• TFIDB EN
  • సత్యభామ (2024)
    UATelugu
    ఏసీపీ సత్యభామ.. షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఆమెను హసినా అనే బాధితురాలు కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెప్పుకొని వాపోతుంది. ఈ క్రమంలో హసినా.. భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యభామ.. నేరస్థుడిని ఎలా పట్టుకుంది? దర్యాప్తులో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvApp
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?

    ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie Review). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొంద...read more

    How was the movie?

    తారాగణం
    కాజల్ అగర్వాల్
    నవీన్ చంద్రన్
    ప్రకాష్ రాజ్
    నాగినీడు
    హర్ష వర్ధన్
    సిబ్బంది
    సుమన్ చిక్కాలదర్శకుడు
    శశి కిరణ్ టిక్కానిర్మాత
    శ్రీచరణ్ పాకాల
    సంగీతకారుడు
    విష్ణు బేసిసినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్‌ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్‌, శర్వానంద్‌ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్‌ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  మనమే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్‌ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్‌ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ నటుడు శర్వానంద్‌.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  సత్యభామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్‌ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్‌ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్‌ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాజ‌ల్‌ నటనపై ప్రశంసలు కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
    జూన్ 08 , 2024
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    Satyabhama Movie Review: ఖాకీ చొక్కాలో కాజల్‌ అదరగొట్టిందా? ‘సత్యభామ’ టాక్‌ ఏంటి?
    నటీనటులు: కాజల్‌,  నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, తదితరులు రచన, దర్శకత్వం: సుమన్‌ చిక్కాల సంగీతం: శ్రీచరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ: విష్ణు బెసి ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌ నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి విడుదల: 07-06-2024 ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie Review). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. కెరీర్‌లో తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ క్రమంలో జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? పోలీసు ఆఫీసర్‌గా కాజల్‌ ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో అదరగొట్టింది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఇక భర్తగా నవీన్‌ చంద్ర పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ప్ర‌కాశ్‌రాజ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, నాగినీడు న‌టులున్నా వాళ్ల ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించలేదు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించారు. సత్యభామ క్యారెక్టరైజేషన్‌ను బలంగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆధారాల్ని చేజేతులా వదిలేస్తూ.. మళ్లీ వాటి కోసమే అన్వేషించడం కాస్త మైనస్‌గా మారింది. ఇంకాస్త బెటర్‌గా స్క్రీన్‌ప్లేను నడిపించి ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. అయితే సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఒకే. కెమెరా, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం.. యాక్షన్‌ సీక్వెన్స్‌ను, ఉత్కంఠ సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కాజల్‌ నటనకొన్ని ట్విస్టులుపతాక సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్క్రీన్‌ప్లేసెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-interesting-facts-about-kajal-aggarwal.html
    జూన్ 07 , 2024
    దివికేగిన సీనియర్ నటి జమున… అలనాటి ‘సత్యభామ’ గురించి ఆసక్తికరమైన నిజాలు
    దివికేగిన సీనియర్ నటి జమున… అలనాటి ‘సత్యభామ’ గురించి ఆసక్తికరమైన నిజాలు
    ]1968  : ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు              - మిలన్ 1964  : ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు               - మూగ మనసులు 2008  : ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం 2019  : ఆమె సంతోషం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్           అవార్డును అందుకున్నారు.  సాక్షి మీడియా 2019, 2020 జీవితసాఫల్య పురస్కారంఅవార్డులు
    ఫిబ్రవరి 11 , 2023
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    గత శుక్రవారం (జూన్‌ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్‌ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్‌లో వాటి కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.  ‘మనమే’ 3 డేస్‌ కలెక్షన్స్‌ శర్వానంద్‌ లేటెస్ట్ మూవీ 'మనమే'కు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్‌లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్‌ (Gross) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్‌ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి. కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  వీకెండ్‌లో నిరాశ పరిచిన ‘సత్యభామ’ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సత్యభామ'. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 7) విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్‌ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్‌ (Gross) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి. కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 
    జూన్ 10 , 2024
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.  తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.  యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.  ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.  సత్యభామ ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.  రక్షణ స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.  లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  వెపన్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
    జూన్ 03 , 2024
    <strong>KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు</strong>
    KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు
    విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి.&nbsp; కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్&nbsp; పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది. సాంకేతిక విభాగం: ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరగా మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని&nbsp; బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రేటింగ్ : 3.5/5
    నవంబర్ 01 , 2024
    <strong>KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే బ్లాక్‌బాస్టరే!</strong>
    KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే బ్లాక్‌బాస్టరే!
    టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.&nbsp; ట్రైలర్ రిలీజ్‌ కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘క’. తన్వీ రామ్‌ (Tanvi Ram) హీరోయిన్‌. సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న దీనిని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘క ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=n75xEs-9u1I ఇవి గమనించారా? ట్రైలర్ అసాంతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆరంభంలోనే చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిని చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఊరిలో చీకటిపడిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆ ఊరికి పోస్ట్‌ మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్‌ (కిరణ్ అబ్బవరం) సత్యభామతో ప్రేమతో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరించడం ట్రైలర్‌లో చూడవచ్చు. ఆ ఉత్తరంలో ఏముంది? వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికిని పెంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్‌ను చూపించడం ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్‌ అని చెప్పవచ్చు.&nbsp; బ్లాక్‌ బాస్టర్‌ పక్కానా? ‘క’ ట్రైలర్‌పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘క’ పక్కాగా ఆకట్టుకుంటుందని సినీ లవర్స్‌ విశ్వసిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా ట్రైలర్‌లో కనిపించాయని కామెంట్స్ చేస్తున్నారు. సరైన హిట్‌ లేక ఇంతకాలం ఇబ్బంది పడుతూ వస్తోన్న కిరణ్‌ అబ్బవరం ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోగా మారిపోవడం ఖాయమన్న కామెంట్స్‌ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి రహాస్య గోరక్‌ను కిరణ్‌ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కిరణ్‌కు కూడా బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్‌ నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు కిరణ్‌ అబ్బవరం సైతం ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌పైనే అతడి ఫిల్మ్‌ కెరీర్‌ ఆధారపడి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; తొలి ఫిల్మ్‌ హీరోయిన్‌తోనే పెళ్లి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) - రహస్య గోరక్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. తమపై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఈ హీరో- హీరోయిన్లు కొన్ని రోజుల క్రితం పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. https://twitter.com/vamsikaka/status/1826657731585147141
    అక్టోబర్ 25 , 2024
    <strong>Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలియా భట్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వేదాంగ్‌ రైనా, అకాంక్ష రంజన్‌ కపూర్‌, మనోజ్‌ పహ్వా, యువరాజ్‌ విజయన్‌, జసన్ షా, ధీర్‌ హిరా, ఆదిత్య నంద తదితరులు దర్శకత్వం : వాసన్‌ బాల సంగీతం : అచింత్‌ థక్కర్‌ సినిమాటోగ్రఫీ : స్వప్నిల్‌ ఎస్‌. సోనావానే ఎడిటింగ్‌ : ప్రేర్నా సైగల్ నిర్మాతలు : కరణ్‌ జోహార్‌, అలియా భట్‌, షాహీన్‌ భట్‌, అపూర్వ మెహతా విడుదల తేదీ : 11-10-2024 బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్‌ చేసిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్‌ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్‌ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్‌ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్‌ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు వాసన్‌ బాలా జైల్‌ బ్రేక్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్‌ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్‌ రిలేషన్‌ను ఆడియన్స్‌ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్‌ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్‌ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ మూవీని ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; &nbsp;ప్లస్‌ పాయింట్స్‌ అలియా భట్‌ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    Kajal Aggarwal: కాజల్‌కు అరుదైన గుర్తింపు..&nbsp; ఆ అవార్డుతో గట్టి కమ్‌బ్యాక్‌!
