• TFIDB EN
  • సార్
    UTelugu2h 28m
    బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ధనుష్
    గణిత ఉపాధ్యాయుడు
    సంయుక్త మీనన్
    జీవశాస్త్ర ఉపాధ్యాయుడు
    సముద్రకని
    శ్రీనివాస్ తిరుపతి (తమిళం) / శ్రీనివాస్ త్రిపాఠి (తెలుగు)
    తనికెళ్ల భరణి
    పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు తెలుగు/తమిళం & చరిత్ర ఉపాధ్యాయుడు
    పి. సాయి కుమార్
    అధ్యక్షుడు ముత్తు పాండియన్ (తమిళం) / పత్తి పాపా రావు (తెలుగు)
    రాజేంద్రన్
    రాజేంద్రన్ $
    పమ్మి సాయి సుబ్బయ్య మరియు కాలేజీలో ప్యూన్
    ఆడుకలం నరేన్
    బాలా తండ్రి
    హరీష్ పేరడి
    బాలా టీచర్
    ఇళవరసు
    విద్యాశాఖ మంత్రి
    తోటపల్లి మధుప్రతిపక్ష నేత నారాయణ స్వామి.
    హైపర్ ఆది
    కెమిస్ట్రీ టీచర్
    ష ర
    ఫిజిక్స్ టీచర్
    సుమంత్
    జిల్లా కలెక్టర్ ఆనంద ముత్తువేల్ కుమార్ IAS
    ప్రవీణ
    బాల తల్లి
    నాగ మహేష్ఇన్స్పెక్టర్ సురేష్
    కల్పలతమీనాక్షి తల్లి
    భారతీరాజా
    ఒక గ్రామస్థుడు (అతి అతిథి పాత్ర)
    సిబ్బంది
    వెంకీ అట్లూరి
    దర్శకుడు
    సూర్యదేవర నాగ వంశీనిర్మాత
    సాయి సౌజన్యనిర్మాత
    జివి ప్రకాష్ కుమార్
    సంగీతకారుడు
    నవీన్ నూలి
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    రెండు సార్లు ప్రేమలో విఫలమైన  నయన తార.. లేడీ సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగిందంటే..?
    రెండు సార్లు ప్రేమలో విఫలమైన నయన తార.. లేడీ సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగిందంటే..?
    ]YouSay తరఫున  నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలుDownload Our App
    ఫిబ్రవరి 14 , 2023
    వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని
    వాణీ జయరామ్ సంగీత ప్రస్థానం: మూడు సార్లు జాతీయ అవార్డు గెలిచిన ఏకైక గాయని
    ]వాణీ జయరామ్ తెలుగు సినిమా సంగీతంపై విపరీతమైన ప్రభావం చూపారు.
    ఫిబ్రవరి 11 , 2023
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
    గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు  కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.  మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.  డెడ్‌ లైన్  ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.  కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.  OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
    ఫిబ్రవరి 22 , 2023
    తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన అరియానా గ్లోరీ
    తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పేసిన అరియానా గ్లోరీ
    ]బిగ్‌బాస్ సహచరులు అఖిల్ సార్థక్, అషు రెడ్డి, మొమైత్ ఖాన్, సిరి, యాంకర్ శివలతో అరియానాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;</strong>
    Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;
    టాలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్‌ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్‌ పెళ్లి టాపిక్‌ చాలా సార్లు సోషల్‌ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్‌ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే? ప్రభాస్‌ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్‌ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్‌ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్‌ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్‌ తర్వాత యావత్‌ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది.&nbsp; మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్‌ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్​తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.&nbsp; ‘ఫౌజీ’ షూట్‌లో ప్రభాస్‌! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ తాజాగా ఈ మూవీ షూట్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్‌ మలయాల భామ నమిత ప్రమోద్‌ కూడా సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్‌ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    అక్టోబర్ 26 , 2024
