• TFIDB EN
  • తొలి చూపులోనే
    UATelugu
    రాజు, భాను ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ భాను తండ్రి శ్రీకర్ ప్రసాద్, తన స్నేహితుడి కొడుకుతో ఆమె పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. దీంతో రాజు వారిద్దరినీ పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నందమూరి కళ్యాణ్ రామ్
    రాజు
    ఆకాంక్షభాను
    సుమన్
    భాను తండ్రి
    శారద
    సుదీప పింకీ
    సుదీప
    కల్పన
    చరణ్ రాజ్
    సునీల్
    రాజు స్నేహితుడు
    సూర్య
    ఎంఎస్ నారాయణ
    ఎంఎస్ నారాయణ
    బ్రహ్మానందం
    ఎల్బీ శ్రీరామ్
    ఎల్బీ శ్రీరామ్
    వేణు మాధవ్
    ఐరన్‌లెగ్ శాస్త్రి
    ఐరన్‌లెగ్ శాస్త్రి
    భగవాన్
    ఆనంద వర్ధన్
    మాస్టర్ ఆనంద్ వర్ధన్
    ఆహుతి ప్రసాద్
    రఘు బాబు
    రవిబాబు
    తెలంగాణ శకుంతల
    రైల్వే టిక్కెట్ కలెక్టర్
    వజ్జ వెంకట గిరిధర్
    సిబ్బంది
    కాశీ విశ్వనాథ్
    దర్శకుడు
    రామోజీ రావు
    నిర్మాత
    చక్రి
    సంగీతకారుడు
    శేఖర్ వి. జోసెఫ్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    'తొలి చూపులోనే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం. కళ్యాణ్ రామ్ ముద్దు పేరు? కళ్యాణ్ బాబు కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత? 5 అడుగు 11 అంగుళాలు కళ్యాణ్ రామ్ తొలి సినిమా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా 'తొలిచూపులోనే'  కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు? జులై 5, 1978 కళ్యాణ్ రామ్ భార్య పేరు? స్వాతి కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది? ఆగస్టు 10, 2006 కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్? సాయిపల్లవి, శ్రీదేవి కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో? Sr.NTR, రజనీకాంత్ కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా? అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి. కళ్యాణ్‌ రామ్‌కు ఇష్టమైన కలర్? వైట్ అండ్ బ్లాక్ కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా? దానవీర సూరకర్ణ కళ్యాణ్ రామ్ తల్లి పేరు? లక్ష్మి హరికృష్ణ కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం? కేరళ, మనాలి కళ్యాణ్ రామ్ చదువు? MS(USA) కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?  2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు.  కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం? చేపల కూర కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?  దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్ అభిరుచులు? బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం కళ్యాణ్ రామ్ వ్యాపారాలు? NTR క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)? రూ.110కోట్లు https://www.youtube.com/watch?v=xmZT13t7xxI
    మార్చి 21 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్‌ వెనక రాజమౌళి!
    Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్‌ వెనక రాజమౌళి!
