• TFIDB EN
  • టెనెంట్
    UATelugu
    గౌతమ్‌, సంధ్య పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత వారి కాపురంలో సమస్యలు వస్తాయి. ఓ రోజు మేఘా బెడ్‌పై విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారుంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు పైనుంచి దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? పైనుంచి పడ్డ యువకుడు ఎవరు? గౌతమే ఆమెను చంపేశాడా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 June 264 months ago
    టెనెంట్ చిత్రం మరో ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో జూన్ 28నుంచి స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సత్యం రాజేష్
    మేఘా చౌదరి
    ఆడుకలం నరేన్
    చందన పాయవుల
    భరత్ కాంత్
    ఎస్టర్ నోరోన్హా
    ధన బాల
    రమ్య కొల్తూరి
    సిబ్బంది
    వై.యుగంధర్దర్శకుడు
    చంద్ర శేఖర్ మొగుల్లానిర్మాత
    సాహిత్య సాగర్సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ  ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.  లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌  దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ  ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.  ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్‌ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
    ALLU ARJUN SON: “ఇక నా పిల్లల చేత శ్రీవల్లి పాట పాడిస్తా”.. అయాన్‌ టాలెంట్‌కు షారుక్ ఫిదా!
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడిన ఓ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ నటించిన సూపర్ హిట్‌ మూవీ డుంకీ చిత్రంలోని లుట్‌ ఫుట్ గయా పాటను మంచి రిదమ్‌తో పాడాడు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా SRK ఫ్యాన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్‌ సైతం అయాన్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియో షారుఖ్‌ ఖాన్‌కు చేరింది. అయాన్ టాలెంట్‌పై SRK స్పందిస్తూ.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన బుడ్డోడివి అంటూ ప్రశంసించాడు.  అల్లు అర్జున్ కొడుకు అయాన్.. సెలబ్రెటీ కిడ్ మాదిరిలా కాకుండా చాలా ఫ్రీగా ఉంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ తన టాలెంట్‌ను చాటుతుంటాడు. తన తండ్రి స్టార్ డమ్‌ను ఏమాత్రం తనపై ప్రభావం లేకుండా చాలా స్వేచ్ఛగా మాట్లాడుతుంటాడు.  అయితే ఈ మధ్య అల్లు అర్జున్‌తో కారులో ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో తనకు ఇష్టమైన సాంగ్‌ను పాడుతా అంటూ బన్నీకి చెప్పాడు. రీసెంట్ మూవీ  డుంకీ చిత్రంలోని "లుట్ ఫుట్ గయా" అంటూ తనదైన స్వాగ్‌లో అయాన్ హమ్ చేశాడు. బ్లాక్, వైట్ అండ్ ఎల్లో జెర్సీ వేసుకున్న అయాన్ చివర్లో షారుక్ ఖాన్ స్టైల్‌లో ఓ లుక్ ఇస్తూ ముగించాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేశారు. అయాన్‌కు  గొప్ప భవిష్యత్‌ ఉందంటూ అతని ప్రతిభ ప్రశంసిస్తూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. https://twitter.com/SRKUniverse/status/1761332479590297791?s=20  ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ స్పందించారు. "నువ్వో ఫ్లవర్, ఫైర్ కలిగిన వ్యక్తివి అంటూ ప్రశంసించారు. అలాగే పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను తన పిల్లల చేత త్వరలో పాడిస్తానని ఎక్స్‌లో చెప్పుకొచ్చాడు. షారుక్ స్పందించడంపై అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు అగ్రహీరోల మధ్య జరిగిన ఈ స్వీట్ కాన్వర్జేషన్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. https://twitter.com/iamsrk/status/1761701819687030986?s=20 టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్.. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గతంలో జవాన్ సినిమా విడుదలైన సమయంలో షారుక్ నటనను ప్రశంసిస్తూ బన్నీ కామెంట్ చేశాడు. మాస్‌ అవతార్‌లో షారుక్‌ లుక్ అదిరిపోయిందని, జవాన్ చిత్రం అతి పెద్ద బ్లాక్ బాస్టర్‌ అంటూ ప్రశంసించాడు. ఆ చిత్ర యూనిట్‌గా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఈ పోస్ట్‌పై SRK సైతం స్పందించి థ్యాంక్స్ చెప్పాడు. తాను పుష్ప సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా కలుస్తానని పేర్కొన్నాడు.  https://twitter.com/iamsrk/status/1702214179212411127?s=20 తాజాగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ వీడియో అదేస్థాయిలో షారుక్ స్పందించడం విశేషం. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు షారుక్ ఖాన్ డుంకీ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాడు.
