రివ్యూస్
How was the movie?
తారాగణం
భరత్ తిప్పిరెడ్డి
ధన్య బాలకృష్ణ
కేశవ కర్రి
మానస్ అద్వైత్
రాజశేఖర్ నర్జాల
విశ్వనాథ్ మాండలిక
యష్
సిబ్బంది
కార్తీక్ సాయిదర్శకుడు
అనిల్ పల్లానిర్మాత
శశాంక్ ఆలమూరుసంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది!
నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్ పచౌరి, ప్రణవ్ మిశ్రా, విజయ్ కృష్ణ
దర్శకత్వం: సుదీప్తోసేన్
సంగీతం: వీరేష్ శ్రీవాల్స
నిర్మాణ సంస్థ: సన్‌షైన్ పిక్చర్స్
‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్ ఉందా? ది కేరళ స్టోరీ హిట్ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటి:
షాలిని ఉన్ని క్రిష్ణన్ (ఆదాశర్మ) నర్స్ అవ్వాలన్న కోరికతో నర్సింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే:
‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
సాంకేతికంగా:
దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
ఆదాశర్మ నటనడైరక్షన్ స్కిల్స్నేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హింసాత్మక సన్నివేశాలుబోల్డ్ సీన్స్
రేటింగ్: 3/5
మే 05 , 2023
Controversial Movies: విడుదలకు ముందే విమర్శలు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్లు..!
సినిమాలను అమితంగా ఇష్టపడే దేశంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఏటా వందల చిత్రాలు రిలీజవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ప్రతీ మనిషి జీవితంలో సినిమాలు ఓ భాగం కావడంతో అవి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదస్పదంగా మారుతున్నాయి. ఆ చిత్రాలను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే పుట్టుకొచ్చాయి. భారత్‌లో తీవ్ర వివాదానికి కారణమైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ది కేరళ స్టోరీ
భారత్‌లో విడుదలకు ముందే తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న సినిమా ‘కేరళ స్టోరీ’. కేరళలో గత కొన్నేళ్లలో అదృశ్యమైన 32 వేల మంది మహిళలు ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. దీనిపై కేరళ సీఎం సహా, ప్రతిపక్ష కాంగ్రెస్, ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సమాజంలో అల్లర్లు సృష్టించేలా ఈ సినిమా ఉందంటూ ఆరోపించాయి. వీటన్నింటిని దాటుకొని రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆదా శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Image Credit: wikipedia/commons
ఫర్హానా
నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన 'ఫర్హానా' సినిమాపై కూడా వివాదం చెలరేగింది. ముస్లింల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా డైలాగ్‌లు ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. వివాదం మరింత ముదురుతుండటంతో మేకర్స్ స్పందించారు. ఈ సినిమా ఏ మతం సెంటిమెంట్‌లకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మే 12న రిలీజైన ఫర్హానా చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
Image Credit: wikipedia/commons
ది కాశ్మీర్ ఫైల్స్
2022లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణమైంది. కశ్మీరీ పండిట్లను మిలిటెంట్లు ఏ విధంగా హింసించి చంపారో అన్న అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ ప్రదర్శనలకు పన్ను రాయితీలు సైతం ఇచ్చాయి. అయితే, ది కాశ్మీర్ ఫైల్స్‌లో వాస్తవాలను వక్రీకరించి చూపించారంటూ కాంగ్రెస్ మండిపడింది.
Image Credit: wikipedia/commons
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ పైనా విడుదలకు ముందు వివాదం చెలరేగింది. చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. కాషాయ రంగు బికినిపై హిందూ - ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం దీపిక వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్, వీర్ శివాజీ గ్రూప్‌లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Image Credit: wikipedia/commons
అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాపై కూడా అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి. ఈ మూవీలో అభ్యంతరకర సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ పలువురు ప్రజా సంఘ నేతలు సినిమా పోస్టర్లను చించేశారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. యాంకర్ అనసూయ సైతం సినిమాలోని అభ్యంతరకర డైలాగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదాలను దాటుకొని అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టింది.
Image Credit: wikipedia/commons
పీకే
బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాపై కూడా 2014లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంస్థలు ధ్వజమెత్తాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని యోగా గురు బాబా రాందేవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముస్లిం సంఘాలు సైతం పీకే సినిమాను తప్పుబట్టాయి. అప్పట్లో ఈ వివాదంపై స్పందించిన అమీర్‌ఖాన్ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. అయితే రిలీజ్ అనంతరం పీకే సూపర్ హిట్‌గా నిలిచింది.
Image Credit: wikipedia/commons
ద ఢిల్లీ ఫైల్స్
కశ్మీర్ ఫైల్స్ చిత్రం తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ద ఢిల్లీ ఫైల్స్’ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ డైరెక్టర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నోటీసులు పంపించారు. ఈ విధంగా ‘ద ఢిల్లీ ఫైల్స్’ చిత్రీకరణకు ముందే హాట్ టాపిక్‌గా మారింది.