    Kajal Aggarwal: కాజల్‌కు అరుదైన గుర్తింపు..&nbsp; ఆ అవార్డుతో గట్టి కమ్‌బ్యాక్‌!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal).. ఇటీవల బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు.. కాజల్‌ నటనపై కూడా ప్రశంసలు కురిశాయి. తాజాగా ఈ చిత్రానికి గాను ‘జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ - JIFF’ (Jaipur International Film Festival)లో కాజల్‌ను ఓ అవార్డు వరించింది. కాజల్‌తో (Kajal Agarwal) పాటు ప్రకాష్‌ (బింబిసారా), అనుపమ్‌ ఖేర్‌ (కార్తికేయ 2), అర్జున్‌ రాంపాల్‌ (భగవంత్‌ కేసరి) సైతం JIFF అవార్డులకు ఎంపికయ్యారు.&nbsp; గత కొంతకాలంగా అవకాశాలు లేక తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్‌ ‘భగవంత్‌ కేసరి’ ద్వారా గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. తాజా అవార్డుతో కాజల్‌ మరోమారు ఇండస్ట్రీలో పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాజల్‌.. 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే కాజల్‌కు తిరుగుండదు. అందుకే కాజల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాగే హిందీలో 'ఉమా', తెలుగులో సత్యభామ అనే రెండు చిత్రాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.&nbsp; ఇదిలా ఉంటే మూడు పదుల వయసులోనూ కాజల్‌ (#KajalAggarwal) యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఆమె ఫిట్‌నెస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు.&nbsp; అయితే తన అందం, ఫిట్‌నెస్‌ వెనకున్న రహాస్యాలను కాజల్‌ పంచుకున్నారు. కొన్ని ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌కు తెలియజేశారు.&nbsp; ప్రతీ రోజు సూర్య నమస్కారాలు&nbsp; చేస్తానని కాజల్‌ అగర్వాల్‌ (#KajalAggarwal) తెలిపింది. వారంలో కనీసం మూడు రోజుల యోగా తప్పనిసరి అని పేర్కొంది. అయితే ప్రతీరోజూ రొటీన్‌గా ఒకే రకమైన వ్యాయమం కాకుండా విభిన్నంగా ట్రై చేస్తుంటానని కాజల్‌ తెలిపింది. మధ్య మధ్యలో స్విమ్మింగ్‌ కూడా చేస్తుంటానని చెప్పుకొచ్చింది. ఇక డైట్‌ విషయంలోనూ కాజల్‌ చాలా జాగ్రత్తగా ఉంటుందట. వ్యాయామానికి తగిన ఫుడ్‌ తీసుకుంటూ ఉంటానని గతంలో తెలిపింది.&nbsp; నాన్‌ వెజ్‌ కంటే ఎక్కువగా వెజ్‌కే ఈ బ్యూటీ ప్రాధాన్యం ఇస్తుందట. ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకోవడమే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అని కాజల్‌ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.&nbsp;&nbsp;
    జనవరి 27 , 2024
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
    శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్‌ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp;&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పేరును పోస్టర్‌ ద్వారా మూవీ టీమ్‌ తెలియజేసింది. ప్రభాస్‌ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.&nbsp; కన్నప్ప (Kannappa) మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. NBK109 నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.&nbsp; https://twitter.com/i/status/1766375268804120887 ఓదెల 2 (Odela 2) తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది. షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai) చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ నెట్టింట ట్రెండ్ అవుతోంది.&nbsp; గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వ‌చ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్‌ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu) సుహాస్ హీరోగా ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs Of Godavari) విశ్వక్‌సేన్‌&nbsp; హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి&nbsp; ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా&nbsp; మేకర్స్‌ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.&nbsp; సత్యభామ (Sathyabhama) స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘సత్యభామ’. అఖిల్‌ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది.&nbsp;
    మార్చి 09 , 2024
    కైకాల సత్యనారాయణకు సినీలోకం నివాళి
    కైకాల సత్యనారాయణకు సినీలోకం నివాళి
    ]బ్రహ్మానందం, చిరంజీవి సహా అనేక మంది ప్రముఖులు కైకాల పార్థీవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
    ఫిబ్రవరి 13 , 2023
    తెలుగుతెరపై మర్చిపోలేని కైకాల సత్యనారాయణ పాత్రలు
    తెలుగుతెరపై మర్చిపోలేని కైకాల సత్యనారాయణ పాత్రలు
    ]సత్తిపండుమహేశ్‌ బాబు మురారీ గుర్తుందా. ఇందులో ఆయన తండ్రిగా కైకాల నటించారు. స్క్రీన్‌పైనా &nbsp;తక్కువ సమయం కనిపించినప్పటికీ ఆయన నటన అద్భుతం. చిన్నపిల్లాడిలా కైకాల చెప్పిన డైలాగులు, హాస్యం ఎంతగానో అలరిస్తుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024
    <strong>Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?</strong>