    ఫిబ్రవరి 26 , 2024
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
    మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.  మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.  https://twitter.com/Nithish13771106/status/1671007811839623170 దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536 లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.  https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365 లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/s_siechojithu/status/1670955824305569795 రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు. https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656 తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది. https://twitter.com/sunny5boy/status/1671039650897510400 మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.  https://twitter.com/always_dasari9/status/1670959463367598082 మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.  https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040 డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328 ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705 ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.   https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818 అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.  https://twitter.com/gnani0414/status/1670985319297212416 పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది. https://twitter.com/gnani0414/status/1671012059625168897 రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు. https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529 మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది. https://twitter.com/s_siechojithu/status/1671026894760992770 నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు. https://twitter.com/KingLeo_007/status/1671348946755805191 చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది. https://twitter.com/Noori_NN/status/1671045618079506433
    జూన్ 21 , 2023
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శృతి హాసన్ తన మెస్మరైజింగ్ టాలెంట్‌తో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో గబ్బర్ సింగ్, క్రాక్, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకున్న శృతి హాసన్(Some Lesser Known Facts about Shruti Haasan)  గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.  శృతి హాసన్ ముద్దు పేరు? కన్నా శృతి హాసన్ వయస్సు ఎంత? 1986, జనవరి28న జన్మించింది శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి సినిమా? అనగనగా ఓ ధీరుడు(2011) శృతి హాసన్ హిందీలో నటించిన తొలి సినిమా? లక్(2009) శృతి హాసన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  శృతి హాసన్ ఎక్కడ పుట్టింది? చెన్నై, తమిళనాడు శృతి హాసన్  ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ శృతి హాసన్ అభిరుచులు? షాపింగ్, ట్రావెలింగ్ శృతి హాసన్‌కి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ శృతి హాసన్‌కు అఫైర్స్ ఉన్నాయా? హీరో సిద్ధార్థతో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతం శాంతను హజరికతో ప్రేమలో ఉంది. శృతి హాసన్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ శృతి హాసన్‌కు ఇష్టమైన హీరో? షారుక్‌ ఖాన్, రజనీకాంత్ శృతి హాసన్‌ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2 కోట్ల  వరకు ఛార్జ్ చేస్తోంది. శృతి హాసన్‌ తల్లిదండ్రుల పేరు? కమల్ హాసన్, సారిక ఠాకూర్ శృతి హాసన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శృతి హాసన్‌ సినిమాల్లోకి రాకముందు సింగర్‌గా పలు స్టేజ్ పర్ఫామెన్సెస్ ఇచ్చింది శృతి హాసన్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shrutzhaasan/?hl=en శృతి హాసన్ వ్యాపారాలు? శృతి హాసన్ పలు కాస్మోటిక్( Guess and aldo) బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=mos5_ozTwEE శృతి హాసన్ గురించి మరికొన్ని విషయాలు స్కూళ్లో చదివేటప్పుడు తన పేరు పూజ రామచంద్రన్.శృతి హాసన్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.శృతి హాసన్ తన బెస్ట్ ఫ్రెండ్ తమన్నా భాటియా ఒకరికొకరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.శృతితో విడిపోతున్నట్లు ఆమె మాజీ ప్రేమికుడు మైఖెల్ కార్‌సెల్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు.
    ఏప్రిల్ 27 , 2024
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్‌ చేసే యంగ్‌ హీరోలు వీరే!
    సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్‌ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  సుహాస్‌ యువ నటుడు సుహాస్‌ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్‌.. తానొక హీరో మెటీరియల్ ‌అని నిరూపించుకున్నాడు. ‘కలర్‌ ఫొటో’, ‘రైటర్‌’, ‘అంజాబీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ వంటి హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్‌ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్‌ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్‌ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్‌ స్టార్‌ అవుతాడని అంటున్నారు.  విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’తో స్టార్‌ హీరోగా మారిన విజయ్‌.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్‌ సొంతం. ప్రస్తుతం సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్‌ మార్కెట్‌ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్‌ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్‌ హిట్‌ లభిస్తే విజయ్‌ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.  సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌ను రూల్‌ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో రూ.100 కోట్ల క్లబ్‌లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, రైటింగ్‌ స్కిల్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్‌ చేయడంలో యూత్‌ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్‌ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్‌’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో స్టార్‌ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్‌ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.  నవీన్ పొలిశెట్టి ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్‌ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్‌లో కామెడీ స్టార్‌ అనగానే అందరికీ నవీన్‌ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్‌ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్‌ తన టాలెంట్‌ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్‌ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్‌ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్‌ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఒక సాలిడ్‌ హిట్‌ లభిస్తే నవీన్‌ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తేజ సజ్జ యంగ్‌ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్‌’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాందించిన ఈ యంగ్‌ హీరో.. టాలీవుడ్‌ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్‌ యోధ’ చిత్రం కూడా  సాహసోపేతమైన కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్‌ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.  అడవి శేషు యువ హీరో అడవి శేషు.. యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్‌ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్‌ బాయ్‌, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్‌ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం  కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్‌: సెకండ్‌ కేసు’, ‘మేజర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్‌లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్‌లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌గా మారే అవకాశముంది. ప్రియదర్శి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన  'టెర్రర్‌' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్‌లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్‌ ప్రాజెక్టులను ప్లాన్‌ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్‌ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
    ఏప్రిల్ 18 , 2024
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే 'అన్నయ్య' ఆయన. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన ఆపాద్బాంధవుడు. ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. పద్మవిభూషణుడిగా వెలుగొందుతూ.. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్న చిరంజీవిగారి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి అసలు పేరు? కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు చిరంజీవి నటించిన తొలి సినిమా? ప్రాణం ఖరీదు, (చిరంజీవి నటింటిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది) చిరంజీవి ఎక్కడ పుట్టారు? పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి పుట్టిన తేదీ ఎప్పుడు? 1955 ఆగస్టు 22 చిరంజీవి భార్య పేరు? ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి అభిరుచులు? చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారు?  "సుప్రీమ్‌ హీరో"గా గుర్తింపు పొందిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 'మరణ మృదంగం' చిత్రం విజయం తర్వాత ఆ సినిమా నిర్మాత కేఎస్‌ రామారావు, చిరంజీవిని మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు. చిరంజీవి బ్రేక్ డ్యాన్స్‌ ఏ సినిమాలో ఫస్ట్‌ టైం చేశారు? పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు చిరంజీవికి ఇష్టమైన సినిమా? రుద్రవీణ చిరంజీవికి ఇష్టమైన పాటలు? రుద్రవీణ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' పాట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి అభిమాన నటుడు? అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం? ఖైదీ చిరంజీవికి ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ చిరంజీవి తల్లిదండ్రుల పేర్లు? కొణిదెల వెంక‌ట్రావ్, అంజనా దేవి  చిరంజీవి ఏం చదివారు? BCom https://www.youtube.com/watch?v=hURrrR2lMrY చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు? 150కి పైగా సినిమాల్లో నటించారు చిరంజీవికి ఇష్టమైన ఆహారం? బొమ్మడాయిల పులుసు, చిన్న చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు. చిరంజీవి నికర ఆస్తుల విలువ ఎంత? రూ.3000కోట్లు చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.70కోట్లు తీసుకుంటారు.