మే 19 , 2023
Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్’ ఆ స్థాయిలో ఉందా?
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు
రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
విడుదల తేదీ: 25-10-2024
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రంపై మంచి ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.
ప్లస్ పాయింట్స్
కథప్రధాన తారాగణం నటనసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం.
[toc]
Eesha Rebba
తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు.
Tatoo images
యుక్తిత రేజా
రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది.
నిహారిక కొణిదెల
మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.
https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh
గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది.
సంయుక్త మీనన్
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది.
అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs
తృప్తి డిమ్రి టాటూస్
న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు.
సమంత టాటూస్
సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది.
మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని.
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
శృతి హాసన్ టాటూస్
అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.
https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh
రాశి ఖన్నా టాటూస్
గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.
అనసూయ భరద్వాజ్ టాటూస్
అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం.
ఫరియా అబ్దుల్లా టాటూస్
పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం.
View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)
అనన్య నాగళ్ల టాటూ
గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.
View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
మమతా మోహన్ దాస్ టాటూ
ఒకప్పుడూ టాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది.
నేహా శర్మ టాటూస్
అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది.
శోభిత దూళిపాళ
శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.
షిర్లి షెటియా
అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది.
View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer)
రుహాని శర్మ
రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
అక్టోబర్ 22 , 2024
The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్ క్లియర్ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం.
వివాదానికి బీజం:
సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.
కేరళ సీఎం ఆగ్రహం
'ది కేరళ స్టోరీ' ట్రైలర్.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.
సినిమాను బ్యాన్ చేయాలి
‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్ వంటి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.
తమిళనాడు అలెర్ట్
ది కేరళ స్టోరి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ బృందాలు అలెర్ట్ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్ సెల్వన్-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు
‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.
సుప్రీంకోర్టు స్పందన
‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాల్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది.
మే 03 , 2023
Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా తనగురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను చాలా ఫన్నీగా చెప్పింది. అవేంటో మీరు ఓసారి చూసేయండి.
View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)
గూగుల్: అనన్య పాండేకు టాటూ ఉందా?
అనన్య పాండే: నాకు ఎలాంటి టాటూ లేదు. కానీ ఒక టాటూ అయితే వేయించుకోవాలని ఉంది. ఓసారి టాటూ కోసం డబ్బులు కూడా చెల్లించాను. కానీ అక్కడి వెళ్లి టాటూ వేయించుకోవాలంటే భయమేసింది. నాకు ఎలాంటి టాటూ బాగుంటుందో ఐడియాస్ ఇవ్వండి.
గూగుల్: అనన్య పాండే దగ్గర డాగ్స్ ఉన్నాయా?
అనన్య పాండే: అవును, నా దగ్గర రెండు శునకాలు ఉన్నాయి. ఒకటి గొల్డెన్ రిట్రివర్ జాతికి చెందినది, మరొకటి మల్టిపుల్ కాల్ రైట్
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ లిప్స్‌టిక్ ఏది?
అనన్య పాండే: నాకు లాక్మీకి చెందిన Blushing Bae లిప్స్‌టిక్ అంటే చాలా ఇష్టం. ఇందులోని ప్రెటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి.
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ సాంగ్ ఏది?
అనన్య పాండే: నాకు మిల్లి సైరస్( Miley Cyrus) పాడిన ఫ్లవర్స్ సాంగ్ అంటే చాలా ఇష్టం. అది వింటున్నప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇక అనన్య పాండే విద్యభ్యాసమంతా ముంబైలో జరిగింది. ఆమె ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. యూనివర్సిటీ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించింది.
అనన్యకు ట్రావెలింగ్, డ్యాన్సింగ్, పార్టీయింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతుంది.
బాలీవుడ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, సుహానా ఖాన్
అనన్య తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. 30 ఏళ్ల సినీ జీవితంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. తల్లి భావన పాండే.. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. అనన్య తాత శరద్ పాండేకు దేశంలోనే ప్రముఖ హార్ట్ సర్జన్‌గా పేరుంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 చిత్రం ద్వారా అనన్య పాండే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
సినిమాల్లోకి రాకముందు అనన్య పాండే మోడలింగ్ చేసింది. లాక్మీతో పాటు మరికోన్ని వాణిజ్య ప్రకటనల్లో ఆమె నటించింది.
ఇక తెలుగులో లైగర్ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకుంది.
లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అక్టోబర్ 30 , 2024
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్‌సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
‘కేరాఫ్ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
బూట్‌కట్ బాలరాజు
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ధీర
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్ హీరోగా నటించిన లక్ష్ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.
