్యారు. అయితే వారిని కాదని బోయపాటి శ్రీను పేరునే చిరు ప్రస్తావించడానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రస్తుత డైరెక్టర్లలో యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా బోయపాటి ఉన్నారు. పైగా బాలకృష్ణ లాంటి సీనియర్‌ నటుడితో ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తీశారు. దీంతో బోయపాటి అయితేనే ఈ భారీ మల్టీస్టారర్‌కు న్యాయం చేయగలరని చిరు భావించి ఉండవచ్చు. అందుకే ‘ఓయ్‌ బోయపాటి.. ఛాలెంజ్‌’ అంటూ ముందుగా ఆయన పేరునే ప్రస్తావించినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సీనియర్‌ డైరెక్టర్ వై.వీ.యస్‌. చౌదరి, ఇతర కథా రచయితలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పరోక్షంగా చిరు సూచించారు.&nbsp; రంగంలోకి వై.వి.ఎస్‌..? ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే ఆయన నందమూరి కుటుంబానికి వీరాభిమాని. అంతేగాదు ఆ ఫ్యామిలీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో ఆయన గతంలో సినిమాలు కూడా తీశారు. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన కథతో చిరు. బాలయ్యను ఒప్పించగలిగితే టాలీవుడ్‌లో నెవర్‌ బిఫోర్‌ మల్టీస్టారర్‌ రావడం పక్కా అని చెప్పవచ్చు.&nbsp; ఫ్యాన్‌ వార్‌పై చిరు క్రేజీ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్‌ ఇటీవల బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ అన్నారు.
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Mokshagna Teja: </strong><strong>మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ బిగ్‌ ప్లాన్‌!</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ బిగ్‌ ప్లాన్‌!
    నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో నందమూరి నట వారసుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. మెున్నటి వరకూ కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తాజాగా స్లిమ్‌ అయ్యి హీరోలా మేకోవర్ అయ్యాడు. హనుమాన్‌ ఫేమ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ అతడ్ని తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అమితాబ్‌ స్పెషల్‌ రోల్‌! తన కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను యంగ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మకు బాలకృష్ణ అప్పగించారు. హనుమాన్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ నందమూరి నట వారసుడిని ఓ రేంజ్‌లో పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పాన్‌ ఇండియా స్టోరీని ప్రశాంత్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్‌ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్‌ నమ్ముతున్నారట. ఇందుకోసం త్వరంలోనే బిగ్‌ బీని ప్రశాంత్‌ వర్మ సంప్రదిస్తారని తెలుస్తోంది.&nbsp; ప్రశాంత్‌ వర్మ బిగ్ ప్లాన్‌! మోక్షజ్ఞ సినిమాలోకి అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. దిగ్గజ నటుడు తన సినిమాలో ఉంటే అటు మోక్షజ్ఞకు కూడా కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. మోక్షజ్ఞతో చేయబోయే ఈ సినిమా, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఓ భాగమని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అభిమన్యుడి పాత్రలో నందమూరి వారసుడు కనిపిస్తాడని స్ట్రాంగ్‌ బజ్‌ కూడా వినిపిస్తోంది. ప్రముఖ నటులు కూడా ఈ మూవీలో తారాగణంగా ఉంటారని అంటున్నారు. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; బాలయ్యకు నో చెప్పిన బిగ్‌ బీ! నందమూరి బాలకృష్ణ, అమితాబ్‌ బచ్చన్‌ కాంబోలో దర్శకుడు కృష్ణ వంశీ గతంలో ఓ సినిమాను ప్లాన్‌ చేశారట. ఈ విషయమై బిగ్‌బీని సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్ట్‌ కూడా అటకెక్కినట్లు తెలిసింది. అప్పుడు బాలయ్యకు నో చెప్పిన అమితాబ్‌ అతడి కుమారుడి తెరంగేట్రం చిత్రంలో నటిస్తారో లేదోనన్న ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ మూవీలో మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి త్వరలోనే కీలక అపడేట్స్‌ రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; ప్రశాంత్‌ వర్మే ఎందుకు? నందమూరి వశం నుంచి వస్తోన్న మూడో తరం హీరో కావడంతో మోక్షజ్ఞ తేజను ఎవరూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో బోయపాటి వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే వారందరినీ కాదని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకే తన కుమారుడ్ని పరిచయం చేసే అవకాశం బాలయ్య ఇచ్చారు. ఇందుకు ఓ బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమాన్‌ చిత్రంతో ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. తేజ సజ్జ వంటి కుర్ర హీరోతో పని చేసిన అనుభవం ఉండటంతో అతడైతేనే మోక్షజ్ఞను బాగా ప్రజెంట్‌ చేయగల్గుతాడని బాలయ్య నమ్మినట్లు తెలుస్తోంది. అంతేగాక వ్యక్తిగతంగానూ సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కూడా ప్రశాంత్‌ వర్మపై బాలయ్య మెుగ్గు చూపించి ఉండొచ్చని టాక్.&nbsp; హ్యాండ్సమ్‌ లుక్‌లో.. నందమూరి మోక్షజ్ఞ హ్యాండ్సమ్ లుక్‌తో ఉన్న ఫొటోలు ఇటీవల ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మోక్షజ్ఞ తన హ్యాండ్సమ్‌ లుక్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్‌ హీరో మెటీరియల్‌ అని తన న్యూ లుక్‌ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ మేకోవర్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్‌ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందని పోస్టులు పెట్టారు.