    మార్చి 19 , 2024
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.  ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్‌ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్‌ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్‌ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు. ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయని వాటిలో 90% ఫెయిలవుతున్నట్లు ఆర్జీవీ చెప్పాడు. చిత్ర నిర్మాతలు ఎంచుకున్న కథ, తారాగణం, సృజనాత్మక అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోని 90% నిర్మాతలకు ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియదని ఈ లెక్కలు రుజువు చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా తీయగల టాలెంట్ ఉన్న ఆడియన్స్‌కు మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కలిసి కట్టుగా నిర్మూలిద్దామంటూ వారికి పిలుపునిచ్చాడు. ఇండస్ట్రీలోని స్టార్ల వారసులని కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా కృషి చేద్దామని ఆర్జీవీ అన్నాడు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. అవి మీ సమయాన్ని, డబ్బుని వృథా చేస్తాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి వాటిని కూడా నిర్మూలించేందుకు చేతులు కలపాలని సినీ అభిమానులకు పిలుపునిచ్చాడు.  చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఆర్జీవీ డెన్‌ ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ టిక్కెట్‌ కొనుగోలు చేసే ప్రేక్షకులు మాత్రమే సినిమాను నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. లీడ్‌ యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, లిరికిస్ట్స్‌, డైలాగ్‌ రైటర్స్‌ను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర టెక్నికల్‌ సిబ్బందిని పరిశ్రమలోని నిపుణుల నుండి ఎంపిక చేసిన దర్శకుడు సెలక్ట్‌ చేస్తారని స్పష్టం చేశాడు.  అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందామని ఔత్సాహికులకు ఆర్జీవీ పిలుపునిచ్చాడు. వారందర్ని ఆర్జీవీ డెన్‌కి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. మరి మీలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.comకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్‌ని తెలుసుకోవాలని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సూచించారు.  ఔత్సాహికులు ఏ విధంగా అప్లై చేయాలి? వచ్చిన ఆప్లికేషన్ల నుంచి నటీనటులను ఫైనల్‌ చేసే విధానాన్ని కూడా ఆర్జీవీ తన వెబ్‌సైట్‌లో వివరంగా పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.  పేరు వయసుఎత్తు (అడుగులలో)చర్మ రంగుకంటి రంగుసింగిల్ బస్ట్ సైజ్‌ ఫొటోసింగిల్‌ ఫుల్‌ ఫిగర్ ఫొటో హీరో, హీరోయిన్ ఎంపిక ప్రక్రియ ఆసక్తిగల వారు 15 రోజుల్లో పై వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 30 మందిని ఆర్జీవీ డెన్‌ సిబ్బంది లుక్స్‌ను బట్టి షార్ట్ లిస్ట్‌ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన 30 మంది వివరాలను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వారిలో ఎవర్ని ఎంచుకోవాలో పబ్లిక్‌  పోల్‌ నిర్వహిస్తారు. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్‌ 15 యువతీ, యువకులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని ఏదైన డైలాగ్‌ ఇచ్చి 30 సెకన్ల ఆడిషన్స్ వీడియో పంపాలని ఆర్జీవ్‌ డెన్‌ టీమ్‌ కోరుతుంది. మళ్లీ ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్టు చేసి మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ దఫా ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఏడుగురు యువతీ, యువకులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి నటనకు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్స్ పెట్టి వారిలో బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చిన వారిని తిరిగి పోల్‌లోకి తీసుకొస్తారు. అందులో టాప్‌లో నిలిచిన యువతీ యువకులను ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వారిని RGVDEN తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్‌గా అవకాశం ఇస్తారు. మిగతా విభాాగాలు.. ఇదే విధంగా డైరెక్టర్స్‌, రైటర్స్‌, మ్యూజిక్ కంపోజర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌, లిరికిస్ట్స్‌ వారి విభాగాలకు తగ్గట్లు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.  https://rgvden.com/
    ఏప్రిల్ 06 , 2024
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    'సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం సృష్టిస్తోంది. ఓ రేంజ్‌లో పరువాలు ఒల‌క‌బోస్తూ కుర్రాళ్లను కంగు తినేలా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్  కుర్రకారులో మ‌రింత వేడిని పెంచుతోంది. క్రీమ్ కలర్ మల్బరీ బ్లౌజ్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.  మల్బరీ పట్టు చీరను కేరళ స్టైల్‌లో ధరించి అందాల విందు చేసింది. మత్తెక్కించే చూపులతో గాలం వేస్తోంది లూజ్ హెయిర్, గొల్డెన్ జూకాలు, నోస్‌ రింగ్ ఆమె అందాన్ని మరింత ఆకర్శనీయం చేశాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం అందం రా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స‌ప్త సాగ‌రాలు (Sapta Sagaralu Dhaati (Side B) చిత్రంలో లిప్‌లాక్‌ సీన్లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ వేసినా అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు.  మ‌హిరా (Mahira 2019)  అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... తక్కువ కాలంలో మల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి పాడేటప్పుడు ఇంట్లో సంగీతం వింటూ పెరిగింది, అలా ఆమె పాడటంపై ఆసక్తిని పెంచుకుని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. సంగీతం అంటే ఇష్టంతో సింగర్‌గా వచ్చిన చైత్ర అనుకోకుండా నటిగా మారింది. ఇప్పటికే నేపథ్య గాయనిగా 10కి పైగా పాటలు పాడింది. గరుడ గమన వృషభ వాహన సినిమాలో "సోజుగడ సూజుమల్లిగే" పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సైమా అవార్డును పొందింది. కళాశాలలో ఉండగానే, నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి, నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సప్త సాగరాలు దాటి సైడ్ బి చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ చిత్రంలో  వేశ్యగా న‌టించి మెప్పించింది. టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ ప‌ల్లెటూరు కూతురిగా అంద‌రినీ అలరించింది. ప్రస్తుతం స్ట్రాబెర్రి, జన్మదిన శుభాకాంక్షలు వంటి కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
    ఏప్రిల్ 01 , 2024