హ్యాపీ ఎండింగ్
యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా కౌశిక్ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’ (Happy Ending). యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
మిస్ పర్ఫెక్ట్
మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect). బిగ్‌బాస్ విజేత అభిజీత్ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్ ఖండేరావ్ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.
సైంధవ్
వెంకటేశ్ లేటెస్ట్ చిత్రం 'సైంధవ్' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. & Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
జనవరి 29 , 2024
Ambajipeta Marriage Band Review: కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సుహాస్ చిత్రం.. హ్యాట్రిక్ కొట్టినట్లేనా?
నటీనటులు: సుహాస్, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న, శరణ్య ప్రదీప్ తదితరులు
రచన, దర్శకత్వం: దుష్యంత్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, బన్నీవాస్, వెంకటేశ్ మహా (సమర్పణ)
విడుదల: 02-02-2024
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు సుహాస్ (Suhas).. అనతికాలంలోనే టాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగాడు. ‘కలర్‌ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band Review). జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగస్వామి కావడంతో పాటు ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి చిత్రం ఎలా ఉంది? సుహాస్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మల్లి (సుహాస్) ఓ సభ్యుడు. చిరతపల్లిలో తన కుటుంబంతో నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఓ పుకారు మొదలవుతుంది. ఓ కారణం చేత వెంకట్‌బాబు - మల్లికీ మధ్య వైరం మొదలవుతుంది. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? లక్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అది చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో పాత్రలు తప్ప (Ambajipeta Marriage Band) నటీనటులు ఎక్కడా కనిపించరు. ప్రతీ ఒక్క నటుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు. మల్లి పాత్రలో సుహాస్ అదరగొట్టాడు. ప్రథమార్ధంలో అబ్బాస్ హెయిర్ స్టైల్‌తో నవ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో కనిపిస్తూ ఎంతో సహజంగా నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో అతడి నటన మనసుల్ని హత్తుకుంటుంది. ఇక హీరోయిన్ శివానీ నాగారం.. లక్ష్మి పాత్రకి 100 శాతం న్యాయం చేసింది. సుహాస్ అక్కగా చేసిన శరణ్య ప్రదీప్ సినిమాకి మరో హీరో అని చెప్పవచ్చు. ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు సినిమాకే హైలైట్. నితిన్, వినయ మహాదేవ్, హీరోకి స్నేహితుడిగా కనిపించే జగదీష్ బండారి పాత్రలు ఆకట్టుకుంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డబ్బు, కులం వ్యాత్యాసం కలిగిన ప్రేమ కథలు, రివేంజ్ డ్రామాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా అదే కోవకి చెందిందే. కానీ, డైరెక్టర్ దుష్యంత్ (Ambajipeta Marriage Band Review) కథకు అక్క-తమ్ముడి ఎమోషన్స్, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌ను జోడించి కొత్తదనం తీసుకువచ్చారు. కులాల మధ్య అంతరాల్ని, ఆర్థిక అసమానతల్నీ సహజంగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను కథకు కనెక్ట్ చేశాడు. ప్రథమార్థాన్ని అందమైన ప్రేమ కథ, సరదా సరదా సన్నివేశాలు చుట్టూ తిప్పిన దర్శకుడు.. విరామం ముందు వచ్చే సన్నివేశంతో సినిమాను కీలక మలుపు తిరిగేలా చేశారు. ద్వితియార్థంలో అత్మాభిమానాన్నే ప్రధాన అంశంగా తీసుకొని తనదైన శైలిలో కొత్త రివేంజ్ డ్రామాను ఆవిష్కరించారు. కథ ఊహకు తగ్గట్టే సాగుతున్నా.. బలమైన సన్నివేశాలు, డ్రామాతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఓవరాల్‌గా డైరెక్టర్ దుష్యంత్ పనితనం మెప్పిస్తుంది.
సాంకేతికంగా..
సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం, వాజిద్ బేగ్ తన కెమెరాతో చిరతపల్లిని ఆవిష్కరించిన తీరు సినిమాకి ప్రధానబలం. ఎడిటింగ్, బలమైన రచన సినిమా గమనాన్నే మార్చేశాయి. మేకింగ్ పరంగానూ ఎంతో పరిణతి కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
ప్లస్ పాయింట్స్
సుహాస్, శరణ్య నటనకథ, నేపథ్యంభావోద్వేగ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ బోరింగ్ సీన్లు
రేటింగ్: 3.5/5
ఓటీటీ వేదిక లాక్!
ఇక ఈ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్నర్‌ను కూడా లాక్ చేసుకుంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ఆహా (Aha) ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించున్నట్లు కన్‌ఫార్మ్ అయ్యింది. దీంతో థియేటర్స్‌లో రన్ అనంతరం ఈ సినిమా ఆహాలోనే అందుబాటులోకి రానుంది.
