• TFIDB EN
 • స్పిరిట్
  రేటింగ్ లేదు
  U/ATelugu
  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయితే 'స్పిరిట్‌'ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో స్పిరిట్ సినిమా కథా నేపథ్యం రానుంది.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  2024 Mar 292 months ago
  ఈ చిత్రంలో ప్రభాస్ భార్యగా రష్మిక మంధాన, సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
  2024 Mar 292 months ago
  స్పిరిట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లడం మరింత ఆలస్యం కానుంది. స్క్రిప్ట్ వర్క్ ఉండటం వల్ల ఈ ఏడాది డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది.
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  ప్రభాస్
  రష్మిక మందన్న
  పంకజ్ త్రిపాఠి
  విద్యుత్ జమ్వాల్
  త్రిష కృష్ణన్
  కీర్తి సురేష్
  మంచు మనోజ్
  సిబ్బంది
  సందీప్ రెడ్డి వంగ
  దర్శకుడు
  భూషణ్ కుమార్
  నిర్మాత
  కథనాలు
  Spirit Movie: ప్రభాస్‌ భార్యగా రష్మిక.. సోదరిగా కీర్తి సురేష్‌.. గెస్ట్‌ రోల్‌లో త్రిష.. కాంబో మామూల్గా లేదుగా?
  Spirit Movie: ప్రభాస్‌ భార్యగా రష్మిక.. సోదరిగా కీర్తి సురేష్‌.. గెస్ట్‌ రోల్‌లో త్రిష.. కాంబో మామూల్గా లేదుగా?
  టాలీవుడ్‌ సెన్సేషన్‌ సందీప్‌ రెడ్డి వంగా.. తీసిన మూడు చిత్రాలతోనే పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ‌అర్జున్‌ రెడ్డితో డైరెక్టర్‌గా తెరంగేట్రం చేసిన సందీప్‌.. రీసెంట్‌గా ‘యానిమల్‌’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కుపిరించాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రం స్పిరిట్‌పై అందరి దృష్టి పడింది. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇందులో హీరోగా నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటికి రాగా అది ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.  షూటింగ్‌ మరింత ఆలస్యం ప్రభాస్‌ - సందీప్‌రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రం త్వరలోనే మెుదలు కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్‌లో మెుదలు కాదట. తాజాగా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో స్పిరిట్ పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టోరీ, స్క్రిప్ట్‌ వర్క్‌ సహా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అటు నటీనటుల ఎంపికపైనా త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ను వెనకెనక్కి జరుపుతున్నారని సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  ప్రభాస్‌ రాకతో రణ్‌బీర్‌ వెనక్కి! సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్‌ మూవీ ‘యానిమల్‌’ (Animal)కు సీక్వెల్‌ కూడా రానున్న విషయం తెలిసిందే. యానిమల్‌ పార్క్‌ (Animal Park) పేరుతో రానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ మరింత వైలెంట్‌గా కనిపించనున్నాడు. అయితే ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కనుందని ఓ దశలో బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. యానిమల్‌ పార్క్‌ స్టోరీ కూడా రెడీగా ఉండటంతో సందీప్‌ ముందుగా ఈ సీక్వెన్స్‌ పైనే ఫోకస్‌ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. అయితే ఆయన తాజా ప్రకటనతో స్పిరిట్‌ మూవీనే ముందుగా రాబోతున్నట్లు మరోమారు కన్ఫార్మ్‌ అయ్యింది. దీంతో రణ్‌బీర్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్‌ ముందుకు వచ్చినట్లైంది.  ముగ్గురు హీరోయిన్లు! ‘స్పిరిట్‌’ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్న దానిపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రముఖ మూవీ వెబ్‌సైట్‌ IMDBలో అభిమానులు మాత్రం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు అప్‌డేట్ చేశారు. స్పిరిట్‌ మూవీ క్యాస్ట్ విభాగంలో రష్మిక, త్రిష, కీర్తిసురేష్‌లను చేర్చారు. అంతేకాదు ఇందులో ప్రభాస్‌ భార్యగా రష్మిక, సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుందని, త్రిష కెమియో రోల్ చేయనున్నట్లు కూడా రాసుకొచ్చారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం. 