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.  ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు  సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.  హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Tollywood Debut Actress in 2023​: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్‌ వీరే!
    Tollywood Debut Actress in 2023​: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్‌ వీరే!
    ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్‌ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం.  ఆషికా రంగనాథ్‌  కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్‌’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. ప్రియా భవాని శంకర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్‌ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్‌ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్‌ అప్‌కమింగ్‌ మూవీ 'అహం బ్రహ్మాస్మి' లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్‌ 'భారతీయుడు-2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.   టీనా శిల్పరాజ్  'రైటర్‌ పద్మభూషణం' సినిమా ద్వారా టీనా శిల్పరాజ్‌ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది. రెబా మోనికా జాన్‌ ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది.  గీతిక తివారి రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అహింస'. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఐశ్వర్య మీనన్‌ నిఖిల్‌ హీరోగా చేసిన 'స్పై' (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్‌ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్‌ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేస్తున్నాడు. యుక్తి తరేజా కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్‌ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి వైద్య యంగ్‌ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి. ప్రగతి శ్రీవాస్తవ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన చిత్రం 'పెద్ద కాపు'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్‌ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది.  నుపుర్‌ సనన్‌ బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్ సనన్‌ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది.  వైష్ణవి చైతన్య బేబి చిత్రం ద్వారా 'వైష్ణవి చైతన్య' (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్‌ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్లు చేసింది. 
    డిసెంబర్ 15 , 2023
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్‌ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం 'కీడా కీలా' (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం. క‌థ వాస్తు (చైత‌న్య‌రావు), వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) తాత మనవళ్లు. లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్‌ వేస్తారు. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్‌ కార్పొరేట‌ర్ కావాల‌ని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tharun bhascker) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవ‌స‌రం పడటంతో నాయుడు, జీవన్‌ కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే. ఎలా సాగిందంటే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీతో క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి వచ్చిన షార్ప్ షూట‌ర్స్‌ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి.  బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది.  ఎవరెలా చేశారంటే? ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ ఈ సినిమాలో న‌టుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీ టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. హీరో చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్, గెటప్‌ శీను కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా సినిమాలో న‌వ్విస్తాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌, సంగీతం, మాట‌ల‌ు, పాత్ర‌ల హావ‌భావాల‌తో ఆయన న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ ఆయన స‌న్నివేశాల్ని న‌డిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా ప్రేక్ష‌కుల్ని మాత్రం కడుపుబ్బా  నవ్వించడంలో తరుణ్ భాస్కర్‌ మరోమారు విజయం సాధించాడు.  టెక్నికల్‌గా  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ న‌టులు హాస్య సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్‌ ఊహకందే కథనంరొటిన్‌ స్టోరీ రేటింగ్‌ : 3.5/5
    నవంబర్ 03 , 2023
    Nora Fatehi: నోరా ఫతేహీ అందాల తెగింపు.. క్యాట్ వాక్‌లో సొగసుల విందు
    Nora Fatehi: నోరా ఫతేహీ అందాల తెగింపు.. క్యాట్ వాక్‌లో సొగసుల విందు
    బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ మరోసారి అందాలను అప్పనంగా ప్రదర్శించింది. తాజగా జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై హోయలు ఒలికించింది. బోల్డ్ బ్లాక్ అవుట్‌ ఫిట్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. బ్యాక్, ఫ్రంట్ అందాల వడ్డింపుతో కుర్రకారును షేక్ చేసింది. ఈ హాట్ అవుట్‌ ఫిట్‌పై నెటిజన్లు తమ కామెంట్లకు పని చెప్పారు. హాట్ ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సూపర్ ఎలిగంట్ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇందుకే నోరాను కుర్రాళ్ల హృదయ దేవత అంటారు అని మరొక నెటిజన్ రెచ్చిపోయాడు. ఇక నోరా ఫతేహీ విషయానికొస్తే… బాలీవుడ్‌లో రోర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అందమైన అందాలను తెరకెక్కించడంలో ముందుండే తెలుగు డైరెక్టర్లు ఈ అమ్మడి టాలెంట్‌ను ముందుగానే పసిగట్టారు. తెలుగులో టెంపర్, బాహుబలి బిగినింగ్, కిక్2 వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్‌లు చేసి అలరించింది. అలాగే బాలీవుడ్‌లో dilbar, 'Kamariya', 'O Saki Saki', 'Garmi' వంటి బ్లాక్ బాస్టర్ పాటల్లో నర్తించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో అందాల ఆరబోతలో మిగతా హీరోయిన్ల కంటే పదాకులు ఎక్కువే చదివిన నోరా ఫతేహీ గడుసందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఎప్పుడు సోషల్ మీడియా అకౌంట్లలో హాట్ ఫోటో షూట్‌ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ వారి ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల యవ్వనం… అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమళ్లు సినిమాలో ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.
