రివ్యూస్
How was the movie?
తారాగణం
అల్లు అర్జున్
ఆనంద్ రాజ్ / కేబుల్ రాజుఅనుష్క శెట్టి
సరోజ (జ్యోతి వర్మ వాయిస్ ఓవర్)దీక్షా సేథ్
పూజ (అనసూయ భరద్వాజ్ చేత డబ్బింగ్ చేయబడింది)మంచు మనోజ్
వివేక్ చక్రవర్తిమనోజ్ బాజ్‌పేయి
రహీముద్దీన్ ఖురేషిశరణ్య పొన్వన్నన్
పద్మనాగయ్యరాములు
లేఖా వాషింగ్టన్
లాస్యరవి ప్రకాష్
ఏసీపీ శివరాంఅదితి గౌతమ్
జరాసత్యం రాజేష్
గణపతిబ్రహ్మానందం
బ్రదర్ బైరాగిపోసాని కృష్ణ మురళి
పోలీస్ ఇన్స్పెక్టర్నాగబత్తుల మనోజ్ కుమార్డప్పు సుబానీ
నిక్కికర్పూరం
పృధ్వీ రాజ్
బుల్లెబ్బాయిరవి రాఘవేంద్ర
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్నాగినీడు
ఉగ్రవాదికల్లు చిదంబరం
గిరిధర్కోటి
రాకేష్ వర్రే
అప్పారావు
క్రిష్ జాగర్లమూడి
సాధుసిబ్బంది
క్రిష్ జాగర్లమూడి
దర్శకుడుశోబు యార్లగడ్డ మరియు ప్రసాదం భాయ్ దేవినేని
నిర్మాతశోబు యార్లగడ్డనిర్మాత
ప్రసాద్ దేవినేనినిర్మాత
ఎంఎం కీరవాణి
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
వేశ్య పాత్రల్లో ఆకట్టుకున్న తెలుగు హీరోయిన్లు
]అనుష్క శెట్టి - వేదంటాలివుడ్ స్వీటి అనుష్క వేదంలో చేసిన ‘సరోజ’పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. వేశ్యావృత్తిలోని చీకటి కోణాన్ని చూపించేలా ఉండే పాత్రలో అమాయకమైన అమ్మాయిగా అనుష్క నటన కన్నీళ్లు పెట్టించింది.
ఫిబ్రవరి 13 , 2023
Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్ - అనుష్క జోడి.. ఎందుకంటే?
టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే వీరి పెళ్లికి సంబంధించి వార్తలు సైతం షికారు చేశాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అటు స్వీటీ సైతం ‘ఘాటీ’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం (నవంబర్ 8) అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని ఘాటీ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చింది. అయితే ఈ రెండు పోస్టర్లు సిమిలర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నోటిలో సిగార్‌తో..
అనుష్క శెట్టి ఫీమేల్ లీడ్‌గా 'ఘాటి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో అనుష్క చాలా డిఫరెంట్‌గా కనిపించింది. ముఖంపై రక్తంతో సిగార్ తాగుతూ ఆ పొగ మధ్యలో కనిపించింది. ఇటీవల వచ్చిన రాజాసాబ్ పోస్టర్‌లోనూ ప్రభాస్ ఈ తరహా గెటప్‌లోనే కనిపించడం గమనార్హం. అనుష్క తరహాలోనే నోట్లో సిగార్ పెట్టుకొని కనిపించాడు. స్మోకీ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇద్దరూ సిగార్ తాగుతూ పోస్టర్‌లో కనిపించడంతో ఆ పోస్టర్లు పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ ట్యాగ్‌లు ఇస్తున్నారు అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/subhaashiniii/status/1854377730575397055
కసిగా తల తెంపిన అనుష్క
గురువారం ఉదయం 'ఘాటి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ అదే రోజు సాయంత్ర సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా చాలా వైలెంట్‌గా స్వీటిని చూపించారు. అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని, అది కూడా బస్ మిర్రర్‌లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది. ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా సిగార్ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. అది తాగే సమయంలో అనుష్క చేతుల నిండా రక్తం ఉంటుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్‌ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది.
https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
స్వీటీ ఆశలన్నీ 'ఘాటి' పైనే!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది ఆమె స్థాయికి తగ్గ హిట్ మాత్రం కాదు. దీంతో ఇండస్ట్రీలో తిరిగి నిలదొక్కుకోవాలంటే 'ఘాటి' సక్సెస్ చాలా కీలకంగా మారింది. మరోవైపు దర్శకుడు క్రిష్‌కు సైతం ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఇటీవల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ చేజారడంతో ఘాటీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని క్రిష్ భావిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
నవంబర్ 08 , 2024
Harom Hara Movie Review: ‘హరోం హరా’లో టాప్‌లేపిన సుధీర్ బాబు.. హిట్ కొట్టాడా?