    దేశంలో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. గత కొన్ని నెలలుగా ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘ప్రేమలు’ (Premalu) కూడా దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోంది. గత నెలలో మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మార్చి 8న తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. రాజమౌళి తనయుడు తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయగా.. రికార్డ్‌ కలెక్షన్స్ సాధిస్తోంది. టాలీవుడ్‌లో తొలి పది రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు’ వరల్డ్‌వైడ్‌ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ‘ప్రేమలు’ కథ ఏంటి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌ వైడ్‌గా రికార్డ్‌ కలెక్షన్స్‌ మలయాళం సెన్సేషన్‌ ‘ప్రేమలు’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళ వెర్షన్‌లో వరల్డ్‌ వైడ్‌గా ఇప్పటివరకూ రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఆ ఇండస్ట్రీలో హైయస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల్లో ‘ప్రేమలు’ ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను డబ్ చేశారు. https://twitter.com/TheNewsDome/status/1769981699675611495?s=20 చరిత్ర సృష్టించిన ‘ప్రేమలు’ దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ఈ సినిమాపై బజ్‌ ఏర్పడింది. మార్చి 8న తెలుగు వెర్షన్‌లో రిలీజైన ఈ చిత్రం.. తొలి పది రోజుల్లో  రూ.10.54 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. ఒక మలయాళ డబ్బింగ్‌ చిత్రం తెలుగులో మెుదటి పది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విడుదలై పది రోజులు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో  ప్రదర్శితమవడం ఆశ్చర్యపరుస్తోంది.  సక్సెస్‌ వెనక రాజమౌళి! ‘ప్రేమలు’ చిత్రం ఈ స్థాయిలో తెలుగులో విజయవంతం కావడం వెనక దర్శకధీరుడు రాజమౌళి ప్రమేయం ఉంది. ఆయన కుమారుడు స్వయంగా ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయడంతో మూవీ ప్రమోషన్స్‌ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. రాజమౌళి లాంటి ప్రపంచస్థాయి దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగం కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. అలాగే మహేష్‌ బాబు, అనిల్‌ రావిపూడి వంటి సినీ ప్రముఖులు ‘ప్రేమలు’పై ప్రశంసలు కురిపించడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపించింది. ఎటు చూసిన ప్రేమలు గురించి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా 10 రోజులు దాటినా విజయవంతంగా రన్‌ అవుతోంది.  ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం ప్రేమలు చిత్రం తెలుగు వెర్షన్‌.. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మలయాళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా అత్యధిక డాలర్లను వసూళ్లు చేయడం విశేషం. ఈ సినిమా ఇప్పటివరకూ 3 లక్షల డాలర్లు రాబట్టినట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. రెండో వారంలోనూ అత్యధిక వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతున్నట్లు ప్రకటించారు.  ఓటీటీలోకి ఎప్పుడంటే? ప్రేమ‌లు మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disney + Hotstar) సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను మార్చి ఫ‌స్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమ‌లు తెలుగు వెర్ష‌న్ మార్చి 8న, త‌మిళ వెర్ష‌న్ మార్చి 15న థియేటర్లలో రిలీజ్ కావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది.  ప్రేమలు కథేంటి? ‘ప్రేమ‌లు’ సినిమాను దర్శకుడు గిరీష్‌.. హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాడు. కథలోకి వెళ్తే.. స‌చిన్ ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఓ వేడుక‌లో అత‌డికి రీనూ ప‌రిచ‌యం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు స‌చిన్‌. అప్ప‌టికే ల‌వ్‌లో ఓ సారి ఫెయిలైన స‌చిన్‌. .రీనుకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? భిన్న మ‌న‌స్త‌త్వాలు, ఆలోచ‌న‌లు క‌లిగిన స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 
    మార్చి 19 , 2024
    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
    నటీనటులు : నిఖిల్‌, దివ్యాంన్ష కౌషిక్‌, సత్య, అజయ్‌, సాయిరామ్‌ రెడ్డి, రుక్మిణి వసంత్‌, హర్ష చెముడు తదితరులు రచన, డైరెక్టర్‌ : సుధీర్ వర్మ సంగీతం:  కార్తిక్‌ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌ విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review) ఎవరెలా చేశారంటే హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్‌ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్‌, గ్లామర్‌ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి.  సాంకేతికంగా .. టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ నిఖిల్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్టోరీబోరింగ్ లవ్‌ట్రాక్స్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2/5 
    నవంబర్ 08 , 2024
    <strong>Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :&nbsp; సాయి కిషోర్ మచ్చా సంగీతం:&nbsp; గోపీ సుందర్&nbsp; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;
    అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ రెడ్డి' (Love Reddy). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్‌ మీట్‌ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; దాడి ఎందుకు జరిగిందంటే? లవ్‌ రెడ్డి చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌ బాస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్‌ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌కు 'లవ్‌ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ రన్‌ అవుతోంది. హీరోయిన్‌ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్‌.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్‌ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్‌ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.&nbsp; https://twitter.com/telugu_insider/status/1849700707248767217 ‘లవ్‌ రెడ్డి’ ఎలా ఉందంటే పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. కథ ఏంటంటే నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
    అక్టోబర్ 25 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    Kushi Movie Review: విజయ్‌ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ సూపర్బ్‌.. మరి ‘ఖుషి’ హిట్ అయినట్లేనా? 
    నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, లక్ష్మీ, మురళీ శర్మ, జయరామ్‌, రోహిణి, సచిన్‌ ఖేడేకర్‌, శరణ్య, అలీ, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు దర్శకత్వం: శివ నిర్వాణ&nbsp; సంగీతం: హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రఫీ: మురళి. G నిర్మాత : చిరంజీవి పెదమల్లు, Y. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లైగర్‌ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సూపర్‌ హిట్‌ సాధించడంతో ‘ఖుషి’పై హైప్‌ మరింత పెరిగింది. భారీ అంచనాల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్, సమంత జోడీకి ఎన్ని మార్కులు పడ్డాయి? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.&nbsp; కథ: ఈ సినిమా కథ కశ్మీర్‌లో ప్రారంభమవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ పిల్ల తనదని ఫిక్స్ అవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బేగం బ్రాహ్మిణ్ అని విప్లవ్‌కు తెలుస్తుంది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆరాధ్య (సమంత)ను క్రిస్టియన్ అబ్బాయి విప్లవ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి చంద్రరంగం (మురళీశర్మ) ఒప్పుకోడు. ఈ పెళ్లికి విప్లవ్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించరు. దీంతో  పెద్దలను ఎదిరించి మరీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. అంతా ‘ఖుషి’గా సాగిపోతుందని అనుకున్న సమయంలో విప్లవ్, ఆరాధ్యల కాపురం కొత్త మలుపు తిరుగుతుంది. అసలు విప్లవ్, ఆరాధ్యలకు వచ్చిన సమస్యేంటి? దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే? విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. విప్లవ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అలరించాడు. అటు సమంత కూడా ఆరాధ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంది. తెరపై విప్లవ్‌, ఆరాధ్య పాత్రలు మాత్రమే కనిపించేంతలా విజయ్‌, సామ్‌ పోటీపడి నటించారు. వీరి మధ్య కెమెస్ట్రీ సైతం అద్భుతంగా కుదిరింది. అటు మురళీశర్మ, సచిన్‌ ఖేడేకర్‌, రోహిణి, లక్ష్మీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. వెన్నెల కిషోర్‌, అలీ, రాహుల్‌ రామకృష్ణ కామెడీ నవ్వులు పూయించింది.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ. తన గత చిత్రాలైన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఖుషి కోసం రొటిన్‌ కథనే ఆయన ఎంచుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. పెళ్లి తర్వాత ఇది చేద్దాం.. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్‌ అనిపిస్తాయి. మరికొన్ని సీన్లు ఎక్కడో చూసిన భావన కలిగిస్తాయి. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా శివ నిర్వాణ డైరెక్షన్‌ బాగుంది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; ఖుషి సినిమాకు టెక్నికల్‌ అంశాలు చాలా బాగా ప్లస్‌ అయ్యాయి. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్‌ ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్‌ వహాబ్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అటు G. మురళి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మంచి ఎసెట్‌ అయ్యింది. ముఖ్యంగా కశ్మీర్‌ అందాలను ఆయన తన కెమెరా  పనితనంతో ఎంతో అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. నాణ్యత విషయంలో ప్రొడ్యుసర్లు ఎక్కడా రాజీపడినట్లు అనిపించలేదు. &nbsp; ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌, సమంత నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్స్‌ రేటింగ్‌: 3/5
    సెప్టెంబర్ 01 , 2023
    <strong>Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి సమర్పణ: తబితా సుకుమార్ సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య విడుదల తేదీ : 23-08-2024 రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్‌ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం 'ఆయ్'తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్‌ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. అయితే గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్‌ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్‌ టైమింగ్‌, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్‌ లవ్‌ ట్రాక్‌, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్‌ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రావు రమేష్‌ నటనకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్‌ అంకిత్‌ లవ్‌ ట్రాక్‌ఊహాకు అందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 23 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    <strong>Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;
    నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ కోసం స్పెషల్‌ పోస్ట్‌! ‘హనుమాన్‌’తో టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్‌ వర్మ పెట్టిన మరో పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; ఒక ఫొటో షేర్‌ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471 ముహోర్తం ఫిక్స్‌..! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్‌ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మోక్షజ్ఞ లుక్స్‌ వైరల్‌.. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్‌ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
    సెప్టెంబర్ 03 , 2024
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    Hyderabad: శంషాబాద్ వద్ద తొలి ‘డ్రైవ్ ఇన్ థియేటర్’.. పార్ట్‌నర్స్‌గా రానా, మహేశ్, వెంకటేష్
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 01 , 2023
    <strong>Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!</strong>
    Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
    టాలీవుడ్‌ ఫ్యూచర్‌ హీరోయిన్స్‌గా బాలీవుడ్‌ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్‌లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్‌ లభిస్తే ఈ భామలకు వరుస అవకాశాలు రావడం ఖాయమంటూ పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా తొలి చిత్రాలతో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకోలేకపోయారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr.Bachchan) సినిమా ద్వారా భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. అటు జాన్వీ (Janhvi Kapoor)కి సైతం ‘దేవర’తో మంచి సక్సెస్‌ వచ్చినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో పెద్దగా హైలెట్‌ కాలేదు. దీంతో ఈ ఇద్దరు ముద్దుగమ్మలు తమ తర్వాతి చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.&nbsp; భారమంతా చరణ్‌పైనే! శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్‌ తారక్ వంటి బిగ్‌ స్టార్‌ నటించిన ‘దేవర’తో తెలుగులో అడుగుపెట్టింది. రిలీజ్‌కు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్ద ఎత్తున బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌లోనూ జాన్వీ చురుగ్గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తీరా సినిమా రిలీజయ్యాక జాన్వీ పాత్ర అందరినీ ఊసురుమనిపించింది. ఆమె చేసిన తంగం పాత్ర గెస్ట్‌రోల్‌ను తలపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో జాన్వీ ఆశలన్నీ రామ్‌ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌పైకి మళ్లాయి. అయితే ఈ సినిమాలోనైనా జాన్వీకి మంచి పాత్ర దొరుకుతుందా? లేదా? అన్న సందేహాం ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌లో ఉంది. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న జాన్వీ మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ పాపులర్ కావడం ఖాయమని చెప్పవచ్చు. RC 16తో ఈ భామ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.&nbsp; బ్రైట్‌గా భాగ్యశ్రీ బోర్సె ఫ్యూచర్! ‘మిస్టర్‌ బచ్చన్’ రిలీజ్‌కు ముందు వరకూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఫ్యూచర్‌ క్వీన్‌ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌గా నిలవడంతో ఆమె పెట్టుకున్న నమ్మకాలన్నీ ఆవిరి అయ్యాయి. అయితే నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండ సరసన ‘VD12’లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రీసెంట్‌గా దుల్కర్‌ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ‘కాంత’ అనే పేరుతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పలువురు కుర్ర హీరోలు సైతం భాగ్యశ్రీతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దీంతో మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌ అయినా ఈ అమ్మడి ఫేమ్‌కు ఎలాంటి ఢోకా లేదని చెప్పవచ్చు. సరైన హిట్‌ లభిస్తే భాగ్యశ్రీ తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా మారిపోవడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&nbsp; శ్రీదేవి కూతురి నుంచి స్టార్‌ హీరోయిన్ వరకూ! శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మరాఠీ చిత్రం ‘సైరాత్’కు రీమేక్‌గా వచ్చిన ‘ధడక్‌’లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్‌’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. ఈ క్రమంలోనే 'రాఖీ ఔర్‌ రానీకి ప్రేమ్‌ కహానీ' చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్‌’ చిత్రాల్లో ఫీమేల్‌ లీడ్‌గా చేసి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హిందీలో 'సన్నీ శాన్‌స్క్రీట్‌ కి తుల్సీ కుమారి' అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది.&nbsp; భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 03 , 2024
    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా?