    ఆగస్టు 21 , 2024
    <strong>Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!</strong>
    Naga Chaitanya - Sobhita: సమంత చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా! చైతూ నిశ్చితార్థంపై నెటిజన్ల ప్రశ్నలు!
    అక్కినేని ఇంటి మరోమారు పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)తో విడాకులు అనంతరం ఆయన మరోమారు పెళ్లికి సిద్దమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)ను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం వీరి కలయికను తప్పుబడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  నాగార్జున స్పెషల్‌ పోస్టు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తనయుడు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘నా తనయుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 రెండేళ్లుగా ప్రేమాయణం! నాగ చైతన్య - శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.  సమంతతో విడాకులు స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 'ఏం మాయ చేశావే' (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్‌ కపుల్‌ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp; సమంత కంటే చాలా బోల్డ్! ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అలాగే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం వంటి అనేక కారణాలూ వినిపించాయి. అయితే, ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.&nbsp; ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్‌పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 08 , 2024
    <strong>Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?</strong>
    Mokshagna Teja: అఖండ సీక్వెల్‌లో మోక్షజ్ఞ, పవర్‌ ఫుల్ రోల్ రాసిన బోయపాటి?
    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడ్ని తెరపై చూడాలని ఆరాటపడుపతున్నారు. మోక్షజ్ఞ తెరంగేట్రం విషయాన్ని ఈ మధ్య బాలయ్య సైతం కన్ఫార్మ్‌ చేయడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ పెరిగింది. రీసెంట్‌గా మోక్షజ్ఞ స్టైలిష్‌, హ్యాండ్సమ్ ఫొటోలు బయటకురాగా తమ అప్‌కమింగ్‌ హీరో మేకోవర్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది విన్న నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య సినిమాతో ఎంట్రీ? నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. వీరి కాంబోలో గతంలో వచ్చి బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న 'అఖండ' (Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో మోక్షజ్ఞ ఓ స్పెషల్‌ రోల్‌ చేయనున్నాడు. మోక్షజ్ఞ కోసం దర్శకుడు బోయపాటి ఓ రోల్‌ రాశారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సెకండాఫ్‌లో అతడి ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞపై టెస్ట్‌ షూట్‌ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తన తండ్రి బాలయ్య సినిమాతోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేసే అవకాశముంది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.&nbsp; హనుమాన్‌ దర్శకుడితో! మరోవైపు హీరోగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘హనుమాన్‌’ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా లాక్‌ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్‌ వర్మ, బాలయ్య మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్‌ షోకు దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే నిర్వహించారు. అలా ఆయనతో ప్రశాంత్‌ వర్మకు మంచి బాండింగ్‌ ఏర్పడింది. ఆ రిలేషన్‌తోనే బాలయ్య తన కొడుకు బాధ్యతలను ప్రశాంత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. హ్యాండ్సమ్‌ లుక్‌లో.. నందమూరి మోక్షజ్ఞ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లోకి మారిపోయాడు. హీరో కటౌట్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో క్రేజీ లుక్స్‌తో మోక్షజ్ఞ మెస్మరైజ్‌ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్‌ హీరో మెటీరియల్‌ అని తన న్యూ లుక్‌ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్‌ చిత్రాలను చూసి నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్‌ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందంటూ పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/AKKINENI_9999/status/1808086164647153776 29 ఏళ్లకు తెరంగేట్రం! తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన జూ.