• TFIDB EN
  • టర్బో
    UATelugu2h 35m
    ట‌ర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవ‌ర్‌. స్నేహితుడు జెర్రీ ప్రేమను గెలిపించే క్రమంలో ఓ యువతిని ఎత్తుకొస్తాడు. పోలీసులు కేసుపెట్టడంతో చెన్నైకి పారిపోతాడు. కట్‌ చేస్తే జెర్రీని ఓ గ్యాంగ్‌స్టర్‌ మనుషులు హత్య చేస్తారు. అతడి ప్రేయసిని చంపేందుకు యత్నిస్తారు. ఆమెను జోస్‌ ఎలా కాపాడాడు? జెర్రీని ఆ గ్యాంగ్‌స్టర్‌ ఎందుకు చంపాడు? స్నేహితుడి చావుకి జోస్‌ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SonyLivఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
    Watch
    2024 July 113 months ago
    టర్బో సినిమా ఆగస్ట్ 9నుంచి సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మమ్ముట్టి
    అంజనా జయప్రకాష్
    రాజ్ బి. శెట్టి
    శబరీష్ వర్మ
    సునీల్
    కబీర్ దుహన్ సింగ్
    నిరంజన అనూప్
    రోషన్ చంద్ర
    ఆదర్శ్ సుకుమారన్
    దిలీష్ పోతన్
    జానీ ఆంటోనీ
    శరవణన్
    అరుల్దాస్
    రోబో శంకర్
    వీటీవీ గణేష్
    అబూ సలీం
    కుంచన్
    విజయ్ సేతుపతి
    సిబ్బంది
    విశాఖ
    దర్శకుడు
    మమ్ముట్టి
    నిర్మాత
    మిధున్ మాన్యువల్ థామస్
    రచయిత
    క్రిస్టో జేవియర్సంగీతకారుడు
    షమీర్ మహమ్మద్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    CCL: తెలుగు వారియర్స్ ట్రోఫీ నిలబెట్టుకుంటుందా? ప్లేయర్స్ వీరే
    CCL: తెలుగు వారియర్స్ ట్రోఫీ నిలబెట్టుకుంటుందా? ప్లేయర్స్ వీరే
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 20 , 2023
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
    ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 24) పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్‌ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. దీనిపై పవన్‌ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్‌ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  పవన్‌ ఏఐ పోస్టు..? తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్‌ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్‌ జీపీటీ లేదా ఏఐ  సాయంతో పదాల కూర్పును జనరేట్‌ చేయించి పవన్‌ ఈ ట్వీట్‌ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్‌ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  https://twitter.com/PawanKalyan/status/1838587619745087518 ‘ఏఐ’ వినియోగంలో తప్పుందా! కార్తీపై పవన్‌ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్‌ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్‌ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్‌ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, గ్రమిటికల్‌ తప్పులు లేకుండా ఏఐ  సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్‌ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్‌ ఏఐ టూల్‌ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్‌ ఏఐ ట్వీట్‌ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి.  కార్తీ చేసిన తప్పేంటి? సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్‌ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్‌ టాపిక్‌.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్‌ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాంకర్‌ లడ్డు టాపిక్‌ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.  https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470 పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్‌! కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్‌ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్‌ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్‌ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్‌’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!</strong>
    Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్‌!
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్‌ 4) థర్డ్‌ సింగిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'దావూదీ' (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్‌ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’ ‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్‌’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్‌ బుధవారం (సెప్టెంబర్‌ 4) సాయంత్రం 'దావూదీ' పేరుతో ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో తారక్‌ తన ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.&nbsp; యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌.. ‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్‌, జాన్వీ కపూర్‌ బ్యూటీఫుల్‌ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్‌ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్‌ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్‌ పెంచుకుంటూ 50 మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతోంది.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1831578339078787537 మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌ దావూదీ సాంగ్‌లో తారక్‌ డ్యాన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్‌ ఎనర్జిటిక్‌ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్‌ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్‌ జోష్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్‌ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్‌ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. దావూదీ సాంగ్‌ షూటింగ్‌ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్‌ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్‌ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp; https://twitter.com/Thyview/status/1831302488340725836 https://twitter.com/krrishnolan/status/1831335770289820070 వెంటాడుతున్న ట్రోల్స్‌ దేవర థర్డ్‌ సింగిల్‌ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అనిరుధ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్‌ నటించిన ‘బీస్ట్‌’ చిత్రంలోని 'అరబిక్‌ కుత్తు'ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్‌, తారక్‌ వేసిన స్టెప్స్‌ కూడా సేమ్‌ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్‌ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్‌ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్‌ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్‌ హైహీల్స్‌ లాంటి షూస్‌ను&nbsp; వేసుకోవాడాన్ని కొందరు హైలేట్‌ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.&nbsp; https://twitter.com/iam_venkatsai_/status/1831547990722671066 https://twitter.com/Sunnykesh/status/1831302199160299619 సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర' ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారోనని తారక్‌ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా,&nbsp; 'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌ం, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.