    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా?
    నటీనటులు: త్రిష, ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు రచన, దర్శకత్వం: సూర్య మనోజ్‌ వంగల సినిమాటోగ్రఫీ : దినేష్‌ కె. బాబు సంగీతం : శక్తి కాంత్‌ కార్తిక్‌ ఎడిటర్‌ : అన్వర్‌ అలీ నిర్మాత : కొల్ల ఆశిష్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 ఓటీటీ వేదిక : సోనీలివ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ రాణించిన త్రిష (Trisha) ఓటీటీలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి బృంద (Brinda) అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్‌ వంగల దర్శకత్వం వహించారు. ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బృంద సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనిలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బృంద (Trisha) ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. ఈ క్రమంలో ఓ రోజు స్థానిక చెరువులో శవం బయటపడుతుంది. హంతకుడు దానికి గుండు కొట్టి, గుండెల్లో 16 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టంలో తేలుతుంది. అయితే ఉన్నతాధికారి ఈ కేసును క్లోజ్‌ చేయమని చెప్పినా బృంద ఇన్వెస్టిగేషన్‌ మెుదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు సంచలన నిజం తెలుస్తుంది. ఆ తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్యకు గురైనట్లు ఆమె కనిపెడుతుంది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో బృందని భాగస్వామిని చేస్తారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడ్ని బృందా టీమ్ ఎలా పట్టుకుంది? మూఢ నమ్మకాలకు ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే పోలీసు ఆఫీసర్‌ బృందాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆమె నటన మెప్పిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టింది. మరోవైపు విలన్‌గా ఆనందసామి మెప్పించాడు. అమాయకత్వం, క్రూరత్వం కలగలుపుతూ ఆనందసామి చేసిన నటన సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇంద్రజీత్‌, రవీంద్ర విజయ్‌ తమ పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులు కూడా తమ యాక్టింగ్‌తో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కథ పరంగా చూస్తే రొటిన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ థీమ్‌తోనే దర్శకుడు సూర్య మనోజ్‌ వంగల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆరంభ సన్నివేశం నుంచి ఆసక్తిరేకెత్తించేలా స్క్రీన్‌ప్లేను నడిపి ఆకట్టుకున్నారు. భూత, వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది. ఇక హంతకుడిని కనిపెట్టే క్రమంలో బృందా టీమ్‌ ఒక్కో క్లూను కనిపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే డిటెయిల్ ఇన్‌వెస్టిగేషన్‌ పేరుతో సిరీస్‌ను మరీ పొడిగించినట్లు అనిపిస్తుంది. ఆధారాలు సేక‌రించే సీన్స్ కొన్ని లాజిక్‌ల‌కు దూరంగా సాగుతాయి. ఆమె చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్స్ చిన్న చిన్న క్లూలు కూడా క‌నిపెట్ట‌లేనివారిగా చూపించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. త్రిష చెల్లెలి ఎపిసోడ్ క‌థ‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. మెుత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్ సాగగా కొన్ని ఎపిసోడ్స్‌ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా మెుదటి నుంచి చివరి వరకూ కథను ఎంగేజింగ్‌గా నడపడించి దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనాలుత్రిష నటనఇన్‌వెస్టిగేషన్‌ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ నిడివిసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
    Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
    ప్రతీ సంవత్సరం స్టార్‌ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్‌ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; శౌర్యువ్‌ నాని హీరోగా తెరక్కిన హాయ్‌ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.&nbsp; కళ్యాణ్‌ శంకర్‌ కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్‌ చేసిన ప్రమోషన్స్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.&nbsp; క్లాక్స్‌ చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.&nbsp; వేణు యెల్దండి ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.&nbsp; షణ్ముఖ ప్రశాంత్ ఈ ఏడాది విడుదలైన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.&nbsp; మురళి కిషోర్ కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్‌.