ఫిబ్రవరి 02 , 2024
Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు
యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే యాడ్స్‌కు సైతం సమయాన్ని కేటాయిస్తుంటాడు. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్స్ అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్-తమన్నా కలిసి ఓ కొత్త యాడ్ చేశారు. ఇందులో వీరి పెయిర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ లుక్కేయండి.
క్యూట్ కపుల్స్‌గా మహేష్-తమన్నా!
మహేష్ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కాంబోలో గతంలో ‘ఆగడు’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైనప్పటికీ వీరి కాంబో బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ ఎలక్ట్రానికి కంపెనీ ‘లాయిడ్’ (LLOYD) తమ ప్రొడక్ట్స్‌కు వారిని బ్రాండ్ అంబాసీడర్లుగా నియమించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘లాయిడ్ నొవాంటే’ (Lloyd Novante) అనే అత్యాధునిక వాషింగ్ మిషన్ (LLOYD Washing Machine) యాడ్‌లో మహేష్, తమన్నా కలిసి నటించారు. 25 సెకన్ల పాటు సాగిన ఈ ప్రకటనలో వీరిద్దరి పెయిర్ చాలా క్యూట్‌గా అనిపించిదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్‌ను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?app=desktop&v=thhQfEk9ZPs
గతంలోనూ ఇలాగే..
మహేష్ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కలిసి ఓ ప్రకటనలో నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరిద్దరు లాయిడ్ కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో నటించారు. లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ ఎసీ, లాయిడ్ ఏసీ తదితర ప్రకటనల్లో వారు క్యూట్ జంటగా కనిపించారు. అందమైన కపుల్స్‌లాగా కనిపిస్తూ ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ యాడ్స్ వినియోగదారుల్లోకి బాగా దూసుకెళ్లాయి. ఈ స్టార్ నటుల క్రేజ్ దెబ్బకి లాయిడ్ ప్రొడక్ట్స్ సేల్స్ బాగా పెరిగిందన్న ప్రచారం ఉంది.
https://www.youtube.com/watch?v=lWf3C90zBuM&t=6s
https://www.youtube.com/watch?v=scd5zQmuQ_c
ప్రియుడితో దీపావళి సంబరాలు
మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరాణి తాజాగా నిర్వహించిన దీపావళి ఈవెంట్‌కు వీరిద్దరు జంటగా హాజరయ్యారు. ముఖ్యంగా తమన్న పింక్ కలర్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించి అక్కడి వారిని కట్టిపడేసింది. ఎద, నడుము అందాలు చూపిస్తూ ట్రెడిషనల్ పార్టీని సైతం ఎంతో హాట్‌గా మార్చేసింది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తమన్నా-విజయ్ వర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
https://twitter.com/Anamika_upi/status/1850805298019316066
కృష్ణుడిగా మహేష్‌బాబు!
మహేష్ - రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మహేష్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తన మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తోన్న 'దేవకీ నందన వాసుదేవ' చిత్రంలో మహేష్ శ్రీకృష్ణుడి గెటప్‌లో ఓ చిన్న క్యామియో ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖం చూపించకుండా కల్కిలో కృష్ణుడు ఎలా కనిపించాడో అలానే కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను అందించగా శ్రీకృష్ణుడి రోల్‌ను అతడు ఎంతో పవర్‌ఫుల్‌గా రాశాడని టాక్ ఉంది. క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడి ఉగ్రరూపం షాట్ కూడా ఉంటుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/RajivAluri/status/1850877605630599469
అక్టోబర్ 28 , 2024
Big Boss Ashwini Sree: అరెబియన్ గుర్రం లాంటి అశ్వినీ శ్రీ అందాలు.. ఇంతకు ఈమె ఎవరో తెలిస్తే షాకవుతారు!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా- ఫుల్టా ట్విస్ట్‌లతో రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ఆరోవారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అశ్వినీ శ్రీ బిగ్‌బాస్ హౌస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.
నామినేషన్ల నుంచి టాస్క్‌ల వరకు తనదైన మాటతీరు బిహేవియర్‌తో ఆటను రక్తికట్టిస్తోంది. దీంతో సహజంగానే ప్రేక్షకుల్లో అశ్వినీ శ్రీ ఎవరు అనే విషయంపై ఆసక్తి మొదలైంది.
అశ్వీని శ్రీ గురించి నెటిజన్లు ఇంటర్నెట్‌లో భారీగా సెర్చ్ చేస్తన్నారు. ఆమె వయసు, చదువు, కెరీర్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాలపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకు ఈ అందాల అశ్వినీ శ్రీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డు ద్వారా భోలే షవాలీ, పూజామూర్తి, నయనీ పావనీ, అంబటి అర్జున్‌తో సహా అశ్వినీ శ్రీ ఎంట్రీ ఇచ్చింది.
హైదరాబాద్‌లో జన్మించిన అశ్వినీ శ్రీ.. చదువులో దిట్ట. ప్రతిష్టాత్మక వరంగల్ ఎన్‌ఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ అభ్యసించింది.