    సెప్టెంబర్ 05 , 2024
    <strong>Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!</strong>
    Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!
    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్‌ మెుదలు పెట్టారు.&nbsp; ఓటీటీలోనూ వెక్కిరింపే! మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్‌ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్‌ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్‌ బచ్చన్‌’కు కనీస వ్యూస్‌ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్‌ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.&nbsp; దారుణంగా ట్రోల్స్‌ మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్‌ చూడటానికి ఆడల్ట్‌ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్‌ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్‌’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్‌ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/nenuneneh/status/1834511822277234953 https://twitter.com/BalaRTCultFan/status/1834481953619542526 https://twitter.com/koppalapn/status/1834462816470007925 https://twitter.com/IamanMCA/status/1834453046287630562 https://twitter.com/Dynamic_boy_7/status/1834439289717096574 https://twitter.com/BunnyJashu3/status/1834299241700757520 కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;</strong>
    Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌ తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్‌ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌! తారక్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ 'ఫియర్‌' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’&nbsp; నుంచి రెండో పాట రిలీజ్‌ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్‌, జాన్వీ కపూర్‌ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతూ మరింత దూసుకెళ్తోంది.&nbsp; పెద్ద ఎత్తున ట్రోల్స్‌! 'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాట సోప్‌ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్‌ యాడ్‌ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. అటు మీమ్స్‌ పేజెస్‌ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌ ట్యూన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్‌ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్‌ ఒకే సమయంలో పాజిటివ్‌, నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకొని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; స్ట్రాంగ్‌ కౌంటర్‌ దేవర సెకండ్‌ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్‌ మాత్రం సూపర్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్‌..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1820689638714998854 ‘దేవర’ వచ్చేస్తునాడు..! ‘దేవర’ మూవీ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
    ఆగస్టు 07 , 2024
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
    సూపర్​స్టార్ మహేష్‌​బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్​టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్‌ కెరీర్​లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్‌ సినిమాలు ఐదు ఉన్నాయి.  గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌​బాబు కెరీర్​లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్‌ నిలిచాడు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌​తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాకు బాగా కనెక్ట్‌ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌​బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్​కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో మహేష్‌​కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్‌ టాప్‌-5 కలెక్షన్లు ఇవే! ‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సర్కారు వారి పాట పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్‌ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. సరిలేరు నీకెవ్వరు మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.  మహర్షి రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్ అనే నేను కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'భరత్‌ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్‌ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ నటించింది.  శ్రీమంతుడు మహేష్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌ సరసన శ్రుతి హాసన్‌ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు.