    <strong>సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    సంయుక్త మీనన్.. తెలుగులో&nbsp; భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్ నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌ స్థాయికి చేరింది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన సంయుక్త మీనన్(samyuktha menon) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. సంయుక్త మీనన్ పుట్టిన తేదీ? సెప్టెంబర్ 11, 1995 సంయుక్త మీనన్ ఎక్కడ పుట్టింది? పాలక్కాడ్, కేరళ సంయుక్త మీనన్ నటించిన తొలి సినిమా? పాప్ కార్న్ సంయుక్త మీనన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; సంయుక్త మీనన్‌కు తెలుగులో తొలి చిత్రం? భీమ్లా నాయక్(2022) సంయుక్త మీనన్ అభిరుచులు? సామాజిక సేవా కార్యక్రమాలు సంయుక్త మీనన్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన కలర్?&nbsp; వైట్, బ్లాక్ సంయుక్త మీనన్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ సంయుక్త మీనన్&nbsp; ఏం చదివింది? ఎకానామిక్స్‌లో డిగ్రీ చేసింది సంయుక్త మీనన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సంయుక్త మీనన్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamsamyuktha_/?hl=en https://www.youtube.com/watch?v=NtisrzL43Vs
    అక్టోబర్ 22 , 2024
    <strong>Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి</strong>
    Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
    దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా "తొమ్మిది రాత్రులు" అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది. శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం మరియు ప్రార్థన కాలం. ఈ తొమ్మిది రాత్రుల సమయంలో, దుర్గాదేవి దైవ శక్తి పరాకాష్టకు చేరుకుంటుందని హిందువులు నమ్ముతారు. భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందెందుకు పూజిస్తారు. ఈ క్రమంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు, అవి ఆమె శక్తి,&nbsp; దయ రూపాలను ప్రతిబింబిస్తాయి. శార్దీయ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట రంగు చీరతో అమ్మవారిని అలంకరించి భక్తులు పూజిస్తారు. ఈ రంగులు దేవి గుణాలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. నవరాత్రి రోజుల్లో భక్తులు ఈ రంగుల్లో దుస్తులు లేదా ఆభరణాలు ధరించి దేవిని స్మరించి, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు.&nbsp; మొదటిరోజు- పసుపు&nbsp; నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించే రోజు. ఈ రోజు పసువు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంటుంది.&nbsp; మరి ఈరోజున భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించడంతో పాటు .. కాస్త ట్రెండీగా కనిపించేందుకు ఇక్కడ మన టాలీవుడ్ హీరోయిన్లు ధరించిన పసుపు రంగు డ్రెస్సింగ్ స్టైల్స్‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి. దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ .. ఈ ట్రెడిషనల్ పసుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో చూడండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో ఎంబ్రాయిడరీ లేస్‌తో ప్రీమియం మాస్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై వచ్చిన అందమైన డిజైనర్ చీర ఇది. ఈ చీర మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. కృతి శెట్టి లాగా మీరు కూడా ఎల్లో హాఫ్‌ శారీలో అందరి మనసులు దోచుకోవచ్చు.&nbsp; పసుపు రంగుకు మ్యాచ్‌ అయ్యేలా గ్రీన్ బ్లౌస్ ధరిస్తే.. మీ అందం రెట్టింపు అవడం ఖాయం. &nbsp;లైగర్ బ్యూటీ అనన్య పాండే మాదిరి మీరు కూడా&nbsp; లెహెంగాలో అందంగా కనిపించవచ్చు. ఫ్లోరల్ ముకాయిష్ డిజైన్‌లో మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. పూజా హెగ్డే లా, మీరు పసుపు రంగు లెహెంగాలో మెరసిపోవచ్చు.&nbsp; అందంగా సంప్రదాయ కుందన్ ఆభరణాలతో&nbsp; అలంకరించుకోండి.&nbsp; మీ సొగసు మరింత రెట్టింపు అవుతుంది. View this post on Instagram A post shared by Tree-Shul Media Solutions (@treeshulmediasolutions) ప్రగ్యా జైస్వాల్ సూర్యకాంతి వెలుగులో రెండు రంగుల ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్,&nbsp; ఆకర్షనీయమైన బ్లౌజ్ డిజైన్‌లో మెరిసిపోతుంది. నవరాత్రి వేళ మీరూ ఈవిధంగా కనిపించాలనుకుంటున్నారా. ఇది మంచి ఛాయిస్ రాశీ ఖన్నా లా, మీరు సిల్క్ డ్రెస్‌లో అట్రాక్ట్ లుక్‌ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ టైప్ బెస్ట్ ఛాయిస్.&nbsp; దీనికి మ్యాచింగ్‌గా లాంగ్ ఈయరింగ్స్, బంగారు గాజులు, బర్గండి లిప్ స్టిక్‌తో మీ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. రకుల్ సింగ్ మాదిరి మోడ్రన్ స్టైల్‌లో అనార్కలి, స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్‌తో కనిపించాలనుకుంటున్నారా… ఈ పండుగ వేళ ఈ డ్రెస్‌ను కచ్చితంగా దీనిని ట్రై చేయండి. షెహ్నాజ్ గిల్ పసుపు రంగు డ్రెస్‌లో తన అందాన్ని మరింత వికసింప జేసింది. ఈ డ్రెస్‌తో మీరు కూడా అలా కనిపించవచ్చు.