  మార్చి 29 , 2024
  Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
  Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.  సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.  ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి. 
  మార్చి 12 , 2024
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.  యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.  ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
  ఫిబ్రవరి 29 , 2024
  Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
  Prabhas New House: లండన్‌లో లగ్జరీ హౌస్‌ తీసుకున్న ప్రభాస్‌.. హీరోయిన్ షాకింగ్‌ కామెంట్స్‌!
  దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) రూపొందించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంతో హీరో ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వరసగా జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తూ వస్తోన్న ప్రభాస్‌.. రీసెంట్‌గా ‘సలార్‌’ (Salaar)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.611.8 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. గ్లోబల్‌ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్‌ తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ వార్త విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా! దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం టాలీవుడ్‌లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించారు. అటువంటి హను రాఘవపూడితో ప్రభాస్‌ తన కొత్త సినిమా తీయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం వారి చిత్రం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉన్న ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిచనున్నారు.  ఖరీదైన ఇంట్లోకి ప్రభాస్‌? సలార్‌ మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న ప్రభాస్‌.. మరో రెండు నెలల్లో మే 9న 'కల్కి 2898 ఏడి’ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ప్రభాస్‌ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని సైతం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇంటి అద్దె కూడా కళ్లు చెదిరే రీతిలో ఉందట. నెలకు రూ.60 లక్షల వరకూ అద్దె చెల్లించనున్నట్లు తెలిసింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు మాత్రమే ఎక్కువగా విదేశాల్లో గడుపుతుండేవారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్లు సైతం విదేశాల్లో గడిపేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.  హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్‌! శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మార్చి 1న ఈ సినిమా రిలీజ్‌ కానుండగా హీరోయిన్‌ రాశి సింగ్‌ మాట్లాడుతూ ప్రభాస్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాఫ్‌ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. కానీ మా సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ  కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  ప్రభాస్ క్రేజీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ఇవే! ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలువురు స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌.. ‘కల్కి 2898 ఏడీ’తో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ (Spirit)తో పాటు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ (Salaar 2)లో నటించనున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఇంకో సినిమా చేయనున్నారు. మెుత్తంగా ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చూసి ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. 
  ఫిబ్రవరి 27 , 2024
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.  ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.  అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.  ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది. 
  ఫిబ్రవరి 27 , 2024
  Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
  Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
  దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.  డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. 
  ఏప్రిల్ 23 , 2024
  Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
  Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
  కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా మరికొన్ని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్‌ వాటెండ్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  గుంటూరు కారం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.  హనుమాన్ ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్‌. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్‌ విడుదల కానుంది.  భారతీయుడు 2 అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు.  పుష్ప 2 సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్‌-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గేమ్‌ ఛేంజర్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  కల్కి 2898 ఏడీ సలార్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్‌ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. స్పిరిట్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్‌ 'స్పిరిట్‌' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్‌ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్‌ స్టార్‌ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెలియజేశారు. 
  డిసెంబర్ 30 , 2023
  తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
  తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
  ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం. ప్రభాస్‌: హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  మహేశ్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.  పవన్‌ కళ్యాణ్‌: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు. పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.  రామ్‌ చరణ్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.  జూ. ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.  RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో  రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.  https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html అల్లు అర్జున్‌: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  చిరంజీవి అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్. బాలకృష్ణ: నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.  విజయ్‌ దేవరకొండ: అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. 
  ఏప్రిల్ 01 , 2023
  Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
  Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
  దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.  నాగ్ అశ్విన్‌ (Nag Ashwin)   ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.   టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.  https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.  https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.  ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.  స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.  ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..  ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.  ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.  కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.  సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి  సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.  బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు. 