    అక్టోబర్ 30 , 2023
    <strong>Akira Nandan: అఫీషియల్‌.. పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’తోనే అకీరా నందన్ ఎంట్రీ</strong>
    Akira Nandan: అఫీషియల్‌.. పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’తోనే అకీరా నందన్ ఎంట్రీ
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. జనసేన పార్టీ (Janasena Party)ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌ ఏపీ ఉపముఖ్యమంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ‘ఓజీ’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ప్రాజెక్ట్స్‌ ఫినిష్‌ చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్‌ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ వారసుడిగా అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. పవన్‌ స్థానంలో అకీరా నందన్‌ (Akira Nandan)ను స్క్రీన్‌పై చూసుకొని సంతోషపడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ ‘ఓజీ’ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇది నూటికి నూరశాతం నిజమేనని తాజా అప్‌డేట్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; అకీరానందన్‌ ఎంట్రీ పక్కా.. పవన్‌ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్‌ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది పూర్తిగా నిజమేనని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అకీరా ఎంట్రీని నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు. ఇక అకీరా రోల్‌కు సంబంధించి మున్ముందు మరిన్ని లీక్స్‌ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి కోసం ఫ్యాన్స్‌తో పాటు మనమూ వేచి చూద్దాం.&nbsp; https://twitter.com/FilmyTwood/status/1859094576272953795 తండ్రి గురువు దగ్గర యాక్టింగ్ పాఠాలు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాల్లోకి రాకముందు ప్రముఖ నట గురువు సత్యానంద్‌ (Acting guru Satyanand) దగ్గర యాక్టింగ్‌ పాఠాలు నేర్చుకున్నారు. వైజాగ్‌లోని సత్యానంద్ శిక్షణాలయంలో నటనలోని ఓనమాలు అభ్యసించారు. ఇప్పుడు పవన్‌ తనయుడు అకీరానందన్‌ (Akira Nandan) కూడా ఆయన దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. భావోద్వేగాలను ఎలా పలికించాలో అకీరా తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన శిక్షణ కూడా అకీరా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే పర్‌ఫెక్ట్ నటుడిగా మారేందుకు అకీరా బాగానే కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. మరి స్క్రీన్‌పై అకీరా ఏ విధంగా మెరుస్తాడో చూద్దాం.&nbsp; అకిరా ఎంతో టాలెంటెడ్‌! అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మ్యూజిక్‌ కోర్సులు కూడా చేశాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్‌ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్‌ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947 న్యూయర్‌కు బిగ్‌ ట్రీట్‌! ‘ఓజీ’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త (Akira Nandan)&nbsp; నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూయర్‌ కానుకగా 2025 జనవరి 1న ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం, పవన్‌ కూడా ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉంటడంతో సాంగ్‌ను వాయిదాా వేశారు. అయితే కొత్త ఏడాది మాత్రం ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమారు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక పవన్‌ను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కనిపించనున్నాడు. ఓజీపై ఎందుకంత హైప్‌? పవన్‌ కల్యాణ్‌ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ చాలా స్పెషల్‌ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్నాడు. ఇందులో పవన్ పాత్ర ఓజాస్‌ గంభీర (Ojas Gambhira) కాగా దానిని షార్ట్‌కట్‌ చేస్తూ ‘ఓజీ’గా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్‌ యాక్టింగ్‌ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్‌ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
    నవంబర్ 20 , 2024
    <strong>HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!</strong>
    HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
    ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్‌ మోస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్‌ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; థమన్‌ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్‌. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.&nbsp; థమన్‌ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్‌ సింగర్‌. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది. ఓ సారి థమన్‌ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్‌ డ్రమ్‌ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్‌ వాయించడం ప్రాక్టిస్‌ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట. థమన్‌ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.&nbsp; థమన్‌ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.&nbsp; థమన్‌ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.&nbsp; అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్‌ షోలు చేసి థమన్‌ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.&nbsp; అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్‌ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్‌ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.&nbsp; ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్‌ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం. ఒకప్పటి స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ దగ్గర వర్క్‌ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్‌ ఇచ్చిందని థమన్‌ చెబుతుంటాడు.&nbsp; ముఖ్యంగా మణిశర్మ టీమ్‌ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్‌ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.&nbsp; 24 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన థమన్‌.. తమిళ చిత్రం 'సింధనాయ్‌ సె' (2009) తొలిసారి వర్క్‌ చేశారు.&nbsp; రవితేజ హీరోగా చేసిన ‘కిక్‌’ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌. ఈ సినిమాలో సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతో థమన్‌ పేరు మారుమోగింది.&nbsp; ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.&nbsp; తారక్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్‌ సంగీతం అందించారు.&nbsp; ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్‌’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.&nbsp; థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్‌ సంగీతం అందించిన బాడీ గార్డ్‌ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.&nbsp; థమన్‌ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు. థమన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్‌ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.&nbsp; ఏ.ఆర్‌. రెహమాన్‌ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్‌ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు. తాజాగా&nbsp; తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్‌ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.&nbsp; థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్‌, కాపీ గోట్‌ అంటూ మీమర్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.&nbsp; ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్‌ చెప్పాడు.
