• TFIDB EN
  • స్పైడర్
    U/ATelugu2h 25m
    ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    శివ
    S. J. సూర్య
    భైరవుడు
    రకుల్ ప్రీత్ సింగ్
    చార్లీ
    భరత్
    భైరవుడు సోదరుడు
    ప్రియదర్శి పులికొండ
    as Vinay
    ఆర్జే బాలాజీ
    మధు
    జయప్రకాష్
    శివుని తండ్రి
    ధీపా రామానుజం
    శివ తల్లి
    కని కృతి
    సాయాజీ షిండే
    DGP చంద్రశేఖర్
    నాగినీడు
    నాగినీడు
    హిమజ
    as Renuka
    షాజీ చెన్
    IB హెడ్ మాథ్యూస్‌
    హరీష్ పేరడి
    CBI హెడ్ ఆఫీసర్‌
    అజయ్ రత్నం
    ఇన్‌స్పెక్టర్ గోకుల్‌నాథ్‌
    జార్జ్ మేరియన్
    సెంద్రాయన్
    రోగ్‌
    రామ్ సంపత్
    రౌడీ
    సిబ్బంది
    ఏఆర్ మురుగదాస్
    దర్శకుడు
    ఎన్వీ ప్రసాద్నిర్మాత
    ఎన్వీ ప్రసాద్నిర్మాత
    హారిస్ జయరాజ్
    సంగీతకారుడు
    సంతోష్ శివన్
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
    Guntur Kaaram: ‘సర్రా సర్రా’.. పాటకు స్పైడర్ మ్యాన్ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్‌ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  స్పైడర్‌ మ్యాన్స్‌ స్పెప్పులేస్తే.. గుంటూరు కారం సినిమాలో వచ్చే ‘మావ ఎంతైన’ పాటలో మహేష్‌ తన డ్యాన్స్‌తో అదరగొడతాడు. ముఖ్యంగా సాంగ్‌ ఎండింగ్‌లో వచ్చే ‘సర్రా.. సర్రా.. సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ హైలెట్‌గా అనిపిస్తుంది. బీట్‌కు తగ్గట్లు స్పెప్పులేసి మహేష్‌ అలరిస్తాడు. అయితే ఈ మ్యూజిక్‌కి స్పైడర్‌ మ్యాన్‌ (Spider Man) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఓ నెటిజన్‌కు వచ్చింది. స్పైడర్‌ మ్యాన్‌ గెటప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వేసిన డ్యాన్స్‌ను.. ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌కు సరిగ్గా సింక్‌ అయ్యేలా ఎడిట్‌ చేశాడు. స్పైడర్‌ మ్యాన్‌ తెలుగు వెర్షన్‌ పాటకు డ్యాన్స్‌ వేస్తే... అందరికీ కనుల విందుగా ఉంటుందంటూ వీడియోకు క్యాప్షన్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోపై మీరూ లుక్కేయండి.  https://twitter.com/i/status/1781273824639725625 ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే.. మహేష్‌ పాటకు స్పైడర్‌ మ్యాన్‌ స్టెప్పులు వేసిన వీడియోపై ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్టెప్పులు భలే సింక్ అయ్యాయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆసక్తికరంగా.. స్పైడర్‌ మ్యాన్‌ : గుంటూర్‌ కార్‌ 'హోమ్‌' (Spiderman: Guntur Kar'Home') అంటూ ఈ వీడియోకు ఫన్నీ టైటిల్‌ కూడా ఇచ్చాడు. మహేష్‌, స్పైడర్‌ మ్యాన్‌ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందంటూ మరో ఫ్యాన్‌ అభిప్రాయపడ్డాడు. SSMB 29 తర్వాత మహేష్‌ క్రేజ్‌ హాలీవుడ్‌ స్థాయికి చేరుకుంటుందని అప్పుడు ఇది నిజంగానే సాధ్యమవుతుందని ఇంకో నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ‘సర్రా.. సర్రా..’ మ్యూజిక్‌ తనకు ఎంతో ఇష్టమని మరికొందరు పోస్టు చేస్తున్నారు.  మరో రికార్డు.. గుంటూరు కారంలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మహేష్‌ బాబు, శ్రీలీల (Sreeleela), పూర్ణ (Purna) ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. అయితే ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల మార్క్‌ను ఈ సాంగ్‌ అందుకుంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన రెండో పాటగా ఇది నిలిచింది. సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్‌ అయితే ఏకంగా 245 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉంది. https://www.youtube.com/watch?v=Ldn11dMHTJ8
    ఏప్రిల్ 20 , 2024
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో  అంతం చేస్తాడు. అటువంటి  బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.  భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.  కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.  కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.  రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో  రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.  పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.  అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.  పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.  ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.  సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.  బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.  అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు. 