నటీనటులు : సుధీర్ బాబు, మాళవిక శర్మ, జయప్రకాష్, సునీల్, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు
దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
సంగీతం : చైతన్ భరద్వాజ్
ఎడిటర్ : రవితేజ గిరిజాల
నిర్మాత : సుమంత్ జి. నాయుడు
విడుదల తేదీ: 14- 05-2024
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, రవి కాలే, కేశవ్ దీపక్, రాజశేఖర్ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాలపై అంచనాలను పెంచింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్‌బాబు.. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సుధీర్‌బాబుకు హిట్ అందించిందా? అతడి అంచనాలను నిలబెట్టిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
1980ల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి, అతని సోదరుడు బసవ, కుమారుడు శరత్‌రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు అన్యాయాలు, అరాచకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉద్యోగరిత్యా సుబ్రహ్మణ్యం (సుధీర్‌బాబు) ఆ ఊరికి వస్తాడు. ఓ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ శరత్‌రెడ్డితో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆర్థిక సమస్యల వల్ల తన మెకానికిల్ తెలివితేటలతో గన్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. తొలుత గొడవపడిన శరత్‌రెడ్డితో చేతులు కలిపి అక్రమంగా తుపాకులు చేయడం మెుదలు పెడతాడు. ఈ క్రమంలో ఒక రోజు తమ్మిరెడ్డికి ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏమైంది? కుప్పం ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ప్రాంత ప్రజలు హీరోను ఎందుకు దేవుడిగా భావించారు? తమ్మిరెడ్డిని అతడెలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
సుబ్రహ్మణ్యం పాత్రలో.. సుధీర్‌బాబు కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో కష్టమైన కుప్పం యాసలో మాట్లాడుతూ తన మార్క్ నటనతో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపించాడు. ఇక అతడికి జోడీగా చేసిన మాళవిక శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుధీర్‌బాబుతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. విలన్ పాత్రల్లో జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ మంచి ప్రభావం చూపించారు. కానిస్టేబుల్ పాత్రతో సునీల్ ఆకుట్టుకున్నాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే అయిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మెప్పించింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక.. రొటిన్ స్టోరీనే సినిమాకు తీసుకున్నప్పటికీ కథనాన్ని అద్భుతంగా నడిపి మంచి మార్కులు కొట్టేశాడు. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను నేరుగా చెబుతూనే స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కథకు జోడించారు. తొలి అర్ధభాగాన్ని చాలావరకూ పాత్రల పరిచయానికే కేటాయించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ ముందుకు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. సెకండాఫ్ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అయితే సెకండాఫ్ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్‌గా మారింది. ఓవరాల్‌గా.. మంచి యాక్షన్ సినిమాను కోరుకునేవారికి ‘హరోం హర’ మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 1980ల నాటి కుప్పాన్ని వారు మళ్లీ రీ క్రియేట్ చేసిన తీరు ప్రశంసనీయం. అటు సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సుధీర్‌బాబు నటనయాక్షన్ సీక్వెన్స్‌ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడంకానరాని మలుపులు
Telugu.yousay.tv Rating : 3/5
జూన్ 14 , 2024
‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్, సెంటీమెంట్ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సలార్ (Salaar)
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ మాత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్ మెప్పిస్తాయి.
https://twitter.com/i/status/1760698195787870606
ఆర్‌ఆర్‌ఆర్
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్ బంగ్లాలోకి తారక్ జంతువులతో ప్రవేశించే సీన్ హైలేట్ అని చెప్పవచ్చు. అటు తారక్ - రామ్‌చరణ్ ఫైటింగ్ కూడా మెప్పిస్తుంది.
https://twitter.com/i/status/1758341886304284738
బాహుబలి 2 (Bahubali 2)
బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అదరహో అనిపిస్తాయి.
https://www.youtube.com/watch?v=TloNJQKZiFg
జెర్సీ (Jersey)
నేచురల్ స్టార్ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్ వెళ్తుండగా నాని అరిచే సీన్.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw
రేసుగుర్రం (Race Gurram)
అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్ పాండే పాత్రతో సర్‌ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్
https://www.youtube.com/watch?v=jxBLgrppzpc
వేదం (Vedam)
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్ డబ్బులు కొట్టేసే సీన్ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్ హృదయాలకు హత్తుకుంటుంది.