    డిసెంబర్ 16 , 2023
    <strong>HBD Tarun Bhaskar: తల్లి రాసిన కవితతో తొలి షార్ట్‌ ఫిల్మ్‌.. గ్రేట్‌ జర్నీ!</strong>
    HBD Tarun Bhaskar: తల్లి రాసిన కవితతో తొలి షార్ట్‌ ఫిల్మ్‌.. గ్రేట్‌ జర్నీ!
    'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) ఆ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఆ మూవీ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' వంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించి యూత్‌కు మరింత చేరవయ్యాడు. యంగేజ్‌ కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఆ తర్వాత నటుడిగానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇటీవల ‘కీడాకోలా’తో నవ్వులు పూయించాడు. ఇదిలా ఉంటే నేడు (నవంబర్‌ 5) తరుణ్‌ భాస్కర్‌ పుట్టినరోజు. 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ 1988 నవంబరు 5న ఉదయ్ భాస్కర్, గీతా దంపతులకు చెన్నైలో పుట్టాడు. తరుణ్‌ భాస్కర్‌ (HBD Tarun Bhaskar) తండ్రిది వరంగల్‌ కాగా, తల్లిది తిరుపతి. అలా రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా తరుణ‌్‌ను చెప్పవచ్చు. తన కొడుకు క్రియేటివ్‌ రంగంలో రాణించాలని తరుణ్‌ భాస్కర్ తండ్రి చిన్నప్పుడే కలలు కన్నారు. ఇందుకు అనుగుణంగా తరుణ్‌కు రెండేళ్ల వయసు ఉండగా ఆ రోజుల్లోనే రూ.300 పెట్టి కెమెరా కొని ఇచ్చారు. ఆ కెమెరా ఇప్పటికీ తరుణ్‌ భాస్కర్ దగ్గర ఉంది. తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా ప్రముఖ తెలుగు నటి. ఫిదా చిత్రంలో సాయిపల్లవికి తల్లిగా నటించింది. శ్రీరంగ నీతులు, సర్కారు వారి పాట, 118, అనుకోకుండా చిత్రాల్లోనూ ఆమె కనిపించింది.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా గొప్ప కవియిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో కవితలు రాశారు. ఆమె రాసిన కవిత ఆధారంగానే తరుణ్‌ భాస్కర్ తన తొలి షార్ట్‌ఫిల్మ్‌ తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.&nbsp; ఆ ఉత్సాహంతో వరుసగా ‘జర్నీ’, ‘మినిట్స్‌ టూ మిడ్‌నైట్‌’, ‘అనుకోకుండా’, ‘జూనూన్‌’, ‘సైన్మా’ మెుదలైన షార్ట్‌ ఫిల్మ్‌ చేశాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ఇంఫాల్ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు ఎంపికై తరుణ్‌ భాస్కర్‌కు మరింత పేరు తీసుకొచ్చింది.&nbsp; ముఖ్యంగా ‘జూనూన్’ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డ్‌ కూడా వచ్చింది. అలాగే ‘అనుకోకుండా’ లఘు చిత్రం యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించింది. ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రీతువర్మ ‘అనుకోకుండా’ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించడం విశేషం.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (HBD Tarun Bhaskar) రూపొందించిన ‘సైన్మా’ షార్ట్‌ ఫిల్మ్‌ మంచు లక్ష్మీకి బాగా నచ్చింది. కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ ఇందులో లీడ్‌ రోల్‌లో నటించడం గమనార్హం.&nbsp; సైన్మా షార్ట్‌ ఫిల్మ్‌ నచ్చడంతో కలిసి పనిచేద్దామని మంచు లక్ష్మీ తరుణ్‌కు ఆఫర్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న సమయంలోనే తరుణ్‌ భాస్కర్ తండ్రి చనిపోయారు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. ఆ తర్వాత నిర్మాత రాజ్‌ కందుకూరును కలుసుకోవడం పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చడం చకా చకా జరిగిపోయింది. అంతకుముందే మంచి పరిచయమున్న విజయ్‌ దేవరకొండ, రీతు వర్మను హీరో, హీరోయిన్‌గా తీసుకొని తరుణ్‌ భాస్కర్ మంచి సక్సెస్ అందుకున్నాడు.