    ఫిబ్రవరి 29 , 2024
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్‌ అయిపోతున్న డైరెక్టర్లు
    సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్‌ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా? సముద్రఖని సముద్రఖని తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్‌, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.  ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్‌ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్‌, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.  గౌతమ్ మీనన్‌ ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్‌ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్‌ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు. భారతీ రాజా శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా. తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్‌ వచ్చినా తరుణ్ భాస్కర్‌ వదులుకోవట్లేదు.  రిషబ్‌ శెట్టి కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్‌ బాయ్‌, స్పాట్ బాయ్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్‌ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్‌ ఇండియాను షేక్‌ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. 
    ఏప్రిల్ 27 , 2023
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.  ప్రకాష్‌ రాజ్‌  ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్‌ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్‌.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈ సీన్‌లో నటించమని ప్రకాష్‌ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్‌ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్‌ తెగ ఆలోచిస్తుంటారు.  https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp మహేష్‌ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన స్పైడర్‌ (Spyder) సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్‌ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్‌ కెరీర్‌లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.  మోహన్‌ బాబు 2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్‌ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్‌ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్‌ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.  https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X వెంకటేష్‌  టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్‌ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్‌.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.  రామ్‌ చరణ్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్‌ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్‌ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. అసలు చరణ్‌.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.  https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db ప్రభాస్‌ ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్‌’.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్‌ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ను డైరెక్టర్‌ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.  https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
    ఏప్రిల్ 30 , 2024
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.  మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.  https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.  https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s నాగార్జున భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.  https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s రామ్‌చరణ్ తేజ్ రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.  అఖిల్, వరుణ్ తేజ్ రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.  https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
    ఆగస్టు 08 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    Mothers Day Special: మహేష్ బాబు సోదరి ఎమోషనల్.. సరదాగా కాజల్, రాశి ఖన్నా, హనిరోజ్!
    మాతృదినోత్సవాన్ని సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లో బిజీగా ఉండే వారంతా మదర్స్‌డే రోజున పూర్తిగా తమ తల్లులతో టైమ్‌ స్పెండ్ చేశారు. వారితో ఆప్యాయంగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సినీ తారలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో పంచుకున్నారు. మరోవైపు అమ్మ దూరమైన జాన్వికపూర్‌, విష్ణుప్రియ తదితరులు తల్లితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా తారలు పోస్టు చేసిన ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.  పంజా వైష్ణవ్‌ తేజ్‌ చిరంజీవి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో పంజా వైష్ణవ్‌ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. అన్న సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి తల్లితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.  View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) శ్రీజ కొణిదెల మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజ.. మాతృదినోత్సవం రోజున తన తల్లితో సరదాగా గడిపింది. తన అక్క సుశ్మితతో కలిసి తల్లితో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. తనకు లభించిన అత్యుత్తమైన బహుమతి తన తల్లి అని శ్రీజ క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) కాజల్ అగర్వాల్ ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్‌ కూడా తన తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తన తల్లితో దిగిన ఫోటోనూ షేర్‌ చేసిన కాజల్‌.. ఆమె లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే దానిని కాదని పేర్కొంది.  View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఆమెతో దిగిన చిన్నప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్‌ మధర్ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) విష్ణు ప్రియ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ మాతృదినోత్సవం రోజున తన తల్లిని గుర్తు చేసుకుంది. ప్రతీ క్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటానని చనిపోయిన తల్లీని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) రాశి ఖన్నా నటి రాశి ఖన్నా తన తల్లితో ఎంతో సంతోషంగా ఉయ్యాల ఊగుతున్న ఫొటోను షేర్ చేసింది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది.  View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) మమతా మోహన్‌ దాస్‌ నటి మమతా మోహన్‌ దాస్‌ కూడా తన తల్లి గొప్పతాన్ని నెటిజన్లకు తెలియజేసింది. నా జీవితంలో గడిపిన ప్రతీ రోజూ నువ్వు ఇచ్చిందేనని తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఆమెతో దిగిన ఫొటోను కూడా నెటిజన్లతో మమతా పంచుకుంది.  View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) హనీరోజ్‌ గ్లామర్‌ బ్యూటీ హనీరోజ్‌ కూడా మాతృదినోత్సవం రోజున తన తల్లి ప్రేమను గుర్తుచేసుకుంది. తన అమ్మతో పాటు ప్రపంచంలోని ప్రతీ అమ్మకు శుభాకాంక్షలు తెలియజేసింది.  View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) పద్మావతి మహేష్‌బాబు సోదరి గల్లా పద్మావతి కూడా మాతృదినోత్సవ రోజున తన తల్లి చూపించిన ఆప్యాయతను గుర్తుచేసుకుంది. పద్మావతి కుమారుడు, నటుడు అశోక్‌ గల్లా ఈ ఫొటోను షేర్ చేశాడు. తన తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  View this post on Instagram A post shared by Galla Ashok (@ashokgalla_) నైనికా విద్యాసాగర్ మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్‌ తన తల్లితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.  View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16)
    మే 15 , 2023
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.  బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.  టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)  స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.  సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు& టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.  ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.  టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.  మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్  (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద  ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది. 
