రివ్యూస్
How was the movie?
తారాగణం
నితిన్
పృధ్విశశాంక్
ప్రదీప్ రావత్
భిక్షు యాదవ్నాసర్
ఖాదర్ (కాలేజీ ఆస్తి యజమాని)అజయ్
భిక్షు యాదవ్ అనుచరుడురాజీవ్ కనకాల
రగ్బీ కోచ్ రఫీతనికెళ్ల భరణి
పృధ్వి తండ్రి మరియు కళాశాల ప్రిన్సిపాల్వేణు మాధవ్
నల్ల బాలుసుప్రీత్
భిక్షు యాదవ్ అనుచరులుమధునందన్
కాలేజీ విద్యార్థిసమీర్
ఏసీపీ అరవింద్శివన్నారాయణ నారిపెద్ది
నర్సింగ్ యాదవ్
SS కంచిఇందు తండ్రి
ఆలపాటి లక్ష్మి
ప్రీతి నిగమ్
పృధ్వీ తల్లిచత్రపతి శేఖర్
భిక్షు యాదవ్ అనుచరుడుశ్రవణ్శశాంక్ క్లాస్‌మేట్
ఎస్ఎస్ రాజమౌళి
నల్ల బాలు హెంచ్మాన్ (అతి అతిధి పాత్ర)సిబ్బంది
ఎస్ఎస్ రాజమౌళి
దర్శకుడుఎ. భారతినిర్మాత
ఎంఎం కీరవాణి
సంగీతకారుడువి.విజయేంద్ర ప్రసాద్
కథఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్!
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా 'సైంధవ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహినికి గత ఏడాది విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. అయితే నిన్న సైలెంట్‌గా వీరి పెళ్లి నిర్వహించి వెంకటేష్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించారు.
ఈ పెళ్లి శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా వాటిని చూసి వెంకటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) భార్య నమ్రత (Namratha), కూతురు సితార (Sitara) ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులతో నమ్రత దిగిన ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో కార్తిక్.. ఈ వివాహ వేడుకలో ప్రధాన ఆకర్షణ నిలిచాడు. కార్తీక్ - వెంకటేష్ ఒకరికొకరు కరచలనం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.
గత సంవత్సరం అక్టోబర్‌లో విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్‌తో హయ వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు.
https://twitter.com/yousaytv/status/1717459822881509489
వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ‘సైంధవ్’ (Saindhav) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. వెంకీ మామ నటించిన దృశ్యం మూవీ ప్రస్తుతం హలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు సమాచారం.
వెంకటేష్.. అంతకు ముందు ‘ఎఫ్ 3’ (F3) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమాకు ముందు వెంకీ.. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.
మరోవైపు వెంకటేష్ తన అన్న కుమారుడు రానా (Rana)తో కలసి ఇటీవల ‘రానా నాయుడు’ (Rana Naidu) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో వెంకటేష్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలలో వెంకటేష్ తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడంతో పాటు బూతులు ఎక్కువగా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి.
ఈ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను ‘మీర్జాపూర్’ , ‘ది ఫ్యామిలీ మ్యాన్’ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం దీనికి రెండో సీజన్ కూడా వస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
మార్చి 16 , 2024
Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్ చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
7:11PM
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం సాధించింది.
ఒకే ఒక జీవితం
తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
Disco Raja
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.
Mark Antony
టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు.
Krrish 3
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది.
Robo 2.o
సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు.
Robo
రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది.
24
టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు.
Skylab
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.
Srivalli
బ్రేయిన్ మ్యాపింగ్ అనే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.
Taxiwaala
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.
Tik Tik Tik
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు.
Chandamama Lo Amrutham
చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
Yuganiki Okkadu
తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు.
ఆదిత్య 369
తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.
Kalki 2898 AD
సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
నవంబర్ 07 , 2023
GOD MOVIE REVIEW TELUGU: సైకో థ్రిల్లర్‌గా వచ్చిన గాఢ్ మెప్పించిందా? రేటింగ్ ఇదే!
నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిశ్ విద్యార్థి, రాహుల్ బోస్, వినోద్ కిషన్, విజయలక్ష్మి
నిర్మాతలు: సుధన్ సందరం, జయరాం, సతీష్‌కుమార్
డెరెక్టర్: ఐ.అహ్మద్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: హరి కే.వేదాంతం
జయం రవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాఢ్' నేడు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సైకోథ్రిల్లర్‌గా డైరెక్టర్ అహ్మద్ తెరకెక్కించారు. ఆద్యంతం ట్విస్ట్‌లు, ఎమోషనల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ డబ్బింగ్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా ఎలా ఉంది? చిత్రంలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.
కథ
గాడ్ స్టోరీ విషయానికి వస్తే దూకుడు స్వభావం కలిగిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్జున్ (జయం రవి)కి అతడి స్నేహితుడు ACP ఆండ్రూ (నరైన్) అంటే చాలా ఇష్టం. సాఫిగా సాగుతున్న వారి జీవితానికి సైకో కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) రూపంలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో కిల్లర్ బ్రహ్మ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్యలు చస్తూ తప్పించుకు తిరుగుతుంటాడు. అతన్ని పట్టుకునేందుకు అర్జున్, ఆండ్రూ టీం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆండ్రూ మరణించడంతో మనస్తాపం చెందిన అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. అయితే అరెస్టయిన సైకో కిల్లర్ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.. ప్రియ (నయనతార)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
అర్జున్ పాత్ర పరిచయంతోనే కథ మొదలు పెట్టిన దర్శకుడు.. నగరంలో ఉండే 25 ఏళ్ల లోపు అమ్మాయిలు కిడ్నాప్ కావడం.. వారంతా సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురికావడం.. వాటిని ఛేదించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగడం.. ఇలా పది నిమిషాల పాటు కథ వేగంగా సాగుతుంది. ఆ తర్వాత కథ నెమ్మదిస్తుంది. హత్యలు జరిగే తీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. అయితే హత్య సీన్స్ నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది. అర్జున్ సైకో కిల్లర్‌ను పట్టుకోవడం, అతడు జైలు నుంచి తప్పించుకోవడం, కిల్లర్ వెనుక మరో సైకో కిల్లర్ ఉన్నాడని తెలియడంతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. చనిపోయిన సైకో కిల్లర్‌నే మళ్లి హత్యలు చేస్తున్నాడా.. లేదా మరొకరు ఉన్నాడా.. సైకో కిల్లర్ జైలులో ఉన్నప్పుడు తనలాంటి వ్యక్తిని తయారు చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే సైకో కిల్లర్ వ్యక్తి వెనకున్న మరో సైకోను పట్టుకునేందుకు హీరో పెద్దగా కష్టపడాల్సి ఉండకపోవడం, వ్యక్తిని చూడగానే అతడే హత్యలు చేస్తున్నాడని తెలుసుకోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ మంచి థ్రిల్లింగ్‌గా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే
పోలీస్ కమిషనర్ పాత్రలో జయం సూపర్బ్‌గా నటించాడు. సైకో కిల్లర్స్‌గా నటించిన ఇద్దరు నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నయనతార పాత్రకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు. రెండు మూడు సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కనిపించదు. నరైన్, ఆశిశ్ విద్యార్థి, వినోద్ కిషన్, విజయలక్ష్మి తమ పరిధి మేరకు నటించారు.
డెరెక్షన్
సైకో కిల్లర్స్ హత్యలు చేసే తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అయిన్పటికీ కథను ఆసక్తికరంగా మలచుకోవడంతో డెరెక్టర్ ఐ.అహ్మద్ కాస్త తడబాటుకు గురయ్యాడు. సైకో కిల్లర్స్ వరుస హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏంటనేది చెబితే బాగుండేది.
టెక్నికల్ పరంగా
గాఢ్ మూవీ నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో అది కనిపిస్తుంది.
సినిమాటోగ్రఫీ పర్వాలేదు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ తెచ్చింది. నేపథ్య సంగీతం క్లైమాక్స్ సీన్లు, పోరాట సన్నివేశాలను ఎలివేట్ చేశాయి.
బలాలు
జయం రవి నటన
ఇంటర్వెల్ సీన్స్
సెకండ్ హాఫ్‌లో ఆసక్తికర ట్విస్టులు
బలహీనతలు
ఫస్ట్ హాఫ్ సీన్లు
పసలేని స్క్కీన్ ప్లే
నయన తారకు స్కోప్ లేకపోవడం
చివరగా
ఫస్ట్ హాఫ్‌లో నార్మల్‌గా సాగే ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 13 , 2023
తెలుగులో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) మూవీస్
]నాని (2004) - YouTubeబింబిసార (2021) - Zee5ఇవి కూడా చూడొచ్చు
ఫిబ్రవరి 14 , 2023
Pushpa 2: యష్ స్పీచ్‌ను సైతం కాపీ కొట్టిన బన్నీ.. సేమ్ టూ సేమ్! వీడియో వైరల్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా రిలీజ్ ఉండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (నవంబర్ 24) చెన్నైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ‘కిస్సిక్’ ఐటెం సాంగ్‌ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం బన్నీ తన మెస్మరైజింగ్ స్పీచ్‌తో తమిళ ఆడియన్స్ ఆకట్టుకున్నారు. అయితేే ఇది బన్నీ ఓన్ స్పీచ్ కాదని ‘కేజీఎఫ్’ హీరో యష్ గతంలో చేసిన ప్రసంగాన్ని కాపీ కొట్టాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అటు కేజీఎఫ్ 2 స్టోరీ, ప్రచార చిత్రాలను (Pushpa 2 vs KGF 2) సైతం మూవీ టీమ్ మక్కీకి మక్కీ దించిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్పీచ్.. సేమ్ టూ సేమ్
కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్: ఛాప్టర్ 1 (KGF: Chapter 1) బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2018లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో యష్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలను, భాషను, సంస్కృతిని గౌరవించాలని యష్ అన్నాడు. అయితే ‘పుష్ప 2’ చెన్నై ఈవెంట్‌లో బన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. తమిళంలో మాట్లాడిన బన్నీ ఇక్కడి మట్టి (నేల అర్థం వచ్చేలా)ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను ఎక్కడ నిలబడితే ఆ నేలను గౌరవిస్తానని అన్నాడు. దుబాయి వెళ్తే అరబిక్, పాట్నా వెళ్తే హిందీ, కేరళ వెళ్తే మలయాళంలో సొల్లుతా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి వారంతా చప్పట్లు కొడుతూ బన్నీని అభినందించారు. అయితే యష్ చెప్పిన మాటలకు బన్నీ స్పీచ్ (Pushpa 2 vs KGF 2) దగ్గర ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ కాన్సెప్ట్, పోస్టర్లు, ఎలివేషన్సే కాకుండా స్పీచ్ కూడా కాపీ కొట్టావా? అంటూ నవ్వు ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/Salaarified22/status/1860960000090481050
కథ కూడా కాపీయేనా?
‘కేజీఎఫ్ 2’కు ‘పుష్ప 2’ అన్ అఫిషియల్ రీమేక్ (Pushpa 2 vs KGF 2) అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ ‘కేజీఎఫ్ 2’ను ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. 'కేజీఎఫ్ 2' చివర్లో రాకీభాయ్ సైతం భార్య మాట వింటాడు. అలాగే 'పుష్ప 2' ట్రైలర్‌లో శ్రీవల్లి మాట వింటానని పుష్పరాజ్ చెబుతాడు. ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్‌లో శత్రువుల దాడిలో రాకీభాయ్ భార్య చనిపోతుంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌లో చితి దగ్గర బన్నీ నిలబడటం చూపించారు. అది శ్రీవల్లిదేనని జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య మరణం తర్వాత రాకీభాయ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాగే పుష్ప రాజ్ కూడా క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపిస్తాడని ట్రైలర్ చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాదు ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’లో రాకీభాయ్ పేరు స్థానికంగా మాత్రమే తెలుస్తుంది. ‘పార్ట్ 2’కు వచ్చేసరికి దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగుతుంది. అదే విధంగా ‘పుష్ప’లో నల్లమల్ల ప్రాంతానికే పరిమితమైన పుష్పరాజ్ క్రేజ్ సెకండ్ పార్ట్‌కు వచ్చేసరికి దేశం దాటి అంతర్జాతీయ లెవల్లోకి వెళ్లిపోయినట్లు చూపించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ‘కేజీఎఫ్ 2’కి కాపీగా ‘పుష్ప 2’ వస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 5న దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
https://twitter.com/ketan__00108/status/1858948085524951474
పోస్టర్లకు సైతం ‘కేజీఎఫ్ 2’ రిఫరెన్స్!
ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన 'పుష్ప 2' (Pushpa 2 vs KGF 2) పోస్టర్లు సైతం 'కేజీఎఫ్ 2' సినిమాలో యష్ పోస్టర్స్‌కు దగ్గరగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో కేజీఎఫ్ టీమ్ రిలీజ్ చేసిన తరహాలోనే రెడ్ థీమ్‌తో 'పుష్ప 2' బిగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. అలాగే 'కేజీఎఫ్ చాప్టర్ 1'కు సంబంధించి పోస్టర్‌లో రాకీభాయ్ (యష్) భుజానా గన్ పెట్టుకొని ఉంటాడు. 'పుష్ప 2' కూడా బన్నీ భుజానా గన్ పెట్టుకొని నడుస్తూ వస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అలాగే 'కేజీఎఫ్ 2' రిలీజ్ డేట్ పోస్టర్‌లో యష్‌ను బ్యాక్ సైడ్ నుంచి చెప్పారు. అలాగే 'పుష 2' 75 డేస్ టూ గో పోస్టర్‌లో సైతం బన్నీని వెనకి వైపు నుంచి చూపించారు. ఈ రెండింటి ఫొటోల కలర్ థీమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నయంటూ కామెంట్స్ వచ్చాయి. ఇలా 'పుష్ప 2' నుంచి వచ్చిన చాలా వరకూ ప్రమోషన్ పోస్టర్స్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలకు దగ్గరగా ఉండటం ఆరోపణలకు ఊతం ఇచ్చింది. ఓసారి ఆ పోస్టర్లను మీరూ చూసేయండి.
https://twitter.com/Ggk_here_/status/1855938612832948694
‘పుష్ప’ రిలీజ్ సమయంలోనూ ఇంతే!
2021లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa: Part 1) ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అయితే ‘పుష్ప’ స్టోరీ ఫార్మూలా కేజీఎఫ్’ (KGF)కు సిమిలర్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రతీ సీన్‌ను కనెక్ట్ చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 'కేజీఎఫ్'లో బంగారం ఉంటే 'పుష్ప' (Pushpa 2 vs KGF 2)లో ఎర్రచందనం పెట్టారని ఆరోపించారు. కేజీఎఫ్ తరహాలోనే కేశవ వాయిస్ ఓవర్‌తో కథను నడిపించారని ఆరోపించారు. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్స్ తొలుత హీరోలను వ్యతిరేకించారని, చివరికీ వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. ఇద్దరు హీరోలకు బాల్యంలో తల్లితో శాడ్ సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. సాధారణ వ్యక్తిగా విలన్ల గ్రూప్‌లోకి వచ్చిన హీరో వారందరినీ తొక్కుకుంటా నాయకుడైన తీరు కూడా సిమిలర్‌గా ఉందని చెప్పారు. స్టోరీలో డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ థీమ్ చూస్తే ‘కేజీఎఫ్’ను ‘పుష్ప’తో కాపీ కొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
https://twitter.com/RSKTheMonsters/status/1484072213750095874
నవంబర్ 26 , 2024
Akkineni Akhil Engagement: సైలెంట్‌గా అఖిల్ నిశ్చితార్థం.. నాగార్జునకు కోడలిగా మరో నటి!
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా ప్రకటించారు. చిన్న కోడలు - కుమారుడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. డిసెంబర్‌లో పెద్ద కూమారుడు అక్కినేని నాగచైతన్య వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్ కూడా త్వరలో పీటలు ఎక్కబోతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
పెళ్లికూతురు ఎవరంటే?
అఖిల్ అక్కినేని నిశ్చితార్థం (Akkineni Akhil Engagement) ఇవాళ (నవంబర్ 26) హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ప్రముఖ ఆర్టిస్టు 'జైనాబ్ రవద్జీ' చేతికి అఖిల్ ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు. ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలోకి చిన్న కోడలికి స్వాగతం పలికారు. ఈ యువ జంటను ఆశీర్వదించండంటూ నాగార్జున కోరారు.
https://twitter.com/iamnagarjuna/status/1861374206338048318
వచ్చే ఏడాదే పెళ్లి!
అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ (Akkineni Akhil Engagement) ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు కూడా అంగీకరించారు. దీంతో అందరి సమక్షంలో ఒక్కటయ్యేందుకు వీరు రెడీ అయ్యారు. నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 4న జరగనున్న అక్కినేని నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లిలో అఖిల్ జంట ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
గతంలో అఖిల్ నిశ్చితార్థం రద్దు
అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో అఖిల్-శ్రియ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలో శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు జైనాబ్ రవద్జీతో పెళ్లికి సిద్ధమయ్యాడు.
అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అఖిల్ నెక్ట్స్ ఫిల్మ్ రాబోతున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైతం ఇప్పటికే మెుదలైనట్లు చెబుతున్నారు. దీంతో పాటు 'సాహో'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనిల్ కుమార్‌తో మరో ప్రాజెక్ట్ అఖిల్ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్ కూడా ఓకే చేశారని టాక్. ఈ నేపథ్యంలో అఖిల్ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 26 , 2024
Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్ హీరో.. బిగ్ ఫైట్ తప్పదా?
ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు తమిళ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’తో బాక్సాఫీస్ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs Dhanush) అంటూ సవాలు విసురుతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ vs ధనుష్
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The Rajasaab). డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్‌లో తొలిసారి హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో ‘ది రాజాసాబ్’పై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రభాస్ (Prabhas vs Dhanush)ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ది రాజాసాబ్’ రిలీజ్ రోజునే తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఇడ్లీ కడై'ను (Idli Kadai) వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆ రోజునే ఎందుకంటే!
'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు) చిత్రానికి స్టార్ హీరో ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిత్యామీనన్ చేస్తోంది. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ పతకాలపై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, షాలినీ పాండేలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే బరిలో ప్రభాస్ సినిమా ఉన్నప్పటికీ ధనుష్ తన ‘ఇడ్లీ కడై’ చిత్రాన్ని రిలీజ్ చేయడం వెనక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. మన తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో తమిళ వాళ్లకు ఏప్రిల్‌లో వచ్చే న్యూ ఇయర్ కూడా అలాంటిదే. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళనాడులో న్యూ ఇయర్ జరుపుకుంటారు. పైగా దానికి లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతోంది. అందుకే ధనుష్ ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారు. మొత్తానికి 'ది రాజా సాబ్'తో పాటు ధనుష్ మూవీ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. మరి ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే.
https://twitter.com/dhanushkraja/status/1854758303399919813
అక్కడ ప్రభాస్‌కు ఎదురుదెబ్బ!
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)కు తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రభాస్‌తో పోలిస్తే మాత్రం కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా ధనుష్ కంటే చాలా పెద్దది. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ‘ది రాజాసాబ్’కు 'ఇడ్లీ కడై' నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. అయితే తమిళనాడులో మాత్రం ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ ధనుష్ పేరు చెబితే అభిమానులు ఊగిపోతుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ‘ది రాజాసాబ్’కు (Prabhas vs Dhanush) గట్టి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. తమిళనాడు కలెక్షన్స్‌లో భారీగా కోత పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అరడజను పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
నవంబర్ 09 , 2024
EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
[toc]
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18
శ్రీకాంత్ (శంకర్‌దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ - త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
అక్టోబర్ 22 , 2024
Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్-10 ప్రీ-రిలీజ్ బిజినెస్ చిత్రాలు ఇవే!
తారక్ లేటెస్ట్ చిత్రం 'దేవర' రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్ బిజినెస్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్స్!
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈవెంట్‌లో పాల్గొంటారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్ ప్రమోషన్స్ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే
ఒకప్పుడు ప్రీరిలీజ్ బిజినెస్ అంటే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
బాహుబలి 2 (Bahubali 2)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
సలార్ (Salaar)
కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా.
సాహో (Sahoo)
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది
ఆదిపురుష్ (Adipurush)
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
రాధేశ్యామ్ (RadheShyam)
ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.
సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్ కెరీర్ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం.
దేవర (Devara)
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ఈ జాబితాలో టాప్-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.
పుష్ప (Pushpa)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
సెప్టెంబర్ 21 , 2024
NTR 31: కొత్త చిత్రాన్ని సైలెంట్‌గా లాంచ్ చేసిన జూ. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, ఎందుకంటే?
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా గప్‌చుప్‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా అందరినీ షాక్‌కి గురిచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. నేడు (ఆగస్టు 9) పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
https://twitter.com/reddy_tarock/status/1821778632026751223
https://twitter.com/AllHailNTR/status/1821765706507284736
https://twitter.com/Sudha_NTR/status/1821785928798454169
విభిన్నమైన కథాంశంతో..
ప్రశాంత్ నీల్ సినిమా అనగానే భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే హీరోయిజం గుర్తుకువస్తాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో యష్, ప్రభాస్‌లను చూపించినట్లుగానే తారక్‌ను కూడా చాలా పవర్‌ఫుల్‌గా ప్రశాంత్ నీల్ చూపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ‘NTR 31’ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’ అని పేర్కొన్నారు. దీంతో తారక్‌ను కేజీఎఫ్, సలార్‌కు మంచి సరికొత్తగా నీల్ మామా చూపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
డ్యూయల్ రోల్‌లో తారక్?
తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్ చేసింది. ఆ బజ్ ప్రకారం ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.
పవర్‌ఫుల్ టైటిల్!
NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్ పేరు అయినందువల్లే డ్రాగన్ టైటిల్‌ను ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్ అయితేనే సరిగ్గా మ్యాచ్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం.
భారీ బడ్టెట్..
తారక్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేస్తారని సమాచారం.
ఆగస్టు 09 , 2024
Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్ ఫైట్‌కి రెడీ!
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో నాని (Nani), దగ్గుబాటి రానా (Daggubati Rana) ముందు వరుసలో ఉంటారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. జానర్‌తో సంబంధం లేకుండా వీరు తమ మార్క్ నటనతో మెప్పిస్తుంటారు. అటు బయట కూడా నాని-రానా మంచి ఫ్రెండ్స్‌గా గుర్తింపు పొందారు. ఇటువంటి కథానాయకులు ప్రత్యర్థులుగా మారితే? సినిమాలో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటే? ఊహిస్తేనే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదా. అయితే ఇది ఊహా మాత్రమే కాదు.. త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో వీరిద్దరు హీరో విలన్లుగా కనిపించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘హిట్ 3’ మూవీలో..
టాలీవుడ్‌లో 'హిట్' (Hit) సినిమా సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వచ్చిన 'హిట్' (Hit: The First Case), ‘హిట్ 2’ (Hit 2 : The Second Case) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇందులో హీరోలుగా చేసిన విశ్వక్ సేన్, అడవి శేష్‌లకు కెరీర్ పరంగా మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇక హిట్ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న పార్ట్ 3 చిత్రంలో నాని హీరోగా చేయనున్నట్లు సెకండ్ పార్ట్ ఎండింగ్‌లోనే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ‘హిట్ 3’ (Hit 3: Third Case) ఎప్పుడు మెుదలవుతుందా అని మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ‘హిట్ 3’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో నానికి ప్రత్యర్థిగా దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ వార్త టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిపోయింది.