అంతటి మంచి కాలేజీలో చదివిన ఈ ముద్దుగుమ్మ ఏ సాప్ట్‌వేర్ జాబో మరేదో చేయకుండా మోడలింగ్, నటన వైపు అడుగు పెట్టింది.
తన పెరెంట్స్‌కు తాను సినీరంగం వైపు వెళ్లడం ఇష్టం లేకున్నా తాను మాత్రం అదే రూట్‌లో ప్రయాణించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటూ ఇన్‌స్టా వీడియోలు, రీల్స్‌తో ఆకట్టుకుంటూ ఉండేది
అప్పుడప్పుడూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రకారు దృష్టిలో పడుతుండేది. దీంతో భారీగా ఇన్‌స్టా ఫాలోవర్లను అయితే సంపాదించింది.
తన అందానికి తగ్గట్టే ఇన్‌స్టాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్‌ను స్టేటస్‌గా పెట్టుకుంది. నన్ను సరిగా ట్రీట్ చేస్తే... డబుల్ ఫేవర్ చేస్తాను.. ఇట్లు అరేబియన్ గుర్రం అంటూ తనేంటో ఒక్కమాటలో చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా కొంత మంది కళాకారులు అందమైన అమ్మాయిల అందాన్ని అరేబియన్ గుర్రంతో పోలుస్తుంటారు. అయితే తాను కూడా అంతటి అందగత్తెను అని చెప్పకనే చెప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక అశ్వినీ శ్రీ సినిమా కెరీర్ పరంగా చూస్తే తాను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ... పెద్దగా గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి.
బీటెక్ బాబులు, అమీర్ పేటలో వంటి సినిమాల్లో నటించింది. ఇక పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యూజిక్ షోల్లో స్టేజ్ అప్పియరెన్స్ మాత్రం ఇచ్చింది.
అయితేనేం... తన అందచందాలతో కుర్రాళ్ల కామెంట్లలో ఎప్పుడూ అశ్వినీ శ్రీ నలుగుతూనే ఉంటుంది.
ఇక ఇన్‌స్టాలో తాను పెట్టిన ఫోటోల గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. చీరకట్టినా, సింగిల్ పీస్ డ్రెస్ వేసినా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈ గుమ్మ సొంతం.
హాట్ క్లివేజ్ అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పుడూ హుషారెత్తిస్తునే ఉంటుంది ఈ అరెబియన్ గుర్రం
ప్రస్తుతం తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చుకునేందుకు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది.. అశ్వినీ శ్రీ.
మరి బిగ్‌బాస్ హౌస్‌లో ఈ హాట్ డాల్ ఎంతవరకు నెగ్గుకొస్తోందో వేచి చూడాలి. ప్రతి వీక్ నామినేట్ అవుతున్న అశ్వినీ శ్రీ భారీగానే ఓట్లు సాధిస్తూ సేవ్ అవుతూ వస్తోంది.
అక్టోబర్ 25 , 2023
RGV Heroines List: శ్రీదేవి To ఆరాధ్య దేవి.. ఆర్జీవీ చేతిలో పడి స్టార్లుగా మారిన హీరోయిన్లు వీరే!
భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ అనగానే ముందుగా అందరికీ ‘రామ్ గోపాల్ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆరాధ్య దేవి (Aaradhya Devi)
ఆర్జీవీ అప్‌కమింగ్ చిత్రం 'చీర'లో శ్రీలక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Aaradhya Devi Hot images gallery
ఇర్రా మోర్ (Irra Mor)
ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు 'భైరవ గీత', ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)
హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'రౌడీ' సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది.
Shanvi Srivastava Hot images gallery
పూజా భలేకర్ (Pooja Bhalekar)
హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్ అందాలను ఆర్జీవీ క్యాప్చర్ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ హాట్ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.
Pooja Bhalekar Bikini images gallery
నైనా గంగూలి (Naina Ganguly)
ఆర్జీవీ టాలెంటెడ్ హీరోయిన్లతో పాటు బోల్డ్ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్ షో చేసింది.
అప్సర రాణి (Apsara Rani)
ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్ బాంబ్ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ పోస్టులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Apsara Rani Hot images gallery
ఊర్మిళ (Urmila Matondkar)
ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్’, ‘జంగిల్’, ‘దావుద్’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్, అందమైన హీరోయిన్ ఉంటే సినిమాను సక్సెస్ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.
అక్కినేని అమల (Akkineni Amala)
స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.
శ్రీదేవి (Sridevi)
రామ్‌గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా', 'క్షణ క్షణం' చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం.
రేవతి (Revathi)
ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్’, ‘అబ్ తక్ ఛాపన్’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మహేశ్వరి (Maheswari)
ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'దెయ్యం' సినిమాలో మహేశ్వరి లీడ్ రోల్‌లో నటించింది. హర్రర్ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేశాయి.