https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk
పోకిరి (Pokiri)
మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.
https://www.youtube.com/watch?v=PvkITH66FEc
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్ ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE
ఛత్రపతి (Chatrapathi)
ప్రభాస్ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్ చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వెేయిస్తుంది. ప్రభాస్ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc
జనతా గ్యారేజ్ (Janatha Garage)
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’లో తారక్ పవర్ ప్యాక్డ్ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్ సీన్ మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు.
https://www.youtube.com/watch?v=FmAak259Its
టెంపర్ (Temper)
తారక్-పూరి కాంబోలో వచ్చిన టెంపర్ చిత్రంలో.. కోర్టు సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.
https://twitter.com/i/status/1668264361469591558
https://twitter.com/i/status/1668264361469591558
విక్రమార్కుడు (Vikramarkudu)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్ రాథోడ్ అనే పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://www.youtube.com/watch?v=aorA5S083W4
మగధీర (Magadheera)
రామ్‌చరణ్ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్ షేర్‌ఖాన్ పంపిన వందమంది సైనికులను చంపే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ సినిమాను మలుపు తిప్పుతుంది.
https://www.youtube.com/watch?v=9NJya1B8mvI
మిర్చి (Mirchi)
ప్రభాస్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్ తరపు మనుషులకు ప్రభాస్ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది.
https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ
ఆడవారి మాటలకు అర్థాలే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.
https://www.youtube.com/watch?v=L26KInZYQcI
ఇంద్ర (Indra)
మెగాస్టార్ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్ గతాన్ని రివీల్ చేసే ఇంటర్వెల్ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు.
https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I
సింహాద్రి (Simhadri)
రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్ ప్రతీకారం తీర్చుకునే సీన్ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సూపర్‌గా అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo
తులసి (Thulasi)
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.
https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
ఫిబ్రవరి 24 , 2024
20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్ స్టార్ అయ్యాడు!
‘అల్లు అర్జున్’... ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్ చేసి పాన్ ఇండియన్ స్టార్. ఐకాన్ స్టార్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్ వాల్యూలో ఇండియాలో టాప్-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరో. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
https://telugu.yousay.tv/allu-arjun-pushpa-will-decrease-in-brand-value-allu-arjun-rashmika-and-pv-sindhu-in-top-25.html
తొలి అడుగు
28 మార్చి 2003లో గంగోత్రి సినిమా వచ్చినపుడు చాలా మంది విమర్శించారు. ఇతను హీరోనా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో తనలోని నటుడిని ప్రపంచానికి చాటాడు. మరి అల్లు అర్జున్‌ను స్టార్ చేసిన అంశాలేంటో చూద్దాం.
కథల ఎంపిక
గంగోత్రి విడుదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్‌ను స్టార్‌గా నిలిచేలా చేసింది మాత్రం అతడి స్టోరీ సెలెక్షన్. అల్లు అర్జున్ ఏ రెండు వరుస సినిమాలు కూడా ఒకే పంథాలో సాగవు. లుక్, మేనరిజం ఇలా ప్రతీది మారిపోతుంది. గంగోత్రితో విమర్శలు ఎదుర్కొన్నా… ఆ తర్వాత 2004లో వచ్చిన సుకుమార్ ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్ పేరు మార్మోగేలా చేసింది. అప్పటిదాకా తెలుగు సినిమా చూడని వెరైటీ లవ్‌స్టోరీని అల్లు అర్జున్ ఎంపిక చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలోనూ అల్లు అర్జున్ డిఫరెంట్‌గానే కనిపిస్తాడు. బన్నీ, పరుగు, దేశముదురు, ఆర్య-2, వేదం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో ఇలా తనలోని నటుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూనే వచ్చాడు. పుష్పలో అయితే ఊర మాస్ లుక్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
డ్యాన్స్
మరో మాట లేకుండా ఇండియాలోని హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్స్‌లో అల్లు అర్జున్ ఒకడు. అతడి డ్యాన్స్‌కు టాలివుడ్‌లోనే కాదు బాలివుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్య-2, అల వైకుంఠపురములో, రేసు గుర్రం ఇలా ఏ సినిమా తీసుకున్నా అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.