    Zebra Movie Review: ఈసారైనా సత్యదేవ్‌ హిట్‌ కొట్టాడా? ‘జిబ్రా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ్, ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌, జెన్నీఫర్‌, సునీల్‌, సత్య, సత్యరాజ్‌, సురేష్‌ చంద్ర మీనన్‌ తదితరులు దర్శకత్వం : ఈశ్వర్‌ కార్తిక్‌ సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్‌ ఎడిటింగ్‌: అనిల్ క్రిష్‌ నిర్మాతలు: ఎస్‌.ఎన్‌. రెడ్డి, బాల సుందరం, దినేష్‌ సుందరం విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (Daali Dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్‌’ సినిమాను డైరెక్ట్‌ చేసిన ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్‌, అమృత అయ్యంగార్‌ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్‌ క్రైమ్‌ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్‌ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న సత్యదేవ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ (Zebra Movie Review). ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో నటుడు సత్యదేవ్‌ (Satyadev) మరోమారు దుమ్ములేపాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ ఇలా అన్ని కలగలిసిన పాత్రలో సత్యదేవ్‌ అదరగొట్టాడు. సత్యదేవ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించాడు కన్నడ నటుడు డాలి ధనంజయ్‌. ఆది పాత్రలో అతడు జీవించేశాడు. సినిమాలో అత్యంత పవర్‌ఫుల్‌ పాత్ర అతడిదే. కొన్ని సన్నివేశాల్లో సత్యదేవ్‌ను డామినేట్ చేశాడన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రియా భవానీ శంకర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. జెన్నిఫర్‌ తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. సత్య కామెడీ టైమింగ్ మరోమారు ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం సూర్య వర్సెస్‌ ఆది అన్నట్లు సాగిపోవడంతో మిగిలిన పాత్రలు పెద్దగా హైలెట్‌ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ రిలేటెడ్‌ కంటెంట్‌ (Zebra Movie Review)ను తీసుకొని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో అతడి నైపుణ్యం బాగా కనిపిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్‌ను కళ్లకు కట్టే ప్రయత్నంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో బ్యాంక్‌ ఎంప్లాయిగా ఈశ్వర్‌ కార్తిక్‌ పని చేయడం సినిమాకు కలిసివచ్చింది. అయితే సాధారణ బ్యాంక్‌ ఎంప్లాయి అయిన హీరో నాలుగు రోజుల్లో రూ.5 కోట్లను సంపాదించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. రూ.100 కోట్ల సమస్యను సైతం ఒక్క ఈమెయిల్‌తో తప్పించుకోవడం కూడా లాజిక్‌కు అందదు. లాజిక్కులను పట్టించుకోని ప్రేక్షకులకు మాత్రం జిబ్రా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. సత్యదేవ్‌ - డాలీ మధ్య జరిగే ఇంట్రస్టింగ్‌ వార్‌, సత్య కామెడీ, సునీల్‌ నటన, డైలాగ్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Zebra Movie Review) రవి బస్రూర్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పాటలు మాత్రం గుర్తుంచుకునేలా లేవు. సత్య పోన్మార్ కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. బ్యాంక్‌ను పర్ఫెక్ట్‌గా రీక్రియేట్‌ చేసి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి మార్కులు కొట్టేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేసత్యదేవ్‌, ధనంజయ్‌ నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ లాజిక్‌కు అందని సన్నివేశాలుఇరికించినట్లు వచ్చే పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 22 , 2024
    <strong>EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;
    సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్‌ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్‌ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? [toc] సత్యరాజ్ (బాహుబలి) బాహుబలిలో ప్రభాస్‌, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు. ప్రకాష్‌ రాజ్‌ (అతడు) మహేష్‌ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్‌ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR సుకుమారి (మురారి) మహేష్‌ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్‌ నటి మెప్పించింది. మహేష్‌ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.&nbsp; https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18 శ్రీకాంత్‌ (శంకర్‌దాదా MBBS) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్‌ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లోనూ శ్రీకాంత్‌ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు. https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3 రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు) డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.&nbsp; https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0 శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) సిద్ధార్థ్‌ - త్రిష జంటగా డ్యాన్స్‌ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయి.&nbsp; https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd గొల్లపూడి మారుతిరావు (లీడర్‌) దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్‌’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్‌ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్‌ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y అభినవ్‌ గోమఠం (ఈ నగరానికి ఏమైంది) తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్‌ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.&nbsp; https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ - ఆర్తి అగర్వాల్‌ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్‌ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్‌ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
    అక్టోబర్ 22 , 2024
    Baahubali: Crown of Blood Review: ఓటీటీలోకి బాహుబలి యానిమేషన్‌ సిరీస్‌.. హిట్టా? ఫట్టా?
    Baahubali: Crown of Blood Review: ఓటీటీలోకి బాహుబలి యానిమేషన్‌ సిరీస్‌.. హిట్టా? ఫట్టా?
