UATelugu
హీరో శ్రీను (గోపీచంద్). ఫ్రెండ్స్ తో జాలీగా తిరుగుతుంటాడు. కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఓ ట్రైన్ జర్నీలో హీరోయిన్ శైలజ(రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. అదే ప్రేమని శ్రీని శైలజకి చెప్తే మొదట నో అంటుంది, కానీ ఫైనల్ గా ఓ రోజు ఒప్పుకుంటుంది. ఓ రోజు శైలజని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కిడ్నాప్ గ్యాంగ్ నుంచి శైలను శ్రీను కాపాడాడా? లేదా అన్నది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
గోపీచంద్
శ్రీనివాస్ రావు (శీను)రెజీనా కసాండ్రా
శైలజ (శైలు)ముఖేష్ రిషి
శీను తండ్రిప్రదీప్ రావత్
బావుజీదేవన్ (నటుడు)
శైలు తండ్రిబ్రహ్మానందం
దయజయ ప్రకాష్ రెడ్డి
పెళ్లికొడుకుపోసాని కృష్ణ మురళి
తిరుపతి రైలు ప్యాసింజర్పృధ్వీ రాజ్
శివుడురఘు బాబు
శీను మామయ్యసత్య కృష్ణ
దేవ భార్యసత్యం రాజేష్
డా. సిదప్పసౌకార్ జానకి
మోడ్రన్ బామ్మాప్రగతి మహావాది
శీను తల్లినారమల్లి శివప్రసాద్
పరిమళ ప్రసాద్సప్తగిరి
గిరికృష్ణ భగవాన్
కృష్ణ భగవాన్శివాజీ రాజా
శీను బావమరిదిసురేఖ వాణిశీను సోదరి
గుండు సుదర్శన్
రైలు ప్యాసింజర్రఘు కారుమంచి
బావుజీ హెంచ్మాన్చంటికానిస్టేబుల్
సీవీ సుబ్బారెడ్డి
సారిక రామచంద్రరావు
రామచంద్ర
టార్జాన్ లక్ష్మీనారాయణ
రజిత
అపూర్వ
జ్యోతి
సిబ్బంది
ఏఎస్ రవి కుమార్ చౌదరిదర్శకుడు
వి. ఆనంద్ ప్రసాద్నిర్మాత
అనూప్ రూబెన్స్
సంగీతకారుడుకోన వెంకట్
స్క్రీన్ ప్లేగోపీమోహన్
స్క్రీన్ ప్లేప్రసాద్ మూరెళ్ల
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Regina Cassandra: అందుకే ఇస్లాం మతం నుంచి క్రిస్టియానిటీకి మారా!
సాధారణంగా సినిమాల్లో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు వంటి వాటి కారణంగా వచ్చే సమస్యలు పలు సినిమాల్లో కథలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇవి కేవలం తెరపై మాత్రమే కాకుండా, నిజజీవితంలోనూ చాలామంది ప్రముఖుల జీవితాలను ప్రభావితం చేశాయి. ఈ కోవలోకే కోలీవుడ్ నటి రెజీనా కాసాండ్రా జీవిత కథ కూడా వస్తుంది. రెజీనా టాలీవుడ్‌లో “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పిల్ల నువ్వు లేని జీవితం”, సౌఖ్యం వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
రెజీనా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలోనూ విభిన్నమైన పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చూపించారు. ఐటమ్ సాంగ్స్‌లోనూ తన ప్రతిభను చాటిన రెజీనా, ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఇటీవల కొన్ని వెబ్‌సిరీస్‌లలోనూ ఆమె కనిపించారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో రెజీనా కీలక పాత్రను పోషిస్తోంది.
ఇస్లాం నుంచి క్రిస్టియన్‌గా
తన కుటుంబ నేపథ్యంపై రెజీనా ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పుట్టుకతో ఇస్లాం మతస్తురాలైన ఆమె, ఆ తరువాత క్రిస్టియన్ మతాన్ని స్వీకరించినట్లు తెలిపారు. ఆమె తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారు కాగా, తండ్రి ఇస్లాం మతస్తుడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులకు జన్మించిన రెజీనా, తన చిన్నతనంలో ఇస్లాం మత ఆచారాలను అనుసరించిందని చెప్పారు.
అయితే, తన ఆరేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయినట్లు రెజీనా వెల్లడించింది. ఆ తరువాత తన తల్లి తిరిగి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి.. రెజీనా పేరుకి ‘కసాండ్రా’ అనే పేరు జోడించారని ఆమె వివరించారు. ఆ తర్వాత బాప్తిజం తీసుకున్న తాను బైబిల్ చదివినట్లు వెల్లడించింది. ఆ విధంగా తన క్రిస్టియన్ జీవితాన్ని కొనసాగించానని పేర్కొంది.