సుకుమార్
అల్లు అర్జున్ కెరీర్‌లో సుకుమార్‌ది కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదు. అప్పుడు ఆర్యతో అతడి కెరీర్‌ను మలుపు తిప్పాడు. అలాగే ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ మార్చాడు. ఇప్పుడు పుష్ప: ది రూల్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
https://telugu.yousay.tv/allu-arjun-passed-prabhas-in-remuneration.html
అల్లు అర్జున్ చేసిన అద్భుతమైన పాత్రలు
అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో కథల ఎంపిక, డ్యాన్స్‌లతో పాటు కొన్ని పాత్రలు సినీ ప్రియులు మరిచిపోలేరు. అవి
ఆర్య
సుకుమార్ కల్ట్ క్లాసిక్ మూవీ ఆర్యలో ‘ఆర్య’గా అల్లు అర్జున్‌ను ఎవరూ మర్చిపోలేరు. సినిమా అంతా నవ్వించినా, నవ్వులపాలైనా చివరిలో కన్నీరు పెట్టించినా ‘ఆర్య’ పాత్ర సూపర్ అని చెప్పాలి.
బాల గోవింద్
అల్లు అర్జున్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా దేశముదురు. ఇందులో బాల గోవింద్‌గా అల్లు అర్జున్ పాత్ర ఊర మాస్ ఉంటుంది. ఇందులో బాలగోవింద్ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటాయి.
గోన గన్నారెడ్డి
స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో చూపించిన సినిమా రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ఎవరూ మర్చిపోలేరు.
కేబుల్ రాజు
క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా. హీరోయిజంకు ఏమాత్రం అవకాశం లేకుండా కేవలం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర కేబుల్ రాజు. ఎంతోమంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు కనెక్ట్ అయిన పాత్ర. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్‌లో అద్భుతమైన పాత్రల్లో ఒకటి.
పుష్ప
ఫైనల్‌గా ‘పుష్ప’. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ పాత్ర తన కెరీర్‌లో మైలురాయి. 20 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చిన పాత్ర.
ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ కష్టపడుతున్నారు. సుకుమార్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
తన 20 ఏళ్ల ప్రయాణంపై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రేక్షకులు, అభిమానులే. సదా మీకు కృతజ్ఞుడను’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/alluarjun/status/1640581255732535296?s=20
మార్చి 28 , 2023
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
[toc]
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
అక్టోబర్ 22 , 2024
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
Fear Movie Review: భయపడుతూనే భయపెట్టిన వేదిక.. ‘ఫియర్’ ఎలా ఉందంటే?
నటీనటులు : వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
దర్శకత్వం : డా. హరిత గోగినేని
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్రూ
నిర్మాత: డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
విడుదల తేదీ: డిసెంబర్ 14, 2024
ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్ రోల్‌లో నటించిన హారర్ చిత్రం ‘ఫియర్’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఇందులో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్ ఎలిమెంట్స్ ప్రతీ ఒక్కరినీ థ్రిల్ చేస్తాయని ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వేదిక నటన ఆకట్టుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
జయప్రకాష్, పవిత్ర లొకేష్ దంపతులకు ఇద్దరు కవల పుత్రికలు జన్మిస్తారు. వేదిక చిన్నప్పటి నుంచి దెయ్యం సినిమాలు చూస్తూ ఉంటుంది. చెల్లెలకు భయమని తెలిసినా తనతోపాటే బలవంతంగా ఆమెకూ సినిమాలు చూపిస్తుంది. ఫలితంగా చెల్లెలిలో తలెత్తిన మానసిక సమస్యలు ఆమెతో పాటే పెరిగి పెద్దదవుతాయి. దీంతో తల్లిదండ్రులు ఆమెను ట్రీట్‌మెంట్ కోసం మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తారు. అక్కడ ఆమె తన భాయ్‌ఫ్రెండ్ సంపత్ (అరవింద్ కృష్ణ)ను కలవరిస్తుంటుంది. కానీ ఆ పేరుతో అసలు మనిషే లేడని చెప్పిన వినిపించుకోదు. కట్ చేస్తే మరోవైపు అక్క (వేదిక) సిటీలో జీవిస్తుంటుంది. విలాసవంతమైన ఇంటిలో షాయాజీ షిండే, సత్యకృష్ణ, మరో ఇద్దరితో నివసిస్తుంటుంది. అయితే వేదిక కూడా తరచూ భయపడుతుంటుంది. వారిద్దరి భయానికి కారణం ఏంటి? సంపత్ అనే వ్యక్తి ఉన్నాడా లేడా? కథళో షాయాజి షిండే, సత్య కృష్ణ పాత్రలు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. (Fear Movie Review)
ఎవరెలా చేశారంటే