    అక్టోబర్ 04 , 2024
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్‌.. హీరో గన్‌ పడితే పోస్టర్‌ పీక్స్‌ ‌అన్నట్లే. మీరే చూడండి..!
    సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సార్లు వారే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి ప్రేక్షకుల్లో తమ చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాతలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ హీరో పోస్టర్‌లో గన్‌ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాల పోస్టర్లను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? తుపాకీ పట్టుకున్న స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; భోళా శంకర్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భోళాశంకర్‌’ (Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ కానుండగా.. ఇంకా తొమ్మిది రోజులే ఉందంటూ ఇటీవల మేకర్స్‌ ఓ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇందులో చిరు రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. యాక్షన్‌ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌ను ‌అమితంగా ఆకట్టుకుంది.&nbsp; జైలర్‌ సూపర్‌ రజనీకాంత్‌ రీసెంట్‌గా ‘జైలర్‌’ (Jailer) మూవీ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో రజనీ గన్‌తో మెరిసారు. చేతిలో పెద్ద తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా హీరోయిన్‌గా చేసింది.&nbsp; కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ లేటెస్ట్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజయ్యింది. మునుపెన్నడూ చూడని లుక్‌లో ధనుష్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు. తుపాకీని ఫైర్‌ చేస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి అరుణ్‌ మతేశ్వరం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.&nbsp; జవాన్‌ ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న ‘జవాన్‌’ (Jawan) చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో షారుక్‌ రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా ఆమె కూడా తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో తుపాకీతోనే దర్శనమిచ్చింది. కాగా, ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; సలార్‌ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, KGF డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’ (Salaar). ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. గన్‌పై చేయి పెట్టుకొని, అగ్రెసివ్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.&nbsp; గాండీవధారి అర్జున మెగా హీరో వరణ్‌ తేజ్‌ తాజాగా ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌లోనూ వరణ్‌ చేతిలో గన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షివైద్య హీరోయిన్‌గా చేస్తోంది. మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. సైంధవ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం ‘సైంధవ్‌’ (Saindhav) మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఇందులో వెంకటేష్‌ చేతితో గన్‌ పట్టుకొని దాన్ని చూస్తూ కనిపించాడు. కాగా, ఈ చిత్రాన్ని సైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈగల్‌ మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్‌ నాగేశ్వర్‌ (Tiger Nageswara Rao) చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘ఈగల్‌’ (Eagle) సినిమా చేయనున్నాడు. కాగా ఈగల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని కనిపించాడు. చేతిలో గన్‌ కూడా ఉంది. కాగా, ఈ చిత్రంలో కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.&nbsp; స్పై&nbsp; ఇటీవలే విడుదలైన ‘స్పై’ (Spy) చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో నిఖిల్‌ కూడా పిస్టల్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp;
    ఆగస్టు 04 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.&nbsp; హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.&nbsp; ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.&nbsp; 2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.&nbsp; లక్ష్యం మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్‌ విక్‌ నుంచి ఇది నేర్చుకోవచ్చు. నిబద్ధత జాన్‌ విక్‌ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు. కఠోర శ్రమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్‌ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.&nbsp; అసలేంటిది? నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.&nbsp; హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్‌ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం. నమ్మకం సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్‌ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు. మన పని చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు. తక్కువగా మాట్లాడు సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు. ప్లాన్ బి&nbsp; చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా. కుదరదు ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.&nbsp;
    మార్చి 21 , 2023
    <strong>Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే</strong>
    Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే
    ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో లక్కీ భాస్కర్&nbsp; మంచి జనాదారణ పొందింది. ఆ చిత్రంలోని&nbsp; డైలాగ్‌లు సగటు మధ్యతరగతి జీవి జీవన చిత్రాన్ని కళ్లకు కట్టాయి. ప్రస్తుతం ఈ సంభాషణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డైలాగ్స్‌ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చిత్రంలో వచ్చిన టాప్ డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం. lucky Bhaskar Movie Dialogues “ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”. “ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా!” “ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్‌ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “. “అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.“ “మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.” లక్కీ భాస్కర్ కొడుకు చెప్పే డైలాగ్ “నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.“ “జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.“ “ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”. “భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.” “మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.“ నగల షాపులో చెప్పే డైలాగ్ “నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.“ lucky Bhaskar Movie Dialogues “దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.“ “సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…! ”ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.” “దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.” డబ్బు ఇచ్చే కిక్కు డైలాగ్ “సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.” “వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు“ “డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.“ “కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి”.(lucky Bhaskar Movie Dialogues) “ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.” “గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.“ దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం! మాటల్లో ఇంత అహంకారం….అహంకారం కాదు.. ధైర్యం!