మత సామరస్యం
తన మతానికి సంబంధించి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా, చర్చ్, మసీదు, గుడి ఇలా ఎక్కడికైనా వెళతానని రెజీనా తెలిపారు. మతం తన జీవితంపై పెద్దగా ప్రభావం చూపలేదని, తనకు ముఖ్యమైంది మానవత్వం అని పేర్కొన్నారు. ప్రజలకు ఆమె ప్రస్తుతం రెజీనా కసాండ్రా పేరుతో పరిచయం అయినా, వాస్తవానికి తన అసలు పేరు కేవలం ‘రెజీనా’ మాత్రమేనని హాస్యంగా వెల్లడించారు.
డిసెంబర్ 30 , 2024
రెజీనా కాసాండ్రా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
రెజీనా కాసాండ్రా తెలుగులో సుధీర్ బాబు నటించిన SMS(శివ మనసులో శృతి) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రొటీన్ లవ్‌స్టోరీ, కొత్తజంట సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం ద్వారా కమర్షియల్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత శాకిని డాకిని, సౌఖ్యం, పవర్, రారా కృష్ణయ్య వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీలో సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ఫర్జీలో నటించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో హద్దులు చెరిపేస్తున్న రెజీనా గురించి కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about Regina Cassandra) విషయాలు ఓసారి చూద్దాం.
రెజీనా కాసాండ్రా ముద్దు పేరు?
రెజీనా
రెజీనా కాసాండ్రా ఎప్పుడు పుట్టింది?
1990, డిసెంబర్ 13న జన్మించింది
రెజీనా కాసాండ్రా తొలి సినిమా?
కందా నాల్ ముదల్(2005)
రెజీనా కాసాండ్రా తెలుగులో నటించిన తొలి సినిమా?
శివ మనసులో శృతి(2012)
రెజీనా కాసాండ్రా ఎత్తు ఎంత?
5 అడుగుల 6అంగుళాలు
రెజీనా కాసాండ్రా ఎక్కడ పుట్టింది?
చెన్నై
రెజీనా కాసాండ్రా ఏం చదివింది?
సైకాలజీలో పీజీ చేసింది
రెజీనా కాసాండ్రా అభిరుచులు?
పుస్తకాలు చదవడం
రెజీనా కాసాండ్రాకు ఇష్టమైన ఆహారం?
చాకోలెట్స్, చీజ్
రెజీనా కాసాండ్రా కు అఫైర్స్ ఉన్నాయా?
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.
రెజీనా కాసాండ్రాకు ఇష్టమైన కలర్ ?
బ్లాక్
రెజీనా కాసాండ్రాకు ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్, అజిత్ కుమార్
రెజీనా కాసాండ్రా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.1.5Cr వరకు ఛార్జ్ చేస్తోంది.
రెజీనా కాసాండ్రా ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/reginaacassandraa/?hl=en
https://www.youtube.com/watch?v=XHVrAH6968k
ఏప్రిల్ 06 , 2024
Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
నటీనటులు : రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్ విజయ్, పృథ్వీ, తాగుబోతు రమేష్ తదితరులు
డైరెక్టర్ : ఏ.ఎస్. రవి కుమార్
సంగీతం : జేబీ
సినిమాటోగ్రఫీ : జవహర్ రెడ్డి
నిర్మాత : మాల్కాపురం శివ కుమార్
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
హీరో రాజ్ తరుణ్ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్ సీన్స్ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్ తరుణ్ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్ పరిచయం, వారి లవ్ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్ ఎక్కడా బోర్ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్ తరుణ్‌ను ఎన్నో మాస్ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్ రాజ్‌తరుణ్ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్‌తరుణ్ నటనలవ్ ట్రాక్‌యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
వర్కౌట్ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 02 , 2024
Jr NTR : సౌమ్యుడైన తారక్‌కు కోపం తెప్పించారు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)కు మంచి నటుడిగానే కాదు.. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా ఎంతో పేరుంది. తారక్ అనవసరంగా ఏ వివాదాలలోకి తలదూర్చడు. పైగా ఆడియో ఫంక్షన్లలో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తుంటారు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు తారక్ ఎందుకు కోపడ్డాడు? కారణం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
తారక్‌కు కోపం వచ్చింది!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ కాంబోలో ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ తారక్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు వెళ్తున్న తారక్‌ను ఫొటో గ్రాఫర్స్ ఫాలో అవుతూ అతడి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయబోయారు. అది గమనించిన ఎన్టీఆర్‌కు కోపలు కట్టలు తెచ్చుకుంది. ఓయ్ అంటూ ఒక్కసారిగా కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు.
https://twitter.com/i/status/1783491705049886808
కోపానికి కారణం ఇదే!
‘వార్ 2’ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇందులో తారక్ పాత్ర చాలా కీలకం కావడంతో ఆయన లుక్స్ రివీల్ చేయడానికి చిత్ర యూనిట్ సంసిద్ధంగా లేదు. కానీ, ఇటీవల షూటింగ్‌లో తారక్ లుక్స్‌కు సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి. అవి జాతీయ స్థాయిలో వైరల్‌గా మారాయి. దీంతో ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని మేకర్స్ యూనిట్ మెుత్తానికి సూచించారట. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడం ఆయన కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందుకే అతడు ఫొటోగ్రాఫర్లను విసుక్కున్నాడని అంటున్నారు.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'వార్' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఇటీవల ఓ ప్లాట్ నెట్టింట వైరల్ అయ్యింది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. హృతిక్-తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏప్రిల్ 27 , 2024
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు గురించి తెలుసా?