మనీషా కోయిరాలా (Manisha Koirala)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్ హిట్ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్ రిటర్న్స్’, ‘దర్వాజ బంద్’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.
సుస్మితా సేన్ (Sushmita Sen)
ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'AAG' లోనూ సుస్మితా సేన్ మెరిసింది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)
ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన 'సర్కార్ రాజ్' అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌త
https://telugu.yousay.tv/heroines-launched-by-ram-gopal-varma.html
ఏప్రిల్ 24 , 2024
LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు
బడ్డీ
చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.
శివం భజే
యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది.
ఉషా పరిణయం
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.
తిరగబడర సామి
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలనాటి రామచంద్రుడు
కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు
ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్, డ్యూన్ పార్ట్ 2, కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి.
PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
జూలై 29 , 2024
Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
ఒకప్పుడు యాడ్స్ అంటే బాలీవుడ్ నటులే గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడలా లేదు. ఏ యాడ్ చూసినా టాలీవుడ్ హీరోలే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి లోకల్ ప్రొడక్టు వరకు ప్రతీ ప్రచారానికి తెలుగు హీరోలే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేస్తున్న ప్రకటనల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో హీరో ఏకంగా నాలుగైదు యాడ్స్ చేస్తుండటం డామినేషన్‌ని తెలియజేస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లలో బిజీబిజీగా గడుపుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా.
అల్లు అర్జున్
పుష్ప సినిమా బన్నీని ఐకాన్ స్టార్‌గా మార్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్‌లలో చేస్తున్నాడు. ఇటీవలే రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. కేఎఫ్‌సి చికెన్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రాల్ స్ట్రాంగ్ పీవీసీ పైప్‌లకూ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. కోకాకోలా కూల్‌డ్రింక్ యాడ్‌లోనూ నటించాడు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కీ అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున కూడా బన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఇలా సినిమాలతో పాటు ప్రకటనలతోనూ బన్నీ బాగానే కమాయిస్తున్నాడు. ఒక్కో ప్రకటనకి అల్లు అర్జున్ రూ.7 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడని టాక్.
View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)
విజయ్ దేవరకొండ
శ్యామ్ స్టీల్ ఇండియాతో విజయ్ చేతులు కలిపాడు. ఈ స్టీల్ గుణగణాలను తెలియజేస్తూ డిజైన్ చేసిన యాడ్‌లో విజయ్ నటించాడు. దీంతో పాటు జైవర్స్ ఫుట్‌వేర్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. లక్స్ కాజి మెన్స్ ఇన్నర్‌వేర్ తరఫున ప్రచార కర్తగా ఉన్నాడు. థమ్స్ అప్(Thumbs Up) యాడ్‌లోనూ విజయ్ దేవరకొండ నటించాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకు తంబ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు విజయ్ ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
మహేశ్ బాబు
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేశ్ బాబు.. యాడ్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఇటీవల మౌంటెన్ డ్యూ అనే సాఫ్ట్‌డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. దీంతో పాటు మహేశ్ బాబు ఎవరెస్ట్ గ్రాండ్ మసాలా యాడ్‌లో నటించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌తోనూ మహేశ్ బాబు అసోసియేట్ అయ్యాడు. మౌంటెన్ డ్యూ యాడ్‌కి మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్.
View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh)
జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలు కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టాయి. రీసెంట్‌గా జూనియర్ మెక్ డొనాల్డ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించాడు. 24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లిషియస్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌కి, ఆప్పీ ఫిజ్ కూల్‌డ్రింక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
View this post on Instagram A post shared by Jr NTR (@jrntr)
రామ్‌చరణ్
రామ్‌చరణ్ పలు ప్రకటనల్లో నటించాడు. గతంలో సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ తరఫున ప్రచారం చేశాడు. ఇటీవల ఫ్రూటీ యాడ్‌లోనూ అలియా భట్‌తో కలిసి చెర్రీ నటించాడు. గతేడాది మీషో బ్రాండ్ తరఫున యాడ్‌లో తళుక్కున మెరిశాడు.
https://www.youtube.com/watch?v=PtNSXvlZVIM
జూన్ 13 , 2023
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం : అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ : రాజు ఎడురోలు
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : నిహారిక కొణిదెల
విడుదల: 09-08-2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యదు వంశీ 90'sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంగోదావరి స్టైల్ కామెడీజాతర సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంద్వితియార్థం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 09 , 2024
Honeymoon Express Review: బోల్డ్ కంటెంట్ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ రివ్యూ!
నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు
డైరెక్టర్ : బాల రాజశేఖరుని
సంగీతం : కల్యాణి మాలిక్
నేపథ్య సంగీతం : ఆర్.పి పట్నాయక్
నిర్మాత : కేకేఆర్, బాలరాజు
విడుదల తేదీ: 21 జూన్, 2024
చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) ఫస్ట్ టైమ్ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్‌కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
ఇషాన్ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్ కపుల్స్ పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్ - సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్‌ను మెప్పిస్తుంది. సీనియర్ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్‌గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన పనిని ఇంకాస్త బెటర్‌గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
చైతన్య రావు, హెబ్బా పటేల్ నటనసమకాలిన అంశాలు ఉండటంసంగీతం
మైనస్ పాయింట్స్
కథనం, స్క్రీన్‌ప్లేసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/en/do-you-know-these-top-secrets-about-hebah-patel.html
జూన్ 21 , 2024
Oh My God 2 Review: సెక్స్‌పై సమాజం దృష్టిని మార్చే ప్రయత్నం.. అక్షయ్ నటించిన OMG 2 ఎలా ఉందంటే?
నటీనటులు: అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, పవన్ మల్హోత్రా, తదితరులు
రచన, దర్శకత్వం: అమిత్ రాయ్
విడుదల తేదీ: ఆగస్టు 11
2012లో వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ వచ్చింది. తొలి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడిగా కనిపించాడు. విభిన్నమైన అంశంతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసింది. మరి, శుక్రవారం(Aug 11) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సగటు ఆడియెన్స్‌ని మెప్పించిందా? ఈ సారి పోరాటంలో ఎవరు గెలిచారు? అని ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
కాంతి శరణ్ ముద్గల్(పంకజ్ త్రిపాఠి) దైవ భక్తుడు. పట్టింపులను పాటించే వ్యక్తి. ఒక రోజు పాఠశాల టాయిలెట్‌లో తన కొడుకు హస్తప్రయోగం(Masturbation) చేసుకుంటాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కాంతి ఫ్యామిలీ మానసికంగా ఎంతో కుంగిపోతుంది. బయటి వారికి ముఖం చూపించలేక పోతుంది. ఈ క్రమంలో వీరిని బయట పడేయడానికి దైవదూత(అక్షయ్ కుమార్) వస్తాడు. జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయ పోరాటం చేయాలని కాంతికి సూచిస్తాడు. ఆ తర్వాత, పాఠశాలతో పాటు మొదట కొడుకు వైపు నిలబడనందుకు తనపై కూడా కేసు వేసుకుని కేసు విచారణ చేస్తుంటాడు. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్‌ని సిలబస్‌గా చేర్చితే తన కొడుక్కి ఈ పరిస్థితి వచ్చుండేది కాదంటూ వాదిస్తాడు. మరి, చివరికి న్యాయం ఎవరు వైపు నిలిచింది? కాంతికి దైవదూత చేసిన సహాయం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/Jagadishroyspr/status/1689888371089510400?s=20
ఎలా ఉంది?
ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం(సెక్స్), సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చర్చించడానికి మొహమాట పడతారు. సరిగ్గా, ఈ వృత్తాంతాన్నే కథాంశంగా చూపించారు. ప్రతి పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ని చేర్చాలని సినిమా ద్వారా చూపించడం బాగుంది. సున్నితమైన అంశం కనుక ఎక్కడా పక్కదారి పట్టకుండా పాయింట్‌పై ఫోకస్ చేస్తూ వినోదభరితంగా చెప్పడం మెచ్చుకోదగిందే. మాస్టర్బేషన్ ఒక నేరం కింద పరిగణించకూడదని చేసే వాదనలు ఆలోచింపజేస్తాయి. సెక్స్ విషయంలో సొసైటీ ఆలోచనా తీరును ఎండగట్టి కాస్త అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. కోర్టు సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టి కథాంశాన్ని చెప్పడం, తర్వాత అక్షయ్ కుమార్ ఎంట్రీతో కథలో కదలిక రావడం చకచకా జరిగిపోతాయి. సెకండాఫ్ తొలి పోర్షన్లలో సినిమా కాస్త డల్‌గా అనిపించినా చివరి 40 నిమిషాల్లో ప్రేక్షకుడి మైండ్ మారిపోతుంది. అయితే, కాంతి వాదనల్లో ద్వంద్వ వైఖరి కనిపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేస్తుంది.
ఎవరెలా చేశారు?