    జనవరి 19 , 2024
    C/O కంచెరపాలెం డైరెక్టర్‌పై KGF ఫ్యాన్స్ ఫైర్… నెట్టింట్లో ట్రోల్స్
    C/O కంచెరపాలెం డైరెక్టర్‌పై KGF ఫ్యాన్స్ ఫైర్… నెట్టింట్లో ట్రోల్స్
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 07 , 2023
    <strong>#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!</strong>
    #BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
    భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్‌. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్‌ అన్నా, డైలాగ్‌ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్‌ నుంచి ‘వేట్టయన్‌’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; ‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’ రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్‌ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్‌ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/thenaani29/status/1843888854568431666 https://twitter.com/Kadirodu/status/1843694483508211884 https://twitter.com/kannayyaX/status/1843899836732743696 https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639 ఆ సినిమాలు కూడా అంతే! కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్‌ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్‌’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్‌’, ‘తంగలాన్‌’, ‘రాయన్‌’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్‌ పెట్టొచ్చు కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్‌ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.&nbsp; తెలుగు భాష వద్దా! గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్‌’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్‌ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
    అక్టోబర్ 09 , 2024
    Cannes Film Festival 2023: ఛీ..ఛీ..ఛీ.. భారతదేశం పరువు తీస్తున్నారు కదా..ట్రోల్స్‌తో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    Cannes Film Festival 2023: ఛీ..ఛీ..ఛీ.. భారతదేశం పరువు తీస్తున్నారు కదా..ట్రోల్స్‌తో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 19 , 2023
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని&nbsp; మోటివేట్ చేసే అంశం? అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్‌ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్‌ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646470630639034368 ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర? అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా.. https://twitter.com/anusuyakhasba/status/1646469527897800706 ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్‌ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు? అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా తాపత్రయం.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646463701757878274 ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా? అను: హనుమంతుడు నా ఫేవరెట్‌. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు. https://twitter.com/anusuyakhasba/status/1646461240250896389 https://telugu.yousay.tv/trolls-on-anasuya-they-dont-understand.html ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు. అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్‌ చేయడం కరెంట్ కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646458862214733824 ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్‌, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు&nbsp; భయం వేయలేదా? అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్‌ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646456898613579776 ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా? అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం. https://twitter.com/anusuyakhasba/status/1646455609506816001 ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పిండి? అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. https://twitter.com/anusuyakhasba/status/1646455293927374851 ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్‌/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా? అను: అది నిజం కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646438774950477826 ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు? అను: నథింగ్‌.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు. https://twitter.com/anusuyakhasba/status/1646437957228965889 https://telugu.yousay.tv/anasuyas-romance-with-sunflowers.html
    ఏప్రిల్ 14 , 2023
    <strong>EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;</strong>
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; [toc] సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    అక్టోబర్ 22 , 2024
    <strong>EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; [toc] ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.&nbsp; శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.&nbsp;&nbsp; రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.&nbsp; బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.&nbsp; లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌&nbsp; రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.&nbsp; సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!</strong>
    Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!
    తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్‌ ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి దీక్ష విరమించారు. అనంతరం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో డీఎంకే, ఉదయనిధి సోషల్‌ మీడియా వింగ్‌ పవన్‌ను టార్గెట్‌ చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి తెరలేపింది. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ సైతం రంగంలోకి దిగి ఉదయనిధి ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు డీఎంకే సోషల్‌ మీడియా విభాగం పూర్తిగా వెనక్కి తగ్గింది. నిన్నటి వరకూ పవన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేసిన పలు అకౌంట్లు ప్రస్తుతం క్లోజ్‌ అయ్యాయి. చెన్నైలోని తమ హాస్టల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన సనాతన ధర్మం గురించే చర్చ జరుగుతోందంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. దీనంతటికీ కారణం పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే ఒక సీటుకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పాడు. https://twitter.com/Deepika_JSP/status/1843293613029200362 పవన్‌పై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌ను సైతం సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లూజర్‌ అయిన ప్రకాష్‌ రాజ్‌ ఆంధ్రాలో రెండో అతిపెద్ద పార్టీ అధినేత పవన్‌కు రాజకీయాలపై సలహాలు ఇవ్వడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఓ సైకియార్టిస్టును కలిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. అంతేకాదు 2019లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ప్రకాష్‌ రాజ్‌ ఏ విధమైన ఘోర ఓటమిని చవి చూశారో గుర్తుచేస్తున్నారు. https://twitter.com/nrkaravindh/status/1843349508127916391 పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం నినాదాన్ని ఖండిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తుల నిజ స్వరూపాలను సైతం ఫ్యాన్స్ బట్టబయలు చేస్తున్నారు. We Dravidians 2.0 అకౌంట్‌ నుంచి పవన్‌పై తీవ్ర అసభ్యకర పోస్టు వచ్చింది. అయితే ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తి వేరే మతస్తుడని, పైగా మలేసియా పౌరసత్వం తీసుకున్నాడని ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టారు. ద్రవిడియన్స్‌ ముసుగులో సనాతన ధర్మపై యుద్దం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.&nbsp; https://twitter.com/HPhobiaWatch/status/1843251985178657133 పవన్‌ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున We Dravidians 2.0 పేజీని టార్గెట్‌ చేయడంతో వారిని తట్టుకోలేక అడ్మిన్‌ తన పేజీను క్లోజ్ చేసుకున్నాడు. ఎగిరెగిరి పడ్డ సీఎంనే 11 సీట్లకు పరిమితం చేశాడని, అంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.  https://twitter.com/lyf_a_zindagii/status/1843309397952598086 https://twitter.com/Nanda_927/status/1843287653699211585 పవన్‌ కంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ బాగా చదువుకున్నాడని చేస్తోన్న ట్రోల్స్‌కి ఫ్యాన్స్‌ గట్టిగానే బదులిస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన పవన్‌.. చెన్నై వరదల సమయంలో రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడని గుర్తు చేశారు. మరి బాగా చదువుకున్న ఉదయనిధి  ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాది బిన్‌లాడెన్‌ కూడా సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాడని, కానీ ఎన్నో బిల్డింగులను బాంబులతో కూల్చి వేశాడని గుర్తు చేశారు. https://twitter.com/parandhamdalit/status/1842842605828415846 ఉదయ నిధి స్టాలిన్‌ ఐటీ సెల్‌ను ధీటుగా ఎదుర్కొవడం ద్వారా సోషల్‌ మీడియాలో మరోమారు పవన్‌ కల్యాణ్‌ సత్తా ఏంటో నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ ఐకమత్యంగా ఏర్పడి పవన్‌ వ్యకతిరేక శక్తులను తిప్పికొట్టారని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/lordshivom/status/1843026533906059587 పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లాలంటే అతడి ఊర మాస్‌ ఫ్యాన్స్‌ను దాటుకొని వెళ్లాలంటూ ఓ అభిమాని పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.&nbsp; https://twitter.com/i/status/1843210460226867648 https://twitter.com/PK_Addicts/status/1843004204392088060 ఏపీలో ఒకప్పటి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని, మాజీ సీఎం జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా ఓడించాడో చూడంటూ పెట్టిన వీడియో సైతం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.  https://twitter.com/i/status/1843210675512086692 https://twitter.com/JSPGovtIn2024/status/1843221542920159417 ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూపై తమిళ యూట్యూబ్‌ ఛానెల్ రీసెంట్‌గా ఓ పోల్‌ నిర్వహించింది. ఈ వ్యవహారంలో పవన్‌కే ఏకంగా 89 శాతం మంది మద్దతు లభించింది.&nbsp; https://twitter.com/_MSD_VK/status/1842860646544630155
    అక్టోబర్ 08 , 2024
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!</strong>
    Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!
    బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్‌ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్‌ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్‌ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అనసూయ షాకింగ్‌ పోస్టు బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్‌ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్‌ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791 విజయ్‌ దేవరకొండను ఉద్దేశించేనా? అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్‌ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్‌ మ్యానర్స్‌ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్‌ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్‌ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.&nbsp; గతంలోనూ ఇలాగే.. అనసూయ ఈ తరహా అగ్రెసివ్‌ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్‌ పెట్టి అందరినీ షాక్‌ గురిచేసింది. తన గ్లామరస్‌ ఫోటోలోను షేర్‌ చేస్తూ హాట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అనసూయ ప్రస్థానం జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది.&nbsp;
    జూలై 25 , 2024
    <strong>Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!</strong>
    Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!