    డిసెంబర్ 16 , 2024
    <strong>Mahira Sharma: బాలీవుడ్‌ భామతో సిరాజ్ పీకల్లోతు ప్రేమ? ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా!&nbsp;</strong>
    Mahira Sharma: బాలీవుడ్‌ భామతో సిరాజ్ పీకల్లోతు ప్రేమ? ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా!&nbsp;
    టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj), బాలీవుడ్‌ నటి మహిరా శర్మ (Mahira Sharma)తో రిలేషన్‌లో ఉన్నట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవల మహిరా పోస్టు చేసిన బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ ఫొటోకి సిరాజ్‌ లైక్‌ కొట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.&nbsp; సిరాజ్‌ లైక్‌ను గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా దాన్ని వైరల్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన సిరాజ్‌ ఆ లైక్‌ తీసేయడం గమనార్హం. అంతేకాదు వీరిద్దరూ డేట్‌కు సైతం వెళ్లారని , ఒకే లోకేషన్స్‌లో చాలా సార్లు కనిపించారని కూడా కొందరు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. సిరాజ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ (Mahira Sharma) అంటూ బాలీవుడ్‌లో సైతం ప్రచారం జరుగుతుండటంతో అందరి దృష్టి మహిరా శర్మపై పడింది. ఆమె గురించి తెలుసుకునేందుకు క్రికెట్‌ లవర్స్‌ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.&nbsp; మహిరా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1997 నవంబర్‌ 25న జమ్ము కశ్మీర్‌లో జన్మించింది. స్కూలింగ్ అనంతరం ఆమె ఫ్యామిలీ ముంబయికి షిఫ్ట్‌ అయ్యింది.&nbsp; ఆ తర్వాత ముంబయి విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో మహిరా డిగ్రీ చేసింది. ఆపై మోడల్‌గాను కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; 'తారక్‌ మెహతా రివర్స్‌ గ్లాసెస్‌' అనే టెలివిజన్‌ సిరీస్‌తో తొలిసారి బుల్లితెరపై మహిరా అడుగుపెట్టింది.&nbsp; ఆ తర్వాత నుంచి హిందీలో వరుసగా సీరియల్స్‌, టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా చేస్తూ తక్కువ కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; ముఖ్యంగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13లో అడుగుపెట్టడం ఈ భామ కెరీర్‌ను మలుపు తిప్పందని చెప్పవచ్చు. ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్‌ను మహిరా సొంతం చేసుకుంది.&nbsp; మహిరా శర్మ (Mahira Sharma) కన్నా బిగ్‌బాస్‌ మహిరా అంటేనే బాలీవుడ్‌లో ఎక్కువ మంది ఆమెను గుర్తుపడతారు. అంతలా బిగ్‌బాస్‌ ఆమెకు ఫేమ్‌ను తీసుకొచ్చింది.&nbsp; దీంతో పంజాబీ చిత్రాల్లో ఈ అమ్మడి (Mahira Sharma)కి వరుస అవకాశాలు వచ్చాయి. లంబోర్గినీ, రరాద్వా రిటర్న్స్‌ చిత్రాల్లో ఆమె నటించింది.&nbsp; ఆ తర్వాత 'ర్యాన్సమ్‌వేర్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి మహిరా అడుగుపెట్టింది. ‘ఫిరోతి బాజ్‌’ ఫిల్మ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ కనిపించింది.&nbsp; మహిరా తన సినిమాలు, సీరియల్స్‌ కంటే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కనిపించడం ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది.&nbsp; ఇప్పటివరకూ ఏకంగా 26 మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో మహిరా (Mahira Sharma) నటించింది. తన అందం, డ్యాన్స్‌, గ్లామర్‌తో యూట్యూబ్‌ సహా సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది.&nbsp; మహిరాకి ప్యారిస్‌ అంటే చాలా ఇష్టం. అక్కడి వెళ్లిన ప్రతీసారి ఓ పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ను కొనుగోలు చేస్తానని చెబుతోంది.&nbsp; ఫేవరేట్‌ స్టార్స్‌ విషయానికి వస్తే బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ అంటే ఈ భామకు చాలా ఇష్టం.&nbsp; రెస్టారెంట్ ఫుడ్‌ కంటే స్ట్రీట్‌ ఫుడ్‌ను చాలా ఇష్టపడతానని మహిరా శర్మ (Mahira Sharma) ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ముఖ్యంగా వడాపావ్‌ అంటే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది. &nbsp; మహిరా శర్మ సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 8.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ ఫైనల్‌ లుక్‌ ఇదేనా? పిక్స్‌ వైరల్‌!&nbsp;</strong>
    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ ఫైనల్‌ లుక్‌ ఇదేనా? పిక్స్‌ వైరల్‌!&nbsp;
    సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. 'RRR' వంటి గ్లోబల్ హిట్‌ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో 'SSMB29' భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రానప్పటికీ గాసిప్స్‌ మాత్రం పెద్ద ఎత్తునే చక్కర్లు కొట్టాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్‌ లాంగ్‌ హెయిర్‌, బియర్డ్‌ లుక్‌తో మేకోవర్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల కాలంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌ లేటెస్ట్ లుక్స్‌ మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గత ఫొటోలతో పోలిస్తే కాస్త భిన్నంగా మహేష్‌ కనిపించడం విశేషం. మహేష్‌ లుక్ అదుర్స్‌! భారత్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మాల్దీవుల్లో ఇచ్చిన విందుకి ఇటీవల మహేష్‌ బాబు దంపతులు హాజరయ్యారు. వారితో పాటు టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), విక్టరి వెంకటేష్‌ (Venkatesh), అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వీరంతా ఓ డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని దిగిన ఒక ఫొటో సైతం ఇటీవల వైరల్‌ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌లో మహేష్‌ దిగిన ఫొటోలు తాజాగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్‌ మ్యాన్‌ కపుల్స్‌తో మహేష్‌ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్‌ లుక్‌ అదిరిపోయింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.&nbsp; https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174 మార్పులు గమనించారా? రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘SSMB 29’ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మహేష్ బాబు మేకోవర్‌ అవుతున్నారు. అయితే గతంలో వైరల్‌ అయిన ఫొటోలకు ప్రస్తుత మేకోవర్‌కు కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది. గత పిక్స్‌లో మహేష్‌ గుబురు గడ్డం, లాంగ్‌ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్‌ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్‌ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్‌ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌ మహేష్‌ లుక్‌ ఫైనల్‌ అయ్యిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో మహేష్‌ ఈ లుక్‌తోనే కనిపిస్తాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; వారణాసి నేపథ్యంలో..&nbsp; రాజమౌళి - మహేష్‌ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్‌ మెుత్తాన్ని ఓ సెట్‌లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్‌ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్‌ ఫైనల్ కాగానే సెట్‌ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; హీరోయిన్‌గా బ్రిటిష్‌ భామ! SSMB 29 ప్రాజెక్టులో సూపర్‌ స్టార్‌ మహేష్‌కు జోడీగా బ్రిటిష్‌ భామ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. RRR సినిమాలో బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్‌‌ (Olivia Morris)ను తీసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో సినిమా కోసం మరో బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్‌‌ (Naomi Scott)ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ రానుందని అంటున్నారు. కాగా నవోమి స్కాట్‌కు భారత్‌ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి ఉసా స్కాట్‌ది గుజరాత్‌ కాగా ఆమె చిన్నప్పుడే ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారట. కాబట్టి భారత్‌పై నవోమి స్కాట్‌కు కాస్త అవగాహన ఉన్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘స్మైల్‌’, ‘అల్లాద్దీన్‌’, ‘విజర్డ్స్‌’ తదితర చిత్రాల్లో నవోమి నటించింది. రూ.2000 కోట్లకు పైగా బిజినెస్‌! మహేశ్‌-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 గురించి టాలీవుడ్‌ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. 'అంతర్జాతీయ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. దీని బిజినెస్‌ మినిమం రూ.2000కోట్లు దాటొచ్చని టీమ్‌ భావిస్తోంది. అంతకుమించి ఎంతైనా వసూలు చేయొచ్చు. ఈ నంబర్‌ రూ.3, 4 వేల కోట్ల వరకు వెళ్లొచ్చు. అదే జరిగితే తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీరంగంలోనే కొత్త చరిత్ర అవుతుంది. భవిష్యత్తును రాజమౌళి బాగా ఊహిస్తారు. ఆయన ఈ చిత్రంతో మళ్లీ మరోసారి సత్తా చాటనున్నారు' అని అన్నారు.&nbsp;
    నవంబర్ 13 , 2024
    <strong>Indian Films With Rs.100 cr opening: </strong><strong>తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్‌ ఇండియా స్టార్స్‌ వీరే!</strong>
    Indian Films With Rs.100 cr opening: తొలి రోజే రూ.100 కోట్లు ఖాతాలో వేసుకున్న పాన్‌ ఇండియా స్టార్స్‌ వీరే!