    నవంబర్ 16 , 2024
    <strong>Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?</strong>
    Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
    టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని చిత్రాల్లో మెయిన్‌ హీరోయిన్‌గా, మరికొన్నింటిలో క్యారెక్టర్‌ అర్టిస్టుగా చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల లీడ్‌ యాక్ట్రెస్‌గా ఆమె చేసిన ‘పొట్టేల్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. అనన్య నటనకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే ఎన్ని మంచి పాత్రలు చేసినా అనన్యకు సరైన అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయం చాన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బంపరాఫర్‌ కొట్టేసింది. దీంతో అనన్య ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; మెగా హీరో సరసన..! మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్న తాజా చిత్రం 'SDT 18'. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు.&nbsp; ‘విభిన్న పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుతోన్న ప్రతిభావంతురాలు అనన్య నాగళ్లను వెల్కమ్’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టర్‌లో అనన్య అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించింది. చీరకట్టు, బొట్టుతో ముఖంగా చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటోది.&nbsp; https://twitter.com/Primeshowtweets/status/1855937397583953941 మెగా హీరోతో రొమాన్స్‌! 'SDT 18' ప్రాజెక్టులో ఇప్పటికే హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi) నటిస్తోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌లో ఈ అమ్మడు లుక్‌ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రాజెక్టులో జాయిన్‌ కావడంతో ఆమె రోల్ ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెుదలైంది. అయితే ఇందులో అనన్య సెకండ్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిధరమ్‌ తేజ్‌, అనన్యకు మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్లు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. అనన్య పాత్రకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర బృందం వెల్లడించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; కొత్తవారికి ప్రేరణగా అనన్య! ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే స్టార్‌ హీరోల సరసన చేయడం తప్పనిసరి. ఈ విషయం అనన్య నాగళ్ల (Ananya Nagalla)కు తెలిసినంతగా ఏ హీరోయిన్‌కు తెలీదు. 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్లే బ్యాక్‌' వంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌ హీరోగా చేసిన 'వకీల్‌ సాబ్‌'లో కీలక పాత్రే పోషించినప్పటికీ నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. దీంతో పలు చిత్రాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేసింది. అవకాశం దొరికినప్పుడుల్లా హీరోయిన్‌గా కనిపించి తనను తాను నిరూపించుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'తంత్ర', 'పొట్టేల్‌' సినిమాలతో నటిగా మరో మెట్టు ఎక్కింది. స్టార్‌ హీరో చిత్రాల్లో నటించడమే లక్ష్యంగా ఆమె చేస్తున్న కృషికి ఇన్నాళ్లకు సరైన ఫలితం దక్కింది. అనన్య టాలెంట్‌ను గుర్తించిన ‘SDT 18’ టీమ్‌ తమ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి గౌరవించింది. ఈ సక్సెస్‌ అయితే అనన్య కెరీర్‌ మరోస్థాయికి వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనన్య సినీ ప్రయాణం ఈ తరం తెలుగమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది పేర్కొంటున్నారు.&nbsp; 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో.. ‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రోహిత్‌ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మించినట్లు ఇటీవల రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954 పడిలేచిన కెరటంలా.. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే అతడికి ఊహించని విధంగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్‌ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్‌ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.&nbsp;
    నవంబర్ 12 , 2024
    <strong>Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే</strong>
    Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
    బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా తనగురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను చాలా ఫన్నీగా చెప్పింది. అవేంటో మీరు ఓసారి చూసేయండి. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) గూగుల్‌: అనన్య పాండేకు టాటూ ఉందా? అనన్య పాండే: నాకు ఎలాంటి టాటూ లేదు. కానీ ఒక టాటూ అయితే వేయించుకోవాలని ఉంది. ఓసారి టాటూ కోసం డబ్బులు కూడా చెల్లించాను. కానీ అక్కడి వెళ్లి టాటూ వేయించుకోవాలంటే భయమేసింది. నాకు ఎలాంటి టాటూ బాగుంటుందో ఐడియాస్ ఇవ్వండి. గూగుల్: అనన్య పాండే దగ్గర డాగ్స్ ఉన్నాయా? అనన్య పాండే: అవును, నా దగ్గర రెండు శునకాలు ఉన్నాయి. ఒకటి గొల్డెన్ రిట్రివర్ జాతికి చెందినది, మరొకటి మల్టిపుల్ కాల్ రైట్ గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ లిప్స్‌టిక్ ఏది? అనన్య పాండే: నాకు లాక్మీకి చెందిన Blushing Bae లిప్స్‌టిక్ అంటే చాలా ఇష్టం. ఇందులోని ప్రెటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి. గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ సాంగ్ ఏది? అనన్య పాండే: నాకు మిల్లి సైరస్( Miley Cyrus)&nbsp; పాడిన ఫ్లవర్స్ సాంగ్ అంటే చాలా ఇష్టం. అది వింటున్నప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇక అనన్య పాండే విద్యభ్యాసమంతా ముంబైలో జరిగింది. ఆమె ధీరుబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. యూనివర్సిటీ ఆఫ్‌ సథరన్‌ కాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించింది.&nbsp; అనన్యకు ట్రావెలింగ్, డ్యాన్సింగ్, పార్టీయింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతుంది. బాలీవుడ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, సుహానా ఖాన్ అనన్య తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. 30 ఏళ్ల సినీ జీవితంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. తల్లి భావన పాండే.. ఫేమస్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. అనన్య తాత శరద్‌ పాండేకు దేశంలోనే ప్రముఖ హార్ట్‌ సర్జన్‌గా పేరుంది. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ -2 చిత్రం ద్వారా అనన్య పాండే బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది. సినిమాల్లోకి రాకముందు అనన్య పాండే మోడలింగ్ చేసింది. లాక్మీతో పాటు మరికోన్ని వాణిజ్య ప్రకటనల్లో ఆమె నటించింది. ఇక తెలుగులో లైగర్‌ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్‌&nbsp; ఆకట్టుకుంది. లైగర్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్‌ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.&nbsp; సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.&nbsp; అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్‌ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.&nbsp; బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్‌ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 30 , 2024
    <strong>HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    HBD Sujeeth: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌ గురించి ఈ టాప్‌ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ (HBD Sujeeth) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకూ చేసింది రెండే చిత్రాలే అయినప్పటికీ పది చిత్రాలు చేసినా రానీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘రన్‌ రజా రన్‌’తో డైరెక్టర్‌గా మారిన సుజీత్‌ ‘సాహో’ (Saaho)తో పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ చిత్రాన్ని తెరకెకిస్తూ మెగా ఫ్యాన్స్‌ దృష్టంతా తన వైపునకు తిప్పుకున్నాడు. ఇవాళ ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ పుట్టిన రోజు. 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 17 ఏళ్లకే షార్ట్‌ ఫిల్మ్స్‌ సుజీత్‌ రెడ్డి ఏపీలోని అనంతపురంలో 1990 అక్టోబర్‌ 26న జన్మించాడు. తొలుత చార్టెట్‌ అకౌంటెండ్‌ (CA) కావాలని కలలు కన్నాడు. సినిమాలపై ఆసక్తి పెరగడంతో L.V. ప్రసాద్‌ ఫిల్మ్‌ &amp; టీవీ అకాడమీలో ఫిల్మ్‌ కోర్సు చేశాడు. 17 ఏళ్లకే యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేయడం మెుదలు పెట్టాడు. ఇప్పటివరకూ 30కి పైగా షార్ట్‌ఫిల్మ్‌ను సుజీత్‌ తెరకెక్కించాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్స్‌లో క్రియేటివిటీ సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ అంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. వాటి నుంటి హై స్టాండర్డ్స్‌ను ఎవరు పెద్దగా ఎక్స్‌పెక్ట్‌ చేయరు. కానీ సుజీత్‌ తెరకెక్కించిన ‘రన్‌ రాజా రన్‌’, ‘ప్రేమ ఇష్క్‌ కాదల్’, ‘తొక్కలో లవ్‌ స్టోరీ’, ‘వేషం’, ‘యుద్ధం’, ‘ప్రేమ కేరాఫ్‌ డ్రామా’, ‘ఇండియన్‌ ఐడల్‌’ వంటి షార్ట్‌ఫిల్మ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించి సినీ ఇండస్ట్రీ వాళ్లను ఆశ్చర్యపరిచాడు. తన క్రియేటివిటీ మెస్మరైజ్‌ చేశాడు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) తొలుత ఫ్యామిలీ ఒప్పుకోలేదట తను డైరెక్టర్ అవుతానని సుజీత్‌ చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు విముఖత వ్యక్తం చేశారట. అయితే సినిమాపై అతడికి ఉన్న శ్రద్ధ చూసి ఫైనల్‌గా ఓకే చెప్పారట. అంతే కాదు సుజీత్‌ ఫస్ట్ కెమెరాను అతని తల్లి స్వయంగా తన డబ్బులతో కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చిందట. అలా తల్లి, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో సుజీత్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.&nbsp; పూరి జగన్నాథ్‌ సూచనతో డైరెక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుజీత్‌ తొలుత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్‌ దగ్గర పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్ను కలవగా అప్పటికే డైరెక్టర్‌ స్కిల్స్‌ పుష్కలంగా ఉన్నాయని పూరి చెప్పారు. దీంతో డైరెక్టర్‌గా సుజీత్‌ ప్రయత్నాలు మెుదలుపెట్టాడు.&nbsp; 23 ఏళ్లకే డైరెక్టర్‌గా.. డైరెక్టర్‌ ఛాన్స్ కోసం సుజీత్‌ ప్రయత్నిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ అతడి టాలెంట్‌ను గుర్తించి అవకాశమిచ్చింది. 