  మే 24 , 2024
  Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
  Tollywood : బాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతున్న తెలుగు డైరెక్టర్లు.. స్టార్‌ హీరోలతో సినిమాలు లాక్‌!
  ప్రస్తుతం టాలీవుడ్‌ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘హనుమాన్‌’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా టాలీవుడ్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయితే ఆ సినిమాలకు ముందు టాలీవుడ్‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. బాలీవుడ్‌ వర్గాలకు తెలుగు ఇండస్ట్రీ అంటే కాస్త చిన్నచూపు ఉండేదని అప్పట్లో టాక్‌ వినిపించింది. ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన పాన్‌ ఇండియా చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ వస్తుండటంతో ఇక్కడి డైరెక్టర్ల ప్రతిభ హిందీ స్టార్లను ఆకర్షిస్తోంది. దీంతో వారు టాలీవుడ్‌ డైరెక్టర్లతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు టాలీవుడ్‌ డైరెక్టర్లతో బాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాలు కూడా ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్లు ఎవరు? ఏ బాలీవుడ్‌ స్టార్‌తో వారు సినిమా చేయబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం.  రణ్‌వీర్‌ - ప్రశాంత్‌ వర్మ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma).. 'హనుమాన్‌' (Hanu Man) చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు. ప్రశాంత్‌ అంటే బాలీవుడ్‌ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడికి బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో సినిమా చేసే అవకాశం దక్కింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో రణ్‌వీర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతే కాదు దీనికి ‘రాక్షస్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.  సన్నీ డియోల్‌ - గోపిచంద్‌ మలినేని దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni)కి టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. కొత్త తరహా కథతో అద్భుతమైన యాక్షన్‌ చిత్రాలను ఆయన రూపొందిస్తుంటారు. ఇలా వచ్చి సూపర్‌ హిట్ సాధించినవే ‘క్రాక్‌’ (Krack), ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు. ఇదిలా ఉంటే అతడికి బాలీవుడ్‌ నుంచి సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గదర్‌ 2’ (Gadar 2)సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ అందుకున్న సన్నీ డియోల్ (Sunny Deol)తో గోపిచంద్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా ఆయన శైలీలోని యాక్షన్‌ డ్రామాగా రానున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ వచ్చేనెలలో మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.  షాహిద్‌ కపూర్‌ - వంశీ పైడిపల్లి టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి (Vamsi Paidipally).. గత కొంతకాలంగా తెలుగు హీరోలకంటే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌తో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత చిత్రం ‘వారసుడు’లో విజయ్‌ హీరోగా చేశాడు. ఇక తన అప్‌కమింగ్‌ చిత్రం కోసం బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor)ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షాహిద్‌ కపూర్‌కు కథ చెప్పి ఒప్పించినట్లు కూడా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు చిత్రాలను డబ్‌ చేసి విడుదల చేసే గోల్డ్‌మైన్‌ సంస్థ.. ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.  సాయి రాజేశ్‌ గతేడాది జులైలో రిలీజైన ‘బేబీ’ (Baby) చిత్రం టాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ వెండితెరకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు సాయి రాజేశ్‌.. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఏమేరకు ఆకర్షిస్తాడో చూడాలి.  సందీప్‌ రెడ్డి వంగా - రణ్‌బీర్‌ కపూర్‌ టాలీవుడ్‌ అగ్రెసివ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చేసిన రీసెంట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal).. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. బాలీవుడ్‌ లవర్‌ బాయ్ రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)ను గతంలో ఎన్నడూ చూడనంత వైలెంట్‌గా ఈ సినిమాలో చూపించాడు. అయితే యానిమల్‌కు సీక్వెల్‌ కూడా భవిష్యత్‌లో రానుంది. రణ్‌బీర్‌ను మరింత వైలెంట్‌గా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చూపించనున్నారు. ప్రస్తుతం సందీప్‌.. ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ తర్వాత ‘యానిమల్‌ 2’ పట్టాలెక్కనుంది. 
  మే 06 , 2024

  @2021 KTree