    ప్రస్తుతం దేశంలో పాన్‌ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు తమ ఇండస్ట్రీలకు మాత్రమై పరిమితమైన స్టార్‌ హీరోలు ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలలోనూ సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రాలను రిలీజ్‌ చేస్తూ పెద్ద ఎత్తున కలెక్షన్స్‌ రాబడుతున్నారు. తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను తమ ఖాతాల్లో వేసుకుంటూ సత్తా చాటుతున్నారు. తారక్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై తొలిరోజు రూ.172 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో తమ చిత్రాలను నిలిపిన స్టార్‌ హీరోలు ఎవరో ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం దేశంలో ఏ హీరోకు లేనంత క్రేజ్ ప్రభాస్‌కు ఉంది. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులన్నీ దాసోహం కావాల్సిందే. తొలి రోజు అత్యధికసార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారు. ప్రభాస్‌ ఐదు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ‘బాహుబలి 2’ (రూ. 214.5 కోట్లు), ‘సాహో’ (రూ.130 కోట్లు), ‘ఆదిపురుష్‌’ (రూ.140 కోట్లు), ‘సలార్‌’ (రూ.178.7 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.191.5 కోట్లు) చిత్రాలన్నీ తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.&nbsp; విజయ్‌ (Vijay) ప్రభాస్‌ తర్వాత విజయ్‌ అత్యధిక సార్లు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘ది గోట్‌’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో గతేడాది వచ్చిన 'లియో' (Leo) చిత్రం తొలి రోజు రూ.145 కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్‌' (The G.O.A.T) ఫస్ట్‌ డే రూ. 126.3 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.&nbsp; జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) దేవర సినిమా సక్సెస్‌తో తారక్ ఈ జాబితాలో టాప్‌ 3లో నిలిచారు. ఆయన చేసిన రెండు చిత్రాలు తొలి రోజు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ‘RRR’ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.223 కోట్లను రాబట్టింది. తారక్‌ రీసెంట్‌ చిత్రం ‘దేవర’ (Devara) ఫస్ట్‌ డే రూ.172 కోట్లను వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాల సక్సెస్‌తో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు.&nbsp; షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రెండు సార్లు ఈ ఫీట్‌ సాధించారు. ఆయన నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం తొలిరోజు రూ.106 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్‌’ (Jawan) ఫస్ట్‌ డే వరల్డ్ వైడ్‌గా రూ.129 కోట్లను తన ఖాతాలో వేసుకుంది.&nbsp; యష్‌ (Yash) కన్నడ నటుడు యష్‌ ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) చిత్రం ద్వారా తొలి రోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. ‘కేజీఎఫ్‌’ (KGF)కు ముందు వరకూ కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన యష్‌ ఆ సినిమా సక్సెస్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నారు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రం తొలి రోజు రూ.164 కోట్లు కొల్లగొట్టి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) బాలీవుడ్ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా డేర్ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా రూపొందించిన ‘యానిమల్‌’ (Animal) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రణ్‌బీర్‌ కెరీర్‌లో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. గతేడాది డిసెంబర్‌ 1 రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.116 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. రామ్‌చరణ్‌ (Ramcharan) దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రంలో తారక్‌తో పాటు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సైతం హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా తొలి రోజు రూ.223 కోట్లను కొల్లగొట్టి ఈ జాబితాలో చోటు సంపాదించాడు. డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కూడా తొలి రోజు రూ.100 కోట్లు పైనే రాబడుతుందని చరణ్‌ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మక్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే&nbsp; తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp; https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ  జాతకం మార్చనుందా?