    మే 22 , 2024
    రామ్‌ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రామ్‌ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్‌ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి... RRR చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. అత్యంత డౌన్ టు ఎర్త్‌గా ఉండటంతో ఆయనకు విస్తృత అభిమానం పొందారు. ఈక్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ ఎవరు? టాలీవుడ్‌లో స్టార్ హీరో, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రామ్ చరణ్ పుట్టినరోజు ఎప్పుడు? రామ్ చరణ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. మెగాపవర్ స్టార్ వయసు 39 ఏళ్లు. రామ్‌ చరణ్ ముద్దు పేరు? చెర్రీ రామ్ చరణ్ ఎత్తు ఎంత? 5 అడుగల 8 అంగుళాలు రామ్‌ చరణ్ అభిరుచులు? చరణ్‌కు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జిమ్‌లో సాధన చేస్తుంటాడు. హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టం రామ్ చరణ్ హీరోగా ఎన్ని సినిమాలు వచ్చాయి? రామ్ చరణ్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు రామ్ చరణ్ ఏ యాక్టింగ్ స్కూల్‌లో చదివాడు? తన సినీరంగ ప్రవేశానికి ముందు, చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ స్కూలు చాలా ఫేమస్. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అందరూ ఇక్కడ నటనను అభ్యసించారు. రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడా? జూన్ 14, 2012న, రామ్ చరణ్ తన స్నేహితురాలైన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు CEO. రామ్‌చరణ్‌కు ఉపాసనకు ఎలా పరిచయం అయింది?  రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ లండన్‌లోని రీజెంట్ యూనివర్శిటీలో తమ చదువును పూర్తి చేసారు, ఆ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు. రామ్‌ చరణ్- ఉపాసనకు ఎంతమంది పిల్లలు? వీరిద్దరి ఒక పాప జన్మించింది. పాప పేరు క్లింకారా రామ్ చరణ్ ఎక్కడ నివసిస్తున్నారు? రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. రామ్ చరణ్ కొత్త సినిమా ఏంటి? రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు దర్శకుడు శంకర్ https://www.youtube.com/watch?v=8zpKqO0QMn0 రామ్ చరణ్‌కి ఇష్టమైన ఆహారం? రామ్ చరణ్ వంట చేయడం చాలా ఇష్టం. బిర్యానీ అతనికి ఇష్టమైన వంటకం.  రామ్‌ చరణ్ వ్యాపారాలు?  గుర్రపు పందేలపై తనకున్న అభిరుచిని సూచించేందుకు చరణ్ హైదరాబాద్‌లో పోలో టీమ్‌ని కొనుగోలు చేశాడు. అతను స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉన్నాడు. రామ్ చరణ్‌కు వచ్చిన సినిమా అవార్డులు? తన కెరీర్ మొత్తంలో, రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.
    మార్చి 19 , 2024
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    Miss Shetty Mr Polishetty Review: సూపర్ హిట్.. బొల్డ్ కంటెంట్‌ ఉన్నా.. అనుష్క, నవీన్ పొలిశెట్టి అదరగొట్టారు!