]సమాజ సేవ..తన సంపాదనలో కొంత మొత్తం సమాజ సేవకు వెచ్చిస్తానని చెబుతుంటుందీ జబర్దస్త్ యాంకర్.Download Our App
ఫిబ్రవరి 14 , 2023
PawanKalyan On Instagram: ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. అంతా ఫ్యాన్స్ వల్లే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టారు. సింగిల్ పోస్ట్ లేకుండా కేవలం 20 నిమిషాల్లోనే 140K ఫాలోవర్లను పవన్ చేరుకోగా.. గంటలో 250K ఫాలోవర్లను క్రాస్ చేశారు. మరో 5 నిమిషాల్లోనే 300K మార్క్‌ను దాటారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదల జెట్ వేగంతో దూసుకెళ్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో నానా రచ్చచేస్తున్నారు. #PawanKalyanOnInstagram హ్యాష్ ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.
దేశంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయాలని ట్వీట్ల జడివాన కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ షేర్ చేయాలని ఇతర అభిమానులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈరోజు #PawanKalyanOnInstagram ట్యాగ్‌ను సోషల్ మీడియాలో నంబర్ 1 గా నిలపాలని పవన్ డైహర్టెడ్ ఫ్యాన్స్.. అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676106458516127747?s=20
ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెడుతున్నట్లు ఇటీవల నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ నోట్ చాలా సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా ఉంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జైహింద్ అనే ట్యాగ్ లైన్‌ను పవన్ తన అకౌంట్‌కు జత చేశారు.
ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు, యువతకు నిత్యం అందుబాటులో ఉండేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్విట్టర్, తన అధికారిక వెబ్‌సైట్ (https://janasenaparty.org/) ద్వారా తన పార్టీ అభిప్రాయాలను పవర్ స్టార్ పంచుకుంటున్నారు.
https://twitter.com/_jspnaveen/status/1676108997869588480?s=20
అందుకేనా ఇన్‌స్టా?
ఏపీలో మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో జనసేనాని సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో వెనకపడొద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్, ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. సనిశితమైన సమస్యలపై ప్రశ్నిస్తూ యువత ద్వారా సమాధానాలు రప్పిస్తూ విలైనంత ఎక్కువ మందికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం తనదైన శైలీలో వాగ్బాణాలతో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గతానికంటే భిన్నంగా తన ప్రచార పర్వాన్ని మార్చివేశారు. తన అభిమానులతో పాటు టాలీవుడ్‌లో ఇతర అగ్ర హీరోలైన ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. కులాల ప్రస్తావనకు తావులేకుండా తాను అందరివాడినంటూ యువతకు దగ్గరయ్యేందుకు తన టెంపోను మార్చుకున్నారు.
జులై 'బ్రో' నెల
మరోవైపు పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' మూవీ ఈనెల 28న విడుదల కానుంది. చిత్ర యూనిట్ బ్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. అభిమానులు జులై నెలను 'బ్రో' నెలగా ప్రకటించి ఉత్సాహంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయిధరమ్ కామన్ మ్యాన్‌గా నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.
అటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ హిట్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిష్ డెరెక్షన్‌లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా ఆగిపోయింది. అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న OG సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసింది. బ్రో సినిమా తర్వాత OG మూవీనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
జూలై 04 , 2023
Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్ తదితరులు
రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు
ఎడిటింగ్: ఆర్.గోవింద రాజు
నిర్మాత: జ్యోతిక, సూర్య
విడుదల తేదీ: 28-09-2024
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3.5/5
సెప్టెంబర్ 28 , 2024
Balakrishna Double role Movies: బాలకృష్ణ అరుదైన రికార్డు.. అత్యధిక సంఖ్యలో డబుల్ రోల్స్ చేసిన ఏకైక హీరోగా ఘనత!
తెలుగులో ఈ తరం కథానాయకుల్లో బాలకృష్ణ చేసినన్ని డబుల్ రోల్ పాత్రలు ఏవరు చేసి ఉండరు. ఆయన ఏకంగా 18 చిత్రాల్లో డబుల్ రోల్‌లో మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. మరే ఇతర హీరోకు సాధ్యంకాని రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి నందమూరి నటసింహం డ్యుయల్ రోల్‌లో కనిపించిన ఆ సినిమాలు ఏంటో ఓసారి చూద్దామా.
1.Apoorva Sahodarulu (1986)
బాలకృష్ణ డబుల్ రోల్‌లో నటించిన తొలి చిత్రం అపూర్వ సోదరులు. ఈ సినిమాను కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రాము, అరుణ్ కుమార్ పాత్రల్లో నటించారు.