    గ్లోబల్‌ స్టార్‌ కమల్‌ (Kamal Hassan) హాసన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం 'భారతీయుడు 2' (Bharateeyudu 2). స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ 'భారతీయుడు 2' (Bharateeyudu 2). హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా చేశారు. జులై 12న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్‌ 25) ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సేనాపతి పాత్రలో కమల్‌ హాసన్‌ అదరగొట్టారు. అయితే కొందరు మాత్రం కమల్‌ పాత్రను టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ట్రోల్స్‌కు కారణమిదే? 'భారతీయుడు 2' సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్‌ హాసన్‌ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికారులను ఎంతో సాహసోపేతంగా కమల్‌ హత్య చేయడం గమనించవచ్చు. అయితే వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆ వయసులో కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉంటుందని.. కానీ, సేనాపతి మాత్రం అలవోకగా స్టంట్స్‌ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్‌లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్‌ ఫ్రీడం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో కాదని హితవు పలుకుతున్నారు.&nbsp; శంకర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ 'భారతీయుడు 2'లో కమల్‌ పాత్ర గురించి వస్తోన్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ శంకర్‌ స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ, ఫైట్స్ చేస్తున్నారు. ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దాం’ అంటూ శంకర్‌ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్‌ శంకర్‌కు పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని.. లాజిక్స్‌ గురించి ఆలోచిస్తే ఏ మూవీ చూడలేరని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ట్రైలర్ ఎలా ఉందంటే? 'ఇండియన్‌ 2' నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్.. అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో.. హీరో సిద్దార్థ్‌ను ఓ స్టూడెంట్‌లా చూపించారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే పాత్రలో అతడు కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విటర్‌లో 'ఆయన మళ్లీ రావాలి' హ్యాష్‌టాగ్‌ను యూత్‌ ట్రెండ్‌ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతి చేసిన కొందరిని శిక్షించడం ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్‌ పరంగా ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను డైరెక్టర్‌ శంకర్‌ తనదైన మార్క్‌తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అనిరుధ్‌ అందించిన నేపథ్యం సంగీతం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=H1GFcXaNXHU
    జూన్ 26 , 2024
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్‌ ‌అండ్ ఫ్యూచరిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్‌ చేయని కమల్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి కమల్‌ ఏమన్నారంటే దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్‌.. కల్కిలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్‌.. ఈ చిత్రాన్ని హవర్‌ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్‌ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.&nbsp; కల్కిలో భారీ కాస్టింగ్‌ ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా గెస్ట్‌ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్‌ వాహనానికి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తన వాయిస్‌ అందించింది. ఇలా ఇంతమంది స్టార్‌ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.&nbsp; అలనాటి నటి గ్రాండ్‌ ఎంట్రీ! కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్‌ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌! విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్‌ భైరవ' అనే యానిమేటెడ్‌ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్‌ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్‌ కూడా మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్‌ వండర్‌లా ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందో చూడాలి.&nbsp;
    జూన్ 04 , 2024
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్‌ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్‌ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.&nbsp; ‘మేము గొప్ప స్నేహితులం’ స్టార్‌ హీరోయిన్‌ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్‌ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/yoursanjali/status/1796260781551682021 నెటిజన్లు భిన్నాభిప్రాయాలు అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్‌ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్‌ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. https://twitter.com/GoneWorse/status/1796158320778117123 నిర్మాత ఏమన్నారంటే.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్‌ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.&nbsp; https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044 నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్‌ వైడ్‌గా మాత్రం ట్రెండ్‌ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి.&nbsp;ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు.&nbsp;
    మే 31 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. &nbsp; కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.&nbsp; దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.&nbsp; అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.&nbsp; అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.&nbsp; అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ కథనంలో చూద్దాం.&nbsp; లోయెస్ట్‌ కలెక్షన్స్‌! మిక్స్‌డ్‌ టాక్‌ ఎఫెక్ట్.. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star Day 1 Collections) కలెక్షన్స్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.10.60 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకంటిచాయి. భారత్‌లో రూ. 6.6 కోట్ల గ్రాస్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.4 కోట్లు, తమిళనాడు రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రూ.20 లక్షలు రాబట్టినట్లు వివరించాయి. దీంతో&nbsp; విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ‘ఫ్యామిలీ స్టార్‌’ నిలిచింది. విజయ్‌ గత చిత్రం ‘ఖుషి’.. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్‌ సాధించడం గమనార్హం. ఓవర్సీస్‌లో దూకుడు! లోకల్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా డాలర్ల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ 4.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్‌ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఈ వీకెండ్‌లో మరిన్ని డాలర్లు సాధించే దిశగా ‘ఫ్యామిలీ స్టార్‌’ పరుగులు పెడుతోంది.&nbsp; బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? భారీ అంచనాలతో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత డే1 కలెక్షన్స్‌ బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాగా శ్రమించాల్సి ఉంది.&nbsp; ‘ఫ్యామిలీ స్టార్‌’.. కథేంటి గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp; https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 06 , 2024

    @2021 KTree