&nbsp; 2016లో రిలీజైన ‘పెళ్లి చూపులు’ (Pelli Chupulu).. ఉత్తమ తెలుగు చిత్రం, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ డైలాగ్స్‌కు గాను జాతీయ పురస్కారాలు అందుకుంది.&nbsp;&nbsp; మహానటి సినిమాలో దర్శకుడు సింగీతం శ్రీనివాస్‌ పాత్రను పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు తరుణ్‌ భాస్కర్‌.&nbsp; తరుణ్‌ భాస్కర్‌ (HBD Tarun Bhaskar) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన లతా నాయర్‌ను 2013 నవంబర్‌ 20వ తేదీన పెళ్లి చేసుకున్నారు. తరుణ్‌ భాస్కర్‌ పుట్టిన రోజు, పెళ్లి రోజు నవంబర్‌లోనే ఉండటం విశేషం. తరుణ్‌ భాస్కర్‌ భార్య లతా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేస్తుంటారు. తన భర్త తీసిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలకు ఆమె పని చేశారు. అంతేకాదు సమంత నటించిన ‘యూ టర్న్‌’ మూవీకి కూడా వర్క్‌ చేశారు.&nbsp; ఈటీవీలో ‘మీకు మాత్రమే చెప్తా’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి తను ఏదైనా చేయగలగనని మరోమారు నిరూపించాడు తరుణ్‌ భాస్కర్‌.&nbsp; తరుణ్ భాస్కర్‌ పుట్టిన రోజు (HBD Tarun Bhaskar) సందర్భంగా ఆయన కొత్త సినిమా పోస్టర్‌ రిలీజైంది. ఏ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రంలో తరుణ్‌ ‘అంబటి ఓంకార్ నాయుడు’ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్‌గా అది రానుంది. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి 'ఓం శాంతి శాంతి శాంతి' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!</strong>
    The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 1 కలెక్షన్స్ ఎంతంటే విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా రూ.38.3 కోట్లు (GROSS) వసూలైనట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించాయి. ఇక వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలుపుకుంటే రూ.80 కోట్లు (GROSS)పైనే తొలి రోజు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ‘ది గోట్‌’ చిత్రం ‘లియో’ రికార్డ్‌ను దాటలేకపోయినట్లు తెలుస్తోంది. విజయ్‌ గత చిత్రం ‘లియో’ తొలి రోజున రూ. రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘ది గోట్‌’ అధిగమించలేకపోయింది.&nbsp; 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/the-goat-review-if-dalapati-vijay-had-to-face-himself-is-the-goat-great-or.html
    సెప్టెంబర్ 06 , 2024
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    ]రేటింగ్: 3.0/5విజయ్ నటన యోగిబాబుతో వచ్చే కామెడీ ట్రాక్ కుటుంబ సన్నివేశాలు పాటలుబలాలురొటీన్ కథ కథను ముందే ఊహించే సీన్లు ఫ్యాన్స్‌కు నచ్చే సీన్లకే ప్రాధాన్యంబలహీనతలు
    ఫిబ్రవరి 13 , 2023
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను&nbsp; కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన&nbsp; తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.&nbsp; మార్చి 29న తెలుగులోకి..! శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.&nbsp; కలెక్షన్స్‌లో టాప్‌- 5 ఇవే 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్‌), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్‌) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.&nbsp; ఈ సినిమా కథేంటి? 2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’  చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 19 , 2024

    @2021 KTree