    తారాగణం - అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, తులసి, జయసుధ, నాజర్  డైరెక్టర్ - పీ మహేష్ బాబు నిర్మాత -  ప్రమోద్ ఉప్పలపాటి, వి.వంశీకృష్ణా రెడ్డి బ్యానర్ - UV క్రియేషన్స్ సంగీతం - రధన్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ క్రేజీ కాంబోను థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో ఆమె ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. అలాగే  జాతిరత్నాలు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత నవీన్ 2 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌లోనే అనుష్క మెస్మరైజింగ్ లుక్స్, నవీన్ కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మూవీ యూనిట్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించగా, అనుష్క చెఫ్‌గా కనిపించింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? అనుష్క శెట్టికి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిందా లేదో? ఈ సమీక్షలో చూద్దాం.. కథేంటంటే..? మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి శెట్టి( అనుష్క) తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లండన్‌ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో తల్లి చనిపోయిన తర్వాత అన్విత ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తల్లి లేని తనకు మరొకరి తోడు, కుటుంబం అవసరం లేదని భావిస్తుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టి( నవీన్ పొలిశెట్టి) స్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. అసలు అన్విత సిద్దూను ఏమి కోరింది.. సిద్దూ తన ప్రేమ కోసం ఏంచేశాడు? పెళ్లి వద్దనుకున్న అన్విత తన మనసు మార్చుకుందా? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. స్టాండప్ కామెడియన్ పాత్రలో నవీన్ పొలిశెట్టి ఒదిగిపోయాడు. మరో ఏ హీరో చేసినా తనలాగా సెట్ కాదు అనేలా జీవించాడు. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించాడు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్‌లో బాగా పర్ఫామ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి తాను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకున్నాడు.  హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రం చేసింది. ఆధునిక భావాలున్న యువతి పాత్రలో చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో జీవించింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో అనుష్క నటించిందనే భావన ఆమె ఫ్యాన్స్‌లో తప్పక కలుగుతుంది.  క్లైమాక్స్ సన్నివేశాల్లో అనుష్క యాక్టింగ్ గూస్‌బంప్స్. ఎలా ఉందంటే?  రోటిన్ లవ్ స్టోరీస్, సెన్స్‌లెస్ యాక్షన్‌లెస్ సినిమాలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా ఫ్రేష్ ఫీల్‌ను అయితే అందిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లికావాలనుకే ఓ యువతికి.. ఆమెతో ప్రేమలో పడే ఓ యువకుడి సంఘర్షణను డైరెక్టర్ పీ మహేష్ బాబు చక్కగా తెరకెక్కించాడు. లవ్ స్టోరీతో ముడిపడి ఉన్న ‘స్పెర్మ్ డోనేషన్’ వంటి సున్నితమైన కథాంశాన్ని ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాడు.  ఇక సినిమా ఫస్టాప్ ఫుల్ హెలారీయస్‌గా నడుస్తుంది. ఈ క్రెడిట్ నవీన్‌ పొలిశెట్టికే దక్కుతుంది. నవీన్ స్టేజ్ పర్ఫామెన్స్ కడుపుబ్బ నవ్విస్తుంది.  ఫస్ట్ 30 నిమిషాలు కాస్త స్లో అయినప్పటికీ నవీన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను ట్రాక్‌లోకి తెచ్చాడు. ఫస్టాఫ్‌లో వన్‌మ్యాన్ షో చేశాడు. నవ్వించే వన్-లైనర్స్‌తో పాటు, సెంటిమెంట్ జోన్‌లోని డైలాగ్‌లు ‘క్రిస్ప్ అండ్ సెన్సిబుల్‌’గా ఉన్నాయి. ఇక సెకండాఫ్‌లో సినిమాకు మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. ఎమోషనల్‌గా సాగుతుంది. ఫర్టిలిటీ ఎలిమెంట్ కారణంగా కొన్ని సార్లు కామెడీ శృతిమించినట్లు అనిపిస్తుంది. కానీ దానిని డైరెక్టర్ చాలా క్లీన్‌గా మెనేజ్ చేశాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కథాంశం ఎంచుకోవడం పట్ల డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంత సులువు కాదు. డైలాగ్స్ రైటింగ్ నుంచి భావోద్వేగాలను పండిచడం వరకు డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే.. మురళి శర్మ, అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించారు. బలాలు నవీన్ పొలిశెట్టి నటనఅనుష్క పర్ఫామెన్స్వన్‌లైన్ కామెడీ పంచ్‌లు బలహీనతలు సెకండాఫ్‌లో నిడివి ఎక్కువ ఉండటంసినిమాలోని పాటలు టెక్నికల్ పరంగా.. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది. నిర్మాణం పరంగా ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు. రాధన్ అందించిన BGM బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ కాస్త లాగ్‌ అనిపించినప్పటికీ క్లైమాక్స్ సీన్లు దానిని కవర్ చేశాయి. చివరగా.. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో వేగిన ప్రేక్షకులకు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి వినోదాన్ని పంచుతుంది. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 07 , 2023

    @2021 KTree