'రన్‌ రాజా రన్‌' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అలా 23 ఏళ్లకే సుజీత్‌ డైరెక్టర్‌గా మారాడు. తొలి చిత్రంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు.&nbsp; షార్ట్‌ ఫిల్మ్‌నే సినిమా తీసి.. తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన ‘రన్‌ రాజా రన్‌’ షార్ట్‌ ఫిల్మ్‌నే తన ఫస్ట్‌ ఫిల్మ్‌గా సుజీత్‌ తెరకెక్కించడం విశేషం. షార్ట్‌ ఫిల్మ్‌లోని స్టోరీ కొద్దిగా మార్పులు చేసిన సినిమాను తెరకెక్కించడం గమనార్హం.&nbsp; బాహుబలి కంటే ముందే తొలి చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్‌ వాళ్లే ప్రభాస్‌తో ‘మిర్చి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో రెండో ఫిల్మ్‌ ప్లాన్‌ చేయాలని యువీ క్రియేషన్స్ భావించగా తన వద్ద కథ ఉందంటూ సుజీత్‌ తెలియజేశాడు. ఆ స్టోరీని ప్రభాస్‌కు చెప్పగా బాగా నచ్చిందట. అయితే అప్పటికీ బాహుబలి రిలీజ్‌ కాలేదు. బాహుబలి రిలీజ్‌ తర్వాత ప్రభాస్‌ క్రేజ్ అమాంతం పెరగడంతో కథలో సుజీత్‌ మార్పులు చేశాడు. అలా ‘సాహో’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోయిన అంత చిన్న వయసులో సుజీత్‌ పనితనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్యాన్‌ నుంచి పవన్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సుజీత్‌ వీరాభిమాని. జానీ సినిమాకు తలకు బ్యాండ్‌ కట్టుకొని మరి థియేటర్‌కు వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో సుజీత్‌ చెప్పారు. ఏడు రోజుల పాటు బ్యాండ్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు. అటు గబ్బర్‌ సింగ్‌ రిలీజ్‌ సమయంలోనూ ర్యాలీగా థియేటర్‌కు వెళ్లినట్లు సుజీత్ అన్నారు. అటువంటి స్టేజ్‌ నుంచి ‘ఓజీ’తో పవన్‌ను డైరెక్ట్‌ చేసే స్థాయికి సుజీత్‌ ఎదగడం సాధారణ విషయం కాదు.&nbsp; జపనీస్‌ సినిమాలంటే చాల ఇష్టం డైరెక్టర్‌ సుజీత్‌కు జపనీస్‌ సినిమాలంటే చాలా ఇష్టమట. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పవన్‌ ‘ఓజీ’ సినిమాపైనా జపనీస్‌ సినిమాల ప్రభావం ఉంటుందని అంటున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ఫ్రెండ్స్‌తో ట్రావెలింగ్‌ సుజీత్‌ తీరిక దొరికినప్పుడుల్లా స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారితో కలిసి వరల్డ్‌ టూర్‌కు వెళ్తుంటారు. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటారు.&nbsp; View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) క్రికెట్ అంటే పిచ్చి సుజీత్‌కు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), సచిన్‌ టెండూల్కర్ (Sachin Tendulkar) అతడి తన ఫేవరేట్ ప్లేయర్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.&nbsp; భక్తి ఎక్కువే సుజీత్‌కు భక్తి కాస్త ఎక్కువనే చెప్పాలి. సమయం దొరికినప్పుడూ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. View this post on Instagram A post shared by Sujeeth (@sujeethsign) ప్రేయసితో వివాహం దర్శకుడు సుజీత్‌ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2020లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రవల్లికను వివాహం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/Filmiparadise/status/1271319435127603205 ఉత్తమ డైరెక్టర్‌గా తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రన్‌ రాజా రన్ చిత్రానికి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా నంది అవార్డ్స్‌లో&nbsp; సుజీత్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత అతని రెండో చిత్రం సాహోకు గాను ఉత్తమ డైరెక్టర్‌గా సైమా అవార్డు పొందాడు. బర్త్‌డే స్పెషల్ వీడియో నేడు ద‌ర్శ‌కుడు సుజీత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతనికి బ‌ర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ‘ఓజీ’ టీమ్‌ స్పెషల్ వీడియోను పంచుకుంది. షూటింగ్‌ స్పాట్‌లో సుజీత్‌కి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను ఒక దగ్గర చేర్చి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1850075370994925843
    అక్టోబర్ 26 , 2024
    <strong>Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!</strong>
    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది.&nbsp; చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్‌' మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు. ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.&nbsp; ఐరెన్‌ లెగ్‌గా ముద్ర కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.&nbsp; మహానటితో కెరీర్‌ టర్నింగ్‌ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.&nbsp; వరుస ఫెయిల్యూర్స్ ‘మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,&nbsp; రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.&nbsp; కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌ గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు. https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk కీర్తి స్పెషల్‌ టాలెంట్‌ కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్‌' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి.. ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
    అక్టోబర్ 17 , 2024

    @2021 KTree