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్‌ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్‌ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు. గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్‌ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్‌' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్‌' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 30 , 2024
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    Top 15 Telugu BGM Movies: తెలుగులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన ఈ సినిమాల గురించి తెలుసా?
    ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్‌, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్‌ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఫైనలైజ్‌ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్‌ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.&nbsp; https://twitter.com/i/status/1756920670112317839 పుష్ప (Pushpa) సుకుమర్‌ - అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=B4aXmcfwkL4 ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా గ్లోబల్‌ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్‌, రామ్‌చరణ్‌ పాత్రలను హైలెట్‌ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. https://www.youtube.com/watch?v=Cve98-ZDIjY రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.&nbsp; https://twitter.com/i/status/1508823419013369857 అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్‌ రెడ్డి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.&nbsp; https://www.youtube.com/watch?v=RrtLwUR1kVQ బాహుబలి (Baahubali) తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=poqKN52SKx0 ఇంద్ర (Indra) మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్‌ వేసేలా ఉంటుంది. అటు చిరు - ప్రకాష్‌ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1281802257319641090 https://twitter.com/i/status/1286298937746264065 మిర్చి (Mirchi) ప్రభాస్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్‌ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1653647992283619340 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమార్కుడు' కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1407610528948645889 https://twitter.com/i/status/1672174183395266561 ఛత్రపతి (Chatrapathi) రాజమౌళి - ప్రభాస్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.&nbsp; https://twitter.com/i/status/1591641776083070978 స్టాలిన్‌ (Stalin) చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్‌ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1307524939029688320 తులసి (Tulasi) వెంకటేష్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్‌ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1377645148671148036 https://twitter.com/i/status/1386233991800360961 సింహాద్రి (Simhadri) తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1557928081096028160 రక్షకుడు (Rakshakudu) నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్‌ అందించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=hX06emC9sb8 ఓజీ (OG) పవన్‌ కల్యాణ్‌ హీరోగా డైరెక్టర్ సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్‌, కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.&nbsp; https://twitter.com/i/status/1759904474091704446 యానిమల్‌ (Animal) ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్‌. రణ్‌బీర్‌ మాస్‌ యాక్షన్‌ను హర్షవర్ధన్‌ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్‌ వేస్తున్నట్లు రణ్‌బీర్‌ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్‌.&nbsp; https://twitter.com/Billa2Harry/status/1751450675991773283
    ఫిబ్రవరి 21 , 2024
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్‌ డోస్‌ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
    SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్‌ డోస్‌ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
    టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ సంయుక్త మీనన్. విరూపాక్షతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.&nbsp; సంయుక్త మళయాలం చిత్రాలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది.&nbsp; బింబిసార చిత్రానికి మెుదట సంతకం చేసినప్పటికీ తెలుగులో విడుదలైన ఫస్ట్ చిత్రం బీమ్లా నాయక్&nbsp; కల్యాణ్ రామ్ నటించిన బింబిసారతో బ్లాక్‌ బస్టర్ అందుకుంది సంయుక్త. అందులో మోడ్రన్ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో మెప్పించింది.&nbsp; ధనుష్ నటించిన సార్ చిత్రంలోనూ తళుక్కున మెరిసింది ఈ అమ్మడు. అది కూడా విజయవంతం కావటంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.&nbsp; ఇప్పటివరకు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఉన్న రోల్స్‌లోనే మెరిసింది సుందరి. గ్లామర్‌ పాత్రల్లో నటించలేదు.&nbsp; సూపర్‌ హాట్‌గా కనిపించే సంయుక్త బికినీ ఫోటోలు పెట్టి అప్పట్లో అందర్ని షాక్‌కు గురిచేసింది. ఆ పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.&nbsp;విరూపాక్ష సినిమాలో కాస్త గ్లామర్‌కి పనిచెప్పింది ఈ అమ్మడు. హాఫ్ సారీలో అందచందాలు ప్రదర్శించింది సంయుక్త మీనన్.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌తో&nbsp; చేసిన కొన్ని సీన్లలో బొల్డ్‌గా కనిపించింది. చీరకట్టులోనైనా కావాల్సిన చోట అందాలు ఆరబోసింది. పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్‌లో ఆఫర్‌ రావటానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారణమనే రూమర్స్ ఉన్నాయి. ఆయన కారణంగా అవకాశాలు వస్తున్నాయని టాక్.&nbsp; చీరకట్టులోనూ ఈ వయ్యారి లుక్ ఇచ్చిందంటే కుర్రాళ్ల మతిపోవాల్సిందే. ఆమె పెట్టె ఫోటోల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.&nbsp; సామాజిక మాధ్యమాల్లో సంయుక్త మీనన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమెకు 2.6 మిలియన్స్‌ ఫాలోవర్లు ఉన్నారు. సంయుక్త మీనన్‌ ప్రస్తుతం కల్యాణ్‌ రామ్ సరసన డెవిల్ అనే సినిమాలో చేస్తోంది. బింబిసార 2లోనూ కనిపించే అవకాశం ఉంది.&nbsp; https://telugu.yousay.tv/sanyukta-menon-is-stunning-in-a-saree.html https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
    ఏప్రిల్ 24 , 2023
    LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌
    LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌
    అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్‌ కొన్ని మీకోసం.&nbsp; మాష్టారు మాష్టారు… ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ చిత్రంలోని&nbsp; “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్‌లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై ప్రేమని చెప్పే పాటనే. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. https://www.youtube.com/watch?v=7JBPq28O0sY సామీ సామీ… అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని సామీ సామీ అంటూ సాగే పాట ఈ కోవలోకి వస్తుంది. పుష్ప గురించి హీరోయిన్ పాడే ఈ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు ఇన్‌స్టాలో చేయని రీల్ లేదు. చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. దేవీ శ్రీ ప్రసాద్‌ నుంచి వచ్చిన మరో అద్భుతమైన&nbsp;సాంగ్ ఇది. https://www.youtube.com/watch?v=JJFVjxFmYlY ప్రియతమా ప్రియతమా.. మజిలీ చిత్రంలోని ప్రియతమా ప్రియతమా అనే పాట ఇటీవల విడుదలైన బెస్ట్ లవ్‌ సాంగ్. నాగ చైతన్య తన ప్రేమని అర్థం చేసుకోవాలనే ఆశతో సమంత పాడుతుంది. ఈ పాట ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిందనే చెప్పాలి. ఎస్.ఎస్‌. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. https://www.youtube.com/watch?v=BpINyS4k7Uw ఉండిపోవ నువ్విలా.. సవారి చిత్రంలోని “ఉండిపోవ నువ్విలా రెండు కళ్ల లోపలా” అనే పాట ఇటీవల వచ్చిన పాటల్లో సూపర్ హిట్ అయ్యింది. అబ్బాయి మీద ప్రేమని వర్ణిస్తూ పాడిన పాట చాలామంది హృదయాల్ని తాకిందని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=UwALZDEsMdU మనసున ఉన్నది…&nbsp; తరుణ్, స్నేహ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియమైన నీకు చిత్రంలోని “మనసున ఉన్నది చెప్పాలనున్నది” ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషన్‌. ప్రేమించే అబ్బాయి గురించి మనసులో దాగున్న విషయాలను చెప్పలేకపోతున్నట్లుగా సాగే ఈ పాట సూపర్ హిట్. ఈ సినిమాకు శివశంకర్ సంగీతం అందించారు. https://www.youtube.com/watch?v=COZGV3vEQ4A ఇంతకీ నువ్వెవరు?... నాని నటించిన స్నేహితుడు చిత్రంలోని “ఇంతకీ నువ్వెవరు వరుసకి నాకెవరు” అంటూ అబ్బాయి కోసం అమ్మాయి పాడే ఈ సాంగ్‌ చార్ట్‌బస్టర్. అనుకోని సమస్యల్లో చిక్కుకున్న తనకి సాయం చేస్తున్న అబ్బాయి గురించి హీరోయిన్ పాడుతుంది. శివరాం శంకర్‌ సంగీతం అందించారు.&nbsp; https://www.youtube.com/watch?v=Yyn8XCwaalw కోపమా నాపైనా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష జంటగా తెరకెక్కిన లవ్, రొమాంటిక్ సినిమా వర్షం లోని “కోపమా నాపైనా ఆపవా ఇకనైనా” అంటూ సాగే పాట ట్రెండ్ సెట్టర్. అమ్మాయిపై అలిగిన హీరో కోసం పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ సంగీతం అందించగా శ్రేయ గోషాల్‌ పాడారు. https://www.youtube.com/watch?v=K6gTLP1-gWU
    మార్చి 17 , 2023

    @2021 KTree