నటి వేదిక (Fear Movie Review) ద్విపాత్రాభినయంతో మెప్పించింది. నటన పరంగా ఆమెకు మంచి పాత్రే దక్కింది. కథ మెుత్తం ఆమె చేసిన అక్క, చెల్లెళ్ల పాత్ర చుట్టే తిరిగింది. భయపడే సన్నివేశాల్లో ఆమె ఎక్స్‌ప్రెక్షన్స్ చాలా నేచురల్‌గా అనిపించాయి. సంపత్ పాత్రలో నటుడు అరవింద్ కృష్ణ ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే, సత్యకృష్ణ రోల్స్ కథతో పాటే ట్రావెల్ చేశాయి. తమిళనటుడు జయప్రకాష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ వేదిక తల్లిదండ్రులుగా బాగా చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
https://twitter.com/IndianClicks/status/1867486641822347748
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఫియర్’ అనే టైటిల్‌తో భయం చుట్టే తన సినిమా తిరుగుతుందని దర్శకురాలు డా. హరిత చెప్పకనే చెప్పేశారు. కథనాన్ని నడిపే క్రమంలో ఆమె ఎంచుకున్న రివర్స్ ఫ్లాష్ బ్యాక్ ఫార్మెట్ ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది. బాల్యంలోని సంఘటనలు, వర్తమాన పరిస్థితులను చూపిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ చిత్రాల్లో కనిపించే ఈ తరహా శైలి ప్రేక్షకులకు అంతగా రుచించలేదని చెప్పవచ్చు. అసలు భూమ్మీదే లేవని చెప్పే పాత్రలు వేదిక సిస్టర్స్‌ను భయపెట్టే సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. సెకండాఫ్‌కు వచ్చేసరికి సవతి చెల్లెళ్ల భయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు బాగుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు పర్వాలేదనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వేదిక భయపడుతున్న పాత్రలన్నీ తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది. అయితే స్క్రీన్‌ప్లే, కథనం విషయంలో ఇంకాస్త బెటర్ వర్క్ చేసి ఉంటే బాగుండేది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి (Fear Movie Review) వస్తే ఆండ్రూ కెమెరా పనితనం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సన్నివేశాలపై ఆసక్తిని కలిగించాయి. ఈ మూవీ దర్శకురాలే ఎడిటింగ్ వర్క్ సైతం చేసింది. ఈ విషయంలో ఆమె ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వేదిక నటనఫియర్ ఎలిమెంట్స్‌ట్విస్టులు
మైనస్ పాయింట్స్
కథనంలో తడబాటుసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 13 , 2024
Vedika Bikini: బికినిలో వేదిక థండర్ థైస్ అందాలు
గ్లామర్ బ్యూటీ వేదిక (Vedhika) మరోమారు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన బికిని ఫొటోలను కుర్రకారు మతిపోగొడుతోంది.
తాజాగా ఓ బీచ్‌కు వెళ్లిన వేదిక అక్కడ బికిని (Vedika Bikini Photos)తో హల్ చల్ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసి అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది.
జీరో సైజ్‌లో వేదిక (Vedhika Hot) అందాలు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె సొగసుల సంపద అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.
వేదిక ఫొటోలు నెట్టింట వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా ఈ బ్యూటీ షేర్ చేస్తోన్న హాట్ ఫొటోలు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.
వేదిక (Vedika Bikini Photos) వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1988 ఫిబ్రవరి 21న కర్ణాటకలో జన్మించింది. బ్రాటప్ అంతా ముంబయిలో జరిగింది.
కెరీర్ ప్రారంభంలో వేదిక (Vedhika) మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో ఆమె నటించింది. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది.
తమిళంలో 2006లో వచ్చిన 'మద్రాసి' చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. అందులో అంజలి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
2007లో రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని సినిమాలో వేదిక నటించింది. ఆ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 'విజయ దశమి' మూవీతో నేరుగా తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు.
దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన వేదిక అక్కడ వరుసగా చిత్రాలు చేసి మరింత పాపులర్ అయ్యింది.
తద్వారా 2009లో నారా రోహిత్ ఫస్ట్ ఫిల్మ్ 'బాణం'లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో సుబ్బలక్ష్మీ పాత్రతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసింది.
ఆ తర్వాత తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'పరదేశి' చిత్రం నటిగా వేదికకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అంగమ్మ పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
బాణం సినిమా సక్సెస్ అయినప్పటికీ తెలుగులో వేదికకు రెగ్యులర్‌గా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఈ అమ్మడు బిజీ అయిపోయింది.
