• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Spirit Movie: ప్రభాస్‌ భార్యగా రష్మిక.. సోదరిగా కీర్తి సురేష్‌.. గెస్ట్‌ రోల్‌లో త్రిష.. కాంబో మామూల్గా లేదుగా?

  టాలీవుడ్‌ సెన్సేషన్‌ సందీప్‌ రెడ్డి వంగా.. తీసిన మూడు చిత్రాలతోనే పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ‌అర్జున్‌ రెడ్డితో డైరెక్టర్‌గా తెరంగేట్రం చేసిన సందీప్‌.. రీసెంట్‌గా ‘యానిమల్‌’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కుపిరించాడు. దీంతో ఆయన తర్వాతి చిత్రం స్పిరిట్‌పై అందరి దృష్టి పడింది. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇందులో హీరోగా నటిస్తుండటంతో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటికి రాగా అది ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. 

  షూటింగ్‌ మరింత ఆలస్యం

  ప్రభాస్‌ – సందీప్‌రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రం త్వరలోనే మెుదలు కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్‌లో మెుదలు కాదట. తాజాగా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో స్పిరిట్ పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టోరీ, స్క్రిప్ట్‌ వర్క్‌ సహా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అటు నటీనటుల ఎంపికపైనా త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ను వెనకెనక్కి జరుపుతున్నారని సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 

  ప్రభాస్‌ రాకతో రణ్‌బీర్‌ వెనక్కి!

  సందీప్‌ రెడ్డి (Sandeep Reddy Vanga) లేటెస్ట్‌ మూవీ ‘యానిమల్‌’ (Animal)కు సీక్వెల్‌ కూడా రానున్న విషయం తెలిసిందే. యానిమల్‌ పార్క్‌ (Animal Park) పేరుతో రానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ మరింత వైలెంట్‌గా కనిపించనున్నాడు. అయితే ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కనుందని ఓ దశలో బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. యానిమల్‌ పార్క్‌ స్టోరీ కూడా రెడీగా ఉండటంతో సందీప్‌ ముందుగా ఈ సీక్వెన్స్‌ పైనే ఫోకస్‌ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. అయితే ఆయన తాజా ప్రకటనతో స్పిరిట్‌ మూవీనే ముందుగా రాబోతున్నట్లు మరోమారు కన్ఫార్మ్‌ అయ్యింది. దీంతో రణ్‌బీర్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్‌ ముందుకు వచ్చినట్లైంది. 

  ముగ్గురు హీరోయిన్లు!

  ‘స్పిరిట్‌’ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్న దానిపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రముఖ మూవీ వెబ్‌సైట్‌ IMDBలో అభిమానులు మాత్రం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు అప్‌డేట్ చేశారు. స్పిరిట్‌ మూవీ క్యాస్ట్ విభాగంలో రష్మిక, త్రిష, కీర్తిసురేష్‌లను చేర్చారు. అంతేకాదు ఇందులో ప్రభాస్‌ భార్యగా రష్మిక, సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుందని, త్రిష కెమియో రోల్ చేయనున్నట్లు కూడా రాసుకొచ్చారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

  పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌

  దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv