ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
Watch
2024 Apr 58 months ago
తంత్ర మూవీ 'ఆహా' ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
రివ్యూస్
How was the movie?
తారాగణం
అనన్య నాగళ్ల
ధనుష్ రఘుముద్రి
సలోని అశ్వాని
సిబ్బంది
శ్రీనివాస్ గోపిశెట్టిదర్శకుడు
నరేష్ బాబు పినిర్మాత
రవి చైతన్యనిర్మాత
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
మెగా హీరో సరసన..!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.
https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941
మెగా హీరోతో రొమాన్స్!
'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కొత్తవారికి ప్రేరణగా అనన్య!
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్' వంటి సైన్స్ ఫిక్షన్ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ హీరోగా చేసిన 'వకీల్ సాబ్'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్ అయితే అనన్య కెరీర్ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.
1947-67 బ్యాక్‌డ్రాప్‌లో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954
పడిలేచిన కెరటంలా..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
నవంబర్ 12 , 2024
This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్’ సహా 24 చిత్రాలు!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
వెయ్ దరువెయ్
ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Vey Dharuvey). యషా శివకుమార్ హీరోయిన్. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజాకార్
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.
తంత్ర
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
షరతులు వర్తిస్తాయి!
చైతన్యరావ్, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్ కుమార్, విజయ, కృష్ణకాంత్ సంయుక్తంగా నిర్మించారు.
లైన్‌మ్యాన్
త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
రవికుల రఘురామ
ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది.
లంబసింగి
భరత్ రాజ్ హీరోగా బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్ తన్నీరు నిర్మించారు.
యోధ
సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యోధ’ (Yodha). సాగర్ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్ జోహార్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇతర చిత్రాలు
పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
మార్చి 11 , 2024
Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ తదితరులు
రచన, దర్శకత్వం: శౌర్యువ్
సంగీతం: హషీమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్.
నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల: 07-12-2023
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్, ట్రెండ్ అంటూ లెక్కలేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. విడుదలకి ముందే నాని - మృణాల్ జోడీ, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్ అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మహి తల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నాని (Hero Nani) మరోసారి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించాడు. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్రధానబలం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్దరూ చాలా బాగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. తన అభినయంతో కట్టిపడేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా కనిపిస్తూ కంటతడి పెట్టించింది. ప్రియదర్శి, అంగద్ బేది, జయరామ్, విరాజ్ అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్ కూడా కాస్త మైనస్ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి.
సాంకేతికంగా..
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కథకి తగ్గ సన్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేషమ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్, కూర్పు సరిగ్గా కుదిరాయి.
ప్లస్ పాయింట్స్
నాని, మృణాల్, కియారా నటనభావోద్వేగాలు, మలుపులుసంగీతం
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథసాగదీత సీన్లు
రేటింగ్: 3/5
డిసెంబర్ 07 , 2023
Vimanam Movie Review: తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకుడిని కదిలించే ‘విమానం’
నటీనటులు : సముద్రఖని, ధృవన్ వర్మ, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ,ధన్ రాజ్ తదితరులు..
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
సినిమాటోగ్రఫీ: వివేక్ కలేపు
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
నటుడిగా, దర్శకుడిగా చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పిస్తూనే మెగా ఫోన్ పట్టుకుని ఏకంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పాజిటివ్ రోల్‌లో సముద్రఖని ప్రధానపాత్ర దారుగా వచ్చిన చిత్రం ‘విమానం’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి, ఈ ‘విమానం’ థియేటర్‌లో ప్రేక్షకుడిని ఆకాశానికి తీసుకెళ్లిందా? టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు సన్నివేశాలు మెప్పించాయా? అనే విషయాలను రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ప్రచార చిత్రాలతోనే సినిమా కథేంటో తెలిసిపోయింది. ఓ పేదింటి కుర్రాడు రాజు(మాస్టర్ ధ్రువ్)కి విమానం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని ఆశపడుతుంటాడు. తండ్రి వీరయ్య(సముద్రఖని) వికలాంగుడు. తల్లి లేకున్నా రాజుకి ఏ లోటు రాకుండా పెంచాలని పరితపిస్తుంటాడు. వంశ పారం పర్యంగా వచ్చిన సులభ్ కాంప్లెన్స్‌ని నడుపుకొంటూ జీవనాన్ని సాగిస్తాడు వీరయ్య. ఎప్పుడు విమానం గురించి అడిగినా చదువుకుంటే విమానం ఎక్కొచ్చని చెబుతూ కొడుకుని వీరయ్య ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్రమంలో కొడుక్కి ఓ ప్రాణాంతక వ్యాధి ఉందనే చేదు నిజాన్ని వీరయ్య తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే పుత్రుడి కోరిక తీర్చాలని వీరయ్య ఒక్కో పైసా పోగు చేస్తాడు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక్కో ఘటనతో తన ప్రయత్నానికి వీరయ్య మరింత దూరం అవుతుంటాడు. మరి చివరికి ఎలా విమానం ఎక్కించాడని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
ఇలాంటి సినిమాలకు కథనం, సంభాషణలు, నటీనటుల ప్రదర్శన చాలా ముఖ్యం. ఈ సినిమా వీటిని భర్తీ చేస్తుంది. బస్తీలో ఉండే వాతావరణం, నిరుపేద కుటుంబ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపించారు. చూసేటప్పుడు ఇది మన కథే, పక్కింటి వారి కథే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని తెరపై చూపిస్తుంది. ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారు?
వికలాంగ తండ్రిగా సముద్రఖని జీవించేశాడు. కొడుకు కలను నెరవేర్చాలన్న తపన ఓ వైపు, కలకాలం తనతో ఉండబోడన్న వేదన మరోవైపు.. ఇలా గుండెను భారంగా చేసుకుని బతుకీడుస్తున్న వ్యక్తిగా సముద్రఖని ప్రేక్షకులను మెప్పించాడు. తనలోని నటుడిని వెలికి తీశాడు. ఇక రాజు పాత్రలో మాస్టర్ ధ్రువన్ ఆకట్టుకున్నాడు. చిన్న పిల్లలకు ఉండే అమాయకత్వం, నిజాయితీ, ఆశలు, కోరికలను చక్కగా చూపించగలిగాడు. వేశ్య అయిన సుమతి పాత్రలో అనసూయ ఫర్వాలేదనిపించింది. తన ప్రేమ కోసం పరితపించే కోటిగా రాహుల్ రామకృష్ణ మెప్పించాడు. వీరిద్దరి ప్రేమాయణం చివరికి కంటతడి పెట్టిస్తుంది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ తళుక్కుమంది. ఆటో డ్రైవర్‌గా ధన్‌రాజ్ పరిధి మేరకు నటించాడు.
టెక్నికల్‌గా
తెలిసిన కథను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో డైరెక్టర్ శివప్రసాద్ యానాల సక్సెస్ అయ్యాడు. నిరుపేద కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కగా చూపించాడు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగంగా చిత్రీకరించి ప్రేక్షకులను మెప్పించాడు. కోటీ, సుమతి మధ్య సన్నివేశాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే, కథలో పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు. సెకండాఫ్‌లో హీరోకి ఎదురయ్యే కష్టాలను కాస్త సినిమాటిక్‌గా చూపించాడు. ముఖ్యంగా, తెలుగులో డైలాగ్స్ అందించిన హను రావూరి తన కలానికి పనిచెప్పాడు. సందర్భానుసారంగా వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక, చరణ్ అర్జున్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
భావోద్వేగ సన్నివేశాలు
క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్
ఊహకు అందే కథ, కథనం
చివరగా.. ప్రేక్షకుడిని భావోద్వేగాలనే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లేదే ‘విమానం’.
రేటింగ్: 3.25/5
జూన్ 09 , 2023
Manchu Manoj: తండ్రి చేసిన తప్పెంటో చెప్పేసిన విష్ణు.. కంటతడి పెట్టిన మనోజ్
మంచు మోహన్ బాబు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. గంటకో మలుపు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య రాజుకున్న వివాదంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తొలుత ఆస్తుల వ్యవహారంలా కనిపించినా రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబంలోని మరిన్ని లొసుగులు వెలుగు చూస్తున్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఫ్యామిలీ గొడవలు ప్రస్తావిస్తూ లేఖలు విడుదల చేయడం, ప్రెస్‌మీట్‌లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకోవడం, మీడియాపై మోహన్ బాబు దాడి ఇలా వరుస ఘటనలతో మంచు లొల్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది.
మోహన్ బాబు హెల్త్ బులెటిన్
మంగళవారం రాత్రి ఘర్షణ అనంతరం మోహన్‌బాబు అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 'డిసెంబర్ 10న రాత్రి 8 30 గంటలకు మోహన్ బాబు గారిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. బాడీ పెయిన్స్, యాంగ్జైటీతో సృహలేని స్థితిలో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హుటాహుటిన ఆయకు ఎమర్జెనీ వైద్యాన్ని అందించాం.. ఆయన ఎడమ కంటి కింద గాయం అయింది.. రక్తపోటు చాలా పెరిగింది.. హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది.. తగిన చికిత్సను అందించాం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది' అని వైద్యులు తెలిపారు.
https://twitter.com/Hyderabad_Mail/status/1866749374581313939
రచ్చ పెట్టుకుంటే గెలవలేరు: విష్ణు
కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ చేస్తోన్న ఆరోపణలు గురించి మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. అయితే ఫ్యామిలీ విషయాల గురించి తాను స్పందించనని విష్ణు తేల్చిచెప్పారు. కానీ, ఆత్మ గౌరవ పోరాటమంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించాడు. ‘ప్రేమతో గెలవాల్సింది.. రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు మనోజ్‌ను శత్రువుగా చూస్తున్నారన్న ప్రశ్నపై ‘దాని గురించి చెప్పేదేమి లేదండి. ఇమ్మెచ్యూర్‌గా ఫ్యామిలీ గురించి తను మాట్లాడొచ్చు. చిన్నవాడిగా అవగాహన లేకుండా ఏదైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఫ్యామిలీ గురించి మాట్లాడను’ అని అన్నాడు.
https://twitter.com/10TvTeluguNews/status/1866746906011111783
మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు
తాజా ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న చేసిన పెద్ద తప్పు ఏదైన ఉందంటే అది ముగ్గురు పిల్లలను ఎక్కువగా ప్రేమించడమేనని అన్నారు. 'ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం. ఇండస్ట్రీలో ఉన్నవారందరికీ ఇది తెలుసు. మీడియాకు నాదొక రిక్వెస్ట్. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి.. ఫాదర్స్ ఉన్నారు. ఏ కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. పెద్దలంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేననుకున్నా నా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని, కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. అన్‌ఫార్చ్యునేట్‌గా ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తది, ఇలా మాట్లాడాల్సి వస్తది, ఇలాంటి పరిస్థితి నా ఫ్యామిలీకి వస్తదని ఎప్పుడు ఊహించలేదు’ అని విష్ణు అన్నారు.
https://twitter.com/abntelugutv/status/1866750818646626628
‘నాన్నను క్షమించండి’
మంగళవారం రాత్రి జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మంచు విష్ణు స్పందించారు. 'జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు’ అని విష్ణు అన్నారు.
కంటతడి పెట్టిన మనోజ్..
మంచు విష్ణు కంటే ముందు సోదరుడు మనోజ్ ప్రెస్‌మీట్ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో కంటతడి పెట్టి బావోద్వేగానికి గురయ్యారు.‘నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతకాళ్లపై పనిచేసుకుంటున్నాను. ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా’ అని మనోజ్ వ్యాఖ్యానించారు.
https://twitter.com/swetchadaily/status/1866744650738044980
'అందుకే ఇంటికి వచ్చా'..
కొంతమంది బంధువులు, నాన్న సన్నిహితుల సూచనతో ఈ ఇంటికి వచ్చానని మనోజ్ తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా బయట ఉంటున్నావు. ఇంట్లో అమ్మానాన్న మాత్రమే ఉన్నారు. మీ అన్న ఫ్యామిలీతో దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యాడు. నీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఈ సమయంలో నీ భార్యకు మీ తల్లి, పెద్దవాళ్ల అవసరముంది. ఒక్కడివే ఎలా చూసుకుంటావు?’ అని వారు నాతో అన్నట్లు చెప్పారు. తన భార్య కూడా వారిని సమర్థించి.. మాట వినాలని కోరడంతో ఈ ఇంటికి తిరిగి వచ్చానని వివరించారు.
‘అన్న కోసం గొడ్డులా పనిచేశా’
తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ అన్నారు. ‘దీనికి నేనేమీ చెప్పలేను. ఆధారాలు మాత్రమే చూపించగలను. నేనెప్పటినుంచో కూర్చొని మాట్లాడదామన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాను. ఆమె కోసం పోరాడాను. అందులో తప్పేముంది? పది మంది కోసం నిలబడినందుకు నేను చెడ్డవాడిని అయ్యాను. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేశాను. రమ్మంటే వచ్చాను.. పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను. గొడ్డులా కష్టపడ్డాను. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేశాను. ఏ రోజూ ఒక్క రూపాయి అడిగింది లేదు.. ఆశించింది లేదు’ అని అన్నారు.
https://twitter.com/abntelugutv/status/1866742963445043239
డిసెంబర్ 11 , 2024
Parachute Review: పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలో చూపించిన ‘పారాచూట్’.. ఎలా ఉందంటే!
నటీనటులు : శక్తి రిత్విక్, ఐయల్, కని తిరు, షామ్, కిషోర్, కాళి వెంకట్, వీటీవీ గణేష్, శరణ్య, రామచంద్రన్ తదితరులు
డైరెక్షన్ : రసు రంజిత్
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫీ : ఓం నారాయణ్
నిర్మాతలు : కృష్ణ, కె. ఎస్. మధుబాల
ఓటీటీ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్
కిషోర్ (Kishore), కని తిరు (Kani Tiru), బాల నటుడు శక్తి రిత్విక్, బాల నటి రుద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ వెబ్‌సిరీస్ 'పారాచూట్' (Parachute). రాసు రంజిత్ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. 5 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 29న ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ సహా 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లల కిడ్నాప్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Parachute Review)
కథేంటి
షణ్ముగం (కిషోర్), లక్ష్మి (కని తిరు) భార్య భార్తలు. పిల్లలు వరుణ్ (శక్తి రిత్విక్), రుద్ర (ఇయల్)తో షణ్ముగం కఠినంగా వ్యవహరిస్తుంటాడు. చిన్న తప్పుచేసిన చితకబాదేస్తుంటాడు. దీంతో పిల్లలకు తండ్రి అంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. అయితే వరుణ్‌కు పారాచూట్ (తండ్రి నడిపే మోపెడ్ బైక్) పై రైడ్‌కి వెళ్లాలని కోరికగా ఉంటుంది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి చెల్లిని తీసుకొని మోపెడ్‌పై వెళ్తాడు. నాటకీయ పరిణామాల వల్ల పారాచూట్ కనిపించకుండా పోతుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ (కృష్ణ) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక శ్రీమంతుడి కొడుకుపై చేయి చేసుకుంటాడు. అతడి ఖరీదైన బైక్‌ను స్టేషన్‌కి తీసుకెళ్తాడు. ఈ రెండు కథలకు లింకేంటి? పారాచూట్‌ను కనిపెట్టే ఇంటికి వెళ్లాలని భావించిన పిల్లలు ఏంచేశారు? పిల్లల కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఎలా వేదన పడ్డారు? పారాచూట్‌తో పాటు స్టేషన్‌లో పెట్టిన ఖరీదైన బైక్‌ను ఎవరు దొంగిలించారు? దాని వల్ల ట్రాఫిక్ పోలీసుకు వచ్చిన కష్టాలేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పేరెంట్స్ పాత్రల్లో నటుడు కిషోర్ (Parachute Review), నటి కని తిరు చక్కటి నటన కనబరిచారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలుగా వారు జీవించారు. ముఖ్యంగా కిషోర్ పిల్లలపై అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ బయటకు కఠినంగా ఉండే తండ్రి పాత్రలో అదరగొట్టాడు. కొడుకు, కూతురుగా చేసిన బాల నటులు శక్తి రిత్విక్, ఇయల్ బాగా చేశారు. ప్రధానంగా ఈ పిల్లలిద్దరి చుట్టూ కథ తిరుగింది. ముఖ్యంగా కూతురిగా ఇయల్ మంచి మార్కులు కొట్టేసింది. ఎమోషనల్ సీన్స్‌లో ఇయల్ ఎక్స్‌ప్రెషన్స్ హృదయాలను బరువెక్కిస్తాయి. ట్రాఫిక్ పోలీసుగా కృష్ణ పర్వాలేదనిపించాడు. పొరుగింటి వ్యక్తిగా కాళి వెంకట్ కూడా పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పారాచూట్ మిడిల్ క్లాస్ ఫాదర్ కథ అని చెప్పుకోవచ్చు. బయట ఉన్న ఫ్ట్రస్ట్రేషన్‌ను తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తే వారు ఇలాంటి బాధలు అనుభవిస్తారో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. చిన్న తప్పు చేస్తే చితకబాదే తండ్రి పారాచూట్ పోయిందంటే ఇంక ఎలా రియాక్ట్ అవుతాడోనని భావించి దానిని కనిపెట్టేందుకు ఆరాటపడటం ఆకట్టుకుంది. పిల్లల పట్ల మెురటుగా ప్రయత్నించే తండ్రిని ఓ వైపు చూపిస్తూనే పిల్లల కోసం తాపత్రయ పడే పోలీసు ఆఫీసర్ పాత్రను సమాంతరంగా చూపించి మెప్పించాడు. పిల్లల ఆచూకి కోసం వెతికే క్రమంలో వారి పట్ల తాను ఎంత పెద్ద తప్పుచేశాననో షణ్ముగం రియలైజ్ అయ్యే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. షణ్ముగంతో పోలీసు ఆఫీసర్ చెప్పే డైలాగ్స్ ప్రతీ కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అయితే రొటిన్ స్టోరీ, నెమ్మదిగా సాగే కథనం, పెద్దగా మలుపులు లేకపోవడం, కొన్ని సాగదీత సన్నివేశాలు సిరీస్‌కు మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Parachute Review) యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. భావోద్వేగాలకు తగ్గట్లు ఆయన అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నారాయణ్ కెమెరా పనితీనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సిరీస్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి కథనంలో వేగం పెంచి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీనెమ్మదిగా సాగే కథనం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 30 , 2024
Samantha Ruth Prabhu: ఆ కారణంతోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని తాకే మాటలతో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించిన సమంత, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు గర్వంగా వ్యక్తం చేసింది.
సమంత జీవితంలో తండ్రి ప్రాధాన్యత
సమంత జీవితంలో జోసెఫ్ ప్రభు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. చిన్నతనం నుండి ఆమెకు ఉన్నత విలువలను నేర్పి, తన ప్రతి నిర్ణయానికి అండగా నిలిచారు. సినీ రంగంలో ప్రవేశించిన సమయంలో తన తండ్రి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని సమంత గతంలో అనేక ఇంటర్వ్యూలలో వెల్లడించారు. "తన తొలి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసినప్పుడల్లా ఆయన ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపింది" అని సామ్ వెల్లడించింది.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణం
జోసెఫ్ ప్రభు గురువారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. (Samantha Ruth Prabhu)ఈ వార్త తెలుసుకున్న వెంటనే సమంత ముంబై నుంచి తన స్వస్థలమైన కేరళకు చేరుకున్నారు. శనివారం జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సమంత కుటుంబం
సమంత 1987 ఏప్రిల్ 28న కేరళలోని అలప్పుజలో జన్మించింది. జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) ఆంగ్లో-ఇండియన్ కాగా, ఆమె తల్లి నినెట్ ప్రభు మలయాళీ. ఆమెకు ఇద్దరు అన్నలు జోనాథన్, డేవిడ్ ఉన్నారు.
తండ్రి-కూతుళ్ల అనుబంధం
సమంత తన తండ్రితో ఉన్న బంధాన్ని ఎంతో ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటుంది. ఒక ఇంటర్వ్యూలో, "నా తండ్రి నాకు జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం నేర్పించారు. ఆయన ప్రోత్సాహం లేకుండా నేను ఈ స్థాయికి చేరుకోలేను" అని చెప్పుకొచ్చింది. తండ్రి మరణ వార్త సమంతను తీవ్రంగా కలచివేసింది. "నాన్న నాకు నడిచే దైవం. ఆయన నాకు నేర్పించిన విలువలే నన్ను ముందుకు నడిపించాయి. ఇప్పుడు ఆయన లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను" అని ఆవేదనతో తన సన్నిహితులతో పంచుకుంది.
విడాకుల సమయంలో తండ్రి మద్దతు
2021లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు, జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) తన ఫేస్‌బుక్‌లో వారి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను అంగీకరించడానికి ఆయనకు ఎంతో సమయం పట్టిందని, కానీ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సెలబ్రెటీల సానుభూతి
జోసెఫ్ ప్రభు మరణవార్త తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంతకు కష్టకాలం
సమంతకు 2021 నుంచి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పవచ్చు. నాగచైతన్యతో విడాకుల అనంతరం.. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడటం జరిగింది. దాని నుంచి కోలుకోవడానికి సామ్‌కు రెండేళ్లు పట్టింది. దాదాపు రెండేళ్లు సమంత సినిమాలకు దూరమై, ఒంటరిగా చాలా బాధలు పడింది. అనంతరం ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో చాలా కృంగిపోయింది. తాజాగా నాగచైతన్య - శోభిత దూళిపాల ఎంగేజ్‌మెంట్ కూడా ఆమెను ఓ రకంగా బాధ పెట్టిందని చెప్పవచ్చు.
సమంత ప్రస్తుత బిజీ షెడ్యూల్
ఇటీవలే సిటాడెల్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమంత, తండ్రి మరణ వార్త విన్న వెంటనే తన సొంత ఊరికి చేరుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, సామ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
నవంబర్ 29 , 2024
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని..!
టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు 'విజయ్ దేవరకొండ' (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ పోస్టు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్ గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అసిస్టెంట్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ కుమారుడు!
విజయ్ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్) బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పడంతో విజయ్ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
సాయిపల్లవితో రొమాన్స్
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
జూన్ 19 , 2024
ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
తల్లి కాబోతుంది
గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్ న్యూస్ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
ఇలియానా జీవితం
కెరీర్ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం.
ఆమె సోదరుడితో డేటింగ్
ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.
తండ్రి ఎవరు?
ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
పరిచయం చేస్తుందా?
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
టాప్ హీరోయిన్
దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
ఏప్రిల్ 18 , 2023
తెలుగుతెరపై మర్చిపోలేని కైకాల సత్యనారాయణ పాత్రలు
]సత్తిపండుమహేశ్ బాబు మురారీ గుర్తుందా. ఇందులో ఆయన తండ్రిగా కైకాల నటించారు. స్క్రీన్‌పైనా తక్కువ సమయం కనిపించినప్పటికీ ఆయన నటన అద్భుతం. చిన్నపిల్లాడిలా కైకాల చెప్పిన డైలాగులు, హాస్యం ఎంతగానో అలరిస్తుంది.
ఫిబ్రవరి 13 , 2023
నటనకు కేరాఫ్ విజయ్ సేతుపతి.. ఈ 5 సినిమాలు తప్పక చూడాల్సిందే
]ఈ చిత్రం చూశాక ప్రేక్షకులకు ‘రాయనం’ పాత్ర గుర్తిండిపోతుంది. తండ్రిగా, జమీందారుగా విజయ్ సేతుపతి ప్రేక్షకులను మెప్పించాడు. క్రూరత్వం ప్రదర్శిస్తూనే మనసులోని ప్రేమను కళ్లలో చూపించేలా నటించాడు విజయ్ సేతుపతి.
ఫిబ్రవరి 13 , 2023
HBD Suriya: సూర్యను ‘వేస్ట్ ఫెలో’ అని ఘోరంగా అవమానించారు.. ఎందుకంటే?
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు సూర్య తన మెస్మరైజింగ్ నటనతో సౌత్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తండ్రి శివకుమార్ తమిళంలో ప్రముఖ నటుడు కావడంతో సూర్య సినీ రంగ ప్రవేశం అంతా సాఫీగా జరిగి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ నిజం కాదు. సూర్య కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విమర్శల రూపంలో ఒడిదొడుకులు ఎదురైన తట్టుకొని ముందుకు సాగారు. ఇవాళ సూర్య 49వ పుట్టిన రోజు (23 జులై) సందర్భంగా అతడి సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూర్య అసలు పేరు ఇదే!
సూర్యకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శరవణన్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఆ పేరును సూర్యగా మార్చారు. మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు కూడా సూర్య కావడం విశేషం. అటు సూర్య తొలి సినిమా ‘నేరుక్కు నేర్’లోని ముహూర్తపు సన్నివేశానికి మణిరత్నమే దర్శకత్వం వహించారు. మణిరత్నం నిర్మాతగా వసంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో విజయ్ (Vijay)తో కలిసి సూర్య నటించాడు.
ఆ ఘటనతో సినిమాలపై అనాసక్తి!
సూర్య తండ్రి శివ కుమార్ అప్పట్లో తమిళంలో పెద్ద హీరో. తండ్రి ప్రోద్భలంతో రంగస్థల నాటక సంఘంలో చేరిన సూర్య ఓ సందర్భంలో తనని తాను పరిచయం చేసుకునేందుకు వేదిక పైకి వెళ్లారు. నలుగురిలో మాట్లాడేందుకు భయమేసి ‘హలో! ఐయామ్ శరవణన్, డూయింగ్ మై డూకామ్’ అన్నారట. దీంతో ఒక్కసారిగా అతిథులందరూ నవ్వారట. షూటింగ్ వాతావరణం కూడా ఇలాగే ఉంటుందేమో అని భావించి సినిమాల్లోకి వెళ్లకూడదని సూర్య నిర్ణయించుకున్నారట.
రూ.600 జీతంతో ఉద్యోగం
హీరోగా నటించిన తండ్రి శివకుమార్, సూర్య డిగ్రీ పూర్తయ్యే సరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. దీంతో కుటుంబ ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సూర్య ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.600 చొప్పున రెండు నెలలకు రూ.1200 అందుకున్నాడు. కొన్నాళ్లకు వ్యాపారం పెట్టినా కలిసిరాలేదు. అప్పులపాలు కావడంతో సూర్య సినిమాల్లోకి రాకతప్పలేదు.
కెమెరా ఫియర్
కెరీర్ తొలినాళ్లలో కెమెరా అంటే సూర్య తెగ భయపడిపోయేవారట. డైలాగ్స్ చెప్పడం, ఎమోషన్స్ చూపించడానికి తెగ ఇబ్బంది పడేవారట. దీంతో ‘వేస్ట్ ఫెలో’ అన్న విమర్శలను సూర్య ఎదుర్కొన్నారు. తండ్రి ఎంత మంచి నటుడో కుమారుడు అంత వరస్ట్ అని చిత్ర యూనిట్ నుంచి ఛిత్కారాలను భరించారట.
రఘువరన్ వ్యాఖ్యలతో మార్పు
సూర్య పూర్తి స్థాయి నటుడిగా మారడానికి ప్రధాన కారణం నటుడు రఘువరన్. ఓసారి వీరిద్దరూ రైలు ప్రయాణం చేశారు. గాఢ నిద్రలో ఉన్న సూర్యని లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు. ఏం సాధించావని? ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెబుతూ ఇండస్ట్రీలో బతుకుతావ్?’ అని రఘువరన్ అన్నారట. ఆ మాటలకు బాధపడిన సూర్య నటనపై శ్రద్ధ పెట్టారు. ప్రపంచంలోని గొప్ప సినిమాలన్నీ చూసి ఏ హావభావాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చుకున్నారు.
తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు
షార్ట్ డాక్యుమెంటరీ ‘హీరోవా? జీరోవా?’, ‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’వంటి మ్యూజిక్ వీడియోల్లోనూ సూర్య నటించారు. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలోకి ఆహ్వానితుడిగా వెళ్లిన తొలి దక్షిణ భారతీయ నటుడు సూర్యనే కావడం విశేషం.
సూర్య డబ్బింగ్ చెప్పారని తెలుసా!
ఇతర హీరోలకు సంబంధించి సూర్య తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ‘గురు’ (Guru) తమిళ్ వెర్షన్‌లో హీరో అభిషేక్ బచ్చన్‌కు గాత్ర దానం చేశారు. రానా హీరోగా రూపొందిన ‘ఘాజీ’కి తమిళ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత ఇలా ప్రతి విభాగంలో సూర్య తనదైన మార్క్ చూపించారు.
అవార్డులే అవార్డులు
27 ఏళ్ల నట ప్రస్థానంలో సూర్య జాతీయ అవార్డు (సూరారై పోట్రు) సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ఛాయిస్) విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకూ 6 ఫిల్మ్‌ఫేర్స్, 5 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డ్స్, 2, ఎడిసన్ అవార్డ్స్, 2 సైమా అవార్డ్స్, 6 విజయ్ అవార్డ్స్ అందుకున్నారు.
సేవా కార్యక్రమాలు
మంచి మనసు కలిగిన సూర్య ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారిలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విద్యార్థులకి సూర్య సాయమందించారు. ‘జై భీమ్’ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో కలిసి ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించడం గమనార్హం.
‘కంగువా’గా రాబోతున్న సూర్య
సూర్య తాజా చిత్రం ‘కంగువా’ (Kanguva) అక్టోబరు 10న విడుదల కానుంది. అటు తన 44వ సినిమాని సూర్య ఇటీవల ప్రారంభించారు. ‘Suriya 44’ వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
జూలై 23 , 2024
Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్‌స్టాప్? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్!
మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇంటి వద్ద నెలకొన్న ఘర్షణ పరిస్థితులు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఆదివారం (డిసెంబర్ 8) మెుదలైన ఈ వ్యవహారం బుధవారం (డిసెంబర్ 11) సాయంత్రం వరకు దాదాపు నాలుగు రోజుల పాటు రచ్చ చేస్తూనే వచ్చింది. రాచకొండ సీపీ సుదీర్ బాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడింది. బుధవారం మంచు మనోజ్‌తో పాటు సోదరుడు మంచు విష్ణుకు సీపీ వార్నింగ్ ఇవ్వడంతో వివాదానికి కేంద్రమైన హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
షూటింగ్‌కు వెళ్లిన మనోజ్..
తండ్రి మోహన్‌బాబుతో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ గత నాలుగు రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గాయాలతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపై రాచకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, తనకు జరిగిన అన్యాయంపై వరుస ప్రెస్‌మీట్లతో ప్రజలకు తెలియజేయడం ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అటువంటి మనోజ్ బుధవారం రాచకొండ సీపీ సుదీర్ బాబు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో వివాదానికి తాత్కాలికంగా చెక్ పెట్టారు. గురువారం సినిమా షూటింగ్‌కు ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ ‘భైరవం’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్‌తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో మనోజ్ పాల్గొన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఇటీవల నారా రోహిత్ తండ్రి చనిపోవడం, తాజాగా మనోజ్ ఇంట్లో వివాదం చెలరేగడంతో సినిమా విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి.