2. Ramudu Bheemudu (1988)
రాముడు- భీముడు చిత్రంలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం(Balakrishna Double role Movies) చేసారు. ఈ చిత్రాన్ని కే మురిళి మోహన్‌రావు డైరెక్ట్ చేశారు. రాముడు- భీముడు పాత్రల్లో నటించిన బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ సరసన సుహాసిని, రాధ నటించారు.
3. Brahmarshi Viswamitra (1991)
నందమూరి తారక రామరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ.. సత్యహరిశ్చంద్ర, దుష్యంతుడి పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
4. Aditya 369 (1991)
ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ.. శ్రీకృష్ణదేవరాయగా, క్రిష్ణ కుమార్‌గా డబుల్‌లో రోల్‌లో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆదిత్య 369 సినిమాను సింగీతం శ్రీనివాస్‌రావు డైరెక్ట్ చేశారు.
5. Maatho Pettukoku (1995)
ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (Balakrishna Dual role Movies) చేశారు. ఎస్పీ అర్జున్‌గా మరియు కిష్టయ్యగా కనిపించారు. బాలకృష్ణ సరసన రోజా, రంభలు హీరోయిన్లుగా నటించారు.
6. Sri Krishnarjuna Vijayam (1996)
సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బాలకృష్ణ.. అర్జునుడు, కృష్ణ భగవానుడి గెటప్‌లో కనువిందు చేశారు. ఈ సినిమాలో రోజా, రంభ, ప్రియారామన్ ఇతర పాత్రల్లో నటించారు.
7. Peddannayya (1997)
బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలయ్య.. రామకృష్ణ ప్రసాద్, భవాని ప్రసాద్ క్యారెక్టర్లలో అలరించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా, ఇంద్రజ నటించారు.
8. Sultan (1999)
శరత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మరోసారి బాలకృష్ణ డబుల్ రోల్ చేశారు. నెగిటివ్ క్యారెక్టర్ సుల్తాన్ పాత్రలో జీవించాడు. మరొక రోల్ పృథ్వి క్యారెక్టర్‌లో అలరించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు.
9. Chennakesava Reddy (2002)
మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ.. చెన్నకేశవరెడ్డి, భరత్ రెడ్డి పాత్రల్లో(Balakrishna Double role Movies) కనిపించారు. బాలయ్య సరసన టబు, శ్రియ నటించారు.
10. Allari Pidugu (2005)
జయంత్ సి. పారంజీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ఏసీపీ రంజిత్ కుమార్, గిరి పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ సరసన కత్రినాకైఫ్, ఛార్మి కౌర్ నటించారు.
11. Okka Magadu (2005)
బాలయ్య డబుల్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను YVS చౌదరి డైరెక్ట్ చేశారు. బాలకృష్ణ సరసన సిమ్రాన్, అనుష్క శెట్టి నటించారు.
12. Pandurangadu (2008)
కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈచిత్రంలో బాలకృష్ణ.. పాండు రంగడు, కృష్ణ భగవానుడి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలయ్య సరసన టబు, స్నేహ నటించారు.
13.Simha (2010)
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య.. సింహా, శ్రీమన్నారాయణ క్యారెక్టర్లలో నటించారు. వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా గొప్ప కమ్‌బ్యాక్‌ను ఇచ్చింది.
14. Parama Veera Chakra (2011)
దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ సాధించలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ.. మేజర్ జయసింహా, చక్రధర్ పాత్రల్లో నటించారు.
15. Adhinayakudu (2012)
పరుచూరి మురళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సలోని, లక్ష్మిరాయ్, జయసుధ ఇతర పాత్రల్లో నటించారు.
16. Legend (2014)
బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ లెజెండ్. ఈ సినిమాలో బాలయ్య మరోసారి డబుల్ రోల్‌లో మాస్ జాతర చేశారు. జయదేవ్, కృష్ణ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ సరసన సొనాల్ చవాన్, రాధిక ఆప్టే నటించారు.
Balakrishna's Legend Movie First Look Posters
17. Akhanda (2021)
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. అఖండ రుద్ర అఘోర, మురళికృష్ణ పాత్రల్లో(Balakrishna Double role Movies) నటించారు. బాలయ్య సరసన ప్రాగ్యజైశ్వాల్ నటించింది.
18. Veera Simha Reddy (2023)
గోపిచంద్ మాలినేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పులిచర్ల వీరసింహా రెడ్డి, జయ సింహారెడ్డి పాత్రల్లో బాలయ్య కనిపించారు. ఈ బాలకృష్ణ సరసన హనీరోజ్, శృతిహాసన్ నటించారు.
నవంబర్ 09 , 2023
Sreeleela: టాలీవుడ్‌లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!
అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేసింది. రవితేజ, రామ్, బాలకృష్ణ, నితీన్, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ‘భగవంత్ కేసరి’ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేశారు. మహేష్ ‘గుంటూరు కారం’ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్‌తో ఈ అమ్మడు మరోమారు బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది.
నాగచైతన్యకు జోడీగా..
నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు (Karthik Dandu) ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. 'NC24' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, SVC క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా ఎంపికైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తొలుత ఈ పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)ని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. లుక్స్ టెస్ట్ కూడా ఆదివారం (డిసెంబర్ 15) జరిగిందని, మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. దీంతో తెరపై చైతూ-శ్రీలీల జోడీ తెరపై ఎలాంటి మాయ చేస్తుందోనని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు.
https://twitter.com/klapboardpost/status/1868499773554409475
కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ..
‘అమరన్’తో సాలిడ్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 'SK25' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నటుడు జయం రవి, అధర్వ కీలక పాత్రల పోషించనున్నారు. రూ.150 కోట్ల బడ్టెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. తమిళంలో శ్రీలీలకు ఇదే మెుట్ట మెుదటి ఫిల్మ్. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రానికి 'పురనానూరు' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇది రానున్నట్లు సమాచారం.
https://twitter.com/MovieTamil4/status/1868647066563686816
చేతి నిండా ప్రాజెక్ట్స్..
నితీన్ లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robin Hood)లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్. రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న 'మాస్ జాతర' (Mass Jathara) చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా చేస్తోంది. 'ధమాకా' (Dhamaka) తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అఖిల్ అక్కినేని (Akkineni Akhil) అప్‌కమింగ్ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా రానున్న 'కోహినూర్' (Kohinur) చిత్రంలోనూ శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని శ్రీలీల దూకుడు ప్రదర్శిస్తోంది.
https://twitter.com/GulteOfficial/status/1868525815597850925
డిసెంబర్ 16 , 2024
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ మళ్లీ భయపెట్టిందా? రేటింగ్ ఇదే!
నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరీ కృష్ణ
సంగీతం: జ్ఞాని
సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిదంటే
పొలిమేర పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్ 1లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్-1లో లాగే పార్ట్-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశారు.
ఎవరెలా చేశారంటే?
కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ అదరగొట్టాడు. పార్ట్ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సత్యం రాజేశ్ నటనకథలోని ట్విస్ట్‌లునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంలాజిక్ లేని సీన్స్
చివరిగా: థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్ సీన్స్, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.
రేటింగ్ : 3.5/5
నవంబర్ 03 , 2023
Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్ చేసింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
మార్చి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఏప్రిల్
2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది.
జూన్
ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
జులై
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్ పాన్ ఇండియా స్థాయికి తెలిసింది.
ఆగస్టు
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్
గత నెల సెప్టెంబర్ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.
డిసెంబర్
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది.
అక్టోబర్ 17 , 2024
OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.
ఆ సినిమా ఏదంటే?
2023లో 95వ ఆస్కార్స్ అవార్డ్స్ కోసం అత్యధిక నామినేషన్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రిలీజ్ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్ చూసేయండి.
https://twitter.com/i/status/1634197587438731264
ఊహకందని కాన్సెప్ట్‌తో..
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మనిషిని పోలిన మనుషులు మిగిలిన ప్యారలాల్ యూనివర్స్‌లలో ఉంటారనే పాయింట్‌తో దర్శకులు డేనియల్ క్వాన్, డేనియల్ షైనెర్ట్ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం కురిపించింది.
కథ కోసం 8 ఏళ్ల శ్రమ
కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్, షైనెర్ట్.. 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.
కథేంటి
‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రం. మిషెల్ యో, కి హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్ క్వాడ్ అనే చైనీస్ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.
Telugu.yousay.tv Rating : 3.5/5
ఏప్రిల్ 13 , 2024
Telugu Super Hit Songs 2023: ఈ ఏడాది యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాటలు ఇవే!
ఈ ఏడాది టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో పాటలు విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కొన్ని తెలుగు పాటలు జాతీయస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. యూట్యూబ్‌ను షేక్ చేస్తూ అత్యధిక ఆదరణను సంపాదించాయి. 2023లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న పాటలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
మా బావ మనోభావాలు..
ఈ ఏడాది తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించిన ఐటెం సాంగ్.. 'మా బావ మనోభావాలు..'. వీరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. ఈ సాంగ్‌లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసి అదరగొట్టారు. సాహితి, యామిని, రేణు కుమార్ ఆలపించిన ఈ పాటను రామ జోగయ్యశాస్త్రి రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
https://www.youtube.com/watch?v=DCrO12C5oho
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
'బేబీ' చిత్రం ఈ ఏడాది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట గుండెల్ని పిండేస్తుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సాంగ్.. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలను పొందింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
మాస్టారు మాస్టారు
ధనుష్ హీరోగా రూపొందిన 'సార్' చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని 'మాస్టారు మాస్టారు' సాంగ్ సంగీత ప్రియులను కట్టిపడేసింది. ఈ పాటను ప్రముఖ కన్నడ గాయని శ్వేతా మోహన్ ఆలపించారు.
https://www.youtube.com/watch?v=AXSm49NGkg8
పొట్టిపిల్ల
జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమాలోని ‘పొట్టిపిల్ల’ సాంగ్ ఈ ఏడాది బాగా వినిపించింది. చాలా ఫంక్షన్లు, యూత్ ఈవెంట్లలో మారుమోగింది. ముఖ్యంగా యువత ఈ పాటపై రీల్స్ చేసుకొని షేర్ చేసుకున్నారు. పొట్టిపిల్ల పాటను సింగర్ రామ్ మిరియాల ఆలపించారు.