అడపాదడపా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. బాణం తర్వాత దగ్గరగా దూరంగా, రూలర్, బంగర్రాజు, రీసెంట్‌గా 'రజాకార్' చిత్రాల్లో వేదిక మెరిసింది.
ప్రస్తుతం తెలుగులో ఫియర్ అనే చిత్రంలో వేదిక (Vedika Bikini Photos) నటిస్తోంది. షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ వేదిక యాక్టివ్‌గా ఉంటోంది. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
డిసెంబర్ 09 , 2024
Naga Chaitanya - Samantha: ఒకే వేదికపై నాగ చైతన్య - సమంత.. ఫ్యాన్స్ ఆసక్తికర ప్రశ్నలు!
ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అట్రాక్టింగ్ కపుల్ అనగానే ముందుగా నాగచైతన్య - సమంతల జంట గుర్తుకు వచ్చేది. ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ముందు స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. ఏమైందో ఏమో కొంత కాలానికే విడాకులు తీసుకొని ఫ్యాన్స్‌ను షాకిచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరు ఎదురుపడిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బహిరంగంగా ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోనూలేదు. అయితే విడాకుల తర్వాత తొలిసారి వీరు ఒకే వేదికపై మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకే వేదికపై ఎందుకు వచ్చారంటే?
మంగళవారం సాయంత్రం ముంబయిలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్‌ల గురించి స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. సమంత (Samantha) లీడ్ రోల్‌లో చేసిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ కూాడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సమంతతో పాటు సిరీస్ యూనిట్ అంతా ఈవెంట్‌లో పాల్గొని తమ సిరీస్‌ను ప్రమోట్ చేసుకున్నారు. అటు నాగ చైతన్య ‘దూత 2’ సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కానుండటంతో అతడు కూడా ఈవెంట్‌కు హజరయ్యాడు. విడిపోయిన ఈ జంట తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో అందరి దృష్టి వీరిపై పడింది.
https://twitter.com/i/status/1770184438099410982
చైతు - సమంత మాట్లాడుకున్నారా?
అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో సమంత, నాగ చైతన్య ఒకేసారి ప్రత్యక్షం కావడం టాలీవుడ్‌తో పాటు సోషల్‌మీడియాలోను పలు చర్చలకు దారితీసింది. ఒకే వేదికపై ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? ఏమైనా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్‌లని ప్రమోట్ చేస్తుండటంతో ‘దూత 2 వర్సెస్ సిటాడెల్’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1770045272049279412
అతి త్వరలో స్ట్రీమింగ్‌లోకి..
మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా, సమంత నటించిన ‘సిటాడెల్ ఇండియా వెర్షన్’ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవల ఈ సిరీస్ పేరును మేకర్స్ ‘సిటాడెల్: హనీ బన్నీ’గా మార్చిన సంగతి తెలిసిందే. అటు గతేడాది నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' త్వరలోనే ప్రైమ్‌లోకి రాబోతోంది.
https://twitter.com/FilmifyTelugu/status/1770032462451900440
మార్చి 20 , 2024
Fastest 500Cr Movies: జెట్ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
ఒకప్పుడు దేశంలో సూపర్ హిట్ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. బాహుబలి-2
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.
2. ఆర్‌ఆర్‌ఆర్
బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే.
3. కేజీఎఫ్ 2
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
4. పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ ‘పఠాన్’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.
5. రోబో 2.0
రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం.
6. సుల్తాన్
సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్’ చిత్రం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
7. దంగల్
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దంగల్’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.
8. పీకే
అమీర్ ఖాన్ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది.
9. టైగర్ జిందా హై
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.
10. సంజు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.
సెప్టెంబర్ 05 , 2023
PawanaKalyan: ఇన్‌స్టాగ్రాంలో వేగంగా 1M ఫాలోవర్లను సాధించిన టాప్ 5 హీరోలు తెలుసా?