    దర్శకులు : జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ సంగీతం: కాలభైరవ ఎడిటింగ్: తరుణ్ ప్రసాద్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ రాజమౌళి, జీవన్ జే. కాంగ్, శరద్ దేవరాజన్, షేక్ మక్బూల్ విడుదల తేదీ: 17 మే, 2024 ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌ భారత చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'బాహుబలి' (Bahubali). ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, నాజర్‌ కీలకపాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలు బాక్సాఫీస్‌ వద్ద కోట్లు వసూళ్లు చేశాయి.&nbsp; దీంతో మూడో పార్ట్‌పై సినీప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాహుబలి యానిమేషన్‌ వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఇది ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మెుత్తం 9 ఎపిసోడ్స్‌గా అందుబాటులో ఉంది. మరి ఈ యానిమేషన్‌ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? అన్నది కథ. కథేంటి ఈ సిరీస్‌ కథాంశం బాహుబలి (Baahubali: Crown of Blood Review) చనిపోవడానికి ముందు జరుగుతుంటుంది. మహా క్రూరుడైన రక్తదేవ్‌.. మాహిష్మతి సామ్రాజ్యం చుట్టు పక్కల రాజ్యాలపై దండేత్తి ఆక్రమించుకుంటాడు. తర్వాత అతడి కన్ను మాహిష్మతిపై పడుతుంది. దానిని కూడా ఎలాగైన సొంతం చేసుకోవాలని భావిస్తాడు. దీంతో అతడ్ని అడ్డుకునేందుకు బాహుబలి, భల్లాలదేవ రంగంలోకి దిగుతారు. అయితే అనూహ్యంగా కట్టప్ప రక్తదేవ్‌ కోసం పనిచేయడం మెుదలు పెడతాడు. అసలు రక్తదేవ్‌ ఎవరు? కట్టప్ప అతడి కోసం ఎందుకు పని చేశాడు? రక్తదేవ్‌ వల్ల మాహిష్మతికి వాటిల్లిన ముప్పు ఏంటి? బాహుబలి, భల్లాల తమ రాజ్యాన్ని కాపాడుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే.&nbsp; ఎలా ఉందంటే? 'బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్‌' సిరీస్‌లో గ్రాఫిక్ వర్క్స్‌, యుద్ద సన్నివేశాలు, కొన్ని పాత్రలు, ట్విస్టులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా విలన్‌ రక్తదేవ్‌ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారు. అతడ్ని ప్రెజెంట్‌ చేసిన విధానమూ బాగుంది. జక్కన్న సినిమాల్లో విలన్‌ ఎంత క్రూరంగా ఉంటాడో అదే మార్క్‌ను రక్తదేవ్‌ పాత్రలోనూ చూపించే ప్రయత్నం చేశారు. ఇక రక్తదేవ్‌కు కట్టప్ప సహాయం చేయడం అనేది సిరీస్‌లో కీలకమైన ఆసక్తికర అంశంగా ఉంది. ఈ యానిమేషన్‌ సిరీస్‌లో డిఫరెంట్‌ ఆయుధాలను చూపించారు. అయితే బాహుబలి స్థాయిలో ఈ యానిమేషన్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోదు. బాహుబలి పాత్ర తాలుకూ ప్రభాస్‌ యానిమేషన్‌ వెర్షన్‌ అభిమానులకు అంతగా రుచించదు. తెలుగు డబ్బింగ్‌ కూడా సెట్‌ కాలేదు. ఇతర పాత్రలకు సంబంధించిన డబ్బింగ్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. అయితే చివరి నాలుగు ఎపిసోడ్స్‌ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Baahubali: Crown of Blood Review).. నేపథ్య సంగీతం పర్వాలేదు. కీరవాణి రేంజ్‌లో మాత్రం లేదు. ఎడిటింగ్‌ బాగానే ఉంది. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్‌ చక్కటి పనితీరు కనబరిచింది. బాహుబలి పాత్ర మినహా మిగత పాత్రల తాలుకూ యానిమేషన్‌ బాగుంది. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగ్గట్టు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేయానిమేషన్‌ వర్క్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్ పాయింట్స్‌ తెలుగు డబ్బింగ్‌కొరవడిన ఎమోషన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    Tollywood Top Experimental Movies: తెలుగులో తప్పక చూడాల్సిన ప్రయోగాత్మక చిత్రాలు.. చూస్తే థ్రిల్‌ అవుతారు!&nbsp;&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్‌హిట్స్‌గా నిలిస్తే మరికొన్ని పరాజయాలను చవిచూశాయి. అయితే కొన్ని చిత్రాలు (Telugu Experimental Movies With Unique Concept) మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాయి. రొటిన్‌ చిత్రాలకు అలవాటు పడిన ఆడియన్స్‌కు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. సరైన కంటెంట్‌తో వస్తే ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జంబ లకిడి పంబ (Jamba lakidi Pamba) తెలుగులో ‘జంబ లకిడి పంబ’ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పవచ్చు. మగవారు ఆడవారిగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా క్లిప్స్‌ పెట్టుకొని చూస్తుంటారు ఆడియన్స్‌.