https://www.youtube.com/watch?v=CDNb6zyybDg
చంకీల అంగీలేసి
హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. ఈ సినిమాలోని 'చంకీల అంగిలేసి' అప్పట్లో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేసి సందడి చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై అద్భుత రీల్స్ చేసి అలరించారు.
https://www.youtube.com/watch?v=9O-mBYAqM1c
నచ్చావులే నచ్చావులే
సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. ఈ సినిమాతో పాటే ఇందులోని 'నచ్చావులే నచ్చావులే' సాంగ్ మంచి ఆదరణను సంపాదించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా.. అజనీశ్ లోక్‌నాథ్ స్వరపరిచారు.
https://www.youtube.com/watch?v=TUGfWIO_fFI
ఆరాథ్య
విజయ్ దేవరకొండ, సమంత జంటగా చేసిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆరాథ్య’ సాంగ్ యూత్‌కు మరింత బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మందికి ఫేవరేట్ సాంగ్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లోనూ అధిక వీక్షణలు పొందింది.
https://www.youtube.com/watch?v=wlC_eFbxwDo
సమ్మోహనుడా..
రూల్స్ రంజన్ సినిమాలోని ‘సమ్మోహనుడా’ సాంగ్ ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్‌రిష్ ఇచ్చిన ట్యూన్.. శ్రీయా గోషల్ వాయిస్ అందర్నీ కట్టిపడేసింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గానూ నిలిచింది. సాంగ్ రిలీజ్ అనంతరం ట్రెండ్ అయిన పది రీల్స్‌లో ఐదు ఈ పాటకు సంబంధించినవే కావడం విశేషం.
https://www.youtube.com/watch?v=aJQcn34K_S8
నిజమే నే చెబుతున్నా
ఊరి పేరు భైరవకోన సినిమాలోని 'నిజమే నే చెబుతున్నా' సాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు.
https://www.youtube.com/watch?v=2pgx-tajxwE
జమల్ జమాలో
యానిమల్ సినిమాలోని ‘జమల్ జమాలో’ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన పదిహేను గంటల్లోనే ఏడు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. జమల్ జమాలో పాట నిజానికి ఒక ఇరాన్ సాంగ్. ఈ పాటను ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాశారు. 1958లో ఈ పాట వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుకలతో పాటు ఇతర పంక్షన్స్‌లో ఈ పాట తప్పకుండా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
https://www.youtube.com/watch?v=PmdyY38g6Rg
డిసెంబర్ 28 , 2023
Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న
గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్ చిత్రం సూపర్ హిట్ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు.
మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ మూవీతో మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్ స్టోరీస్-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్ సెర్చ్‌డ్ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.
శ్రీలీల
ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడింది.
తమన్న భాటియా
మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి.
సమంత
ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్ మూవీ ‘ఖుషి’ హిట్ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్ చేశారు.
అనుష్క శెట్టి
అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.
కాజల్ అగర్వాల్
పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్ చేసిన ఘోస్ట్, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.
కీర్తి సురేష్
ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్ బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్ కావడంతో కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.
రకుల్ ప్రీత్ సింగ్
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్ ఫోటోలు కారణంగా రకుల్ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.
కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 14 , 2023
Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్.. సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు.
దర్శకుడు: శివ తూర్లపాటి
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్
ప్రముఖ హీరోయిన్ ‘అంజలి’ లీడ్ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రీక్వెల్ లాగానే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
దర్శకుడు శ్రీనివాస్ (శ్రీనివాస్ రెడ్డి) హ్యాట్రిక్ ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతింటాడు. పొట్టకూటి కోసం మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సత్య హీరోగా ఓ సినిమా అవకాశం వస్తుంది. ఊటీలో రిసార్టు నడుపుతున్న అంజలి ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అయితే దెయ్యాల కోటగా పిలవబడుతున్న సంగీత్ మహల్‌లోనే షూటింగ్ జరపాలని ప్రొడ్యూసర్ ఓ కండీషన్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్ మహల్ గతం ఏంటి? మహల్‌లో షూటింగ్ మెుదలుపెట్టిన శ్రీను & టీమ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
ప్రముఖ నటి అంజలి ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో అదరగొట్టింది. పతాక సన్నివేశాల్లో తన అత్యుత్తమ యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని హార్రర్ సీన్లలో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్ నానిగా సునీల్ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్ మాధవ్ నటన మెప్పిస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఈ సీక్వెల్ మూవీ.. తొలి భాగం చూడనివారికి కూడా అర్థమయ్యేలా డైరెక్టర్ శివ తుర్రపాటి తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సంగీత మహల్‌కు వెళ్లిన తర్వాత అసలు కథను మెుదలుపెట్టాడు. ఆ మహల్ చరిత్ర... అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరును దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ క్రమంలో తీసుకొచ్చిన విరామ సన్నివేశాలతో ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పరంగా చూస్తే లాజిక్‌కు దూరంగా చాలా అంశాలే ఉన్నాయి. బలమైన ఎమోషన్స్ కూడా కొరవడ్డాయి. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మెరుపులు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు సంభాషణలు రాసుకోవడం కాస్త ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా దర్శకుడిగా శివ తన పాత్రకు కొంతమేర న్యాయం చేశారు.