తముళ్లకు మంచు లక్ష్మి కౌంటర్..
మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం తెలుగు రాష్ట్రాలను కుదిపేసినప్పటికీ మంచు లక్ష్మీ ఎక్కడా ఈ వివాదంలో తలదూర్చలేదు. పైగా సోదరులు ఇద్దరు మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే మంచు లక్ష్మీ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంతటితో ఊరుకోకుండా నెట్టింట పరోక్ష కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో ప్రవచనాన్ని గురువారం ఉదయం మంచు లక్ష్మీ పోస్టు చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. 'ఈ ప్రపంచంలో ఏదీ నీకు సొంతం కానప్పుడు ఏదో కోల్పోతామనే భయం నీకెందుకు? అని మంచు లక్ష్మీ కొటేషన్ పెట్టింది. సోదరులు ఇద్దరు ఆస్తుల కోసం గొడవపతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె సూక్తి పెట్టినట్లు అర్ధమవుతోంది.
https://twitter.com/LakshmiManchu/status/1867031240064504027
మోహన్ బాబుపై హత్య కేసు
మీడియాపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సీనియర్ నటుడు మోహన్‌పై హత్య కేసు నమోదైంది. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని పెద్దఎత్తున్న జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మరోమారు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఆధారాలను పరిశీలించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసును పెట్టారు. దీనికి సంబంధించి త్వరలో మోహన్‌బాబును పోలీసులు విచారించే అవకాశముంది.
‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు’
మంచు మనోజ్ చేసిన ఫిర్యాదులో భాగంగా రాచకొండ సీపీ కార్యాలయానికి గురువారం సాయంత్రం మంచు విష్ణు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా జరిగిన మంచు కుటుంబం వివాదాలపై సీపీ సుదీర్ బాబు ఆరా తీశారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడ్డవద్దని సూచించారు. సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, గొడవలు చేయవద్దని చెప్పారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్న సరే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇకపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిలే వ్యవహరిస్తే లక్షరూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
డిసెంబర్ 12 , 2024
Manchu Manoj: ఒక మగాడిలా రమ్మనండి.. మంచు విష్ణుపై ఫైర్.. వీడియో వైరల్!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తండ్రి కొడుకులు మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj)లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు సోమవారం రాత్రి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిద్దరి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన హైదరాబాద్ పహాడిషరీఫ్ పోలీసులు విడివిడిగా రెండు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ ఈ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు.
గేట్లు తోసుకెళ్లిన మనోజ్..
హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్, అతడి భార్య మౌనిక తిరిగి ఇంటికి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. వారి వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో మనోజ్ దంపతులు కారులోనే చాలా సేపు ఉండాల్సి వచ్చింది. వారి 7 నెలల పాప లోపలే ఉండటంతో కారు నుంచి బయటకు దిగిన మనోజ్ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఏం గొడవ జరుగుతుందా? అని స్థానికంగా ఆందోళన నెలకొంది.
మనోజ్‌కు అల్టిమేటం..
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శంషాబాద్ జల్‌పల్లి నివాసం నుంచి మనోజ్‌ను పంపించేయాలని మోహన్ బాబు నిర్ణయించారు. తాజా ఘర్షణ నేపథ్యంలో మనోజ్ ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదని అల్టీమేటం జారిచేసినట్లు తెలుస్తోంది. అటు మనోజ్ సైతం వెళ్లి పోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వాహనాలు తెప్పించి సామాన్లు తరలించేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
గన్‌మెన్‌ల కోసం రిక్వెస్ట్
తన తండ్రి మోహన్‌బాబుతో వివాదం నేపథ్యంలో మంచు మనోజ్, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సంబంధిత అధికారికి తెలియజేశారు. తమ ఇద్దరికీ గన్‌మెన్లను కేటాయించాలని మనోజ్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసు అధికారి అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
మంచు విష్ణు వార్నింగ్..
దుబాయి నుంచి వచ్చిన మంచు విష్ణు.. ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్ తరపున వచ్చిన బౌన్సర్లకు విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ బౌన్సర్‌కు వేలు చూపిస్తూ విష్ణు సీరియస్‌గా మాట్లాడటం గమనించవచ్చు.
https://twitter.com/prime9news/status/1866426632845832420
ఫామ్ హౌస్ చుట్టే లొల్లి..
మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థల ఆస్తుల పంపకాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ మెుదలైనట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ కూడా తనకు సంబంధంలేని జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉండటంతో మోహన్‌బాబు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. తమ కుమారుడు మనోజ్, కోడలు మౌనిక తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని హైదరాబాద్ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘అమ్మ ఒంటరిగా ఉండటంతో’..
ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడన్న మోహన్‌బాబు ఆరోపణలను మంచు మనోజ్ ఖండించారు. ఆ ఇంట్లో ఉంటున్నందుకు గల కారణాన్ని సోమవారం అర్ధరాత్రి పోస్టు చేసిన సుదీర్ఘ పోస్టులో వివరించారు. 'నా సోదరుడు (మంచు విష్ణు) కొన్ని కారణాల వల్ల దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. మా నాన్న, అతని స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇంట్లోకి వెళ్లా. ఏడాదిపైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నా’ అని అన్నారు.
డబ్బు వృథా చేస్తోంది నేనా? విష్ణునా?
మనోజ్ కారణంగా తన విలువైన వస్తువులు, ఆస్తుల భద్రత విషయంలో భయపడుతున్నట్లు మోహన్‌బాబు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో మోహన్‌బాబు పేర్కొన్నారు. దీనిపైనా మంచు మనోజ్ తన ఎక్స్‌పోస్టులో స్పందించారు. 'నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రగా ఉంటూ కెరీర్‌ను నిర్మించుకున్నా. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశా. ఒక్కరూపాయి తీసుకోలేదు. నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. అడిగినట్టు నిరూపించండని సవాల్ చేస్తున్నా. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృథా చేస్తున్నారు.. నేనా? విష్ణునా?' అంటూ నిలదీశారు.
నన్ను అణిచివేసేందుకే..