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూలై 05 , 2023
RAHUL SIPLIGUNJ: ధూల్‌పేట్ గల్లీ నుంచి ఆస్కార్ వేదికపై లైవ్ పర్‌ఫార్మెన్స్ దాకా..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
మార్చి 13 , 2023
Deepika padukone Bday Special: డిప్రెషన్ నుంచి ప్రపంచ వేదికకు ప్రయాణం
]తెలుగులో మరికొందరి పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తే వదులుకోనంటుంది.తెలుగు హీరోలంటే ఇష్టం
ఫిబ్రవరి 13 , 2023
Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
గత శుక్రవారం (మే 31) విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ చిత్రాలు.. థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే విష్వక్ నటించిన గ్యాంగ్య్ ఆఫ్ గోదావరి తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్ రాబట్టగా.. ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ చెప్పుకోతగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే మౌత్ టాక్‌తో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్‌ను ఆకర్షిస్తాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యాయా? వీకెండ్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్స్ ఎంత? మిగిలిన రెండు చిత్రాల వసూళ్లు పుంజుకున్నాయా? లేదా? ఈ కథనంలో పరిశీలిద్దాం.
దుమ్మురేపిన విష్వక్
విష్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. శుక్ర, శని, ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.16.2 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాలో లంకల రత్న అనే పాత్రలో విశ్వక్‌సేన్ యాక్టింగ్, హీరోయిజంతో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్వక్ సేన్ క్యారెక్టర్‌ను దర్శకుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. అటు హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో అంజలి అనే కీలక పాత్రను పోషించింది.
https://twitter.com/vamsikaka/status/1797530286579917125
లాభాల్లోకి వచ్చినట్లేనా?
యంగ్ హీరో విష్వక్ సేన్.. నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఆయన గత చిత్రాలు నిర్మాతలకు రూపాయి మిగిల్చిందే గానీ, నష్టాల పాలు చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ.10 కోట్లకు మేర ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాతలు ప్రకటించిన గ్రాస్ రూ.16.2 కోట్లుగా ఉంది. ట్యాక్స్‌లు, థియేటర్ల అద్దెలు మినహాయిస్తే 95 శాతానికి పైగా పెట్టుబడి మెుత్తం వచ్చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
నిరాశ పరిచిన ‘గం గం గణేశా’
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘గం గం గణేశా’ చిత్రం... బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్‌ఫార్మ్ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్‌లో ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదని సమాచారం. ఈ మూవీ తొలి మూడు రోజులు.. వరల్డ్ వైడ్‌గా రూ.1.94 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.68 కోట్లు కలెక్ట్ చేసినట్లు స్పష్టం చేశాయి. కాగా, గం గం గణేశా... బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ.5.50 కోట్లుగా ఉంది. ఈ మార్క్‌ను అందుకోవాలంటే ఈ వర్కింగ్ డేస్‌లో ఆడియన్స్‌ను మరింత అట్రాక్ట్ చేయాల్సి ఉంది.
‘భజే వాయు వేగం’కు బెటర్ రెస్పాన్స్
యంగ్ హీరో కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం'.. మే 31న విడుదలై సాలిడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు రూ. కోటి లోపే కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో గణనీయంగా పుంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, భజే వాయు వేగం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత గ్రాస్ కాకుండా షేర్‌ను పరిగణలోకి తీసుకుంటే నేటి నుంచి ఈ మూవీ కూడా లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జూన్ 03 , 2024
Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతోంది.
https://twitter.com/memesbyAru/status/1762745277944054182
తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ (Mathias Boe)ని వివాహం చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మార్చి నెలఖారు లోపు పెళ్లి బంధంతో వీరు ఒక్కటవుతారని సమాచారం.
సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారిపోయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తాప్సి - మథియస్ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని అంటున్నారు.
సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
సుమారు పదేళ్లుగా తాప్సీ - మథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఈ జంట చాలా జాగ్రత్త పడింది. ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.
బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఆ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది.
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.
‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు.
తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్ ఖేల్ మీన్ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 28 , 2024
Cannes Film Festival 2023: సొగసు చూడ తరమా… ఒక్క వేదికపై ఇన్ని అందాలా?
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాలీవుడ్, బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు.
కేన్స్ వేడుకల్లో తొలిసారి పాల్గొన్న సారా అలీఖాన్.. రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసింది. ఐవరీ కలర్ లెహంగాలో సారా మెరిసిపోయింది. తన బాడి ఔట్‌ఫిట్‌తో మెస్మరైజ్ చేసింది.
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కూడా ఈ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొంది. తెల్లటి దుస్తుల్లో స్టన్నింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మానుషి ఆకట్టుకుంది.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేెలా ఫ్రెంచ్ వేడుకల్లో హోయలు ఒలికించింది. ఎర్రటి దుస్తుల్లో కనిపించిన ఊర్వశి.. తెల్లటి అందాలను ఆరబోసింది.