టెక్నికల్‌గా
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకి సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం బాగా కలిసొచ్చింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్‌ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అంజలి నటనకామెడీ సన్నివేశాలుకొన్ని హార్రర్ అంశాలు
మైనస్ పాయింట్స్
కథలో బలం లేకపోవడంలాజిక్‌కు అందని సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 12 , 2024
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ మూవీకి సాధ్యం కాని కలెక్షన్స్ సాధిస్తూ పలు రికార్డులను కొల్లగొడుతోంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరో నేషనల్ అవార్డు పక్కా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సౌత్, నార్త్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క చోట పుష్ప గాడి ప్రభంజనం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధిస్తే సంబంధిత ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తాయి. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆర్‌ఆర్‌ఆర్, కల్కి, సలార్ సినిమా విషయంలో మనం ఇది చూశాం. కానీ ‘పుష్ప 2’ సక్సెస్ విషయంలో టాలీవుడ్ మౌనం వహిస్తోంది. పైగా కొందరు స్టార్స్ ఆ సినిమాను కించపరుస్తూ మాట్లాడటం చర్చకు తావిస్తోంది.
‘క్వార్టర్ ఇస్తే ఎవరైనా వస్తారు’
ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (Siddharth) 'పుష్ప 2' చిత్రంపై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడు నటించిన 'మిస్ యు' చిత్రం ఈ వారమే తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 2'ను కించపరిచేలా మాట్లాడాడు. పాట్నాలో భారీ జనసందోహంలో జరిగిన 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై ఆయన సెటైర్లు వేశారు. 'మన దేశంలో జనసమీకరణం పెద్ద విషయమేమి కాదు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక కన్‌స్ట్రక్షన్ దగ్గ జేసీబీ వర్క్ జరుగుతున్నప్పుడు జనాలు గుమ్మికూడతారు. బిర్యానీ, క్వార్టర్ సీసా ఇస్తే పొలిటికల్ మీటింగ్‌కు జనాలు ఎగబడతారు. పొలిటికల్ మీటింగ్స్‌కు జనాలు వచ్చినంత మాత్రాన పార్టీలు గెలుస్తాయని నమ్మకం లేదు. ఇండియాలో జనం గుమికూడడం సహజమే. ఇది చాలా చిన్న విషయం' అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. మరోవైపు సోమవారం జరిగిన హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్‌లో ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’ అంటూ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన సంగతి తెలిసిందే.
https://twitter.com/WhatTheFuss_/status/1866378487784742950
రాజమౌళి మౌనం ఎందుకు?
దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) ఇండస్ట్రీ నుంచి ఏ మంచి సినిమా వచ్చిన దగ్గరుండి ప్రశంసలు కురిపిస్తారు. ‘సలార్’ (Salaar), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో పాటు ఇటీవల వచ్చిన ‘దేవర’ గురించి కూడా ఆయన స్పందించారు. అటువంటి రాజమౌళి ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత సినిమా గురించి ఒక్క కామెంట్ చేయకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా హాజరైన రాజమౌళి తాను అప్పటికే చూసిన ఇంట్రడక్షన్ సీన్‌పై భారీగా హైప్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. అటువంటి జక్కన్న సినిమా రిలీజ్ తర్వాత సడెన్‌గా మౌన మునిగా మారిపోవడంపై సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేశాడని తెగ ఆలోచిస్తున్నారు.
మహేష్ రివ్యూ ఎక్కడ?
సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) గత కొంతకాలంగా రివ్యూవర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలను స్వయంగా చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కల్కి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో పాటు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం, మత్తు వదలరా 2 వంటి చిన్న సినిమాలకు సైతం మహేష్ ప్రశంసలు కురిపించారు. కానీ యావత్ దేశాన్ని షేక్ చేస్తోన్న 'పుష్ప 2' మాత్రం మహేష్ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. అయితే దీనికి ఓ బలమైన కారణమే ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. బాలయ్య టాక్‌షోలో బన్నీ చేసిన వ్యాఖ్యలు మహేష్‌ను నొప్పించి ఉంటాయని అంటున్నారు. ఆ షోలో ప్రభాస్, మహేష్‌లలో నీకు ఎవరు పోటీ? అని బన్నీని బాలయ్య అడుగుతాడు. అప్పుడు ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ పాడుతూ తనకు తనతోనే పోటీ అంటూ బన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఈ సమాధానం మహేష్ ఫ్యాన్స్‌కే కాకుండా ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు.
బన్నీ యాటిట్యూడే కారణమా?