వివాదానికి కేంద్రమైన హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘నేను చేస్తోంది ఆత్మగౌరవ పోరాటం. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన అంశం. ఒక మగాడిగా నాతో నేరుగా వచ్చి ఇదంతా చేసినా పర్వాలేదు. కానీ, నన్ను అణిచివేసేందుకు నా భార్యను బెదిరించడం, ఏడు నెలల తన పాపను వివాదంలోకి లాగుతున్నారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే నాపై దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదు’ అని చెప్పారు.
https://twitter.com/pakkatelugunewz/status/1866385879117553785
పోలీసుల చర్యలపైనా..
ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంటి వద్ద మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ తరపున భారీగా బౌన్సర్లు పోగయ్యారు. సోమవారమే మంచు విష్ణు తరపున 40 బౌన్సర్లు రాగా, మనోజ్ మరో 30 మందిని తన భద్రత కోసం పిలిపించారు. తాజాగా ఈ అంశంపై మంచు మనోజ్ మాట్లాడుతూ ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తనకు రక్షణగా తెప్పించుకున్న వ్యక్తులను బెదరగొట్టి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. తనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’ అని మనోజ్ అన్నారు.
https://twitter.com/tv5newsnow/status/1866376337285636475
బౌన్సర్ల మధ్య ఘర్షణ
మరోవైపు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్ తరపు బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు, సెక్యురిటీ సిబ్బంది బలవంతంగా బయటకి పంపించేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో వారు దౌర్జన్యంగా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుతున్నట్లు సమాచారం. ఒకరినొకరు తోసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
https://twitter.com/AadhanTelugu/status/1866381934546575621
సోమవారం రాత్రి హైడ్రామా
సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తన అనుచరులతో స్వయంగా వెళ్లిన మనోజ్ తనపై గుర్తు తెలియనివారు దాడి చేశారంటూ తొలుత ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు లేఖ రాశారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, చిన్న కోడలు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని సీపీని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని సీపీకి తెలియజేశారు.
https://twitter.com/jsuryareddy/status/1866227364629520738
పవన్ కల్యాణ్‌కు మనోజ్ రిక్వెస్ట్
తండ్రి మోహన్ బాబు రాసిన లేఖను సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్‌వేదికగా ఖండించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సహా ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలకు ట్యాగ్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తనపై తన భార్య మౌనకపై తన తండ్రి మోహన్ బాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తన పరువు మర్యాదాలను కావాలనే తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగేలా చేశారని రాసుకొచ్చారు. ఈ మేరకు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ మంచు మనోజ్ ఇచ్చారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు.
https://twitter.com/HeroManoj1/status/1866180910472974706
డిసెంబర్ 10 , 2024
Father's Day Special: నాన్నలతో ఈ స్టార్ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చారు.
https://twitter.com/KChiruTweets/status/1802187791251509401
మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది.
View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni)
అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది. ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది.
View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్ షేర్ చేసింది.
https://twitter.com/shrutihaasan/status/1802221449899610217
మెగా బ్రదర్, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్ హీరో ‘వరుణ్ తేజ్’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
జూన్ 17 , 2024
Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు విష్ణు తన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు.
విష్ణు.. మాస్ వార్నింగ్
మంచు ఫ్యామిలీ గొడవల్లో బయటవారి ప్రమేయం ఉందని మంచు విష్ణు అన్నారు. వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకూ టైమ్ ఇస్తున్నట్లు చెప్పారు. వారంతట వారే ఇందులో నుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని విష్ణు అన్నారు. అయితే తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు.
https://twitter.com/Telugu360/status/1866749230423085437
మోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీచేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది.
దాడి కేసులో ఒకరి అరెస్టు
మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచు మనోజ్‌పై దాడి చేసిన వారిలో కిరణ్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు విష్ణుకు ప్రధాన అనుచరుడిగానూ వ్యవహరిస్తున్నారు. కిరణ్‌తో పాటు దాడికి పాల్పడిన వినయ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
మంచు లక్ష్మి ఆసక్తిక పోస్టు
మంచు ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు కారణమైన నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను పోస్టు చేస్తూ 'పీస్' (శాంతి) అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల రిత్యా ఆమె షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ ఇంట్రస్టింగ్ పోస్టును మంచు లక్ష్మి పోస్టు చేశారు. ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 11 , 2024
Sandeep Reddy Vanga: తల్లి సెంటిమెంట్‌పై సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా?
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్ రెడ్డి ‘యానిమల్’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘అమ్మను ఎదిరించాను’
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) రంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల్లో తల్లి రోల్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడో వివరించాడు. తన అమ్మతో తాను చాలా చనువుగా ఉంటానని సందీప్ తెలిపారు. ఆమె తనను బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తన మదర్ చాలా సహకరించిందని, యాక్టింగ్ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ వరకు ఎన్నో విషయాల్లో ఆమె సపోర్ట్ ఉందని చెప్పారు. అమ్మతో ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆమెను ఎదిరించిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పించారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తల్లి- కుమారుడు సెంటిమెంట్‌తో సినిమా తీస్తే అది పాజిటివ్‌గా ఉంటుందని, అందులో హింసకు చోటుండదని చెప్పుకొచ్చాడు.
తండ్రి-కొడుకుల బాండింగ్ సూపర్బ్
సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ‘యానిమల్’(Animal) చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో వైలెన్స్‌తో పాటు తండ్రీ, తనయుల మధ్య అనుబంధాన్ని సందీప్ చక్కగా చూపించాడు. యాక్షన్ & ఎమోషన్ డ్రామా ఫిల్మ్‌గా కళ్లకు కట్టాడు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తండ్రి పాత్రలో యాక్ట్ చేయగా రణ్‌బీర్ కపూర్ తనయుడిగా చేశాడు. బాబీదేవోల్ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానున్న విషయం తెలిసిందే.
మూడు విభిన్న లుక్స్‌తో..
యానిమల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో సందీప్ (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్ రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. పోలీసు లుక్‌తో పాటు మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్ అలరించే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్ ఎండింగ్‌లోపు సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో..
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా 'స్పిరిట్' నిలవనుంది.
డిసెంబర్ 07 , 2024
Venkata Datta Sai: పీవీ సింధు చేసుకోబోయే వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.
డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభమవుతాయని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సింధు పెళ్లి ప్రకటనతో ఆమెకు కాబోయే భర్త (Venkata Datta Sai) గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆయన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి (Venkata Datta Sai) ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ & సైన్సెస్‌లో డిప్లొమో పొందారు
2018లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో బీబీఏ పట్టా అందుకున్నారు.
బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు.
ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్ సౌత్ వెస్ట్) తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అతను సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
అప్పట్లో తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం.
ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్ (Posidex Technologies) అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి (Venkata Datta Sai) వ్యవహరిస్తున్నారు.
ఈ వెంకట దత్త సాయి అదే పోసిడెక్స్ ఎండీ, మాజీ ఐఆర్ఎస్ అయిన జీటీ వెంకటేశ్వర్ రావు తనయుడే. దీంతో తన కంపెనీలోనే సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
గత నెలలో ఈ పోసిడెక్స్ టెక్నాలజీస్ (Posidex Technologies) కొత్త లోగోను సింధునే లాంచ్ చేయడం విశేషం. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పీవీ సింధు ఈ మధ్యే వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజ చేసింది. అరిలోవా ఏరియాలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ సెంటర్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు పీవీ సింధు తెలిపింది.
డిసెంబర్ 03 , 2024
A.R. Rehman: ఏ.ఆర్. రెహమాన్‌తో ఎఫైర్ ఉందంటూ రూమర్లు.. అసిస్టెంట్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెహమాన్ భార్య సైరా బాను (Saira Bhanu) తరపు లాయర్ ప్రకటించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్దిసేపటికే అతడి టీమ్‌లోని మోహిని దే (Mohini Dey) అనే మహిళ తన భర్తకు విడాకులు ప్రకటించడం చర్చనీయాంశమైంది. రెహమాన్ ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు ఒక్కటయ్యేందుకే జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే వీటిపై తాజాగా మోహిని దే స్పందించింది. రెహమాన్‌తో తనకున్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.
‘నిందలు వేయడం కరెక్ట్ కాదు’
ఏ.ఆర్. రెహమాన్‌తో రిలేషన్‌పై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్‌ను బేస్ ప్లేయర్ మోహిని దే తీవ్రంగా ఖండించింది. ఆయన తనకు తండ్రితో సమానమని స్పష్టం చేసింది. తనది ఏ.ఆర్. రెహమాన్ కుమార్తెలది ఒకటే వయసని గుర్తుచేసింది. ఆయన తనను ఎప్పుడూ కూతురు లాగానే చూశారని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆయన బృందంలో పని చేస్తున్నానని రెహమాన్ అంటే తనకెంతో గౌరవమని పేర్కొంది. మాపై ఇలాంటి రూమర్స్ రావడం చాలా బాధకరమని చెప్పింది. సున్నితమైన విషయాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ ప్రచారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది. ఈ ఏడాదే తన తండ్రిని కోల్పోయానని అప్పటి నుంచి రెహమాన్ టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ తనను సొంత వ్యక్తిలా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది.
https://twitter.com/GemCinemas/status/1861288712652628193
ఆడియో రిలీజ్ చేసిన మాజీ భార్య
ఏ.ఆర్. రెహమాన్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన భార్య సైరా బాను సైతం స్పందించింది. ఈ మేరకు ఆఢియోను విడుదల చేసింది. యూట్యూబర్లు, తమిళ మీడియా రెహమాన్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. రెహమాన్ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. ఇకనైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని హితవు పలికింది. మరోవైపు రెహమాన్ భార్య తరపు న్యాయవాది సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. రెండు జంటల డివోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరస్పర అంగీకారంతోనే సైరా - రెహమాన్ విడిపోయారని స్పష్టం చేశారు. వైవాహిక బంధంలో సైరా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని చెప్పుకొచ్చారు. వారు విడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పారు.
https://twitter.com/sunnewstamil/status/1860585811940352492
సైరా బాను గురించి తెలుసా!
రెహమాన్ మాజీ భార్య సైరా బాను (Saira Bhanu) గుజరాజ్‌లో జన్మించింది. ఆమె ప్రముఖ మలయాళ యాక్టర్ రషిన్ రెహమాన్ మరదలు. ఓ దర్గాలో తొలిసారి సైరాను చూసిన రెహమాన్ తల్లి ఆమెను ఇష్టపడింది. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లితో రెహమాన్ సైరా ఒక్కటయ్యారు. ఏ.ఆర్ రెహమాన్ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. రెహమాన్ - సైరా జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు ఖతీజా వివాహాన్ని 2022లో ఘనంగా నిర్వహించారు.
ఫుల్ రైజింగ్‌లో రెహమాన్!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ ఏడాది వచ్చిన అయాలన్, లాల్ సలామ్ చిత్రాలకు రెహమానే సంగీతం సమకూర్చాడు. ముఖ్యంగా రాయన్‌లోని పాటలు ప్రేక్షకులను బాగా అలరించారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌కు సైతం రెహమాన్ వర్క్ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేరుగా ఓ తెలుగు ఫిల్మ్‌కు రెహమాన్ వర్క్ చేయబోతున్నారు. దీంతో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని సంగీత ప్రియులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
నవంబర్ 26 , 2024
Nayanthara: ధనుష్‌తో వివాదం.. చిరు, రామ్‌చరణ్‌ను ఆకాశానికెత్తిన నయనతార!
తమిళ హీరోయిన్ నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పై ఇటీవల నయన్ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
‘వారంటే నాకెంతో గౌరవం’
లేడీ సూపర్ స్టార్‌కు సంబంధించిన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. అటు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్ భార్య గౌరీ ఖాన్, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)
ధనుష్‌తో గొడవ ఎందుకుంటే?
2015లో నయనతార (Nayanthara) చేసిన 'నానుమ్ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్ (Dhanush) నిర్మాత. 'నానుమ్ రౌడీ'తో నయన్‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ధనుష్ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్‌ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల 'నానుమ్ రౌడీ దాన్' కంటెంట్‌ను వాడటంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్‌ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది.
https://twitter.com/NayantharaU/status/1857680582773551362
నయనతారకు మద్దతుగా మహేష్!
ధనుష్ - నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్ - విఘేష్ లవ్ ఎపిసోడ్ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్, విఘ్నేష్, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మహేష్ ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టాడు. మూడు లవ్ సింబల్స్‌ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. ధనుష్ - నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్‌లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
https://twitter.com/GulteOfficial/status/1858556384079761643
దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్!
ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్', 'మన్నన్‌గట్టి సిన్స్ 1960', 'తని ఓరువన్ 2', 'ముకుతి అమ్మన్ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
నవంబర్ 21 , 2024