బ్యూటీ క్వీన్ ఈషా గుప్త తన అందాలతో వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హాలీవుడ్ బ్యూటీ ఎల్లీ ఫ్యానింగ్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అలరించింది.
image courtesy: Twitter/@ElliStavroulake
హాలీవుడ్ పావోలా తురానీ కేన్స్ వేడుకల్లో తన సొగసుల పంట పండించింది.
image courtesy: Twitter/@itisnicoleeee
బ్రెజిల్ మోడల్ అలెస్సాండ్రా అంబ్రోసియొ తన ఎద అందాలతో మెరిసింది.
image courtesy: Twitter/@izz4h_vl
చైనా నటి గువాన్ షియావోటోంగ్ బ్లాక్ డ్రెస్‌లో వేడుకల్లో అదరగొట్టింది.
image courtesy: Twitter/@muglare
రష్యా నటి విక్టోరియా బొన్యా కాస్ట్యూమ్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరించింది.
image courtesy: Twitter/@FaashionLooks
మే 17 , 2023
Varun Tej Marriage: నెట్టింట వరుణ్-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.
వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు.
భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు.
వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు.
వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్-పవన్ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://twitter.com/vamsikaka/status/1719756960852263315
కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
నవంబర్ 03 , 2023
NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !
తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మిస్ ఇండియా 2023
మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న జరిగిన ఫైనల్స్ జరగ్గా… ఆమె అందానికి అందరూ దాసోహం అయ్యారు. విజేతగా ప్రకటిస్తూ జడ్జీలు నిర్ణయం తీసుకున్నారు. కిరీటాన్ని పెట్టి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు బాటలు వేశారు. దీంతో నందినీ గుప్తా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
చిన్ననాటి కల
నందినీ 10 ఏళ్ల వయసు నుంచే మిస్ ఇండియా కావాలని కలలు కంటోంది. ఈ విషయాన్ని తన బయోలో వెెల్లడించింది ఈ అందాల తార. చిన్నతనంలోనే వివిధ కార్యక్రమాలకు హోస్టింగ్ చేయడం పట్ల ఆసక్తి చూపించేదట. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంవైపు అడుగులు వేసింది నందినీ. చిన్న పట్టణం నుంచి ప్రపంచ వేదికపైకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించింది. “రోలర్ కోస్టర్ రైడ్ కంటే ఈ ప్రయాణం తక్కువేం కాదు. కష్టం, సంకల్పం, అంతులేని మద్దతు నా విజయానికి కారణం. ప్రతిక్షణం దేశం గర్వించేలా చేసేందుకు కష్టపడతాను. ఈ విజయం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అంకితం” అని పేర్కొంది.
స్ఫూర్తినిచ్చింది వీళ్లే
రతన్ టాటా, ప్రియాంక చోప్రా తనకు ఆదర్శమని నందినీ గుప్తా వెల్లడించారు. “రతన్ టాటా నా జీవితంలో అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి. మానవత్వంతో సంపాదించిన చాలా మెుత్తం చారిటీకి ఖర్చు చేస్తారు. ఎంతో మంది ఆయన్ని ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఉంటారు. అందుకే రతన్ టాటా నాకు స్ఫూర్తి” అని చెప్పింది. అంతేకాదు, ప్రియాంక చోప్రా కూడా అంతే స్ఫూర్తినిచ్చినట్లు వెల్లడించింది. చిన్న వయసులోనే భారతదేశం గర్వించేలా ప్రపంచ వేదికపై మిస్ వరల్డ్‌గా నిలిచిన ఆమె ప్రయాణం తనను ప్రేరేపించిందని చెప్పింది నందినీ గుప్తా.
నందినీ లక్ష్యం
రాజస్థాన్ కోటాలో లభించే అత్యంత మన్నికైన ఫాబ్రిక్ గురించి ప్రచారం కల్పించాలని చూస్తోంది మిస్ ఇండియా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి ప్రచారం కల్పించి నేతన్నలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు… చాలామందికి ఉపాధి కల్పించాలనేది ఆమె లక్ష్యం.
విశ్వ సుందరి అవుతుందా?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే 71వ మిస్ వరల్డ్ పోటీల్లో నందినీ గుప్తా పోటీ పడబోతుంది.ఇందుకోసం ఎంతవరకైనా కష్టపడతానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి, ఈ పోటీల్లో గెలిచి విశ్వ సుందరిగా రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి.
ఏప్రిల్ 17 , 2023
ఈ వారం(FEB 13-19) థియేటర్లు/ OTT వేదికల్లో సందడి చేయనున్న సినిమాలు
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 13 , 2023