‘పుష్ప 2’ భారీ విజయం సాధించడంపై టాలీవుడ్ పెద్దలు సంతోషంగా ఉన్నప్పటికీ ఆ సినిమా చేసిన డ్యామేజ్ విషయంలో మాత్రం వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకొని ఓ మహిళ మృతి సంగతి తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెన్‌ఫిట్ షోలకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతికి రాబోయే చిత్రాలు బాగా ఎఫెక్ట్ కానున్నాయి. బన్నీ ఆ రోజు థియేటర్‌కు రాకుండా ఉంటే ఇలాంటి తప్పిదం జరిగేది కాదని సినీ పెద్దలు భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి విషయంలో అతడు వ్యవహార శైలి కూడా సరిగా లేదని అభిప్రాయపడుతున్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సక్సెస్‌పై ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రశంసలు రావట్లేదని టాక్ వినిపిస్తోంది.
డిసెంబర్ 10 , 2024
Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా పుష్పరాజ్ సృష్టిస్తున్న రికార్డ్స్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్ నడుస్తున్న సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్ యాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
హరికథ ప్రీరిలీజ్ ఈవెంట్..
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హరికథ వెబ్ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్ బృందమంతా పాల్గొంది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.
https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM
‘రూ.1000 టికెట్ పెట్టి వెళ్లక్కర్లా’
‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా ఒక్కో టికెట్ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546
తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్ చేశారు. ఈ సిరీస్ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
డిసెంబర్ 09 , 2024
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్‌లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
నవంబర్ 05 , 2024
Karthi - Mahesh Babu: మహేష్ గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ.. సర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్!
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆయన చేసిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులో రిలీజై మంచి విజయాలను అందుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన సత్యం సుందరం కూడా తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు భాష, ఇక్కడి ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టమని కార్తీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే సత్యం సుందరం సక్సెస్ మీట్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్యూలో నటుడు కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహేష్ నా క్లాస్‌మేట్: కార్తీ
కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravinda Swami) ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చిత్రం శనివారం (సెప్టెంబర్ 28) విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తీ మాట్లాడారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యూచర్‌లో మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందా? అంటూ రిపోర్టర్ కార్తీని అడిగారు. దీనికి కార్తీ బదులిస్తూ సరైన కథ దొరికితే మహేష్‌తో తాను సినిమా చేయడానికి రెడీ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మహేష్ తాను స్కూల్లో క్లాస్‌మేట్స్ అంటూ పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. అటు ఫ్యాన్స్ కూడా కార్తీ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం ఈ విషయం తమకు తెలియలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/_VardhanDHFM_/status/1840974122475532541
కథ వినగానే అనుమానించా!
సత్యం సుందరం స్టోరీ వినగానే ఇలాంటి సినిమాను ఈ రోజుల్లో చూస్తారా? అని అనుమానం కలిగిందని కార్తీ (Karthi) పేర్కొన్నారు. కానీ, కొత్త కాన్సెప్ట్‌తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. 'తెలుగు ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్ చేశారు. వారు సినిమా చూసి చాలా ఎమోషనల్‌గా ఫీలవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమా కమర్షియల్‌గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ తరహా చిత్రాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది' అని కార్తీ చెప్పుకొచ్చారు.
కార్తీకి కథ చెప్పిన రాజమౌళి!
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు' అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. రాజమౌళి చెప్పింది ‘RRR’ అయ్యి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
డిసెంబర్‌లో ‘SSMB 29’ షూటింగ్!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 01 , 2024
Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్ అయినా తమ్ముడు సక్సెస్ అయ్యాడు!
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్, రాజ్ అర్జున్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, క్రిష్ణ చైతన్య
డైరెక్టర్ : ఉదయ్ బొమ్మిశెట్టి
సంగీతం : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి
ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్ సెలగంశెట్టి
విడుదల తేదీ : 31-05-2024
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలు. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిశోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్, ప్రిన్స్ యావర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా అయినా సక్సెస్ కావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా?
కథేంటి
గణేష్ (ఆనంద్ దేవరకొండ).. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయెల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్ గణేష్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. అటు హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. మరో కథానాయిక నయన్ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయెల్ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్ అర్జున్ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు ఉదయ్ బొమిశెట్టి రొటీన్ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్ & ఎంటర్‌టైనింగ్ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్ - వెన్నెల కిషోర్ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, సెకండాఫ్ ట్విస్టులు, థ్లిల్లింగ్ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
ఆనంద్ దేవరకొండ నటనకామెడీట్విస్టులు
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు
Telugu.yousay.tv Rating : 3/5
పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. ఈ వీకెండ్ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్ చేరిందని కామెంట్ పెట్టాడు.
https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755
‘గం గం గణేశా’ డీసెంట్ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.
https://twitter.com/review_rowdies/status/1796384723033596372
స్టోరీలో కంటెంట్ మిస్ అయ్యిందని మరో నెటిజన్ పోస్టు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.
https://twitter.com/Mjcartels/status/1796394003979800864
‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు.
https://twitter.com/tcsblogs/status/1796341604845867293
మే 31 , 2024