ఎన్టీఆర్‌.. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించాడు. తారక్‌ 17 ఏళ్లకే ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. తెలుగులో ఇంత లేటు వయసులో నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న హీరో మోక్షజ్ఞనే కానున్నాడు. నిజానికి బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీరాకృతి మార్చుకునే క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైంది. ఇన్నాళ్లకు హీరో మెటిరియల్‌గా మోక్షజ్ఞ లుక్‌ మారడం.. అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
    జూలై 09 , 2024
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్‌ ఫ్యాన్స్ బేస్‌ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ - బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్‌ ఉంది. గతంలో బాలయ్య - బోయపాటి చేసిన హ్యాట్రిక్‌ చిత్రాలు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. ఇవాళ (జూన్‌ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య కుమార్తె సమర్పణలో.. ఇవాళ (జూన్‌ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది 'NBK 110' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - బోయపాటి అప్‌కమింగ్‌ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. 'లెజెండ్‌' చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. 'NBK110' చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం. షూటింగ్‌ ఎప్పుడంటే? బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్‌ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం.. 'NBK110' చిత్రం ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్‌ బాబీతో కలిసి 'NBK109' చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు.&nbsp; బోయపాటికే సాటి.. ఇండస్ట్రీకి హ్యాట్రిక్‌ విజయాలను అందించిన బాలకృష్ణ - బోయపాటి జర్నీ.. 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్‌', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్‌ కావడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.&nbsp; 'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 10 , 2024
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో మరో బ్లాక్ బాస్టర్ చిత్రం టిల్లు స్కేర్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), క్యూట్ గల్ అనుపమ పరమేశ్వరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. నాగ్ అశ్వీన్ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ డెరెక్ట్ చేసిన టిల్లు స్కేర్ చిత్రానికి మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్‌కి సంబంధించి క్రేజీ బజ్ తెలిసింది. టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా? డీజే టిల్లు నుంచి 'టిల్లు స్కేర్' సీక్వేల్‌గా వచ్చింది. మరి టిల్లు స్కేర్ నుంచి మరో సీక్వేల్ వస్తే బాగుంటుందని ఈ సినిమా హిట్ తర్వాత అభిమానులు అనుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ బజ్ ఉండగా.. సినిమా విడుదల తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఇదే విషయంపై మేకర్స్ టిల్లు స్క్వేర్‌ విడుదల తర్వాత స్పష్టత ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వ లేదు. దీంతో మరో సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. అయితే ప్రేక్షకుల మదిలో ఎక్కడో ఓ మూలన టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక పోతే ఇబ్బందుల్లో పడుతామని తొలుత మేకర్స్ ఆలోచించారు. ఇదే విషయాన్ని&nbsp; చిత్ర నిర్మాత నాగ్ వంశీ కూడా తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో టిల్లు క్యూబ్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నిజానికి మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సీక్వేల్‌పై ఓ ఐడియా ఇచ్చారు. ఇదే విషయంపై హీరో సిద్ధూ నేను మాట్లాడుకున్నాం. అతి త్వరలోనే&nbsp; చేద్దామని నిర్ణయించుకున్నాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ స్లో మోషన్‌ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తాం. సోమవారం నుంచి ప్రేక్షకులకు అది కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. టిల్లు క్యూబ్ అనౌన్స్ చేయడంలో డీజే టిల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. https://twitter.com/GulteOfficial/status/1773664243654471818?s=20
    మార్చి 30 , 2024

    @2021 KTree