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇది తెలుగులో వచ్చిన తొలి టైమ్‌ ట్రావెలింగ్ సినిమా. అప్పటివరకూ హాలీవుడ్‌లోనే ఈ తరహా చిత్రాలు వచ్చాయి. అయితే మన పరిస్థితులకు అనుగుణంగా డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు కథను రాసుకున్నారు. టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్‌తో శ్రీకృష్ణ దేవరాయల కాలానికి కథను ముడిపెట్టి మంచి ఫలితాలను రాబట్టాడు.&nbsp; నాని (Nani) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.జె. సూర్య (S.J. Surya) దర్శకత్వంలో వచ్చిన నాని (2004) చిత్రం.. విభిన్నమైన కథాంశంతో రూపొందింది. ఓ బాలుడు సైంటిస్ట్‌ ద్వారా 28 ఏళ్ల కుర్రాడిగా మారడం.. ఓ కంపెనీలో పనిచేస్తూ ఓనర్‌ కూతుర్నే ప్రేమించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. చివరికి తన తల్లికి దూరమవుతున్నానని భావించి మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోవడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.&nbsp; దశావతరం (Dasavatharam) ఒక హీరో ద్విపాత్రాభినయం (Telugu Experimental Movies With Unique Concept) చేయడం సాధారణం. కొన్ని సినిమాల్లో ముగ్గురిగానూ నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే పది విభిన్నమైన పాత్రలను హీరో ఒక్కడే చేయడం ఒక్క ‘దశవాతరం’ (Kamal Haasan) సినిమాలోనే చూడవచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా చేశారు. ఈ సినిమాను చూసిన వారంతా కమల్ నటనకు ఫిదా అయ్యారు.&nbsp; దొంగల ముఠా (Dongala Mutha) రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'దొంగల ముఠా' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి నటీనటులతో ఐదే రోజుల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చే వరకూ తారాగణం ఒక్క రూపాయి తీసుకోకపోవడం విశేషం. కెనాన్ 5D కెమెరాలతో ఈ చిత్రం రూపొందించడం మరో ప్రత్యేకత.   ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఒక సినిమాకు (Telugu Experimental Movies With Unique Concept) స్టార్‌ హీరోనే అవసరం లేదు.. ఒక చిన్న ఈగతో కూడా ఘన విజయం సాధించొచ్చని ఈ సినిమా ద్వారా రాజమౌళి నిరూపించారు. హాలీవుడ్‌ స్థాయి టెక్నిషియన్లను వినియోగించుకొని అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌ను అందించారు.&nbsp; మిథునం (Mithunam) పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల ‘మిథునం’ కథకు నటుడు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ సినిమా. ఈ మూవీ మెుత్తం కేవలం రెండు పాత్రలే కనిపిస్తాయి. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు తమ శేష జీవితాన్ని ఎలా గడిపారు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ‘ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా’ ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు సైతం నామినేట్ కావడం విశేషం.&nbsp; అనుకోకుండా ఒక రోజు (Anukokunda Oka Roju) 2005లో వచ్చిన ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతో రూపొందింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలుకోవడానికి ప్రయత్నిస్తుంటే సహస్రపై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. మూఢనమ్మకాలకు సహస్రపై జరుగుతున్న దాడులకు సంబంధం ఏంటన్నది కథ. ఈ సినిమా ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.&nbsp; అ! (Awe!) టాలీవుడ్‌లో ఈ తరహా సినిమా ఇప్పటివరకూ రాలేదు. హనుమాన్‌ (Hanu Man) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.&nbsp; మనం (Manam) అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మనం’. పునర్జన్మలు - ప్రేమలకు ముడిపెడుతూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కథ కొత్తగా ఉండటంతో పాటు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలలో మునిగి తేలేలా చేస్తుంది.&nbsp; ఒక్కడున్నాడు (Okkadunnadu) గోపిచంద్‌ హీరోగా&nbsp; చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం కూడా వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఓ మాఫియా డాన్‌కు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడం.. హీరో గుండె అతడికి సరిగ్గా సరిపోలడం జరుగుతుంది. దీంతో విలన్లు హీరో వెంట పడుతుంటారు. చివరికీ ఏమైంది అన్నది స్టోరీ. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం మంచి థ్రిల్‌ను అందించింది.&nbsp; గగనం (Gaganam) నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని (Telugu Experimental Movies With Unique Concept) దర్శకుడు రాధా మోహన్‌ తెరకెక్కించారు. విమానం హైజాకింగ్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. హాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమైన ఇలాంటి కథను.. తొలిసారి తెలుగులోకి తీసుకొచ్చారు. ఆద్యాంతం ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది.&nbsp;
    మార్చి 20 , 2024
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    Gopichand Bhimaa Review: యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో గోపిచంద్‌ శివతాండవం.. ‘భీమా’ మూవీ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : గోపిచంద్‌, ప్రియా భవాని శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెకల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముఖేష్‌ తివారి, పూర్మ, రోహిణి, సరయూ, చమ్మక్‌ చంద్ర తదితరులు&nbsp; దర్శకుడు : ఎ. హర్ష సంగీతం : రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ నిర్మాణ సంస్థ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాత : కె. కె. రాధామోహన్‌ మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ (Bhimaa). కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్‌కు ‘భీమా’ ఊరట కలిగించిందా? పోలీసు పాత్రలో గోపిచంద్‌ మెప్పించాడా? లేదా? కథ భీమా కథ పరుశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిని పోలీసు అధికారి భీమా (గోపిచంద్‌) ఎలా ఛేదించాడు? అతడికి పరుశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌ ఎలా ఉన్నాయి? ప్రియా భవానీతో గోపిచంద్‌ లవ్‌ ట్రాక్‌ ఎలా మెుదలైంది? అన్నది కథ. ఎవరేలా చేశారంటే ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీగా తెరకెక్కిన భీమా సినిమాలో.. హీరో గోపిచంద్‌ అదరగొట్టాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. చాలా రోజుల త‌ర్వాత గోపీచంద్ క‌టౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని చెప్పవచ్చు. ఇందులో డ్యూయల్‌ రోల్స్‌లో గోపిచంద్‌ కనిపిస్తాడు. పాత్రకు తగ్గ వేరియేషన్స్‌తో మిస్మరైజ్‌ చేశాడు. ఇక హీరోయిన్లు ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ ఇద్ద‌రి రోల్స్‌కు ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ప్రియా భవాని, గోపిచంద్‌ మధ్య కెమెస్ట్రీ తెరపై ఆకట్టుకుంటుంది. నరేష్‌, వెన్నెల కిషోర్‌, చమ్మక్‌ చంద్ర పాత్రలు నవ్వులు పూయిస్తాయి. నాజర్‌, ముఖేష్‌ తివారి, రోహిణి తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే భీమా చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ. హర్ష..&nbsp; డైరక్టరే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. ‘భీమా’ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు.. రెండు సాంగ్స్‌కి కొరియోగ్రఫీ కూడా అందించారు. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష.. గోపీచంద్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడంలో సెక్సెస్ అయ్యారు. ప‌ర‌శురామ క్షేత్రం చుట్టూ అల్లుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌‌తో పాటు మరో సర్‌ప్రైజింగ్ రోల్‌తో గోపీచంద్‌లోని నట విశ్వరూపాన్ని డైరెక్టర్‌ బయటపెట్టారు. ప్రతీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను గూస్‌బంప్స్‌ వచ్చేలా తెరకెక్కించారు. అటు ఎఫ్ఎక్స్‌ విభాగం నుంచి కూడా మంచి ఔట్‌పుట్‌ను రాబట్టడంలో డైరెక్టర్ హర్ష విజయం సాధించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే సెకండాఫ్‌ కాస్త రొటీన్‌గా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. రవి బస్రూర్‌ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. స్వామి జె. గౌడ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ సాగదీత సీన్లుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024

    @2021 KTree