ఇది పూర్తిగా పంకజ్ త్రిపాఠి సినిమా అని చెప్పుకోవాలి. అక్షయ్ కుమార్ పూర్తి లెంగ్త్ ఉన్న అతిథి పాత్రను చేశాడనిపిస్తుంది. సినిమాలో పంకజ్ ఇరగదీశాడు. కోర్టు సీన్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక దైవ దూతగా అక్షయ్ అలరించాడు. తన క్యారెక్టర్ పదును ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. ఇక, అపోనెంట్ లాయర్‌గా యామీ గౌతమ్ బలమైన పోటీ ఇచ్చింది. తన నటనతో మెప్పించింది.
https://twitter.com/Ajju___Bhai/status/1689868294038454273?s=20
టెక్నికల్‌గా
సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడంలో రచయిత, డైరెక్టర్ అమిత్ రాయ్ సఫలమయ్యాడు. చాలా వినోదభరితంగా ఈ సమస్యను లేవనెత్తగలిగాడు. ఆసక్తికర కథనంతో ప్రేక్షకుడిని మెప్పించాడు. ప్రత్యేకంగా ఆలోచింపజేసే డైలాగులను డెలివరీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో పరిపూర్ణ హిందీలో డైలాగ్స్ రాసుకోవడం భాషాభిమానులను మెప్పిస్తుంది. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా లేవనెత్తాడు. ఎక్కడా స్థాయిని దిగజార్చే మాటలు వాడకపోవడం ప్రశంసనీయం.
పాజిటివ్ పాయింట్స్
నటీనటులు
కథ
కామెడీ
రచన
నెగెటివ్ పాయింట్స్
కన్‌ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్
కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 3.25/5
https://www.youtube.com/watch?v=x-KtclLsK7Q
ఆగస్టు 11 , 2023
This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్’ సహా 24 చిత్రాలు!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
వెయ్ దరువెయ్
ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Vey Dharuvey). యషా శివకుమార్ హీరోయిన్. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజాకార్
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.
తంత్ర
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
షరతులు వర్తిస్తాయి!
చైతన్యరావ్, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్ కుమార్, విజయ, కృష్ణకాంత్ సంయుక్తంగా నిర్మించారు.
లైన్‌మ్యాన్
త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
రవికుల రఘురామ
ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది.
లంబసింగి
భరత్ రాజ్ హీరోగా బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్ తన్నీరు నిర్మించారు.
యోధ
సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యోధ’ (Yodha). సాగర్ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్ జోహార్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇతర చిత్రాలు
పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
మార్చి 11 , 2024
Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్ భాస్కర్ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
నిర్మాతలు: కె.వివేక్, సాయికృష్ణ, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్, ఉపేంద్ర వర్మ
సమర్పణ: రానా దగ్గుబాటి
విడుదల: 03-11-2023
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం.
కథ
వాస్తు (చైతన్యరావు), వరదరాజు (బ్రహ్మానందం) తాత మనవళ్లు. లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్ వేస్తారు. తాత కోసం కొన్న శీతల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింకని చూపించి యజమానిని బ్లాక్‌మెయిల్ చేయాలని పన్నాగం పన్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చిన తన అన్న నాయుడు (Tharun bhascker) అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవసరం పడటంతో నాయుడు, జీవన్ కూడా ఓ వ్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? డబ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ ఎలా కలిశారు? తదితర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
సరదా సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం వేగంగా పూర్తవుతుంది. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఎంట్రీతో కథలో మరింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయన చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మరింత సందడిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనల్లో నటిస్తూ హీరోగా గెటప్ శీను చేసే సందడి, వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని సరెండర్ అంటూ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. నాయుడుని అంతం చేయడానికి వచ్చిన షార్ప్ షూటర్స్ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి. బ్రహ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే పరిమితమైనా సందర్భానుసారంగా నవ్విస్తుంది.
ఎవరెలా చేశారంటే?
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నటుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయన కనిపించిన విధానం, నటన, కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధానబలం. బ్రహ్మానందం పాత్ర పరిధి తక్కువే అయినా చివరి వరకూ సినిమాపై ఆయన పాత్ర ప్రభావం కనిపిస్తుంటుంది. హీరో చైతన్యరావు వైకల్యం ఉన్న యువకుడిగా కనిపించాడు. మాటల్ని సరిగ్గా పలకలేని పాత్రలో మంచి నటనని ప్రదర్శించాడు. రాగ్‌మయూర్, జీవన్, విష్ణు, రఘు, రవీంద్ర విజయ్, గెటప్ శీను కీలక పాత్రల్లో కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలు కూడా సినిమాలో నవ్విస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తరుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్రమిది. ఈ కథని నడిపించిన విధానం, రచనలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, మాటలు, పాత్రల హావభావాలతో ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ గత చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. తొలి రెండు సినిమాల్ని వాస్తవికతకి పెద్ద పీట వేస్తూ ఆయన సన్నివేశాల్ని నడిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, నవ్వించడమే టార్గెట్ అన్నట్టుగా స్వేచ్ఛగా ఇందులో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, కొన్ని సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగా సాగుతున్నా ప్రేక్షకుల్ని మాత్రం కడుపుబ్బా నవ్వించడంలో తరుణ్ భాస్కర్ మరోమారు విజయం సాధించాడు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. తరుణ్ భాస్కర్ తెలివైన రచన ఇందులో చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని మాటల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాటలతో తనే సెన్సార్ చేస్తూ నవ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటులు హాస్య సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకందే కథనంరొటిన్ స్టోరీ
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023