సైకో కిల్లర్‌గా రానా?
‘హిట్’, ‘హిట్ 2’ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు.. వరుస హత్యలు, సైకో కిల్లర్, పోలీసు ఇన్‌వెస్టిగేషన్ నేపథ్యంలోనే వచ్చాయి. కాబట్టి ‘హిట్ 3’ కూడా ఆ తరహా కథాంశంతోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని.. పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఇక నానిని ఢీకొట్టే స్థాయిలోనే రానా పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానాకు తన పాత్రను వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ‘హిట్ 3’లో రానా క్రూరమైన సైకో కిల్లర్‌గా కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అతడి పాత్ర ఎంతగానో భయపెడుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టైటిల్ ఛేంజ్..!
నేచురల్ స్టార్ నాని నటించిన గత రెండు చిత్రాలు 'దసరా' (Dasara), 'హాయ్ నాన్న' (Hi Nanna) మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ప్రస్తుతం నాని హ్యాట్రిక్ హిట్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఆయన నటించిన 'సరిపోదా శనివారం' త్వరలోనే విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా చేస్తోంది. గతంలో ఈ హీరో - హీరోయిన్ - డైరెక్టర్ కాంబోలోనే 'గ్యాంగ్ లీడర్' (Gang Leader) అనే సినిమా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నాని, ప్రియాంక జంటకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ మూవీని 'సాటర్ డే' (Saturday) టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
క్రేజీ కాంబో లాక్..!
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో లాకైనట్లు తెలుస్తోంది. నేచరల్ స్టార్ నాని, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే నానిని కలిసిన శేఖర్ కమ్ముల.. మూవీకి సంబంధించిన లైన్‌ను చెప్పారట. అది నానికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏషియన్ సునీల్ నిర్మించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాని, శేఖర్ కమ్ముల కాంబోలో గతంలో సినిమా రాలేదు.. ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల.. 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్, నాగార్జున హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత నాని ప్రాజెక్ట్‌పై శేఖర్ కమ్ముల ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
జూలై 03 , 2024
Sabari Movie Review: థియేటర్లలోకి వచ్చేసిన వరలక్ష్మీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.. ‘శబరి’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక, రాజశ్రీ నాయర్ తదితరులు
దర్శకత్వం: అనిల్ కాట్జ్
సంగీతం: గోపి సుందర్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ: రాహుల్ వాత్సవ, నాని చమిడిశెట్టి
నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల
విడుదల: 03-05-2024
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. గణేశ్ వెంకట్రామన్, శశాంక్, మైమ్‌గోపి, సునయన, బేబీ కార్తీక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
సంజనా (వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత సంజనా.. ఓ కారణంతో అరవింద్‌ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి వైజాగ్ వచ్చేస్తుంది. తన ఫ్రెండ్ సాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా చేరుతుంది. మరోవైపు సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. పోలీసులు దర్యాప్తు చేయగా అతడు చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనాను వెంబడిస్తున్న సూర్య ఎవరు? అరవింద్‌తో సంజన ఎందుకు విడిపోయింది? కిడ్నాప్‌కు గురైన కూతుర్ని సంజన ఎలా కాపాడుకుంది? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్.. 100 శాతం న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన ఆమె.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో మెప్పించింది. అటు మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్‌గా గణేష్ వెంకట్రామన్ చక్కగా చేశాడు. లాయర్‌గా శశాంక్, పోలీసు అధికారి శంకర్‌గా మధుసూధన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనిల్ కాట్జ్ ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే పోరాటాన్ని చక్కగా ఆవిష్కరించాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్‌తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్‌గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటైల్డ్‌గా చూపించడంతో ఫస్టాఫ్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఈ మూవీ కథ బాగున్నా దానిని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిప్పడం వల్ల ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. స్క్రీన్‌ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండే ఫలితం మరింత బెటర్‌గా వచ్చేది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం గుర్తుంచునేలా లేవు. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులే ఇవ్వొచ్చు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరలక్ష్మీ నటనకథలోని ట్విస్టులునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లే స్లో నారేషన్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
Ustaad Bhagat Singh: ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్ గట్టి కౌంటర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్ ఇచ్చేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మరో గ్లింప్స్ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’
భగత్ బ్లేజ్(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8
అధికార వైసీపీకి గట్టి కౌంటర్!
ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్’ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1770055005283688593
పొలిటికల్ హీట్ పెంచిన డైలాగ్స్!
మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
మార్చి 19 , 2024
Pragati Srivastava: పెదకాపు 1 హీరోయిన్ జీరో సైజ్ గ్లామర్ చూస్తే మతి పోవాల్సిందే!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
సెప్టెంబర్ 29 , 2023
Saindhav Movie Review: యాక్షన్ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: వెంకటేష్, శ్రద్ద శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
సైంధవ్ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్ నడుస్తుంటుంది. సైంధవ్ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సైంధవ్ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు.
ఎలా సాగిందంటే
గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్ కథను తీసుకున్నారు. 'సైంధవ్' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్. సన్నివేశాల మధ్య కనెక్షన్ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం శైలేష్ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్ పక్కన పెడితే సైంధవ్ మెప్పిస్తాడు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వెంకటేష్ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్
రేటింగ్: 3/5
జనవరి 13 , 2024
Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే ఓ వీర సైనికుడి గాథ
చిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024
భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం.
కథ
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి.
ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి.
అలాగే కశ్మీర్‌లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి ఖాజీపత్రి ఆపరేషన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది.
సాంకేతికత
ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి.
బలాలు
బలమైన కథ
సెకాండాఫ్
బలమైన ఎమోషన్స్
శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ
బలహీనతలు
పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
చిరవగా
మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసింది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్ దర్శకులకు తారక్ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్స్!
టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట జూ.ఎన్టీఆర్ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి దేవరతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్'తో సక్సెస్ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో సక్సెస్ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్ క్రియేట్ చేస్తున్నాడు.
ఒకే ఒక్క హీరోగా తారక్
హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న వాడే. అయితే తారక్ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’, సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్) వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.
23 ఏళ్ల ఫ్లాప్ రికార్డు బద్దలు
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమంట్‌ను బీట్ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్ వెంటనే ‘దేవర’తో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్ స్వయంగా తానే దీనిని బ్రేక్ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 04 , 2024
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.
ఆ సినిమా ఏదంటే?
2023లో 95వ ఆస్కార్స్ అవార్డ్స్ కోసం అత్యధిక నామినేషన్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే రిలీజ్ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్ చూసేయండి.
https://twitter.com/i/status/1634197587438731264
ఊహకందని కాన్సెప్ట్‌తో..
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మనిషిని పోలిన మనుషులు మిగిలిన ప్యారలాల్ యూనివర్స్‌లలో ఉంటారనే పాయింట్‌తో దర్శకులు డేనియల్ క్వాన్, డేనియల్ షైనెర్ట్ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం కురిపించింది.
కథ కోసం 8 ఏళ్ల శ్రమ
కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్, షైనెర్ట్.. 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.
కథేంటి
‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రం. మిషెల్ యో, కి హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్ క్వాడ్ అనే చైనీస్ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు.
Telugu.yousay.tv Rating : 3.5/5
ఏప్రిల్ 13 , 2024
Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.
https://twitter.com/tarak9999/status/1691728962731589669?s=20
దేవరలో ‘భైరా’గా
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.
ఆదిపురుష్
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.
హిందీ చిత్రాలు
30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.
2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.
ఫ్యూచర్ విలన్
ప్రస్తుతం టాలీవుడ్ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 16 , 2023